నిండైన మనస్సుతో వచ్చేవారు మెండైన సత్ఫలితాలతో పోతారు !

శ్రీ వల్లభ గణపతయే నమః
శ్రీ అంకాళ పరమేశ్వరీ నమః
ఓం గురువే శరణం

శ్రీ అరుణుని అనుగ్రహమే అనుగ్రహం

ప్రపంచములోనే కాకుండా నక్షత్రములు, ఖండాలు మొదలగు అన్నీ లోకములయందును ఉన్న ఒక్కొక్క వస్తువు పంచభూతాల ద్వారా రూపొందించబడినవే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనబడు పంచభూత తత్వాలచే వివిధ నిష్పత్తులతో రూపొందించబడిన రచనలే ప్రపంచములో ఉన్న ఒక్కొక్క వస్తువునకు మూలాధారముగ నున్నవి. పంచ భూతాలను సృష్టించిన భగవంతుడే కాంచీపురం (భూమి), తిరుఆనైక్కా (నీరు), తిరుఅణ్ణామలై (అగ్ని), కాళహస్తి (వాయువు), చిదంబరం (ఆకాశము) వంటి ఐదు పుణ్య స్థలములయందును పంచభూత లింగాలుగా ఆవిర్భవించి కటాక్షించుచున్నాడు. 

శ్రీ అణ్ణామలై స్వామి వారి ఆవిర్బావం

పంచభూతాలలో ముందుగా ఆవిర్భవించినది అగ్ని. ఆదిలో పరమశివుడు అగ్నిగోళముగా తిరుఅణ్ణామలై పుణ్యస్థలియందునే ఆవిర్భవించెను. తదనంతరము కాంచీపురమునందు శ్రీ ఏకాంబరేశ్వర లింగ రూపమున వెలసెను. ఇతర పంచభూత లింగ మూర్తులందలి చతుర్లింగములు లింగ రూపమునే ధరించియుండగ, తిరుఅణ్ణామలైయందు మాత్రము సదాశివుడు అగ్నిగోళముగా ప్రకాశించుచున్నాడు. 

శ్రీ రెట్టై పిళ్ళయారు సన్నిధి

తిరుఅణ్ణామలై అగ్నిగోళ రూపముగా, జ్యోతి స్వరూపముగా ప్రకాశించుట వలన సాధారణ కనులతో దర్శించుట సాధ్యము కాక సమస్త జీవరాసులును శ్రమ పడుట గమనించిన సిధ్ధ పురుషులు, మహర్షులు, “ప్రభూ ! ఇతర నాల్గు పంచభూతములనూ లింగ రూపమున దర్శించి ఆనందించుచున్నట్లుగ, తిరుఅణ్ణామలైయందలి కూడా తమరి అగ్నిగోళ రూపమును సాధారణ జీవుడునూ చూడగల్గు రూపములో దర్శనమివ్వ గలరు !” యని వేడుకొనుచూ కోట్ల యుగములు ఘోర తపస్సు చేపట్టిదిరి. 

అడిగిన తడవే వరములను ప్రసాదించునటువంటి శ్రీపరమేశ్వరుడు, “నేను కృత, త్రేత, ద్వాపర, కలియుగములయందు ఒక్కొక్క యుగములోనూ ఆయా యుగ నియమానుసారాల కనుగుణముగ ఒక్కొక్క రూపములో తిరు అణ్ణామలైలో దర్శనమిచ్చెదను.” యని వరమిచ్చెను. ఆయన వరము ప్రకారము కృత యుగమునందు నిప్పు కొండ, త్రేతా యుగమునందు మాణిక్యపు కొండ మరియు ద్వాపర యుగమునందు పసిడి కొండగా దర్శనమిచ్చిన తిరుఅణ్ణామలై కలియుగములో రాతి కొండ రూపములో దర్శనమిచ్చుచున్నది. యావత్భూలోకములో తిరుఅణ్ణామలైయే అతి పెద్ద శివలింగము.

సర్వమును తిరుఅణ్ణామలైలోన ఇమిడినవే

దేవుడే పర్వత రూపముగల్గి దర్శనమిచ్చినాడనిన తిరుఅణ్ణామలై అంతర్ బాహ్యములందు వ్యాపించి యుండునది భగవంతుని అనుగ్రహ జ్యోతియేకదా ! మనకు మామూలు మానవ కంటితో కనుబడు 2600 అడుగుల ఎత్తే తిరువణ్ణామలై ఎత్తా ? కానే కాదు.

ఈ పర్వతములోపల అనంత కోటి బ్రంహాండాలు, పలు విధములైన గోళాలు, వేలాదివేల గ్రహాలు, నక్షత్ర మండలాలు వేర్వేరు విధమైన లోకాలును ఇమిడియున్నాయి. ఈ ప్రపంచానికే కాదు, అపరిమితమైన లోకములన్నింటికీ కూడా దివ్య నిధి ఈ తిరుఅణ్ణామలై !

శ్రీ కుదూహల నంది మూర్తి

సాధారణ రాతి కొండ లాగ మన కనులకు కనిపించిననూ, తిరుఅణ్ణామలై లోపల దాగి ఉన్న ఆధ్యాత్మిక నిధులు ఎన్నో, ఎన్నెన్నో !

ఉదాహరణకు, తిరుఅణ్ణామలై యొక్క కొండ శిఖరమునందు “ఊర్ధ్వ మూల మరం [స్థానిక మూల వృక్షం]” అనబడు మర్రి చెట్టు కలదు. దీని వ్రేళ్ళ భాగము వంగి పైకిచూచుచు ఆకాశమున వ్రేళ్ళూని యుండును. ఈ వృక్షము క్రింద, శ్రీ దక్షిణా మూర్తి మానవ శరీరము ధరించి నేటికినీ యోగానంద ధ్యానావస్థలో తిరుఅరుణగిరియోగిగా దర్శనం ఇచ్చుచున్నాడు. కానీ ఎవరూ సులభంగా వెళ్ళి దర్శించుట వీలు కాదు. 

శ్రీ రమణ మహర్షికే ఆ మర్రి చెట్టు యొక్క ఒకే ఒక్క ఆకును మాత్రమే దర్శించే భాగ్యము కలిగెను అనగ మన పరిస్థితి ఏమిటన్నది కాస్త ఆలోచించి చూడండి !

విధి ప్రకారముగ తపస్సు చేసినవారు మర్రి చెట్టు ఉన్న కొండ శిఖర భాగములో శ్రీ ఆది పరాశక్తియొక్క ఒక అంశమైన శ్రీ ఆయుర్ దేవియొక్క జ్యోతి స్వరూప దర్శనము పొందవచ్చు. భూలోకములో మరెక్కడనూ ఈ అంబికయొక్క జ్యోతి దర్శనం లభించుట అంత సులభము కాదు. ఈ శిలా జ్యోతి రూపాన్ని శనకాది మునులు నలుగురున్ను ప్రతి దినము విచ్చేసి పూజించి వెళుతున్నారు. శ్రీ సూర్య భగవానుడుకూడ ప్రతి దినము శ్రీ ఆయుర్దేవిని మ్రొక్కి వెళుతున్నారు. 

గిరి ప్రదక్షిణ విశేషము

తిరుఅణ్ణామలైలో సాక్షాత్తు పరమశివుడే పూర్ణ యోగ సిద్ధలింగ కొండ రూపములో దర్శనమివ్వడంవలన కొండను చుట్టు ప్రదక్షిణం చేయుటయే అతి గొప్ప పూజా విధానమయినది. ఈ నాటికీ కోట్లాది సిద్ధపురుషులు, మహానుభావులు, యోగపురుషులు ప్రతి రోజూ తిరుఅణ్ణామలైని గిరిప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు.

ఈ భూలోకములో అనేక ప్రదేశములలో గిరి ప్రదక్షిణ విధానము ఉన్ననూ రెండు ప్రదేశములలోని గిరి ప్రదక్షిణములు మాత్రమే అత్యంత దైవత్వ ఆకర్షణ కలిగినవిగ ప్రాముఖ్యం పొందెను.

ఒకటి హిమాలయాలయందు కైలాస గిరి ప్రదక్షిణము; మరొకటి తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణం. టిబెట్ దేశమునందు దైవదత్తమైన మహోన్నత జీవితం గడుపుచున్న ‘లామాలు’ (Lamas) అనబడు గొప్ప యోగులు నేటికీ భౌతిక శరీరముతో (physical body)  శ్రీ కైలాస పర్వత ప్రదక్షిణము చేయుచున్ననూ, ఆధ్యాత్మిక సూక్స్మ  శరీరముతో (spiritual body) తిరుఅణ్ణామలై ప్రదక్షిణముకూడ చేస్తున్నారు. 

దక్షిణ గోపురం తిరుఅణ్ణామలై

ఇది మాత్రమేనా? ఆయా వారానికి సంబంధించిన గ్రహాధిపతులును, నక్షత్ర దేవతలును తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణం చేయుచున్నారు. క్రిములు, జంతువులు, వృక్షములు, కీటకములు మొదలగు ప్రతియొక్క జీవరాసులకుగాను తత్సంబంధిత దేవతలు వారి జాతియొక్క బాగు కోరి తిరుఅణ్ణామలైని ప్రదక్షించుచున్నవి.

శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ అగస్త్య మహాముని వంటి సిద్ధ దైవ అవతార మూర్తులుకూడ ఏదో ఒక రూపములో ప్రతిరోజు గిరి ప్రదిక్షిణము చేస్తున్నారు. శ్రీ అంగవ మహర్షి తన 10000 శిష్యగణముతో దట్టగాలీ ప్రదక్షిణ మార్గములో అనేక కోటి యుగాలుగ గిరి ప్రదక్షిణము చేస్తూనే ఉన్నారు.

తిరుఅణ్ణామలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటనగ పగలైన, రేయైన, సంధ్యైన, ఎండైన, వానైన ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు ! గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకము, విష్ణులోకము వంటి అన్య లోక వాసులుకూడా తిరుఅణ్ణామలైకి విచ్చేసి భూలోక నియతికి తగినట్లు మానవ రూపము ధరించో, లేక ఈగ, చీమ, చిలుక, రంగురంగుల పక్షి, పాము, పశువు, కుక్క వంటి రూపమును దాల్చి సర్వేశ్వరుని ప్రదక్షిణము గావించి మ్రొక్కుతూ ఉండుట వలన గిరి ప్రదక్షిణము చేయువారు ‘మనము ఒంటరిగ వెళుచుంటిమే !’ యని చింతయో, భయమో పడునవసరం లేదు !

గిరి ప్రదక్షిణ దర్శనములు, వాటి మహాత్యములు

శ్రీ కర్పక వినాయకుడి ఆలయం
తిరుఅణ్ణామలై

‘కలియుగములో ధర్మము తగ్గిపోయి అధర్మముతో నిండిపోయి ఉంటుంది. అందువలన ప్రపంచపు జీవరాసులు అనేక రకములైన కష్టాలను అనుభవిస్తూ వేదనలకు గురౌతారు’ అనేదాన్ని తమ దూర దృష్టితో తెలుసుకొన్న యోగులు, మహర్షులు ఆయా యుగాలలో తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణము చేసి, కలియుగమునందలి జీవ రాసుల కష్టాలను తుడిచి వేయుటకు కావలసిన నివారణోపాయములను ప్రసాదించుట కొరకు తత్సంబంధిత ప్రాంతములలో కూర్చుని కొండ దిశగా చూస్తూ తపమొనర్చుచుండిరి. ఆ విధముగ వారు మహోన్నతమైన తపస్సు చేసిన స్థలములే దివ్య పుణ్య దర్శనముగా ప్రసిద్ధి గాంచెను. ఈ విధంగా ప్రసిధ్ధ పుణ్య దర్శనములుగా పేరు గాంచిన పలు ప్రదేశములు, అచ్చోటనే గిరి ప్రదక్షిణము చేసి అక్కడినుండే తిరుఅణ్ణామలై దిశగా చూచుచూ మ్రొక్కుకొను వారికి, వారి సర్వ దుఖాలకునూ తగు నివారణమును ప్రసాదిస్తున్నాయి. 

మరియున్నూ, మహర్షులే కాకుండా దివ్య పుణ్య మూర్తులు కూడా ఈ విధంగా గిరి ప్రదక్షిణము చేసి, సర్వేశ్వరుడైన తిరుఅణ్ణామలై స్వామిని దర్శించి మరియు పూజలొనర్చిన అనేక ప్రదేశములుకూడా ప్రసిద్ద దైవ దర్శనములుగా విరాజిల్లి అంతులేని ఫలాలను అందజేస్తున్నాయి. 

దర్శనము అనగ గిరి ప్రదక్షిణము చేయునపుడు గిరి ప్రదక్షిణ మార్గములో ఒక ప్రత్యేక స్థలమునుంచి కొండ శిఖరాన్ని దర్శించుటయగును. తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గములో వేల సంఖ్యలో ఎందుకు, కోట్ల సంఖ్యలో దర్శనములు ఉన్నాయి. ఎలా అని అడుగుతున్నారా ?

గిరి ప్రదక్షిణము చేయునపుడు వేసే ప్రతి ఒక్క అడుగుకీ కూడా కొండ శిఖరాన్ని దర్శించుట ఉత్తమమైనది. దేని కోసమే, గిరి ప్రదక్షిణము ఒక నిండుమాసాల గర్భిణి స్త్రీ నడిచి వెళ్ళినట్లుగ చేయవలెనని పెద్దలు ఉపదేశించెను. ఆ విధంగ ఒక్కొక్క అడుగుకీ ఒక్కొక్క దర్శనము కలదు. ఆ రకంగా దర్శనము ఒకటే అయినప్పటికీ కూడ పగలు, రేయి, రోజు, వారము, నక్షత్రము, శుభ సమయం, తిథి వంటి వేర్వేరు నియమాలకు తగినట్లుగా వేర్వేరు ప్రతిఫలాలను వివిధ రకాలుగా ఇవ్వగలదు. 

ఒక నిర్దిష్ట స్థలమునుండి మనకు లభించే దర్శనముకూడ ఎప్పుడూ ఒకే రకంగా ఉండజాలదు. మనం నిశ్చలంగ ఒకే చోట నిలిచి ఉండినను గోళములు, నక్షత్రములు, చంద్ర, సూర్యులు వారి స్థితిగతులను మార్చుకుంటూనే ఉన్నందున, ఒకే చోట నిల్చి ఉండి పొందే దర్శన ఫలితములుకూడ మారుతూ ఉంటున్నాయి. ఒకేఒక అంబిక ఉన్నపటికీ నవరాత్రులయొక్క తొమ్మిది రోజులలోనూ వివిధ నామ రూపాలను ధరించి ఆశీర్వదించునట్లు, ఒకేఒక్క దర్శనము వారము, నక్షత్రము, రోజు, యోగము, కరణము, హోరై వంటి కాలమానాలకు తగినట్లు ఎన్నో పేర్లతో ఉంటున్నది. అందుకే ‘ఒకే చోట లభించు దర్శనమునకు వేర్వేరు పేరులా ?’ యని సందిగ్ధం వలదు. 

శ్రీ రమణాశ్రమం నుండి పొందే
ఏకముఖ దర్శనం

ఇప్పటికి అర్థమౌతున్నదా తిరుఅణ్ణామలై స్వామివారి మహాత్యము ! ఇది మాత్రమేనా ? తనను దర్శించువారి మనో పరిపక్వత, దేవుని పట్ల ఉన్న భక్తి యొక్క ఉచ్ఛ స్థాయుకి తగినట్లు తన రూపాన్ని మార్చి దర్శనమునిచ్చే ప్రత్యేకత కూడా ఉన్నది. నవ వ్యాకరణ పండితులైన శ్రీ ఆంజనేయ స్వామివారు గిరి ప్రదక్షిణము చేయు తిరుఅణ్ణామలై యొక్క రూపము, చుట్టుకొలత వేరు ! కానీ, మనము గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు అదే తిరుఅణ్ణామలైయొక్క రూపము, చుట్టుకొలత వేరు ! మన పూర్వీకులైన వసు, రుద్ర, ఆదిత్య పిత్రులు తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణం చేసినచో వారు మానవ శరీరమును దాల్చి ఈ భూలోకములో జీవించినపుడు ఏ విధంగ దర్శనమిచ్చినదో, అదే విధంగా తిరుఅణ్ణామలై కనిపించుచున్నది. 

ఈ విధముగ తిరుఅణ్ణామలై యొక్క గొప్పతనాన్ని, మహిమలను వివరించుకుంటూనే వెళ్ళొచ్చు. అంతులేని మహా సాగరం లాగ అది విస్తరించెను ! అందు వలనే ఎన్నో కోట్ల యుగాలుగా శ్రీ నందీశ్వర స్వామివారు తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ మహిమను నిరంతరాయముగా చెప్పుకొస్తే, శ్రీ అగస్త్య మహర్షి తాళ పత్ర గ్రంథములను ఇంకా కూడా లిఖిస్తూనే ఉన్నారు అంటే తిరుఅణ్ణామలై యొక్క మహిమ ఎంత గొప్పదో !

ఆదివారంనాడు గిరి ప్రదక్షిణం

ప్రపంచములో అనేక కోటి సూర్యులు కలవు. ఇన్ని కోట్ల సూర్యులు కూడా వారికి అవసరమైన అగ్ని శక్తిని పంచ భూత లింగాలలో ఒకటి అయిన అగ్ని లింగముగా కొలువై ఉన్న తిరుఅణ్ణామలై నుండే పొందుచున్నవి. వాటన్నింటికీ శ్రీ సూర్య నారాయణ స్వామివారే ఆధిపత్యం వహిస్తున్నారు. ప్రతి ఆదివారమునాడు శ్రీ సూర్య భగవానుడే భూ లోకానికి విచ్చేసి ఏదో ఒక రూపములో తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణము చేస్తూ వస్తున్నారు. 

ఈ నాటికీ తిరుఅణ్ణామలై పుణ్య క్షేత్రములో సూర్యుడు తిరుఅణ్ణామలైని అడ్డంగా దాటకుండా చుట్టుకొని వచ్చి వెళ్ళుట చూడ గలము. ప్రపంచములో వేరే ఎక్కడా కూడా చూడ వీల్లేని అద్భుతం ఇది ! ఎటువంటి విజ్ఞాన శాస్త్రం కూడా వివరణ ఇవ్వలేని ఒక విచిత్రం ఇది ! ‘సూర్యుని పాదములు పడకుండా కిరణాలు నమస్కరించి వెళ్ళే తిరుఅణ్ణామలై’ యని శ్రీ అగస్త్యుని తాళ పత్ర గ్రంథాలు పొగిడే అద్భుత దృశ్యాన్ని మీరుకూడా వెళ్ళి దర్శించి జన్మ తరింప చేసుకోండి !

శ్రీ సూర్య భగవానుడు స్వీకరించిన గిరి ప్రదక్షిణం

సిమ్హ తీర్థం తిరుఅణ్ణామలై

శ్రీ సూర్య భగవానుడు ‘సమ్జ్ఞై’ యని పిలువబడు స్వర్చలా దేవిని పరిణయం చేసుకున్నప్పుడు, ఆయన తన అగ్ని రూపాన్ని ఓర్చుకోలేక కృశించిపోయిన స్వర్చలా దేవి తన నీడను సూర్య సవితా మండలములో ఆపి ఉంచి తన తండ్రి ద్వష్టా దగ్గరకు వెళ్ళి శరణ్యం తీసుకొనెను. ఆ ఛాయా దేవే శ్రీ శనీశ్వర భగవానునికి జన్మనిచ్చిన ఛాయా దేవి!

తనను వదలి వీడి పోయిన స్వర్చలా దేవిని మరల పొందుటకు ఇష్టపడ్డ శ్రీ సూర్య భగవానుడు తిరుఅణ్ణామలై వచ్చి చేరి తపస్సు చేసెను. కానీ ఎన్నో చతుర్యుగములు తపస్సు చేసినను అతనికి తిరుఅణ్ణామలై స్వామివారి దర్శనము లభించలేదు.

శ్రీ సూర్య భగవానుని తపస్సుని చూచి హృదయానందం పొందిన శ్రీ అంబికా ఉణ్ణాములైఅమ్మవారు, “భాస్కరా ! దంపతి సమేతముగ విచ్చేసి తనని నమస్కరించాలన్నదే శ్రీ అరుణాచలేశ్వరుని కోరిక. కానీ నీవో విడిపోయిన భార్యను మరల పొందుటకై తపస్సు చేయుచుంటివి !

నీ అగ్ని రూపాన్ని తాళ లేక స్వర్చలా దేవి విడి పోయినందున నీవు నీ అగ్నిని శాంతింపచేయమని వేడ్కొని తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణం చేయుము. అదే సమయములో, నీ భార్య కూడా నీ అగ్ని రూపాన్ని భరించే శక్తిని కోరుకొని గిరి ప్రదక్షిణము చేయవలెను !” యని వరమొసగెను.

అదే సమయములో కురుక్షేత్రం వెళ్ళి తపస్సు చేయుచున్న స్వర్చలా దేవికికూడ, “నీ తపస్సు ఇచ్చట పరిపూర్ణమైనదె. దాని ఫలాలను తిరుఅణ్ణామలైయందు పొంది పరవశించెదవుగాక !” యని అశరీరవాణి లభించెను.

ఈ విధముగ శ్రీ అంబికయొక్క దివ్య వాక్కు ప్రకారము శ్రీ సూర్య భగవానుడు, స్వర్చలాంబ దేవి కలిసి తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణం చేసిన రోజే ఆదివారమగును. శ్రీ సూర్య భగవానుడు ముందు పోవ, కాస్త దూరముగ అతని అగ్ని కిరణాలను భరించదగ్గ దూరములో స్వర్చలాంబ దేవి శివ ధ్యానములో మునిగిపోయి గిరి ప్రదక్షిణం చేసిరి. 

శ్రీ పృథ్వీ నంది తిరుఅణ్ణమలై

శ్రీ అరుణాచలేశ్వరుడు ఇరువురికీ అగ్ని జ్యోతి లింగముగ దర్శనమిచ్చి, “సూర్యా! స్వర్చలాంబ దేవికి నీ దేహ కాంతిని భరించే శక్తిని ప్రసాదించే ముందు, నీ అగ్ని కిరణాల భారమును ఆమె కోరుకున్నట్లు సేవించుటకుగాను, అగ్ని కిరణములలోని కొన్నింటిని అమృత కిరణములుగ మార్చి వాటిని అనేక కళలను కోల్పోయి వాడిపోవుచున్న చంద్రునికి ఇస్తున్నాను. వేరు అనేక కిరణాలను వేర్వేరు ఆయుధాలుగ మార్చి, దివ్య శక్తి కలిగిన ఆయుధాలను కోరి తిరుఅణ్ణామలైయందు తపస్సు చేయుచున్న దేవతలకు ప్రసాదించుచున్నాను. ఇంకా ఇన్నో కిరణాలను అనేక రకముల వస్తువులుగాను, జీవరాసులుగాను మార్చి శృష్టించుచున్నాను” యని వరమిచ్చెను. రాత్రి పూట మెరిసే పువ్వులు, క్రిములు, పాదరసం, గుడగూబ, పిల్లి, కుక్క వంటి జీవరాసుల రాత్రి పూట మెరిసే కనులు మొదలగునవి ఈ విధముగానే సృష్టింపబడినవి. దేని తరువాత ముప్పై ముక్కోటి దేవతలూ పూజ చేయుటకు శ్రీ సూర్య భగవానుడు తన భార్యయైన స్వర్చలా దేవితో ఏకమయ్యెను. 

అందుకనే పలు విధాల కారణాల వలన విడి పోయి బ్రతుకుతున్న దంపతులు కలిసి కట్టుగా జీవించుటకు ఆదివారం నాడు గిరి ప్రదక్షిణం అత్యంత ప్రాధాన్యమైనది. ఆదివారం సూర్య హోరై సమయములో (ఉదయం 6-7, మధ్యాహ్నం 1-2, రాత్రి 8-9, అర్థ రాత్రి 3-4) గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభించుట అద్భుతమైన ఫలితాలను సమకూర్చెను. దానితోనే కాకుండా ‘భర్త తన వెంట గిరి ప్రదక్షిణం చేయలేదే’ యని బాధ పడే భార్యామణులు సూర్య హోహై సమయములో మగ బిడ్డలకు చక్కెర పొంగలి దానము చేసి గిరి ప్రదక్షిణము ప్రారంభించినచో వారి కోర్కెను అరుణాచలం తెలుసుకుని కటాక్షిస్తారు. 

ఆదివార గిరి ప్రదక్షిణము కటాక్షించెటి దివ్య శక్తి

కలియుగమునందు ఒక మానవుడు దేవుని వైపు గట్టిగా సమేకమై ఉన్నత స్థాయిని అందుకోవాలంటే మంచి విషయముల వైపే మొగ్గు చూపాలి. మంచి ఆలోచనలలోనే మనసు పెట్టాలి; శుభ కార్యాలలోనే ఎల్లప్పుడూ భాగం పంచుకొంటుండాలి. దానికి తగినట్లుగ మన బుధ్ధిని తీర్చి దిద్దుటయే ఆదివారపు గిరి ప్రదక్షిణము అనబడుతుంది.

బుధ్ధియొక్క ఎనిమిది విధముల కార్య కలాపాలు

మానవుని బుధ్ధియైనది ఎనిమిది విధముల క్రియాకలాపాలను గల్గి యుండును. అవి ఏమిటనగ

1. శ్రవణం 

2. దానం

శ్రీ దుర్వాస మహర్షి సన్నిధి

3. స్మరణం 

4. ప్రవచనం 

5. వ్యూహం

 6. అవపోశనం

7. అంతర్ ధ్యానం

8. తత్వ జ్ఞానం

శ్రవణం (వినికిడి)

ప్రస్తుత పరిస్థితుల్లో మనం వేలాది విషయాలను వినవలసిన నిర్బంధంలో ఉన్నాము. ఆదివారం నాడు తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణము చేయుట వలన, కొండ పైన ఉన్న అద్భుతమైన దివ్య శిలలయొక్క ప్రకాశవంతమైన వెలుగు రవ్వలు మనకు వినిపించెటి మాటలలోనుండి మంచి విషయాలను మాత్రమే చెవి ద్వారములలోనికి వెళ్ళనిచ్చెటి దివ్య శక్తిని ప్రసాదిస్తాయి. చెవులకు ఎరుపు రంగు (మాణిక్యం) దిద్దులను ధరించి గిరి ప్రదక్షిణం చేస్తే సత్ఫలితాలను పెంచుతుంది. 

దానం

ఒక్క మంచి విషయాలను మాత్రమే వినుట చాలదు. వాటిని మనస్సులో పదిల పరుచుకొనవలయును. తిరుఅణ్ణామలైయొక్క పవిత్రమైన వాయుమండల గాలి (తిరుఅణ్ణామలైని తాకి నెమ్మదిగ వచ్చే గాలిని సాధారణ గాలిగా భావించరు. ‘మణముగిళ్ అలైవాయ్’ యని పిలుస్తారు.) ఇందు కోసం బుధ్ధి నాళాళను పవిత్రం చేసి కావలసినంత తేజస్సును ప్రసాదిస్తుంది. దానివల్ల ధర్మపరమైన ఆలోచన గల్గి, తన మనస్సును దాన ధర్మాలలో పాలుపంచుకునేటట్లు మళ్ళిస్తుంది. 

స్మరణం

శివరాజ సింగ తీర్థం

బుధ్ధిలో నిలిచిపోయిన మంచి విషయాలు కావలసినప్పుడు గుర్తుకు రావలయును. ఆదివారం నాడు గిరి ప్రదక్షిణం చేయుట వలన తిరుఅణ్ణామలైలో ఉన్న అద్భుతమైన మూలికల శక్తి ఈ తెలివిని ప్రసాదిస్తుంది. 

ప్రవచనం

గుర్తుకొచ్చే మంచి విషయములను ఇతరులకు కూడా చెప్పి వినిపించటం శ్రేష్టమైనది. ఆదివారపు గిరి ప్రదక్షిణములో తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ దారిలో ఉన్న తీర్థాల దర్శనం, వాటిలో స్నానమాడుట లేదా తల మీద జల్లుకొనుట వంటివి బుధ్ధికి ఈ తెలివిని ఇస్తుంది. 

వ్యూహం

దివ్య జీవితంలో మనకు లభించేటి మంచి అనుభవాలను పెద్దవారితో పంచుకోవటం వల్ల అనుభవ పరిపక్వత ఏర్పడుతుంది. ఆదివారంనాడు శారీరికంగానో, మానసికంగానో గిరి ప్రదక్షిణం చేసే కోట్లాది మహానుభావులు, సిధ్ధ పురుషులయొక్క పవిత్ర పాదాలను తాకిన మన్ను, ధూళి వంటివి గిరి ప్రదక్షిణం చేసెటి ఇతరుల మీద పడి ఈ శక్తిని వారికి ప్రసాదిస్తుంది.

అవపోశనం

“ధాటిగా మాట్లాడు” అనేది పూర్వీకుల మాట. దేన్ని, ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగ మాట్లాడవలె అనేదే వాక్ ధాటి. ఆదివారం నాడు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనకు లభించేటి అనేక నందులయొక్క దర్శనం ఇటువంటి వాక్ ధాటిని ప్రసాదిస్తుంది.

అంతర్ – ధ్యానం

దేన్ని, ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగ చెప్ప కూడదు అనేదే మౌన శక్తి అనబడుతుంది. మౌనం అనే దానికి అర్థం ‘మాట్లాడకుండా ఉండటం’ అని మాత్రమే కాదు. కావలసినపుడు మాట్లాడి, అక్కర్లేని లేదా చీడు చేసే విషయాలను మాట్లాడకుండా ఉండటము, మనస్సులో పెట్టుకోకుండా ఉండటము వంటిది కూడా మౌనమే. “అనవసర మాటలు ఎందుకు” అనేది పెద్దల వాక్కు. ఆదివారపు గిరి ప్రదక్షిణములో అష్ట దిక్కుల లింగాలయొక్క ఆకర్షణా శక్తి పైన చెప్పబడిన దివ్య శక్తిని ఇచ్చి కటాక్షిస్తుంది.

తత్వ జ్ఞానం

శ్రీ అప్ఫు నంది తిరుఅణ్ణామలై

పైన చెప్పబడిన ఏడు దివ్య శక్తులను పొందినవారికే “అంతా దేవుడు సృష్టించినదే” అను నిజమైన జ్ఞానం ఏర్పడుతోంది. తిరుఅణ్ణామలైని దర్శించుకుంటూ చేసే ఆదివారపు గిరి ప్రదక్షిణములో ఒక్కొక్క విధముగ కనబడుతున్న వేలాది దర్శనములే నిజమైన జ్ఞానాన్ని పొందే తెలివిని మనకు అందిస్తున్నాయి. 

చూశారా, ఆదివారం నాడు తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణం చేయు ప్రత్యేకతని ! ఎన్నో జన్మలెత్తి పొందే దివ్య శక్తిని, ఆదివారం నాడు పధ్ధతి ప్రకారం చేసే తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణం అందిస్తోంది.

ఆదివారం గిరి ప్రదక్షిణ పధ్ధతి

ఆదివార గిరి ప్రదక్షిణాన్ని శ్రీ అరుణాచలేశ్వర ఆలయం యొక్క తూర్పు గోపుర ద్వారములో ఉన్న శ్రీ లక్షణ వినాయకుడిని నమస్కరించుకొని ప్రారంభించవలెను. మనకి ఈ మానవ శరీరాన్ని ప్రసాదించి, గిరి ప్రదక్షిణము చేయుటకు దయ బూనినవారు సృష్టికర్తయిన శ్రీ బ్రహ్మ దేవుడే. అందుకనే, ఆయనకి కృతజ్ఞత తెలిపే విధముగా తరువాత దక్షిణ ద్వారం వెళ్ళి అక్కడ ఉన్న బ్రహ్మ లింగాన్ని నమస్కరించ వలెను.

సర్ప పడగేశ్వర లింగముఖ దర్శనం

గిరి ప్రదక్షిణం చేసేటపుడు సుగంధంతో కూడిన అగర్ బత్తీలను వెలిగించి వాటిని గుండకు ఎదురుగా చేతిలో పట్టుకుని ఉంచుకొంటూ ప్రదక్షిణము చేయుట శ్రేష్టమైనది. ఆలయముయొక్క దక్షిణ గోపురము నుండి సాంబ్రాణి కడ్డీ నుండి వెలువడే దివ్యమైన ప్రొగ వెంటే తిరు అణ్ణామలైని దర్శించటాన్ని సర్ప పడగేశ్వర లింగముఖ దర్శనం అని అంటారు. 

అగర్ బత్తీలను పట్టుకుని ఉంచుకుంటూనే వెళ్ళి తిరుమంజన వీధిలో ఉన్న శ్రీ కర్పక వినాయక ఆలయములో వాటిని సమర్పించి మరల వేరే అగర్ బత్తీలను వెలిగించి ఉంచుకుంటూనే గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభించవలెను. ఈ సర్ప పడగేశ్వర లింగ ముఖ దర్శనము వలన ‘నేను’ అనే అహంకారాన్ని తగ్గించుకునే మార్గం ఉన్నది.‘తిరు అరుణాచలా ! సర్వం నీవే’ అనే భావన పెరుగుటకు మార్గం చూపే దర్శనం ఇది. 

పంచాయతన పంచముఖ దర్శనం

గిరి ప్రదక్షిణ మార్గములోనే ముందుకు నడిచేటప్పుడు శ్రీ రమణాశ్రమం దాటి కాస్త దూరములో తిరు అణ్ణామలై స్వామివారు ఐదు ముఖములతో కనబడుతూ ఉంటారు. ఈ దర్శనానికి ‘పంచాయతన పంచముఖ దర్శనం’ అని అంటారు. శాళగ్రామ పూజ చేసేవారికి చాలా తగిన దర్శనం. పంచాయతన పూజని పధ్ధతిగా చేయని అపరాధానికి కూడా ఈ దర్శనం శ్రేష్టమైన పరిష్కారముగా నిలుస్తున్నది. 

శ్రీ ఉణ్ణాములై అమ్మవారి మండపం

పదాది కరన్యాస దర్శనం
పృథ్వి నంది వైపు నుండి అణ్ణామలేశుడిని తిలకించే దర్శనమే పదాతి కరన్యాస దర్శనం. కుడి కాలుని కుడి భుజం దాకా పైకెత్తి, కుడి కాలుని చుట్టి కుడి చేతిని శిరస్సుదాకా పైకెత్తి ఎడమచేతిని చేర్చి శిరస్సుమీద నమస్కరించడాన్ని (దాదాపుగా ఊర్థ్వ తాండవ రూపంగా కనబడుతుంది) పదాది కర సహిత దర్శనం అని పేరు. ఈ దర్శనం వల్ల పలు ఫలితాలు లభించినా ముఖ్యంగా ఇతరులను పాదాలతో తన్నడం వల్ల వచ్చే పాద క్రమణం అనే దోషం తొలగుతుంది.
అడుగడుగునా అర్ధనారీశ్వరుడి లింగాల రూపంలో వ్యాపించి ఉంటాడన్న అగస్త్యమహర్షి వాక్కుననుసరించి తిరువణ్ణామలై క్షేత్రమంతటా కోటానుకోట్ల సంఖ్యలో లింగాలు వ్యాపించి ఉంటాయి గనుక మన పాదాలు ఏ లింగమూర్తిపైన పడుతుందేమో నన్న భయంతో గిరి ప్రదక్షిణం చేయాలి.
దీని తర్వాత 'మాయ సంచల దర్శనం', 'చతురాది అశ్విని దేవ దర్శనం' 'వాయుపుత్ర హనుమంత దర్శనం' వంటి పలు దర్శనాలు ఉన్నాయి. మంచి గురువును ఆశ్రయించి తగు వివరణలు పొందాలి.
పాసత్రియాంకు దర్శనం
శ్రీగౌతముడి ఆశమ్రం సమీపాన లభించే ఈ దర్శనం వలన మధుమేహ రోగులు (ఈరిబిలీలిశిరిబీ ఆబిశిరిలిదీశిరీ) స్వస్థత చెందుతారు. ఈ ప్రాంతంలో నిరుపేదలకు తీపి పదార్థాలు దానం చేస్తే మంచి ఫలితాలు త్వరగా లభిస్తాయి. ఈ చోట తిరువణ్ణామలైకి అభిముఖంగా గాలి వీస్తుండటాన్ని గమనించగలం. ఆ గాలినే అభిముఖ పంచోన్నతశిఖర వాయువు అని పెద్దలు చెబుతారు.
రెండు కొండల దర్శనం
అణ్ణామలై దిగువ ప్రాంతంలో లభించే దర్శనమిది. ఈ ప్రాంతంలో అరుణాచలేశ్వరుడే రెండు చిన్న కొండలుగా దర్శనమిస్తున్నారు. భార్యాభర్తల నడుమ అన్యోనత ప్రాప్తించేందుకు ఈ దర్శనం దోహదపడుతుంది.
త్రిశూల దర్శనం
పరమేశ్వరుడి తన నంది వాహనాన్ని పిలిచినప్పుడల్లా నందీశ్వరుడు తిరుఅణ్ణామలైని ప్రదక్షిణ చేసి నమస్కరించి 'త్రిశూల దర్శనం' అనే అద్భుతమైన దర్శనం సిద్దించిన తర్వాతే దేవ వాహన విధులను ప్రారంభిస్తాడు.
ఓ సారి పరమేశ్వరుడు పిలువగానే నందీశ్వరుడు ఆగమేఘాలపై వెళ్లాడు. మహేశుడు నందీశ్వరుడిని పరిశీలనగా చూసి ఉలుకుపలుకు లేకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. మహేశుడి వైఖరిపట్ల దిగులు చెందిన నందీశ్వరుడు ఆయనను వెంబడించి కారణమడిగాడు.
'నందీశ్వరా రోజూ నీ వాహన సేవను ప్రారంభించే సమయంలో ఏం చేస్తుంటావు?' అని ప్రశ్నించాడు.
'స్వామీ! తిరుఅణ్ణామలైకి వెళ్లి త్రిశూల దర్శనం చేసుకుని వస్తుంటాను' సమాధానం చెప్పాడు నందీశ్వరుడు.
'నందీశ్వరా! రోజూ నువ్వు త్రిశూల దర్శనం చేసిన తర్వాత నీ వీపుపై మూడు త్రిశూల రేఖలు కనిపించేవి. ఈ రోజు ఆ రేఖలు కనిపించకపోవడంతో తిరిగి వెళుతున్నాను' అన్నాడు మహేశుడు.

శ్రీ అరుణాచలేశ్వరుడి పాదాలు

తాను ఆ దినం తిరుఅణ్ణామలై దర్శించలేదనే విషయం నందీశ్వరుడికి అప్పటికిగాని తెలియలేదు. పశ్చాత్తాపం చెందాడు. త్రిశూల దర్శనం గొప్పదనాన్ని లోకానికి ఎలుగెత్తి చాటాడు. ఈ దర్శనం వలన పెద్దలను, ఆపదల సమయంలో ఆదుకున్నవారిని అవమానించడంవల్ల కలిగే దోషాలు నివృత్తి అవుతాయి. పెద్దలను, సాయపడినవారిని మళ్లీ కలుసుకుని వారికి సహాయపడాలి.
నంది అపసవ్య ముఖ దర్శనం
అణ్ణామలై దిగువ ఆలయం చేరువగా అరుణాచలేశ్వరుడిని దర్శించేందుకు నందీశ్వరుడు తన శిరస్సును కాస్త వెనుకవైపు తిప్పినట్లుగా లభించే దర్శనమిది. దీనికి నంది అపసవ్యముఖ దర్శనం అని పేరు.
ఈ దర్శనం వల్ల వాహన యోగాలు కలుగుతాయి. తరచూ విమానాల్లో ప్రయాణించేవారికి, తరచూ ఊర్లకు వెళ్లేవారికి ఈ దర్శనం ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుతుంది.
కల్పగ పూర్ణ దర్శనం
అడిఅణ్ణామలై ఆలయ తీర్థకొలను సమీపం నుండి చూస్తే లభించేది కల్పగ పూర్ణ దర్శనం.
ఈ చోట సాంబ్రాణి పొగలు వేయడం శ్రేయస్కరం. దీనివల్ల ఆస్తమా, T.B., శ్వాస ఇబ్బందులు వంటి శ్వాస సంబంధిత రోగాలు నయమవుతాయి.
సత్సంగంలా పలువురు కలిసి మంచుమేఘాల్లా సాంబ్రాణి పొగలు వేసి గిరి ప్రదక్షిణ చేస్తే శుభ ఫలితాలను ఇస్తుంది.
దూర్వా కాష్ట తర్పణం
దశముఖ దర్శన ప్రాంతంలో అభయమండపం సమీపంలో ఓ తీర్థం ఉంది. అక్కడ 'దూర్వా కాష్ట' పద్ధతిన తర్పణం ఇస్తే పితృదేవత శాపాలు తొలగి సంతాన భాగ్యం కలుగుతుంది.
ఓ వస్త్రంలో పచ్చిబియ్యం పరచి దానిపై దర్భలను గుండ్రంగా అమర్చి తర్పణం ఇవ్వాలి. ఆతర్వాత ఆ వస్త్రాన్ని, బియ్యాన్ని దానంగా ఇవ్వాలి. పితృదేవతలకు తర్పణాలను తీసుకువెళ్లే స్వతాదేవి మండలంలో ఉండే విఘ్ననాసిని అనే దేవత ఆ తీర్థకొలనులో ఉంటుంది. ఆ తీర్థకొలను గట్టున తర్పణం ఇచ్చేవారికి అనుగహ్రాలను ప్రసాదిస్తుంది.
పురుష వీర్యకణాల కొరత, గర్భసంచి కుంచించుకుపోవడం వంటి వైద్య సంబంధిత లోపాలతో బాధపడేవారు తమ సమస్యలు తీరేందుకు ఈ తీర్థపు గట్టున పచ్చిబియ్యాన్ని పరచి, రెండు జీడిమామిడి పప్పులకు పసుపు పూసి ఓ తమలపాకుపై పెట్టి, దానిపై దర్భపు చదరాలను చేసి పితృ తర్పణం ఇవ్వాలి. దీనినే 'పూజ్య తంత్ర తర్పణం' లేదా 'వీర్య ప్రసాదిత తర్పణం' అని అంటారు.

శ్రీ బ్రహ్మ లింగం తిరుఅణ్ణామలై

(తర్పణపు మంత్రాలు, తర్పణమిచ్చే పద్ధతులు గురించి మేము ప్రచురించిన 'సులువైన తర్పణ పద్ధతులు' అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు)
ఇక మన శ్రీలశ్రీ లోబామాత అగస్త్య ఆశ్రమం ఏర్పాటై ఉన్న ప్రాంతంలో కొంతసేపు ధ్యానం చేసిన మీదట, వీలయినంత దాన ధర్మాలు చేస్తే దూర్వా కాష్ట తర్పణ ఫలితాలు పరిపూర్ణంగా లభిస్తాయి
అవధూత సిద్ధపురుషుడైన శ్రీ దక్షిణామూర్తి తల్లిదండ్రులు పైన పేర్కొన్న రీతిలో ఇక్కడ బసచేసి భగవంతుని ప్రార్థించిన మీదట వారికి కలలో శ్రీదక్షిణామూర్తి స్వాముల దైవీక జననం గురించి బోధపడింది.
కోటి శ్మశాన లింగ దర్శనం
తదుపరి కుబేరలింగం, పంచముఖ లింగం, ఇడుక్కు పిళ్ళయార్‌ సన్నిది వంటి దర్శనాలు చేసుకున్న తర్వాత వేలూరు రహదారి విడిపోవు స్థలంలో ఉన్న శ్మశాన భూమి నుండి పొందే దర్శనానికి 'కోటి శ్మశాన లింగ దర్శనం' అని పేరు. అనువుకాని ఆశలు, దురాశలను తొలగించే అద్భుత దర్శనమిది.
మాయా నివృత్తి దర్శనం
ఆదివారాల్లో గిరిప్రదక్షిణలో శ్రీదుర్గ అమ్మవారి ఆలయ సమీపంలో మనం పొందేది మాయా మాన్విత దర్శనం. మానవుడిని వేధించే మాయలను శ్రీ దుర్గాశక్తి ద్వారా సంహరింపబడి మంచి మార్గాన్ని చూపునదే ఈ దర్శనభాగ్యంలోని విశేషం. రాత్రి పూట ఈ దర్శనం పొందటాన్ని 'మాయా నివృత్తి దర్శనం' అని పిలుస్తారు.
అపసవ్య కామం వల్ల చేయబడే అన్ని రకాల తప్పిదాలను రూపుమాపి మంచి మార్గాన్ని అందించే దర్శనం. అలాంటి పాపాలను చేసినవారు తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసి, శ్రీ దుర్గాదేవి ఆలయం సమీపంలో మాయా మాన్విత దర్శనం పొంది, 9 గజాల చీరను వస్త్రదానంగా, అరటి కాయల బజ్జీలను దానమిచ్చి ప్రాయశ్చిత్తం పొందే మంచి పద్దతులను తెలుసుకోగలం.
మానవ దేహాన్ని ఎల్లవేళలా కాపాడే శ్రీభూతనారాయణ పెరుమాళ్‌ దర్శనంతో గురు కృప ద్వారా ఆదివారపు గిరి ప్రదక్షిణ సంపూర్ణమవుతుంది.

సోమవారపు గిరి ప్రదక్షిణ పద్దతి

సోమవారం అనుగ్రహ దేవుడైన శ్రీచంద్ర భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. సోమవారంనాడే తిరుఅణ్ణామలై పర్వతంలో సోమభాను, చంద్ర కనక గుళికై, చంద్రమూలం, సోమ శూదక మూలిక, సోమవార శుద్ధ గుళిక వంటి ముఖ్యమైన మూలికలు మన దృష్టికి గోచరమవుతాయి. అద్భుత శక్తివంతమైన ఈ మూలికల సువాసన మనపై ప్రసరించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మనక్లేశాలు పటాపంచలవుతాయి. ఈ భాగ్యం కోసమే పలువురు సిద్ధవైద్యులు రహస్యంగా మూలికల స్నానం చేసి సోమవారాల్లో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.
జ్యోతిష్యులకు...
వాక్‌శక్తి పెరగాలనుకునేవారు సోమవారంనాడు తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేయాలి. జ్యోతిష్యంలో ప్రతిభ సాధించాలంటే మంచి వాగ్ధారణా శక్తి అవసరం. జ్యోతిష్యంలో సునిశిత శిక్షణ పొందినప్పటికీ పూజలు పునస్కారాలు, దాన ధర్మాలు, సామాజిక సేవ, నిరుపేదలకు ఉచిత సహాయం వంటివి చేసి గురుభక్తి కలిగినవారికి దైవీక శక్తి పెరిగి వాక్‌ శక్తి కూడా అధికమగును.
కనుక, సోమవారంనాడు జ్యోతిష్యులు మూలికల రసంతో తడిపిన వస్త్రం ధరించి తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసి పైన పేర్కొన్నవాటిని తప్పకుండా పాటిస్తూ వస్తే దైవానుగ్రహం వలన తమ శాఖలో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. వీరు గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న అడిఅణ్ణామలై ఆలయంలో ఉన్న శ్రీచంద్రభగవానుడి పూజించిన లింగమూర్తిని ప్రార్థించి, ధవళ వర్ణం కలిగిన ఆహారం (తెలుపురంగు కలిగిన ఆహారం), వస్త్రాలను దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
న్యాయ విభాగంలోని వారికి...
న్యాయవాదులు, న్యాయమూర్తుల వంటి న్యాయవ్యవస్థకు సంబంధించివారికి మంచి వాక్‌ పటుత్వం అత్యంత అవసరం. సందర్భవశాన, పరిస్థితుల కారణంగా, వాద ప్రతివాదలను, సాక్ష్యాల కోసం వారు సత్యం, అసత్యం మధ్య పోరాడవలసి వస్తోంది.
న్యాయశాఖలో ఉన్నవారు సోమవారంనాడు ముఖ్యంగా సోమవారపు పౌర్ణమినాడు తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేస్తే వాక్‌పటుత్వం లభించటంతోపాటు ధార్మికపరమైన కేసులలో విజయం సాధించగలుగుతారు.
న్యాయమైన వృత్తి రీత్యా అసత్యమాడవలసిన సందర్భాలకు ఇది ఒక ప్రాయశ్చిత్తంగా ఉంటుంది. అయితే ఇకమీదట వీరు న్యాయమైన కేసులపైనే దృష్టి సారించాల్సి ఉంటుంది.
సోమవారం గిరి ప్రదక్షిణ పద్ధతి
సోమవారం గిరి ప్రదక్షిణ చేసేవారు శ్రీఅరుణాచలేశ్వరుడి ఆలయపు తూర్పు గోపురం సమీపాన ఉన్న రెట్టయ్‌ పిళ్ళయార్‌ గుడి నుండి గిరి ప్రదక్షిణను ప్రారంభించాలి.
చాణక్య దర్శనం

దశముఖ దర్శనం తిరుఅణ్ణమలై

రెట్టయ్‌ పిళ్ళయార్‌ను మొక్కి ప్రదక్షిణ చేసి ఆ సన్నధి నుండి అరుణాచలేశ్వరుడిని దర్శించటమే చాణక్య దర్శనం. అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని అందించిన అపరమేధావి చాణక్యుడు ఈ ప్రాంతాన గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత తనలోని అహంకార భావాలనుండి విముక్తి పొంది సంపూర్ణ జ్ఞానం పొందగలిగాడు.
రాజలింగ దర్శనం
బ్రహ్మలింగాన్ని మొక్కిన తర్వాత దక్షిణపు గోపుర ద్వారం నుండి వెలుపలికి వచ్చి, తిరుమంజన వీథిలో ఉన్న శ్రీకర్పగ వినాయకుడి గుడి తర్వాత గల శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించిన మీదట అక్కడి నుండి లభించే దర్శనమే 'రాజలింగ దర్శనం'
ప్రభుత్వపు ఉద్యోగులకు తమ కార్యాలయాల్లో, ఇళ్ళల్లో ఎదురయ్యే సమస్యలన్నీ ఈ దర్శనం ద్వారా పరిష్కారమవుతాయి.
పళని రాజలింగ దర్శనం
ఇక సెంగం రహదారిలో పూర్ణలింగ తీర్థం, మంగళ తీర్థం ఉన్నాయి. ఈ తీర్థాలు ప్రస్తుతం అదృశ్యరూపంలో ఉన్నాయి. అనువైన గురువును ఆశ్రయిస్తే వీటిని చూడగలరు.
మంగళ తీర్థం నుండి లభించే దర్శనాన్నే పళని లింగ దర్శనం అని పిలుస్తుంటారు. దీని తర్వాత ఏకలింగ దర్శనం, షణ్ముఖ దర్శనం లభిస్తాయి. సోమవారాలలో పొందే ఈ దర్శనం వల్ల భార్యశీలంపై కలిగిన అనుమానాలు తొలగిపోతాయి.
శ్రేయో భాగ్య శివస్వరూప దర్శనం
షణ్ముఖ దర్శనం తర్వాత మేఘాల నడుమ తిరుఅణ్ణామలేశుని దర్శించగలం. ఈ విధమైన దర్శనాన్ని పగటిపూట లేదా రాత్రి వేళ సూర్య లేదా చంద్ర కాంతులలో పొందితే ఆ దర్శనాన్ని శ్రేయో భాగ్య శివ స్వరూప దర్శనం అని చెబుతారు. అరుదుగా లభించే దర్శనమిది. ఈ దర్శనం వల్ల ఇళ్లలో సకల సంపత్తులు అధికమగును.
దిష్టి నివృత్తి లింగ దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో కొంత దూరం పోయాక ఓ చోట తిరుఅణ్ణామలై వాసుడు ఇరువైపులా నక్షత్రాలతో దర్శించగలం. చాలా అపూర్వమైన దర్శనమిది. కాల నిర్ణయాల ప్రకారం భాగ్యమున్నవారికే ఈ దర్శనం లభిస్తుంది.

శ్రీలశ్రీ లోబామాత అగస్త్య ఆశ్రమం
తిరుఅణ్ణామలై

ఇలా ఇరువైపులా నక్షత్రాల నడుమ తిరుఅణ్ణామలై మహేశ్వరుడి దర్శనం లభిస్తే ఆ దర్శనాన్నే దిష్టి నివారణ లింగ దర్శనం అని పిలువబడుతుంది. అన్ని రకాల కంటి సమస్యలు, దిష్టి, అహంభావం తొలగిస్తుంది.
ఈ ప్రాంతం నుండి గిరి ప్రదక్షిణ మార్గంలో కామారణ్య ప్రాంతం దాకా దారి పొడవునా నంది దర్శనాలు, తీర్థాలు ఉంటాయి. నంది దేవుడి కొమ్ముల మధ్యభాగం నుండి అరుణాచలేశ్వరుడిని దర్శించటమే శుభప్రదమైనది.
పసిపిల్లల జోగాడు దర్శనం
కామారణ్య ప్రాంతంలో వీలయినంత దూరం వరకూ పసిపిల్లల్లా జోగాడుకుంటూ గిరి ప్రదక్షిణ చేయడం మంచిది. కామం నుండి విముక్తి పొంది పసిపిల్లల వంటి మనస్తత్త్వం కలిగి ఉన్నప్పుడే భగవద్‌ దర్శనం లభిస్తుందని ఈ దర్శనం రుజువుచేస్తుంది. పసిపిల్లల వలే జోగాడు పరిస్థితిలో పొందే తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని దర్శనాన్నే 'పసిపిల్లల జోగాడు దర్శనం' అని పిలుస్తారు.
మనఃక్లేశాలను తొలగిపోవటానికి దోహదపడే దర్శనమిదే!
పంచేష్టి దర్శనం
సాధారణ పద్ధతిలో ధోవతిని ధరిస్తే అనవసరపు తలంపులు అధికమవుతాయి. మనస్సు స్థిరచిత్తంగా ఉండదు. పంచేష్టి పద్ధతిలో ధోవతిని ధరిస్తే ఇరు నాసిక ద్వారాలలో శ్వాస సక్రమంగా ఉంటూ మనస్సులో స్థిరచిత్తం ఏర్పడుతుంది. కనుక, పూజ, ధ్యానం, గిరి ప్రదక్షిణ వంటి సత్కార్యాలు చేసేటప్పుడు పంచకచ్చ పద్ధతిలో ధోవతిని ధరించటం శ్రేయస్కరం.
కామకాట్టు ప్రాంతాన్ని దాటిన తర్వాత పంచకచ్చం ధరించిన స్థితిలో అణ్ణామలైవాసుడిని దర్శనం చేయడాన్నే 'పంచేష్ఠి దర్శనం' అని అంటారు.
కామకాట్టు పూర్తయ్యాక నైఋతి లింగం దాటిన తర్వాత ఉన్న తిరు ఉన్నాములై మండపానికి సమీపంలో కుడివైపు ఎడమవైపు ముప్పై అడుగుల దూరం వరకు అంగ ప్రదక్షిణం చేసుకుంటూ తిరుఅణ్ణామలై ఈశ్వరుడిన దర్శించి మొక్కడం విశేషదాయకం. తొలుత కుడివైపు మూప్పై అడుగుల వరకు అంగప్రదక్షిణం చేసి మళ్లీ వచ్చి ఉన్నాములై మండపం నుండి తిరుఅణ్ణామలై వాసుడిని దర్శించి మొక్కాలి. ఆ తదుపరి ఎడమవైపు ముప్పై అడుగుల దూరం దాకా ప్రదక్షిణం చేయాలి.
గిరి ప్రదక్షిణ మార్గంలోని ఈ చోట కాస్త చేరువగా త్రయాక్షక దర్శనం, త్రిమూర్తి దర్శనం అనే దర్శనాలు ఉన్నాయి. ఈ దర్శనాల వల్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో ఏర్పడే దోషాలు తొలగుతాయి.
సర్వజీవ ప్రాప్త దర్శనం

శ్రీ అధికార నంది తిరుఅణ్ణామలై

సోమవారం గిరి ప్రదక్షిణంలో అభయ మంటపం ముందు మనం పొందే దర్శనానికి ముని ఉచ్చికాల దర్శనం అని పేరు. అభయమండపానికి ఎదుగా ఉన్న తీర్థపుగట్టున (ప్రస్తుతం ఆడయూర్ తీర్థం అని పిలువబడుతోంది) మోకాళ్ళూనుకొని శిరస్సు నేలను తాకేలా నమస్కరించి మళ్లీ తిరుఅణ్ణామలైని దర్శించటమే సర్వజీవ ప్రాప్త దర్శనమవుతుంది.
మన జీవితాల్లో ఆహారంగా స్వీకరించే పీతలు, కోళ్లు, చేపలు వంటి జీవరాశులకు కలిగిన వేదనలను నివారించే దర్శనమిది. నోరులేని ఆ జీవాలను కొట్టి హింసించడం వంటి పాప కార్యాలకు పరిహారంగా ఈ దర్శనం చేసుకోవాలి.
అంతర పాద లింగ దర్శనం
అభయ మండపం దాటిన తర్వాత నెలకొల్పబడి ఉన్న శ్రీలశ్రీ లోబామాతా అగస్త్య ఆశమ్రం నుండి కుబేర లింగం వరకు మోకాళ్ళూనుకొని నడిచి గిరిప్రదక్షిణం చేయడం విశేదాయకం. తర్వాత కొన కాళ్లపై నిలబడి అరుణాచల పర్వతాన్ని దర్శించటాన్నే 'అంతర పాద లింగ దర్శనం' అని పిలుస్తారు.
క్రమం తప్పకుండా చేయాల్సిన సంధ్యావందన పూజలు మానుకున్నందుకు, పూజలను సకాలంలో చేయకపోవడం వల్ల పోగొట్టుకున్న ఫలితాలు కొన్నింటిని, కాస్త ప్రాయశ్చిత్తాన్ని అందించే దర్శనమిది.
పశువులు, శునకాలు వంటి నోరులేని ప్రాణులను తన్నడం, దిష్టితీసిన గుమ్మడికాయ, మిరపకాయలు, వెంట్రుకలు చుట్టబడిన ఉమ్మెత్త కాయల వంటివాటిని తొక్కడం వల్ల పాదాలు చేసిన పాపాలకు పరిహారంగా ఈ దర్శనం ఉంటుంది.
చక్రాయుధపాణి దర్శనం
ఇక కుబేర లింగం వద్ద శ్రీలక్ష్మీస్తోత్రం, శ్రీలక్ష్మీకవచం, శ్రీసూక్తం వంటి లక్ష్మీదేవి స్తుతులను 12 లేదా 30 సార్లు పారాయణం చేసి పొందే దర్శనమే చక్రాయుధపాణి దర్శనం. చక్రాయుధపాణిగా, సారంగపాణిగా అనుగ్రహించే మహావిష్ణువులు, శ్రీలక్ష్మీదేవి సమేతంగా గిరిప్రదక్షిణం చేయడం వల్ల ఈ స్థలంలో తిరుఅణ్ణామలై వాసుడిని చక్రాయుధపాణి ఆకారంలో దర్శనం పొందారు.
సవ్యమైన ఈ దర్శనం వల్ల

శ్రీ ఇడుక్కు పిళ్ళయార్ సన్నిధి

1. దీర్ఘకాలంగా న్యాయస్థానంలో పరిష్కారం కాని కేసులు పరిష్కరించబడి శుభాలు కలుగజేస్తాయి
2. శత్రువుల చర్యలేవీ మనపై ప్రభావం చూపకుండా ఎదుర్కొంటుంది.
3. పూర్వీకుల నుండి మనకు రావలసిన ఆస్తులు చేతికి వస్తాయి.

4. ఆస్తి సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ పరిష్కరించబడతాయి.
ప్రాయశ్చిత్త కర్మలింగ దర్శనం
ఇక వేలూరు రహదారిలోని రుద్రభూమి నుండి సోమవారంనాడు పొందే దర్శనమే 'ప్రాయశ్చిత్త కర్మలింగ దర్శనం' అని పేరు.
పితృదేవతలకు చేయాల్సిన తర్పణాలను సక్రమంగా చేయలేకపోయినవారు, తర్పణపూజలను సక్రమంగా చేయకుండా ధనాశతో అరకొరకగా చేసినవారు, తెలిసో తెలియకో పలు కర్మఫలితాలను కూడగట్టుకుంటారు. వీరంతా ఈ స్థలంలో నువ్వులు కలిపిన ఆహార పదార్థాలను దానమివ్వటం, నిరుపేదలకు స్నానం కోసం నూనె, శీకాయ వంటివి దానం చేయడం, వృద్ధులకు ఊతకర్రలు ఇవ్వడం వంటి ధర్మాలను చేస్తే తగు పరిహారం లభించి సన్మార్గం ప్రాప్తిస్తుంది.
తర్వాత శ్రీ భూతనారాయణ పెరుమాళ్‌ సన్నిధి నుండి అరుణాచలేశ్వరుడిని దర్శించటంతో సోమవారపు నాటి గిరి ప్రదక్షిణ ముగుస్తుంది. ఇక్కడ సాష్టాంగంగా దేహంలోని ఎనిమిది అంగాలు నేలను తాకేలా అణ్ణామలై ఈశ్వరుడిని నమస్కరించాలి.
సోమవారపు గిరి ప్రదక్షిణ ఫలితాలు
సోమవారం గిరి ప్రదక్షిణం చేయడం వల్ల పైనపేర్కొన్న దర్శన ఫలితాలే కాకుండా పలు శుభఫలితాలు కూడా లభిస్తాయి. వాటిలో కొన్నిటిని పరిశీలిద్దాం.
1. ప్రమోషన్‌ కోసం పరీక్షలు, మౌఖిక పరీక్షలకు వెళ్లేవారు సోమవారం గిరి ప్రదక్షిణ చేస్తే మంచి పదవులను పొందుతారు.

2. కోపగుణం కలవారు, చిటికిమాటికి విసుగును ప్రదర్శించేవారు సోమవారం తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేస్తే వారి గుణాలు మంచివవుతాయి. మాటల్లో మృదుత్వం చోటుచేసుకుంటుంది. వీరు గిరి ప్రదక్షిణ సమయంలో కొబ్బరి, తేనె వంటివి దానం చేస్తే శుభఫలితాలు పొందుతారు.

పంచముఖ దర్శనం తిరుఅణ్ణామలై

3. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాకుండా, చదువుకు తగ్గ ఉద్యోగం పొందలేని వారు నెలపొడుపు సోమవారపు కలసి వచ్చే దినాలలో గిరి ప్రదక్షిణ చేసి అర్హతకు తగ్గ ఉద్యోగాలు పొందవచ్చు
4. ఉన్నత పదవుల్లో ఉన్నవారు సోమవారం పౌర్ణమినాడు గిరి ప్రదక్షిణ చేస్తే అనవసరపు మనోక్లేశాల నుండి విముక్తి పొందుతారు.
5. వ్యాపారులు సోమవారం సూర్యహోర, బుధహోర సమయాల్లో ప్రారంభించి గిరి ప్రదక్షిణ చేసి ఆ రోజున భార్య, తల్లి, మహిళల ద్వారా వ్యాపారాలను ప్రారంభిస్తే పలు దోషాలు, దిష్టి తొలగిపోతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
6. ఉద్యోగస్థులు తమ కార్యాలయాల్లోని సమస్యలు తీరేందుకు సోమవారాల్లో గురుహోర, శుక్రహోర సమయాల్లో గిరి ప్రదక్షిణ చేయడం శుభదాయకం.
7. రసాయనం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, వాహన సంబంధింత విద్యలను నేర్చిన విద్యార్థులు సోమవారం గిరి ప్రదక్షిణ చేసి పేదలకు, చిన్నపిల్లలకు పలకలు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, నోటు పుస్తకాలు దానంగా ఇస్తే విద్యలో ఉన్నతస్థితిని పొందగలరు.
గిరి ప్రదక్షిణ మార్గంలో ఆవులకు గానుగ పిండి ఇచ్చి మహోన్నత స్థితిని పొందిన 'పున్నాక్కు సిద్ధులు (ఈశ సిద్ధిని పొందినవారు) అనే అద్భుతమైన సిద్ధపురుషుడు నేటికి తిరుఅణ్ణామలైలో శ్రీచంద్రలింగ దర్శన ప్రాంతంలో సోమవారంలో మానవరూపంలోనో అదృశ్యరూపంలోనో దర్శనమిచ్చి విద్యలో ఉన్నతస్థితిని ప్రాప్తింపచేస్తాడు.
8. తనను ఎవరూ గౌరవించడం లేదు అనే గుణంతో చింతించే వృద్ధులు సోమవారంనాడు గిరి ప్రదక్షిణ చేసి వృద్ధ నిరుపేదలకు ఆహారం, చాప, దిండు, చేతి ఊతకర్ర వంటివి దానం చేసి మంచి ఫలితాలు పొందవచ్చును.
9. వివాహ ఆటంకాల వల్ల దిగులు చెందేవారు సోమవారం వేకువజాము ఉదయం ఐదున్నర నుండి ఏడున్నర గంటలలోపున గిరి ప్రదక్షిణ చేసి ఏదో ఒక్క అమ్మవారి సన్నిధి వద్ద పేద కన్యలకు మాంగల్యపు వస్తువులను దానం చేస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి.
ముఖ్యంగా పౌర్ణమితో కూడిన సోమవారాలలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు కలుగును. బ్రహ్మదేవుడే తిరుఅణ్ణామలైని పలు యుగాల తరబడి గిరి ప్రదక్షిణ చేసిన మీదటే సరస్వతీదేవిని పరిణయమాడే భాగ్యం పొందారని చెబుతారు.

మంగళ వారాల్లో గిరి ప్రదక్షిణ పద్దతి

మంగళవారం మురుగ పెరుమాళ్‌కు శ్రేష్టమైన దినం. మహాశివుడి మూడో కంటి నుండి ఉద్భవించిన అగ్ని జ్వాలలుగా జనించి, ఆరు కార్తీక నక్షత్రాలు పోషించబడి, శరవణతీర్థంలో షణ్ముఖుడిగా జన్మించిన రోజు ఇదే.
మంగళవారం తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణను అరుణాచలేశ్వరాలయంలోని బ్రహ్మతీర్థం సమీపంలో వేంచేసి యున్న గణపతిదేవుని నమస్కరించి ప్రారంభించాలి.
గో సంరక్షణ గణపతి
కోటి యుగాలపాటు కొలువుదీరిన అద్భుతమూర్తి ఈ గణపతి. ద్వాపరయుగంలో ఓమారు గోకులంలో పశువుల సంతతి బాగా తగ్గిపోవడంతో గోకులవాసులంతా శ్రీకృష్ణపరమాత్ముడితో కలిసి తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసి, అరుణాచలేశ్వరుడిని దర్శించి పొందిన గోవులను గణపతికి సమర్పించారు. ఆ సమయంలో శ్రీకృష్ణపరమాత్ముడు గణపతిని 'గో సంరక్షణ గణపతి' అంటూ కీర్తించి శ్రీవేణుగోపాలుడి రూపంలో దర్శనమిచ్చారు. ఆయనే నేటికీ మూలవిరాట్టుకు వెనుకవైపున, తొలి ప్రాకారంలోన మురళీగానలోలుని రూపంలో దర్శనమిస్తున్నారు.
గజ పూజ

శ్రీ పచ్చయమ్మన్ ఆలయం

చేర చోళ పాండ్య రాజులు మువ్వురూ అతీత బలంతో ఐకమత్యంగా రాజ్యాలు ఏలుతున్న ఓ సమయంలో పదాతి బలం పెంచేందుకు దోహదపడే గజ పూజను చేయటం మరచారు.

చతుర్థి దినాన సైన్యపు ఏనుగులన్నీ బారులు తీరి శ్రీగణపతికి పలు రకాల అభిషేక ఆరాధనలు నిర్వంహించేవారు. ఆ తర్వాత 108 ఏనుగులతో శైవ, వైష్ణవ పద్ధతుల్లో 'గజపూజ' జరుపుతుండేవారు. ఆ సమయంలో 108 ఏనుగులలో ఒకదానిపై గణపతి ఆవాహనం చెంది అనుగ్రహిస్తారు. ఆ మువ్వురు చక్రవర్తులు చతుర్థినాడు చేయాల్సిన గజపూజను మరచిపోవడంతో దళంలోని ఏనుగులు అడవిలోకి వెళ్లి అంతర్థానమయ్యాయి. ఆ ముగ్గురు రాజులు దిగ్భ్రాంతి చెందారు. పెద్దల ద్వారా కారణం తెలుసుకుని తిరుఅణ్ణామలై చేరుకు 'యానై పల్లం' (ఏనుగుల గొయ్యి) అనే చోట 1008 ఏనుగులతో గజపూజలు నిర్వహించారు. చతుర్థి, మంగళవారం కూడిన దినాన జరిపిన ఆ మహాగజపూజను భూలోకవాసులేక కాకుండా సమస్త లోకాలకు చెందినవారంతా తిలకించి సంతషించారు. శ్రీఅగస్త్యులవారు, అవ్వయార్‌ నేరుగా వెళ్లి హాజరై ఆ గజపూజలకు నిండుదనం చేకూర్చారు. ఆ పూజ ముగియగాను 'తిరుఅణ్ణామలైలో బ్రహ్మతీర్థపు గట్టున వేంచేసి యున్నాను. మీవద్దగల ఏనుగులన్నింటినీ తీసుకువచ్చి నాకు సమర్పించండి' అంటూ అశరీరవాణి పలికింది. ఆ మువ్వురు రాజులు ఆ విధంగానే తమ సైనిక దళంలోని ఏనుగులన్నింటినీ తీసుకువచ్చి గణపతి దేవుని ఎదుట సమర్పించారు.
నేటికీ గణపతి ఉపాసకులు తమ ఉపాసనా పుణ్యభాగ్యాన్ని 'గోసంరక్షణ గణపతి' వద్ద సమర్పిస్తే దైవీక జీవనంలో ఉన్నత స్థితిని పొందగలరు.
మంగళవారం గిరి ప్రదక్షిణ పద్ధతి
జనన కర్మలు తీరడానికి, దైవానుగ్రహం పొందటానికి గురు అనుగ్రహం అత్యంత అవసరం. అనువైన గురువును తప్పకుండా పొందాలి. ఇలా సద్గురువు కోసం అన్వేషించే భక్తులకు మంగళవారం గిరి ప్రదక్షిణ చేయడం వరదాయకమవుతుంది.
'దీక్ష' అంటే స్పర్శ ద్వారా ఎరుకపరచడం అని అర్థం. పలువిధాలైన దీక్షల ద్వారానే సద్గురువు అనుగ్రహం పొందగలం. అనుగ్రహదీక్ష, స్పర్శ దీక్ష, మానస దీక్ష, నేత్ర దీక్ష, గిరి ప్రదక్షిణ దీక్ష అని దీక్షలు పలురకాలు.
'అరుణాచలేశ్వరా! అనువైన సద్గురువును అనుగ్రహించు తండ్రీ!' అని వేడుకునేందుకు మంగళవారాల్లో తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేస్తే, అరుణాచలేశ్వరుడే పలు రకాల అనుగ్రహ దీక్షలను దర్శన రూపంలో అందిస్తారు. వాటిలో కొన్ని దర్శనాలను గురించి ముచ్చటిద్దాం.
నయన దీక్ష దర్శనం

శ్రీ దుర్గ అమ్మవారి ఆలయం

మంగళవారం తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసి శ్రీదుర్గాదేవి ఆలయంవద్ద పగడపు కొండసహితంగా అరుణాచలేశ్వరుడిని రాహుకాల సమయంలో (మంగళవారం 3 - 4.30 pm) దర్శించడాన్నే నయన దర్శనం అని పిలుస్తారు. రాహుకాల సమయంలో ఈ దర్శనం పొందేలా ఈ గిరి ప్రదక్షిణ సమయాన్ని ఎంచుకోవాలి.
1. అరుణాచలేశ్వరుడి నయన దీక్ష ప్రాప్తిసుంది. నయనదీక్ష సద్గురువు అనుగ్రహాన్ని తలపింపచేస్తుంది. సద్గుణాలను పొందగలము.
2. ఆటంకాలు తొలగి కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది.
3. క్రిమికీటకాల బారిన పడకుండా పంటలను కాపాడుకోగలం.
4. కాయగూరల ఉత్పత్తి అధికమవుతుంది.
స్పర్శ దీక్ష దర్శనం
మంగళవారంనాడు, మంగళ హోర సమయంలో (ఉదయం 6-7, రాత్రి 8-9, వేకువజాము 3-4) తిరుఅణ్ణామలైని ప్రదక్షిణ చేసి ఆలయ చిలుక గోపురం వద్దగల బ్రహ్మతీర్థం చేరువగా నిలచి అరుణాచలేశ్వరుడిని దర్శించటమే 'స్పర్శ దీక్ష దర్శనం'. స్పర్శదీక్ష దర్శనం వల్ల కాపురాలు సవ్యంగా సాగుతాయి. గురువు చూపిన ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి వీలుకలుగుతుంది.
గురువును పొందటమే అరుదు. గురు మార్గంలో నడవడం మరీ అరుదు. దీనికి సంబంధించిన ప్రార్థనా పద్ధతులు, ఆధ్యాత్మిక శక్తిని స్పర్శ దీక్ష దర్శనం మనకు అందిస్తుంది.
మానస దీక్షా దర్శనం
మంగళ హోరలో ఉచ్చికాలాన (మద్యాహ్నం 12-1) గిరి ప్రదక్షిణను ప్రారంభించి, మంగళ హోరలో (మధ్యాహ్నం 1-2) దక్షిణ గోపుర ద్వారం నుండి కుడివైపు తిరిగితే లభించేదే 'మానస దీక్షా దర్శనం'.
1. నివాసగృహాల్లో, వ్యాపారం, కార్యాలయాల్లో ఎదురయ్యే సమస్యలు తొలగి శుభదాయకమైన స్థలమార్పిడి కలుగుతుంది, సకల సౌభాగ్యాలు కూడా ప్రాప్తిస్తాయి.
2. ఆధ్యాత్మికపరంగా గురువు చూపించే ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే మన పూర్వజన్మపు కర్మఫలితాలవల్ల కలిగే ఆటంకాలన్నీ తొలగుతాయి.
సద్గురు మార్గంలో వెళితే కష్టాలు ఎందుకు ఎదురవుతాయి?
ఏ సద్గురువైనా తన శిష్యులు వారి కర్మఫలితాలను తొలగించడాన్నే కోరుకుంటారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని అద్బుతాలు జరుపరు. వాస్తవిక జీవితంలోని కర్మలు (ప్రాప్త కర్మం) అనుభవించి తీరాల్సిందే కాని ఆ కర్మఫలితాలను గురువులు మార్చేందుకు ఇష్టపడరు. అయితే కొత్త కర్మలు చేరకుండా కాపాడగలుగుతారు.
మన కర్మఫలితాలు కొద్ది కొద్దిగా తగ్గుతూ, కొత్త కర్మలు దరి చేరకుండా ఉంటే అదే జనన మరణరాహిత్య సార్థక జీవితానికి సంకేతమవుతుంది.
సద్గురువు ఆధ్యాత్మిక మార్గాలపై సంపూర్ణ విశ్వాసంతో వాటిని అనుసరిస్తే వారి భవిష్యత్‌ కర్మఫలితాలను ఈ జన్మలోనే అనుభవించేలా చేసి పునర్జన్మల సంఖ్యను తగ్గించగలరు. కనుకనే శిష్యగణాలు ఎంతటి మహత్కరమైన ఆధ్యాత్మిక జీవనం పొంది ఉన్నప్పటికీ జీవితంలో పలు కష్టాలను అనుభవిస్తుంటారు.
కనుక జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా 'గురువుల అనుగ్రహంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలం' అన్న దృఢనిశ్చయాన్ని ఏర్పరచుకోవాలి. అదే సద్గురు అనుగ్రహాన్ని దైవానుగ్రహంగా మనకు అందిస్తుంది.
వాసక దీక్షా దర్శనం

శ్రీ అంగప్రదక్షిణ అణ్ణామలైయారు
జీవ సమాధి

మంగళవారంనాడు గురు హోరలో (వేకువజాము 5-6, మధ్యాహ్నం 12-1, రాత్రి 7-8, వేకువజాము 2-3) తిరుఅణ్ణామైలిని గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దక్షిణ గోపురం సమీపాన తిరుమంజన వీథిలోని శ్రీకర్పగ వినాయకుడి ఆలయం నుండి అరుణాచలేశ్వరుడిని దర్శనం చేసుకుంటే అదే 'వాసక దీక్షా దర్శనం' అవుతుంది.
1. వృత్తి, విద్య, సంసారంలో ఏర్పడే ద్వేషం, శత్రుత్వం, కలహం, అవమానం వంటివి తొలగుతాయి.
2. సద్గురువు నిర్దేశించిన మార్గంలో పయనించేటప్పుడు కలిగే ఇడుములు తొలగి భగవద్‌ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
యోగ దీక్షా దర్శనం
కర్పగ వినాయకుడి ఆలయం నుండి నేరుగా వెళ్లి ముక్కూడలి రహదారంలో కుడివైపు తిరిగితే ప్రభుత్వ పాఠశాల సమీపాన లభించే దర్శనమే యోగ దీక్షా దర్శనం.
కలియుగంలో పలువురికి యోగమార్గంపై తీవ్రమైన ఆసక్తి ఏర్పడుతుంది. అందుకు సద్గురువు అవసరం. అసవ్యమైన యోగశిక్షణ అనారోగ్యాలను, మనో వ్యాధులను కలిగిస్తుంది. మంగళవారం తులా లగ్నంలో గిరి ప్రదక్షిణ చేసి యోగ దీక్షా దర్శనం పొందేవారికి యోగ అభ్యాసం సులువుగా లభించేందుకు మార్గదర్శి లభిస్తాడు.
పలు ఇళ్లల్లో పూర్వీకులు ధనలాభం, దోష నివృత్తి కోసం పూజించిన దైవీక యంత్రాలు, చక్రాలకు సవ్యమైన పూజలకు నోచుకోక నిరుపయోగంగా ఉంటాయి. అలా పూజలకు నోచుకోనందువల్ల ఆ యంత్రాలు చక్రాల దైవీక శక్తి క్రమేణా తగ్గుతుంది. నిత్యపూజల ద్వారానే వాటిలోని దైవీక శక్తులను ప్రేరేపించబడతాయి. పైగా ఆ యంత్రాలలో ఆవాహనం చేయబడిన దేవతలకు పూజలు, నైవేద్యం లేకపోవడం వల్ల వాటికి దేవతాకలి కలిగి దోషాలుగా మారుతాయి. (దైవీక నేరాలలో ఇది కూడా ఒకటి)
పైన పేర్కొన్న దోషాలకు పరిహారంగా మన ఇళ్లల్లోని యంత్రాలు / చక్రాలను పసుపు వస్త్రంలో ఉంచి, చేతులలో పెట్టుకుని మంగళవారంనాడు తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణం చేసి తులా లగ్న సమయంలో యోగా దీక్ష దర్శనం పొందాలి. ఈ దర్శనం వల్ల
1. కిరాణా వ్యాపారులు అభివృద్ధి చెందుతారు.
2. బ్యాంక్‌, ఆలయం, గణాంక శాఖ, విద్యుత్‌, తపాలా శాఖ, తనిఖీ శాఖ (జుతిఖిరిశిరిదీవీ / దీరీచీలిబీశిరిళిదీ)లలో పనిచేస్తున్నవారు పదోన్నతి, కోరుకున్న చోటుకు బదలీ పొందుతారు. కార్యాలయపు కష్టాలనుండి బయడపడతారు.
3. తమిళ వేదాలు, గ్రంథాలపై ఆసక్తిగలవారు, వ్యవసాయ రంగంలోనివారు జీవితంలో ఉన్నతస్థితికి చేరుకుంటారు.
అవుత్రీ దీక్షా దర్శనం
శ్రీరమణాశ్రమం వెళ్లే మార్గంలో ఇంద్ర తీర్థం సమీపంలో నెలపొడుపు ఆకారంలో అరుణాచలేశ్వరుడు దర్శనమిస్తారు. ఆ దర్శనమే అవుత్రీ దీక్షా దర్శనం. పలు తీవ్రమైన కర్మఫలితాలను నివారించగలదు. అవుత్రీ దీక్ష అంటే ఏమిటి?
జీవితంలో పలు సమయ సందర్భాలలో పలు రకాల కర్మలను చేసి పలువురు జీవిస్తుంటారు. దానికి ప్రాయశ్చిత్తం అన్వేషిస్తూ పరిహారాలు చేసేవారు కూడా ఉన్నారు.
ఏ తప్పిదాలకు పరిహారం అన్వేషిస్తుంటామో
1. వాటిని జీవితం మళ్లీ చేయకుండా ఉండటం
2. తప్పిదాలవల్ల బాధపడుతున్నవారికి నివారణ సహాయాలు అందించడం
3. పరిహార పద్ధతులు అందించటం
ఈ మూడింటి వలన ఎలాంటి కర్మఫలితాలకైనా నివారణ లభించగలదు.
అయితే అవుత్రీ దీక్ష ద్వారా ఎలాంటి చెడు కర్మఫలితాలైనా ఎలాంటి పరిహారం లేకుండా నివారణం పొందవచ్చు. మంగళవారం నెలపొడుపు కూడిన వేళ తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసి త్రిమూర్తి లింగ దర్శనం పొంది శ్రీత్రిమూర్తి హోమం, దానధర్మాలు చేసిన మీదటే అవుత్రీ దీక్షా దర్శనం పొందగలం.
అయితే మంగళవారం చంద్రహోర సమయంలో (ఉదయం 10-11, సాయంత్రం 5-6, రాత్రి 12-1) తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసి అవుత్రీ దీక్షా దర్శనం పొంది, 101 సార్లు నమస్కరిస్తే అవుత్రీ దీక్ష శక్తి సులువుగా ప్రాప్తిస్తుంది. ఈ దర్శనం పొంది నిరుపేదలు నివసించే ప్రాంతాల్లో హోమాలు జరిపి, ఎరుపు రంగు వస్త్రాలు దానం చేస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలెదురైనా సులువుగా పరిష్కరింపబడుతాయి.
జ్ఞాన దీక్షా దర్శనం
పలు సంవత్సరాలుగా దైవానుగ్రహం పొందటానికి అవసరమైన ఉత్తమ గుణాలను జ్ఞానదీక్షా దర్శనంతో క్షణాలలో పొందగలుగుతారు. చెడు తలంపులు, చెడు గుణాలు తొలగి ఉత్తమ గుణాలు దేహంలోను, మనస్సులోను ఏర్పరచే అద్భుతమైన దర్శనమిది!
తిరుఅణ్ణామలైలో జ్ఞానదీక్షా దర్శనం పొందిన మహర్షులలో గుహ నమశ్శివాయులు, శ్రీకుళందైయానంద స్వాములు, కుంభకోణంలో జీవ సమాధిపొందిన శ్రీత్యాగానంద స్వాములు, శ్రీఅమావాస్య సిద్ధులు ఉన్నారు.
అరుణాచలేశ్వరుడే తన సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రాప్తింపచేయగల ఈ అద్భుత దర్శనాన్ని మంగళవారం రాహుకాలంలో గిరి ప్రదక్షణ చేసి ప్రార్థిస్తే పొందగలము.
క్రియా దీక్ష దర్శనం
మన దేహంలో దాగి ఉన్న మూలాధార శక్తిని ప్రేరేపింపజేసి, వెన్నెముకలోని ధవళ నరం ద్వారా పైకెగసి సహస్రారాన్ని చేరేలా చేసేదే కుండలినీ యోగ పద్ధతి. కుండలినీ శక్తి పైకెగసేటప్పుడు దేహంలో ఉష్ణం ఏర్పడుతుంది. పలురకాలైన సిద్థులు చేకూరుతాయి. వాటిని భరించగల దేహ దారుఢ్యం, మనోపక్వం పొందటానికి గురువు అనుగ్రహం అత్యంత ఆవశ్యకం. కనుక తగిన సద్గురువు ద్వారా కుండలినీ యోగాన్ని నేర్చుకోవడమే మంచి పద్ధతి.
కుండలినీ యోగ పద్ధతిని అనుసరిస్తున్నవారికి క్రియా దీక్షా దర్శనం బాగా దోహదపడుతుంది. వీరు ఎరుపు రంగు మాణిక్యం, పగడపు చెవి పోగులు ధరించి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కుండలినీ యోగ పద్ధతులను త్వరగా తెలుసుకోగలం.
గిరి ప్రదక్షిణ మార్గంలో ఓ చోట అంగారక గ్రహపు కాంతి, తిరుఅణ్ణామలై శిఖరాగ్రంతో కలిసి, నిట్టనిలువుగా దర్శనమిస్తుంది. దీనినే 'అంగారక రక్తక్రియా దీక్షా దర్శనం' అని పిలుస్తుంటారు.
1. జ్యోతిష్యం, పవితాత్మ్ర అనుగ్రహం కలిగి జ్యోతిష్యం చెప్పేవారు, యోగ చక్రాలను పూజించేవారు, ఊలిజిలిచీబిశినీగి లో నిష్ణాతులైనవారు తమ శాఖలలో అభివృద్ధి చెందగలరు.
2. కుండలినీ యోగం నేర్చుకునేవారికి, యోగ శిక్షకులకు యోగ శక్తి అధికమవుతుంది.
3. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తెలుసుకొని వాటి నుండి కాపాడుకునేందుకు ఈ దర్శనం దోహదపడుతుంది.
సుభిక్ష దీక్షా దర్శనం
గురువు వద్దే ఉంటూ సేవలు చేసి ఆయన నేర్పే దైవీక విషయాలను పాటించి దైవకార్యాలను చేయువారికి సద్గురువైనవారు 'సుభిక్షా దీక్ష'ను అందించి అనుగ్రహిస్తుంటారు.
మంత్ర దీక్ష, యోగ దీక్ష వంటి పలు కఠినమైన పూజా పద్ధతులు, వ్రత పద్ధతులు లేకుండా చాలా సులువుగా గురు అనుగ్రహంతో కూడిన దైవానుగ్రహాన్ని సైతం అందించే పద్ధతే సుభీక్షా దీక్ష పద్ధతి.
సద్గురువును పొంది ఆయనతోనే ఉంటూ సకమ్రంగా సేవలు చేయాలనుకునేవారు మంగళవారాల్లో విశాఖ నక్షత్రంతో కూడి శుభసమయాన తిరుఅణ్ణామలైని గిరిప్రదక్షిణ చేయాలి. లేదా మూడేళ్లు క్రమం తప్పకుండా గిరి ప్రదక్షిణ చేసి పూజిస్తే అరుణాచలేశ్వరుడు సద్గురువును ఎరుకపరచి, ఆయనకు సేవచేసే భాగ్యాన్ని అందించగలరు.
'కలియుగంలో సద్గురువును పొందటమే అరుదైన విషయం. ఈ స్థితిలో గురుసేవ ఎలా చేయడం? అని తలంచకండి. నేటికీ ఎందరో సద్గురువులు తమ పరిపూర్ణమైన దైవీ శక్తిని ఎరుకపరచకుండా సామాన్య మానవుల్లా జీవిస్తున్నారు. నిజమైన దైవ విశ్వాసం కలిగినవారు మాత్రమే వీరిని గుర్తించగలరు.
మన దగ్గరే ఉన్నా వారిని కనుగొనలేకపోవడం మన తప్పిదమే కాదా! మన జీవనపు సమస్యలు తీరడానికి, సుఖయోగాలు, సంతోషాలు కోరటానికే వారిని వెంబడించడం ఎలా న్యాయమవుతుంది? అమృత భాండాగారాన్నే మనముందు ఉంచడానికి సద్గురువులు సిద్ధంగా ఉన్నప్పుడు వారిని కనుగొనకుండా ఉండటం ఎవరి నేరం?
కనుక తగిన సద్గురువు కావాలనుకునేవారు విశాఖ నక్షత్రంతో కూడిన మంగళవారాల్లో మూడేళ్లపాటు (1095 రోజులు) తిరుఅణ్ణామలైని గిరిప్రదక్షిణ చేస్తే తప్పకుండా తగిన సద్గురువును పొందగలుగుతారు.

బుధ పారం గిరి ప్రదక్షిణ పద్దతి

బుధవారంనాడు తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేయాలనుకునేవారు రెట్టయ్‌ పిళ్లయార్‌ గుడి సమీపంలోని శ్రీభూతనారాయణ సన్నిధిలో ప్రారంభించి పద్ధతిగా గిరి ప్రదక్షిణ చేసి మళ్లీ శ్రీభూతనారాయణ సన్నిధికి చేరుకుని ప్రదక్షిణ ముగించాలి.
దేవతలు, గంధర్వులు, పితృలు, దైవాలు వంటి ఉన్నత స్థితిని కలిగినవారే సులువుగా గిరి ప్రదక్షిణ చేసి పూజించలేని తిరుఅణ్ణామలైని ఏ అర్హతలు లేని నాకు గిరి ప్రదక్షిణ చేసే భాగ్యం ప్రసాదించు స్వామీ!' అంటూ వేడుకుని శ్రీభూత నారాయణ పెరుమాళ్‌ను మొక్కిన తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. అప్పుడే భూతనారాయణ పెరుమాళ్‌ ఏదో ఒక రూపంలో వచ్చి మార్గదర్శనం చేస్తాడు. ఇది ఎంతటి భాగ్యం!
బాణ లింగ దర్శనం
శ్రీభూత నారాయణుని దర్శించిన తర్వాత ఉత్తర గోపుర ద్వారం వద్దకు వెళ్లి అక్కడి నుండి తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శించడమే బాణ లింగ దర్శనం. ఈ ప్రాంతంలో పాయసం దానం చేయడం మంచిది.
1. భార్యను వేధించడం
2. పర స్త్రీలను కామ దృష్టితో చూడటం
3. మహిళల జీవితాలను నాశనం చేయడం
పైన పేర్కొన్న తప్పిదాలకు చింతించి, మళ్లీ అలాంటి తప్పిదాలకు పాల్పడకుండా ప్రాయశ్చిత్తం ప్రసాదించే పవిత్రమైన దర్శనమిదే!
ఈ దర్శనం తర్వాత దక్షిణ ద్వారం గుండా వెలుపలికి వచ్చి గిరి ప్రదక్షిణను ప్రారంభించాలి.
ఆకాశ లింగ మూర్తి దర్శనం
గిరిప్రదక్షిణను ప్రారంభించేటప్పుడు శ్రీశేషాద్రి స్వామి జీవసమాధి ప్రాంతం నుండి తిరుఅణ్ణామలైవాసుడిని దర్శిస్తే పర్వత శిఖరాగ్రాన కాస్త పైదిశగా ఆకాశాన లభించే దర్శనమిది. దీనికి 'ఆకాశ లింగమూర్తి దర్శనం' అని పేరు. ప్రతి మానవుడు తన జీవితంలో తెలిసో తెలియకో పలు నిరాశలకు లోనవుతాడు. వాటి వల్ల కలిగే దోషాలను పటాపంచలు చేసే దర్శనం ఇదే. ఇక్కడ తిరుఅణ్ణామలై వాసుడిని సాష్టాంగంగా నమస్కరించాలి. అహంభావంతో పలు కుటుంబాలకు చేసిన కష్టాలను తగ్గించే దర్శనం ఇది.
శివపాద దర్శనం
ఇక రెండు పర్వతాల నడుమ లభించేదే శివపాద దర్శనం. సంతాన భాగ్యానికి నోచుకోనివారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది.
ప్రత్యక్షదైవాలైన తల్లిదండ్రులకు, పెద్దలకు ప్రతినిత్యం పాదపూజ చేయాల్సిన బాధ్యత ప్రతిమానవుడికి ఉంది. వీరికి నిత్యపూజలు చేస్తేచాలును. తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సుల ద్వారా కష్టాలనుండి బయటపడగలరు. సందర్భవశాన ఈ పూజలను చేయలేనివారు మానసికంగానైనా ప్రతిరోజూ ఈ పూజను చేయాలి. మానసికమైన ప్రార్థన అంత సులువైన విషయం కాదు. గురుముఖంగా ఈ పూజా పద్ధతులను తెలుసుకోండి.
శివపాద పూజ
ప్రతి శివాలయంలోనూ ప్రతి రాత్రీ శివస్వర్ణపాదాలను మోస్తూ ఆలయ ప్రదక్షిణ చేసిన తర్వాత వాటిని శయనమండపానికి చేరుస్తారు. గర్భిణీ మహిళలు ఈ శివపాద పూజలలో పాల్గొని నైవేద్యమిచ్చిన పాలను సేవిస్తే సుఖ ప్రసవం జరుగుతుంది. ఈ మహిళలకు శివపాద పూజ నైవేద్యానికి పాలను ఇవ్వడం, నైవేద్యంగా ఇచ్చిన పాలను నిరుపదేల పిల్లలకు దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
అన్నాభిషేక దర్శనం
చెంగం రోడ్డులో అరుదుగా లభించే దర్శనం అన్నాభిషేక దర్శనం. మంచు మేఘాలు తిరుఅణ్ణామలైపై కప్పబడినట్లుగా కనిపించే అద్భుత దృశ్యం! అన్ని సమయాల్లోనూ ఈ దర్శనం లభించదు. పూర్వజన్మ సుకృతం ఉన్నవారికే లభిస్తుంది.
ఈ అరుదైన దర్శన భాగ్యానికి నోచుకునేవారు జీవిత పర్యంతమూ ఎన్నడూ 'అన్న ద్వేషం' (ఆహారంపై ద్వేషం) కలుగదు. వీరికి రోగాలతో పడకపైనే మృతి చెందే పరిస్థితి ఏర్పడదు. ఈ దర్శనం తర్వాత ఐదేళ్లపాటు (1825 సార్లు గిరి ప్రదక్షిణ చేయాలి.) గిరి ప్రదక్షిణం కొనసాగించాలి.
సప్త ముఖ దర్శనం
అన్నాభిషేకం దర్శనం తర్వాత గిరి ప్రదక్షిణ మార్గంలో కుడివైపు తిరిగే చోటు వద్ద నంది దర్శనాలు, తీర్థరహస్యాలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుంటూ పోతే పెద్ద పురాణమే అవుతుంది.
ఓ నిర్ణీత ప్రాంతంలో తిరుఅణ్ణామలైని దర్శించేటప్పుడు ఏడు ముఖాలతో దర్శనమిస్తారు. ఆ సప్త ముఖాలు సప్త స్వరాలను తలపిస్తాయి. సంగీత కళాకారులు ఈ దర్శనం పొందితే కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. సంగీత విభాగంలో ప్రవేశించిన వారికి ప్రవేశించదలిచేవారికి మంచి ఫలితాలు ఇచ్చే దర్శనమిది.
కామక్రోధ దర్శనం
కామం అంటే స్త్రీపురుషుల మధ్య గల ఇచ్చ మాతమ్రే కాదు. ధనం తదితర ఐహిక వస్తువులపై పేరాశను కలిగి ఉండటం కూడా కామమే అవుతుంది. తాను అనుకున్నది పొందలేకపోయినప్పుడు కామం క్రోధంగా మారి మనిషిని దుర్మార్గుడిగా మార్చుతుంది.
తిరుఅణ్ణామలైవాసుని బుధవారం గిరి ప్రదక్షిణం చేయునపుడు కామకోడు ప్రాంతం నుండి పొందే దర్శనానికే 'కామ క్రోధ దర్శనం' అని పేరు. ఈ దర్శనం వల్ల కామ, క్రోధ మదమాశ్చర్యాలు తొలగిపోతాయి.
గిరి ప్రదక్షిణ ప్రారంభించడానికి ముందు ఈ చోట మూత్ర విసర్జన చేయాలి. మూత్రవిసర్జన చేస్తే మనలోని కామ క్రోధాలను భూదేవి స్వీకరించి త్యాగదేవిగా అనుగ్రహిస్తుంది. ఈ దర్శనం తీవ్రమైన మూత్రాశయ రోగానలు నయం చేయగలదు.
నాగ వల్మీకం
ఈ ప్రాంతంలో రహదారికి ఎడమవైపు పలు నాగుపాములు వాటి శక్తి ద్వారా రూపొందించిన నిలువెత్తు వల్మీకాలు (పుట్టలు) చాలా ఉంటాయి. నాగలోక దేవతలు ఈ చోటుకు వచ్చి ఏదో ఒక రూపంలో తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసి తమ లోకానికి వెళుతుంటాయి. ఈ నాగపాము పుట్టకు నిత్యం పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది.
పాలాయి లింగమూర్తి దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో కుడివైపున ఉన్న జ్యోతి వినాయకుడి గుడి సమీపంలోని తీర్థకొలను గట్టు వద్ద లభించేదే 'పాలాయి లింగమూర్తి దర్శనం' ఇక్కడున్న నందుల కొమ్ముల మధ్య తిరుఅణ్ణామలైని దర్శనం చేయడం విశేషమైనది. పలు సమయాలలో చెట్ల ఆకులు ఈ దర్శనానికి అడ్డుపడుతుంటాయి. భాగ్యవంతులే ఈ దర్శనం పొందగలరు.
జంధ్యం ధరించనివారు, జంధ్యం ధరించినా గాయత్రి జపం, సంధ్యావందనం తదితర పూజలు చేయనివారు ఈ దర్శనం పొందిన తర్వాత ఆ పూజలన్నింటినీ సక్రమంగా చేయాల్సి ఉంటుంది. జంధ్యమంటే పంచభూత శక్తులను తనలో ఇముడ్చుకుని వేద, మంత్రాల శబ్దాలను గ్రహించి ధరించినవారికి కవచంగా ఉంటూ కష్టాలనుండి కాపాడుతుంది. జంధ్యాన్ని అలంకార వస్తువుగా భావించకూడదు. జంధ్యంలో తాళపు చెవిని ముడివేసి పెట్టరాదు. కనుక జంధ్యం వేసుకున్నవారిని హేళనగా మాట్లాడం పాపం. అలా హేళనచేసి జంధ్యం ధరించినవారి మనస్సును కష్టపెట్టి వుంటే వాటి వల్ల కలిగిన పాపాలను ఈ దర్శనం తొలగించగలదు. ఇక ఇలాంటి తప్పులను మళ్లీ చేయకూడదు. ఈ దర్శనం వల్ల ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ దర్శనం వల్ల న్యాయమైన పదోన్నతి కలగుతుంది. అప్పులు తీర్చగలుగుతారు. మహిళలకు ధనభాగ్యం కలుగుతుంది. తల్లి ఆశీస్సులు లభింపజేస్తుంది.
స్తంభ దీప దర్శనం
బుధవారం గిరిప్రదక్షిణలో తర్వాత అడిఅణ్ణామలై ప్రాంతం నుండి పొందే దర్శనానికి స్తంభ దీప దర్శనం అని పేరు
స్తంభ దీపంలో మూడు బాగాలు ఉంటాయి. స్తంభ దీపపు అడుగుభాగం బ్రహ్మ, నడిమధ్య భాగం విష్ణువు, పై భాగం- శివుడు. (దీపం వెలిగించే పద్ధతి, దీప పూజ దీప ఫలితాల వంటి వివరణలు మా ఆశ్రమ ప్రచురణ అయిన 'శుభ మంగళ దీప మహిమ' అనే గ్రంథంలో చూడండి)
సకల సౌభాగ్యాలు ముఖ్యంగా మహిళలకు దీర్ఘ సుమంగళ సౌభాగ్యాన్ని అందించే దర్శనమిది. దీని తర్వాత షణ్ముఖ దర్శనం, సప్తముఖ దర్శనం, పాద సరాసరి దర్శనం వంటి పలు దర్శన పద్ధతులు ఉన్నాయి. తగిన సద్గురువు అనుగ్రహంతో గిరి ప్రదక్షిణ చేస్తే వీటిని గురించి తెలుసుకోగలము.
ఆ తర్వాత గిరి ప్రదక్షిణ మార్గం కాంచీ రహదారి కలిసే స్థలానికి కుడివైపు వెళితే శ్రీ-ల-శ్రీ లోబామాత అగస్త్య ఆశమ్రాన్ని చేరుకోగలం.
శివశక్తి ఐక్య స్వరూప దర్శనం
ముందువైపున్న పర్వతశిఖరం అంబికాదేవి రూపంలోను వెనుక కాస్త ఎత్తయిన స్థితిలో ఉండే పర్వతం ఈశ్వర స్వరూపంగాను లభించే దర్శనమే శివశక్తి ఐక్య స్వరూప దర్శనం. రెండు కొండలూ ఒకే రేఖపై అమరికతో శివశక్తి ఐక్యమైన రీతిలో రెండూ ఒకటే. శక్తిలో శివం, శివంలో శక్తి ఒకదానికొకటి ఐక్యం అనే అద్భుత తత్త్వాన్ని వివరిస్తుంది.
గిరి ప్రదక్షిణ మార్గంలో మరెక్కడా అణ్ణామలై మహేశ్వరుడు ఇంతటి పరిపూర్ణంగా కనిపించరు. చాలా చాలా అపూర్వమైన దర్శనం!
ఈ అద్భుత దర్శన ప్రాంతంలోనే తిరుఅణ్ణామలై జ్యోతి అలంకార పీఠాధిపతి శక్తి శ్రీఅంకాళపరమేశ్వరి భక్తుడు శ్రీ-ల-శ్రీ వెంకటరామన్‌గారు అణ్ణామలైవాసుడి అనుగ్రహంతో నిర్మించి శ్రీ-ల-శ్రీ లోబామాత అగస్త్య ఆశమ్రం ఉంది. ప్రతి నెలా పౌర్ణమికి తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు కాస్త భగవత్‌ ప్రసాదం, దాహార్తిని నివారించేందుకు తియ్యటి జలాలను అందించే సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. పైగా భక్తుల ఆధ్యాత్మిక ఆరాటాన్ని తీర్చేలా పలు దైవీక ప్రచురణలు, 'శ్రీఅగస్త్య విజయం' పేరుతో ఆధ్యాత్మిక మాసపత్రికను వెలువరిస్తున్నారు.
జీవితంలో మీరెక్కడా వినలేని కనలేని పలు అద్భుత దైవీక విషయాలు, దైవ రహస్యాలు కలిగిన ఆశమ్ర ప్రచురణలను మీరు కొని చదివి లబ్దిపొందండంటూ గిరి ప్రదక్షిణ భక్తులను వేడుకుంటున్నాము.
అధికార నంది
గిరి ప్రదక్షిణ మార్గంలో ఆ తర్వాత మనం దర్శించనున్నది శ్రీ అధికార నందీశ్వరుడు. ప్రదోష కాలంలో ఈ చోట తిరుఅణ్ణామలైవాసుడిని దర్శించి పలు ఆలయాలలో అధికార నందితో కూడిన ఆలయాల్లో ప్రదోష పూజల వల్ల కలిగే ఫలితాలను పొందగలం.
పలు యుగాలుగా తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసిన నంది భగవానుడు ఈ చోట తిరుఅణ్ణామలై వాసుని దర్శనం చేసిన మీదటే అధికార నందీశ్వరుడిగా ఉన్నత స్థితిని సంపాదించుకోగలిగాడు. కనుక ఉద్యోగంలో ఉన్నత పదవులు ఆశించేవారు, న్యాయంగా లభించాల్సిన పదవోన్నతి లభించకుండా చింతించేవారు దానధర్మాలు చేసి ఈ దర్శనం పొందటం వల్ల సత్ఫలితాలను పొందగలుగుతారు.
ఇడుక్కు పిళ్లయార్‌ సన్నిధి
ఇక కుబేర లింగాన్ని దర్శించిన తర్వాత కాస్త దూరం వెళితే కుడివైపున ఇడుక్కు పిళ్ళయార్‌ సన్నిధిని చూడగలం.
శ్రీఅరుణాచలేశ్వరుడు ఆలయంలోని మూలమూర్తి ఇడైక్కాట్టు సిద్ధపురుషుడు జీవసమాధి పైన కొలువై అనుగ్రహిస్తున్నాడు. ఇడైక్కాటు సిద్ధుడు తాను జీవ సమాధి పొందటానికి ముందు ఇడుక్కు పిళ్ళయార్‌ సన్నిధిలో మూడు యంత్రాలను ప్రతిష్టించారు.
ఇడుక్కు పిళ్ళయార్‌ సన్నిధిలో మనం పడుకున్న స్థితిలో తల నుండి పాదాల దాకా దోగాడుతూ వెళ్ళవలసి ఉండటంతో ఇడైకాట్టు సిద్ధపురుషుడి యంత్రాల నుండి ఆకర్షణ శక్తి మన దేహమంతటా ప్రసారమై నరాల వ్యాధులు, గర్భాశ్రయ సమస్యలు నయమవుతాయి.
ఈ మండపంలో అరుణాచలేశ్వరుడిని చూస్తూ దోగాడుతూ లోపలికి వెళ్లి వెలుపలికి వచ్చినప్పుడు కూడా అరుణాచలేశ్వరుడినే చూస్తూ రావాలి. అంటే ఉత్తరం నుండి దక్షిణ దిశ వరకూ అరుణాచలేశ్వరుడిని దర్శిస్తూ బయటపడటం సరైన పద్ధతి. ఓ భక్తుడు తన జీవిత పర్యంతమూ ఎన్నిమార్లు తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణలు చేసి, ఇడుక్కు పిళ్ళయార్‌ను దర్శించి, లోపలకు దోగాడుతూ వెళ్లి తిరిగి వస్తాడో అన్ని జన్మలు తగ్గుతాయి. గర్భవాసాన్ని తగ్గించే శక్తి వంతమైనది ఈ ఇరుకైన మార్గం!
సుష్వాట దర్శనం
ఆ తర్వాత వేలూరు రహదారిలో కుడివైపు తిరిగి కొంత దూరం పోయాక పచ్చయమ్మన్‌ గుడి దగ్గరు తిరుఅణ్ణామలైని దర్శనం చేస్తే అదియే సుష్వాట దర్శనం అవుతుంది. ఇతరులలోని తప్పులెంచనివారెవరూ ఉండరు. అలా తప్పులెంచటం, చాడీలు చెప్పటం, ఇతరులకు హాని కలిగించటం వంటి కర్మలకు పరిహారాన్ని ఇచ్చే దర్శనమే సుష్వాట దర్శనం. అందరూ పొందాల్సిన దర్శనమిది!
చివరగా శ్రీభూతనారాయణుని సన్నిధిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా గిరి ప్రదక్షిణం చేయడానికి అనుగ్రహించిన శ్రీభూతనారాయణ పెరుమాళ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుని గిరి ప్రదక్షిణను ముగించాలి.

గురువారం గిరి ప్రదక్షిణ పద్దతి

గురువారం గిరి ప్రదక్షిణను ఆలయంలోని శ్రీఅరుణాచలేశ్వరస్వామివారి సన్నిధి నుండి తొలి ప్రాకారంలో కన్ని మూలగా కొలువై ఉన్న శ్రీదుర్వాసమహర్షిని దర్శించిన తర్వాత అక్కడి నుండి ప్రారంభించాలి.
సుందర రూప దర్శనం
గిరి ప్రదక్షిణను ప్రారంభించే చోటు నుండే సంస్కృతం, తమిళంలో వేదం, దేవారమ్‌, తిరువాసగం, దివ్య ప్రబంధం, రుగ్‌, యజుర్వేద, సామ వేదాలను, మంత్రాలను స్తుతిస్తూ ప్రారంభించడం మంచిది. బయలుదేరి మూలవర్లు మరియు పలు దైవ మూర్తులను దర్శనాలు పొందుతూ మొదటి గోపురాన్ని దాటుకుని ఏనుగు ఘట్టానికి చేరుకుని అక్కడి నుండి తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శిస్తే అదే సుందర రూప దర్శనం! నాలుగు వేదాలలో దేవపురుషుడైన 'సహస్ర శీర్ష పురుషుడు' అనే వేదవాక్యానికి తగ్గట్లు సహస్రవదనాలతో దర్శనమిస్తారు.
కొత్తగా వేదం పఠించాలనుకునేవారు, వేదాలపై పరిశోధన చేసేవారు, వేద పాఠాలలో కొత్త పాఠాలను ప్రారంభించేవారికి దోహదపడేదే సుందర రూప దర్శనం.
వేదం పఠించేటప్పుడు అక్షరదోషాలు, ఉచ్చారణలోపం, దైవీక మనోభావం లేకుండటం వంటి దోషాలకు ప్రాయశ్చిత్తంగా సుగంధ ద్రవ్యాలను వెలిగించి ఈ దర్శనం పొందడం విశేషదాయకం.
నంది సేవక మహాలింగ దర్శనం
కుతూహల నందీశ్వరుడిని దాటుకుని కంబత్తు ఇళయనార్‌ సన్నిధి నుండి తిరుఅణ్ణామలేశుడిని దర్శించడాన్నే నంది సేవక మహాలింగ దర్శనం అని అంటారు.
వాక్‌శక్తి లింగ దర్శనం
ఆ తదుపరి అక్కడి తూర్పు గోపురం మీదుగా రథం వీథికి చేరుకుని 'పినాక మురళీధర ముఖ లింగం' అనే పిలువబడే ఇంద్రలింగాన్ని దర్శించాలి. ఈ దర్శనం వల్ల ఉద్యోగంలో, పదవిలో ఎలాంటి తప్పిదాలు, అపవాదాలు కలుగకుండా రక్షిస్తుంది.
ఆ తర్వాత దక్షిణ గోపురం సమీపాన తిరుమంజన వీథిలోని శ్రీకర్పగ వినాయకుడి ఆలయం నుండి తిరుఅణ్ణామలైవాసుడిని దర్శిస్తే అదే వాక్‌శక్తి లింగ దర్శనం అవుతుంది. వాక్‌పటిమను పెంచేందుకు ఈ దర్శనం దోహదపడుతుంది.
వాక్‌ చాతుర్యం, ప్రజలను దైవీక అనుగ్రహం ద్వారా అయస్కాంతంలా ఆకర్షించే శక్తి కలుగటానికి, చదువుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయేందుకు వాక్‌శక్తి లింగ దర్శనం తోడ్పడుతుంది.
బుద్ధి పూర్వ లింగ దర్శనం
గురువారం గిరిప్రదక్షిణలో వాక్‌శక్తి లింగ దర్శనం తర్వాత శ్రీశేషాద్రిస్వాముల ఆశ్రమం సమీపం నుండి పొందే దర్శనాన్నే 'బుద్ధి పూర్వలింగ దర్శనం' అని పిలుస్తారు. వర్తమాన పరిస్థితులలో పలువురు తప్పిదాలు చేయడానికి దుష్టశక్తులే కారణం. అలా చెడు స్నేహం వల్ల బుద్ధి మారి పలు తప్పిదాలు చేసి ఉంటే, వాటికి ప్రాయశ్చిత్తం కలిగించే దర్శనమిది! ఈ దర్శనం తర్వాత చెడు స్నేహితులకు దూరమై సత్సంగంలో చేరి శివ సేవలను నిర్వహించడమే చాలా మంచిది
గ్రహణ పంచముఖ దర్శనం
శ్రీశేషాద్రి స్వాములు జీవసమాధి పొందిన ఆశ్రమం నుండి లభించే బుద్ధి పూర్వలింగ దర్శనం తర్వాత శ్రీరమణాశ్రమం సరిహద్దు నుండి లభించే దర్శనమే గ్రహణ పంచముఖ దర్శనం. సూర్య చంద్ర గ్రహణ కాలాల్లో చేయాల్సిన పూజలు, తర్పణాలు ఇవ్వడం వంటి కార్యాలను మరచినవారికి ప్రాయశ్చిత్తంగా ఈ దర్శనం ఉంటుంది.
గోముఖ దర్శనం
ఇక సెంగం రహదారిలో కాస్తా దూరం వెళ్లాక మురుగన్‌ ఆలయం దాటుకుంటే కుడివైపున సింహ ముఖ తీర్థం కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించిన తర్వాత, లేక ఆ తీర్థపు జలాలను శిరస్సుపై చల్లుకున్న తర్వాతే అణ్ణామలైని దర్శిస్తే గోముఖ ఆకారంలో కనిపిస్తారు. ఈ దర్శనమే గోముఖ దర్శనం.
పశువులను కాలితో తన్నటం, కొట్టడం, దూడకు పాలివ్వకుండా పాలను పూర్తిగా సేకరించడం (దీనివల్ల పాలవాడు, ఆ పాలను సేవించే ఇరువురికి దోషమేర్పడుతుంది) వంటి పశు హింసా దోషాలకు పరిహారం ఇచ్చే దర్శనమే గోముఖ దర్శనం. కనుక పశువులను మృదువుగా తట్టి నడిపించడమే మంచిది. రోజూ పశువులకు ఏదైనా ఆహారపదార్థాన్ని ఇవ్వడమే తాము నిదురనుండి లేచిన తర్వత చేయవలసిన మొదటి మంచి కార్యమని సంకల్పించుకోవడం మంచిది.
బాల శిక్షా లింగ దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో మరికాస్త దూరం పోయాక తిరుఅణ్ణామలై దిక్‌దర్శన ఆలయం, అప్పు ‌నందిని దాటుకుంటే వచ్చే జ్యోతి వినాయకుడి గుడి వద్ద ఉన్న తీర్థమే శివరాజ సింగ తీర్థం. ప్రస్తుతం 'సోణా నంది తీర్థం' అని పిలువబడుతోంది.
ఇక్కడి నుండి తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని దర్శించటాన్నే బాల శిక్ష లింగ దర్శనం అని పిలుస్తారు. ఈ చోట సంస్కృతం, తమిళ మంత్రోచ్ఛాటనల మధ్య దర్శించడం శ్రేయోదాయకం.
ప్రతి మనిషీ చిరు ప్రాయంలో నేర్వాల్సిన సంస్కృతం, తమిళ స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పుడు చేయాల్సిన పూజా పద్ధతులు కూడా ఉన్నాయి. వీటిని చేయనివారికి పరిహారంగా వేద, తమిళ స్తోత్రాలు పఠిస్తూ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నప్పుడు పెద్దలకు కలిగించిన క్లేశాలకు, మనోవేదనలకు పరిహారంగా ఉంటుందీ దర్శనం. ఈ దర్శనం తర్వాత వృద్ధాశ్రమాలకు వెళ్లి పెద్దలకు సేవలు చేయడం చాలామంచిది.
పినాకి దర్శనం
గురువారం గిరి ప్రదక్షిణలో కామక్కాడు ప్రాంతం నుండి తిరుఅణ్ణామలైవాసుడిని దర్శించటాన్నే పినాకీ దర్శనం అని అంటారు. పాము పడగెత్తినట్లు దర్శనమిచ్చే ఈ దర్శనానికి మన మనస్సుల్లో చెలరేగే దుర్గుణాలను తొలగిస్తుంది ఈ దర్శనం
అసుర సమన లింగ దర్శనం
కామక్కాడు ప్రాంతం దాటాక మరొక సింహ ముఖ తీర్థం ఉంటుంది. ప్రస్తుతం అది చాలా దుస్థితిలో ఉంది.
మన జీవితంలో మంచి చెడులు అనే విచక్షణ లేకుండా యోచించకుండా పలు కార్యాలను చేస్తాము. వాటి వల్ల మనమే కాకుండా మన కుటుంబీకులకు హాని కలుగుతుంది. వాటిని గురించి తెలుపకపోయినా వారిలో ఏర్పడే మనో వేదనలు మనల్ని బాధిస్తాయి. ఈ కారణంగానే మనకు శిరోభారం, వంటి నొప్పులు, కడుపునొప్పి వంటి బాధలు కలుగుతాయి. వీటికి పరిష్కారం లభింపజేసే దర్శనమే అసుర సమన లింగ దర్శనం
పాప నివృత్తి సూక్ష్మ లింగ దర్శనం
ఆ తర్వాత అడిఅణ్ణామలై నుంచి పొందే దర్శనం. దీనిని పాప నివృత్తి లింగం దర్శనం అని శ్రీఅగస్త్య గ్రంథాలు జెబుతాయి.
అవాంఛనీయ పరిస్థితులలో అకారణంగా కలిగే కోపం, ద్వేషం వల్ల ఇతరులకు కలిగే కష్టాలను రూపుమాపి వారితో సఖ్యత ఏర్పడేలా చేస్తుందీ దర్శనం.
అసాధ్య వాక్‌విమోచన లింగ దర్శనం
అడిఅణ్ణామలై ఆలయ గోపురంతోపాటు అరుణాచలేశ్వరుడిని దర్శించడమే అసాధ్య వాక్‌ విమోచన లింగ దర్శనం. జీవితంలో ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సందర్భవశాత్తూ తెలిసో తెలియకో అసత్యమాడే పరిస్థితులు కలుగుతాయి. అలా అసత్యమాడినందుకు పరిహారం ఇచ్చేదే ఈ దర్శనం. ఈ దర్శనం తర్వాత మళ్లీ అసత్యమాడని శివభక్తులకు దైవానుగ్రహం లభిస్తుంది.
తీర్థ స్నాన దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో కాంచి రహదారితో కలిసి చోట మంగళ తీర్థం ఒకటి ఉంది. గురువారం గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తే ఈ తీర్థంలో స్నానమాచరించడం, తీర్థంలో జలాలు తక్కువగా ఉన్నప్పుడు శిరస్సుపై తీర్థ జలాలను చల్లుకున్న తర్వాత లభించే దర్శనమే తీర్థస్నాన దర్శనం. ఇక్కడ స్నానమాచరించి తడిబట్టలతో తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని దర్శించడం శ్రేయోదాయకం.
ఆ తర్వాత శ్రీకుబేర లింగాన్ని శ్రీలక్ష్మీ స్తోత్రాలను పారాయణం చేస్తూ మొక్కిన తర్వాత తడిబట్టలను మార్చుకుని కొత్త దుస్తులు ధరించి తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణను కొనసాగించాలి.
కూట్టు లింగ దర్శనం
తడి బట్టలు బాగా ఆరిన తర్వాత గిరిప్రదక్షిణ మార్గంలోనే వాటిని దానం చేయాలి. గిరి ప్రదక్షిణను కొనసాగించేందుకు వేలూరు రహదారి విడిపోయే చోట ఉన్న శ్మశానం నుండి తిరుఅణ్ణామలైవాసుని దర్శించి నమస్కరిస్తే అదే కూట్టు లింగ దర్శనమవుతుంది.
శ్మశానం, శ్మశాన స్థలాను చూస్తే కలిగే భయాలను పోగొడుతుందీ దర్శనం. శ్మశానికి వెళ్లి మృతులకు అంత్యకియ్రలు చేయనివారికి ప్రాయశ్చిత్త దర్శనమే ఇది. ఆ తర్వాత దుర్గమ్మ గుడి వద్ద సాష్టాంగ నమస్కరించి శయనస్థితిలోనే అణ్ణామలైవాసుని దర్శించాలి. దీని వల్ల విష్ణుమాయ తత్త్వాన్ని తెలుసుకోగలుగుతాము. గురువారం రాహుకాల సమయంలో (మధ్యాహ్నం 1.30 - 3) ఇలా దర్శించిన తర్వాత నిమ్మపులుసు ప్రసాదం దానమిస్తే వివాహ దోషాలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ యోగం లభిస్తుంది.
చివరగా శ్రీభూత నారాయణ స్వామి ఆలయంలో లభించే భూతనారాయణ దర్శనంతో గురువారం నాటి గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.

శుక్రవారం గిరి ప్రదక్షిణ పద్దతి

శుక్రవారం తిరుఅణ్ణామలై వాసుని గిరి ప్రదక్షిణ చేసేవారు, గిరి ప్రదక్షిణను శ్రీఅరుణాచలేశ్వరాలయం ప్రధాన ద్వారం తూర్పు గోపురం వైపు నుండి ప్రారంభించాలి. అలా గిరి ప్రదక్షిణను ప్రారంభించేటప్పుడు తూర్పు గోపురం లోపలివైపు ఆలయ దళంలో నిలిచి పొందే దర్శనాన్ని సంపూర్ణ లింగ దర్శనమని అంటారు.
సంపూర్ణ లింగ దర్శనం
తిరుఅణ్ణామలై వాసుని దర్శనాలు మన జీవితంలోని సమస్యలను, అనారోగ్యాలను తొలగించి ద్వేషం, క్రోధం, దురాశ, అపసవ్య కామం వంటి మానసిక సమస్యలను పూర్తిగా తొలగించి దైవానుగ్రహం లభించేలా చేస్తుంది.
దైవ మార్గంలో మనకు ఎదురయ్యే బద్ధ శత్రువు ఎవరంటే మనలోని ద్వేషమే. ఇతరుల అభివృద్ధిని చూసి మన మనస్సులో ఏర్పడే వ్యతిరేక భావాలే ద్వేషాలు. ఇవి లౌకిక జీవితంలోనే కాకుండా దైవీక జీవనంలో ఆటంకాలుగా నిలుస్తాయి. వీటి ప్రభావానికి లోనుకానివారంటూ ఎవరూ లేరనే చెప్పవచ్చు.
'అంతా దైవ సంకల్పాలే' అనే భావన మనస్సులో దృఢపడేంత వరకూ ఈ దుష్టభావనను తొలగించలేము. అయితే శుక్రవారం తిరుఅణ్ణామలై వాసుని గిరి ప్రదక్షిణ సమయాన లభించే సంపూర్ణ లింగ దర్శనం మనలోని ద్వేషభావాలను తొలగిస్తుంది. కుటుంబంలో, పిల్లలలో, ఉద్యోగం, వ్యాపారం వంటివాటిపై ఇతరుల్లో కలిగిన ద్వేషాలు, దిష్టిని తొలగించేందుకు ఈ దర్శనం దోహదపడుతుంది.
శ్రీదుర్వాస మహర్షి పొందిన తపోబలాన్ని చూసి ఓర్వలేని ఋషులు యేళ్లతరబడి తపస్సు చేసినా వారిలో పాదుకుపోయిన ద్వేషభావాలను ఈ ఢంకా లింగముఖ దర్శనం పొంది తొలగించుకోగలిగారు.
తూర్పుగోపుర ద్వారం లోపలివైపున ఉన్న లక్షణ వినాయకుడిని, గోపురం లోపల గల చాముండీశ్వరీ అమ్మవారిని మొక్కి స్తుతిస్తూ గిరి ప్రదక్షిణను కొనసాగించాలి.
పుష్ప దీప దర్శనం
ఆలయంలోని శ్రీ బ్రహ్మలింగానికి ఎదురుగా ఉన్న బ్రహ్మతీర్థ గట్టునుండి తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శించటమే పుష్ప దీప దర్శనం.
భగవంతుడిని తెలుసుకోవడానికి, చేరుకోవడానికి ఎలాంటి జాతి, మత, కుల బేధాలు లేకుండా సకల జీవరాశులు తమకు తోచినంతగా దాన, ధర్మాలు లేదా శారీరక శ్రమలతో కూడిన సేవలు నిర్వర్తిస్తే భగవంతుని గురించిన వాస్తవాలను తెలుసుకోగలుగుతారు. దీనిని ఎరుకపరచేదే పుష్ప దీప దర్శనం.
వర్తమాన పరిస్థితులలో పలువురు యువకులు ఉద్యోగాలు లేకుండా తాము చేస్తున్న ఉద్యోగంలో తృప్తి బడయక దుఃఖపడుతుంటారు. వీరికి మంచి మార్గాన్ని చూపునదే ఈ దర్శనం. ఉన్నత చదువులు చదివినవారికి సాధారణమైన ఉద్యోగం, తక్కువగా చదవినవారికి అత్యధిక జీతం పొందే ఉద్యోగం లభించటం సర్వసాధారణమైన విషయం. ఈ లోపాలను ఈ దర్శనం చక్కబరుస్తుంది.
కుంభమూర్తి దీప దర్శనం
దక్షిణ గోపురం దాటుకుని వెలుపలికి వచ్చి తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని చూస్తే కుంభం వంటి ఆకారం అగుపడుతుంది. ఇదియే మహాశక్తివంతమైన కుంభమూర్తి దర్శనం.
పలువురు ఆత్మజ్ఞానం కోసం ప్రార్థించి దైవ కార్యాలు చేసి, ఇతరులను ధర్మం వైపు నడిపించేలా దైవానుగ్రహంతో జీవిస్తుంటారు. అలాంటివారికి దైవ దర్శనం అంటే ఏమిటో ఎరుకపరచి, దానిని ఇతరులకు అవగాహన కల్పించే కరుణకటాక్షాలను ప్రసాదించునదే కుంభమూర్తి దీప దర్శనం.
దైవనమ్మకం అధికమైన వాస్తవం బోధపడి దైవజ్ఞానాన్ని అందించే ఈ దర్శనమే తల్లిదండ్రులకు చేయాల్సిన సేవలను చేయనివారికి పరిహారం ఇవ్వగలిగే దర్శనం కూడా ఇదే! ఈ దర్శనం పొందిన తర్వాత తల్లిదండ్రులకు చేయాల్సిన సేవలను సక్రమంగా నిర్వర్తించాలి. వారిని అనాథలుగా విడువకూడదు.
వేదశక్తి ప్రసాదిత దీర్ఘ దర్శనం
శుక్రవారం గిరిప్రదక్షిణలో దక్షిణ గోపురం నుండి నేరుగా వెళ్ళి కుడివైపున ఉన్న శ్రీకర్పగ వినాయకుడి గుడి నుండి లభించే దర్శనమిది.
వేదశక్తులను అపహరించితే వాటిని ఉపయోగించి దేవతలను నాశనం చేయవచ్చునని తలంచిన అసురులు ఓ సారి వేదాలను బ్రహ్మదేవుడి నుండి అపహరించేందుకు ప్రయత్నించారు. వేదాలకు అధిపతియైన బ్రహ్మదేవుడు కోటానుకోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా అసురుల వేధింపులను తట్టుకోలేక తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని శరణుజొచ్చి తన రూపాన్ని మూలికాశక్తులు కలిగిన వృక్షపు (చెట్టు) ఆకారంగా మార్చుకుని వేదశక్తులుతో మాయం కాగల శక్తి సామర్థ్యాలను పొందగలిగారు.
దేవతలు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వారికి మాత్రమే మూలికల సువాసనలు వ్యాపింపచేసి వేద శక్తులను అందించగల శక్తిని కూడా పొందారు. అలా దేవతలు గిరి ప్రదక్షిణ చేసి వేదశక్తులు పొందిన స్థలమే వేదశక్తి ప్రసాదిత దర్శన ప్రాంతం.
ఈ ప్రాంతంలో నాలుగువేదాలను తలపించే విధంగా నాలుగుసార్లు తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శించి నమస్కరించాలి. ఈ దర్శనం పొందిన తర్వాత ఉత్తరేణి మొక్కను తమ తలచుట్టూ మూడు మార్లు (దిష్టితీసే విధంగా) తిప్పి ఎవరికాలికి తగలనంత దూరంలో విసిరివేసినట్లయితే చేతబడుల వల్ల కలిగే కష్టాల నుండి విముక్తి పొందగలము.
ఈ విధంగా ఇళ్లలో, వృత్తి, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు చేసే చేతబడులు ప్రభావం చూపకుండా ఈ దర్శనం కాపాడగలుగుతుంది. చేతబడుల వల్ల కలిగే మానసిక భయాందోళనలను పూర్తిగా తొలగిస్తుంది.
శ్రీతైల లక్ష్మీ దీప దర్శనం
ఓ యుగాన తమ పేరాశలకు తగినట్లు ఐశ్వర్యాన్ని అందించని శ్రీలక్ష్మీదేవిపై ఆగ్రహించిన అసురులు శ్రీలక్ష్మీదేవి నివాసముంటున్న లోకం (వైకుంఠం)పై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో శ్రీలక్ష్మీదేవి తిరుఅణ్ణామలైకి వేంచేసి తైల దీపంలా గిరి ప్రదక్షిణ చేసి తపమాచరించింది. ఆ తైల దీపమే చాలా అందంగా మెల్లగా కదలుతూ గిరి ప్రదక్షిణ చేసిన దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.
శ్రీశేషాద్రి స్వాముల ఆశ్రమం సమీపంలో కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పలు మూలికా తైలాలతో మట్టిదీపాలను వెలిగించి, వాటిని చేతపట్టుకుని తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శించటాన్నే శ్రీతైల లక్ష్మీదీప దర్శనం అని పిలుస్తారు.
ఈ దర్శనం సంసారిక మహిళలకు దైవీక శక్తులను ప్రసాదిస్తుంది. దీర్ఘ మాంగల్య బలాన్ని శ్రీలక్ష్మీకటాక్షాన్ని అందిస్తుంది. సంసారంలో శాంతి సౌభాగ్యాలు చోటుచేసుకుంటాయి.
అష్ట నేత్ర దీప దర్శనం
శ్రీబ్రహ్మ తన నాలుగు శిరస్సులలోని ఎనిమిది నేత్రాలతో ఒకే సమయంలో తిరుఅణ్ణామలై వాసుడిని దర్శించి ఆనందించిన అద్భుత దర్శనమిది. వేరు ఏ దైవమూర్తికి ఇలాంటి దర్శన భాగ్యం కలుగలేదు.
గిరి ప్రదక్షిణ మార్గంలో పృథ్వీ నందీశ్వరుడి వద్ద నుండి తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శించటమే అష్ట నేత్ర దీప దర్శనం. స్వార్థపు తలంపులు తొలగించి త్యాగగుణాలను పాదుకొలిపే దర్శనమిది. మన ఇళ్లల్లో, వ్యాపార స్థాలాల్లో దోషాలకు, అష్టదిక్పాలకులకు సక్రమంగా పూజలు నిర్వహించనివారికి కలిగే దోషాలకు ప్రాయశ్చిత్తం అందించే దర్శనమిది. ఈ దర్శనం పొందినవారికి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎంతగా కష్టపడినా పదోన్నతులు రాకుండా విరక్తి చెందేవారికి ఆటంకాలు తొలగించి ఉన్నత స్థితిని ప్రసాదిస్తుంది.
సద్గుణ పంచదీప లింగ ముఖ దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో కాస్త దూరం వెళితే శ్రీదుర్వాసుల సన్నిధి తర్వాత అప్పు ‌నందీశ్వరుడిని చూడగలం. అప్పు ‌నంది కొమ్ముల నడుమ తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శించడమే సద్గుణ పంచదీప లింగమూర్తి దర్శనం.
మానవుడిలో కామ, క్రోధ, మద, మాత్సర్యాలు వంటి అష్ట దుర్గ్గుణాలు ఉంటాయి. వాటి నుండి విముక్తిని పొందితేనే ఆత్మజ్ఞానం పొందగలుగుతాడు. దీనికి ఈ దర్శనం దోహదపడుతుంది.
IAS, IPS అధికారులు, న్యాయమూర్తులు వంటి ఉన్నతాధికారులు కార్యాలయంలోను బదలీల వల్ల కలిగే కష్టాలనుండి ఈ దర్శనం విముక్తి కలిగిస్తుంది. అన్ని అర్హతలు కలిగిన వారికి ఉన్నత పదవులను ప్రాప్తింపజేస్తుంది.
శుభ దీప లింగముఖ దర్శనం
వారాలూ సక్షత్రాలూ చేసే కార్యాలను పలువురైనా చేయరు అనేది సిద్ధపురుషుల వాక్కు. ఆ మేరకు ఏ కార్యాన్నయినా మనం రాహుకాలం, యమగండం, గుళికాలం, వారశూలను పరిగణనలోకి తీసుకునే నిర్వర్తించాలి. అలా చేయకపోవడం వల్ల దైనందిక జీవనంలో పలు కష్టాలు ఎదురవుతాయి.
శుక్రవారం గిరిప్రదక్షిణ చేసేవారు తేయు నంది రెండు కొమ్ముల నడుమ తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని దర్శించటమే శుభ దీప లింగ ముఖ దర్శనం. వారాలను లెక్కలోకి తీసుకోకుండా చేసే కార్యాలు, ప్రయాణాలు ఓ మోస్తరు పరిహారం అందిస్తుంది ఈ దర్శనం. ఈ దర్శనపు మహిమవలన వివాహం, గృహప్రవేశం వంటి శుభ కార్యాలలో శుభముహూర్తాలను పట్టించుకోనివారికి ప్రాయశ్చిత్తం కలిగిస్తుంది.
గిరి ప్రదక్షిణ చేసేవారు ఈ దర్శనం చేయడానికి ముందుగా 'మంగళ సూక్తం' జపించిన తర్వాత దర్శించటం అన్ని విధాలా శ్రేయస్కరం. మంగళ సూక్తం మంత్రాలు తెలియనివారు 'ఇంద్రాయనమః మహేంద్రాయనమః' అంటూ నినాదాలు చేస్తూ ప్రార్థించాలి.
యక్ష దీప దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో మరికాస్త దూరం వెళితే నైఋతి లింగం, సూర్య లింగం, వరుణ లింగం, వాయు లింగం తదితర లింగాలను దర్శించి మొక్కిన తర్వాత వాయునందిని చూడగలం. అక్కడక్కడా పలు దర్శనాలు కలుగుతాయి. సద్గురువును ఆశ్రయించి వాటిని తెలుసుకోవాలి.
వాయు నంది నుండి తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని దర్శించటమే యక్ష దీప దర్శనం. విదేశీ ఉద్యోగాలను అందించగలిగే దర్శనమిదే! ఈ ప్రాంతంలో సాంబ్రాణి ధూపం వేసి, అగరుబత్తులను వెలిగించి అణ్ణామలై ఈశ్వరుడిని దర్శించడం మరింత శ్రేష్టకరం.
1. సిమెంట్‌, పైప్‌ వంటి కట్టడ వస్తువులకు సంబంధించిన వృత్తి, వ్యాపారాలు చేయువారికి అభివృద్ధిని కలిగిస్తుంది.
2. పలు ఆటంకాల వల్ల ఇల్లు నిర్మించడానికి, ఇల్లు కొనడానికి వీలులేనివారికి గృహ సంపత్తిని ప్రాప్తింపజేస్తుంది.
3. ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌, ఆలయ నిర్వహణ, రెవిన్యూ, అటవీ శాఖ తదితర శాఖలలో పనిచేయువారికి శుభాలను కలిగిస్తుంది.
కారణోదక దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో మనం శ్రీ-ల-శ్రీ లోబామాత అగస్త్యుల ఆశ్రమం నుండి చూడగలిగే దర్శనానికే కారణోదక దర్శనం అని పేరు. పర్వతం ముందువైపు అంబికగాను, వెనుకవైపు మహేశ్వరుడు శివశక్తి సమ్మేళనంగా ఉండే సమైక్య దర్శనమే శుక్రవారపు గిరి ప్రదక్షిణలో లభించేదే అరుదైన కారణోదక దర్శనం.
నిరుద్యోగుల కష్టాలు తొలగి, చేస్తున్న ఉద్యోగాలలో సంతృప్తిని, వివాహ యత్నాలలో కలిగే అడ్డంకులు తొలగించి, కుటుంబ సమస్యలను తీర్చి సకల సౌభాగ్యాలను కలిగిస్తుందీ దర్శనం. జవుళి, బంగారు, వజ్రాల వ్యాపారులు, ఆదాయపు పన్నులు, వ్యాపారాలు, బ్యాంకింగ్‌ రంగాలలో పనిచేస్తున్నవారికి ఉన్నతస్థితిని కలిగిస్తుంది.
క్షీరోదక శివదీప దర్శనం
శ్రీ-ల-శ్రీ లోబామాత అగస్త్యుల ఆశ్రమం దాటుకు వెళితే కనిపించే అధికార నంది మండపం నుండి తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని మొక్కే దర్శనమిది. ఫల పుష్పాలు, కాయగూరలు, పాకశాస్త్ర వృత్తిలో, సంగీత, సౌందర్యాలంకరణ రంగాలలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలను ప్రాప్తింపజేసే అద్భుతమైన దర్శనమిదే!
కర్తమ ముని దీప దర్శనం
శుక్రవారంనాడు ఈశాన్య లింగం సమీపాన పొందే తిరుఅణ్ణామలై ఈశ్వరుడి దర్శనమే కర్తమ ముని దీప దర్శనం. పలు సిద్ధపురుషుల జీవ సమాధులు ఉన్న ప్రాంతం నుండి లభించే దర్శనం కనుక చాలా శక్తివంతమైన దర్శనం కూడా ఇదే! మన మనస్సుల్లో తిష్టవేసుకున్న మంచి తలంపులకు కార్యరూపమిచ్చి వాటిని నెరవేర్చగల అత్యద్భుత దర్శనం కూడా ఇదే!
చంద్ర పుష్టి దీప దర్శనం
ఇక బస్టాండు దాటిన తర్వాత శ్రీదుర్గమ్మ ఆలయం వద్ద లభించే దర్శనమే చంద్ర పుష్టి దర్శనం. పిండి వస్తువులు, ధాన్యాలు, పాత్రల వ్యాపారం చేసేవారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈ ప్రాంతానికి చేరువగానే శ్రీ అంగ ప్రదక్షిణ అన్నామలై స్వాముల జీవసమాధి ఉంది. తిరుఅణ్ణామలైవాసుని అంగప్రదక్షిణం చేస్తూ సంపాదించిన సొమ్ములతో నిరాటంకంగా అన్నదాన కైంకర్యంచేసి కీర్తి గడించిన మహానుభావుడాయన. ఆ మహాపురుషుడి సమాధి దర్శనం పాపాలను, కర్మఫలితాలను పటాపంచలు చేస్తుంది. ప్రస్తుతం 'సేవాశ్రమం' అని పిలువబడే ఈ స్థలాన్ని గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పకుండా దర్శించి తరలించాలి!
గర్బోదక శివ దీప దర్శనం
శుక్రవారం గిరి ప్రదక్షిణకు ముక్తాయింపుగా శ్రీభూత నారాయణ పెరుమాళ్‌ ఆలయం నుండి లభించే తిరుఅణ్ణామలై వాసుడి దర్శనమే 'గర్బోదక శివ దీప దర్శనం'. జీవితంలో చేసే తప్పులను మనంతటమనమే తెలుసుకొని, సరిదిద్దుకుని సుఖప్రదమైన జీవితాన్ని అందించే అరుదైన దర్శనం కూడా ఇదే. ఈ స్థలంలో నిలిచి దర్శించడం శుభదాయకం.
మనకు ఈ భూలోక జీవనం అందించిన పూర్వీకులు ప్రత్యేకించి ఆది పూర్వీకులైన 14 మనువులను స్మరించి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరించడంతో శుక్రవారంనాటి గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది.

శనివారం గిరి ప్రదక్షిణ పద్దతి

శనివారం తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణను శ్రీఅరుణాచలేశ్వరాలయం తూర్పు గోపుర ద్వారంలో ప్రారంభించి, ఎడమవైపుగా ఆలయాన్ని ప్రదక్షిణ చేయాలి.
ముఖ పర్వత దర్శనం
శ్రీఅరుణాచలేశ్వరాలయపు ఈశాన్యపు మూల నుండి పొందే పర్వత దర్శనానికి 'ముఖ పర్వత దర్శనం' అని పేరు. కన్నులు, చెవులు, ముక్కు, నోరు వంటి ఇంద్రియాలు చేసిన పాపాలను పోగొట్టే దర్శనమిది.
1. రేచీకటి, cataract, glucoma వంటి కంటి రోగాలున్నవారు ఈ దర్శనం పొంది, దృష్టిలోపం కలిగిన నిరుపేదలకు కంటి అద్దాలను దానం చేయడం, కంటి ఆపరేషన్‌లకు చేతనైనంత ధనసాయం చేయడం, కంటి ఆసుపత్రులలో సేవ చేయడం వంటి సత్కార్యాలు చేస్తే కంటి రోగాలనుండి బయటబడగలం.
2. అదే విధంగా చెవి రోగాలబాధపడేవారు ముఖ పర్వత దర్శనం చేసి, వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి వినికిడి పరికరాలు (hearing aids) దానం చేయాలి. వైద్య సహాయం చేస్తూ వస్తే మన చెవి సమస్యలు తొలగుతాయి.
2. కంటి వైద్యులు (opthalmologists), ENT specialists వంటివారు ఈ దర్శనం వల్ల వృత్తినైపుణ్యం పొందగలరు. నియమనిష్టలతో వీరు దర్శనం చేసుకుంటే కఠినమైన అరుదైన శస్త్రచికిత్సలను సునాయాసంగా చేయగలుగుతారు.
4. స్వరపేటిక లోపం, సక్రమంగా మాట్లాడలేనివారు ఈ దర్శనం చేసి పేద సుమంగళి స్త్రీలకు ముక్కుపుడకలను దానంగా ఇవ్వడం, ముక్కుపుడకలు ధరించని మహిళలకు ముక్కుపుడకలను దానం చేస్తే తమ రోగాల నుండి బయటపడగలుగుతారు.
ఆత్మస్థయిర్య లింగ దర్శనం
జీవితంలో వచ్చే కష్టాలన్నింటికీ మన పూర్వజన్మ కర్మఫలితాలే కారణం. మంచి చెడ్డలు మన పూర్వజన్మ కర్మలవల్లే కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు. కర్మఫలితాలకు పరిహార ప్రాయశ్చిత్త పద్ధతులు ఉన్నప్పటికీ కొన్ని కర్మలను అనుభవించాల్సిందే. వాటిని ఎదుర్కొనగల ఆత్మస్థయిర్యాన్ని అందించేదే ఈ దర్శనం.
ఉత్తర గోపురం సమీపంలో నిలిచి అణ్ణామలైవాసుని దర్శిస్తే కొండచరియ, రేఖలు కనిపిస్తాయి. ఆ దర్శనమే ఆత్మస్థయిర్య దర్శనం.
మహామఖ దర్శనం
ప్రతియేటా మాసి నెల పౌర్ణమి, మఖ నక్షత్రంతో కూడిన దినమే మాసిమఖం. పన్నెండేళ్లకు ఒకమారు సింహరాశిలో గురువు ప్రవేశించేటప్పుడు, మఖ నక్షత్రం, పౌర్ణమి కూడిన దినమే మహామఖం అవుతుంది.
కోటానుకోట్ల నదీమాతల్లులు కుంభకోణం మహామఖం పుష్కరిణిలో సూక్ష్మరూపంలో స్నానమాచరించి తమ పాపాలను ప్రక్షాళనం కావించుకుంటారు. ఆ తర్వాత శ్రీఆదికుంభేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకుని ఈ పుష్కరిణిని పవిత్రం చేస్తారు. కనుక మాసి మఖం రోజున...
1. మహామఖం పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించాలి.
2. అన్నదానం, వస్త్రదానం తదితర దానాలు చేయాలి.
3. పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాత తిరువిడైమరుదూరు, తారాసురం, తిరునాగేశ్వరం, స్వామిమలై, కరుప్పూర్‌ అనే ఐదు క్షేత్రాలను దర్శించి అన్నదానాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.
పేదరికంతో, ఆకలిదప్పులతో అలమటించేవారికి ఈ దర్శనం ద్వారా మాసిమఖం నాడు కలిగే శుభఫలితాలు పొందగలరు.
గిరి ప్రదక్షిణ మార్గంలో దక్షిణ గోపురం ఎదురుగా తిరుమంజన వీధిని దాటుకుని మూడు రహదారులు కలిసే చోట నిలిచి దర్శిస్తే పర్వతపు కొసం ఓ కలశంలా కనిపిస్తుంది. ఇదే మహామఖ దర్శనం. గిరి ప్రదక్షిణ మార్గంలో ఈ దర్శనం చేసుకున్న తర్వాత ఈ చోట గంగా, కావేరి నదీజలాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను దానం చేసినట్లయితే మాసిమఖం మహాస్నాన శుభఫలితాలన్నీ కలుగుతాయి.
ఏకముఖ దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో రమణాశ్రమం సమీపంలో లభించే దర్శనమే ఏకముఖ దర్శనం. ఏకాగ్రత మనస్సుతో ధ్యానం వంటి ఉన్నత స్థితులను ప్రాప్తింపజేసే అరుదైన దర్శనమిది. 'దేవుడొక్కడే' అనే భావాన్ని అందిస్తుంది.
ధ్యానమార్గంలో పయనించదలచినవారు ఈ చోట ఆశీనులై 'అరుణాచల శివా! అరుణాచల శివా!' అని స్తుతించి ప్రార్థించాలి. నిరుపేదలకు జీడిమామిడి పప్పులను దానం చేస్తే ధ్యానానికి అవసరమైన దేహదారుఢ్యాన్ని, మనోశక్తిని పొందగలుగుతారు. జీడిమామిడి పప్పులు మంత్రశక్తిని గ్రహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
శివ పంచముఖ దర్శనం
సెంగం రహదారిలో కొంత దూరం పోయాక ఓ చోట ఐదు ముఖాలతో కూడి దర్శనం కలుగుతుంది. ఆ దర్శనాన్నే పంచముఖ దర్శనమని పిలుస్తారు. కొన్ని సందర్భాలలో పలు వర్ణాలతో ఈ దర్శనాన్ని పొందగలం. భాగ్యం కలిగినవారికే ఈ అవకాశం లభిస్తుంది.
క్షయ వ్యాధితో బాధపడుతున్నవారు ఈ దర్శనం చేసి నారింజ, పనస, అనాస ఫలాలను దానం చేస్తే రోగం నయమవుతుంది. ఎలాంటి చర్మవ్యాధులనైనా ఈ దర్శనం పోగొడుతుంది. చర్మవ్యాధి వైద్యనిపుణులు ఈ దర్శనం చేసుకుంటే వృత్తి నైపుణ్యం పొందుతారు.
యమ లింగ దర్శనం
శనివారం, మఖ నక్షత్రం కూడిన దినాన ఈ దర్శనం పొందటం శుభదాయకం. గిరి ప్రదక్షిణ మార్గంలో యమ లింగ దర్శనం పొంది స్తుతిస్తే అక్కడి నుండి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంటే అదే యమ లింగ దర్శనమవుతుంది.
ఈ యమలింగ దర్శనం ద్వారా తీరని రోగాలతో బాధపడుతూ కష్టపడుతున్నవారంతా రోగవిముక్తులవుతారు. ఈ చోట చేయాల్సిన దానధర్మాలను గురించి సద్గురువుల సలహాలను పొందాల్సి ఉంటుంది.
త్రిజట జ్యోతి లింగ దర్శనం

గిరి ప్రదక్షిణ మార్గంలో కుడిపవైపు సింహ తీర్థం కనిపిస్తుంది. సింహపు ముఖాన్ని పోలి ఉండే ఈ మార్గంలో ప్రవేశించి మెట్లు దిగి వెళితే సింహ తీర్థాన్ని చూడగలం.
ఈ తీర్థంలో స్నానమాచరించి అరుణాచలేశ్వరుని దర్శిస్తే అదే త్రిజట జ్యోతి లింగ దర్శనమవుతుంది. ఈ చోట పితృదేవతలకు తర్పణాలు చేయడం మిక్కిలి శ్రేష్టకరమవుతుంది.
స్నానమాచరించేందుకు వీలులేక నీటిమట్టం తగ్గి ఉన్నట్లయితే తీర్థపు జలాలను శిరస్సుపై చల్లుకుంటే చాలును. ఒక వేళ కొలనులోని మట్టిని నుదుట విభూతిలా ధరిస్తే చాలు.
సర్వ లింగ దర్శనం
హిరణ్యాక్షుని వధించటానికి మహావిష్ణువు నరసింహావతారం దాల్చిన గాథ మనకందరికీ తెలిసిందే. అసురుని వధించి అతడి రక్తపు ధారాలను వళ్లంతా తాపడం చేసుకున్న శ్రీనరసింహ మూర్తి మరింత ఉగ్రరూపం దాల్చుతాడు. ఆ ఉగ్రహాన్ని తగ్గించేందుకు ఆ మహేశ్వరుడే శ్రీశరభేశ్వరుడి అవతారం దాల్చి శ్రీనరసింహుడి ఉగ్రతను తగ్గిస్తాడు.
అలా ఉగ్రత తగ్గిన శ్రీనరసింహమూర్తి తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసి మహేశ్వరుడు దాల్చిన శరభేశ్వరుడి దర్శించారు. ప్రహ్లాద తీర్థం నుండి లభించే ఆ దర్శనమే 'సర్వ లింగ దర్శనం'.
ప్రహ్లాద తీర్థం ప్రస్తుతం ఆ చోట కనుమరుగైంది. సద్గురువు సలహా ద్వారా ఆ ప్రాంతం గురించి తెలుసుకోవచ్చును.
కామక్రోధ నివృత్తి దర్శనం
సెంగం రహదారి నుండి కుడివైపు తిరిగితే గిరిప్రదక్షిణ అంతర్గత రహదారిలో శ్రీదుర్వాసుల ఆలయం, అప్పు ‌నంది ప్రాంతాలను దాటుకుని వెళితే దట్టమైన చెట్లే కనిపిస్తాయి. ఆ ప్రాంతానికి కామకాడు అని పేరు.
కన్నులలో కామం పూర్తిగా తొలగనంతవరకు దైవదర్శనం కలుగదని ఎరుకపరుస్తుంది. కామక్కాడు ప్రాంతానికి చేరుకోవడానికి ముందుగానే మూత్ర విసర్జన చేయాలి. అలా చేస్తే కామపు వికారాలు మనస్సు నుండి తొలగిపోతాయి. ఇక్కడా చేయాల్సిన ఆసన పద్ధతులు, నియమాలు కొన్ని ఉన్నాయి.
కామక్కాడును దాటుకుని వెళితే దట్టమైన చెట్ల సంఖ్య తగ్గిన చోట అరుణాచలేశ్వరుడు చక్కగా దర్శనమిస్తారు. ఆ దర్శనానికే కామక్రోధ నివృతి దర్శనం అని పేరు. ఇక్కడ మనలోని చెడుగుణాలను తలంచి, పశ్చాత్తాపం చెంది ప్రార్థించి పరిహారం పొందవచ్చును.
కామక్కాడును దాటుకుని వెళితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గుర్తు చేసే మూడు ఆకారాలలతో కూడిన త్రిమూర్తి దర్శనం, శ్రీగాయత్రీ, శ్రీసావిత్రీ, శ్రీసరస్వతీ ముగ్గురమ్మలు కలిసి ఇచ్చే గాయత్రీ దర్శనం వంటి అద్భుత దర్శనాలను పొందగలం.
బాలిక తీర్థం
పేదరికం, జాతక దోషాలు వంటి కారణాల వల్ల వివాహభాగ్యానికి నోచుకోని కన్యలకు ఈ దర్శనం ఓ వరప్రసాదం లాంటిది. వీరు శివరాజతీర్థం సమీపంలో ఉన్న బాలికా తీర్థంలో స్నానమాచరించి మొలకెత్తిన ధాన్యాలను తీర్థంలో జారవిడవడమో లేక వాటిని పశువులకు ఆహారంగా సమర్పించడమో చేయాలి. ఇలా చేస్తే మరు జన్మలోనైనా మంచి భర్తను పొంది దీర్ఘ సుమంగళి అయ్యే భాగ్యం పొందగలుగుతారు.
బ్రహ్మ పూర్ణ శక్తిముఖ దర్శనం
శనివారం గిరి ప్రదక్షిణలో అడిఅణ్ణామలై ప్రాంతంలో శ్రీఆదిఅరుణాచలేశ్వర ఆలయం నుండి పొందే దర్శనమే బ్రహ్మ పూర్ణ శక్తిముఖ దర్శనం. ఈ ఆలయంలో ఉన్న పావురాలు యేళ్లతరబడి జీవించే దైవీక శక్తిని కలిగి ఉంటాయి. ఇప్పటికీ పలు లోకాలకు వెళ్లి ఈ పావురాలు తిరిగి వస్తుంటాయి. ఈ పావురాలకు నవధాన్యాలు, ముఖ్యంగా రాగులను ఆహారం ఇస్తే మంచిది. శుభఫలితాలను కూడా ఇస్తాయి.
మహర్షులు, దేవతలు, గంధర్వులు, దేవతలు వంటి వారు భూలోకానికి వచ్చినప్పుడు తమ సూక్ష్మ దేహాలను ఆలయగోపురాలలో భద్రపరచి, భూలోకపు జీవరాశులుగా ఆకారం దాల్చి ఆలయంలోని మూర్తులను దర్శించిన మీదట, తమ లోకాలకు తిరిగి వెళుతూ ఆలయ గోపురాలలో దాచిన తమ సూక్ష్మదేహాలను ధరింపజేసుకుని బయలుదేరుతూ, తమ దేహాలను కాపాడిన ఆలయ గోపురాలకు కృతజ్ఞతా భావంతో దైవీక శక్తులను అందించి వెళతారు. కనుకనే 'గోపుర దర్శనం కోటి పాప విమోచనం' అని చెబుతారు.
దశముఖ దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గం కాంచీ ప్రదాన రహదారితో కలిసిచోట అభయ మండపం ఉంది. ప్రస్తుతం మిక్కిలి శిథిలమైన స్థితిలో ఉన్న ఈ మండపంలో నుంచి చూస్తే అరుణాచలేశ్వరుడు దశ ముఖాలతో కనిపిస్తాడు. శ్రీమహావిష్ణువు దాల్చిన పది అవతారాలు మహేశ్వరుడిని మొక్కి తరించిన స్థలమిదే.
ప్రతిమానవుడి దేహంలో పది రకాలయిన (దశ వాయువులు) వాయువులున్నాయి. దేహం నుండి ప్రాణం పోయాక, రోజుకు ఒకటి చొప్పున తొమ్మిది రకాల వాయువులు తొలగిపోతాయి. మృతి చెందిన వ్యక్తి దైవీక స్థితిని బట్టి పదోరోజున కలా వాయు విడిపోతుంది. కనుకనే మానవ దేహానికి పది రోజులపాటు కర్మలు నిర్వర్తించం ఆనవాయితీగా మారింది.
ఉత్తమ, శాంతమైన, చలన రహిత మరణం కావాలని కోరుకునేవారికి దశముఖ దర్శనం శుభప్రదమైనది.
పంచలింగ పంచముఖ దర్శనం
కుబేరలింగం నుండి, ఇడుక్కు పిళ్ళయార్‌ సన్నిధి తర్వాత ఉన్న పంచముఖ లింగాల నుండి తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని దర్శనం చేసుకోవడం మహాభాగ్యం. ఈ చోటు నుండే పంచముఖ మహర్షి పలుకోటి యుగాల దాకా తపస్సు చేసి పంచభూత శక్తులను పొంది దైవ సన్నిధిని చేరుకున్నారు.
శ్రీఇసక్కి సిద్ధులవారి జీవ సంచారమున్న ప్రాంతం కూడా ఇదే. దురలవాట్లకు బానిసలై జీవితంలో అక్రమ మార్గాలను అనసురిస్తున్నవారికి శ్రీఇసక్కి సిద్ధపురుషుడి జీవన స్థలం సద్గతిని ప్రాప్తింపజేస్తుంది. శివభక్తులు ఈ చోట శంఖాలతో క్షీరాభిషేకం చేసి, నిరుపేదలకు శంఖువులతో పాలను దానం చేస్తే దురలవాట్లకు దూరమవుతారు.
ఇక్కడి నుండి పచ్చయమ్మన్‌ ఆలయం వరకూ ఉన్న మార్గం పక్కగా పలు మహాపురుషులు జీవసమాధులు, కంటికి కనిపించని పలు తీర్థాలు ఉన్నాయి. తగిన సద్గువును ఆశయ్రించి ఈ విశేషాలను గురించి తెలుసుకోవచ్చును.
కోణ లింగ దర్శనం
కాంచి రహదారి చివరన బస్టాండు వైపు వెళ్లే మార్గంలో ఉన్న శ్మశానం నుండి అరుణాచలేశ్వరుడిని దర్శనం చేస్తే అదే కోణ లింగ దర్శనమవుతుంది. కామభావాలు, విపరీతమైన ఆశలు తొలగించే అత్యుత్తమ దర్శనమిది. ఈచోట చల్లటి మజ్జిగను దానం చేయడం మంచిది.
ఫలచార బహులింగ దర్శనం
శనివారం గిరిప్రదక్షిణలో శ్రీపచ్చయమ్మన్‌ ఆలయం నుండి లభించే దర్శనాన్ని ఫలచార బహులింగ దర్శనం అని చెబుతారు. నరాల వ్యాధులు, పక్షపాత వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ దర్శనం చేస్తే రోగాల బారి నుండి బయటపడి సుఖంగా జీవిస్తారు.
చివరగా శ్రీభూతనారాయణ పెరుమాళ్‌ సన్నిధిలో మొక్కి స్తుతిస్తే శనివారంనాటి గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.
ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది?
లౌకికపరమైన మొక్కుబడులు, ప్రార్థనలు చేయదలచినవారు అందుకు అనువైన సమయం, కాలం ఎంచుకుని గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది. ఎందుకంటే తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ ఫలితాలు ఆయా రోజులు, తిథులు, నక్షత్రాలు, హోరైలు, గ్రహ, నక్షత్ర అమరికలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. తగిన సద్గురువు సలహాలు తీసుకుని తమ ప్రార్థనలకు అనువైన రోజుల్లో గిరి ప్రదక్షిణ చేస్తే శుభఫలితాలను పొందగలుగుతారు.
అయితే, ఏమి కావాలన్నా 'దేవా నీవే సర్వస్వం. నీ అభీష్టం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి. ఏవి నాకు శుభాలుగా భావిస్తారో వాటినే ప్రసాదించు దేవా' అని వేడుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే చాలును.

గిరి ప్రదక్షిణ ఫలితాలను పెంపు

తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?
ఈ ప్రశ్నకు లేదు అన్నదే సమాధానం. ఎందుకంటే పరీక్షలు రాసినవారందరికీ ఒకే విధమైన మార్కులు రావు కదా. వారి వారి జ్ఞాపకశక్తి, సమాధానాలు రాసే పద్ధతి, పదజాలం వంటి పలు విషయాల వల్లే మార్కులు అధికంగా లభిస్తాయి. అదే రీతిలో తిరుఅణ్ణామలైని పలువురు గిరి ప్రదక్షిణ చేసినా వారి వారి ఆత్మవిశ్వాసం, అంకితభావంతో చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందగలుగుతారు.
అయినా కొన్ని చిట్కాలు పాటిస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలను అధికంగా పొందవచ్చును.
1. స్నానమాచరించిన తర్వాత తమ కులధర్మాన్ని బట్టి నుదుట విభూతి, సింధూరం, కుంకుమ ధరించి, దేహంపై దైవీక చిహ్నాలతో గిరి ప్రదక్షిణ చేస్తే శుభఫలితాలు అధికమవుతాయి.
2. సంప్రదాయ రీతిలో పురుషులు పంచకచకం, స్త్రీలు చీరలు ధరించి గిరి ప్రదక్షిణ చేయడం శ్రేయస్కరం.
3. ఆయా రోజులకు అనువైన రంగుల దుస్తులు ధరిస్తే మంచిది.
4. పురుషులు జంధ్యాలు, చెవిపోగులు ధరించి, మహిళలు ముక్కుపుడకలు ధరించి గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది.
5. నిర్ణీత లగ్నం, హోరై, అమృతయోగం వంటి శుభముహూర్త సమయాల్లో గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది.
గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడక్కడా పితృదేవతలకు తర్పణాలు, ధాన ధర్మాలు చేస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలు అధికంగా పొందగలుగుతారు.
తిరుఅణ్ణామలైని ఒంటరిగా గిరి ప్రదక్షిణం చేయడం కంటే కుటుంబ సమేతంగా, బంధువులు, స్నేహితులతో కలిసి గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శ్రేష్ట ప్రదం. ప్రతీ సారి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు తమతో పాటు ఓ కొత్త వ్యక్తిని వెంటబెట్టుకుని తీసుకెళ్లడం కూడా మంచిది.
గిరి ప్రదక్షిణ నియమాలు
సాక్షాత్తు మహేశ్వరుడే స్థూల రూపంలో అవతరించిన తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ చేయడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అవేమిటంటే...
1. పాదరక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ నియమానికి మినహాయింపులు లేనేలేవు.
తిరుఅణ్ణామలై అంతటా కోటానుకోట్ల సంఖ్యలో లింగాలు సూక్ష్మరూపంలో ఉన్నాయి. కనుక అంతటి పవిత్రమైన మార్గంలో ఎట్టి పరిస్థితులలోనూ పాద రక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయడమే మంచిది.
2. వాహనాలతో గిరి ప్రదక్షిణ చేయరాదు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తమ శక్త్యానుసారం నెమ్మదిగా నడిచి అక్కడక్కడా సేదతీరుతూ, విశ్రాంతి తీసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. నడవలేని స్థితిలో ఉన్నవారు గిరి ప్రదక్షిణ చేయకుండా ఉన్న చోటు నుండే సాష్టాంగంగా నమస్కరిస్తే చాలును.
3. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కబుర్లాడరాదు. భగవన్నామ స్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. వ్యర్థ ప్రసంగాలు చేయరాదు. సంస్కృతం, తెలుగు భాషలలోని దైవనామాలను నినదిస్తూ నెమ్మదిగా గిరి ప్రదక్షిణ చేయాలి. 'అరుణాచల శివా! అరుణాచల శివా!' అనే నామావళిని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది.
4. మొక్కుబడులు తీర్చుకోదలచినవారు మాత్రమే తిరుఅణ్ణామలై శిఖరాగ్రాన్ని చేరుకోవచ్చు. కార్తీక దీపం రోజున పర్వతంపైకెక్కి నేతితో ప్రార్థన చేసి వెంటనే కిందకు దిగాలి. కొండపై నుండి వేడుకగా చూడకూడదు. మొక్కుబడులు లేనివారు అకారణంగా కొండెక్కరాదు. పాప చింతనలు కలిగిన వారు పర్వతం పైకి ఎక్కరాదు.
5. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఉన్న తీర్థాలు, నందులు, అష్టలింగాలు, ముఖ్యమైన దర్శన ప్రాంతాల వద్ద సాష్టాంగ నమస్కారాలు ఆచరించాలి. వంటిపై మట్టి అంటుకుంటుందన్న తలంపు ఎట్టి పరిస్థితులలోనూ ఉండకూడదు. సిద్ధులు, మహర్షులు పాదాలు మోపిన పవిత్ర స్థలమన్న భావనతోనే సాష్టాంగ నమస్కారాలు చేయాలి.
6. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఎదరుయ్యే నిరుపేదలకు, పశువులు, శునకాలు వంటి జంతువులకు ఆహార పదార్థాలను దానం చేస్తే మంచిది. గిరి ప్రదక్షిణకు వెళ్లేవారు ముందుగానే వారి వెంట పండ్లు, బిస్కెట్లు, రొట్టెలు (bread), తదితర ఆహార పొట్లాలను తీసుకెళ్లడం మంచిది.
కార్యసిద్ధి కోసం గిరిప్రదక్షిణ
ఒక్కో రోజు గిరి ప్రదక్షిణకు వెళ్లేవారు ఆ రోజుకు సంబంధించి ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుని ఆ వర్ణపు దుస్తులు ధరించి గిరి ప్రదక్షిణ చేసి మరిన్ని ఫలితాలను పొందవచ్చు. ఆయారోజులకు అనువైన వర్ణాలు కలిగిన దుస్తులను నిరుపేదలకు దానం చేస్తే మరీ మంచిది.

వారం ధరించాల్సిన వస్త్రపు వర్ణం
ఆదివారం నారింజరంగు
సోమవారం తెలుపు + ఎరుపు
మంగళవారం ఎరుపు
బుధవారం పచ్చ
గురువారం పసుపు
శుక్రవారం లేత నీలం
శనివారం నలుపు లేదా నీలం

మనం చేయదలచిన సత్కార్యాలకు ఆటంకాలు కలిగితే పైన పేర్కొన్న విధంగా ఆయారోజులకు అనువైన రంగు దుస్తులు ధరించి గిరి ప్రదక్షిణ చేస్తే ఆటంకాలు తొలగి సత్కార్యాలను నిర్విఘ్నంగా చేయగలుగుతారు.
సకలమూ తెలిసినవారే సద్గురువులు
తిరుఅణ్ణామలై క్షేత్రాన్ని వారాలలో గిరి ప్రదక్షిణ చేసే పద్ధతులను తెలుసుకున్నాం. ఏయే వారాల్లో గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో కూడా తెలుసుకున్నాం.
ఇక సామాన్యమైన మానవులుగా ఉండే మనం ఎలా ఈ దర్శనాలను, ఆ దర్శనపు ఫలితాలను ఎలా తెలుసుకోగలం? అలా తెలుసుకున్నా వాటిని జ్ఞాపకంలో పెట్టుకోగలమా? సద్గురువు సలహాలు పొందాలన్నదే ఈ ప్రశ్నకు అనువైన సమాధానమవుతుంది.
ఇక పైన పేర్కొన్న దర్శనాలే గాకుండా మరెన్నో దర్శనాలు కూడా ఉన్నాయి. సోమస్కంధ దర్శనం, గజతోన్ముఖ దర్శనం, కామాక్యా రూప దర్శనం, 'అన్నిమతాలు ఒక్కటే' అని రుజువుచేసే సంగమ దర్శనం, మూషిక లింగ దర్శనం, హరిహర దర్శనం అంటూ ఎన్నో దర్శనాలను గురించి చెప్పుకుంటూ పోవచ్చు. ఈ దర్శనాలకు సంబంధించి నియమనిష్టలు, పద్ధతులు గురించి బాగా తెలిసినవారే సద్గురువులు.
సద్గురువు నిర్దేశించిన మార్గంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఆ గురువులే మనకు అనువైన దర్శనాలను నిర్దేశించి దైవానుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తారు. మన పూర్వజన్మ కర్మఫలితాలను పోగొట్టి సద్గతిని కలిగిస్తారు. కనుకనే సద్గురువుతో కలిసి గిరి ప్రదక్షిణ చేస్తే మరీ మంచిది.
ఇక మంచి గురువును పొందలేనివారు 'మహేశ్వరా మాకు అనువైన సద్గురువును అందించు స్వామీ' అని ప్రార్థిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తే ఆ పరమేశ్వరుడే కరుణించి సద్గురువును మనకు అందిస్తాడు.
అలా సద్గురువుల అనుగ్రహం పొందిన మీదట మనం గుర్తుంచుకోవాల్సిన ఉన్నతమైన మంత్రమొకటింది. 'మహేశ్వరా నాదంటూ ఏవీలేవు. సర్వమూ నీదే! కరుణామయా కరుణించవయా అరుణాచలేశ్వరా' అని మనసారా ప్రార్థిస్తే చాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. సకలమూ తెలిసిన సద్గురువు ద్వారానే ఇవన్నీ పొందగలం. సద్గురువును శరణుజొచ్చి సకల సౌఖ్యాలు పొందుదామా!

- ఓం గురువే శరణం -

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam