కుళలుఱవుత్యాగి 
               
 
 
నీలో ఉన్నాడు దేవుడు, అతనికి సేవ చెయ్యడమే నా ఆశయం !

కార్తీక దీపం

కార్తీక దీపం నాడు తిరుఅణ్ణామలైకి వెళ్ళే వీలులేనప్పడు 60 సంవత్సరాల వయసు నిండిన సుమంగళులచేత దీపం వెలిగింపించి దానినుంచి ఆరుదీపాలను స్వగృహంలోనూ ఆలయంలోనూ వెలిగించాలి. ఒక్కొక్క సుమంగళి వెలిగించే దీపంనుంచి ఆరు, ఆరుగా దీపాలను వెలిగించాలి. ఈ విధంగా ఎంత మంది సుమంగళుల ద్వారా ఆరురెట్లు ఆవు నెయ్యి దీపాలను వెలిగిస్తామో ఆ లెక్కకు జ్యోతి యోక్క పుణ్యశక్తి పదిరెట్లుగా పెరిగి భర్తకు ఆయుర్వృద్ధి, దీర్ఘసుమంగళిత్వం లభిస్తాయి.

కార్తీక దీపం నాడు తామర తూడుతో జ్యోతిని వెలిగించటం ఉత్తమమైనది. భర్త సుఖజీవనానికోసం వెలిగించేది కార్తీక దీపం.

విష్ణు దీపం

మొదటిరోజు భరణి దీపం. రెండవరోజు కార్తీక దీపం. మూడవరోజు విష్ణు దీపం.

ఈనాడు ఇంట్లో దూది పత్తితో దీపం వెలిగించి నారాయణమూర్తి ఆలయంలో పిండి దీపం వెలిగించటం శ్రేష్టమైన పూజగా చెప్పబడుతోంది. భర్త, భార్య, బిడ్డలకు సహకుటుంబీకులకు సుఖ సంతోషజీవితాన్ని ప్రసాదించేదే విష్ణు దీప జ్యోతి.

అన్నదాన అగ్ని కూడా ఒక జ్యోతే. ఈనాటికి తిరుఅణ్ణామలైలో కార్తీక దీప మహోత్సవం జరిగేటప్పుడు పలు అధ్యక్ష తన కొన్ని వందల కుటుంబాలు చేరి సత్సంగాలద్వారా అన్నదానాలను చేస్తున్నారు.

కుటుంబాలతో వందలమంది ఈ అన్నదానంలో పాలుపంచుకోడంవల్ల దీపం పెట్టేందుకే సమయం చాలదు. కానీ, కొన్ని వేల జీవాలకు ఆకలి బాధను తీర్చే ఉన్నతమైన దైవ కార్యానికి సాయం చెయ్యడంవల్ల అన్నం తయారయే పొయ్యి జ్యోతే భరణి, కార్తీక, విష్ణు దీపాల మిశ్రమం. బ్రహ్మ రుద్ర విష్ణులైన త్రిమూర్తులు ఉన్నతమైన అగ్నిని నేరుగా అరుణాచల పర్వత దీపంలో కలుపుతున్నారు. ఎంత ఉన్నతమైన భాగ్యం !

సద్గురువు కృపతో చేసే మహేశ్వరుని సేవలతో అన్నదానంవల్ల కలిగే సాటిలేని మహత్యంగల దైవశక్తి.

తిరు అణ్ణామలై గిరిప్రదక్షిణ పద్ధతి

తిరుఅణ్ణామలైలో సాక్షాత్ పరమేశ్వర మూర్తే అణ్ణామలై అనబడే పర్వతంగా స్థాణురూపంలో వున్నారు. ఆదిశివుని లింగాకృతి ఈనాడు తిరుఅణ్ణామలై రూపంలో దర్శన మిస్తున్నది. ఇటువంటి పుణ్యపర్వతాన్ని ప్రదక్షిణ చేయడం శ్రీ వినాయకుడు పరమశివునికి ప్రదక్షిణ చేసినట్టు, పరమేశ్వరునికి ప్రదక్షిణ చేసిన భాగ్యం కలుగుతోంది. ఈ మానవ జన్మ ఎత్తినందుకు అరుణాచలవు తిరుఅణ్ణామలైని ఒకసారి గిరి ప్రదక్షిణ చేసే తీరాలి, చేయకపోతే, ఈజన్మ ప్రయోజనరహిత మవుతుంది.

ఎన్నో కష్టనష్టాలనుభవిస్తూ జీవించే మానవుడు జీవితంలో ఏదో ఒకసమయంలో తన కష్టాలను తలచుకొని పరిహారంకోసం వెదుకుతాడు. అతనికి సద్గురువు లభిస్తే వారే అతని కర్మ ఫలాలను తెలుసుకుని సన్మార్గాన్ని చూపిస్తారు. కానీ సద్గురువు దోరకడం అంత సులభం కాదుగదా, దొరికినా మనసారా సంపూర్ణంగా వారిని దైవ ప్రతినిధిగా నమ్ముకోవాలిగదా.

కలియుగంలో ఈ స్థితి ఏర్పడుతుందని ఆరంభంలోనే సాక్షాత్ సదాశివుడే తిరుఅణ్ణామలై (పర్వత రూపంలో) గానే మానవ దృష్టికి దైవనిరూపణ మాదిరి కనిపిస్తున్నారు.

ఇక మీదటగూడా తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ మహిమానుభూతిచెంది తమ కర్మలకు, కష్టాలకు నివారణనిచ్చే జన్మరాహిత్యం కోసం దైవకృప గురువుల ఆశీస్సులు పొంది తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణను ప్రారంభిస్తారు.

సత్గురువును పొందే మార్గం

నాకు సరైన గురువెవరు? సద్గులువును ఎక్కడ చూడగలుగుతారు. అందరికీ సద్గురువుంటాడా? ఇవన్నీ సాధారణంగా అందరి మనసులలోనూ ఉదయించే ప్రశ్నలు – నిజంగానే సద్గురువును పొందే ఆశయం వున్నవారు భగవంతుడా ! నాకు సద్గురువును ప్రసాదించు అని ప్రార్థనతో పాటు ఒక్కొక్క మంగళవారం, విశాఖ నక్షత్రం కలిసివచ్చిన రోజున వరుసగా తిరుఅణ్ణామలైలో గిరిప్రదక్షిణ చేస్తే నిశ్చయంగా సద్గురువే వచ్చి ఆశీర్వదించి సన్మార్గాన్ని చూపుతాడు.

తిరుఅణ్ణామలైలో శ్రీఅణ్ణామలేశ్వరుని ఆలయ దర్శన పద్ధతి, తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ పద్ధతి, తిరుఅణ్ణామలై తీర్థస్నాన, దర్శన పద్ధతి వంటి పలువిధ మూర్తులు, తీర్థాలు, స్థలాలు, గిరిప్రదక్షిణ పద్ధతులు సిద్ధ పురుషులద్వారా ఏర్పరచబద్దాయి. వీటిని నియమప్రకారం నెరవేర్స్తే పరిపూర్ణ ఫలాలను పొందవచ్చు.

శివగురు మంగళగంధర్వ శ్రీలశ్రీ ఇడియాప్ప సిద్ధ స్వాములవారి వద్దనుంచి గురుకుల వంశ అనుభూతుల వంటివి పొంది ఔన్నత్యానిని పొంది, యిక్కడ మన గురు మంగళ గంధర్వ శ్రీలశ్రీ వెంకటరామన్ స్వామి వారు కలియిగ ప్రజల సత్జీవనం కోసం వివరిస్తున్నారు.

గిరిప్రదక్షిణ నియమాలు

  1. తిరు అణ్ణామలై గిరిప్రదక్షిణ నియమాలను పూర్తిగా అనుష్టించడం శ్రేష్టం.

  2. ఓం నమశ్శివాయ, ఓం మురుగా, ఓం నమో నారాయణాయ, శ్రీ గాయత్రీ మంత్రం, రామ నామ తారక మంత్రం, వంటి నామాలను, దైవస్తుతులనూ, విడవకుండా, సామూహికంగా పారాయణ చెయ్యడం సంపూర్ణ ఫలితాల నిస్తాయి.

  3. గిరిప్రదక్షిణలో పాదరక్షలు ఉపయోగించరాదు. పురుషులు పంచెను పైభాగంలో ఎడము దోపుకోడం శ్రేష్టం. ధోవతీకట్టు ఆంధ్రుల పద్ధతిలో కట్టుకుంటే, శ్వాసస్థితి సక్రమంగా పనిచేయటమేగాక మనశ్శాంతి లభిస్తుంది. కాషాయ పంచెగానీ ఆరంగు తుస్తులుగానీ వాడరాదు. స్త్రీలు చీరను కాసిపోసి కట్టు కట్టటం ఉత్తమం.

  4. నుదుటికి పసుపు, విభూతి, కుంకుమ, చందనం, సింధూరం, నామం వంటి బొట్టు పెట్టుకునే గిరి ప్రదక్షిణ చేయాలి.

  5. గిరిప్రదక్షిణ సమయంలో పండ్లు, రొట్టె, బిస్కట్లు, అన్నం, మంచినీళ్ళు, మజ్జిగ, వస్త్రాల వంటి వాటిని వెంటతీసుకుని పోయి మార్గంలో అక్కడక్కడా వుంటే బీదలకు, పశువులకు దానం చేస్తే ఆ ఫలితం అపరిమితంగా మనకు ఆశీస్సుల నిస్తుంది.

  6. పురుషులు, చిన్నారులు, చొక్కా లేకుండా, గిరిప్రదక్షిణ చేయడంవల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. తిరుఅణ్ణామలైనుంచి వీచే ఔషధ పవనాలు, తిరుఅణ్ణామలైని సర్వకాలాలలోను ప్రదక్షిణచేసే యోగులు, మహాత్ముల స్పర్శవల్ల వచ్చేగాలీ, పర్వతం మీదవున్న పలు నవరత్న శిలా లింగాల నుండి వెలుపడే దైవకృప వంటి ప్రకాశకిరణాలు మొదలైనవి చొక్కాలు లేని శరీరాన్ని సోకి నప్పుడు వాటి పుణ్యశక్తిని పొందవచ్చు. కౌపీనం ధరించి గిరిప్రదక్షిణ చెయ్యడం చాలా శ్రేష్టం.

  7. స్త్రీలు, మెట్టెలు, గాజులు, పుష్పాలు, మాలలను ధరించి గిరిప్రదక్షిణ చెయ్యడం మంచిది. అంటించే బొట్లను ఉపయోగించరాదు.

  8. మెడనిండా రుద్రాక్షలు, తులసి మాలలను ధరించి గిరిప్రదక్షిణ చెయ్యడం మూలాన ధ్యాన స్థితి మెరుగవుతుంది.

  9. తురుఅణ్ణామలైని దర్శించే వారు ఎంతో సావధానంగా, నిండుగర్బిణి నడకతో ప్రదక్షిణ చెయ్యాలి. అప్పుడే దర్శనవు పూర్ణ ఫలితాన్ని పొందకలుగుతారు.

ఇతర దర్శనాలు

తిరుఅణ్ణామలేశ్వరుని ఆలయం పక్కన వున్న జంట వినాయకులను దర్శించి, శ్రీ రట్టై పిళ్లయార్ (జంట వినాయకులు) వెనుక భాగంలో నిలుచుని, తిరుఅణ్ణామలైని దర్శించుకోవాలి. దీనికి చాణక్య దర్శన మని పేరు. బుద్ధి సూక్ష్మతలో గొప్ప వాడైన చాణక్యుడు తన శపథాన్ని దైవకృపతో నెరవేర్చ గలిగి తన కోష్పాదాన్ని (పిలక) తిరిగీ ముడివేసుకున్న స్థలమిది.

దీని దర్శనం వల్ల చిన్నపిల్లలకు మంచి చదువు అధిక మవుతుంది. చదువులో మందకొడిగా వున్న పిల్లలు ఈ దర్శన భాగ్యంవల్ల చదువులో మంచి అభివృధ్ధిని సాధిస్తారు.

ఈ స్థలంలే పలకలు, బలపాలు, పుస్తకాలు వంటిని దానం చేసిన వారి పిల్లలకు మంచి చదువు అబ్బుతుంది.

శ్రీ రట్టై పిళ్ళైయార్ దర్శనానికి పిదవ అరుణాచల శివాలయం తూర్పు కోపురంద్వారా లోనికి ప్రవేశించి ఎడమవైపు ద్వారంలో వున్న శ్రీ లక్షణ వినాయకుడు, గోపురవు లోపలి భాగంలే వున్న శ్రీ కాళీదేవి, శ్రీ మురుగన్, శ్రీ నంధీశ్వరుడు, చిలక గోపురం, ఎడమవైపు తిరిగి శ్రీ బ్రహ్మలింగం వంటి దైవమూర్తులను దర్శించి, దక్షిణ గోపుర ద్వారం ద్వారా బయటికి వచ్చి గిరి ప్రదక్షిణను ప్రారంభించాలి.

మూడు గోపురాల దర్శనం ఫలితంగా కుటుంబంలో భార్య, బంధువులు వగైరాలలో వుండే సమస్యలు సుముఖంగా మారి మనశ్శాంతి లభిస్తుంది. పనిచేసే ఆఫీసు, కుటుంబ ఆర్థిక పరిస్థితిలోని వొది దుడుకుల, నివారణకోసం ముక్కూటు దర్శనం మంచి దారిని చూపి శాంతిని ప్రసాదిస్తుంది. దీనికంతా నిర్మలమైన గురుదేవుని నమ్మకం అవసరం.

తిరుఅణ్ణామలై దైవీక విశేషాలను తెలుసుకునేందుకు ఎప్పుడైనా ఏసమయంలోనైనా, ఎవరైనా, ఒంటరిగానైనా గిరిప్రదక్షిణ చేస్తూనే వుంటారు.

శ్రీ అరుణాచలేశ్వర శివాలయం, తిరుఅణ్ణామలై

సెంగంరోడ్లో ఆరంభమయే గిరిప్రదక్షిణ మార్గం విడిపడే చోటినించి కొద్దిదూరంలో సింహముఖం కలిసిన శివరాజ్ సింగతీర్థం ఉన్నది.

ఈ ప్రదేశంలో ఏవ్యక్తైనా తన జీవితంలో చేసిన ఏవిధమైన తీవ్ర పాపాలు, చెడు అలవాట్లకు (మధుపానం, ధూమపానం, వావి వరుసలు పాటించని అక్రమ సంబంధాలు, దొంగతనం వగైరా) సరైన పరిహారాన్ని తెలుసుకోవచ్చు. కానీ, తన మూలంగా బాధింపబడ్డ వారికి తగిన నివారణను చూపించి ఆతోషాన్ని తిరిగీ చెయ్య గూడదు అనే ప్రతిజ్ఞను దీసుకోవాలి. అతా చేయని పద్ధతిలో తీప్ర శాపాలను  అనుభవించాల్సోస్తుంది.

అణ్ణామలై పర్వత ప్రారంభంలో ముందు శ్రీ ఆది అణ్ణామలేశ్వరుని దర్శించి దశముఖ దర్శనాన్ని చేసుకోవాలి.

పలుదర్శనాల పిదవ వచ్చేది శివశక్తి ఐక్యస్వరూప దర్శన మవుతుంది. ఇక్కడ శక్తి స్వరూపంగా పార్వతీ దేవి పర్వతం, శిఖరాగ్రం ముందుగా దృష్టికి గోచరమవుతుంది. అగ్రమే శివుడు ప్రవేశ ద్వారమే శక్తి.

ఈ స్థలంలోనే శ్రీ అరుణాచలేశ్వరుని పరిపూర్ణ కటాక్షంలో శివగురు గంధర్వ శ్రీలశ్రీ ఇడియాప్ప సిద్ధ మహా పురుషుల కటాక్షంతో గురుదేవులు మంగళ గంధర్వ శ్రీలశ్రీ వెంకటరామ స్వామివారి కృపా కటాక్షాలతో శ్రీలశ్రీ లోభామాతా అగస్త్య ఆశ్రమం నెలకొనేది.

ఇక్కడనించి లభ్యమయ్యే శివశక్తి ఐక్య స్వరూప దర్శనం వల్ల సంతాన భాగ్యం లభిస్తుంది. ఒక విధమైన ధ్యాన స్థితి కలుగుతుంది. ఇదీ చాలా యుగాలలో శ్రీ అగస్త్య మహా ప్రభువు పారంపర్యానికి చెందిన సిద్ధ పురుషులు నివశించి కటాక్షించిన విశేషమైన స్థలం.

శ్రీ కుబేరలింగ దర్శనం, శ్రీ ఇడుకు పిళ్ళైయార్ (మూల వినాయకుడు) దర్శనం, పంచముఖ లింగ దర్శనాలతో బాటు రట్టైపిళ్ళైయార్ (జోడు వినాయకులు) ఆలయానికి ముందున్న శ్రీ భూతనారాయణ సన్నిధిలో గిరిప్రదక్షిణ ముగుస్తుంది.

ఓంకార ప్రణవంతో ఆరంభమయి ఈ పాంచభౌతిక శరీరంలో తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ చేయడానికి కటాక్షీంచే శ్రీ భూతనారాయణుల వారికి నమస్కరించి గిరిప్రదక్షిణను ముగించాలి.

ఈ గిరిప్రదక్షిణకు పిదవ ఆలయంలో శ్రీ అరుణాచలేశ్వరునికి శ్రీ ఉణ్ణాములై దేవికి నమస్కారం చేయడంవల్ల గిరిప్రదక్షిణ ఫలితం పరిపూర్ణంగా లభిస్తుంది.

గిరిప్రదక్షీణ ప్రసాదించే ఫలితాలు

శ్రీ లోభామాతా అగస్త్య ఆశ్రమం నుంచి తిరుఅణ్ణామలై దర్శనం చేసుకునేటప్పుడు మనం చేసుకునే గొప్ప దర్శనమే శిపశక్తి ఐక్య స్వరూప దర్శనం.

ఈ విధంగా సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో వున్న తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణలో నడిచే సమయోల్లో ఒక్కొక్క పాదం మోపేటప్పుడూ దర్శన నిమిత్తం తలనొక సారి ఎత్తి పర్వతానికి నమస్కరించాలి. ఒక్కొక్క అంగకూ పర్వతదృశ్యంలో కనిపించే మార్పు వింతల్లో వింత. ఈ విధంగా మనకు వేలానువేల దర్శనాలు లభిస్తాయి.

ఒక్కొక్క అంగలోనూ కనుపించే పర్వత దృశ్యానికి ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క దర్శనంలోనూ విమోచనమయే కష్టాలు అపారం.

కర్మ ఫలితాల చేరిక

తన జీవితంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషంలోనూ మానవుడు ఎన్నో రకాల కర్మ ఫలితాలను కూడ గట్టుకుంటాడు.

శివాలయాలలో మూలవిరాట్టుకు వెనుక గోష్టమూర్తిగా ఉండే అర్థనారీశ్వరులకు శుక్రవారం, పంచమి తిథి రోజుల్లో కొబ్బరినూనెతో ఐదు, 14, 23 సంఖ్యల చొప్పున దీపాలను వెలిగిస్తే దంపతుల మధ్య మనస్పర్థలు మాయమైన కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది.

అసత్యం, దొంగతనం, జూదం, (చీట్లాట, గుర్రవు పందాలు, లాటరీ వగైరా) మోసం చెయ్యడం, ఇతర్ల సొత్తును అపహరించడం, లంచం, పుకార్లు, హత్యలు, దోపిడీలు, అధికార దుషప్రయోగం, బ్రహ్మద్వేషము, వ్యభిచారము, అప్పిచ్చిన వారిని మోసం చెయ్యడం, అక్రమ శరీరక సంబంధాలు, అక్రమ వ్యపారాలు, దేశ ద్రోహచర్యలు, పెద్థలపట్ల అపచారం, మహాత్ములను దుయ్యబట్టడం, విద్రోహాలు, తల్లి, తండ్రి భార్య, బిడ్డలను కష్ట పెట్టడం వంటి చెడు చర్యలతో నిండి అధికమైన వాటితోనే మానవుల జీవితాలు జరుగుతున్నాయి.

తన ఒక్కొక్క కర్మకూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే మానవునికి కోటానుకోట్ల జన్మలవసరమవుతాయి. అన్నీ కర్మలనూ విమోచనం చేయగలిగేది తిరుఅణ్ణామలై దర్శనమే అలేది నిదర్శన సత్యం. దుర్మార్గులు, బాధితులు ఈ విషయాన్ని గ్రహించి వారి పాపాలకన్నీటికీ పరిహారాలను గిరిప్రదక్షిణ ద్వారా పొందగలరుగదా. కానీ ఆదుర్మార్గులు సన్మార్గులైతేనేగదా సమాజంలో శాంతి నెలకొనేది. దీనికి శ్రేష్టమైన మార్గం గిరిప్రదక్షిణ.

తిరుఅణ్ణామలైలో ఒక్కొక్క దర్శనానికీ సిద్ధ పురుషులు ఒక్కొక్క పేరు పెట్టి దాని దర్శన ఫలితాలను పేర్కొన్నారు.

మహాత్ములకు గిరిప్రదక్షిణ ఎందుకు?

కోట్లాది సిద్ధ పురుషులు, మహర్షులు, యోగులు, జ్ఞానులు, ముముక్షువులు సంచరించే పుణ్య స్థలం తిరుఅణ్ణామలై! ఒక్కఒక్కరూ ఎన్నోకోట్ల యుగాలు తిరుఅణ్ణామలైపై గిరిప్రదక్షిణ చేసి లెక్క లేని దైవకార్యాలను ఆచరిస్తూ, తమ తపో, పుణ్య దాన శక్తులను గిరిప్రదక్షిణ సమయంలో ఒక్కొక్క అడుగూ దూరానికి భూమిమీద, అంతరిక్షంలో అరుణాచలంలోని వృక్షాలలోనూ సూక్ష్మ రూపంలో నిక్షిప్తంచేశారు.

ఎవరైతే తెలిసిగానీ తెలియకగానీ గిరిప్రదక్షిణలో ఈవైపునుంచి పర్వత దర్శనాన్ని చేసుకుంటారో వారికి కర్మలనించి విముక్తి కలిగేందుకు, ఆకర్మ విముక్తి కలిగే మంచి మార్గంకోసం అనే పోకడతో ఒక్కొక్క మహర్షీ, సిద్ధడూ ఆయావైపులనుంచి సంకల్పిస్తూవుంటారు. కొందరు సిద్ధ పురుషులు కొన్ని కర్మఫలాల ధాటికి ఓర్పువహించి కొన్ని దానధర్మాలను కొన్ని దర్శన స్థలాలలో చెయ్యాలని చెప్పారు. వాటిని సద్గురువులు కలియుగంలో సూక్ష్మస్థాయిలో తెలియజేస్తారు.

మన చేతి వేళ్లద్వారా పలు దుష్టశక్తులు దేహంలో చేరి మనకు కష్టాలను కలిగిస్తాయి. కనుక చేతిగోళ్ళను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పదిహేను రోజులకొకమారు వేళ్లకు, చేతికి గోరింటాకు పెట్టుకుంటే వ్యతిరేక శక్తుల బారినబడకుండా రక్షణ పొందగలం. 

గిరిప్రదక్షిణలోని చాలాస్థానాలలో దూర్వాసుడు, గౌతముడు, పంచముఖఋషి, శివరాజ మహర్షి, శుకముని, సాంఖ్య మహర్షి వంటి మహర్షులు, ఇడైకాట్టు సిద్ధడు, కుప్పై సిద్ధుడు, ఇసక్కి సిద్ధుడు, సట్టనాధ సిద్ధుడు, కుడంహై సిద్ధుడు, బోగర్, పులిప్పాణి వంటి సిద్ధపురుషులు, గురునమష్షీవాయ, ఈశాన్య సిద్ధుడు, శేషాద్రి స్వామి, రమణ మహర్షీ వంటి కలియుగ జ్ఞానులు చాలా ప్రాంతాలలో ఆశ్రమాలూ నిర్మించికుని తమ తపశ్శక్తులను ఆ ప్రాంతంలోనూ, అంతరిక్షంలోనూ ప్రసరిస్తూ వీటిని భగవంతునికే అర్పిస్తున్నారు.

ఈ స్థలాలో పాదచారులమై మనం గిరిప్రదక్షిణ చేస్తే ఆహా పుణ్య మూర్తుల పవిత్ర పాదాలు సోకిన పుణ్య భూమిలో నడిస్తేనే ఎటువంటి కర్మఫలాలైనా నివారణ మవుతాయిగదా!

పాదచారుల పాపకర్మలను బరిస్తూ మహాత్ములు అనుభవించే వేదనలు, బాధలు, ఎన్నో మరెన్నో? మానవులమైన మనం ఇహనైనా సన్మార్గంలో జీవితాన్ని గడపలేమా అనే దృఢ నమ్మకంతోనే సిద్ధులు మహాత్ములు తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ చేసే మానవుల కర్మఫలితాలను భరించడానికి కటాక్షిస్తున్నారు.

గిరిప్రదక్షిణలో కర్మల పరిపాలన

కొన్ని కర్మలకు శీఘ్రంగా నివృత్తి చేసుకోగలం. చాలా కర్మలు సులభంగా నివృత్తికావు. కారణం, కర్మలు సులభంగా నివృత్తి అయేదీ కానిదీ ఆ కర్మల ఆధిక్యతకు సంబంధించివుంటుంది. ఒక సాధారణ కుక్కను రాతితో కొట్టి తాని కాలు విరిగితే ఆకర్మ ఫలితంగా నోరులేని ఆ కుక్క ఎంత కాలం బాధ పడుతుందో దాన్ని కొట్టిన వ్యక్తి అంత వరకూ అనుభవించాల్సిందే.

ఉదాహరణకు, ఫలాని రోజు ఇస్తానని చెప్పి ఒక వెయ్యి రూపాయలు అప్పుతీసుకుంటే, చెప్పిన నాడు ఇవ్వక పోయినా, మరునాడు వడ్డీ కలిసి ఇవ్వ వచ్చు. అయినా ఇదీ కూడా కర్మ లెక్కలోకే వస్తుంది. ఈ ఒక్క రోజు ఇవ్వకపోతే వెయ్యిరూపాయలకోసం అప్పిచ్చిన వ్యక్తి పడిన కష్టాలు, మనో వేదనలు, నష్టాలు (వడ్డీ సహితంగా తిరిగి ఇచ్చినా కూడా) అప్పుచేసిన వ్యక్తి, దానికి తగ్గట్టు అనుభవిస్తేనే ఈ కర్మ నివృత్తి అవుతుంది.

కర్మలను పరిపక్వం చేసుకుందాం

ఈ కర్మలను తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణలో ఎంతవరకు తీర్చుకోగలమో చూద్దాం.

  1. అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ వెయ్యి రూపాయలను తిరిగి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వక పోవడంవల్ల అతను అనుభవించిన క్షణాలను అప్పుతీసుకున్న వ్యక్తి కూడా అనుభవించాలి గదా? గిరిప్రదక్షిణ మార్గంలో రాళ్లు, ముళ్లు గుచ్చుకోడం, కాళ్లు కాలడం, ఎండ మూలంగా తల, శరీరం ఒడిలి పోవడం, దాహం, మొకాళ్ల నొప్వులు, కాళ్లనొప్పులు, తలవొప్పి వంటి శారీరక బాధలు కలిగి ఆ కర్మలు నివర్తి అవుతాయి.

  2. గిరిప్రదక్షిణలో చాలినంతమేరకు ఆహారాన్ని దానం చెయ్యడానికి కొంతఖర్చవుతుందిగదా! వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చిన వ్యక్తి అది తిరిగి (సరైన సమయంలో) రాకపోతే ఏదైనా కారణంచేత వాయిదాకు గురైతే, ఆ కర్మల ఫలం అనుభవించాలి. కానీ ఆ పుణ్యకార్యవు సత్పలితం అప్పిచ్చినవారికి చేరుతుంది.

  3. ఒక రోజు అప్పుకు ఇంత కర్మఫలమంటే వేలకువేల రూపాయలు అప్పు తీసుకుని సంవత్సరాల తరబడి తిరిగి చెల్లించకపోతే లెక్కించలేని కర్మఫలాలు వడ్డితో సహా కూడుకుంటాయి. ఆలోచించండి కర్మ ఫలాల కష్టాలను.

  4. ఇచ్చిన అప్పు వసూలు కాకాపోతే, ఒకరోజైనా దాన్ని గురించే చింతిస్తూ అప్పిచ్చిన ప్యక్తి పూజ, ప్రార్థన, దేవాలయ దర్శనం వంటివాటిని విస్మరించ వచ్చు. ఆ కర్మ ఫలాన్ని సైతం అప్పుతీసుకున్న వ్యక్తి  అనుభవించాలి. ఇది ఎంతవరకూ గిరిప్రదక్షిణవల్ల నివర్తి అవుతుందంటే, అప్పు తీసుకున్న ప్యక్తి తను చేసే గిరిప్రదక్షిణలో జపం చేసే మంత్రం, దైవ స్తుతులు, దేవాలయాలలో దర్శనం వంటి వాటిలో ఒకభాగం అప్పిచ్చిన ప్యక్తికి చెంతుతాయి. దీనివల్ల అతడు విడిచి పెట్టిన పూజ, ప్రార్థన, దేవాలయ దర్శనాల పుణ్యశక్తికి తోడవుతాయి.

  5. అప్పచ్చిన ప్యక్తిని నాశనమైపోనూ, వాంతి భేతులు పుట్టనూ లాంటి దూషణలు చేస్తే గూడా డబ్బు అప్పుతీసుకున్న ప్యక్తిని బాధిస్తాయి. అదే తిరుఅణ్ణామలై యాత్రలోనో లేక ఇతరత్రగానో బాధింపుకు కారకాలవుతాయి. కాబట్టి  వీటిని మన పుణ్యయాత్రలలో మనల్నే, బాధించాలా అని మనసు కుంటుబడకుండా వాటిని కష్టాల మాదిరి తలచకుండా కర్మ విమోచనాలని అభిప్రాయ పడితే మనశ్శాంతి లభిస్తుంది.

ఇవితప్ప ఒక్కొక్క కర్మ చాలరకాల కష్టాలకు కారణ మవుతుంది. ఒక వెయ్యి రూపాయల అప్పు ఒక రోజు తరువాత తిరిగి ఇచ్చినందుకే ఇన్ని కష్టాలు. అయితే మానవుడు ఒక్కొక్క క్షణం చేసే చర్యల మూలంగా ఎన్ని కర్మలు పేరుకుపోతాయో.

వీట్టన్నింటికీ సరితూగే మొత్తంగా తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ కుదిరందంటే దాని మహిమ ఏమిటి! అత్యద్బుత ఫలితాలను, వరాలను, అనుగ్రహాలను ప్రసాదించే తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణను జీవితాంతం చేసేటప్పుడంతా కర్మలను నివర్తిచేసి, మరణ భయాన్ని జయించి ఉత్తమ లోక ప్రాప్తి చెందుతారు.

మంత్ర వస్త్ర పూజ

సిద్ధుల అపూర్వమైన తిరుఅణ్ణామలైకి సంబంధించిన పూజ ఒక దానిని భగవత్కృపతో వివరిస్తున్నాము. వారివారికి ఇష్టమైన మంత్రాలలో, దైవ స్తోత్రాలలో, పర్వతానికి వస్త్రాన్ని మంత్రంతో పునీతం చేసి సమర్పించడమే ఈ పూజ.

గిరిప్రదక్షిణ  పూజలో ఏదైనా ఒక స్థలంలో, వీలైతే పద్మాసనం వేసుకుని కూచోవాలి. తమకు ఇష్టమైన మంత్రాన్నో, స్తోత్రాన్నో ఎన్నుకోవాలి. శ్రీ గాయత్రిమంత్రం, శివపురాణం, అభిరామ స్తోత్రం, శ్రీ లలితా సహస్రనామం, తేవారం, తిరువాచక గీతాలు లేదా ఓంకారం వంటి వాటిని పఠించవచ్చు.

పర్వతముఖంగా కళ్లుమూసుకుని కూచుని ముంది ఎడమ కంటిని కొద్తిగాతెరిచి దృష్టిని సారించి పర్వతాన్ని ఒకవైపు నుంచి చూస్తూ భగవన్నామాన్ని గానీ, మంత్రాన్నీగానీ, మానసికంగాగానీ, వినిపించే విధంగాగానీ జపించాలి.

ఈ విధంగా మనసులో మంత్రాన్ని పేని నేత్రాలలో నేసి, పర్వత లింగానికి వస్త్రాన్ని సమర్పించే విధంగా భావించి సమర్పించాలి.

ఆ విధంగా లింగ ప్రదక్షిణ చేస్తూ పరమేశ్వరికో, విఘ్నేశ్వరునికో వస్త్రాన్ని సమర్పించడంలా భావించడం కూడా శ్రేష్టమే. ఇది ధ్యాన మార్గంలో ఒకటి. అద్బుతమైన మంత్రశక్తిని ప్రసాదించే మార్గం. కాయసిద్ధిని సైతం సమకూర్చగల ప్రార్థనా మార్గమిది. తిరుఅణ్ణామలేశ్వరుడు ఎన్నో విధాలుగా పూజలనందుకుంటూ భక్తులను పరవశులను చేస్తాడు – దైవానికి సంతోషాన్ని కలుగచేసి వస్త్ర పూజచేసి పరమానందాన్ని పొందుదురుగాక!

అఖండ జ్యోతి అణ్ణామలేశ్వర పర్వతాన్ని కాలి నడకన చుట్టిరావడం గిరిప్రదక్షిణ పద్ధతి. ఇది మాత్రమేకాక మరికొన్ని అత్యద్బుత ప్రదక్షిణ పద్దతులు ఆచరణకు కఠినంగా అనిపిస్తాయి. కానీ కఠినమైన ఈ పద్ధతులను అనుష్టించడం వల్ల పొందే ప్రతి ఫలాలు అనేకం.

అంగ ప్రదక్షిణ

మహాత్ములు, పెద్దలు తమ యోగశక్తులను, అనుగ్రహాలనూ కొన్నిటిని గిరిప్రదక్షిణ మార్గంలో వదిలివెళ్తుంటారు. వారి పాదధూళి ఈ మార్గాన్ని పవిత్రంచేస్తున్నది. ఇవే, గిరిప్రదక్షిణ చేసేవారి ప్రార్థనలను, వేడుకోళ్ళను వారివారి భక్తికి అనుగుణంగా అనుగ్రహిస్తాయి. ఒక్కొక్క మానవుడు తన శరీర అంగాలతో చాలా తప్పులు చేస్తాడు. వాటికి అతడు తన జీవితంలో పరిహారాలను వెతుకుకోక తప్పదు. అంతేకాక, దైవదత్తమైన ఈ శరీరాన్ని భగవత్సేవలకు వినియోగించకుండా, అతిస్వార్థంతో ఆస్తిపాస్తులను, వస్తువాహనాలను పొందేందుకు అనవరతమూ ప్రయత్నిస్తుంటారు.

ఇటువంటి తప్పులకు పరిహారం గానూ, భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయటంగానూ, ఈ ప్రదక్షిణను పెద్దలు సూచించారు. కాబట్టి మనం శరీరంతో చేసే తప్పులను శారీరకంగానే దిద్దుకుంటే శ్రేష్టమైన మార్గమే ఇది. పైగా, మనం ఏదీ చేయలేము. అంతా దైవలీల అనే అభిప్రాయం కలిగేందుకు ఈ అంగ ప్రదక్షిణం సాయపడుతుంది. దుష్టశక్తులను పూర్తిగా పారదోలి మానవుణ్ణి సన్మార్గ పధంలో నడిపిస్తుంది.

మీ సంతకంలోని అక్షరాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి వున్నట్లయితే మీరు చేసే కార్యాలకు ఆటంకాలు, సమస్యలు రానేరావు. కార్య విజయం ప్రాప్తిస్తుంది. 

పలురకాల మానవులు ప్రదక్షిణ మార్గంలో వెశ్తుంటారు. వారి దుర్మార్గవు ఆలోచనా శక్తులు, ప్రవర్తనలు అక్కడే నివర్తి అవుతాయి. అంగ ప్రదక్షిణ చేసే వ్యక్తి శరీరాన్ని ఆశించుకుని వుంటాయవి. కాబట్టి ఏదో ఒకస్థలంలో వుంటే ఆమహాత్ముల  పాదధూళి ప్రదక్షిణ చేసేవారి శరీరానికి సోకినప్పుడు, చెడు ఆలోచనలు వగైరాలన్నీ మాసిపోతాయి. తన శరీరంతో చేసిన పాపాలకు పరిహారాన్ని వెదికే ఈ శరీరాన్ని ఒక సాధకంగా చేయడమే అంగ ప్రదక్షిణ మవుతుంది. త్యాగంతో నిండిన దైవకార్యం ఇది.

పధ్నాలుగు కిలోమీటర్ల వృత్తంగల తిరుఅణ్ణామలై పర్వతాన్ని అంగ ప్రదక్షిణ చేయడం సులభం కాదుగదా! కానీ ఏం చెయ్యడం?  చేతిలో చిన్న తుండు కుడ్డ, మార్చేందుకు ధోవతి, చీరను పెట్టుకుని ముందు నిర్థారింపబడ్డ కొన్ని స్థలాలలో మాత్రం ముప్పై అడుగులకు తక్కువగాని దూరాన్ని ప్రయత్నించాలి.

సెంగం మార్గంలో గిరిప్రదక్షిణకు కుడివైపుకు తిరిగిన తదుపరి కొంచెం దగ్గరగా కామకాడు అనే స్థలం వుంది. ఈ ప్రదేశంలో, ఉణ్ణాములై అమ్మవారి మండపం, అణ్ణామలై పర్వత అడుగు భాగంలో, శ్రీలశ్రీ లోభామాతా అగస్త్య ఆశ్రమం కలిగివున్న శివశక్తి ఐక్య స్వరూప దర్శనం (దశముఖ దర్శన పార్శ్వం), కుబేర లింగం, శ్రీ దుర్గా అమ్మవారి ఆలయం వంటి స్థలాలలో ప్రదక్షిణ చేయడం చాలా మంచిది.

ఒక్కొక్క రోజు నిర్ణయించుకున్న దూరాన్ని మాత్రం అంగ ప్రదక్షిణ చేయడం వంటిది కూడా చెయ్యవచ్చు. పర్వతాన్ని మొత్తంగా ఒకేసారి అంగ ప్రదక్షిణ చేయాలన్న నిబంధన లేదు. సద్గురువుల నాశ్రయించి వివరాలను తెలుసుకోవడం మంచిది.

పాద ప్రదక్షిణ

తిరుఅణ్ణామలై చుట్టూ సూక్ష్మ రూపాలలోనూ, స్థూల రూపాలలోనూ, మహాత్ములు, యోగులు, సిద్ధుల సంచారాలు ఎల్లవేళలా వుంటాయి. అందుకనే ప్రదక్షిణ మార్గంలో నడిచే సమయంలో చేతులు కాళ్ళు అధికంగా ఊపడం పనికిరాదు. చేతులను కట్టుకునిగానీ, జోడించిగాని నడవడం మంచిది.

పాదప్రదక్షిణ చెయ్యడం వల్ల సహిన గుణం అధికమవుతుంది. పైగా మనం ఆధ్యాత్మిక జీవితంతో గడపాల్సిన సమయం అధికం, ఆమార్గంలో మనం పయనించినది చాలా తక్కువే అయినా, ఆలోచన ప్రకాశము మానవునికి ఈ విధమైన ప్రదక్షిణ మూలంగా లభిస్తుంది. మనం పాదాన్ని అంటిపాదం పెడుతూ నడిచే సమయంలో  విశ్రాంతి లేకుండా నడుస్తాము. దానివల్ల కలిగే పుణ్యశక్తి పూరితమైన ప్రదక్షిణ మార్గాన్ని ఒక అంగుళం కూడా విడువకుండా నడవడం గొప్ప భాగ్యం కదా !

అంగ ప్రదక్షిణలోనూ, పాద ప్రదక్షిణలోనూ గిరిప్రదక్షిణ మార్గాన్ని మొత్తంగా మనం నడుస్తూ పొర్లుతూ చేస్తున్నాం. దీనివల్ల ఎన్నో చోట్ల సిద్ధ పురుషులు, మహాత్ములు తమ పూజ్యపాదాలతో పవిత్రంచేసిన భూమిని మనం శరీరంతో స్పర్శించడానికి ఎంతటి భాగ్యం చేసి వుండాలి.

మహాత్ముల పాదధూళి పడటం వల్ల వారి దివ్యశక్తి మన శరీరాలకు తగుల్తుందంటే ఇక్కడికొచ్చే ఎంతో మంది దుర్మార్గులు, హంతకులు, దొంగల, శరీరాల్లో నుండే దుర్మార్గవు శక్తులు కూడా మనల్ని అంటుకోవా అనే అనుమానం కలగడం సహజం, నిజంకూడా.

ఇతరుల దుర్మార్గవు శక్తులు మన శరీరాలను తాకినా గూడా, అంగ ప్రదక్షిణగానీ, పాద ప్రదక్షిణగానీ చేసేవారి శరీరాలు బాధలను సహించే సహన శక్తిని ప్రసాదించేందుకు మహాత్ములు ముందుకొచ్చి తమ తవశ్శక్తులతో వారిని కాపాడుతుంటారు. కానీ అది కూడా దైవ కార్యకేగదా – ఈ విధంగా అంగ ప్రదక్షిణ, పాద ప్రదక్షిణలు త్యాగ భరితమైన గొప్ప సేవలవుతాయి.

ఊత్తుకోట్టై - తిరుపతి మార్గంలో చురుటపళ్ళి అనే ఊరిలో పవళించిన భంగిమలో పళ్లికొండేశ్వరునిగా కటాక్షిస్తున్నాడు పరమేశ్వరుడు. ప్రదోషకాలంలోగానీ లేక ఇతర దినాలలో మిట్టమధ్యాహ్న సమయంలోగానీ యిచట పాకుడు ప్రదక్షిణను నియమానుసారంగా చేయడంవల్ల మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు పొందవచ్చు.

తల మొదలు కాలివరకూ ఎన్నెన్ని పాపాలను చేసి మానవుడు కర్మ ఫలాలన నుభవిస్తుంటాడు. ఈ పాపాల మూలంగా దుష్ట శక్తులు అంగాంగం ఆక్రమించు కుంటాయి. అంగ, పాద ప్రదక్షిణ మూలంగా తుష్టశక్తులతో నిండిన అంగాలు పుణ్యశక్తులు సోకడంవల్ల దుష్టశక్తులు తరిగి పోతాయి. ఎందుకంటే దుష్టశక్తులు దుర్మార్గాలతో నిండిన స్థలాలలోనే ఉండగలుగుతాయి. ఈ విధంగా బయల్పడే దుష్టశక్తులను మహాత్ములు తమదేహాలకు ఆపాదించుకొని, భక్తులు అనుభవించాల్సిన వాటిని, వారే రాచకురువు, కీళ్లవ్యాధులు, రక్త వ్యాధులవంటి వాటిని అనుభవిస్తారు.

కొన్ని కర్మఫలాలకు సరయిన ఫరిహారంగా అంగ ప్రదక్షిణ పాద ప్రదక్షిణలు నియమించ బడ్డాయి. బాంధవ్యం పాటించని కామంవల్లనూ, కట్టుబాటును మించిన కామేచ్చల వల్లనూ చాలామంది స్త్రీ పురుషుల జీవితాలు పాడయిపోవడానికి కారణమైన వ్యక్తులు మనసారా పరితవించి అంగ ప్రదక్షిణ చేసి, బీదలకు వస్త్రదానం వంటి దానాలు చేసి తమమూలంగా బాధింపబడ్డ వారికి మనశ్శాంతి కలగజేస్తే, అతే గొప్ప పరిహార మవుతుంది.

లేకుంటే బాంధవ్యం పాటించక చేసిన చర్యల మూలంగా ఏర్పడ్డ దుర్మార్గానికి తిరిగి స్త్రీ గానో, పురుషునిగానో, జంతువుగానో జీవించి, అన్నిటినీ పోగొట్టుకొని జీవించాల్సి వస్తుంది. ఇది అవసరమా !

పాకుడు ప్రదక్షిణ

పాకుడు ప్రదక్షిణ

మోకాళ్ల మీద పాకుతూ (చిన్న బిడ్డల మాదిరి) చేసేదే పాకుడు ప్రదక్షిణ. అద్బుతమైన సిద్ధులను, ఫలాలను ప్రసాదించేది తిరుఅణ్ణామలైకి పాకుడు ప్రదక్షిణ చేయడంవల్ల

  1. మారుటి తల్లి బిడ్డలను హింసించడంవల్ల కలిగే పాపం. తన బిడ్డలను తాగుడుమైకంలో  హింసించడం వల్ల కలిగే పాపం.

  2. కుక్క, పిల్లి, ఆవు, గుర్రం వంటి సాత్విక ప్రాణులను కొట్టి హింసించటం వల్ల కలిగే పాపము వంటి వాటికి పాకుడు ప్రదక్షీణ చాలా గొప్పదని ప్రసిద్ధి.
సర్వాంగ శరీర ప్రదక్షిణ

కొంచం కష్టమైన ప్రదక్షిణమిది. ఈ నాటికి హిమాలయ పర్వతాలలోని కైలాస పర్వతాన్ని చుట్టి, రక్తం గడ్డ కట్టే చలిలోకూడా సర్వాంగ శరీర ప్రదక్షిణము కైలాస పర్వత ప్రదక్షిణము చేస్తూంటారు.
ఒకసారి నేల మీద సాష్టాంగంగా పడుకుని అణ్ణామలేశ్వరుని దర్శించిన పిదవ, మొదటి నమస్కారం పెట్టిన చోట ఎక్కడ తల తాకిందో, అక్కడ పాదాలనుంచి తదుపరి నేలమీద సాష్టాంగంగా పడుకుని నమస్కారం చేయాలి.

పాదప్రదక్షిణంలో మొదటి అడుగు చివరి నుంచి రెండవ అడుగు ఆరంభమయ్యే విధంగా సర్వాంగ శరీర ప్రదక్షిణంలో ప్రథమ నమస్కారవు (శిరస్సు) చివరినించి తదుపరి నమస్కారం ఆరంభమవుతుంది.

తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ మొత్తంగా అక్కడక్కడా అంగ ప్రదక్షిణ, పాద ప్రదక్షిణ నియమబద్ధంగా సర్వాంగ శరీర ప్రదక్షిణ చెయ్యడం అపారమైన దైవానుగ్రహాన్ని తరగని పుణ్యశక్తిని, అత్యుత్తమ ఆధ్యాత్మిక సిద్ధిని కలగ జేస్తుంది. కానీ, కాల, దేశ, సంసార పరిస్థితులలో పరిణామాలను ఆలోకిస్తే, స్థిరమైన మనోవైరాగ్యం వున్నవారికే ఇది సాధ్యమవుతుంది.

అయినా సర్వాంగ శరీర ప్రదక్షిణ చెయ్యవలసిన ముఖ్యమైన ప్రదక్షిణ ప్రాంతాలను అన్నిటినీ ఇక్కడ పేర్కొంటాం.

  1. కనీసం 90 అడుగుల దూరమైనా సర్వాంగ శరీర ప్రదక్షిణ చెయ్యాలి. విశ్రాంతి తీసుకుని, మెల్లగా చెయ్యడం తప్పేమీకాదు.

  2. అన్ని అంగాలూ భూమికి తగలాలి.

  3. స్త్రీలు సర్వాంగ నమస్కారం లేదా పంచ అంగ నమస్కారం చెయ్యవచ్చు.

  4. అగ్ని తీర్థం (శేషాద్రి ఆశ్రమం దగ్గర), త్రిపురాంతక దర్శనం (రమణాశ్రమం దాటిన పిదవ పెద్ధ మైదానం ప్రాంతం), యమలింగం, ఉణ్ణాములై అమ్మవారి మండపం, శివరాజ్ శింగ తీర్థం, ఆదిఅణ్ణామలై (దేవాలయ ప్రకారంలో), ఇడుక్కు పిళ్ళైయార్ మొదలైన స్థలాలలో సర్వాంగ శరీర ప్రదక్షిణలు ఫలాలనిస్తాయి.
ఫలాలు

  1. పెద్ధవారిని, మహాత్ములను తెలిసో తెలియకో నిందించడం, భగవంతుని పట్ల నమ్మకం లేకపోవడం, నాస్తికుడుగా జీవించడంవల్ల వచ్చే పాపం.

  2. ఎవరికీ తరగని యవ్వనం, సంపద, ఆరోగ్యం దేహదార్ఢయం కారణాలుగా ఇతరులకు చేసిన అవమానాలు, అపకారాలు.

  3. కన్నవారికి, పెద్ధలకు, భార్యకు, భర్తకు ప్రతి దినంగానీ, విశేషమైన రోజులలోగానీ పాదపూజ చెయ్యని పాపాలకు పరిహారంగా అమరినదే సర్వాంగ శరీర ప్రదక్షిణ.
మొగ్గ ప్రదక్షిణ

యోగులకు ప్రత్యేకించబడ్డ ప్రదక్షిణ ఇది. చేతులు రెంటినీ భూమికి ఆన్చి పక్కకువంగి ఫల్టీ కొట్టిన విధంగా చేసేదిది. 

దీనిలోని ఆధ్యాత్మిక రహస్యాలేమిటి?

కారైకాల్ అమ్మపారు ఉత్తమమైన సిద్ధ యోగిని. 63 నాయన్మార్లలోనే కలవగల భాగ్యం కలిగిన ఒక సిద్ధయోగీశ్వరి. అడుగుకొక లింగం చొప్పున సిద్ధుల పాదస్పర్శలో కోటానుకోట్ల లింగాలుగల స్థలం తిరుఅణ్ణామలైలో తమ పాదాలు పడకూడదని, తలక్రిందుగా గిరిప్రదక్షిణ చేసి దర్శనం చేసుకున్న జ్ఞాని కారైకాల్ అమ్మవారు. శ్రీ రామానుజులు కూడా, తిరుపితి వైకుంఠవు ఒక భాగంగాబట్టి అక్కడ తమపాదాలు పడగూడదనే కారణంతో పాకుతూ, పైకిచేరి, తిరుమల పైన మూత్ర వివర్జన చేయకూడదని, పాకుతూనే కిందికి వచ్చేవారు.

మనం సాధారణంగా పైనుంచి కిందికి కేశాది పాదాంతం పర్వత దర్శనం చేసుకుంటాం. ఇక్కడ తిరుఅణ్ణామలైలో తలకిందుగా నిలుచుని దర్శనంచేసుకుంటే కలిగే ఫలితాలను తెలియజేసేందుకు కాలంగానీ గ్రంథాలుగానీ చాలవు. దైవాన్ని తలకిందులుగా పాదాది కేశాంతం దర్శించడం ఎంతటి మహద్భాగ్యం! ఈ విధంగా భగవంతుని ఆది అంతాలను, సర్వేశ్వరరూపాన్ని కిందినుంచి పైదాకా దర్శించే ఆత్మశక్తిని కలిగిన వారు చాలా కొద్దిమందే – కారైకాల్ అమ్మవారు కూడా వీరిలో ఒకరట.

మొగ్గ ప్రదక్షిణ పద్ధతిలో పర్వత ముఖంగా ఎడమవైపు వంగి పల్టి కొట్టి ప్రదక్షిణ చెయ్యడంలో తిరుఅణ్ణామలేశ్వరుని, సర్వేశ్వరుని తలకిందులుగా దర్శనం చేసుకోగల అవకాశం లభిస్తుంది. ఇటువంటి ప్రదక్షిణ పద్ధతి కేవలం పల్టికొట్టడం మాత్రమే అనుకోకుండా, నిశ్చలంగా చేస్తున్నప్పుడు శ్వాసవేగం మందమవుతుంది. ఆకారణంగా శ్వాసలమధ్యగల పరిమాణం తగ్గడం వల్ల దీర్ఘవాయు బంధ మవుతుంది.

తిరుఅణ్ణామలైని మహర్షులు, దేవతలు వాయురూపంలో గిరిప్రదక్షిణ చేస్తుంటారు. వారు, ఈ పద్ధతిలో ప్రదక్షిణ చేసేవారిని ఆశీర్వదిస్తారు.

సిద్ధపురుషులు, యోగులు అహర్నిశలు అరుణాచలాన్ని గిరిప్రదక్షిణ చేస్తుండటం వల్లనూ, ధ్యాన నిమిత్తం మార్గమధ్యంలో కూచోడం వల్లనూ వారికేవిధమైన అంతరాయమూ కలగని పరిధిలో గర్భిణి స్త్రీ మాదిరి మెల్లగా ముందుకు సాగడమే గిరిప్రదక్షిణలో అవలంబించవలసిన ముఖ్య అంశం. అయితే ఈ మొగ్గ ప్రదక్షిణ పద్ధతిలో కొంతవేగంగా పల్టికొట్టవలసి వస్తుంది గాబట్టి, దీనిని వాయుమండల ప్రదక్షిణ పద్ధతిలోనే చేయడం మంచిది. శ్రీ ఆంచనేయ ఉపాసకులకు సరిఅయిన ప్రదక్షిణ పద్ధతి ఇది.

పైగా ధృడ శరీరముగలవారు క్రికెట్, హీకీ, పరుగుపందెము వంటి ఆటలలో మంచిపేరు ప్రావీణ్యతలను ఆశించే వారు ఈ ప్రదక్షిణ పద్ధతిని అలవాటు చేసుకోడం మంచిది.

ఆధ్యాత్మికంగా ఈ పల్టీ ప్రదక్షిణ ప్రయోజనాల వివరాలు

  1. చూడగూడని దృశ్యాలు, కామం, ఆశ కారణంగా, చట్టబద్ధంకాని భోగానుభవాలను అనుభవించేవారు (కామేచ్చను కలిగించే చలనచిత్ర దృశ్యాలు, హింసాకాండలను ఉద్రేకించే పోటీ దృశ్యాలు ప్రాణాలను బలితీసుకునే కోళ్ల పందాలు, పాము ముంగిస పోట్లాటలు వగైరా).

  2. చేసిన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేసి, దానికి మారుగా ప్రవర్తించడం.

  3. చేతిలో చేయివేసి ప్రమాణం  ఛెయ్యడం. ఆగ్ని, దైవసాక్షి అని చెప్పి దానికి భిన్నంగా నడచుకోవడం.

  4. ఇతర్ల సొత్తును అపహరించడానికి ప్రయత్నించడం, సంపదను అధికంచేసుకోవడానికి వీలునామాలను, దస్తావేజులను మారు పేర్లకు మార్చేవారు.

  5. వైద్యశాలలలో అండం, స్త్రీ పురుషులను విడదీయడం, దనం కోసం చిన్న బిడ్డలను అపహరించి ఇతరుల పరంచేయడం.

  6. ప్రేతస్దితిలో వున్నవారి వేళ్లకు సిరా రాచి వీలునామాల మీద వేలిముద్రలను తీసుకొనేవారు (ఈ విధంగా వేలిముద్రలను తీసుకొనేవారికి ఘోరమైన ప్రేతశాపాలు తగిలి, వారి సంతతిని సైతం బాధిస్తాయి. తగిన సద్గురు కృపతో పరిహారాన్ని తెలుసుకోవడం ఉత్తమం.)

ఇటువంటి ఘోరాలు చేసినవారు కనీసం 90 అడుగుల దూరమైనా పైన చెప్పిన పద్ధతిలో గిరిప్రదక్షిణచేసి గ్రామీణ నృత్యకళాకారులకు, ఆహారం, వస్త్రాల వంటిని దానం చేయాలి. ప్రదక్షిణ సమయంలో కారైకాల్ అమ్మవారి స్తోత్రాలను పఠించాలి.

కారైకాల్ అమ్మవారి స్తోత్రాలు చేసేవారే ఈ ప్రదక్షిణలు చేయటంలో నిపుణులు.

వేలకొద్దీ ధనం ఖర్చుచేసే మాంత్రిక, తాంత్రిక పద్ధతులు, నాడీ జ్యోతిష పరిహారాలు చేయించిగూడా ప్రయోజనంలేక, చేతబడి, శూన్యం, గాలీ, దృష్టి దోషాలు వగైరా ఉన్నవారు ఈ మొగ్గ ప్రదక్షిణ పద్ధతిని అవలంబించి, పైన చెప్పిన దానధర్మాలు చెయ్యాలి.
దీనిలో మరికొన్ని వివరాలు అవసరమవుతాయి. తగిన విషయ పరిజ్ఞానం ఉన్నవారిని సంప్రదించడం మంచిది.

  1. యువకులు ఈ ప్రదక్షిణను కనీసం 90 అడుగుల దూరమైనా చెయ్యాలి. వయసు పైబడినవారు లేక చెయ్యలేనివారు, స్త్రీలు ఏంచెయ్యాలంటే వీరు ఈ పద్ధతిని ప్రయత్నించాలి. అలవాటు లేకపాతే, కిందపడటం కూడా జరుగుతుంది. కానీ, ఇటువంటి చిన్న శరీర శ్రమలద్వారా తీరని దోషాలను తీరుస్తుంది అనే విషయం గ్రహించాలి. చేయలేనివారు సద్గురువును ఆశ్రయించాలి.

  2. పది సంవత్సరాల వయసులో వున్న తన సంతానంచేత పై విధంగా ప్రదక్షిణ చేసేందుకు అనుమతినివ్వవచ్చు. కానీ దీనికి కొన్ని నియమాలున్నాయి. అటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను సద్గురువు ద్వారా తెలుసుకోవాలి.

  3. దీనికి కొద్ది మార్పుగా గిరిని చూచేవారు కుప్పిగంతుల పద్దతిలో చేయవచ్చు.

  4. స్త్రీలు సర్వాంగ శరీర పద్ధతిగానీ, పంచ అంగ శరీర పద్ధతినిగానీ అనుసరించవచ్చు.
గిరిప్రదక్షిణ పూర్తిగా ఈ పద్ధతిలో చేయడం ఉత్తమమైన ఫలితాలనిస్తుంది. చెయ్యలేని వారు కనీసం 90 అడుగుల దూరమైనా చెయ్యడం మంచిది.

ఏకముఖ దర్శనం (రమణాశ్రమం దగ్గిర), యమలింగం, నిరుది లింగం, వాయులింగం, పంచముఖలింగాలున్న స్థలాలలో ఈ ప్రదక్షిణ చేయడం చాలామంచిది. అయినా, వాయుమండల దేవతలు, ఋషులు, ఈ ప్రాంతంలో ఎప్పుడూ వసిస్తుంటారు.

శరీరాసన ప్రదక్షిణ

కూర్చున్నవారు మెల్లగా ముందుకు జరుగుతూ ప్రదక్షిణ చేయ్యడం. మానవుడు ఉపవాసాలతో పూజలు చేసిగానీ, గిరి ప్రదక్షిణ చేయడాన్ని భగవంతుడు కోరుకుంటాడా? అనారోగ్య శరీరాన్ని బాధించకుండా ఈ కలియుగంలో పూజ చెయ్యడాన్నే దైవం కోరుకుంటాడనేది నిత్యసత్యం.

  1. ఎన్నో కోళ్లు, ఎండ్రకాయలు, మేకలు, చేపలు, పందులు, జింకలు వంటి సాత్విక ప్రాణులను వండుకుని తింటున్నారే. ఆ పావమే తీవ్రమై బాధిస్తుందిగదా – చంపబడ్డ ఆసాధు జంతువుల శరీరాలు పడ్డ బాధను తెలుసుకునేందుకే ఈ గిరిప్రదక్షిణ.

  2. అందం, కామం, కోరికలు, ఆశలు, సంపదలు, ప్రతిష్ట, అధికారం, పదవి వంటివాటి కోసం ఎంతమంది మనసులను గాయపరచడం జరుగుతోంది. దానికి పరిహారంగానే ప్రదక్షిణ నియమించబడింది.

  3. పాశ్చాత్య దేశాలలో వశించడం, మళ్లీ పెళ్లీ చేసుకోడం, పేరాశ, భార్యా విధేయిత, గౌరవం, వసతులు కారణాలుగా ఎంతో మంది తమ తల్లితండ్రులను, సంతానాన్ని ఆశ్రమంలోనో శరణాలయాలలోనో, వీధులలోనో విడిచి పెడుతున్నారు. ఎన్ని వసతులు కలిగించినా, పండిపోయిన వయసులో వంటరితనం అనేది శరీరంకంగా మానసికంగా ఎంత బాధకు గురిచేస్తుంది. దీనికి పరిహారమేమిటి?

  4. ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగాలకు పోవడంవల్ల, స్వార్థచింతతో డబ్బు సంపాదించాలనే కోరికతో  తన బిడ్డలను శిశు సంరక్షణ శాలల్లో విడిచి వెళ్తుంటారు. ఎంతైనా కన్నువారి ఆప్యాయత శిశురక్షణ శాలల్లో లభ్యమా? అక్కడ ఆ బిడ్డలు తినేదెబ్బలకు, తాపులకు, ఈసడింపులకు వారు నేర్చుకున్న చెడు మాటలకు తలిదండ్రులే బాధ్యులవుతారు. బిడ్డలు శరీరకంగా పడే బాధకు ఎలా తీర్చడం.

  5. అధికార దుష్ప్రయోగం వల్ల ఇతరులను ఉద్యోగంలో ఒకచోట నిలకడగా ఉండనియ్యక కష్ట పెట్టడం.

  6. మోసం చెయ్యడం, ద్వేషము, క్రోధము, పాతపగ కారణాలగా ఇతరుల పదవులకు భంగం కలిగించడం.

పైన ఉదహరించిన ద్రోహాలకు ప్రాయశ్చిత్తంగా తిరుఅణ్ణామలై గిరి శరీరాసన ప్రదక్షిణ పద్ధతి నియమించబడ్డది. కనీసం 90 అడుగుల దూరాన్నైనా ఈ పద్ధతిలో ప్రదక్షిణ చేయాలి.

శరీరాసన ప్రదక్షిణగా గిరిచుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఇంద్రతీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, సింహముఖ తీర్థం, శివరాజ సింహ తీర్థం, నిరుది తీర్థం, వాయుతీర్థం, కుబేర తీర్థం వంటి తీర్థాల దగ్గర ఈ పద్ధతిలో ప్రదక్షిణ చేయడం శ్రేష్టం. ప్రదక్షిణలు పూర్తికాగానే బీదలకు దానలు, కంబళ్ళు, దిండ్లను దానం చెయ్యాలి.

అవిటివారికి చక్రాల వాహనాలను దానం చెయ్యడం చాలా మంచిది.

ఈడుపు నడక ప్రదక్షిణ

కుడికాలి మడమకు ఎడమకాలి వేళ్లు తగిలే విధంగా పాదాన్ని మోపి, తిరిగి కుడికాలినే మందుంచి, దాని మడమకు ఎడమ కాలివేళ్లు తగిలేలా ప్రదక్షిణ దూరాన్నంతా ప్రదక్షిణ చేయడాన్ని ఈడుపునడక ప్రదక్షిణ అంటారు.

ఇచువంటి వివిధ రకాల ప్రదక్షిణ క్రితం కొంతకాలం వరకూ ఆచరణలో ఉండేవి. కానీ వాటి మహిమలు ప్రయోజనాల గురించి వివరంగా తెలియ చేసే వ్యక్తులు తగ్గిపోతున్నారు. పాదాన్ని కలుపుతూ నడవడం (walking race) పద్ధతైన ఈ ఈడువు నడక ప్రదక్షిణ ఎందుకు, దేనికోసం, ఎవరికోసం నిర్ణయించబడింది?

ఈడుపు నడక ప్రదక్షిణలో శ్వాస వేగం హెచ్చవుతుంది. సాధారణంగా గిరిప్రదక్షిణ చేసేకాలంతో పోల్చితే ఈ పద్ధతిలో ప్రదక్షిణ చేయడం మూలమగా శ్వాస వేగం పన్నెండు రెట్లు అధికమవుతుంది.

గిరిప్రదక్షిణలో మహాత్ములు, సిద్ధ పురుషుల మీదినుంచి వీచేగాలి, తిరుఅణ్ణామలై మీదనున్న అపూర్వమైన, అద్బుత శక్తిగల మూలికల మీదినుంచి ప్రసరించి ఈడుపు నడక ప్రదక్షిణ చేసేవారి శ్వాసను పన్నెండు రెట్లకు అధికం చేస్తుంది. అటువంటి అపరిమితమైన దైవశక్తిని కలిగి ఉండటంవల్ల శరీరారోగ్యం, ఆధ్యాత్మిక శక్తి పెంపొందుతాయి.

ఈ ప్రదక్షిణ చేసే వారిని వాయుమండల దేవతలు, మహర్షులు విశేషంగా కటాక్షిస్తారు. కొన్ని వాయు తరంగాలలో ఘనపతార్థాలు మిళితమై ఉంటాయి. భూమినుండి సుమారు 12 అడుగుల పైదాకా ఈ వాయుమండలాలు సూక్ష్మ రూపంలో కంటికి కనుపించని రీతిలో ఉంటుయి. ఈ ప్రదక్షిణలో ఆ తరంగాలు వేగంగా శరీరాలకు తగలడంవల్ల మంచి జరుగుతుంది.

పాదాలతో చేసే పాపాలకు ఈడుపు నడక ప్రదక్షిణ పరిహీరం పంటిది.

  1. కాలితో పెద్దలను, బిడ్డలను తన్నడం.

  2. తెలిసిగానీ తెలియకగానీ ఇతరులు దిష్టితీసి, దారిలో పారేసిన ఉప్పు, మిరియాలు, బియ్యం, పిడకలు, గుమ్మడికాయ వంటి వాటిని తొక్కడం.

  3. కారు, స్కూటరులలో ప్రయాణం చేసేటప్పుడు భోజన పదాత్థాలు, పుస్తకాలు, విగ్రహాలు దేవుళ్ల పటాలు, సమిధలు, మూలికల వంటివాటిని కాళ్ల దగ్గిర ఉంచుకుని (తొక్కుతూ) ప్రయాణం చెయ్యడం.

  4. పశువులు, కుక్కలు వంటి జంతువులను కాళ్లతో తన్నడం.

  5. పెళ్లయిన అమ్మాయిలు కాళ్లకు గోరంటు, మెట్టలు లేకుండా బయట తిరగటం.

  6. ఏ రూపంలో ఉన్న నిప్పులనైనా కాలితో తన్నడం లేక ఆర్పడం.

  7. హడావిడిగా ఏవేవో పనులు చేసి అవస్థలు కొని తెచ్చుకోడం.

  8. ఇతర్లను అలక్ష్యంగా మాట్లాడడం, అపమానం చేయడం, దూషించడం, ఆఫీసుల సామాగ్రిని అల్లర్ల నెపంతో పాడుచెయ్యడం పంటి చెడు చేష్టలకు పరిహారంగా తిరుఅణ్ణామలైలో ఈడుపునడక ప్రదక్షిణ చెయ్యడం మంచిది.

మునివేలి నడక ప్రదక్షిణం

కాళ్ల వేళ్ల మీద మాత్రమే శరీర భారాన్ని మోపి, భూమికి పాదం తగలకుండా నడవడాన్ని మునివేలి నడక ప్రదక్షిణమంటారు.

  1. నడిచి వస్తానని మొక్కుకుని, ఆ పద్ధతిలో చెయ్యకపోవడం.

  2. తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణను, నడిచికాకుండా, కార్లు, సైకల్, స్కూటర్ల వంటి వాటిలో కూచుని చేయడం గొప్పు తప్పు. ఈ విధంగా చెయ్యడం ప్రయోజనం శూన్యం.

  3. పెద్దవారినీ, భార్యను, బిడ్డలను, ఇతర జంతువులను కాలితో తన్నినందుకు ఈ ప్రదక్షిణలు ప్రాయశ్చిత్తాలవుతాయి.
మునివేళ్ల ప్రదక్షిణ వేరు, మడమ ప్రదక్షీణ వేరు. మునివేళ్ళ ప్రదక్షిణలో మడమనేలకు తగలకుండా నడవడం, వ్రేళ్లు మినహా పాదవు ఏ భాగమూ నేలను తాకకుండా గిరిప్రదక్షిణ చేయడం.
తనకు ముంతు పుట్టిన వారికి ద్రోహం చెయ్యడం, ఉద్యోగంలో తనకు ముందు చేరినవారిని అపకారం చేసిన వారికి ఈ మునివేలినడక ప్రదక్షిణ పరిహారం.

ఈ ప్రదక్షిణలో మునికాళ్ల మీద పైకిలేచి మడమను ఆన్చి ప్రదక్షిణ చెయ్యాలి. ఆకారణంగా కింది ఉద్యోగులను ఇష్టమొచ్చినట్టు మార్చడం, ఉద్యోగ ధర్మాన్ని సరిగా నిర్వర్తించేవారికి మానసిక వ్యాధులు కలిగించడం వంటి పాపాలకు పైన చెప్పిన ప్రదక్ష్ణ పరిహారం.

సాధారణంగా గిరిప్రదక్షిణను మునివేలి నడక పద్ధతిలో చెయ్యడం వల్ల అద్బుతమైన శక్తులు కలుగుతాయి. ఈ పద్ధతిలో చెయ్యలేని వారు దశముఖ దర్శనం నుంచి  (అభయ మండపం దగ్గర) కుబేర దర్శనం వరకూ చెయ్యడం చాలా ముఖ్యం. ఈ చోటనే పాత యుగాల వారికి చెందిన ఆశ్రమాలు స్థాపిచ్చబడి అనుదినమూ సిద్ధపురుషులకు, మహాత్ములకు నిత్యపాద పూజ చెయ్యబడేది.

కార్య సిద్ధికి గిరిప్రదక్షిణ

న్యాయమైన కార్యాలకు అవాంతరాలు ఏర్పడితే వాటి నివారణానిమిత్తం ప్రత్యేకించబడ్డ దినాలలో, చెప్పబడిన రంగుల క్రొత్త వస్త్రాలను దానంచేసి గిరిప్రదక్షిణ చేస్తే కార్య సిద్ధి కలుగుతుంది.

దినం      వస్త్రాల రంగు    అన్నదానం
 
ఆదివారం  ఆరంజి    నిమ్మరసం కలిసిన అన్నం
సోమవారం   తెలుపు   కొబ్బరి అన్నం
మంగళవారం    ఎరుపు  టొమాటొ అన్నం
బుధవారం ఆకుపచ్చ ఆకుకూర అన్నం
గురువారం  పసుపు  చక్కర పొంగలి
శుక్రవారం లేతనీలం  వెణ్పొంగలి (పులగం)
శనివారం  ముదురు నీలం, నలుపు  పులిహోర
             


పౌర్ణమినాడు గిరిప్రదక్షిణ

ఏదినమైనా, ఏసమయంలోనైనా, తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ చెయ్యవచ్చు. ఆయాదినం, తిథి, నక్షత్రం, యోగం, కరణం, హోర, లగ్నాలకు సరిపడేవిధంగా ప్రదక్షిణ ఫలితాలు మార్పుచెందుతాయి. ఒక దృశ్యాన్ని ఒకసారి చూచి, మరోసారి చూచేలోపల ఒక్క క్షణ కాలంలోపనే ఆదర్శన ఫలితం మార్పు చెందుతుంది. అందుకనే శ్రీ శగస్త్య సిద్ధ పురుషుడు ఆ మార్పులను, అరుణాచల మహత్యాన్ని నాడి గ్రంథాలుగా క్రోడీకరించాడు.

పౌర్ణమి నాడే చంత్ర భగవానుడు తన 16 కళలతో పరిపూర్ణంగా ప్రకాశిస్తుంటాడు. మనసుకు కారకుడని చెప్పబడే చంద్ర భగవానుడు మనసును పరిపాలిస్తుంటాడు. శరీర పరిశుద్ధత, మనో పరిశుద్ధత ధ్యాన సిద్ధికి ఎంతో మేలు కలుగ చేస్తాయి. మనను ఎన్నో విధాల ఆలోచనలతో సుళ్లు తిరుగుతుంటుంది. ఆలోచనలను కట్టుబాటు చేయలేదు. ఆలోచనా తరంగ వేగాలను హద్దులలో ఉంచగలిగినప్పుడే మనోశక్తిని పెంపొందించగలుగుతాము. దానికి చంద్ర భగవానుని అనుగ్రహం అవసరం. దానిని పొందేందుకే పౌర్ణమి నాడు గిరిప్రదక్షిణ చేయడం.

పౌర్ణమి తిథి రోజున సూర్య భగవానుని వివిధ దైవాంశలను తన 16 కళల పూర్ణబింబంలో చంద్ర భగవానుడు ఐక్యం చేసుకుని ప్రకాశిస్తుంటాడు. అతడి అనుగ్రహ శక్తి కిరణ ప్రసరణ ద్వారా మన శరీరాల పైననూ, చుట్టూరావున్న ప్రాంతాలలోనూ ప్రసరించుతూ ఉంటుంది.

పౌర్ణమి వెన్నెల కిరణాలు అద్బుత శక్తివంతమైన దైవశక్తిని సాధారణ మానవుడు పొందలేడు గాబట్టి అణ్ణామలేశ్వరుడే తన శరీర స్వరూపమైన పర్వతం పైన చంద్రుని అమృత కిరణాలన్నిటిని పొంది, వాటిని ఒక్కొక్క మానవుని దేహ శక్తికీ సరిపడే పంధాలో ప్రసాదిస్తుంటాడు. అణ్ణామలైలో విశేషమైన శిలలు, మూలికలు, వృక్షాలు చాలా ఉన్నాయి. అవి వివిధ కర్మఫలితాలను, జబ్బులనూ దోషాలనూ, పాపాలనూ నివర్తించగల శక్తివంతాలు.

ఈ పర్వతం మీద చంద్ర భగవానుని కిరణాలు ప్రసరించి ప్రతిఫలించేటప్పుడు వాటికి పదిరెట్లు శక్తి హెచ్చయి, గిరిప్రదక్షిణ చేసే వారి శరీరాలను తాకుతాయి.

దీనికోసమే పౌర్ణమి రోజున బయలుదేరే పురుషుల శరీరవు పైభాగంలో ఏ ఆచ్ఛాదనా లేకుండా (చొక్కా లేకుండా) ధోవతి కట్టుకుని, అంగ వస్త్రంతో మాత్రమే గిరిప్రదక్షిణ చెయ్యాలి. దీనివల్ల తిరుఅణ్ణామలైనుండి ప్రతిఫలించే పుణ్యప్రదము, శక్తీవంతములైన చంద్ర కీరణాలు అధిక శాతం నేరుగా శరీరాన్ని తాకుతాయి. ఆ శక్తి మూలంగా ప్రతి మానవుడూ

  1. ఎన్నో కోట్ల కర్మ ఫలాలను నివారణ చేసుకుని మంచి మార్గంలో జీవీతం సాగించగలుగుతాడు.

  2. బాలారిష్ట, దృష్టిదోషం, శూన్యం, చేతబడి, దిగదుడిచిన పదార్థలను తొక్కడం, గాలిచేష్టలవంటి, చెడుకార్యాలనుండి కాపాడబడుతాడు.

  3. ఒక్కొక్క మానవుడు సాంప్రదాయల ప్రకారం చేసే ఒక గిరిప్రదక్షిణలో కనీస పక్షం ఒక నెలకు అవసరమైన పుణ్యశక్తిని పొందగలుగుతాడు.

  4. తిరుఅణ్ణామలైలో చేయబడే దానధర్మాలకు వెయ్యిరెట్ల ఫలితం ఉంటుంది. పౌర్ణమి రోజున చేసే దానాలకు వెయ్యిరెట్లకన్నా ఇంకా ఎక్కువ ఫలితాలుంటాయి. ఈ విధంగా అపరిమితమైన పుణ్యశక్తులను ప్రసాదించేదే పౌర్ణమి గిరిప్రదక్షిణ.

  5. పౌర్ణమి నాడు మహర్షులు, సిద్ధపురుషులు, యోగులు, దేవతలు, దేవ దైవమూర్తులు, కలియుగంలో మానవాళి మంచి కోసం గిరిప్రదక్షిణ చేస్తుండటంవల్ల వారు తమ గిరిప్రదక్షిణ దైవశక్తిని పుణ్యఫలితాన్ని ఆనాడు గిరిప్రదక్షిణ చేసేవారికి ప్రసాదిస్తారు.కాబట్టి సాధారణంగా గిరిప్రదక్షిణ చేయడానికి వచ్చేవారికి కూడా ఈ అద్బుతానుగ్రహం కలుగుతుంది.
గొప్ప మూలికలు,శిలలు, వృక్షాలు

తిరుఅణ్ణామలై పర్వతం పైన మన దృష్టికి గోచరించేవేకాక, బండల మాదిరీ, గుండ్ల మాదిరి గాను కనుపిస్తాయి. కానీ అవి యదార్థానికి స్వయంభులింగ మూర్తులు, పర్వతమే ఆదిశివుని శరీర మైనప్పుడు ఒక్కొక్క శిలా ఒక్కొక్క లింగమేగదా? భగవంతుని శరీరంపైన ఉండే వృక్షాలు, లతలు, చెట్లు ఎంతటి ఉత్తమమైన స్థితిని పొంది ఉండాలి!

ఒక మహాత్ముని దర్శనమే వేలకువేల కర్మ విమోచనలకు కారణమవుతున్నప్పుడు భగవంతుని స్థూల రూపమైన తిరుఅణ్ణామలై మీద ఉండే, గడ్డి, వెల్లుల్ని, చెట్టు లతలు, వృక్షాల దర్శనం కోటానుకోట్ల కర్మల విమోచనాన్ని చేస్తుందిగదా. అందుకనే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క అడుగుకూ పర్వతాన్ని దర్శించాలి అన్నది నియమం.

తిరుఅణ్ణామలైపైన అద్బుతమైన సాలగ్రమాలు, స్ఫటిక రూపాలు, బాణ లింగాలు చాలా ఉన్నాయి. వీటిపైన సూర్యకాంతి, చంద్రకాంతి, పర్వతంపైనుంచి ప్రవహించే నీరు తగిలి పౌర్ణమినాడు ఈశక్తులు ఎన్నోరెట్లుగా వృద్ధి చెంది గిరిప్రదక్షిణ చేసేవారికి సత్ఫలితాలను దైవభక్తినీ సంపూర్ణంగా ప్రసాదిస్తాయి.

మాస శివరాత్రి నాడు గిరిప్రదక్షిణ

సాధారణంగా కృష్ణపక్ష చతుర్థశికి శివరాత్రి అనిపేరు. మాఘ మాస శివరాత్రీ మహా శివరాత్రీ అవుతుంది. ఆది పరాశక్తి రాత్రీ పూర్తిగా కైలాసంలో పరమశివుని పూజించే పుణ్య తిథే మహాశివరాత్రీ. కానీ ఆభాగ్యాన్ని అంబిక పొందేంతుకు ముంది చాలా యుగాలలో కృష్ణ పక్ష చతుర్ధశి తిథినాడు చాలా స్వయంభు లింగాలను భూలోకంలో పూజిస్తుండేవారు.

మాస శివరాత్రిలో గిరిప్రదక్షిణచేసే సాంప్రదాయంగా సిద్ధపురుషులు పేర్కొన్నది.

  1. మాస శివరాత్రీ నాడుసాయంత్రం ఆరుగంటల మొదలు మరునాటి ఉదయం ఆరుగంటలవరకూ ఆపకుండా గిరిప్రదక్షిణ చెయ్యాలి. ఒకే ఒక ప్రదక్షిణగానో లేక రెండు సార్లు చుట్టి రావడమో చెయ్యవచ్చు.

  2. ఎన్నిసార్లు ప్రదక్షిణ చేస్తారో ఆమేరకు పదిరెట్లు ఫలాలు లభిస్తాయి.

  3. కార్యసిద్ధినిచ్చి ప్రసాదించేది మాసశివరాత్రీ గిరిప్రదక్షిణ. మంచి కార్యాలు వెంటనే పూర్తవుతాయి.

  4. బ్రహ్మ తీర్థం సమీపాన బ్రహ్మలింగంనుంచి ప్రారంభించి భూతనారాయణ సన్నిధిలో గిరిప్రదక్షిణను ముగించాలి.

  5. ఉదయం 6 గంటలకు గిరిప్రదక్షిణ ముగించుకుని తేవాలయానికి వెళ్లవచ్చు.

  6. ఇంటికి వచ్చిన పిదవ తనకు భోజనం ఎవరు పెట్తారో, వారికి పాద పూజ చేసి నమస్కారం చెయ్యాలి. గిరిప్రదక్షిణ చేసివచ్చినవారికి పెద్దలు భోజనం పెట్టాలి.

  7. పాదపూజ అంటే, వారి పాదాలను పరిశుద్థమైన నీటితో కడిగి, పసుపు, చందనం, కుంకుమ, పువ్వులు ఉంచి పాదాలను తాకి నమస్కరించడం. మానసికంగానైనా పాదాభివందనం చేసుకోవచ్చు.

  8. భోజనం వడ్డించేవారు వయసులో చిన్న వారయితే తమపితరులను ఆవాహనచేసుకుని వీరు వారనే భావంతో  పాదపూజ చేసి నమస్కరించాలి.

  9. భోజనం వడ్డించేవారు, భార్యగానీ, బిడ్డలుగానీ అయినా, పైన చెప్పిన విధంగా చేసి, దానికి ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి.

  10. దానిపిదవ సాయంత్రం 6 గంటల వరకూ శివధ్యానం, శివ స్మరణలోగడపాలి.

  11. ఇటువంటి మాసశివరాత్రీ పూజలోనే శివుడు సంపూర్ణఫలితాలను ప్రసాదిస్తాడు. కైలాసంలో స్థనాన్ని పొందేందుకు మాసశివరాత్రి గిరిప్రదక్షిణ సోపానంవంటిది.
మాసశివరాత్రి ప్రదక్షిణ ఫలితాలు
  1. వ్యాపారంలో అభివృద్ధి లేక ఆటంకాలతో అవస్థపడేవారు పైన చెప్పిన స్థితిలో మాస శివరాత్రి రోజున గిరిప్రదక్షిణ చేసి, పాదపూజ చేసిన తరువాత ఏనుగుకు చెరుకు, 12 ముద్దల ఆహారము, ఆకులు, మొలకలు వంటిని తినిపించడం మంచిది.

  2. చతుర్థి వ్రతాన్ని నెరవేర్చలేనివారు మాస శివరాత్రి రోజున గిరిప్రదక్షిణచేసి పాలు దానంగా ఇస్తే పాప పరిహారమవుతుంది.

  3. కృష్ణ పక్షంలో వివాహము, సీమంతము, ఉపనయనము, శంఖు స్థాపన వంటి శుభ కార్యాలను చెయ్యకూడదు. తెలిసో తెలియకో ఈ కార్యాలను చేసినవారు మాస శివరాత్రీ తిరుఅణ్ణామలైలో గిరిప్రదక్షిణచేసి వినాయకుడికి 1008 వుండ్రాళ్లను నైవేద్యం చేసి, వాటిని బీదలకు దానం చేస్తే దోషపరిహార మవుతుంది.

  4. ఇదే మాదిరి శుక్ల పక్షంలో ఆపరేషన్ల వంటివి చేసుకోగూడదు. చెయ్యక తప్పని పరిస్థితిలో చెయ్యడం జరిగితే, వ్యాధిగ్రస్తుని రక్తసంబంధీకులు, లేదా కుటుంబంలోని వారెవరైనా తిరుఅణ్ణామలైలో మాసశివరాత్రినాడు గిరిప్రదక్షిణచేసి, అక్కడి వ్యాధి పీడితులకు వైద్య సహాయం, మందులు, ఆహారపతార్థాలు వినియోగం చెయ్యడంవల్ల ఆ దోషం నివర్తి అవుతుంది.
శ్రీ అంగవ మహర్షి

శ్రీ అంగవ మహర్షి అనబడే మహాత్ముడు 10000 శిష్య పరివారంతో కొన్ని కోట్ల యుగాలనుంచీ గిరిప్రదక్షిణ చేస్తూవస్తున్నారు. ఈ నాటికీ పర్వతవు తూర్పు దిక్కునుంచి పడమటి దిశగా ప్రతిదినమూ రాత్రి 7 గంటల ప్రాంతంలో  ఒక నక్షత్ర రూపంలో శ్రీ అంగవ మహర్షి గిరిప్రదక్షిణ చేయడం చూచి ఆనంచించవచ్చు. ఈ నక్షత్రం రాత్రిలో గంటగంటకూ స్థానం మారి పర్వతానికి ప్రదక్షిణ చేస్తంది.

తిరుఅణ్ణామలై క్షేత్రంలో అద్బుతమైన ఆధ్యాత్మిక రహస్యం ఏమంటే, రాత్రీ, పగలూ, ఎండా, వానా అని చూడకుండా ఎవరో ఒకరు గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. దానిని చూచి ఆనందించేవారే శ్రీ అంగవ మహర్షి – రెండు మూడు గిరిప్రదక్షిణలో ముగించ తల పెట్టినవారు పైనచెప్చిన శ్రీ అంగవ మహర్షిని ధ్యానించడంవల్ల అపూర్వమైన ధైర్యం మహర్షుల అనుగ్రహంవల్ల లభిస్తుంది. వీలయినప్పడు శ్రీ అణ్ణామలై గిరిప్రదక్షిణకు రండి. నెలపొడుపు, పౌర్ణమివంటి అపూర్వ దినాలలో నెలకొకసారి సాంప్రదాయ సిద్ధంగా ప్రదక్షిణ చేయండి.

ఈ విధంగా నెలనెలకూ గిరిప్రదక్షిణకు రావడం వల్ల కనీసం ఒక కొత్త భక్తుణ్ణి మనతో ప్రదక్షిణానిమిత్తం తీసుకునివస్తే, అతనికి గూడా దైవకటాక్షం కలుకుతుంది. నా భక్తుల సంతతి వృద్ధి అవుగాక అనే విధంగా స్వలాభాన్ని మాని దైవాన్ని సేవించుకోడానికి సిద్ధంకండి.

ఇతరులను గిరిప్రదక్షిణకు ప్రేరేపించినందువల్ల ప్రదక్షిణా ఫలితం పదిరెట్లు అధికమవుతుంది.

ఓం సద్గురు శరణమ్

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam