కుళలుఱవుత్యాగి
   
 
 
అవకాశాలు అలంకరించుకొని రావు!

ఓం శ్రీ వల్లభ గణపతి కృప
ఓం శ్రీ అంగాళ పరమేశ్వరి కృప
ఓం శ్రీ సద్గురు శరణం

 
శ్రీ
సద్గురువుల
అమృత
పలుకులు
 
     
విదేశాలకు వెళ్ళాలనుకుంటారా ?

విదాశలకు వెళ్ళాలి, డబ్బు అధికంగా సంబాదించాలి అనే ఆలోచన ఈ నాటికి ప్రబలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలని మీ తలరాత ఉంటేనే విదేశాలుకు వెళ్ళొచ్చు. అలా లేదంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళలేరు. విదేశానికి వెళ్ళి జీవించాలనే ఆశ అమితంగా ఉంటే దానికో దారి ఉంది. ఉత్తిరకోశమంగైలోని నటరాజరు సన్నిధిలో ఎకాదశ రుద్ర లింగాలు ఉన్నాయి. బాణం (లింగ భాగం) తెల్లగాను ఆవుడై (యోని భాగం) నల్లగాను వున్నాయి. వీరికి వెన్కాండ బాణ రుద్ర లింగాలు అనే పేరు ఉన్నాయి. ఈ ఏకాదశ రుద్ర లింగాలను యథావిధిగా పంచాక్షర జపం చేసి చతుర్థశి తిథి నాడు ఉపవాసం ఉండి విడవకుండా ప్రార్థిస్తే మంచి మార్పులను ఎదురుచూడవచ్చు. వీలయినంతమట్టుకు మాత్రుభూమిలో ఉంటడం మంచిది.

పదవులు కోల్పోయినవారు మళ్ళీ పదవులు పొందడం ఎలా ?

ఈ నాటికి ఒకరు మరొకరికి సహాయం చేయడం అనేది ఎంతో అరుదుగా ఉంది. కారణ కార్యాలు లేక పోతే ఇతరులు సహాయం చేయడం లేదు. పైగా సహాయం చేయడంతో ఇబ్బందులూ వస్తాయి. అందువల్ల మంచివారి ద్వారా మనం సహాయం పొందాలంటే ప్రతిఫలం ఎదురుచూడని సహాయకుణ్ణి పొందాలంటే వామనపురీశ్వరుడని పిలువబడే సహాయనాయకుడైన శివుణ్ణే అనునిత్యం ప్రార్థించాలి. స్వామి నామం ఉతవి నాయకరు అనగా సహాయకుడు. అమ్మవారి పేరు ఉతవి నాయకి అంటే స్త్రి నహాయకుడు. ఇప్పుడు అంబుజాడ్చి, తామరైకణ్ణి అని నామాలు ఉన్నాయి. కడలూరు తగ్గర కెడిలం నది దక్షిణ తీరంలో వీరి మందిరం ఉన్నది. తెరలో భీమ రుద్ర పూజలను చూసి తరువాత తెర తీసాక వామన మూర్తి పూజించిన శివలింగ నాయకుడైన శ్రీ ఉతవినాయకుని దర్శించండి. పైగా తన పదవి శాశ్వతం చేసుకొవడానికి ఇతరుల పదవులను విడిచి పెట్ట చేసిన వారికీ, పదవి ఆశతో పంచబాధాలు చేసినవారికీ తగిన శిక్ష ఇవ్వగల దేవుడు. పైగా తప్పులు చేయని అమాయకులు పదవి కోల్పోయి పరితపిస్తున్నప్పుడు శ్రీ ఉతవినాయకుణ్ణి శరణు పొందే ఒక మంచి దారి కనబడుతుంది.

ఎముకుల వైద్యులకు కీర్తి

వైద్య రంగంలో పలు ఉపశాఖలు ఉన్నాయి. వాటిలో ఎముకులకు సంబంధించిన రోగాలకు ప్రత్యేక వైద్యం ఉంది. ఈ రంగానికి చెందినవారు (Bone specialists, Orthopedists) తమ రంగానికి వచ్చే రోగగ్రస్తుల నుండి మర్యాద పొందేందుకూ వారు నయమవడానికి ఎంతో పాటుపడాలి. వారు తమ రంగంలో ప్రత్యేక గొప్పతనాన్ని సాధించడానికీ జనల మధ్య గౌరవ ఆదరాలు పొందేందుకూ ఆధ్యాత్మికంలో ఒక దారి ఉంది. అదే ప్రళయకాల రుద్ర ఆరాధన అవుతుంది. వారి రూపం చతుర్భుజాలవారు. ఒక చేతితో జింకకు పిల్లు ఇస్తున్నారు. రెండు చేతులతో డమరకం వాయిస్తూ వుంటారు. ఒక దీర్ఘ కత్తి వంటి ఎముకు చెక్కను భుజాలపై ఉంచుకొని ఒక చేతికి పుచ్చుకొంటారు. ఈ రూపం కలిగిన రుద్ర మూర్తికి చతుర్దశి తిథి నాడు ఉపవాసం ఉండి రుద్ర మంత్రాన్ని 11 సార్లకు తగ్గకుండా జపించి జీడిపప్పు కలిసిన పాల పాయసం దానం ఇస్తూ ఉంటే మంచి పేరు కీర్తి కలుగుతారు. శ్రీ రుద్ర మంత్రం ఎరగనివారు తిరుజ్ఞానసంబంధ మూర్తి నయనారు అనుగ్రహించిన "వరియ మరైయార్ పిరైయార్ ..." అనే తేవార గీతాలను 11 సార్లకు తగ్గకుండా ఉచ్చరించి ప్రార్థించాలి. ఈ రుద్ర మూర్తి వెలసివున్న స్థలం కుంబకోణం నాగనాథస్వామి ఆలయంలోని మొదటి ప్రాకారం దక్షిణ వైపులా ఉత్తరాభముఖ సన్నిధి అవుతుంది.

బంగారం ఆభరణాల వ్యాపారులకు క్షేమం

అగ్ని చేత వచ్చే ఆపదలను నిరోధించడానికీ, అగ్ని చేత మంచి కార్యాలు చేసేందుకూ, అగ్ని చేత చేసే హోమాలూ యాగాలూ మంచి ఫలాలు కలిగించేందుకూ, ఉక్కు మెల్ట్ చేసే శాల, విద్యుత్ శక్తి ఉత్బత్తిదారులు, దానికి సంబంధించిన విడి భాగాలు, బంగారం ఆభరణాలు, ఉక్కు కర్మాగారం, బండి వాహన యంత్రశాలలు వృద్ధి చెందడానికీ, పైగా నిప్పుచేత ఇబ్బందులు రాకుండా ఉంటడానికి సహాయం చేసేవారే తరుఅణ్ణామలైలోని అఘోరరుద్ర మూర్తి. వీరు నెలకొనివున్న స్థలం తిరుఅరుణాచలేశ్వర ఆలయంలోని చిలక గోపురం లోపలి ఆగ్నేయ మూలన బ్రహ్మ తీర్థం గట్టులో పడమటాభిముఖంగా సన్నిధి సాధిస్తారు. (ప్రస్తుతం భైరవుడి కోవెల అని పేరు.) వీరు అఘోర రుద్ర మూర్తే అవుతారు. ఆగ్నేయ మూలన నిర్మించబడి ఉంటడం వల్ల గొప్ప శక్తి గలవారు. ఆహారం ఉత్పత్తిదారులు, భోజనశాల నిర్వాహకులు, అన్నదానం చేసేవారికి బాగా సహాయం చేసే వారు. 32 ఆవు నేతి దీపాలు వెలిగించి వీరిని నమస్కరించి వ్రతాలు చేసేవారు భవిష్యత్తులో పలు ఆహార శాల్లకు ఆధికారులుగా మారుతారు. నిప్పుచే తయారుచేసిన చప్పాత్తి గట్టి పెరుగు దానం గొప్పది.

ప్రయాణ ఆపదల నుంచి విమోచన

వాహన ప్రమాదాలను నిరోధించడానికీ, రైలు ప్రమాదాలను నిరోధించడానికీ, విమాన అపహరణ నుండి తప్పించుకోవడానికీ, ఎదురుచూడని సమయంలో తలపై ఏ వస్తువులు పడి కష్టాలు రాక పోవడానికీ, ప్రయాణంలో దారి దోపిడీలు జరగకుండా ఉంటడానికీ, మన వద్ద వున్న డబ్బును మంచి కార్యాలకు ఖర్చు చేయడానకీ సహాయం చేయగల అష్ట రుద్రుడు వెలసివున్న స్థలం తిరుకడైయూరు అవుతుంది.

తిరుకడైయూరు శివాలయం

మందిరాన్ని లోపలి ప్రాకారమయిన తిరుమాళిగై పత్తి బారున ఉత్తరాన రెండూ, తూర్పున రెండూ, దక్షిణన మూడుగానూ ఏడు రుద్ర మూర్తులతో కాలసంహార విహారి మూర్తిన్నీ కలిసి ఎనిమిది రుద్ర మూర్తులు ఉన్నారు. (ప్రస్తుతం వీరిని అష్ట వసువులు అంటారు. కాని విరి రూపం రుద్ర రూపమే అని జనులు తెలుసుకోవాలి.) ఎనిమిది దినాలకు పాలు పండ్లు మాత్రమే తిని ప్రతం అనుష్ఠించి ఇక్కడ బసచేసి ప్రతిదినం దర్శించి ప్రార్థింస్తే పైన చెప్పిన సమస్యలు తీరుతాయి.

కుటుంబ అప్పు బరువు తగ్గించి పోవాలా ?

అన్న తమ్ములు ఇద్దరూ కలిసి వ్యాపారం వంటి ఉమ్మడి ఉద్యోగం చేస్తుంటారు కనుక. అప్పుడు కుటుంబ సమస్యల కారణం కోసం గాని లేక వ్యాపారం కోసం గాని అప్పు తీయవలసి వచ్చినప్పుడు అన్న తమ్ములు ఇద్దరూ అప్పు పత్రంలో సంతకాలు పెట్టి అప్పు తీసి వుంటారు. ఇలా వున్నప్పుడు అన్నగాని తమ్ముడుగాని చచ్చి పోతే ఎవరో ఒకరి తల పై ఆ అప్పు పడుతుంది. అప్పుడు అన్నో తమ్ముడో అప్పు తీర్చడానికి ఆధ్యాత్మికంలో ఒక మంచి దారిని చూపాడు పెద్దలు. వారు అప్పు తిరిగీ ఇవ్వడానికి మంచి మార్గదర్శకమూ సహాయమూ కలగడానికి వారు చేయవలసినది ఇదే. తిరువిడైమరుతూరికి వెళ్ళి ప్రతిదినం రుద్ర తీర్థంలో స్నానం ఆచరించి 11 రుద్ర మూర్తుల నామాలను విడవకుండా జపించి శ్రీ మహాలింగ మూర్తికి దర్శించి ఒకే వేళ ఆహారం అందుకొని 48 దినాలు ప్రతం అనుష్ఠిస్తే అప్పు తీర్చేందుకు మంచి మార్గదర్శకుడు కలుగుతాడు. ఈ రుద్ర తీర్థం ఆలయానికి దక్షీణ వైపులా ఉంది.

అపార సంపద మీకే

పదవీవృద్ధి కోసం అనేక పందివారు పలు రకాల కార్యాలను చేబడతారు. పై అధికారుల ఇంటి కార్యాలు, తోట పనులు మొదలుపెట్టి అశ్లిల కార్యాలు కూడా వారి కాళ్ళ కిందనే పడివోయి చేస్తారు. ఈ విధంగా పొందే పదవి, డబ్బులన్నీ చాలా పెద్ద కర్మ మూటలుగా మారి భవిష్యత్తులో ఇబ్బందులు కలిగించేవి అనేది వాస్తవమే. ఈ విధంగా గౌరవ ప్రతిష్ట కోల్పోయి పదవి కోసమూ డబ్బులకోసమూ తిరుగుతూన్న వ్యక్తులకు ఆధ్యాత్మికంలో గొప్ప దారి వుంది. పదవి మేటి కోసం ఇతరుల పాదాలను పట్టుకొవడం కంటె సర్వశక్తివంతుడైన భగవంతుని కాళ్ళను పట్టుకుంటే అన్నీ మంచి దానంతట వస్తాయి. దినికి అనుగ్రహించే దేవుడు వున్న స్థలమే మయిలాడుతురై నుండి తరంగంపాడి వెళ్ళే మార్గంలోని సెంపొన్నార్కోవెల. 12 సూర్య మూర్తులు ప్రార్థించి నశించి పోవని పదవినీ అనుగ్రహాన్నీ కలిగిన స్థలం. ఇక్కడ ఒక తీర్థం వుంది. దాని పేరు సూర్య పుష్కరణి. చిత్ర మాసంలో సూర్య కిరణాలు భగవంతుని మీద ప్రసరించే దినాల్లో సిద్ధులు వట్ట పూసురై అనే మూలికను కలుపుతారు. అందువల్ల ఈ దినాల్లో ఈ తీర్థంలో ప్రతిదినం స్నానం చేసి గొధుమ హల్వా, ఆరంజి రంగు వస్త్రాలు దానం చాసి శివుణ్ణి ప్రార్థిస్తే సొర్ణపురీశ్వరుడు స్వర్ణాస్తులను అమితంగా ప్రసాదిస్తారు.

మూసిన ఫ్యాక్టరీలను తెరచడానికి

పలు చిన్న ఫ్యాక్టరీలనుండి పెద్ద ఫ్యాక్టరీల వరకు ప్రస్తుతం అనేక చోటుల్లో మూసి వున్నాయి. దీనికి పలు కారణాలు వున్నాయి. అప్పిచ్చే బ్యాంకులు అప్పు ఇవ్వక పోవడంవల్లనూ, ప్రైవేటు ఆర్థిక సంస్థుల్లో వున్న పై అధికారుల అపనమ్మకంతోనూ, ఉద్యోగుల వద్ద సహాకారం లేకపోవడంతోనూ, ఇంకా మరి కొద్ద మంది ప్రతిష్ట వల్లనూ ఎన్నో ఫ్యాక్టరీలు మూసి ఉన్నాయి. ఫ్యాక్టరీలు తెరిచి పనులు జరగడానికి ఆధ్యాత్మికంలో పలు పరిష్కారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనదే పారిజాత వనం అని పెరు కాంచిన తిరివాడానైలో నివసిస్తున్న శ్రీ ఆతిరత్నేశ్వరుడు స్నేహవల్లి అమ్మవారులకు మొక్కుబడి ఒక వేళ ఆహారం అందుకొని ప్రతిదినం దానధర్మాలు చేసి ఒక మండల కాలం పాటు ఉపవాసం అనుష్ఠించే తెరని ఫ్యాక్టరీలు, మూసిన వ్యాపారాలు తెరిచి ఉద్యోగులు యజమానులు సంతోషిస్తారు. తిరువాడానై శివగంగైనుండి 33 మైళ్ళ దూరంలోను కాలయార్కోవెలనుండి 21 మైళ్ళ దూరంలోను ఉంది.

కోరికలు తీరే మార్గాలు

జీవితంలో అనేక మంది వారికి పలురకాల కోరికలు ఉన్నాయి. "అరచేయంత హృదయంలో సముద్రమంత ఆశ పెట్టాడు" అన్నారు పెద్దలు. అలాగే మానవాళి ఒక్కొక్క ఆశను నెరవేర్చడానికి పలు మార్గాలు చూపివున్నారు సిద్ధులు. అయతే ఎటువంటి ఆశలు కూడదని పెర్కొన్నారు. వాటిలో పేరాస కూడదు, దురాస కూడదు, చపలాస కూడదు అని కూడా తెలిపేవారు. ఎది పేరాస, ఎది దురాస ఎది చపలాస అని తెలియకుండా లోకులు ప్రతిదినం నిలకడ లేని మనసు కలవారై ఉంటారు. ఈ ఆశలను సిద్ధుల మూలంగానే తెలుసుకోగలము. అలా అయితే సిద్ధులను మనం ఎలా దర్శనం చేసి వారి నుండి ధర్మ మార్గాలు తెలుసుకోవడం ? ప్రస్తుతం సిద్ధుడు ఎవడైతే తాను ఒక సిద్ధుడని ప్రకటించడు. రూపాన్ని చూసిగాని బట్టలు ఆభరణాలను చూసిగాని మనం సిద్ధులను గుర్చించలేరు. అందువల్ల ఇటువంటి లోకులకు సహాయం చేసేందుకు ఒక అద్భుత మార్గాన్ని చూపారు ఆధ్యాత్మికంలో. అదేమిటి? సిద్ధులను దర్శించాలంటే ప్రతి ఆదివారం నాడు 108 తామర పుష్పాలు తీసుకువెళ్ళి శ్రీపుష్పరతీశ్వరుడు అనే శివునికి వ్రతం పాటించి అర్చించి చక్కెర పొంగలి లేదా వేరుసనగ కలిసిన నిమ్మరస అన్నం దానం చెయ్యాలి. ఈ విధంగా 12 సంవత్సరాల పాటు ఎన్ని ఆదివారం దినాలు వస్తాయో అన్నీ ఆది వార దినాలు తామర పువ్వులతో అర్చించి ఉపవాసం ఉండి దానధర్మాలు చేస్తూంటే సిద్ధుల దర్శనం పొంది అన్నీ కార్యాలను సాధించ కలుగుతారు. ఈ కోవెల జ్ఞాయిరు అనే స్థలంలో వెలసి ఉంది. ఈ ఉరికి వెళ్ళడానికి చెన్నై గోల్డనరోడ్డు నుండి నగర బస్సులు ఉన్నాయి. లేక పోతే చెన్నై నుండి ఎర్ర గుండ్రం (Red Hills) చేరి అక్కడ నుండి ఉత్తరాన శాఖ దారిలో పాలవాయిలు, అరుమందై మొదలైన ఊళ్ళ ద్వారా వెళ్ళి ఈ ఉరికి చేరుతారు.

జన్యు వ్యాధులు తొలగి పోవడానికి

జీవితంలో అనేక మంది వారు పలువిధమైన పూర్వజన్మ కర్మల చేత కఠినమైన వ్యాధులకు గురి అవుతారు. పైగా ఒకే విధమైన కర్మాలను చేసినవారిని ఒకటిగా చేర్చి తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లలు అని ఒకే కుటుంబముగా భగవంతుడు సృష్టిస్తాడు. అలా సృష్టంచడమే గాక ఒకరికి వచ్చిన రోగం ఈ కుటుంబానికి చెందినవారందరికీ రానని చేస్తాడు. దీన్నే జన్యు వ్యాధి అని వైద్యులు చెబుతారు. తల్లి తండ్రులకు చక్కెర వ్యాధి వుంటే పిల్లలకు కూడా అది వస్తుంది. అలాగే తక్కిన వ్యాధులు కూడా వెదుక్కొంటూ వచ్చిన వ్యాధులు అవుతాయి. ఈ విధంగా జన్యు వ్యాధులతో బాధబడుతున్నవారు దేవ దైవ పెద్దల శాపంతో కలిగిన జన్యు వ్యాధులు తీరడానికి పలు మార్గాలు వుండినా ఆధ్యాత్మికంగా ఒక మార్గం పేర్కోబడింది. అదే సూర్యుడు పూజించిన మంగలకుడి అనే స్థలం. సూరియనారుకోవెల తగ్గరి స్థలం ఇది. ఈ స్థలానికి దేవుడు శ్రీ ప్రాణవరతేశ్వరుడు అవుతాడు. అమ్మవారు శ్రీ మంగల నాయకి. మిక్కిలి శక్తీ కృపాలు గలవారు. ఇక్కడ కార్తీక మాసం ఆదివారం మొదలుబెట్టి విడవకుండా 12 ఆదివారం దినాల్లో ఈ మంగల తీర్థంలో స్నానం చేసి శ్రీ ప్రాణనాథేశ్వరునికి తెల్లజిల్లేడు ఆకులో పెరుగు అన్నం నైవేద్యం పెట్టి విడవకుండా ఆరాధిస్తూంటే ఇబ్బంది కలిగించే జన్యు వ్యాధుల నుండి నివారణం పొంద గలరు భగవత్కృపతో.

సూర్యుడు అందజేసే కళ్ళ రక్ష

బాను శష్టి, బాను సప్తమి - ఈ రెండు రోజులూ గొప్ప విశేషమైన రోజులవుతాయి. ఆదివారమూ శష్టి తిథీ కలిసి వస్తే బాను శష్టి అంటున్నారు. ప్రథమ తిథినాడు మొదలుబెట్టి బిల్వాకుల నీళ్ళు మాత్రం తాగి ఉపవాసం ఉండి ఆదివారమూ శష్టీ కలిసి వచ్చే బాను శష్టి నాడు చక్కెర పొంగలి, గొధుమ చప్పాతి, పూరి, ఆరంజి రంగు దుస్తులు, అద్దాలు వంటి వాటిని దాన ధర్మం చేసేవారు కంటికి సంబంధించిన రోగాలతో బాధ కలగరు.

పరితినియమం

కంటి వైద్యులు తప్పకుండా ఈ వ్రతాన్ని నిర్వర్తంచాలి. ఈ విధంగా ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తే అది బాను సప్తమి అవుతుంది. పైన చెప్పినట్టు ప్రథమ తిథి నుండి ఏడు దినాల పాటు ప్రతం అనుష్ఠించి ఏడవ దినం అదివారం సప్తమి కలిసి వచ్చినప్పుడు బాను సప్తమి ఉత్సవం పాటించడం వల్ల గొప్ప అనుగ్రహం కుదురుతుంది. కంప్యూటరులో పని చేసేవారు, వెల్డింగ్ ఉద్యోగంలో ఉన్నవారు, మెల్ట్ చేసే శాల, కొలిమి, టెలిస్కోప్ మూలంగా పని చేసేవారు (observatory) వాతావరణ పరిశోధనలో కలిగి వున్నవారు, optical centre-లో పని చేసేవారు, నవరత్నాల రాళ్ళకు సాన పట్టలు పెట్టేవారు, పరిశీలించేవారు, అగ్ని సేవవారు, బాయిలరులో పని చేసేవారు, లేసరు సాధనాల్లో పని చేసేవారు తప్పకుండా ఈ బాను శష్టి బాను సప్తమి దినాల్లో వ్రతాలు అనుష్ఠించి మంచి ఫలితాలు పొందాలంటే పరితినియమం అనే స్థలంలోని సూర్య తీర్థంలో స్నానం చేసి ఈ ఆరు లేక ఏడు దినాలు అక్కడనే ఉండి ఈ వ్రతాన్ని అనుష్ఠించి విడవకుండా 12 సంవత్సరాలు ఇలా నెరవేర్చితే గొప్ప మార్పులను జీవితంలో చూడ గలుగుతారు. తంజావూరు పట్టుకోట్టై మార్గంలో తంజావూరు నుండి పది కి.మీ. దూరంలో ఈ ఊరు ఉన్నది.

చివరి వరకు పిల్లలతో కలిసి వుంటడానికి

జీవితంలో కొద్ద మంది వారికి అనేక మంది పిల్లలు ఉన్నారు. కొందరికి రెండు పిల్లలు ఉన్నారు. అయితే స్వల్ప మంది వారికి ఒక పిల్ల పైకి లేదు. ఇవన్నీ భగవంతుని ఇష్టం. అనేక పిల్లలు ఉన్నవారు వారి పల్లల పెశ్ళికి తరువాత వారినిండి వదిలి పోయి ఒంటరిగా ఉంటున్నారు, పిల్లలతోనే నివసించడమూ ఉంటుంది.

ఏకాసనం మాద
సోమాస్కంద మూర్తి

కొందరు తన పిల్లలకు పెళ్ళి జరిపి విదేశాలకు పంపి తానూ భార్యనూ ఉంటడమూ ఉంటుంది. పండి పొయిన వయసులో కొందరు ఒకే పిల్లకు పెళ్ళి జరిపి తాము మాత్రం ఒంటరిగా ఉంటున్నారు. ఇవన్నిటికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ విధంగా తమ పిల్లల పెళ్ళి తరువాతను వారినుండి వదలకుండా మంణించే సమయం వరకు ఒకటిగా వుంటడానికి తల్లితండ్రులు ఎంతో కోరుతారు. ఈ కోరిక నెరవేరడానికి ఆధ్యాత్మికంలో మార్గం వుంది. అదే సోమాస్కంద ఆసన ఆసీసుల పూజ అవుతుంది. శివుడు మురుగుడు మధ్య వుండి అమ్మవారితో ఒక దీర్ఘమైన దీర్ఘచతురస్ర ఆసనం మీద ఆసీసులై విహారించే సమయంలోను ఆలయంలోను వున్నప్పుడు దర్శించి పాల వుండ్రాలు దానం చేస్తూంటే తమ పిల్లలతో చివరి వరకు కలిసి వుండే అనుగ్రహం కుదురుతుంది. ఈ ఆసనానికి పేరు ఏకాసన మూర్తం. కాని పలు ఆలయాల్లో అలంకారం నిమిత్తం వేరువేరుగా మూడు ఆసనాలు పెట్టి అలంకరిస్తారు. ఈ విధంగా సోమాస్కందరుడు కూర్చివున్న ఆసనానికి భిన్నాసన మూర్తం అని పేరు.

భిన్నాసనం మాద
సోమాస్కంద మూర్తి

ఇటువంటి భిన్నాసన మూర్తంలో ఆసీసులైవుంటే ఆ ఆరాధన తల్లి తండ్రులను పిల్లలనుండి వేరుచేసే పరిస్థితి వస్తుంది. అందుచేత ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు ఈ ఆసన స్థితిని బాగా కనుక్కొని ఆరాధించాలి. అందుచేత భక్తితో నిండిన మహానుబావులు భిన్నాసన మూర్తంలో ఆసీసులైన సోమాస్కంద మూర్తిని దర్శనం చేయ వలసిన స్థితి ఏర్పడితే మీకు పరిచయమైన బంధువులను గాని లేదా మిత్రువులను గాని వారిని తమ కుమారునితో సహా రప్పించి తల్లి తండ్రుల మధ్య కుమారున్ని కూర్చోబెట్టి వారి పాదాలపై కుంకుమ అక్షింతలు ఉంచి నమస్కరించి వారికి అన్నం వస్త్రాలు దానం చేసి ఆశీస్సులను పొందండి. 60, 80 ఏళ్ళ వయసు కలిగిన తల్లి తండ్రుల మధ్య కుమూరుడు కూర్చున్నట్టుగా నమస్కరించడం మంచిది.

పిల్లల పుట్టకతో ఇబ్బందులా ?

అనేకుల మనస్థితుల్లో పలు మార్పులు కానవచ్చాయి. కొందరు తమ పెళ్ళైన తరువాత బాగా ఆదాయం పెరిగి, వ్యాపారం వృద్ధి చెందినదని చెబుతారు. కాని బిడ్డ పుట్టిన తరువాత వ్యాపారం తగ్గంచి పోయి నష్ట గతిలో జరుగుతున్నదని వారికి శోకం. అందుచేత అనవసరంగా పిల్లలను శపించి పలు ఇబ్బందులకు గురి అవుతారు. ఇవన్నిటినికి ఆధ్యాత్మింలో పలు కారణాలను పెద్దులు చెప్పివున్నారు. ఈ దు:ఖం నుండి విమాచనం చెందడానికి సిద్దులు ఒక గొప్ప మార్గాన్ని పేర్కొంటారు. పెళ్ళై పిల్లవాడు పుట్టాక వచ్చే కష్ట నష్టాలు తీరడానికి తిరుకుర్రకుండ్రంలోని శ్రీ భక్తవత్సలేశ్పరుని ఆలయంలో ఆసీసులైన సోమాస్తందునికి దర్శించి సోమపారం శష్టి తిథి కలిసి వచ్చే దినం ఉపవాసం ఉండి దాన ధర్మాలు నిర్వార్తించి ఈ మూర్తిని విడవకుండా ప్రార్థిస్తూంటే పిల్లల పుట్టకచేత వృత్తిలో గాని వ్యాపారంలో గాని ఏ తక్కువ రాదు.

మామిడిపండు సోమాస్కందుడు మహిమ

విణాయకునికి మామిడిపండు కలిగినందుకు మురుగుడు కోపంతో ఆరుపడైవీడుల్లో స్వామి నెలకొన్నారు అనేది మన అందరికి తెలుసు. విణాయకునికి కలిగిన మామిడి పండు చేత ఆకాశం తడి పొలాలతో నిండి పోయింది. భూమండలం తడి పొలాలు, పొడి పొలాలు, మెట్ట పొలాలు, ఎడారిలు, తోపులు తోటలతో నిండి పోయింది. ఆ చోట సాగుతో లోకులు జీవించారు. కాని మురుకుడైన సోమాస్కందుడు తన చేతికి మామిడి పండు కలగడం వల్ల ఊహకందని కార్యాలన్నీ ఈ ప్రపంచంలో జరిగాయి. అవన్నిటిని సిద్ధులు రహస్యంగా ఉంచేశారు. వాటిని గురువుగారి ద్వారానే తెలుసుకోవడం మంచిది. కాని లోకులకు ఉపయోగం కలిగించే ఒక ముఖ్యమైన సంగతిని అందరికి తెలిపి ఉన్నారు. అదేమిటి? పలు సంవత్సరాల పాటు ఆలయ కుంభాభిషేక పనులు జరగక నిలిచి పోయిన ఆలయాల్లో ఆ పనులు కొనసాగించాలంటే మామిడి పండు పట్టుకున్న సోమాస్కందుని ప్రతం నిర్వర్తించి ప్రార్థిస్తే మంచి మార్పులను అందరూ చూడగలరు. ఆలయ కుంభాభిషేకం జరిగితే జనులూ దేశమూ మంచి చెందుతాయి అనేది సిద్ధుల పలుకులు. మామిడి పండు పట్టుకున్న సోమాస్కందుడు నెలకొన్న స్థలం తంజావూరు జిల్లాలోని తిరుపనైయూరు శివాలయమవుతంది. పేరళం తిరవారూరు మార్గంలో సన్నానల్లూరు తగ్గర ఉంది తిరుపనైయూరు.

డబ్బును రక్షించే ఆపద్సహాయరుడు

కలియుగంలో అనేక వ్యాపార పరివర్తనలు, ఉద్యోగ వేతనాలు, దినసరి ఖర్చులు ఇవన్నీ మన దేశంలో డబ్బు ద్వారానే అధికంగా జరుగుతాయి. చెక్, డ్రాఫ్ట్, టీ.టీ. వంటివి ఎక్కువగా వాడుకలో లేవు. అందుచేత జనులు ఎన్నో బాధలకు గురై పోతారు. అందుచేత డబ్బు లావాదేవీ అధికంగా వున్న స్థానాల్లో ఆపద, నష్టం, దు:ఖాలు అపరిమితంగా జనులను దాడి చేస్తాయి. అందుచేత చేతిలో డబ్బు తీసుకొని వ్యాపార నిమిత్తం వెళ్ళేవారు తన డబ్బును భద్రంగా పెట్టుకొని సహాయం చేయగల ఎటువంటి వ్యక్తులను నమ్మ వద్దు. "రుద్ర గంగా ఆపద్సహాయా" అని 108 సార్లకు తగ్గకుండా ఉచ్చరిస్తూ వెళ్ళి కార్యాలను చేస్తే రుద్ర గంగా సోమాస్కందుడు వెంటనుండి ఎల్లెప్పుడు కాపాడుతారు అనడంలో కొంచం కూడా సందేహం లేదు. ఈ స్థానం తిరువారూరు కుంబకోణం మార్గంలోని పూంతోట్టం తూర్పున 5 కి.మీ. దూరంలో ఉంది.

నవ సర్ప గరుడుని సహాయం పొందడం

దు:ఖాల్లో పలు రకాలున్నాయి. కొందరు నిజాయితీ సత్యంతో పరిశ్రమించేవారిని పనిలో పెట్టుకొని వారికి ఎటువంటి పై వేతనాలు గాని, పదవీవృద్ధి గాని ఇవ్వక పోతారు. ఇటువంటివారు వేరు పనులను వెదకి పోవడానికీ స్థానం మారి పోవడానికీ తయారుగా ఉండరు. యజమానులూ వీరిని బానిసల మాదిరి జరుపుతారు. ఇటువంటి పరిస్థితిలో కష్టాలు అనుభవించేవారు తమ కుటుంబం పురోగమించడానికి, ససుధులు పెరగడానికి పలు మార్గాలు ఉన్నాయి. వాటిలో అతిముఖ్యమైనది ఏమిటంటే నవసర్పాలను తన శరీరం మీద స్వీకరించి మహా శక్తి గలవారైన నాచ్చియారు కోవెల్లో వెలసివున్న గరుడాళవారికి మొక్కబడి ఎక్కడ ఉండినా ఆషాడం మాస శుక్ల పక్ష పంచమీ తిథి వ్రతాన్ని అనుష్ఠించి అమావాశ్య దినం నాడు తులసి తీర్థం తాగి వ్రతం అనుష్ఠించి, ప్రథమ తిథి నాడు పాలు మాత్రం తాగి వ్రతం అనుష్ఠించి, ద్వితీయ తిథి నాడు పండ్లు మాత్రం తింటూ ప్రతం అనుష్ఠించి, త్రితీయ తిథి నాడు ఒక వేళ ఇడియాప్పం, గొబ్బరి పాలు తింటూ వ్రతం అనుష్ఠించి, చతుర్థి తిథి నాడు ఒక వేళ తొమ్మిది ఉండ్రాలను మాత్రం తింటూ వ్రతం అనుష్ఠించి, పంచమి తిథి నాడు వేపాకు తీర్థం మాత్రం తాగి వ్రతం అనుష్ఠించి, ఆషాడ మామం శుక్ల పక్షం పంచమి తిథి నాడు రాళ్ళ గరుడుని వద్ద ప్రార్థిస్తే జీవితంలో మంచి మార్పుతో సహా బానిస సంకెల నుండి విడుదల పొందుతారు. పైగా ఆషాడ మాసం పంచమి తిథి నాడు ఒక సంవత్సరానికి ప్రతం మొక్కుబడి నెలసరి వచ్చే స్వాతి సక్షత్ర దినం గరుడుని ప్రార్థించి అన్నదానం పస్త్రదానం స్వర్ణ దానం పాల పాయమం దానం చేసేవారికి గొప్ప పదవీ వృద్ధి, విదేశ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

వాహన రంగంలో పురోగమించడానికి

ప్రపంచమంతా కారులు బస్సులు ట్రాక్టరులు జీప్పులు పలు చక్రాల వాహనాలు పలు విధాలుగా తయారయి లోకులకు ఇవ్వబడతాయి. కానీ మానవాళి మనసును ఆగట్టుకొనే వాహనాలు కొన్ని మాత్రమే. జనులను తృప్తి చేసే విధంగా కారులు తయారు చేయడానికి, పొరపాటను నివృత్తిచేయడానికి వాహన ఉద్యోగ స్థలం వున్నవారు, తయారీదారులు, విడిభాగాలు అమ్ముకొనేవారు, ఈ ఉద్యోగ చదువులో ఉన్నవారు యావత్తు ప్రపంచంలో పేరు ప్రతిష్ట పొందడానికి అధ్యాత్మికంలో సిద్ధులు కొన్ని మార్గాలను చూపి ఉన్నారు. వాటిలో ఇదీ ఒకటి. నాచ్చియారు కోవెల్లోని చక్రతాళువారు దీనికి ఎంతో సహకరిస్తారు. విష్ణువు చేత తిన్నగా మేదావి మునికి అందించబడి, పూర్ణ శక్తితో తిరుగుతున్న వస్తువులన్నిటికీ శక్తి కలిగించే పెరుమూశు ఇక్కడ వెలసి ఉన్న శ్రీ చక్రతాళవారు అవుతారు. వీరిని అర్చించే పద్ధతిని తగిన గురువుగారి మూలంగా తెలుసుకొని మొక్కుబడి ప్రార్థించేవారు గొప్ప ఫలితాలను పొందుతారు.

ధర్మ చింతన మనస్సులో పెరగడానికి

జీవితంలో మనం చేసే ధర్మాల మేరకు ధనం పెరుగుతుంది అనేది పెద్దుల మాట. దాన ధర్మాలు చెయ్యడానికి స్వభావముగా కొద్ది మంది వారు కోరుతారు. అనేక మందివారికి కష్టాలు వచ్చినప్పుడు ధర్మాలు చేత్తామని మనస్సులో తోచుతుంది. మరి కొద్ది మంది దాన ధర్మాలు చేస్తే తన ఆదాయం తగ్గి పోతుందని ఎంచి దాన ధర్మాలు చెయ్యక ఇతరులతో నా చేతనున్న డబ్బును ఎవరికీ ధర్మం చేయను, అలాగే ఎవరితోను ధర్మం చేయడం సరేనని చెప్పడమూ లేదని చెప్పే స్వార్థపరమైన దద్దమ్మలూ ఉన్నారు. దాన ధర్మాలు చెయ్యాలనే చింతన మనస్సులో పెరగాలంటే సిద్ధులు దానికో గొప్ప మార్గన్ని పేర్కొనేవారు. చిన్నతనంనుండే కుటుంబవారు తెల్ల జిల్లేడి బెరడతో వత్తి చేసి గొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా ఆవు నేతితో ప్రతిదినం ఆలయంలో దీపాలు వెలిగిస్తే దాన ధర్మాలు చేసే చింతనతో వసుతులు కూడా పొందుతారు అనేది సిద్ధుల వాక్యం.

సుగంధమైన వివాహ జీవితం

జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో జీవించాలని కోరుతారు. పేదవారు ధనవంతుని ఇంట్లో తన ఆడ బిడ్డలు వసించాలని వివాహ పొంతన లేకుండా కుమార్తెకు పెళ్ళి చేసి తరువాత పలు ఇబ్బందులకు గురవుతారు. ఈ నాటికి స్త్రిలు వాహన వసతులనూ ఇంటి వసతులనూ ధనాన్నీ చూసి భ్రమ చెందడమూ ఉంటుంది. తరువాత బాధలు కలుగడమూ అవుతుంది. ఈ విధంగా కష్టాలు కలిగిన స్త్రిలు తమ జీవితం సరిగా అమరడానికి పైగా పెళ్ళిచేత మోసం కాకుండా తప్పించడానికి పెళ్ళికి మునుపే ఈ పూజను విడవకుండా నెరవేర్చితే మంచిది. గట్టి పెరుగుతో శివలింగం తయారుచేసి ఒక్కొక్క మూల నక్షత్ర నాడు పదివేలకు తక్కగుండా ఐదు మాసాలకు పంచాక్షర మంత్రం జపించి, పెళ్ళయి సుఖంగా పిల్లలతో జీవిస్తున్న సుమంగళవారికి దోసతో ఈ (శివలింగ) వెన్నె చేర్చి దానం చేస్తే మంచి సంబంధాలు కుదురుతాయి.

బృగు ముని అందజేసే అనుగ్రహం

పురావస్తు పరిశోధకులు, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, సప్తకన్యల ప్రశ్నం, గవ్వల జ్యోతిష్యం, భూమి వాగుల నిపుణులు, బోరుబావి కర్మికులు, బావీ తవ్వోరులు మొదలైనవారు ముఖ్యంగా బ్రహ్మా చేత సృష్టించబడిన బృగు మునిని ప్రార్థించాలి. ఈ మునిని శిలా విగ్రహం ఉత్తిరమేరూరు శ్రీ సుందర పరదరాజపెరుమాళు కోవెల్లో మాత్రమే ఉంది. తామర వుష్పం మీద తవ భంగిమలో ఆసీసులై ఉన్నారు. వీరిని నమస్కరించి నేతి దోసనూ పెద్ద నీరుల్లి చట్నీ పేదవారికి దానంగా ఇస్తే ఈ ముని యొక్క ఆశీస్సులను పొంద కలుగుతారు.

నిరంతర ఉద్యోగం పొందడానికి

రెండు ధ్వజస్తంభాలు వున్న ఆలయాన్ని పిదరుల దు:ఖాలను తీర్చే ఆలయమని పెద్దులు పేర్కొనేవారు. ఈ ఆలయంలో తమ పూర్వీకుల కోసం వారి తిథిలో, నక్షత్రంలో చక్కెర పొంగలి, పెరుగన్నం దానం చేయడం విశేషమవుతుంది. ఈ ఆలయం పెరుమాళు ఆలయం అంటే పెరుమాళువు చేతిలో చక్రం పుచ్చుకోని ఉండ కూడదు. అది శివాలయమైతే స్వామి స్వయంభు లింగ మూర్తిగా ఉండాలి. ఈ ఆలయంలో చేసే పూజలూ సేవలూ బహు కాలానికి రానున్న జన్మాల్లో మనకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకంగా నిరంతర ధనం వర్షించే ఉద్యోగమూ, గుణవతి అయిన భార్యతో కూడిన ఉత్తమ జీవితం దొరుకుతంది.

త్రిదోషాలను తీర్చడం ఎలా ?

సాధారణంగా జీవతంలో ముట్టు దోషం, ఈర్ష్యా దోషం, అంటు దోషం మొదలైన దోషాలన్నీ స్తీలు ధరించే గాజుల్లో అంటుకొంటాయి. అందుచేత గాజులను యథావిధిగా మాటిమాటికి శుబ్రం చేయాలి. పైగా ఈ మూడు దోషాలు మనను తాకకుండా ఉండడానికి మార్గాలు పలు ఉన్నాయి. అలాయితే, ఆషాడం మాస పూర్వఫల్గుణి నక్షత్ర దినం మట్టి గాజులను తీసి వేడి నీడిలో కాస్త సేవు పెట్టి ఆరిన పిదవ ఈ గాజులను చల్లని పసుపు నీటిలో నాన బెట్టి తరువాత 21, 51, 32 అనే లెక్కలో చేర్చి అమ్మవారి చేతిలో ముడిచి గాని వేలాడదీసి గాని ఆషాడ పూర్వఫల్గుణి నాడు దానం చేస్తే పైన చెప్పిన త్రిదోషాలు తొలగి పోతాయి. కుటుంబం బాగు పడుతుంది. ఆ నాడు గొబ్బరి అన్నంతో మిరియాలు కలిసిన ఉర్లగడ్డ చిప్సు దానం మంచిది. మహిళాలకు రుతుక్రమ రోజుల్లో వచ్చే తీప్ర కడుపు నొప్పి, అలసట నుండి నివారణం కలుగుతుంది.

పదవి కోల్పోయిన రాజుకూ పరిష్కారాలు

సత్య మార్గంలో ప్రవర్తించి పాలించకుండా ప్రజలకు హింస పెట్టి ప్రజల సొమ్ములను తనవిగా చేసుకొని సుఖభోగంతో జీవించి ప్రజలచేత విసిరి వేయబడిన రాజులకు వచ్చే శాపం అతి క్రూరమైనది. ఈ శాపానికి "సనత్కమరేశ్వర భంగభూతి" అని పేరు పెట్టారు సిద్ధులు. ఈ శాపం తీరడానికి తగిన మార్గదర్శకత్వం చూపే గురువుగారు అండడం అవసరం. కాని ఇటువంటివారికి గురువుగారు లభించడం ఎంతో కఠినం. తాను బాధ కలిగించిన ప్రజలందరికీ సరైన పరిష్కారాలు చేసి దెయ్యాల సంకెల నుండి విమోచన పొంది, మళ్ళీ పుణ్యం చేసి మానవ జన్మ కలిగి మంచి జీవితం పొందడానికి సహకరించే స్థలం శ్రీసౌందరనాయకి సమేత శ్రీ సనత్కుమరేశ్వరుడు ఆలయమవుతుంది. వాస్తవికంగా ఈ ప్రాయశ్చిత్తం కోరేవారు ఈ ఆలయాన్ని వెతికీ కనుక్కొవాలి.

బయటికి వెళ్ళినవారు భద్రంగా తిరిగి రావడానికి

సాధారణంగా మనం బయటికి వెళుతున్నప్పుడు, ఇంటి నుండి బయట పోతున్నప్పుడు ఇంటిలో ఉన్నవారి వద్ద, "వెళ్ళి ఒస్తాను" అని చెప్పి భగవత్ ప్రార్థినతోనే వెళ్ళడం మంచిది. కొందరు, "వెళుతాను" అంటూ కొపంతే "రాను" అని కూడా చెప్పి వెళ్ళడం పొరపాటే.

తిరునావలూరు

అలా ఇంట్లో ఉన్నవారు ఈ మాటలను వింటే "శివ శివ రామ రామ" అని ఉచ్చిరించి దక్షిణామూర్తి నిలబడిన భంగిమలో పృశభ వాహనం మీద చేతిని ఊనుకొని దర్శనం ప్రసాదించే రూపాన్ని ధ్యానించి, "తిరునావలూరు భక్తజనేశ్వర వృశభ వాహన దక్షిణామూర్తా కాపాడు !" అని ఆర్తితో ప్రార్థంచే బయటికి వెళ్ళినవారు భద్రంగా తిరిగి వస్తారు. పన్రుట్టి, కడలూరు నుండి తిరునావలూరికి బస్సు సౌకర్యం కలదు.

ఎవరికి ఏ ద్వారం గొప్పది ?

సాధారణంగా పెద్ద కుమారుడుకు పూర్వాభిముఖంగా ఇల్లు లేదా పూర్వాభిముఖంగా సిమ్హద్వారం ఉండడం శుభకరం. పచ్చ రంగు మంచిది. పెద్ద కుమార్తెకు ఆగ్నేయాభిముఖంగా ఇల్లూ ఆగ్నేయాభిముఖంగా సిమ్మద్వారం ఉండడం మంచిది. ఉత్తరాభిముఖమైన ఇల్లు, సిమ్మద్వారం మధ్య కుమారునికి గొప్పది. ఈశాన్యాభిముఖమైన ఇల్లు, సిమ్మద్వారం గత కుమూరునికి మంచిది. పడమటాభిముఖమైన ఇల్లు, సిమ్మద్వారం గత కుమార్తెకు ముంచిది. తండ్రికి వాయవ్య ద్వారం శుభకరం. నైఋతి ఇల్లు ద్వారం తల్లికి తగినది. ఈ విధంగా ఇల్లులు కుదరడం మంచిది లేదా కనీసం ఇంట్లోని గదులు కుదరడం శుభకరం.

వస్త్ర వ్యాపారం పెరగడానికి

పస్త్ర పరిశ్రమలు, వస్త్ర వ్యాపారం, దర్చీ పని, కొద్ది కొద్ది వస్త్ర అలంకారం చేసేవారు, వస్త్ర రంగంలో ఇంజనీరింగు రంగం, పత్తి మిల్లు, జిన్నింగ్ మిల్లు వంటి పెద్ద మిల్లులు ప్రపంచం యావత్తు కలిగినవారు, పత్తి పరిశోధన కేంద్రాల్లో ఉన్నవారు, పైగా జీవితంలో మానం కోల్పోకుండా జీవించాలని అనుకుంటున్న వారందరు ప్రార్థించ వలసిన సిద్ధుడు "ఉగంతలింగ స్వామి" అనే ఉత్తముడు. వీరి జీవసమాధి ఎల్లప్పుడూ పలుకే దేవుడు. ఈ స్థలాన్ని ''సిక్కలు ఆండవరు'' అని కూడా పిలుస్తారు. నాగపట్టినం నుండి తిరువారూరు వెళ్ళే రహదారిలో సిక్కలు సింగారవేలన్ ఆలయానికి ముందు ఒక కి.మీ. దూరంలో ఉంది. తిరుకోవిలూరు మఠానికి చెందిన వేదాంత మఠం ఈ జీవ సమాధి ఆలయాన్ని నిర్వహిస్తోంది.

పేరు ప్రతిష్ట పొందాలా ?

సద్గుణాలు, సద్భావనాలే ఒకరిని పై స్తాయికి తీసుకెళ్ళుతాయి. చిన్నతనం నుండే తల్లి తండ్రులు తన పిల్లలకు ఈ పరిజ్ఞానాన్ని నేర్పాలి. ఇది తల్లి తండ్రుల ప్రథమ బాధ్యతల్లో ఒకటి. ఈ విధంగా నేర్పడం పాటు తామూ వారి మధ్య గుణవంతులుగా ప్రవర్తించి చూపాలి సుమా. ఉత్తమ గుణాలు, ఉత్తమ ఆలోచనలతో జీవిస్తున్నవారు ఈ పాటను ప్రతిదినం 108 సార్లకు తగ్గకుండా జపిస్తే కీర్తి మర్యాదలు దానంతట వెతుక్కొంటూ వస్తాయి.

వహత్యంబ స్తంబేరమ దనుజకుంభ ప్రకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభి రమలాం హారలతికామ్ |
కుచాభోగో బింబాధర రుచిభి రంతః శబలితాం
ప్రతాప వ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే ||

అన్నీ కార్యాలలో సిద్ధి చేకూర్చడం

శైవంలో పలు భాగాలు ఉన్నాయి. శైవానికి అద్యక్షునిగా అధికార నంది మూర్తులే కిరీటాన్ని ధరించి ఉన్నారు. వాటిలో అనాది శైవం, ఆది శైవం, మహా శైవం, మాహాంద్ర శైవం, వీర శైవం, పార శైవం అని ఎన్నో భాగాలు ఉన్నాయి. శైవానికి చెందినవారు తన ప్రార్థనలన్నిటినీ, వేడుకోలన్నిటిని, భవిష్యత్తు కార్యాల ప్రణాళికులన్నిట్టినీ అధికార నందులు ఉన్న ఆలయంలో చెప్పడం అవసరం. అధికార నంది ముందు తన ప్రార్థనలను పెట్టి కింది పాటను 51 సార్లకు తగ్గకుండా గానం చేయాలి.

కట్టువడం ఎట్టుం ఉఱువట్ట ముళవత్తిల్
కొట్టుకరం ఇట్ట ఒలి తట్టుం వగైలందిక్కు
ఇట్టం మిగనట్టం అవై ఇట్టవర్ ఇడం - సీర్
వట్ట మదిలుళ్ తిగళుం వణ్ తిరు ఐయారే

తమిళంలో

கட்டுவடம் எட்டும் உறுவட்ட முழவத்தில்
கொட்டுகரம் இட்ட ஒலி தட்டும் வகை நந்திக்கு
இட்டம் மிக நட்டம் அவை இட்டவர் இடம் - சீர்
வட்ட மதிலுள் திகழும் வண்திரு ஐயாறே

అని 51 సార్లు జపించి "ఐయారప్పా ఐయారు" అని మూడు సార్లు బిగ్గరగా ఉచ్చరించాలి. ఇలా బిగ్గరగా ఉచ్చరిస్తే అన్నీ కార్యాలు సిద్ది అవుతాయి.

అప్పు తిసిన వారికి ఆలోచన

భక్తి అనేది అనుభవం చేయగల వస్తువే గాని తెలుసుకోకూడనది అని అందరు వారి వారి జీవిత అనుభవాలను బట్టి మాత్రమే చెప్పగలరు. తిరుమాళు శీవుణ్ణి బ్రహ్మణ్ణి వారిద్దరిని తనతో చేర్చి దర్శనం ప్రసాదించే స్థలమే తిరుముక్కూడలు అవుతుంది. కాంచిపురం చెంగల్పట్టు మార్గంలో పాత శీవరం కొండ కోవెలకు తదుపరి నధి దాటి పోతే దక్షిణ తీరాన ఈ ఊరుకు వెళ్ళొచ్చు. ఈ ఆలయాన్ని ఈశాన్య మూలన పడమటాభిముఖ వీర హణుమంతుడు ఎంతో శక్తి గలవాడు. కనగ భూషణి అనే అద్భత జూకాలు ధరించిన విగ్రహం అవుతుంది. వీరిని ప్రార్థించి నియమం తప్పకుండా అర్చించి మురుక్కులు దానం చేస్తే ఎటువంటి అప్పులను తీర్చడానికి అవసరమైన అద్భుత శక్తి కలిగించేవారు ఈ మూర్తి. అప్పు తీసిన లోకులు ఆర్తి పొందకుండా రక్షించగల వీర హనుమంతుడు వీరే.

ఉద్యోగానికి వెళుతున్న మహిళాల శోకం తీరడానికి ..

30 ఏళ్ళ వయసు దాటి పెళ్ళి కాకుండాను తన చెల్లలు, దమ్ములు, తల్లి తండ్రుల పొట్టకూటి కొసం జీవిస్తున్న మహిళాల అవశ్యకత, స్థితిన్ని తెలుసుకొని తన స్వార్థం కోసం వారిని పనులో పెట్టి అధిక పని చేయబెట్టే యజమానులనూ, కామాంధురులనూ శిక్షించి, ఒంటరిగా జీవించలేక పోయిన మహిళాలు, తమకు హాని కలిగించినవారిని భగవత్కృప చేత శిక్షించడానికి ఒక మార్గం ఉంది. అదే శంకర తీర్థంలో (గుప్త గంగ) స్నానం చేసి రాహువూ కేతువూ కలిసివున్న స్థలంలో ప్రార్థిస్తే హాని కలిగించినవారు శిక్ష పొందడం నిజమే. దానితో కాక తాము కూడా శోకమయ జీవితంనుండి విముక్తి పొందుతారు. ఈ గుప్త గంగ నెలకొన్న స్థలం శ్రీ వాంచియం అవుతుంది. కుంబకోణం నన్నిలం మార్గంలో ఉంది. మూల విరాట్టు స్వయంభు లింగ మూర్తి, దేవి శ్రీ మంగళాంబికై.

మంచి పిల్లలను పొందాలా ?

పలు వివాహాలను ఉచితంగా తన స్వీయ సంపాదనచే జరిపితే భవిష్యత్తులో వీరి వివాహం కూడా ఎంతో కోలాహలంతోను సునాయాసంగాను జరుగుతుందనేది పెద్దుల మాట. అలాగే ప్రసవ చికిత్స ఉచితంగా చేస్తే సంతాన భాగ్యమూ సక్రమంగా ఉంటుంది అనేదీ పెద్దుల మాట. ఈ రెండు కార్యాలూ ప్రతి ఒకరు చేయ వలసిన 32 ధర్మాల కింద పడుతాయి. ఈ రెండు సద్కార్యాలను చేగొని చాలా మందివారికి సహాయం చేశారు అత్తిరి మహర్షీ అనుసుయా దేవీ. వీరికి సత్పుత్ర సంతాన భాగ్యం కలగడానికి శ్రీ నారద మహర్షని అడిగినప్పుడు వారు మీరిద్దరూ శ్రీ వాంచియం వెళ్ళి స్వయంభు మూర్తైన శ్రీ వాంచినాథుడికి ప్రార్థించి ఉద్యానవనం నిర్మించి అందులో చందన మొక్కులను నాటి బాగా పెంచితే ఉద్యాన వనం పెరిగే కొద్దీ సంతాన భాగ్యం కలుగుతుందని పలికారు. అత్తిరి మహర్షీ అనుసుయా దేవీ అలాగే చేయడంవల్ల సోముడు, దూర్వాసుడు, దత్తాత్రేయుడు మొదలైన భగవంతుడి అవదారమూర్తులే వారి పిల్లల కింద పరిణమించారు. సంతాన భాగ్యాన్ని కోరే దంపతులు ఇలా చేస్తే దైవీ పిల్లలను కలగడం నిశ్చయం.

కాశికి మించిన శ్రీవాంచియం

ఉత్తర భారతానికి వెళ్ళి నెమ్మది కోల్పోయి తిరిగీ వచ్చిన వారు అనేకులున్నారు. ఎందుకంటే కాశికి తీసుకువెళ్ళేవారూ, అక్కడికి పండాలూ శాస్త్రీలూ మనకు వారి భాష తెలియదని ఎరిగి చేస్తున్న అక్రమ కార్యాలూ మనకు కలిగించే హాని అనేకం. దేనికైనా డబ్బు కోరి దోపిడీ చేస్తారు. అనేకులు ఈ విషయాల పై నోరు విప్పడం లేదు. "గంగా దేవి మాత్రం గొప్ప పునిత వది" అని మాత్రమే చెప్పి నోరు మూసుకొంటారు. పైగా తెలుగువారు కుడా ఉత్తర భారతవాసుల వలె నటించి తప్పుకొని పోతారు, మీరు ఏదైనా సహాయం అడిగితే. ఇటువంటి సమస్యలను అనుభవించుకొంటూ మీరు కాశికి వెళ్ళి రావాలా? కాస్త ఆలోచించండి. ఉత్తర దేశ కాశి కంటె గొప్ప అనుగ్రహం వర్షించగల స్థలం దక్షిణ తమిళ దేశంలో ఉంది. అదే శ్రీ వాంచియం. కుంబకోణం నన్నిలం రొడ్డులో ఉంది. ఈ క్షేత్రంలో మరణించేవారి చెవుల్లో శివుడే పంచాక్షర మంత్రాన్ని ఉచ్చరిస్తారు. అంతేగాక ఉత్తరదేశ కాశిలో కష్టాలూ ఇబ్బందులూ దు:ఖాలూ కలిగించినవారికి ప్రాయశ్చిత్తం అందించగల స్థలం ఇది ఒకటే. అందరూ శ్రీ వాంచియం వెళ్ళి గుప్త గంగలో స్నానం చేసి పిదరుల రుణం తీర్చండి. ఉత్తరదేశ కాశి కంటే అధిక ఫలాలు పొందండి.

పాఠశాలకు వెళ్ళిన పిల్ల భద్రంగా తిరిగి రావడానికి

ప్రస్తుతం తల్లి తండ్రులు పిల్లలను పాఠశాలకు పంపి వేసి భయంతోనే ఉంటున్నారు. ఎందుకంటే ఒక చిన్న రిక్షా లేదా వేన్ ఆటో వంటి వాహనాల్లో పిల్లలనూ వారి సంచులనూ ఇమిడి వేసుకొని పోవడమే కాక రద్దీగా ఉన్న వీధుల గుండా వెళుతున్నప్పుడు ఎటువంటి ఆపద సంభవించ కూడదని తల్లి తండ్రులు భగవంతుణ్ణి ప్రార్థన చేయని రొజు లేదు. పైగా పాఠశాలలో ఒక పిల్ల మరో పిల్లను హఠాత్తుగా త్రోసి వేయడంతో రానున్న ఆపదనుండి హాని కలగకుండా ఉండడానికి పెద్దులు పలు పద్దతులు పేర్కొన్నారు. అందులో ముఖ్యమైనది మనం మన పిల్లలను హోటలు బీచుకు తీసుకు లేక పొయినా తల్లి తండ్రులు ఈ ఆలయానికి పిల్లలను తీసుకు వెళ్ళి స్వామి యొక్క అనుగ్రహ నేత్ర దృష్టి కలిగి కింది మంత్రాలను పిల్లలు కంఠస్తం చేయమని చెయ్యడం అవసరం. ఈ స్థలానికి పేరు తిరుపార్కడలు. చెన్నై బంగళూరు రోడ్డులో కావేరిపాక్కం పోలీసు స్టేషను తగ్గర ఎడమ పక్కలో రెండు కి.మీ. దూరంలో ఉంది. ఆర్కాడు, వాలాజా, చిత్తూరు వెళ్ళే బస్సుల్లో వెళ్ళి కావేరిపాక్కంలోని తిరుపార్కడల్లో వెలసివున్న శ్రీ ప్రసన్న వెంకటేశునికి దర్శించ కలుగుతారు. పిల్లలు కంఠస్తం చేసి ప్రతిదినమూ తల్లి తండ్రుల సమక్షంలో అప్పుడప్పుడు ఉచ్చరించమని చెప్పవలసిన మంత్రం.

నమో భగవతే తుభ్యం పుషాయ మహాత్మనే
హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే

ముందు వచ్చి సహాయం చేసే కలేలింగరు

మనకు ఒకరు సహాయం చేయడానికి వస్తారంటే అది భగవంతుని కృపాకటాక్షంతోనే జరుగుతుందని మనం స్పష్టంగా అర్థంచేసుకోవాలి. కొన్ని సమయాల్లో మనకు సహాయం చేయడానికి అనేకులు ముందుకు వచ్చినా చాలా మంది జనులు అడ్డం పెట్టి వాటిని పాడు చేస్తారు. వారు సహాయం చేయబోతున్నవారి భార్య గాని, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, మామగారులు గాని ఉండవచ్చును. లేక వారి కర్త ప్రతినిధులు గాని ఉండవచ్చును. ఈ విధంగా మనకు వచ్చే సహాయానికి అడ్డం పెట్టుతున్న వారిని నిశ్చేష్టుడి కింద చేసి మనకు రావలసిన సహాయాన్ని యథావిధిగా పొందడానికి ఆధ్యాత్మికంగా పలు మార్గాలున్నాయి. అందులో ఒకటే పాపనాశ శివుడు చూపే మార్గం. తిరునెల్వేలి జిల్లా అంబాసముద్రం కుండా ఈ ఆలయానికి వెళ్ళాలి. ఆ ఆలయానికి స్థల పృక్షం కలే చెట్టు. కింద మూడు చిహ్లాలతో త్రికలే నిలబడి ఉంటుంది. దాని కింద భగవంతుడైన త్రికలే లింగరు వెలసివున్నారు. వీరికి మొక్కుబడి మనకు సహాయం చేసేవారి కార్యాలకు ఎవ్వరూ అడ్డంగా ఉండకూడదని ప్రార్థించి ఇడియాప్పం దానం చేసి లోపలి వస్త్రాలు దానం చేస్తే అడ్డం పెట్టే వారిని తొలిగిస్తారు శివుడు. సహాయం దానంతట కుదురుతుంది.

మంచి కంటి చూపు

జీవితంలో ఎనిమిది జాన శరీరానికి శిరసే ప్రధానమవుతుంది. అందులో చర్మం నోరు కళ్ళు ముక్కు చెవి ముఖ్యమైనవి. అయతే కళ్ళుతో కార్యాలన్నిటిని చేసేది మానవ జాతి. అందుచేత కంటి చూపు అధి ముఖ్యమవుతుంది. ఈ కళ్ళకు ఎటువంటి కష్టాలు రాకుండా రక్షించడానికి ఆధ్యాత్మికంలో అనేక మార్గాలున్నాయ. వాటిలో ఒకటే దేవదానపట్టి వెదురు కామాక్షిని అనుగ్రహం అవుతుంది. పెరియకుళం నుండి 12 కీ.మీ. దూరంలో ఊరికి వెలుపలి వనప్రాంతంలో వెలసివున్నది వెదురు కామాక్షి అమ్మవారు. ఈ ఆలయంలో మూడు పెద్ద ఆవునేతి దీపాలు రాత్రింపవళ్ళు వెలుగుతున్నాయి. ఈ నేతీ దీపాలకు నేతి దానంగా అర్పిస్తే కంటి సమస్యలు తీరుతాయి. కంటి చూపు పెరుగుతుందనేది ఆచరణకు వచ్చిన అనుభవం అవుతుంది. కళ్ళను రక్షించడానికి తగిన ఉత్తమ దారిదే.

మూల నక్షత్ర మహిమ

జీవితంలో మనం ఎందరో మందివారిని చీవాట్లు పెట్టి ఉన్నాము. నోటికొచ్చినట్టు తిట్టివున్నాము. అవన్నిటినికి మనవద్ద లెక్క ఉందా ? ఆలోచించి చూడండి. పలురకాల పలుకులను మాట్లాడి, చెడు విషయాలకు ముఖ్యత్వం ఇచ్చి అనేక మంది వారిని చీవాట్లు పెట్టి, పలుకులను పడవేసి ఎవరికి అపచారం చేసివేశాము తెలుసా ? సరస్వతి దేవికే అపచారం చేసిపెట్టాము. దీనికి మనం పరిష్కారాలు వెతికే తీరాలి. అందుకు ఒక దారి ఉంది. అదే మీరు ప్రతినెల మూల నక్షత్ర నాడు మౌన వ్రతం అనుష్టించి సరస్వతి శ్లోకాన్ని మనసులోపలే జపిస్తే వాగశుద్ధి కలుగుతుంది. సరస్వతి దేవికి ఇష్టమైన నక్షత్రం మూలం అవుతుంది. పైగా ఉపవాసమూ మౌనమూ కలిసితే ఆధ్యాత్మికంలో మనస్సు అధికంగా లీనమవుతుంది. తిరుచ్చి లాల్గుడి సప్తరిషీశ్వరుడి ఆలయంలో శ్రీ వీణాదక్షిణామూర్తుడూ శ్రీ యోగదక్షిణామూర్తుడూ శ్రీసరస్వతి దేవీ వలసివున్నారు. ఈ అపూర్వ దేవుల సంగమంగా ప్రకాశించే ఈ ఆలయంలో మూల నక్షత్ర నాడు ఉపవాసమూ మౌన వ్రతమూ ఆచరించి పేద పిల్లలకు వెన్న రాసిన రొట్టె (bread) దానంగా ఇవ్వడంవల్ల న్యాయవాదులు, కమిషన్ ఏజంట్లు, తరగరులు, Medical representatives వంటివారు తమ ఉద్యోగాల్లో అభివృద్ధి పొందుతారు.

వజ్ర వ్యాపారుల క్షేమం

జీవితంలో వజ్ర ముక్కుపుడక, కమ్మలు, కాజులు, జూకాలు, చెవిపోగుల వంటి వాటిని అందరూ ధరించలేరు. వారి వారి నక్షత్ర, గ్రహ రాశికి తగినట్టే ధరించాలి. కచ్చతమైన వజ్రంగా లేక పోతే ఎంత ఆదాయం వచ్చినా అంతా ఖర్చై పోతుంది. మనవడు మనుమరాళ్ళు కోడలు అల్లుల ద్వారా వ్యర్థ ఖర్చులుగా మీ ఆదాయం తగ్గి పోతుంది. అందుచేత బజ్రం ధరించాలంటే కొడుముడి శ్రీ మకుటలింగరు సన్నిధిలో వ్రతం అనుష్టించి వజ్ర ఆభరాణలను స్వామి పాదాలపై ఉంచి పూజించి ధరించుకుంటే వజ్రంతో కష్టాలు కుదరవు. ప్రపంచం యావత్తు ఉన్న వజ్ర వ్యాపారులు ఈ స్థలంలో మొక్కుబడి వ్రతం అనుష్టించి వ్యాపారం చేస్తే దు:ఖాలు నష్టాలు పొందరు. కరూరు నుండి 24 కి.మీ. దూరంలో ఉన్నది తిరుపాండి కొడుముడి అనే స్థలం. అలాగే ఎర్ర రాళ్ళు గొప్ప ఫలాలు కలిగించడానికి అనుగ్రహించే స్థలం తిరుఅణ్ణామలై అవుతుంది. మరకత పచ్చ విశేషమైన ఫలాలు ఇవ్వడానికి అనుగ్రహం సాధించే స్థలం తిరుఈంగోయ్మలై అవుతుంది. మాణిక్యం గొప్ప ఫలాలు వర్షించడానికి అనుగ్రహించే స్థలం రత్నగిరి (శీవాయమలై) అవుతుంది. నీలమణి రాశ్ళు గొప్ప ఫలాలు ఇవ్వడానికి అనుగ్రహంచే స్థలం తిరుకుట్రాలం (పొతియమలై).

రోగాలను నివారించే మార్గాలు

మౌనంగా ఉన్న పొరుగింటివాళ్ళతో కారణం లేకుండా తగువు పెట్టితే మనకు రొగాలుగా కొన్ని రోజుల తరువాత వస్తాయి. ఎప్పుడు ఎవరింటికి వివాహ పత్రిక వస్తుందని ఎదురుచూస్తూ అలా వచ్చిన వెంటనే మూడు వేళకూ వెళ్ళి చక్కగా తినివేసి వారికి సరైన బహుమతి ఇవ్వక పోయిన వారికి కొంత కాలం గడిచాక వైద్య ఖర్చులు రావడం అనేక మంది వారికి సహజమై పొయింది. వ్యర్థంగా వివాహ బాకీలను పెంచుకోకండి ! సాధారణంగా వివాహాల్లో చాలా మందివారిని ఆలోచనాలూ, వ్యాకులతలూ వారు పెట్టే ఆహారాల్లో ఉండిపోయి మనను దాడి చేస్తాయి. అందుచేత వీలయనంతమట్టుకు వట్టి చేతితో వివాహాలకు వెళ్ళకుండా వివాహ పత్రికలను పూజ గదిలో పెట్టి వివాహ దినం నాడు పూజించ వలసిన స్తుతి ఇది. ఈ స్తుతిని జపించి దంపతుల క్షేమ జీవితంకోసం ప్రార్థించండి. అది చాలు. మిమ్ములనూ వ్యాధులు తాకవు.

నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయ
సదాభక్తకార్యత్యద్యతా యార్తి హంత్రే
విదాత్రాది స్వార్గస్థితి ధ్వంసకర్త్రే
గదాశంఖ పద్మాది హస్తాయతేస్తు

ENT వైద్యుల మేలు

పుదుకోట్టై పొన్నమరావతి రోడ్డునుండి 15 కి.మీ. దూరంలో వెళ్ళారు తీరంలో పేరైయూరు నాగనాథస్వామి కోవెల ఉంది. స్వామి సన్నిధికి ఎదుట ప్రకృతిపరంగా అమరిన తటాకం ఉంది. దీన్ని పుణ్య పుష్కరిణీ అంటారు. ఈ పుష్కరిణీ ఎంతో శక్తి గలది. ఈ పుష్కరిణీ చుట్టు అనేక నాగ ప్రతిమలు ఉన్నాయి.

పేరైయూరు శివాలయం

ఈ తటాకాన్ని చుట్టి వచ్చి ప్రార్థించి ప్రతిదినం రాహు కాల సమయంలో పూజలు చేసి స్ఫటిక చక్కెర కలిసిన పాలు నిరంతరంగా దానం చేస్తే చెవి సమస్యలు ఉన్నవారు, ENT వైద్యులు పైగా గని ఉద్యోగ యజమానులు, ఉద్యోగులు, సంగీత వాయిద్యాలు తయారీదారులు, ఆ రంగంలో ఉన్నవారు పెద్ద మేలు పొందుతారు. చర్మకి సంబంధించిన వ్యాధులు నివృత్తి అవుతాయి.

కోవెల అర్చకుల క్షేమం

కోవెల నిర్వహణ రంగంలో ఉన్నవారూ, అర్చకులు, శివాచార్యులు, పూజారులు తాము చేస్తున్నది పునీతమైన పని అనే ఎరుక లేకుండా అందులో ఎంత డబ్బు ఆదాయంగా వస్తుంది అని అనుకోవడాన్నే ప్రథమ కర్తవ్యముగా భావిస్తారు. ఈ ఆలోచన ఎప్పుడు మారుతుందో ఆ నాటినుండే జీవితంలో సుఖం అనుభవిస్తారు.

దక్షిణన ఓ గంగ

గంగలో దాన ధర్మాలు చేసిన పుణ్యను దక్షిణ భారత దేశంలోనే పొందడానికి మార్గాలు తెలిపి ఉన్నారు సిద్ధులు. అందుచేత గంగకు వెళ్ళి దానం చెయ్య లేదని ఎవ్వరూ ఆర్తి పడ వద్దు. గంగకు వెళ్ళి రావడం అనేది ఇప్పుడు సునాయసంగా ఉండినా దక్షిణ దేశంలోనే గంగ ఫలాలను పొందేందుకు ప్రార్థించారు ఒక ఉత్తమ మహర్షి. వారే రోమస ముని. ఈ రోమస మునికి వరం అందించిన మూర్తి శ్రీవరమూర్తి ఈశ్వరుడు. వీరు అనుగ్రహించిన స్థలం అరియతురై. అందుచేత ఈ అరియతురై వెళ్ళాలంటే చెన్నై పొన్నేరి తాలూకలోని కవరపేట్టై RMK ఇంజినీరింగ్ కాలేజికి ఎదుట వెళ్ళే కీళ్ముదలంపేడి మట్టి రోడ్డు నుండి మూడు కి.మీ. దూరంలో ఉన్నది అరియతురై. ఉత్తర దేశ గంగను చూడడానికి పయనం తరగరుల ద్వారా ఎన్నో కష్టాలతో కాశి వెళ్ళడం కంటే ఈ శ్రీ వరమూర్తి కోవెలకు వెళ్ళి దాన ధర్మాలు చేస్తే అధికంగా అవలీలగా పుణ్యం పొంద కలుగుతారు.

     
om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam