కుళలుఱవుత్యాగి
   
 
 
జరిగినవే జరగేవిగా జరుగుతున్నాయి !

ఓం శ్రీ వల్లభ గణపతి కృప
ఓం శ్రీ అంగాళ పరమేశ్వరి కృప
ఓం శ్రీ సద్గురు శరణం

 
శ్రీ
సద్గురువుల
అమృత
పలుకులు
 
     
జీవితంలో విజయన్ని సాధించే మార్గం

వినాయకుని పేరు గలవారూ వినాయకుణ్ణి ఆరాధించేవారూ జీవితంలో కార్యసిద్ధి పొందాలంటే పౌర్ణమి గడచిన నాలుగు రోజుల తరువాత వచ్చే సంకటహర చవితి వ్రతాన్ని నియమం తప్పకుంటా నిర్వర్తించటం అవసరం. ఈ నాటి రాత్రి తొమ్మిది గంటల తరువాత గణపతికి దర్శనం చేసి 108 పూర్ణ వుండ్రాలను వినాయక మూర్తికి నైవేద్యం పెట్టి బీదసాదలకు దానం చేయడం వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి.

మాఘ మాసం వచ్చేది మహా సంకటహర చవితి. పైగా సంకటహర చవితీ మంగళ వారమూ కలిసి రావటం చాలా గొప్పది. పైన చెప్పన పద్దతిలో విడవకుండా 12 సంవత్స్రాల కాలం సంకటహర చవితి వ్రతం నెరవేర్చి రాత్రిన విణాయక పూజ చేస్తే మనసు స్థిర వైరాగ్యం పొంది ఏ కార్యాన్నూ ధైర్యంగా చేసి జయం పొందుతారు.

కంప్యూటరు శాస్త్ర రంగంలో బాగా రాణిస్తాలా ?

నిండు బుద్ధి గలవారికి అధిక ఆశ కూడదు. ఉదాహరణకు ఒకరికి కంప్యూటరు రంగంలో నిండు సామర్థయం కలిగితే దానితో ఆశ కూడా పెరుగుతుంది. ఎలా? తన కంటె ఇతరులకు కంప్యూటరికి సంబంధించిన విషయాలు తెలిసివుండటం కూడదని కొత్త కొత్తగా అనేక కంప్యూటరు సాధనాలను కొనుకోలుచేసి అబద్ధమూ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. దీనికి కారణం బుద్ధితో అధిక ఆశ తోడుపోవడమే. అందువల్ల ఆశగలవారితో బుద్ధి చేరితే తమను తామే మోసం చేస్తారు. వీరి ఆశ, చేసే చెప్పే అబద్ధమైన చర్యలచే తమకూ ఇతరులకూ కష్టాలు రాకూడదంటే, స్వామి అమ్మవారుల మధ్య ఉండే దక్షీణామూర్తిని పూజించడమే అటువంటి వారికి తగిన దారి.

ఇట్టి ఆనుగ్రహం చేయగల దక్షిణామూర్తి ఎక్కడికి ఉన్నారు ?

ఓమాంపులియూరు శివాలయం

ఓమాంపులియూరు అనే పుణ్య స్ధలంలో శ్రీ పుష్పలతాంబికై శ్రీ ప్రణవపురీశ్వర మూర్తి వారుల మధ్య ప్రకాశించే శ్రీ దక్షిణామూర్తి స్వామికి దర్శించి జీడిపప్పు కలిసిన నిమ్మరస అన్నం దానం చేస్తూ వచ్చే ఆశ తగ్గి పోయి బుద్ధి వికాశం కలుగుతారు. అన్నదానం ఉచిత వైద్య సదుపాయాలు సమాజంలో పెరిగి మానవాళికి క్షేమం మాత్రమే కలిగించే విజ్ఞాన అభివృద్ధి జరుగుతుంది. చిదంబరం నుండీ కాట్టుమన్నారు కోవెలనుండీ ఓమాంపులియూరికి బస్సు మూలంగా వెళ్ళొచ్చు.

అత్తగారుల క్షేమం కోసం

బుద్ధి వెరిగివున్న ఈ నాటికి పెద్ధవారైన అత్తగారులు కూడా తమ కోడలను తమ కుమార్తెలనుకొనే భావన చాలా తగ్గి పోయింది. కోడలను కారణం లేకుండా శపించడం తిట్టడం ఇబ్బంది పెట్టడం వంటి చర్యలచేత బాధబడిన కోడలు, మంచి అల్లులు ఈ కష్టాలనుండి విమోచనం కలగేందుకు సిద్ధ పురుషులు చాలా సూచనలను పేర్కొన్నారు. వాటిలో ఓ సులబమైన మార్గదర్శకంగా అత్తగారులు గౌరి తీర్థంలో స్నానం చేసి వారి జుడ్డునుండి కిందపడే నీళ్ళ చుక్కలు తమ పక్కనే వున్న కుమారులు కుమార్తెలు కోడళ్ళు అల్లులు పై పడే విధంగా వారందరిని నిల బెట్టి అత్తగారుల కురులను కదిపి ఆరబెట్టడంవల్ల మామగారులూ అత్తగారులూ ఇచ్చిన శాపాలు మాయమైపోతాయి. తరువాత ఆ స్ధలంలో చక్కెర పొంగలి పులిహోర అన్నదానం చేయడం అవసరం. ఈ గొప్ప తీర్ధమే ఓమాంపులియూరు శ్రీ వ్యాఘ్రపురీశ్వర దేవాలయంలోని తీర్ధం అవుతుంది. కుమారుడు కుమార్తె అల్లుడు కోడళ్ళు ఇబ్బందుల నుండి విమోచనం పొందడమే కాక తప్పులు చేసిన అత్తగారులు మామగారులకు గొప్ప ప్రాయశ్చిత్తాన్ని ప్రసాదించేదే ఓమాంపులియూరి తీర్ధం.

నడి సముద్రములో ఎవరు సహకరిస్తారు ?

జాలరులూ సముద్రములో పయనించేవారూ ఓడ పడవల మీద పయనించే పర్యటకులూ పడవల ఇంట్లో నివశించేవారూ పడవల పోటీలో పంచుపాల్కొనేవారూ పడవల్లో పయనించి తమ ఊరికి వెళ్ళవలసిన వారూ తమ జీవితానికి ఎటువంటి ఆపద కలగకుండా బాగా ఇంటికి తిరిగీ వెళ్తామనుకుంటే ఆధ్యాత్మికంగా రాక ముందు కాపాడే మార్గాన్ని సిద్ధ పురుషులు చూపివున్నారు. అనగా, ఓడల్లో పడవల్లో యంత్ర పడపల్లోకి ఎక్కే ముందు "పంచనదీశ్వరా రక్షించు" అని ఉచ్చరిస్తే, వాళ్ళను కాపాడటం కోసమే కురల్కొడుత్త విణాయకుడు (గొంతిచ్చిన విణాయకుడు) నిరీక్షిస్తున్నారు. ఎక్కడ ? తిరువైయారు పంచనదీశ్వర వారి దేవాలయంలోని ఆట్కొండారు సన్నిధి దగ్గరనే. వీలయినప్పుడెల్లా ఆ విణాయకునికి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టి అన్నదానం చేయండి.

వదిలి పోయిన సొత్తును తిరిగీ పొందడం

వస్తువు సాయం, డబ్బు సాయం, ఆస్తిపాస్తుల గురించి రావలసిన న్యాయమైన జడ్జ్మెంట్లు ఇంటికే రావలంటే మీరు ఒక ఆరాధనాన్ని నిర్వర్తించాలి. సిద్ధులు దేవతులు మహాత్ములు నివశించి జీవించిన పాత వరప్రద జమ్మి చెట్లను అరుదుగానే చూడ వచ్చు. అటువంటి పాత జమ్మి చెట్టు నాగపట్టిణం జిల్లా లోని తరంగంపాడి తాలూకలో పొరైయారు సంగరంపంతలు అనే ఊళ్ళ మధ్య ఎడుత్తుకట్టి సాత్తనూరు ఉన్నది. అక్కడికి ధర్మ సాస్తతా వారు తామే ఆలయాన్ని నిర్మించి కొలిచిన విణాయకుడు ఉన్నాడు. ఆ దేవాలయానికి దక్షిణ వైపున చాలా పాత జమ్మి చెట్టు ఉన్నది. విజయ దశమి నాడు విణాయకునికి దర్శనం చేసి ఈ జమ్మి చెట్టుకు 108 సార్లకు తక్కగుండా ప్రదక్షిణ చేసి పెద్ద సనగలు కలిసిన అన్నం దానం చేసి మంచి ఆలోచనతో ఇంటికి తిరిగి వస్తే న్యాయమైన రీతిలో రావలసిన వస్తువులు మన ఇంటికి వస్తాయి.

సురక్షిత విమాన పయనం కోరుతారా ?

తిరువెణ్కాడు పెరుంపళ్ళం తిరునళ్ళారు వీటికి మధ్య ఉన్నది పాసికుళం విణాయక ఆలయం. ఈ ఆలయానికి ఈశాన్య మూలన ఒక గొప్ప రావి చెట్టు ఉన్నది. ఈ రావి చెట్టు గొప్ప శక్తి గలది. ఈ రీవి చెట్టు ఆకాశ స్వరూప శక్తిని కలిగి ఉండడం వల్ల విమాన పయనం చేసేవారు విమాన పైలట్లు, విమాన విడి భాగాలు, విమాన ఇంజినీరింగ్ కార్యాల్లో కలిగివున్నవారు వారికి ఎటువంటి ఆపద రాకూడదనుకుంటే ఇక్కడికి విణాయకునికి దర్శించి రావి చెట్టుకు మంగళ వారం, గురు వారం, ఆది వారాల్లో పగలు 108 సార్లకు తగ్గకుండా ప్రదక్షిణ చేసి బాదం కలిసిన పాల పాయసం టొమాటో అన్నం దానం చేస్తే విమానం మూలంగా దు:ఖాలు రావు.

జయం యొక్క రహస్యం

జీవితంలో విజయం పొందడానికి మూడు నియమాలను నిర్వర్తించాలి. ఒకటి నిదానం, రెండు అలసట రహిత ప్రయత్నం, మూడు భగవంతుని మీద విశ్వాసం. ఈ మూడూ మీకు కావలంటే కింది మారగదర్శకాలను స్ధిరంగా అనుసరించండి.

ప్రతిదినం కలుసుకొనేవి

సుఖమూ దు:ఖమూ వీటిని చూచి చురుకుతనం విడవద్దు

ఎన్నడూ వెళ్ళనివి

కీర్తి అపకీర్తి దీనికోసం ఆశించ వద్దు

పోతే రానివి

మానం ప్రాణం మీరు స్ధిరంగా ఉండండి

మనను అన్వేషణ
చేసుకొని వచ్చేవి

యవ్వనం వృద్ధాప్యం మైకం పడకండి

మనను వెన్నంటేవి

పాపం పుణ్యం అజాక్రత చేయ వద్దండి

మనను పాలించేవి

ఆశ దు:ఖం బానిస కాకండి

వదిలి పెట్టనివి

ఆకలి దబ్బిక ఎవరిన్నీ మోసం చేయకండి

మనను విడవకుండా
ఇబ్బంది చేసేవి

బంధం అభిమానం పిచ్చి పడ వద్దు

తనను తానే నాశనం చేసేవి

అసూయ కోపము అహంకారం వద్దండి

వివక్షత లేకుండా కలుసుకొనేవి

జననం మరణం తెలిసి కూడా ఇతరులకు ఇబ్బంది పెట్టకండి

మీ ఛాతి మీద చేయి పెట్టి చెప్పండి ఇవన్నీ మీకు తెలియదని. మీకు బాగానే తెలుసు. మీరు ఆనుభవిస్తున్న సుఖం దు:ఖాలు మీకు తెలిసే జరుగుతున్నాయి. అందువల్ల గురువు భగవంతుని మీద నమ్మకం అవసరం. ఇంకా తెలుసుకోలేక పోయినవన్నీ తెలుస్తాయి. అర్థం చేసుకోలేక పోయినవన్నీ అర్థమవుతాయి.

విదేశం వెళ్ళినవారు బాగా తిరిగీ రావడానికి

బర్త విదేశానికి వెళ్ళి తిరిగీ రాక పొయినా, మన దేశను కాపాడే పని నిమిత్తం యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు శత్రువుల ఇబ్బందితో అపహరించబడి నిక్షిప్తమై ఉండినా ఆపద లేకుండా తిరిగి రావడానికి ఒక మార్గం ఉన్నది. వళ్ళియూరిలోని కొండ గుహ మురుగ స్వామి వారికి విడవగుండా చేతితోనే అరగ దీసిన చందన గంధం అర్పించి దానిని ప్రసాదంగా తీసుకొని ఆ చందనాన్ని ఉపయోగంచి వస్తే ఈ ఫలాలు తప్పకుండా వస్తాయి. పలువిధమైన కార్యాల కారణాలవల్ల ఇతరులకు తెలియనే నిక్షీప్తమైనవారికి మంచి దారి చూపనందుకే గుహ మురుగ స్వామి వారు ఇక్కడ నిరీక్షిస్తున్నారు. వారిని శరణు పొంది క్షేమం పొందండి.

సంతాన భాగ్యం కలగడానికి

సంతాన భాగ్య వరాన్ని ప్రసాదించడానికి పలు మునులు పలు విధమైన తపస్సు చేసి అనుగ్రహం పొందారు. వారిలో తొమ్మిది విష్ణువు రూపాలను తవ శక్తితో స్థిరం చేసి సంతాన భాగ్య వరాన్ని ఇచ్చే వరం గలవారే బృగు ముని.

ఉత్తిరమేరూరు దేవాలయం

ఈ ముని శ్రేష్ఠను ప్రార్థించేవారి పూర్వజన్మ కర్మ ఫలితాలను నివర్తించి సంతాన భాగ్య వరం పొందేందుకు సహకరిస్తారు. వారు కొలిచిని తొమ్మిది విష్ణువు రూపాలతో తాము కూడా నెలకొనే స్థలం ఉత్తిరమేరూరు ఆలయం. ఈ బృగు ముని తనను మనసారా ప్రార్తించే వారీ ఇక్కడికి దాన ధర్మాలు చేసేవారీ ప్రార్థనలను తొమ్మిది విష్ణువు మూర్తులకు సమర్పిస్తారు. ఎందరు నిజంగానే ప్రార్థన చేస్తారో వారందరికీ ఇక్కడికి విష్ణు మూర్తి చెవి ఒగ్గేవారు.

మంచి జీవితానికి సిద్ధుల సూచనలు

మన్నించడానికి కూడా ఒక పరిమితి ఉంది. విడవకాండా మన్నిస్తూనే ఉంటే మన్నింపు అనే మాటకు అర్ధం లేక పోతుంది. మనను చుట్టు తప్పులు జరుగుతూ ఉంటే విడవకుండా మన్నించడాన్ని ఆపు చేసి తప్పుచేసేవారిని దూరములో పెట్టి వారి సంబంధాలను వదిలి పెట్టడం మంచిది. వీటిలో ఏ కర్మ ఫలాలకు ఏది చెయ్యాలో వాటిని సిద్ధపురుషులు సపష్టంగా అందించి వున్నారు.

1. కుటుంబం జరపడానికి కావలసిన డబ్బు కలిగితే చాలు అనే ఆలోచన ఆరంభంలో వచ్చే గొప్ప జ్ఞానం అవుతంది. ఈ విధంగా ప్రారంభించిన డబ్బు మీది ఆశ అధికరిస్తూ ఉంటే అన్నిటినీ ధర్మం చేయాలి.

2. భూమి పట్ల ఆశ వచ్చి దానిని ఎక్కువగా తీసుకోవాలని ప్రయత్నం చేసేటప్పుడు సొత్తు అన్నిటినీ బీదవారైన బంధులకు దానం చెయ్యాలి.

3. స్త్రీభోగంతో కామదేవుని కర్మ పరిమితిలో చిక్కుకున్నప్పడు కుట్రాలంలోని జలపాతంలో ప్రశాంతంగా కూర్చుని ఉండండి.

4. దానితో కూడా ప్రభావం తగ్గలేదంటే కార్తిక మార్గశిర మాసాలలో రుద్రప్రయాగలో కూర్చోండి.

5. పని అధికంగా ఉన్నప్పుడు పిల్లలు ఇబ్బంది పెట్టితే సమీపంలోని ఆలయానికి వెళ్ళండి.

6. భర్త యెక్క అశ్రద్ధతో కుటుంబం పాడైపోతున్నప్పుడు ప్రేమకు బానిస కాకుండా తల్లి తండ్రుల సెలవు తీసుకొని ఎవరితో చెప్పకుండా ఎక్కడికో దూరంగా వెళ్ళి పోవడం మంచిది.

7. అత్తగారు మామగారు కోడలు వారియందు అర్ధం చేసుకోలేక పోయిన స్థతి ఏర్పడితే తగవు లేకుండా వదిలి ఉండడం మంచిది.

8. డబ్బు చాలీ చాలని పరిస్థితిలో కుటుంబంలో ఖర్చు అధికరిస్తే గౌరవాన్ని తగ్గించుకొని పార్ట్ టైం పని చేయడం మంచిది.

9. మన పట్ల ప్రేమ పెట్టినవారు చస్తే, వారు చచ్చి పోయిన తిథిన తర్పణం అన్నదానం చేయడం మంచిది.

10. మనిషికి తగిన గౌరవం దొరకక పోతే ఆ చోటనుండి దూరంగా వెళ్ళి పోవటం మంచిది.

11. కోపంతో ఓర్పు కోల్పోతే నీ చిన్నతనంలోని ఛాయాచిత్రాన్ని చూడు. ఓర్పు వస్తుంది. పండి పోయిన వయసులోనూ మీ చిన్నతనంలోని ఫోట్డోను మాటిమాటికి చూస్తే ఓర్పు పెరుగుతుంది. అందువల్ల అందరీ ఇంట్లలో వారివారి చిన్నతన పటాలను వ్రేలాడతీసి పెట్టండి.

12. అంతుమీరిన ఉత్సాహంతో మనసులో తీవ్ర ప్రభావితం పెరిగి వెర్రి ఏర్పడితే పచ్చని వెల్లుల్లిని కళ్ళలో ఉంచండి. వెర్రి తగ్గి పోతుంది.

13. నిజమూ కూడా కొన్ని వేళ్లో కాలుస్తుంది. అప్పుడు భగవంతుని వద్ద వెళ్ళి విలపించండి.

ఒంటరితనానికి గొప్ప సహాయం

అహర్నిశలు వంటరిగా వాహనాలు నడిపే తోలేవారులు, ప్రయానం చేసేవారు హాయ్గా ప్రయానం చేసేందుకు కాపలా దైవంగా వచ్చి సహకరించే భైరవ మూర్తి అద్భుతంగా వెలసి వున్న స్థలమే అరియతురై అవుతుంది. దానితో కాక గాలి చేష్ట దుష్ట దెయ్యాలు, ఛాయా చేష్ట మొదలైన కష్టాల నుండి నివారణ పొందేందుకు శ్రీవర మూర్తి శ్రీభైరవ స్వరూపంలో ముకుంద మునికి దర్శనం కలిగించిన ఉత్తముడు. అందుచేత వీరిని ప్రార్థిస్తూ పూరణ జీడిపప్పు కలిసిన చక్కెర పొంగలి సహా వేన్పొంగలి దానం చేసి ఆరాధిస్తే మంచి ఫలాలు అందిస్తారు.

సకల వ్యాధుల నుండి విమోచనం పొందండి

యమధర్మ రాజుగారి ఆశీస్సులతో నెమ్మదిగా భగవంతుని పాదాలకి చేరటం జీవితంలో అరుదైన భాగ్యమవుతుంది. కాని అందరికి అలాగే జరుగుతందా ? అటువంటి భాగ్యం కలగడానికి మార్గం చూపేవారు ఎవ్వరూ లేరనే వ్యాకులత కలిగినవారు ఎందరో వున్నారు. వీరు శతభిష నక్షత్ర రోజున శ్రీ మేఘనాథ స్వామివారు వెలసిన తిరుమీయచ్చూరికి వెళ్లి శంఖాభిషేకం నిర్వర్తించి శంఖు పుష్పాలతో అర్చించి నల్లేరు కలిసిన అన్నం దానం చేసి చేతితో అరగదీసిన చందనంతో స్వామికి కాప్పు పెట్టి ప్రార్థిస్తే సకల వ్యాధుల నుండి విమోచనం పొంది యమధర్మ రాజుగారి ఆశీస్సులు కలిగి ఎటువంటి కష్టాలు లేకుండా నెమ్మదిగా భగవత్ చింతనతో కాలధర్మం చెందుతారు.

పువ్వుల దివ్యత్వాన్ని పొందే మార్గం

భూలోకంలో మంచి సుగంధ పువ్వులను స్వార్థ కారయాలకై, ఒకదాన్ని చెప్పి మరొకదాన్ని చేయడం - దీన్నే లక్ష్యంగా వేస్తున్నవారు, మానవాశికి సేవలు చేస్తానని మోసం చేసేవారు, శివం వదిలి పోయినవారు (చచ్చినవారు), వారికి పువ్వుల మాల్లతో అలంకరించి పువ్వులకు దోషం కలిగించ కూడదు. అన్నీ పువ్వులను భగవంతునికే అలంకరించి కొన్ని ప్రసాదంగా తీసుకోవాలి అనేదే సిద్ధుల పలుకులు. ముఖ్యంగా దిండు మాలలను భగవంతునికి మాత్రమే అర్పించాలి. పుష్పాలను చెడు కార్యాలకు ఉపయోగించడంవల్లనూ, తన్నడంవల్లనూ గోరులతో నరికి అర్చిస్తానని ఇబ్బంది పెట్టడంవల్లనూ మోటుతనంగా నిర్ణయానికి వచ్చే పరిస్థితి చెందుతాము.

మదురై మారియమ్మ ఆలయ కొలను

దూర్వాసుని శాపం పొందిన ఐరావతం భూమండలంలో ఆరణ్య ఏనుగుగా తిరుగుతూ ఉండి శివుని ఆరాధించి భగవంతుని కరుణతో శాపం తొలగి పోయి క్షీరసాగరంలో జన్మించే వరం పొందింది. ఆ వరం చేత దేవసిరస్కుంజరా అనే పేరుగల అద్భుత శంఖులో జన్మించి తపస్సు నిర్వర్తింది. తన తవం పూర్తి అయ్యాక అమృతంతో బైటవచ్చి దేవలోకంలో ఉన్నతంగా జీవించేది. ఈ ఐరావతం తవం చేసి దేవసిరస్కుంజరా శంఖు మూలంగా ఆరాధించి, దేవుడి వాహనం కావడానికి అనుగ్రహం కలిగించిన దేవుడే శ్రీ మరకతవల్లి సమేత శ్రీ ఇంద్రేశ్వరుడవుతాడు. ముక్తీశ్వరుడు అనేది కూడా వారి నామమే. పుష్పాలను తప్పు కార్యాలకోసం వాడినందువల్ల వచ్చిన కష్టాలు తొలగి పోవడానికీ, మంచి జీవితాన్ని పొందేందుకూ శ్రీ ఇంద్రేశ్వరునితో ఈ శంఖును పూజించి ఆర్థిక స్థితిని చక్క చేసుకోండి. దేవశిరస్కుంజరా శంఖుణ్ణి ఆశీర్వదించి అనుగ్రహించిన దేవుడు శ్రీఇంద్రేశ్వరుడు వెలసివున్న స్థలం మదురై తెప్పకుశం మారియమ్మ ఆలయం దగ్గిర కొలనువు పడమట గట్టులో ఉన్నది.

మధుమేహ వ్యాధి గ్రస్తులకు మధురమైన మాటలు

చక్కెర వ్యాధి కలిగించే ఇబ్బంది నుండి విడుదల పొందడానికీ విదేశాలకు వెళ్ళినవారు అధిక ఆదాయం కలిగి తిరిగి రావడానికీ చెరుకు పంట సాగు అధిక దిగుబడి ఇవ్వడానికి మాయందు మంచి వరం ప్రసాదించే శివుడు ఉన్నాడు.

కోయిల్వెన్ని శవాలయం

ఆ శివాలయంలో పంచదారతో బియ్యం, గోధుమ, బొన్న, రాగి, సజ్జలు మొదలైన ధాన్యాల రవ్వలు కలిసి ఆ ఆలయంలోని చీమలకు దానంగా వేస్తే పైన చెప్పన ఫలాలన్నీ మనకు కలుగుతాయి. ఈ దేవుడి పేరు తెలుసునా ? వీరే శ్రీకరుంబేశ్వరుడు. (చెరుకు తమిశంలో కరుంబు). ఈ శివుడు తంజావూరు దగ్గర కోవిల్వెణ్ణి అనే స్థలంలో వెలసివున్నాడు.


ఆహార లోపం ఎన్నడూ రాక పోవడం ఎలా ?

కుటుంబంలో తిండి లోపం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనసొచ్చినట్టు చెడు మిత్రలకోసం ఖర్చు చేయడం, మధు, స్త్రీ భోగం, జూతం, పొగత్రాగటం వంటి వాటికి ఖర్చు చేయడం, దైవ భక్తి కలిగిన భార్య చెప్పే మంచి మార్గంలో వెళ్ళకుండా ఉండడం మొదలైనవి ముఖ్యమైన కారణాలవుతాయి. అందువల్ల కుటుంబంలో ఆహార లోపం వస్తే పైన చెప్పిన చెడు కర్మాలను విడిచి మన్నార్గుడి తగ్గిరవున్న భామిని శివాలయంలో ఆశ్వీయుజ మాసం మొదటి రోజున అన్నం పులుసు కాయకూరలు అప్పడం వడ పాయసం వంటి పలు రకాల తిండి తిప్పలను శివునికి నైవేద్యం పెట్టి అన్నదానం చేస్తే ఇంట్లో ఆహార లోపం రారాదు.

వారసులు బాగా పెరగడానికి

సాధారణంగా కర్ర ఊని నడిచే వాళ్ళో అనేకులు వృద్ధులే. వృద్ధులు దీర్ఘ అనుభవాలు గలవారు. అంతే కాక అధికంగా జపం దానం ధర్మం పూజలను చేసినవారిని కూడా పెద్ధులు అనే పిలుస్తారు. జపం తవం దాన ధర్మం చేయనివారిని వయసు పెరిగి వుండినప్పుడు కూడా పెద్ధులని చెప్ప కూడదు. వృద్దులని పిలవడమే కద్దు. అందువల్ల దైవభక్తి గల పెద్దులకు చేతికర్ర అనగా walking stick దానం చేస్తే కుటుంబ వారసులు బాగా పెరుగుతారని సిద్ధులు చెబుతారు. ముక్తి చేతికర్ర దానం చెయ్యాలనుకొనేవారు టేకు పనస మామిడి రావి మోదుగు మొదలైన చెట్లతో చేతికర్రలను చేసి కొయంపుత్తూరు శ్రీనంజుండేశ్వరుని ఆలయంలోని కోలూన్డ్రి వినాయకునికి సమర్పించి అన్నదానం చేసి మంచి వృద్ధులకు దానం చేస్తే మగ వారసు లేకుండా ఆడ వారసు మాత్రమే కలిగిన కుటుంబాల్లో వరసులు పెరుగుతారు.

పిల్లలు లేని వారికి ...

చాలా మంది వారికి ఇంటి సౌకర్యం వాహన సౌకర్యం డబ్బు సౌకర్యం వంటి అన్నీ సౌకర్యాలు వుండినా సంతతి వృద్ధి కాకుండా ఉండును. దానికి అనేక కారణాలు ఉన్నాయి. గోదోషం నాగ దోషం అక్రమ రోజుల దోషం (ప్రబలారిష్ట యోగ దినాలు) శూన్య తిథీ దోషం శుక్ర దోషం పక్ర దోషం భార్య భర్తలను విభజించిన దోషం ఇతరుల పిల్లలను దొంగి తల్లి తండ్రులను విభజించిన దోషం, ఆడ బిడ్డను మగ బిడ్డగా మార్చిన దోషం, ఇతరుల గర్భాన్ని నాశనం చేసిన దోషం వంటి పలురకాల దోషాలు ఉన్నాయి. ఇటువంటి దోషగ్రస్తులు దోషాల ప్రభావం తగ్గించుకోవడానికి ఎన్నో దారులు వున్నా ఇది కూడా ఆధ్యాత్మికం చూపే ఒక దారి అవుతుంది.

సాధారణంగా అరటి చెట్లు మట్టి నేల మీదే పెరుగుతాయి. దాని వేరులకు మృదువైన నేల అవసరం. కాని కొండ రాళ్ళలో అరటి చెట్లు పెరుగుతున్నాయంటే అది భగవంతుని లీలగానే ఉంటుంది. అందుచేత కొండ రాళ్ళలో పెరిగిన అరటికి దైవ శక్తి అధికం ఉంటుంది. ఈ అరటి ఉన్న చోట చేతితో అరగ దీసిన పసుపు చందనం పూసి ఆరాధించి దానధర్మాలు చేస్తే జీవితంలో కొత్త మార్పు జరుకుతుందనేది సిద్ధుల పలుకులు. ఈ చోటు శివుడు వెలసివున్న స్థలం అవుతుంది. ఈ స్థలం ఎక్కడ వుంది ? ఇదే నాగపట్టనం తగ్గర వున్న తేవూరు శివాలయం. ఇక్కడ పలు దైవ అరటి రకాల్లో ఒకటైన వెల్లరటి (తెల్ల అరటి) ఉంది. ఈ దైవీ అరటి చెట్లను దర్శనం చేసి పసుపు రంగు పస్త్రాలనూ గొబ్బరికాయ అన్నం దానం చేసి సంతతులు కలగడానికి దారి వెదక్కోండి. ఫలాని వారమూ ఫలాని నక్షత్రమూ కలిసి వచ్చే దినాలను అక్రమ రొజులు (ప్రబలారిష్ట యోగ దినాలు) అంటారు సిద్ధులు.

ఆది వారం  భరణి
సోమ వారం  చిత్త
మంగళ వారం  ఉత్తరాభద్ర
బుధ వారం ధనిష్ట
గురు వారం  జ్యేష్ట
శుక్ర వారం  వూర్వాఆషాడ
శని వారం  రేవతి

ఇటువంటి అక్రమ రొజుల్లో వివాహం సీమంతం శంఖుస్థాపనం గృహప్రవేశం మొదలైన మంచి కార్యాలను చెయ్యక పోవడం మంచిదే.

భార్య భర్తల మధ్య విభజన వద్దు

భార్య భర్తల మధ్య విభజన కలగడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానితో అనేకులు యువదంపతులను విభజించడానికి తయారుగానే వున్నారు. వాళ్ళలో యువ వితంతువులూ, వృద్ధ వితంతువులూ, భార్యలను కోల్పోయినవారూ ఇటువంటి కార్యాల్లో పాల్గొనేవారు. పైగా డబ్బు కోసం సొత్తు కోసం తమ పెళ్ళికి ముందు ఎవరినో ప్రేమించాము అనే కారణంచేత కుట్రలు చేసేవారూ ఉన్నారు. ఎంత మంది వారు దంపతులను విభజన చేయడానికి ప్రయత్నం చేసినా వారి చర్యలన్నిటిని పూర్తిగా నాశనం చేసే శక్తిగల దేవతలు మన దేశంలో ఎందరో ఉన్నారు.

కుటుంబ ఐక్యమధ్యం ప్రసాదించే
శ్రీసుబ్రమణ్యసావామివారు
తిరుమంగళం, లాల్గుడి

ఈ దైవశక్రి పూరితమైన స్థలంలో దంపతులు ఒక్కసారిగా కలసి బాగా జీవించడానికి అనుగ్రహిం కలిగంచే దైవం ఎవడని తెలుసునా ? వారే వరగూరు శ్రీ వెంకటేశ పెరుమాళు కోవెల మూలదేవుడైన శ్రీ లక్ష్మి నారాయణ పెరుమాళు అవుతారు. ఇక్కడకి పెరుమాళు ఎవరైతే విడదీయనట్టు ఆదరంతో లక్ష్మి దేవిని కౌగిలించుకొని ఉన్నారు. అమ్మ కూడా తనను ఏ శక్తీ విభచింపనట్టు ప్రేమతో కౌగిలించుకొని వుంది. ఈ స్థలానికి దంపతుల సమేతగా వచ్చి నమస్కరించి తొమ్మది గజాల చీరలనూ స్వర్ణ మాంగల్యాలనూ దానం చేస్తే ఏ చెడు శక్తులు భార్య భర్తలను విభజించలేవు.

తేలు భయం వద్దు

ఈ నాటికి లోకులు అనేకులు క్రిములను చూడగానే భయబడుతారు. పైగా తేలు అంటే ఎంతో భయం కలిగించేది. తేలు మన తగ్గిర ఉండినా మన మీద బడినా మనం దాని తగ్గర వెళ్ళినా మనం తేలువు కాటునుండి తప్పించుకోవడానికి పెద్దలు ఒక దారి చూపారు. కోయంపుత్తూర్లోని అవినాసి ఆలయంలోని అమ్మవారి సన్నిధి గోడన తేలువు రూపం ఉంది. ఈ రూపాన్ని వీలయినప్పుడెల్లా నమస్కరించి "అవినాసి అమ్మ రక్షించు" అని ప్రార్తించి వేరుశనగ వేపుడుకార దానం చేస్తే తేలు భయం మనకు దూరంగా పోతుంది.

కళ్ళను కాపాడుకోండి

గోపుర దర్శనం కోటి పాప నాశనం అన్నారు పెద్దలు. తొమ్మిది కలశాల గోపురాన్ని ప్రతిదినం దర్శనం చేసుకొంటూ వస్తే మన జీవితంలో వచ్చే పలువిధమైన సమస్యలకు పరిష్కారాలు కుదురుతాయి. ప్రతిరోజు తొమ్మది కలశాల గోపురాన్ని నేరుగా దర్శనం చేయని స్థితిలో ఉన్నవారు తొమ్మిది కలశాలు లేక ఆ పైన కలశాలు కలిగిన ఆలయ గోపుర పటాలను తమ పడక గదిలో ఉంచి ఉదయం లేవగానే గోపుర దర్శనం కలగడం వల్ల మనం ప్రతిరోజు ఎదురుకొనే పలు కష్టాలనుండి విముక్తి పొందవచ్చు.

పైగా గోపురాల నీడవు దర్శనాలూ అక్కడ చేసే దానధర్మాలు పలు కార్యాలను సాధిస్తాయి. దానితో కంటి వైద్యులు తమ రంగంలో రాణించడానికి నీడవు దర్శనం గొప్ప సహాయం చేస్తుంది. అది మాత్రమా ? కంప్యూటరు రంగంలో పని చేసి కంటి బాధలు కలిగినవారు కళ్ళను భవిష్యత్తులో రక్షింపగలరు. దానికి ఆనుగ్రహం చేసే నీడవు దర్శనం తిరువారూరు శివాలయంలోని కలిగే శ్రీఅచలేశ్వర ఆలయ నీడ అవుతుంది. దీనిలో వున్న అద్భుతం ఏమిటంటే ఈ ఆలయ నీడ తూర్పు వైపులా మాత్రమే పడుదుంది. ఈ నీడను దర్శనం చేసి క్యారట్ హల్వా, క్యారట్ పాయసం వంటి క్యారచ్ కలిసిన ఆహార పదార్థాలను విడవకుండా దానం చేస్తూ వుంటే గొప్ప ఫలితాలు వస్తాయి.

కోల్పోయిన ఆస్తిని తిరిగీ పొందాలా ?

జీవితంలో ఎంతో కష్టాలతో పరిశ్రమబడి ధనాన్ని సేకరించినవారు ఉన్నారు. ఆ వధంగా పరిశ్రమించి చేర్చిన సొమ్మును మంచి దారిన ఖర్చు చేస్తే ఆ సొమ్ములు పెరుగుతాయి. చెడు దారిన ఖర్చు చేసిన ధనం మనకు వ్యాధులుగాను శత్రువులుగాను మనను దాడి చేస్తాయి.

తిరుమంగళం శివాలయం
లాల్గుడి

అందుచేత డబ్బును దానధర్మాల్లోను ఆలయ పనులలోను 32 ధర్మకార్యాల్లోను ఖర్చు చేయడం మంచిది. ఈ ధర్మాలే మనను ఎల్లప్పుడూ కాపాడుతాయి. అందుచేత మంచి దారిన ఖర్చు చేసి పేదలయినవారు తిరిగీ కోల్పోయిన ఆ సొమ్ములను పొందేందుకు ఆధ్యాత్మిక దారిని పేర్కొన్నారు సిద్ధులు. కోల్పోయిన ఆస్తిని మళ్ళి పోందేందుకు సహాయం చేసే దేవుడు శ్రీ సామవేదేశ్వరుడు అవుతాడు. వాడు అనుగ్రహీంచే స్థలం తిరుచ్చ లాల్గుడి నుండి 2 కి.మీ. దూరంలో తిరుమంగలంలోని ఉన్నాడు. వీరికి మొక్కుకొని ఒక మండల రోజుల పాటు ప్రదక్షిణం చేసి దానధర్మాలు నిర్వర్తస్తే కోల్పోయిన ఆస్తిని మళ్ళీ పొంద వచ్చు. మళ్ళీ ఆస్తిని కలిగినవారు పెద్ద ఎత్తున దానధర్మాలను నిర్వర్తించాలి. చెడు దారిన వెళ్ళ వద్దు. ఇక్కడికి సామవేదం పఠించడంవల్ల గొప్ప ఫలాలు వస్తాయి.

శ్రీ శనీశ్వరుడు
తిరుమంగళం, లాల్గుడి

సామవేదం తెలియనివారు తిరజ్ఞాన సంబంధ మూర్తి నాయనారు అనుగ్రహించిన "వాసి తీరవే కాసి నల్గువీర్ ... " అనే తేవార గీతాలను 11 సార్లకు తక్కకుండా పాడి టొమాటో అన్నం దానంగా ఇవ్వడం మంచిది. కోల్పోయిన సంపత్తును మళ్ళీ కలగడానికి అనుగ్రహం చేసే శక్తి గలవారు ఈ స్థలంలో వెలసివున్న శ్రీ శనీశ్వరడు మాత్రమే. వారు కూడా అలా చెయ్యాలంటే దానికీ ఒక కారణం ఉంది. అదేమిటి ? ఎడమ వైపు చూస్తున్న శనీశ్వరుడి వాహనమయిన కాకి ఈ స్థలంలో కుడి వైపు చూస్తుండగా నిలబడి ఉండడమే ముఖ్య కారణమవుతుంది.

బాణమతి, శూన్యం మనను తగలకుండా కపాడుకోవడం

అభిచార యాగం అని ఒక యజ్ఞం ఉంది. దానిలో సక్రమంగా స్వరం తప్పకుండా మంత్రం జపిస్తే ఈ మంత్రానికి కట్టుబడి హోమాగ్ని నుండి వెల్వడే అన్నీ పశువులు పక్షులు పాములు తేలులు పులులు సిమ్హములు ఏనుగులు భూతాలు మొదలైనవి శత్రువులను దాడి చేసే శక్తి గలవే.

శ్రీగజసమ్హార మూర్తి, వశువూర్

ఎప్పుడూ శత్రువులు బయటకి లేరు. మనలోపలే వుంటారు. అలాగే మన ఉప్పున్ని ఆహారాన్ని తిన్నవారే మన శత్రువులగా మారుతారు. వీరు చేసే పూజలు చేతబడి మనను తగలకుండా ఉండడానికి పలు మార్గాలు ఉన్నాయి. ఏ మంత్రగాణ్ణి నమ్మి మోసం పోకండి. అన్నీ మంత్ర తంత్ర శూన్యం చేతబడి మొదలైనవి మనను తగలకుండా ఉండడానికి వళువూర్లో వున్న శ్రీగజసంహార మూర్తిని అనుగ్రహం ఉంటే చాలు. ఇబ్బందులు తొలగి పోతాయి. ఈ గజసంహార మూర్తికి వెనుక వున్న గోడన అభిచార నివృత్తి యంత్రం బిగింపబడి వుంటుంది. శీవాచార్యుణ్ణి అడగితే చెప్తారు. స్వామికి సహా ఈ యంత్రానికి దర్శనం చేసి చందన ప్రసాదం తీసుకొని ప్రతిదినం దాన్ని ఉపయోగిస్తూ ఉంటే (నుదుటిలో ఉంచి, ఆరగిస్తూ) అన్నీ ఇబ్బందులు దానంతట తొలగి పోతాయి. చక్కెర పొంగలి దానం గొప్పది. తిరివారూరు వెళ్ళే మార్గంలో నెయ్కుప్పై అనే చోట నుండి ఒక కి.మీ. దూరంలో ఉన్నది వళువూరు. మయిలాడుతురై నుండి టవున్ బస్ కోవెల గుమ్మం తగ్గరకి వెళ్ళుతుంది.

దారి దోపిడీల నుండి రక్షణ

వదిలి పోయిన వస్తువులు కలగడానికీ దారి దోపిడీల వంటి బాధలు లేకుండా నెమ్మదిగా ప్రయాణం చేయడానికీ అనుగ్రహం చేసే అద్భుతమైన స్థలం వుంది. తిరుమురుగనాధస్వామి అనే ఈ స్థలం కోవై తిరుప్పూరు మార్గంలో అవినాశి నుండి 4 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ స్థలంలో బ్రహ్మ తీర్థం జ్ఞాన తీర్థం సుబ్రమణ్య తీర్థాలు ఉన్నాయి. సుబ్రమణ్యనని పేరు కలిగినవారు ఈ తీర్థంలో తప్పకుండా స్నానం ఆచరించడం మంచిది. ఈ స్థలానికి తిరుమురుగన్ అనే పేరు కూడా వుంటుంది.

కళ్ళజోడు ధరిస్తున్న
వారికి ...

కంప్యూటరులో అధికంగా పని చేసే వారూ కళ్ళజోడు ధరిస్తున్న చిన్నారులూ అప్పుడప్పుడు వెళ్ళి ఆరాధన చేయవలసిన దేవుడు ఒకడు వుంటాడు. వాడే చెన్నై మైలాప్పూరు దక్షిణ మాడవీధిలోని శ్రీ కామాక్షీ అమ్మవారి సమేత శ్రీవెళ్ళీశ్వరుని ఆలయం. అక్కడకి శనిభగవానికి ఎదుట శుక్రుడు కురుంద చెట్టు నీడన శివుని ప్రార్తించవారే నిలబడి ఉన్నారు. విరిని విడవకుండా ఆరాధించి పేదవారకి గోరంటవు తైలం పొన్నగంటీ తైలం గుంటగలగర తైలం వంటి వాటిని దానంగా ఇస్తూ వుంటే కంటి ప్రాకాశం పోందడానికి అనుగ్రహం చేస్తారు.

సుఖ ప్రసవానికి అద్భుత మందు

తిరుచెంకోడు మూలస్వామి శ్రీఅర్థనారీశ్వరుని పావన పాదాల నీడన చల్లని నీళ్ళు ప్రవహిస్తాయి. ఇది అద్భుతాల్లో ఒకటి. నేటికీ నిజాయితీ కలిగినవారూ మంచి గుణగణాలు కలిగినవారూ మన దేశంలో ఉన్నారు అనడానికి దృష్టాంతంగా స్వామిని గర్బ గుడిలో ఈ అమృత తీర్థ స్రావం ప్రవహిస్తుంది. ఈ నీళ్ళను తీర్థంగా భక్తులందరికి ఇవ్వబడతాయి. ఈ ప్రసాద తీర్థానికి అద్భుత శక్తులు ఉన్నాయి. వ్యాధులను దూరం చేయడం నుండి సుఖ ప్రసవం వరకు అద్భుత అనుగ్రహాలను ఇస్తుంది. అమావాశ్య పౌర్ణమి దినాల్లో వెన్నతో చక్కెర కలిసి స్వామికి నైవేద్యం పెట్టి చిన్నారులకు దానం చేసిన తరువాత తీసుకుంటే ఈ తీర్థ ప్రసాదం పలు మంచి ఫలాలను అందజేస్తుంది. ఎప్పుడైతే ఈ తీర్థ స్రావం ఆగి పోతుందో అప్పుడు దేశంలో పలు ఇబ్బందులు వస్తాయని తెలుసుకోగలం.

పేరులేని చెట్టు రహస్యం

ప్రాన్మలై ఆలయంలోని స్థల వృక్షంలో అనేక మంది సిద్ధులూ యోగులూ జీవ ఐక్యం చెంది వుంటడంవల్ల ఆ చెట్టుకు నామకరణం చేయలేదు. పైగా సిద్దులు ఐక్యమైన చెట్టులను పేరు పెట్టి పిలవడమూ కూడదు. ఈ చెట్టులన్నిటిని మూల లింగాలుగా భావించి పూజించాలి అనే కారణంతో పేరును నిక్షిప్తం చేశారు. సాధారణంగా దూర్వాసుడు కల్పలోకాలనుండి మాదవి వృక్షం కోకర్ణ భూషణ వృక్షం తలైమలై వృక్షం మొదలైన సిద్ధ ఐక్య వృక్షాలను భూమికి తీసుకు వచ్చాడు. ఈ వృక్షాలన్నిటిని పేరులేని వృక్షాలని పిలుస్తారు. అందుచేత పేరులేని వృక్షంగల కోవెలలోని స్థలవృక్షాలు గొప్ప శక్తిని పొంది ఉన్నాయి. ఇవన్నీ అనుగ్రహం ప్రసాదించే వృక్షాలని తెలిసి శ్రద్ధతో పూజించి ఫలాలు పొందండి.

వివాహ ఆటంకాలు తొలగి పోవడానికి

మగవారైనా ఆడవారైనా తగిన వయసులో పెళ్ళి జరగడమే మంచిది. పలు పూర్వ కర్మ ఫలితాల కారణాలవల్ల పెళ్ళ జరగకపోతే దానికి పలు పరిష్కారాలు సిద్ధులు అనుగ్రహించి ఉన్నారు. ఆశ్వీయుజం మాసం శ్రావణ నక్షత్ర నాడు ఉప్పిలియప్పన్ కోవెల్లో అన్నదానం మాంగల్య దానం చేస్తే సాధారణంగా బహుకాలం ఆటంకాలు కలిగిన వివాహములు జరుగుతాయి. శ్రావణ నక్షత్రం విష్ణువుకు ఉచితమైనది గదా ? కోవెలను చుట్టువున్న సారంగ, సూర్య, ఇంద్ర, బ్రహ్మ, దక్షిణ గంగ, దక్షీణ గోదావరి, దక్షిణ యమున అనే ఏడు తీర్థాల్లో శ్రావణ నాడు స్నానం చేసి వస్త్రాలు దానం చేస్తే ఆడ బిడ్డలు గలవారి పిల్లలకు పెళ్ళి బాగానే జరుగుతుంది.

తీర్థ స్నానాలు కలిగించే దివ్య ఫలాలు

108 శివ స్థలాలు 108 విష్ణువు స్థలాలు వున్న కాంచిపురం వాస్తవ్యులు తప్పకుండా ఈ తీర్థాల్లో స్నానం చెయ్యాలి.

ఆదివారం నాడు కచ్చపేశ్వర ఆలయంలోని ఇష్ట సిద్ధి తీర్థంలో స్నానం చేస్తే అప్పు లేని వారుగా జీవించేవారు.

సోమవారం నాడు ఉదయం ఏకాంపరేశ్వర ఆలయంలేని శివగంగ తీర్థంలో స్నానం చేస్తే భార్యకు మంచి పొందుతారు.

సోమవారం నాడు సాయంత్రం పుణ్య కోటీశ్వర ఆలయంలోని చక్ర తీర్థంలో స్నానం చేస్తే సంపద పెరుగుతుంది. కుబేర అనుగ్రహం వస్తుంది.

మంగళ వారం నాడు గంగైకొండాన్ మండపంలోని మంగళ తీర్థంలో స్నానం చేస్తే మాంగల్య బలం పెరుగుతుంది.

బుధ వారం నాడు తిరుకాళిమేడు ఇంద్ర తీర్థంలో స్నానం చేస్తే పిల్లలకు మంచి చదువు వస్తుంది.

గురువారం నాడు కాయారోహణేశ్వర ఆలయంలోని రోగహరణ తీర్థంలో స్నానం చేస్తే అన్నీ రోగాలు తొలగి పోతాయి.

శుక్ర వారం నాడు కామాక్షి కోవెల్లోని ఉలకాణి తీర్థంలో స్నానం చేస్తే విదేశ చదువు ఉధ్యోగం వంటి ఫలితాలు వస్తాయి.

శనివారం నాడు పసుపు నీటి నదికి ఉత్తర వైపులా సిద్ధ తీర్థంలో స్నానం చేస్తే కార్య సాధనాలూ రాజయోగాలూ లభిస్తాయి.

కండ్లను కాపాడే కణ్ణమ్మ

ఎటువంటి కంటి రోగాలూ వచ్చినా కంప్యూటరు రంగంలో దీర్ఘ కాలం కడపడంవల్ల కండ్లు బాధచెందినా ఇంకా బాధలు రాకుండా తప్పించుకోవడానికి, కంటి వైద్యులు, కళ్ళజోడు ధరిస్తున్నవారందరు తంజావూరి దగ్గర పున్నైనల్లూరు మారియమ్మకు పది కొబ్బరి బొండాలకి తగ్గ కుండా అభిషేగించి ప్రతిదినం ప్రార్తించాలి. అమ్మవారి అనుగ్రహం కలిగితే కంటికి సంబంధించిన సమస్యలు రావు. నేత్రజనాకర్షణ యంత్ర మంత్ర శక్తితో శ్రీ సదాశివ బ్రహ్మేంద్రవారి చేతి మూలంగా రూపొందిన అమ్మవారే ఈ మారియమ్మ.

అడిగినవన్నీ ఇస్తారు

తిరుమంగలం సామవేదీశ్వర ఆలయంలోని శ్రీ దక్షీణమూర్తి గొప్ప శక్తి గలవారు. భక్తులు కోరే వరాలను ప్రసాదించేందుకు అభయ హస్తంతో ఉంటున్నారు.

శ్రీ దక్షిణామూర్తి స్వామి
తిరుమంగళం, లాల్గుడి

కాని మీరు అడిగేవి మీకు మంచి చేయగలవానని కాస్త ఆలొచించండి. ఉధాహరణకు అపార ధనం కాలిగిన స్త్రీలను పెళ్ళి చేసుకోవాలి, డబ్బుతో దేన్నైనా సాధిస్తామని ఎంచి తమ అర్హతకు మించిన ఆశలను పెంపొందించుకొని అందువల్ల భగవంతునితో అహర్నిశలు ప్రార్థిస్తూ ఉంటే భగవంతుడు కూడా ఆ వేడుకోలకు చెవి ఒగ్గుతాడు. కాని పెళ్ళికి తరువాత మామగారి ఇంట్లో తాను ఒక పనివానిలా జరపబడే పరిస్థితిలో మనస్సు బాధలు కలిగి తన చేతులే తన కళ్ళను గుచ్చిన వేదన గురించి ఎంతో బాధబడే అనేకమందివారు ఉన్నారు. అందువల్ల, గురుదేవుడా! నాకు ఏది మంచి చేస్తుందో దాన్ని అనుగ్రహించాలి అని ప్రార్థించండి. తిరుమంగలం దక్షిణామూర్తి ఇస్తారు ఇస్తారు ఇస్తూనే ఉంటారు, మీరు వారి వద్ధ శరణు పొందితే !

ఇనుం వ్యాపారం పెరగాలా ?

లాల్గుడి తగ్గరి తిరుమంగలంలోని శనీశ్వరుడు గొప్ప శక్తి గలవాడు. వాని కాకి వాహనం కుడి వైపులా చూస్తూంటడం చాలా విశేషమైనది.

శ్రీ ఉతంగ ముని
తిరుమంగళం, లాల్గుడి

భారీ ఇనుము, vehicle workshop, furnace, పెట్రోల్ కిరోసిన్ డీజల్ వాహన విడి భాగాలు అమ్ముకొనే వారు తయారీదారులు మొదలైనవారికి ఆదాయం కలిగించే కుబేర శక్తిని అనుగ్రహించేవాడు ఇక్కడ వెలసి వున్న శనీశ్వరమూర్తి. తిరుమంగలం ఆలయాన్ని మంచి చేసి రంగులు అలది వీలయనంత దైవసేవలను చేసేవారికి శనీశ్వర మూర్తివారి అనుగ్రహ కటాక్షం ఎల్లప్పుడూ వుంటుంది.

ఆయువు వృద్ధికి అద్బుత పనస

తిరుమంగల శీవాలయ స్థలవృక్షం పనస చెట్టు. ఉతంగ ముని తపస్సు చేసి అమృతం పొందిన స్థలం కనుక ఇక్కడకి స్థలవృక్ష పూజ ఆయువు వృద్ధినీ ఆయుష్హోమం చేసిన ఫలాలను ఇస్తుంది.

స్థలవృక్షం పనస
తిరుమంగళం, లాల్గుడి

మఖ నక్షత్ర దినాల్లోను శనివారం దానాల్లోను ఈ మందిరాన్ని 64 సార్లకు తగ్గకుండా ప్రదక్షిణం చేసి ప్రార్థించి తేనెలో ఊరిన పనస తొనలను దానం చేయడంతో గొప్ప ఆస్తి పాస్తులు వస్తాయి.

తల్లి తప్పు చేస్తే

తల్లి తండ్రులు మన ప్రథమ దేవులు. కాని దేవుల్లా మర్యాద పొందవలసిన తల్లి తండ్రులే తమ కుమారులు కుమార్తెల మీద కోపం పొంది సొత్తును ఏమిన్నీ ఇవ్వక ఇంటి నుండి దూరం చేయడం ఉంటుంది. అందువల్ల కలిగే దోషం చాలా చెడ్డది. ఈ దోషం తీర్చడానికి తల్లితండ్రులు తమ కుమార్తెలు కుమారులకు సహాయం చేసి వారి పేదరికాన్ని నిర్మాలించి తరువాత తిరునల్లూరు ఆలయ తీర్థంలో స్నానం చేయడం మంచిది. ఈ కొలనులో స్నానం చేస్తే ఏడు సముద్రంలోను స్నానం చేసిన పుణ్యం వస్తుంది. పిల్లలకు చెడు చేసిన తల్లి తన తప్పులకోసం పరితవించి పిల్లలకు పలు మంచి కార్యాలు చేసి స్నానం చేస్తే పరిష్కారం లభిస్తుంది.

తండ్రికి సద్గతి ఇచ్చే తనయుడు

మానవుడు మరణించాక వాడు ఈ జన్మలో చేసిన పుణ్య పావాల బట్టి వాడు వెళ్ళే మరణ దారి అమరుతుంది. భూత శరిరాన్ని విడిచిన మానవుడు తన మంచి కోసం ఏ పూజలు దాన ధర్మాలు ఆలయ ఆరాధనాల వంటి వాటిని నిర్వర్తించ లేడు. ఇటువంటి పరిస్థితిలో వాని రక్తం నుండి పుట్టిన కుమారుడు చేసే ప్రార్థనలే వానికి సద్గతినిస్తుంది. అందుచేత మరణించిన తరువాత పది రోజల పాటు మజ్జిగ పానకం గొడుగు చెప్పలు మొదలైనవి దానం చేసే మంచి అలవాట్లను నేటికీ అనుష్ఠిస్తారు. పైగా మరణించిన ఒక సంవత్సరం తరువాత దాన్ని ప్రథమ శ్రాద్ధ తిథిగా సంబరాలు చేసుకొని మరణించినవానికి ప్రీతైన తిండి తిప్పలనూ వస్త్రాలనూ ఆభరణాలనూ దానం చేస్తే మరణించినవారి ఆత్మ నెమ్మది పొంద తన వరుసలకు అన్నీ సుఖ భోగాలను అందజేస్తుంది. తండ్రిని కోల్పోయినవారు మొదటి శ్రాద్ధ దినాన్ని తిరువలంచుశి కబర్తీశ్వర్రుడనే సెంజడైనాథుడి ఆలయంలో నిర్వర్తించాలి. అందువల్ల తండ్రి మంచి జ్ఞానం పొంది వెలుగు లోకంలోకి వెళ్ళి తరువాతి జన్మలో ఎంతో క్షేమం కలుగుతారు అనేది పెద్ధల మాట.

     
om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam