నాదంటూ ఏవీలేవు, సర్వమూ నీదే! కరుణామయా కరుణించవయా అరుణాచలేశ్వరా

శ్రీ వల్లభ గణపతయే నమః
శ్రీ అంకాళ పరమేశ్వరీ నమః
ఓం గురువే శరణం

సూర్య నమస్కారం

శిష్యుడు : 
గురుదేవా, ఇంటిలో చేపలు పెంచవచ్చా? 
సద్గురువు : 
నీ సందేహం సరైనదే. చిలుక, పావురము, నెమలి వంటి పక్షులను పంజరంలో బంధించి ఇంటిలో పెంచితే వాటిని బంధించినవారు భవిష్యత్‌లో జైలులో నిర్బంధించబడతారని మన వాసుదేవర్‌ వాసుకి చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. ఓ చిలుకను యేడాదిపాటు ఒకరు పంజరంలో బంధిస్తే అతడు యేడాదిపాటు జైలులో నిర్బంధించబడతాడని ఎలాంటి లెక్కలు లేవు. ఒక సంవత్సరం అనేది రెండేళ్ల ఆయుష్షు కలిగిన చిలుకకు అది సగం ఆయుష్షు కనుక అతడి ఆయుష్షులో సగభాగం వరకు జైలులో ఉంటాడని భావించాలి. అయితే చిలుకలు, పిచ్చుకలు స్వేచ్ఛగా వచ్చి ఆహారం, నీటిని తీసుకునేలా కొయ్యగూళ్లు, బురుజులు నిర్మిస్తే చాలా మంచిది. వాస్తవానికి అలాంటి గూళ్ళు ప్రజల మధ్య ఐక్యతను, కుటుంబంలో శాంతిని కలిగిస్తాయి. కుటుంబలో సంపాదన పెరుగుతుంది. 
చేపల పెంపకం కుటుంబంలో, సమాజంలో శాంతిని కలిగించేందుకు సాయపడే సత్కార్యమే. చేపలను పెంచటానికి ముందు వాటిని దైవీక గుణాలను గురించి ఆత్మ విచారణ చేసి చూడండి. చాలా పరిశుభ్రమైన జీవి ఏదని అడిగితే చేప అని చెప్పవచ్చు. ఉప్పునీటిలోనే ఉన్నా దాని వంటికి ఉప్పు అంటదు. దానికి దైవీక గుణం ఉండటం వల్లే మహేశ్వరుడు జాలరిగా అవతరించాడు. పరాశక్తి అమ్మవారు మీనాక్షిగా మదురైలో ఆవిర్భవించారు. మహావిష్ణువు సైతం మత్స్యావతారం దాల్చి భూలోకాన్ని సంరక్షించారు. 

చేపలు పెంపకం

ఎందరో మహానుభావులు చేపల సుఖజీవనం కోసం అరుదైన సేవలు చేశారు. కాశిరాజు కుమార్తె ఉరుపతి చేపల కులం కోసం ప్రత్యేకమైన పూజలెన్నో చేశారు. చేపలు ముక్తి పొందాలని, నీటిలో కంటి రెప్పలను ఆర్పకుండా కనిపించాలని, సముద్రంలో జలసంపద వృద్ధిచెందాలని ప్రార్థించటమే కాదు లోకం మెచ్చే అత్యుత్తమ గుణాలు మెండుగా కలిగిన పుత్రభాగ్యం కలుగాలని వేడుకుంది. ఆ ప్రార్థనల కారణంగానే ఉరుపతి మత్స్యగంథి అనేపేరుతో గంగానది వద్ద నావికురాలుగా జన్మించింది. ఆ సమయంలో పరాశర మహర్షి ఆ పడవలో పయనించడం, అతడి వలన పునీత గంగానది సాక్షిగా మత్స్యగంథి వ్యాసమహర్షికి జన్మనిచ్చింది. పరాశరుడి పుత్రుడైన వ్యాసమహర్షి చతుర్వేదాలను సంస్కరించడంతోపాటు ప్రజల కామాన్ని సక్రమపరిచే విధంగా కామసూతాల్రను ఈ లోకానికి అందించారు. 
చేపవంటి నేత్రాలతో మీనాక్షిగా మదురైని పాలించిన పరాశక్తి శక్తిసామర్థ్యాలు ఏపాటితో మీకు తెలిసిందే. కనుసన్నలతోనే మదురైని పరిపాలించిన సామ్రాజ్ఞి మీనాక్షి. ఈ కాలంలోనూ పరిపాలనా సామర్థ్యంకలిగినవారు కన్నుసన్నలతోనే అన్నింటిని సుసాధ్యం చేసుకోగలుగుతున్నారు. మదురైకి చుట్టూ ఉన్న సామంత రాజులు కొందరు మీనాక్షి దేవి మహిమ తెలుసుకోకుండా ఓ సారి మదురైపై దండయాత్ర చేసినప్పుడు ఆ శక్తిస్వరూపిణి కదన రంగంలో ప్రవేశించింది. యుద్ధంలో 200, 300 అడుగులు ఎత్తుకలిగిన ఏనుగులకంటే ఎత్తుగా మీనాక్షిదేవి అశ్వాన్ని అధిరోహించి మెరుపు వేగంతో కదనరంగంలో దూసుకువస్తున్న దృశ్యాన్ని చూసి గజదళాలు, అశ్వదళాలు మోకాళ్లూని నమస్కరించాయి. ఆ పరాశక్తిని చూసిన సామంతరాజులు రథాలపై నుండి కిందకు దిగి మోకరిల్లి నమస్కరించారు. ఇలా తన కనుసన్నలతో శత్రువులందరిని జయించి తన రాజ్యానికి చేరుకుంది మీనాక్షి. 
ఇంటిలో సాత్విక గుణాలు కలిగిన చేపలనే పెంచాలి. గోల్డ్‌, ఏంజెల్‌, మూన్‌లైట్‌ వంటి పేర్లున్న చేపలను ఎంపిక చేసుకుని పెంచడం శ్రేయస్కరం. ఫైటర్‌ వంటి పేర్లున్న చేపలను పెంచవద్దు. మహావిష్ణువు హృదయస్థలివద్ద మహాలక్ష్మి కొలువై ఉంటుంది కనుక మహావిష్ణువు మత్స్యావతారమైన చేపలలోనూ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చేపలు పెంచేవారి ఇంట పేదరికం మటుమాయమై సకల సౌభాగ్యాలు కలుగుతాయి. గాజు తొట్టెలలో చేపలు స్పష్టంగా కనపడేలా పచ్చ, ఆరెంజ్‌, పసుపు రంగు బల్బులతో అలంకరించాలి. చిన్నపాటి విద్యుత్‌ మోటార్లను ఉపయోగించి గాజు తొట్టెలో నిరంతరం గాలి వీచే సదుపాయం కలిగించాలి. 24 గంటలూ ప్రాణవాయువు లభించేలా గాలిబాగా వీచే చోట ఈ చేపలను పెంచాలి. చేపల తొట్టెలో శివలింగ, ఆలయగోపురం, జింక, నెమలి, కప్ప, తాబేలు వంటి దేవుళ్లను గుర్తుకు తెచ్చే బొమ్మలను ఉంచడం శ్రేయస్కరం. 

మనస్సులో క్లేశాలు కలిగినప్పుడు ఈ చేపలను చూస్తూంటే సంక్షోభ సమయాల్లో సరైన నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. చేపలు మనకు ఎదురయ్యే సంఘటనలు గురించి సంకేతాల ద్వారా తెలియజేస్తాయి. రోజూ కాసేపు చేపలతో గడుపుతూ వస్తే అవి మనకు ఈ విషయాలను ఎరుకపరుస్తాయి. ఉదాహరణకు, ఓ చేప తన జాతికి చెందిన మరో చేపను తరుముతుండటాన్ని చూస్తే నీ శత్రువులు నీపై కుట్ర పన్నుతున్నారని గ్రహించాలి. చేప నీవైపుచూస్తూ నోటిని తెరిస్తే ఇతరులకు వాగ్దానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకోవాలి. చేప నిన్ను చూస్తూ కన్నులను తెరచి మూస్తూ ఉంటూ నీ కుమారుడి ఇంటిలో లేదా కుమార్తె ఇంటిలో ఏదో సమస్యలు ఎదురయ్యాయని భావించాలి. 
శిష్యుడు : 
గురుదేవా, తాంత్రిక శాస్త్రం గురించి పలురకాల అయోమయాలు కలుగుతున్నాయి. దాని వాస్తవమైన తాత్పర్యాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాను. 
సద్గురువు : 
చాలా త్వరితగతిన దేవుని దర్శింపజేసే మార్గమే తాంత్రిక మార్గం. అయితే అర్థం చేసుకోవడానికి కఠినాతికఠినంగా ఉన్న శాస్త్రం కూడా ఇదే. నా గురుదేవులు ఇడియాప్ప సిద్ధులు చివరిక్షణంలో 'చూడు చూడు బాగా చూడు' అనే మంత్రాన్ని అవగాహన చేసుకుంటే తాంత్రిక మార్గాన్ని సులువుగా అర్థం చేసుకోగలమని నుడివారు. 
సులువుగా చెప్పాలంటే నువు ఉత్తముడు, మంచివాడు. నీ ప్రతిబింబమే ఈ లోకం. అలాగయితే నీవు ఈ లోకంలో ఉత్తములను, మంచివారిని మాత్రమే చూడాలి. నిజానికి నువ్వు చూస్తున్నదేమిటి? నీ చుట్టూ చోరులు, నయవంచకులు, మోసగాళ్లనే చూస్తున్నావు కదా! దీనికి కారణమేమిటి? నిన్ను నీవు సక్రమంగా అర్ధం చేసుకోలేకపోతున్నావు. దీనికి కారణం నీ చింతనలపై ఏకాగ్రతమనస్సును పెట్టకపోవడమే. మనస్సును ఏకాగ్రత పరచడం అంటే నేతి బీరకాయలో నేతిని వెదకటం వంటిది. 
కలియుగ మానవుడు మనస్సును ఏకాగ్రత పరిచే పలు విధానాలలో శక్తివంతమైన ఆరాధనా విధానాలే లింగ రక్షణ పూజలు. 
ఎవరైతే తన లింగాన్ని కాపాడుకుంటాడో అతడి వీర్యం గట్టిపడుతుంది. వీర్యం పటిష్టమైతే మనస్సు ఓ అంశంపై ఏకాగ్రతను కలిగి ఉంటుంది. ఏకాగ్రతతో కూడిన మనస్సు అతడిని ధ్యానం వైపు మళ్ళిస్తుంది. ధ్యానంలో నిమగ్నమయితే అతడు భగవంతుడిని చేరుకుంటాడు. ఓ అంశంపై లేదా ఓ లక్ష్యంపై మనస్సును నిర్విరామంగా 12 నిమిషాలపాటు ధ్యానించగలిగితే దానిని ఏకాగ్రత చిత్తమని అంటారు. దానినే ఆంగ్లంలో కాన్‌సన్‌ట్రేషన్‌ అని అంటారు. ఆ పన్నెండు పన్నెండింతలుగా అంటే 144 నిమిషాలపాటు మనస్సు ఏకాగ్రతంగా ఉంటే ధ్యానసిద్ధి లభిస్తుంది. ఈ 144 నిమిషాలను 144తో గుణించగా వచ్చే 20736 నిమిషాలపాటు మనస్సు లగ్నమైతే అదే సమాధి స్థితి అవుతుంది. 
శిష్యుడు : 
గురుదేవా, సక్రమమైన ఇంద్రియ (లింగ) సంరక్షణ దేవుని చూపెడుతుందనుకుంటే, ఆ ఇంద్రియాన్ని సంరక్షించడం ఎలాగనే రహస్యాన్ని విడమరచి చెప్పమని అభ్యర్థిస్తున్నాను. 
సద్గురువు : 
ఇంద్రియ సంరక్షణకు పురుషులు కౌపీనం ధరించాలి. కౌపీన రహస్యం గురించి అగస్త్యుల ప్రథమ శిష్యుడైన బోగర్‌ 300,000 లక్షల పాటలను రచించారు. వాటిలో కౌపీనానికి ఎలాంటి వస్త్రాన్ని ఉపయోగించాలి. ఎవరెవరు ఎంతటి పొడవు, వెడల్పు గల కౌపీనాలు ధరించాలి. ఎలా ఆ కౌపీనపు అంచులను కుట్టాలి. ఏ సమయంలో చెమ్మ కలిగిన కౌపీనాన్ని ధరించాలి వంటి అద్భుతమైన విషయాలు ఆయన చెప్పిన కౌపీన గీతలో వివరించియున్నారు. కౌపీన రహస్యాలను గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే పళని ఆలయంలో జీవ సమాధి చెంది భక్తులను అనుగ్రహిస్తున్న బోగర్‌ సిద్ధులను తరచూ ఆరాధించాలి. కలియుగంలో ప్రత్యక్షదైవమైన పళని దండాయుధపాణి, కలియుగవాసులకు ముక్తిని ప్రసాదించేందుకు అవతరించిన మన ఇడియాప్ప ఈశ సిద్ధులు కౌపీనం ధరించినవారే. 
పురుషులు బుధ, శనివారాల్లోను, స్త్రీలు మంగళ, శుక్రవారాల్లోనూ తలకు నూనె పట్టించి స్నానం చేయడం అలవరచుకోవాలి. కనీసం మూడు గంటలపాటు తలపై నూనె బాగా ఊరబెట్టాలి. కొబ్బరినూనెను తలకు పట్టిస్తే చన్నీటిలోను, నువ్వుల నూనెను వాడితే వేడినీటిలోనూ స్నానం చేయాలి. అభ్యంగన స్నానం పగటి పూటే చేయాలి సుమా! 

  

సూర్య దర్శనం చేయడానికి సహాయపడేది పాశాంకుళి ముద్ర. ఈ ముద్ర మినహా మరే ఇతర ఉపకరణాల ద్వారా సూర్యుని దర్శించకూడదని గుర్తుకోండి

మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మన జీవితం సాగుతుంది. మానవుడి నిర్ణయాలను తీర్మానించేది మన శిరస్సులోనే కపాల ఉష్ణోగ్రతే. ఈ కపాల ఉష్ణోగ్రతను సవ్యంగా ఉంచుకోవడానికే నూనెతో తలస్నానం చేస్తుంటాము. ఇంతకు మించి మరే పద్ధతిలోనూ కపాల ఉష్ణోగ్రతను సరంక్షించుకోలేము. వాహనాలను నడిపేవారు దారిలో నలువైపులా చూస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని వాహనాలను నడుపుతుండటం వల్ల వారిలో కపాల ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుంది. ఇక కంప్యూటర్‌లను అత్యధికంగా ఉపయోగించేవారికి సైతం కపాల ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. వీరు తప్పినసరిగా నూనెతో తలంటుకుని బాగా ఊరబెట్టి తలస్నానం చేయాలి. 
దేహంలోని ఉష్ణోగ్రతను మూడు రకాలుగా చెబుతారు సిద్ధులు. అవి అంతర్గత ఉష్ణోగ్రత, మధ్యమ ఉష్ణోగ్రత, బహిర్గత ఉష్ణోగ్రత. స్త్రీల యోని, పురుషుల ఇంద్రియలు సంగమించే చోటు మధ్యమ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. మగవారి అరచేతుల్లో బహిర్గత ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. కనుకనే హస్త ప్రయోగం కారణంగా మగవారి ఇంద్రియంలో ఏర్పడే ఉష్ణోగ్రతల విబేధం వల్ల నరాలు బలహీనమవుతుంటాయి. 
పురుషుల వీర్యనాళంలో మూడువేలకు పైగా సూక్ష్మాతి సూక్ష్మమైన నరాలు ఉన్నాయి. ఈ నరాలను వీర్యాన్ని శుభ్రపరుస్తాయి. వీర్యాన్ని నిర్ణీత ప్రదేశంలోకి పంపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇలా మూడువేల నరాలతో శుద్ధీకరించబడిన వీర్యం మూడు పెదాలు కలిగిన లింగం ద్వారా పంపటంతో మరింత శుద్ధమవుతోంది. హస్త ప్రయోగం వల్ల దేహంలోని నరాలు బలహీనం కావటంతోపాటు, సూక్ష్మ యోగచక్రాలు దోషపూరితాలవుతాయని గుర్తుంచుకోవాలి. శివలింగం మాత్రమే కాదు ఆలయ గోపురాలలో ఉన్న అశ్లీల లైంగికమైథున శిల్ప దృశ్యాలు సైతం ఇంద్రియ సంరక్షణను చాటిచెబుతున్నాయి. 
శిష్యుడు : 
గురుదేవా! గోపురంపైని బూతు శిల్పాలు ప్రజల మనస్సులో విరసాన్ని కలిగిస్తాయిని చెబుతుంటారే? 
సద్గురువు : 
విరసం ఎక్కడుంది ? గోపురపు పైని బొమ్మలలో విరసం లేదు. మన మనస్సులోనే ఉంది. ఆ దృశ్యాలన్నీ ఇంద్రియ సంరక్షణనే తెలుపుతున్నాయి. ఆ బొమ్మలను నిశితంగా పరిశీలిస్తే కాలానుగతంగా బోధపడుతుంది. సంధ్యావందనంలోనూ ఇంద్రియ సంరక్షణ మంత్రాలున్నాయి. వీటిని సరైన సద్గురువుల ద్వారా తెలుసుకోవాలి. ప్రతి రోజూ ఋషులకు, దేవతలకు అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నట్లే తన ఇంద్రియానికి సైతం అర్ఘ్యాన్ని సమర్పించటం వాడుకలో ఉన్న ఆరాధనా పద్ధతే! 
తన ఇంద్రియాన్ని సంరక్షించుకునేవాడు ఆలయానికి కూడా వెళ్లవలసిన అవసరం లేదు. ఆలయంలోని ధ్వజస్థంభం వలే మానవదేహంలో ధ్వజస్తంభంగా ఉన్నది ఈ ఇంద్రియమేనని సిద్థులు చెబుతున్న రహస్యం. ఈ నిజాన్ని లోకానికి చాటిచెప్పినవారే ఉమాపతి శివాచార్యులు. ఆ ఉత్తమపురుషుడి విరచిత కొడికవి స్తుతిని రోజూ పఠిస్తే ఇంద్రియ సంరక్షణ రహస్యాలు సత్పురుషుల ద్వారా తెలుసుకోగలుగుతారు. ఇంద్రియ సంరక్షణకు దోహదపడే పలు యోగాసన పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిని సరైన సద్గురువులు ద్వారా తెలుసుకొని అనుసరించాలి. 
కలియుగంలో సత్పురుషుల రాక తగ్గుతుందని ముందుగానే తన దీర్ఘదర్శనంతో పసిగట్టి అగస్త్య మహాపురుషులు కామాన్ని కట్టడిచేసి భగవంతుడిని చేరే మార్గంగా అందించిన సూర్య నమస్కార ఆచరణ పద్ధతిని మీకు వివరిస్తాను. మన దేశంలో ఇడనాడి, పింగళనాడి, శుసుమ్న నాడి (సూర్య, చంద్ర, సూక్ష్మనాడి) అనే మూడు ముఖ్యమైన నాడులు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటీ అబ్‌, వాయు, పృథ్వి, తేయు భూతాలను కలుసుకునేటప్పుడు 12 నాడులు పరిణమించి, ఆ 12 నాడులు నవ సూక్ష్మ దేహంలో స్థిరపడేటప్పుడు 108 స్తుతులను వల్లెవేసి ఆరాధించేటప్పుడు మానవదేహంలోని 108 నాడులు శుద్ధీకరింపబడి అతడిని దైవం వైపు నడిపిస్తాయి. 
ఎవరైతే శ్రీఅగస్త్యులవారి సూర్యనమస్కార పద్ధతులను 12 సంవత్సరాలపాటు నిరాటంకంగా ఆచరిస్తారో వారికి దైవ దర్శనం లభించటం తథ్యం. 12 ఆసనాలు, 12 పద్ధతులలో 12 సంవత్సరాలపాటు ఆచరించినట్లయితే అది ధ్యాన, సమాధి స్థితులను ప్రాప్తింపజేసి మిమ్మల్ని దైవాన్ని చేరుకునేలా చేస్తాయన్నది మీకందిరికీ ఇదివరకే వివరించబడింది. 
వేకువజామున ప్రారంభించి సూర్యోదయం లోపున ఈ సూర్యనమస్కార పద్ధతిని పూర్తి చేయాలి సుమా! వారి వారి దేహస్థితిని బట్టి ఈ ఆరాధనను పూర్తి చేయడానికి కనీసం మూడు గంటలు పడుతుంది. దానికి తగ్గట్లు నిదురించే సమయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఉదయాన్నే లేచి స్నానమాచరించి, నుదుటిపై విభూతి లేదా కుంకుమను పెట్టుకుని గాలి బాగా వీచే స్థలంలో ఈ ఆసనాలు వేయడం చాలా మంచిది. రోజుకో ఒకసారి ఈ ఆసనం వేస్తే చాలు. ఇక్కడ 12 ఆసనాలు గురించి వాటికి సంబంధించిన మంత్రాలను తెలియజేశాం. ఈ 12 ఆసనాలు 12 సార్లు ఆచరించటం ఒక రోజుకు సరిపడా ఆరాధన పద్ధతి అవుతుంది. తమ దేహస్థితులను బట్టి తొలతు 12 ఆసనాలను ఒక పర్యాయం ఆచరించి, బాగా అలవడిన తర్వాత ఒక్కో ఆసనాన్ని 12 సార్లు ఆచరించి తర్వాత 12 ఆసనాలను ఆచరించి ఆరాధించడం మంచిది. అన్ని ఆసనాలను పూర్వదిశాభిముఖంగా ఆచరించి ఆరాధించాలి. 
ఓ శుభ్రమైన వస్త్రాన్ని లేదా దుప్పటిని నేలపై పరచి దానిపై ఆశీనులై ఈ ఆసనాలను వేయాలి. నేలపై ఎలాంటి భగవద్‌ ఆరాధనలు చేయకూడదు. ఆరాధనకు ముందుగా వినాయకుడు, తల్లిదండ్రులు, ఇష్టదైవం, గురువులను స్మరించుకుని తర్వాతే ఆసనాలు వేయడం శుభప్రదం. 
సూర్యనమస్కార ప్రథమాసనం 
రెండు పాదాలను నేరుగా చాపుకుని కూర్చోండి. పద్మాసనం వేయండి. కుడి పాదాన్ని ఎడమ తోడపై ఉంచి లేదా ఎడమపాదాన్ని కుడి తొడపై ఉంచి పద్మాసనం వేసుకోవాలి. రెండు చేతులను అరచేతులను భూదిశగా పక్కవాటుగా చాచి పెట్టండి. మెల్లగా శ్వాసను లోపలికి పీల్చండి. శ్వాసను బాగా లోపలికి పీల్చిన తర్వాత శ్వాసను కాసేపు బిగించండి. మెల్లగా వంగి శిరస్సుతో నేలను తాకండి. అరచేతుల్ని నేలను తాకకుండా నేలపై నుండి అర అంగుళం ఎత్తుకు పెంచండి. శ్వాసను బిగించుకుని 'ఓం మిత్రాయ నమః' అని 12 సార్లు మనస్సులోని స్తుతించండి. మెల్లగా శిరస్సును పైకి లేపి సాధారణ స్థితికి రండి. మెల్లగా శ్వాసను విడిచిపెట్టండి. సహజస్థితిలో కాసేపు గడిపిన తర్వాత ద్వితీయ ఆసనానికి సిద్ధపడండి. 
సూర్యనమస్కార ద్వితీయాసనం 
పద్మాసన స్థితిలో కూర్చోండి. శ్వాసను మెల్లగా బాగా లోపలికి పీల్చండి. చేతులను పాదాల నడుమకు చేర్చి కుక్కుటాసన స్థితిలో ఉండండి. శిరస్సు సమాంతరంగా లేపి చూడండి. శ్వాసను వెలుపలికి విడువక 'ఓం రవియే నమః' అంటూ 12 సార్లు మనస్సులోనే స్తుతించండి. కుక్కుటాసన స్థితిని నుండి నేలపై కూర్చోండి. మెల్లగా శ్వాసను విడిచిపెట్టండి. సహజస్థితికి చేరుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. 
సూర్యనమస్కార తృతీయాసనం 
పద్మాసనం వేసుకోండి. మెల్లగా వెనుకగా వాలి నేలపై పడుకోండి. చేతులను మడవకుండా పక్కవాటున అరచేతులు ఆకాశంకేసి ఉండేలా ఉంచుకోండి. మెల్లగా శ్వాసను బాగా లోపలికి పీల్చండి. శ్వాసను విడువకుండా 'ఓం సూర్యాయనమః' అని 12 సార్లు మనస్సులోనే స్తుతించండి. శ్వాసను మెల్లగా విడువండి. సహజస్థితికి చేరుకుని విశ్రాంతి తీసుకోండి. 
సూర్యనమస్కార చతుర్థాసనం 
పద్మాసనం వేసుకోండి. మెల్లగా వెనుకవైపునకు వాలి నేలపై పడుకోండి. మెల్లగా శ్వాసను లోపలికి పీల్చండి. పాదాలను, నడుమును పైకి లేపి చేతులతో నడుమును పట్టుకోండి. దేహభాగం నిటారుగాను, శిరస్సుకు 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూడండి. శ్వాసను వెలుపలికి పోకుండా బిగబట్టుకుని 'ఓం బాణవే నమః' అని 12 సార్లు మనస్సులోనే స్తుతించండి. మెల్లగా నడుము, పాదాలను కిందకు దించండి. శ్వాసను మెల్లగా వెలుపలకు విడచిపెట్టండి. సహజస్థితికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకోండి. 
సూర్యనమస్కార పంచమాసనం 
సుఖాసనంలో కూర్చోండి. చేతులలను వెనుక వైపు కట్టుకోండి. నేరుగా చూడండి. శ్వాసను మెల్లగా లోపలికి పీల్చండి. బాగా శ్వాసను పీల్చి బిగపట్టండి. 'ఓం ఖగాయ నమః' అని 12 సార్లు మనస్సులో స్తుతించండి. శ్వాసను మెల్లగా వెలుపలికి విడువండి. సహజస్థితికి చేరుకుని విశ్రాంతి తీసుకోండి. 
సూర్యనమస్కార షష్టమాసనం 
సుఖాసనంలో కూర్చోండి. చేతులను వెనుకవైపున కట్టుకోండి. నేరుగా చూడండి. శ్వాసను మెల్లగా లోపలికి పీల్చండి. మెల్లగా వంగి శిరస్సును నేలపై ఆనించండి. శ్వాసను విడువకుండా బిగపట్టి 'ఓం పూష్ణే నమః' అని 12 సార్లు మనస్సులోనే స్తుతించాలి. మెల్లగా శిరస్సును పైకెత్తి నిటారుగా చూడండి. మెల్లగా శ్వాసను విడిచిపెట్టండి. సహజస్థితికి చేరుకున్నాక కాసేపు విశ్రాంతి తీసుకోండి. 
సూర్యనమస్కార సప్తమాసనం 
సాధారణంగా కూర్చోండి. కుడి చేతితో కుడి పాదాన్ని చుట్టి కుడిచేతి మధ్యవేలితో బొటనవేలిని పట్టుకోండి. కుడిపాదపు బొటనవేలిని చూడండి. కుడిపాదం భూమికి సమంగా ఉంచుకోండి. మెల్లగా శ్వాసను లోపలికి పీల్చండి. శ్వాసను వెంటనే విడువకుండా బిగపట్టుకుని 'ఓం హిరణ్యగర్భాయ నమః' అనే 12 సార్లు మనస్సులోనే స్తుతించాలి. మెల్లగా శ్వాసను వెలుపలికి విడువండి. పాదాన్ని సులువుచేసి సహజస్థితికి చేరుకుని కాసేపు విశ్రాంతి పొందండి. 
సూర్యనమస్కార అష్టమాసనం 
దండాలు తీసే విధంగా కాళ్లు చేతులు ఉంచుకోవాలి. శ్వాసను బాగా లోపలికి పీల్చండి. మెల్లగా దండాలు తీసేలా ఉంటూ శ్వాసను వెలుపలకు విడువకుండా బిగబట్టి 'ఓం మరీచాయ నమః' అని 12 సార్లు మనస్సులోను స్తుతించాలి. మెల్లగా శ్వాసను విడిచిపెట్టండి. సహజస్థితికి చేరుకుని విశ్రాంతి తీసుకోండి. 
సూర్య నమస్కార నవమాసనం 
పాదాల నడుమ ఆరు అంగుళాల స్థలం ఉండేలా నిటారుగా నిలవండి. రెండు చేతులను మెల్లగా శిరస్సుపైకి ఎత్తి అరచేతులు తూర్పు దిశగా చూడునట్లు ఉంచుకోండి. చేతులను పైకెత్తేటప్పుడే శ్వాసను లోపలికి బాగా పీల్చండి. శ్వాసను పీల్చుకుంటునూ మెల్లగా వీలయినంతగా వెనుకకు వంగాలి. శ్వాసను బిగబట్టి 'ఓం ఆదిత్యాయ నమః' అంటూ 12 సార్లు మనస్సులోనే స్తుతించండి. మెల్లగా దేహాన్ని సహజస్థితికి తీసుకురండి. మెల్లగా శ్వాసను విడువండి. చేతులను వేలాడేలా ఉంచుకోండి. సహజస్థితికి చేరుకున్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోండి. 
సూర్యనమస్కారం దశమాసనం 
రెండు కాళ్ళను ఒకటిగా చేర్చి ఉంచుకోండి. మెల్లగా శ్వాసను లోపలికి బాగా పీల్చండి. మెల్లగా వంగి రెండు చేతులతో నేలను తాకండి. రెండు అరచేతులను నేలపై సమాంతరంగా ఉంచుకుని వీలయితే శిరస్సును మోకాలికి ఆనించండి. శ్వాసను బిగపట్టి 'ఓం సవిత్రే నమః' అని 12 సార్లు మనస్సులోనే స్తుతించాలి. మెల్లగా శిరస్సును పైకెల్తి నిటారుగా చూడండి. మెల్లగా శ్వాసను వెలుపలకు విడిచిపెట్టండి. సహజస్థితికి చేరుకున్నాక విశ్రాంతి తీసుకోండి. 
సూర్యనమస్కారం ఏకాదశాసనం 
రెండు కాళ్ల నడుమ సుమారు తొమ్మిది అంగుళాల స్థలం ఉండేలా నిటారుగా నిలవండి. చేతులను మెల్లగా తలపైకి ఎత్తి, అరచేతుల్ని తూర్పుదిశగా ఉంచండి. చేతుల్ని పైకెత్తేటప్పుడే శ్వాసను లోపలికి బాగా పీల్చండి. శ్వాసను బిగబట్టి ఎడమ అరచేతిని దక్షిణ దిక్కుగా ఉంచుకోండి. అదే సమయంలో కుడిచేతిని పక్కవాటున నేలకు సమాంతరంగా భుజమంత ఎత్తుకు చాచి కుడి అరచేతిని నేలపై చూసేటట్లు ఉంచుకొని మెల్లగా వీలయినంతగా కుడి వైపు వంగాలి. ఈ స్థితిలో శ్వాసను బిగబట్టి 'ఓం అర్ఘ్యాయ నమః' అని 12 సార్లు మనస్సులో స్తుతించండి. మెల్లగా మునుపటిలా నిలవండి. చేతులను కిందకు దించండి. శ్వాసను మెల్లగా విడువండి. సహజస్థితికి చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోండి. 
సూర్యనమస్కారం ద్వాదశాసనం 
రెండు పాదాల నడుమ సుమారు తొమ్మిది అంగుళాల స్థలం ఉండేలా నిలబడండి. చేతులను శిరస్సుపైకి ఎత్తి అరచేతుల్ని తూర్పు వైపు ఉంచుకోండి. చేతులను పైకెత్తేటప్పుడే శ్వాసను బాగా లోపలికి పీల్చుకోవాలి. కుడి అరచేతిని ఉత్తర దిక్కును చూసే విధంగా పెట్టుకోవాలి. అదే సమయంలో ఎడమ చేతిని పక్కవాటుకు భుజమంత ఎత్తుకు చాచి నేలపై సమాంతరంగా ఉంచుకొని మెల్లగా వీలయినంతగా ఎడమవైపు వంగాలి. ఈ స్థితిలో శ్వాసను బిగబట్టి 'ఓం భాస్కరాయ నమః' అని 12 సార్లు మనస్సులోనే స్తుతించాలి. మెల్లగా సహజస్థితికి చేరుకోండి. చేతులను కిందకు దించండి. శ్వాసను మెల్లగా వెలుపలకు విడువండి. సహజస్థితికి చేరుకున్నాక పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. 
ఇక్కడ పేర్కొన్న 12 ఆసనాలను వరుసగా చేయడం ఒక వర్తులం అవుతుంది. ఇలా 12 వర్తులాలపాటు చేస్తే సూర్య నమస్కార పూజ సంపూర్ణమవుతుంది. ఈ 12 వర్తులాల ఆసనాల పూజ చేయడానికి సుమారు మూడు గంటలు పడుతుంది. ఈ ఆసనాలు పూర్తయిన తర్వాత మీ శ్వాస కుడి నాసికలో వస్తున్నట్లయితే మీ ఆసనపద్ధతి సక్రమంగా ఉన్నట్లు భావించాలి. ఒక వేళ శ్వాస కుడి నాసికలో రాకుంటే మీరు ఆసనాలను సక్రమంగా వేయలేదని భావించాలి. ఈ స్థితిలో మీరు ఆసనాలు కొనసాగించడం మంచిది కాదు. వెంటనే మా ఆశ్రమాన్ని సంప్రదించి తగు వివరణలు పొందిన మీదట సరైన పద్ధతిలో ఆసనాలు వేయడం నేర్చుకోవాలి. 
ముఖ్యాంశాలు 
జాతి, మత, కుల మతాలకు అతీతంగా అందరూ ఆచరించదగినవే ఈ సూర్యనమస్కార పూజా పద్ధతులు. 
కాస్త యోగాసనం నేర్చుకుని ఉంటే ఈ ఆసనాలను సులువుగా వేయగలుగుతారు. యోగాసనం గురించి తెలియనివారు మా ఆశ్రమ సేవకులను సంప్రదించి వారి సమక్షంలో యోగాసనాలు నేర్చుకోవడం మంచిది. ఇక్కడ పేర్కొన్న 12 ఆసనాలను ఒక్కొక్కటిగా నేర్చుకుని, తర్వాత అన్ని ఆసనాలను ఒకే సమయంలో వేయడంపై శిక్షణ పొందాలి. 
ఆరోగ్యంగా ఉన్నవారంతా ఈ శిక్షణల వల్ల లబ్దిపొందుతారు. సూర్యనమస్కార ఆసనాలకు వయోపరిమితి అంటే ఏదీ లేదు. ముఖ్యంగా యువకులకు ఈ ఆసనాలు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. 
12 ఆసనాలను 12 వర్తులాల వరకు నేర్చుకోవడం వల్ల పూర్ణ ఫలితాలు లభిస్తాయి. కార్యాలయాలు, పాఠశాలలో పనిభారం అధికంగా ఉన్నవారు 12 ఆసనాలను ఒకేసారి వేయలేకపోవచ్చు. కనీసం 3, 6, 9 వర్తులాల (రౌండ్ల) దాకా ఆసనాలు వేస్తే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మనస్సు బాగా వికసిస్తుంది. ఆత్మస్థయిర్యం అధికమవుతుంది. ఇలా 12 ఆసనాలను నేర్వలేనివారు ఒకటి రెండు ఆసనాల ద్వారా సూర్యనమస్కారాలు చేయడం శ్రేయోదాయకం. దీనివల్ల కూడా దేహారోగ్యాలు, దృఢచిత్తం ప్రాప్తిస్తాయి. 
స్నానం, నుదుటి అలంకరణ, చెవిపోగులు, జంధ్య, దీక్ష వంటి రక్షణా సాధనాల ధరించినట్లయితే సూర్యనమస్కార ఫలితాలు పలు రెట్లుగా ప్రాప్తిస్తాయి. వీలయినంత వరకూ ఈ రక్షణా సాధనాలను ధరించి అదనపు ఫలితాలు పొందమని వేడుకుంటున్నాము. 

సూర్య నమస్కార ఆసనం 1
”ఓం మిత్రాయ నమహ ”

సూర్య నమస్కార ఆసనం 2
”ఓం రవియే నమహ”

సూర్య నమస్కార ఆసనం 3
”ఓం సూర్యాయ నమహ”

సూర్య నమస్కార ఆసనం 4
”ఓం భానవే నమహ”

సూర్య నమస్కార ఆసనం 4
(వెనుక వీక్షణ)

సూర్య నమస్కార ఆసనం 5
”ఓం ఖగాయ నమహ”

సూర్య నమస్కార ఆసనం 5
(వెనుక వీక్షణ)

సూర్య నమస్కార ఆసనం 6
”ఓం పూష్ణే నమహ”

సూర్య నమస్కార ఆసనం 7
”ఓం హీరణ్య గర్బాయ నమహ”

సూర్య నమస్కార ఆసనం 8
(ప్రాథమిక భంగిమ)

సూర్య నమస్కార ఆసనం 8
”ఓం మరీచయే నమహ”

సూర్య నమస్కార ఆసనం 9
”ఓం ఆదిత్యాయ నమహ”

సూర్య నమస్కార ఆసనం 10
”ఓం సవిత్రే నమహ”

సూర్య నమస్కార ఆసనం 11
”ఓం అర్ఖాయ నమహ”

-ఓం గురువే శరణం-

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam