కుళలుఱవుత్యాగి 
               
 
 
అడుగుకొక లింగం చొప్పున చిన్న చిన్న శకలాలుసైతం కోటాను కోట్ల లింగాలు !!

ఓం శ్రీ వల్లభ గణపతి కృప
ఓం శ్రీ అంగాళ పరమేశ్వరి కృప
ఓం శ్రీ సద్గురు శరణం

అరుణాచల మహిమ

ఆడుతూ పాడుతూ అన్నామలేశ్వరునికి చేతులు జోడించండి. తిరు అణ్ణామలై అనకండి. అఖండ జ్యోతి తిరు అణ్ణామలై అనే అనండి, అని  సిద్దపురుషులు నొక్కివక్కానించారు.  అఖండ జ్యోతి అంటే ? పంచభూత లింగాలుగా పరమేశ్వరుడు ఐదు పుణ్య క్షేత్రాలలో కృపా కటాక్షాలను ప్రసరిస్తున్నాడు. పృత్వి (నేల), ఆప్పు (నీరు), వాయు (గాలి), అగ్ని (నిప్పు), ఆకాశం (శూన్యం) మొదలైన భూతాలకు అగ్నే ఆది స్థానం అయినది. అగ్ని స్థలమైన తిరుఅణ్ణామలైలోనే పరమేశ్వరడు ప్రపంచానికి ప్రధమంగా అగ్నిని ప్రాసాదించి అంతర్గతంగా అఖండజ్యోతి, బాహ్యంగా పర్వత రూపంగా ఈ నాటికీ  కనువిందు చేస్తున్నారు.

ఈ ప్రకారం సదాశివ  పరబ్రహ్మ అయిన పరమేశ్వరుడు తన ఉనికిని తెలియజేసేందుకు అఖండజ్యోతి రూపమై తిరుఅణ్ణామలై ఆకారంలో ఆవిర్బవించాడు. ఆ విధంగా అవతరించిన అఖండజ్యోతి ప్రప్రథమైన అగ్ని. దీని నుండే సూర్యుడు చంద్రుడు, దీపకాంతులు, నక్షత్రజ్యోతులు, అగ్నికణాలు మొదలైన వన్ని ఉద్బవించాయి.

విద్యుద్దీపం విద్యుత్ శక్తివల్ల వెలుగుతున్నట్టు కనుపించినా ఆ విద్యుత్ శక్తి కూడా అఖండ జ్యోతి అంశమైన మెరుపు అనబడే  అకాశ మార్గ కాంతే కదా.

ఆది శివుడు తన శరీరాన్నే పర్వతరూపంగా  ప్రభవింపజేసుకున్న ఈ స్థలం, కొండరాళ్ల రూపంలో  కనుపిస్తున్నది. కానీ, దాని లోలోపల పొదగబడివున్న నిక్షిప్త నిధులు ఎన్నో, ఎన్నెన్నో.

శ్రీ రమణ మహర్షికి రాళ్లలో పుట్టి పెరిగిన మర్రి చెట్టు ఆకులో భగవంతుని దివ్యమంకళ దర్శనం అయినదనే విషయం మనకందరికీ తెలుసు. ఆ మర్రి చెట్టులోనే సాక్షాత్ శ్రీ దక్షీణామూర్తి తన భౌతికకాయంతో సత్, చిత్, ఆనంద యోగధ్యానంలో అవతరించాడు.  ఆ దృశ్యాన్ని చూచేందుకు కోటినేత్రాలు అవసరం.

అతి పెద్దదైన స్వయంభుమూర్తి

భూమండలంలోనే అతి పెద్ద స్వయంభు మూర్తి తిరుఅణ్ణామలై. పర్వతంపైన వున్న ఒక్కొక్క రాయి ఒక్కొక్క స్వయంభు లింగం.

ఆ కారణంగా తిరుఅణ్ణామలైలో వున్న మట్టిబెట్టనుగానీ, రాతినిగానీ ఎవరూ ఎక్కడికీ తీసుకుని పోలేరు.

అడుగుకొక లింగం చొప్పున చిన్న చిన్న శకలాలుసైతం కోటాను కోట్ల లింగాలు అని శ్రీ అగస్త్య గ్రంథం వర్ణించడమే దీనిలోని ఆధ్యాత్మిక రహస్యం.

నిజానికి ఈ భూమండలంలో వెలిశిన స్వయంభు మూర్తులన్నీ ఈ తిరుఅణ్ణామలైలో ఉద్బవించినవే.

ఈ పర్వతంలో ప్రపంచానికవసరమైన మూలాధార వస్తువులన్నీ వున్నాయి. సాక్షాత్ శ్రీ లక్ష్మి దేవి ఏకాంతంగా తపస్సు చెయ్యాలని వచ్చి, వైకుంఠం, కైలాసం, స్కందలోకం, శ్రీవిద్యాలోకం మొదలైన కోటాను కోట్ల లోకాలన్ని ఆ పర్వత గర్బంలో నిబిడివుండటం చూచి విస్మయమందిందట.

రూపం మారే అద్భుత పర్వతం

కృత యుగంనించి నేటి వరకూ గిరి ప్రదక్షిణ చేసే మహా పురుషులు, ఋషులు, దేవతలు, గంధర్వులు, మొదలైన వారందరికీ ఇది అగ్ని పర్వతం మాదిరే అవుపిస్తుంది.

అదే విధంగా త్రేతాయుగంలోని వారికి ఇది మాణిక్య పర్వతంలా కనుపిస్తుంది. ద్వాపరయుగవువారికి ఇది స్వర్ణ పర్వతం మాదిరికూడా కనుపిస్తుంటుంది. చూచినవారు వర్ణించలేరు, వర్ణించగలవారు చూడలేరు.

శీవ శక్తి ఐక్య దర్శనం, తిరుఅణ్ణామలై
శ్రీలశ్రీ లోబామాతా అగస్త్య ఆశ్రమానికి ఎదురుగా ఉంది

వంశ పురుషుల తపస్సు
మూలపురుషులు, గంధర్వ, ఋషి, సౌందర్య వంటి తేజోలోకవాసులకు భూలోకంలో అరుణాచలమైన తిరు అణ్ణామలై క్షేత్రంలోనే అరుణాచలేశ్వరుని దర్శనమవుతుంది. కానీ, మానవులు సాధారణంగా తిరు అణ్ణామలేశ్వరుని దర్శిస్తున్నంత సులభంగా ఇతర లోకవాసులు తిరు అణ్ణామలేశ్వరుని దర్శించడానికి వీలుకాదు.

అత్యున్నత శ్రేణిలో ప్రకాశించే మన పూర్వకులైన మూలపురుషులు మనమాదిరి తిరు అణ్ణామలేశ్వరుని దర్శనానికి రాలేరు. దివ్యకాంతితో నిండిన వంశకారకులకే యింతటీ కఠోర నియమాలున్నాయంటే, సామాన్యులైన మనం ఎంత భక్తి పూర్వకంగా తిరు అణ్ణామలేశ్వర పర్వతం మీద వాదాలు మోపాలి.

మూల పురుషులకెందుకీ కఠిన నియమాలు?

మూలపురుషులు ఎంతో పవిత్రులైనా, వారికి కర్మనుంచి విమోచనముండదు. కానీ ఒక్కొక్క మూలపురుషుడూ కొంద మంది ఆధ్యాత్మిక ఔన్యత్యానికి దోహదం చెయ్యాలనే లక్ష్యం నిర్ణయింపబడి వుంటుంది. దాని నెరవేర్చితేనే శ్రీ అరుణాచలేశ్వరుని దర్శనానికి అతడు అర్హుడవుతాడు.

ఉదాహరణకు ఒక మూలపురుషుడు తన వంశావళిలో రెండు లక్షల జీవులను ఆధ్యాత్మిక మార్గానికి మళ్లించాలనే లక్ష్యం నిర్ణయింపబడిందంటే, వారు ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ఎన్నో యుగాల కాలం అవసరమవుతుంది.

ఆ రెండు లక్షల జీవాలు, వృక్షాలుగానో, కృమికీటకాలుగానో, జంతువులుగానో జన్మంచి వుండవచ్చు. ఆయా జీవులకు, (కృములు, వృక్షాలు, కీటకాలు, జంతువులు) ఆధ్యాత్మిక సంస్కారాన్ని అందజేసి ఉన్నత స్థాయికి పెంపొందించడం ఎంతో కష్టంతో కూడినపని. దీనికి ఎన్నో వేల సంవత్సరాలు ఓర్పుతోపాటుపడాలి.

ఒకరు తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ చేస్తున్నారంటే అది అతడి నిర్ణయమని అభిప్రాయపడతాం. కానీ ఫలాని సంవత్సరం ఫలాని మాసం, ఫలాని రోజు, ఫలాని సమయంలో వీరు గిరిప్రదక్షిణకు రావాలని, వారి పితరులు రాత్రింపగళ్లు శ్రమపడి, వారిని తిరుఅణ్ణామలైకి రప్పించుకుంటున్నారు.

నిజానికి ఈ వ్యక్తుల కర్మల పాపఫలితాలకూ వీరి పిత్రుదేవతలకూ మధ్య పెద్దపోరాట్టమే జరుగుతుంది. దానికి కారణం, ఒకసారి తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణవల్ల విమోచనమయే కర్మలు లెక్కకు మిక్కిలి.

కాని, కర్మఫలితాలను పిత్రుదేవతలుకూడా అనుభవించక తప్పదుకదా, తన వంశావళిలో జన్మించిన కొందరి కర్మలను పిత్రుదేవతలే అనుభవిస్తుంటారు కూడా, వారికోసం నియమించబడ్డ తర్పణం పూజాలవంటి వాటిని వంశావళిలోని వారి సాంప్రదాయం ప్రకారం నిర్వహించినప్పుడే, పితరులు వాళ్ల కర్మలనుండి విమోచనం కలిగించడానికి ముందుకు వస్తారు. తర్పణం, పూజలు శ్రధ్ధగా నిర్వహించకపోతే పిత్రుదేవతలు శపించడం కూడా జరుగుతుంది. అటువంటి చర్యలు కర్మఫలాలను మరింత అధికం చేస్తాయి.

పైగా అంతుమీరిన పాపాలు చేసిన వారు తిరుఅణ్ణామలై దర్శనానికి రావడానికి వీలులేదు. రుగ్మతలు, ఉద్యోగం, సమ్మెలు, డబ్బులేకపోవడం, ఎదురుచూడని అవాంతరాలు, బస్ చెడిపోవడం వంటి కారణాలు మనకు బహిరంగంగా తెలుస్తాయి.  కానీ దీని వెనుక వేలకు వేల కారణాలుంటాయి.

కాబట్టి ఫలాని రోజున గిరిప్రదక్షిన చేసిరావలంటే, అది మన పిత్రుదేవతల ఆశ, ఆశయం, వారు తీసుకున్న శ్రమల ఫలితమేనని మనం గ్రహించాలి.

తిరుఅణ్ణామలై దృశ్యం

బ్రహ్మ విష్ణువు లిద్దరూ ఆదిశివుని ఆది అంతాలను తెలుసుకునేందుకు గాఢాంధకారంలో పడి పోటిపడటం గురించి మనకు బాగా తెలుసు.

శివుని పాదారవిందాలను చూచే భాగ్యం లేకపోయిందని ఆతత్వం తెలుసుకోలేకపోయానని అంగీకరిచిన శ్రీ మహావిష్ణు “సర్వేశ్వరా! మమ్ముల్ను దైవమూర్తులుగా సృష్టించి కటాక్షించావు. తమ కరుణ వల్లనే తమను కాంచ వీలవుతోంది. అంతరంగ ఆంధకారాన్ని ఛేదించగలిగినప్పుడే పరమాత్మను చూడ వీలవుతందనే విషయం తెలుకోలేక మేము అవస్థలు పడుతున్నాం. ఇలాగయితే సాధారణ జీవుల స్థితి ఏమిటి?

దుష్ట శక్తుల అట్టహాసం, ఆర్భాటాలు,  వినాశకర చర్యలు జరుగుతున్న ఈ కాలంలో మంచివాళ్లు చాలా శోధనలనెదుర్కోక తప్పదుగదా - వాశ్లకుగూడా తమ దర్శన భాగ్యం కలిగేలా కరుణించుమని వేడుకుంటున్నాని ప్రార్తించాడు.

బ్రహ్మ దేవుడు కూడా అదేవిధంగా పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు. శ్రీ ఆది శివుడు సంతోషించి, “ఈ ఆది అంతముల దైవమును  మానవులు దర్శించుటకు శబ్దరూప దర్శన  మహిమను కలిగించేందుకు నా వల్ల ఏర్పాట్టు చెయ్యబడింది. గడచిన యుగాలలో ఈ లీలలను మణిమాల మూలముగా దేవతలు, గంధర్వులు, తిరుఅణ్ణామలైని, నవరత్న పర్వతముగాను, స్వర్ణ, రజత పర్వతములుగాను దర్శనము చేసుకున్నారు. కలియుగంలో మేము శిలా పర్వతముగా ప్రజలకు దర్శనమిస్తాము,” అనే వరాన్ని ప్రసాదించారు.

పరమేశ్వరుని శరీర స్వరూపము పర్వతం ఆరోహణం

తిరుఅణ్ణామలైయే పరమేశ్వరుని పుణ్యప్రదమైన  శరీరమని తెలియజేయడం వల్ల, పొద్దు గడపడానికో కారణం లేకనో పర్వత ఆరోహణ చెయ్యకూడదు. మొక్కు బడితే పర్వతం మీద కాలు మోపవచ్చు. కార్తీక దీపంనాడు, జ్యోతికవసరమైన నూనె, నెయ్యి, పత్తి కర్పూరము తీసుకొని పోవచ్చు. ఈ కైంకర్యాల గురించి తెలియని వారికి సహాయపడడానికి కొండనెక్క వచ్చు. మిగతా సమయాలలో కారణం లేకుండా కొండనెక్కడానికి ప్రయత్నము చేయకూడదు. మొక్కుబడితే కొండనెక్కడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. ఎలుగెత్తి శివనామ కీర్తన చేస్తూ కొండనెక్కేవారికి ఫలం అధికముగా ఉంటుంది.

నిరంతర పర్వత అఖండ జ్యోతి

పర్వతమే పరమేశ్వరుని శరీరమనుకున్నప్పడు జ్యోతి దేనిని సూచిస్తుంది?

చీకటిని పోగొట్టేది వెలుగు. జన్మ అనబడే చీకటిని ప్రారద్రోలేవెలుగే అణ్ణామలై జ్యోతి, కలియుగంలోని మానవుల మంచికోసం సిద్దపురుషులు, బ్రహ్మర్షులు, సదాశివ పరబ్రహ్మ కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు పరమేశ్వరుడు నేను కదలని పదార్థముగా, అణ్ణామలైగా, కలియుగంలో స్థిరత్వం చెందుతాను.

కదిలే పదార్థమూ, కదలని పదార్థమూ, రెండూ నేనే అనేది అనుభవయోగ్యమయ్యేందుకు తిరుఅణ్ణామలై మీద కదలాడే పదార్థంలా అద్బుత జ్యోతిగా నేను కటాక్షిస్తాను, అన్నారు.

కాబట్టి దీపంనాడు కనిపించే జ్యోతి, మానవుల ప్రయత్నంతో ప్రజ్వలింపబడినట్లు తోచినా, నిజానికి పరమశివుడే ప్రపంచ ప్రజలు సత్ప్రవర్తనతో కూడిన జీవితం కొనసాగించాలని అఖండ జ్యోతిలా ప్రకాశిస్తున్నాడు.

మీ తలరాతను తెలిపేదే మీ సంతకం. మీ పేరులోని అక్షరాలను స్పష్టంగా అర్థమయ్యే రీతిలో సంతకం చేస్తే ఆయుష్షు వృద్ధి అవుతుంది. 

పరమేశ్వరుణ్ణి చూశారా అనే ప్రశ్నకు అ తిరుఅణ్ణామలై జ్యోతిని చూశాము అనేదే ఉత్తమమైన సమాధానమవుతుంది. పర్వతముపైన తిరుఅణ్ణామలై జ్యోతిని దర్శించిన పిదవ పునర్జన్మ వుండదు కదా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.

తాను వేరు, భగవంతుడు వేరు అనే అభిప్రాయోలు తొలగనప్పుడే పైన పేర్కొన్న ప్రశ్నలు తలెత్తుతాయి. తనను ప్రబవింపజేసేది కరుణాలయమైన ఆ పరంజ్యోతేననే భావన కలిగినప్పుడే భగవంతుని చేతులలో మనం ఒక పనిముట్టు అనే మహదానందస్థితి లభిస్తుంది. అందుకనే గురు కటాక్షం లేకుండా గిరిదర్శనంవల్ల పొందే, పరిపూర్ణమైన ఫలితాలను ఎవ్వరూ పొందలేరు. గురుకటాక్షము కలిగినవారు సంవూర్ణ ఫలితాలను పొందగలరు.

పరమశివుని ప్రత్యక్షం చేసుకోగలిగిన రావణుని స్ధితేమిట్టి?

అఖండజ్యోతిని ప్రత్యక్షంగా చూసికూడా స్వార్థపరత్వంతో ప్రాణరక్షణ వరాలనే కోరి, పొందాడు.
అలాకాకుండా తిరుఅణ్ణామలై కార్తీక దీపజ్యోతిలో సాక్షాత్తు పరమశివుడే కనుపించినప్పుడు నీ నామస్మరణతోనే జీవించే భాగ్యం కలగజేయమని వేడుకోవడమే కదా ప్రధానము.

ప్రత్యక్ష అఖండ జ్యోతి ప్రజ్వలన

పలుసిద్ధ పురుషులు ఆధ్యాత్మిక పరమైన మహిమగల మూలికల తైలాలను కార్తీకదీపం రోజున, ఉపయోగించే నేతిలో మిశ్రమం చేస్తారు. వాటి మహిమతో, వెలుగుతున్న జ్యోతినుండి వెలువడే ధూమం పవిత్రమైన గాలితో కలిసి భూమండలంలోనే కాక యితరలోకాలలో సైతం ప్రసరించి దుష్ట శక్తులను నశింప జేస్తుంది.

భగవంతుడు తన శక్తిని, తనచే ప్రభవింప బడిన మానవుల మూలంగా తేటతెల్లం చేస్సున్నాడనేదే తెలుసుకోవలసిన విషయము. ఇంతేకాక, పలు అవతార మూర్తుల ద్వారా తన మహిమను ప్రకటిస్తున్నాడు. ఈ విధముగా తన ఉనికిని మహిమను తెలియజేయడానికి ఎన్నో మార్గాలను అవలంబించాడు. చాలామంది సిద్ధ పురుషుల రూపంలో మనలను కరుణిస్తున్నాడు.

పంచ భూతదేవతలను వత్తులుగా చేసి, సిద్ధపురుషులు, బ్రహ్మజ్ఞానులవంటి మహితాత్ములు చేసిన పూజల శక్తులు, మూలికాతైలాలతో, అగ్నిదేవుని కర్పూర రూపంలో భగవంతుడు జ్యోతిరూపం ధరించి ప్రకాశిస్తున్నాడు. ఇదే ఒక్కొక్క దీపోత్సపం రోజున జరిగే పవిత్రోత్సవం. మానవుని ప్రయత్నంవల్ల జ్వలింపచేసిన జ్యోతి మాదిరి కనుపించినా, భగవంతుడు తన భక్తులను సాధనాలుగా చేసుకొని, జ్యోతిరూపంలో కటాక్షించే పవిత్రమైన రోజే దీపోత్సవం.

దీప పూజ

అరుణాచల కార్తీక దీప జ్యోతిని సిద్ధ పురుషులు, జ్ఞానులు, యోగులు, బ్రహ్మర్షులు, మహర్షులు, ముముక్షువులు, మునుల వంటి వారు కర్పూర ధూపాలతో పూజచేసిన పిదవనే లక్షోప తక్షల మానవులు దర్శనం చేసుకుంటున్నారు.  ఈ నాటికీ అరుణాచల దీపం ప్రజ్వలింప జేసిన కొద్ది క్షణాలలో జ్యోతి చుట్టూ మేఘాల పరిభ్రమణ కనుపిస్తుంది. నిజానికి, ముప్పైకోట్ల దేవతలు పూజే మేఘాలకు నేపధ్యమపుతుంది. ఎవ్వరూ తెలుసుకో లేకుండా పరిభ్రమించే ఆధ్యాత్మ రహస్యం. ఈ సమయంలో నక్షత్రాల రూపంలో పర్వతమార్గవు హద్దుల్లో చాలా జ్యోతులు ప్రకాశిస్తుంటాయి. అవి దివిటీలు కావు.

మహర్షులు, దేవతల పవిత్ర స్వరూపాలే ఈ నక్షత్రాలు. తిరుఅణ్ణామలై జ్యోతిలో కనుపించే ఆధ్యాత్మిక వింతలను చూశారా?

జ్యోతి యితర రూపాలు

దీపంనాడు సిద్దులు, మహర్షులు, జ్ఞానులు, యోగులతో దేవతలు, మానవులు, స్థావరాలు, జంగమాలు, పక్షులు ఒక్కొక్క రకానికి అణ్ణామలై జ్యోతి ఒక్కొక్క విధంగా కనుపిస్తుంది. తిరుఅణ్ణామలైలో ప్రభవించే ఈవింత అద్బుతమైన ఆధ్యాత్మిక రహస్యమవుతుంది.

సూర్యభగవానుని గమనం ఈ నాటికీ తిరుఅణ్ణామలైకి అడ్డంగా కాకుండా, పర్వతాన్ని చుట్టే విధంగా ఉంటుంది. మన కళ్లకు సాధారణ పర్వతముగా కనిపించినా, తారలు, సూర్యుడు మొదలైన గ్రహాలు అధిగమించలేని, ఆకాశాన్నంటుతున్నంత ఎత్తున తిరుఅణ్ణామలై వున్నదని సిద్ధపురుషులు ప్రవచించారు.

గ్రహాలకు ఒక విధంగానూ, నక్షత్రాలకు మరో విధంగానూ, గోళాలకు మరణించిన వారి రూపంతోనూ ఎన్నో రకాల రూపాలలో తిరుఅణ్ణామలై కనుపించి కరుణిస్తున్నది.
అందుకనే ప్రపంచములో వున్న ఒక్కొక్క జీవీ, భగవంతునినుండి ప్రభవించిన పంచభూత విహితాచర రూపమే అవుతుంది. పంచభూత తత్త్వాల మిశ్రితమైన మానవుడు స్వామి వల్లలార్ మాదిరి పంచశక్తులను వేరుచేయగల ఆధ్యాత్మిక శక్తిని పొందగలిగి నప్పుడే అతడు మహాత్మడు, జ్ఞాని, యోగి.

శ్రీ అగస్త్యుల దైవ కైంకర్యం

మాయలో మునిగి జీవించే సాధారణ మానవుడు తిరుఅణ్ణామలై అఖండ జ్యోతి దర్శన మహిమను తెలుసుకునేందుకు, భగవద్ధ్యానంతో తపస్సుచేసిన వారు శ్రీ అగస్త్య మహాముని.

పలుయుగాల పర్యంతం విడవకుండా ప్రతిదినం శివపంచాక్షరి నామజపం చేసినవారే తిరుఅణ్ణామలై పర్వతాన్ని ప్రదక్షిణ చేసారు.

కైలాసంలో సర్వవేళల్లో మహేశ్వరునితో సంభాషించే భాగ్యాన్ని కలిగిన సిద్ధ వురుషులకు నాయకుడు శ్రీ అగస్త్య మహర్షి. ప్రపంచానికి ఉదాహరణగా వుపయోగింపబడే తపస్సాధనా మార్గాలను మహర్షి తెలియజేసారు.

శ్రీ అగస్త్యుల తపస్సువల్ల ఆనందించిన పరమేశ్వరుడు ఒక్కొక్క సంవత్సరం కార్తీక దీపం రోజున మేము అఖండ జ్యోతి రూపంలో మా ఆది అంతాలు తెలిసి దర్శనం ఇస్తాము. ఈ విధమైన దర్శనం భూలోక వాసులకు మాత్రమేకాక స్వర్గం మొదలైన లోకాలలో జీవించే కోటానుకోట్ల జీవులకు కూడా మహదానందాన్ని కలిగిస్తుంది అని అభయమిచ్చారు. ఈ విధంగా మనకు ఒక్కొక్క సంవత్సరం భక్తుల సమూహం హెచ్చవుతున్న దృష్ట్యా కార్తీక దర్శనమే అఖండ జ్యోతి దర్శనమవుతుంది.

తిరు అణ్ణామలైలో అన్నదానం

దానాలన్నిటిలోనికీ ఉత్తమమైనది అన్నదానం. అన్నదానంచేసే పద్దతుల గురించి సిద్ధపురుషుల సూచనలు.

 1. చాలా మంది ఒగటిగా కలిసి అన్నదానం చేయడం శ్రేష్టం.

 2. సద్గురువులు నిర్వహించే సత్సంగాల ద్వారే జరిగే అన్నదానం మాదిరి గౌరవం, పొంతన, అంతస్తు, సమయం, కాలం, స్థలం, సామాగ్రి, ఉద్తేశ్యము వగైరా వేటినీ పాటించకుండా అందరూ శరీర సేవ చేయడం ఉత్తమమైనది. వ్యావహారిక జీవితం కారణంగా శరీర శ్రమ చేయలేకపోయినా వీలైనంత వరకు ప్రయత్నం చేయడం అవసరం.

 3. భగవన్నామ స్మరణ చేసే వారే కార్యాలను చేయాలి.

 4. అన్నదాన పతార్థాలన్నీ మన ఇంటి వంటల మాదిరే ఉండాలి. ఏదో చేస్తున్నామనే అభిప్రాయం కలుగకూడదు.

అన్నదాన ప్రతిఫలం

ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తితో నిండి, జాతి, మత, కుల భేదాలు పాటించకుండా బీద ప్రజలకు అన్నదానం చేసేటప్పుడు వచ్చే ప్రతిఫలము.

 1. దానిలో వొదిగివున్న భగవన్నామ శక్తివల్ల, దానిని పొందే వ్యక్తులకు భగవద్భక్తి చేకూరుతుంది.

 2. అన్నవుసారంతో దైవకృప కలియండంవల్ల ఈ ఆధ్యాత్మిక శక్తి ఆ పేదల శరీరంలో కొన్ని సంవత్సరాల వరకూ సాగి, అద్బుతమైన సంతతిని కలుగజేస్తూ, మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది.

 3. అన్నవుసారం మంచి నడత, భక్తి, నిదానం వంటి మంచి గుణాలను కలిగిస్తుంది. వీటిని సాధారణంగా సాధువులు స్వానుభవంతో పొందవచ్చు. కానీ వీటి నన్నింటినీ ఒక్కొక్కప్పుడు అన్నదానంతోనే సాధించవచ్చు.

 4. అన్నాన్ని అడుక్కునే దారిద్ర్య స్ధితిలో వుండే మానవుడు పూర్వజన్మ పాపాలకారణంగా, కష్టల పాలవుతాడు. ఈ అన్నరస పుష్టికి ఆధ్యాత్మిక శక్తి కలవడంవల్ల పాపకర్మలు తీరిపోయి, అతనికి శాంతి కలగటమే కాకుండా అతడి భావి సంతతికి కూదా మంచి జరుగుతుంది. సద్గురువులే ఈ వింతను వేలకు వేల బీదల జీవితాలలో అన్నదానం మూలంగా నిరూపిస్తున్నారు.

 5. తిరుఅణ్ణామలై అన్నదాన కైంకర్యం 1000 మంది బీదలకు ఆహారమిస్తే ఒక సిద్ధపురుషుడు ప్రత్యక్షంగా వచ్చి, ఆ ఆహారాన్ని అందుకొని, అందరినీ ఆశీర్వదిస్తాడు. ఏలాగంటే, మహాభారతంలో శ్రీ కృషణపరమాత్మ, ఆహారపాత్రలో మిగిలిన చిన్న ఆకుకూర ముక్కను రుచి చూడగానే దూర్వాస మహర్షి యొక్క వందలాది శిష్యగణం ఆకలి ఎలా తీరిందో అదే మాదిరి. అలాగునే 1001 మంది జీవుల ఆకలి బాధన ఆయన అన్నదానం మూలంగా తీర్చేస్తారు.

 6. అన్నదానవు ఆహారాన్ని ఆకలి తీరే విధంగా సిద్ధులు కటాక్షించి ఈ కైంకర్యానికి బహుమానంగా ముఖతా దర్శనమిచ్చి అన్నదానం చేసిన భక్తులనూ, దానిని పొందిన వారినీ ఆశీర్వదిస్తారు.

 7. సిద్ధులే నేరుగా వచ్చి ఆశీర్వదించే అన్నవు సారము, మానవుల శరీరంలో రక్తంగానూ, ఇంత్రియంగానూ, ప్రాణవాయువుగానూ, అణువులుగానూ, మజ్జగానూ మారి శరీరంలో కలిసి ఆహారాన్ని తీసుకునే వారి సంతతికి మంచి ఫలితాలను కలుగజేస్తుంది.

 8. మండూక ధ్యానం చేయడానికి అవసరమైన దశముఖ దర్శనం, తిరుఅణ్ణామలై
  ఈ చోట రావణుడు ఎన్నో యుగాల కాలం తపస్సు చేసి పది తలలను వరంగా పొందాడు

 9. ఈ విధంగా ఒకరి అన్నదానంలోని ఆధ్యాత్మిక శక్తి గురువుల కటాక్షంతో పలుతరాలకు గూడా ఫలితాలనిస్తుంది గాబట్టి, దానాలలో శ్రేష్ఠమైనది అన్నదానమని చెప్పబడుతోంది.

 10. సద్గురువులు చేసే అన్నదానంలో గంగ, కావేరి వంటి పుణ్యతీర్థాలు, బిల్వం, తులసి వంటి అద్బుత మూలికలు, కాశీ, రామేశ్వరం, వైదీశ్వరన్ కోవెల, తిరువిడైమరుదూర్, శ్రీరంగం, తిరుపతి, శ్రీ శబరిమల వంటి వుణ్యక్షేత్రాల ప్రసాదాలు, హోమం గుండాలలోని విభూతి ప్రసాదాల వంటి పుణ్య పదార్థాలు చేర్చబడటంవల్ల అన్నదానాన్ని స్వీకరించే సమూహంలో ప్రత్యేకించ బడ్డ కుష్ఠువ్యాధిబాధితులకు, దాతల మూలంగా మానసికంగా ఊహించలేని పరిమితికి పుణ్యప్రదమైన తీర్థప్రసాదాలు అందుతాయి. ఇది వారి రుగ్మతలను తీర్చే అత్యద్బుత ఔషధంగా అమరుతుంది. ఒక అంధుడు శబరిమలకు పోయే వీలవుతుందా? కానీ శ్రీ శబరిమల ప్రసాదం మిశ్రితమైన ఆహారాన్ని ఆ అన్నదానంతో ఆరగించగలుగుతాడు.

 11. వికలాంగులు, గుడ్డవారు, దేశదిమ్మరులు, కుష్ఠురోగులు వంటి వారికి పైన పేర్కొన్న అన్న ప్రసాదం దొరుకుతుందనేది నమ్మలేని విషయం గదా జాతి, మత, కుల వివక్షత పాటించకుండా మానవులంతా ఒకటేనని అందరి క్షేమాన్ని కాంక్షించి సద్గురువులు జరిపేవే ఈ అన్నదాన కైంకర్యాలు.

తిరు అణ్ణామలై దీపొత్సవ అన్నదానంలో లక్షోపలక్షల ప్రజలే కాక, కోట్లాది దేవతలు, గంధర్వలు, కింపురుషులు, మను, రుద్ర, పిత్రుదేవతలు, సప్త ఋషులు, సప్త మాత్రుకలు, దేవసమూహాలు, శ్రీ చక్రంలో వుండే 48 కోట్ల దేవీ రూపాలు, ముక్కోటి దేవతలు, దర్మ దేవతలు, మహర్షులు, యోగులు, జ్ఞానులు, ముముక్షవులు, బ్రహ్మఋషులు, దేవదూతాలు, జీవన్ముక్తలు, నవనాద సిద్ధులు, సిద్ధమహా పురుషులు, దైవావతార మూర్తులు, మానవుల ఊహకందని కోటాని కోట్ల దేవతల సమక్షంలో జరిగే ఈ అన్నదానం, వీరందరి కరుణ, ఆశీస్సులు, అనుగ్రహం అన్నిటినీ ఒకటిగా చేర్చి అన్నదాన ఆహారాన్ని దైవశక్తిగల పదార్థంగా మారుస్తుంది.

ఎసరు నీటి మహిమ

అన్నదానం శ్రేష్ఠమైన పూజ లాంటిది. అన్నదానవు పదార్థం వుడికేటప్పడు ఏర్పడే శబ్దం, నీరు వాయువుల బుడగల మూలంగా ఏర్పడిందనిపించినా, అన్నం, అగ్ని, వాయు, జలం, పృథ్వి దేవతల బీజాక్షర మంత్రధ్వని మార్గదర్శక స్వరమై పచన ధ్వనిలా వినిపిస్తుంది.

చందన కప్పుతో ప్రకాశించే శ్రీ రామచంద్ర మూర్తి
పున్నైనల్లూర్, తంజావూర్

అందుకనే పెద్దలు, పాలు పొంగాయా అనీ, ఎసరు పొంగిందా, అనీ ప్రశ్నించడం శుభప్రదమైన మాటలుగా ప్రశంశిస్తారు.

ఉడుకుతున్నప్పుడు వెలువడే సువాసన మిశ్రితమైన ఆవిరి పిత్రుదేవతలకు ప్రీతికరమైనది.

మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో, పెద్దల ఆశీర్వాదాలు కూడా అత్యంత అవసరం. ఉమ్మడి కుటుంబాలు మటుమాయమై పెద్దలతో కలిసి జీవించడమే అరుదైపోయిన ఈ రోజుల్లో వందేళ్లనాటి జమ్మి, వటవృక్షం, వేప వృక్షాలను తరచూ ప్రదక్షిణం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. 

ఏవిధంగా దేవతలు అగ్నిలో సమర్పించబడ్డ హోమ ఆహుతులను హవిస్సు మాదిరి పొందగలుగుతున్నారో అదే విధంగా ఆహారం ఉడికే నీటి ఆవిరే పిత్రుదేవతలకు ప్రసాదంగా అమరుతుంది.  

తిరు అణ్ణామలైలో  అన్నదాన ఎసరు నీటి ఆవిరి, స్వామికి కూడా ప్రీతికరమైనదవుతుంది. అందువల్ల అన్నదానమే అతి శ్రేష్ఠమైన శరీర పూజ అవుతుంది.

షోడశోపచార పూజ అనబడే 16 విధాల పూజాంశాలు కొంచెం కఠినమైనవి. కానీ, అన్నదానం కోసం చేసే శరీర సేవలో శరీరంలోని వివిధ అవయవాలు పాల్గొని, మనసుగూడా కలియడం వల్ల షోడశోపచార పూజ అన్నీ అంగన్యాస, కరన్యాస సాంప్రదాయాలు అన్నీ అన్నదానంలోనే ఇమిడి ఉంటాయి.

ధ్యానమంటే మనసుకు ఏకాగ్రత కోసం భగవంతుని గురించి మాత్రమే తరుచుకోడమని కాదు. అన్నదాన వంటకాలలో భగవన్నామ స్మరణచేసే వారు అన్నదాన ఆహారాన్ని రుచిగా సమకూర్చి శ్రద్ధగా జరిపేదికూడా ఒక ముఖ్య ధ్యానమే.

ప్రస్తుతంలో కుక్కర్స్లో అన్నం వండబడుతోంది. మట్టికుండ, ఇత్తడిపాత్రంలో పొంగే నీటితో ఆహారిన్ని సమకూర్చితే, ఎసరు నీటి ఆవిరి బీజాక్షర శబ్దప్రసారం వల్ల ఎన్నో దేవతల, పితృదేవతల ఆశీస్సులను ప్రత్యక్షంగా పొంది, జీవితంలోని సమస్యలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

అన్నదానవు సంవూర్ణ ఫలితాన్ని
పొందే మార్గం

అన్నదానం చెయ్యాలి అంటేనే ధనం ఖర్చు చెయ్యాల్సివస్తుంది. సంపన్నులు చెయ్యవలసిన కార్యమిది అనే అభిప్రాయం కలుగుతుంది. బీదకుటుంబీకులు, తమ శక్తికి తగట్టు తిరుఅణ్ణామలై దీపం రోజున రెండు భోజన పొట్టాలను, బిస్కట్లు, అరటిపండ్లు, మజ్జిగ, పాత దుస్తులు, వీటిలో వేటిని యివ్వ వీలవుతుందో వాటిని దానం చేయవచ్చు. తనకు మూడు వేళలకు ఆహారం లేనప్పుడు యితరులకు అన్నదానమా? ఇదేగదా త్యాగమంటే కానీ వారి వారి మనస్సాక్షుల సూచన ప్రకారం దానం చెయ్యాలి.

తిరుఅణ్ణామలైలో సంవూర్ణ ఫలితాన్ని పొందేందుకు ఈ క్రింది విధులను నిర్వర్తించాలి.

 1. ఇతరులతో కలసి ముందుగా అన్నదాన విధానాలను, ఏర్పాట్లను సరిచూచుకోవాలి.

 2. చిల్లర చిల్లరగా ధానాన్ని దాచుకొని ఆ మొత్తాన్ని దీపం రోజున అన్నదాన నియామకంలో కలపాలి.

 3. అనేకులను ఈ సత్కార్యంలో పాలుపంచుకునేలా చెయ్యాలి.

 4. జాతి, మత, కుల భేదాలు లేకుండా దాన ధర్మాలు చెయ్యాలి.

 5. భగవన్నామ స్మరణతో అన్నదాన పదార్థాలను సిద్దంచేసి, వినియోగించాలి.

వస్త్రదాన మహిమ

ఒక్కొక్క సంవత్సరం కార్తీక దీపం రోజున శ్రీలశ్రీ లోబామాతా అగస్త్య ఆశ్రమం ద్వారా వేలకువేల బీదలకు నూతన వస్త్రాలు దానంగా ఇవ్వబడుతున్నాయ్. చీరలు, ధోవతులు, చొక్కాలు, లాగులు, బనీన్లు, కంబళ్ళు, దుప్పట్లు, చేతిసంచులు, రిబ్బన్లు, బట్టలు వంటివి వివిధమైన ఖరీదైన దుస్తులు, ఆభరణాలు తిరుఅణ్ణామలైలో దీపోత్సవం రోజున మా ఆశ్రమంలో వినియోగించబడుతున్నాయి. తిరుఅణ్ణామలేశ్వరుని దీపోత్సవ ప్రసాదంగా రూపోందిన ఈ దుస్తులు వగైరాలు మా ఆశ్రమంలోని భక్తుల ద్వారా భారత దేశంలో వున్న పలు దేవాలయోలకు తీసుకు పోబడి అక్కడవున్న బీదసాదలకు, స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకూ, సేవకులకూ దానంగా యివ్వబడుతున్నాయి. ఈ వస్త్రదానంలో గల ఆధ్యాత్మిక అద్భుత రహస్యమేమిటో తెలుసుకొందాం.

ఉదహరణంగా తిరుఅణ్ణామలైలో కొన్ని వస్త్రాలను తెప్పించి వాటిని తిరుపట్టూర్లోని దేవాలయంలో దానం చేస్తున్నట్టు ఉహించుకొందాం. ఆచర్య వెనుక వేలాది ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి.


శ్రీ బ్రహ్మ మూర్తి
తిరుపట్టూర్ శివాలయం

దానంగా ఇవ్వబడిన వస్త్రాలు కార్తీక దీపవు అద్భుత కాంతికిరణాలు పొదిగి అపరిమిదమైన పుణ్య శక్తిని పొంది వుంటాయి.

తిరుఅణ్ణామలై కార్తీక అఖండ జ్యోతి కిరణాల పుణ్యశక్తి పూరిత వస్త్రాలను ఒక భక్తుడు తిరుపట్టూర్ పుణ్యస్థలానికి తీసుగొని పోగా ఆ కాంతికిరణాలు అతని నేత్రాలలో ప్రసరిస్తుండగా అతనికి కనుపించిన వారందరి నేత్రల మీదా ఆ కిరణాల పుణ్యశక్తి ప్రసరిస్తుంది.

తిరుఅణ్ణామలై జ్యోతిని కాంచిన వారూ, కాంచని వారూ అందరికీ మార్గమంతా కార్తీక జ్యోతి యొక్క దైవశక్తి ప్రసరణ జరుగుతుంటుంది.   ఇది సూక్ష్మరూపంలో జరిగే అద్భుతం. ఈ ఆధ్యాత్మిక శక్తుల పరిభ్రమణవల్లనే పూర్వ జన్మ కర్మవిమోచన పొందగలుగుతున్నారు. సాధారణంగా కర్మఫలాన్నైనా అనుభవించే తీర్చుకోవాలి అనేది నీతి. కానీ, తిరుఅణ్ణామలైలో సద్గురు కృపవల్ల జరుపబడే జ్యోతి ఉద్బవం మతభేదాలు లేకుండా నెరవేర్చబడే ప్రజల సేవలో ఈ పుణ్యస్థలానికి సంబంధించిన విశేషాలవల్ల పుణ్యశక్తి వేలరెట్లకు గాక అ పుణ్యశక్తివల్ల పలువిధాల కర్మల నుంచి (గురువుల అనుగ్రహంవల్ల మాత్రమే) విమోచనం గూడా జరుగుతుంది.

ఆదివారాల్లో రాహుకాల (సా||4.30-6 గం||) సమయంలో సుషుప్త వృక్షాన్ని ప్రదక్షిణ చేసి నమస్కరిస్తే అకారణంగా నిద్రరాకుండా వుండేవారికి సుఖమైన నిద్ర లభిస్తుంది. 

కాబట్టి తిరుఅణ్ణామలై కార్తీక దీప జ్యోతి దైవీక కాంతి కిరణాలు దానంకోసం వినియోగించబడ్డ వస్త్రాలపై ప్రసరించి, అపరిమితమైన పుణ్యశక్తులను నింపుకోవడం వల్ల వాటి అనుగ్రహం, వస్త్రదానం చేసే స్ధలంలో అన్నివైపులా ప్రసరించి శ్రీ అరుణాచలేశ్వరుని కరుణను ప్రభవింపజేస్తున్నాయి. అదేవిధంగా శ్రీ అణ్ణామలేశ్వరుని జ్యోతి గురించి తెలిసినవారు, తలియని వారు దర్శనం చేసుకున్నవారు, చేసుకోలేని వారు కుల, మత భేదం లేకుండా, అందరి మీదా ప్రసరించే పుణ్యశక్తి వల్ల చాలా రకాల పాప పరిహారాలు జరుగుతున్నాయి.

నూతన వస్త్రాలకు మంత్రాలు, పుణ్యశక్తులను ఎక్కువగా గ్రహించే స్వభావం వుంటుంది.

బీద ప్రజలకు సేవలు చెయ్యాలని కొన్ని ఆత్ములు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, భగవంతుడు వాళ్లను పత్తీచెట్టుగా సృష్టిస్తున్నాడు. అవి పత్తిగానూ, దారంగానూ, వస్త్రాలగానూ రూపాంతరమొంది తిరుఅణ్ణామలై పుణ్యస్థలాన్ని చేరి సద్గురువు పుణ్య కరద్వయ సంయోగంలో అనేక భగవత్సేవకుల పాపకర్మలను, పుణ్యశక్తిని దానం క్షాళన చేసి, దానం చేపట్టేవారి ద్వారా దాతలకు అపరిమితమైన మేలు కలుగుతుంది.

ఒక వస్త్రాన్ని దానం నిమిత్తం గురువుదగ్గర వుంచి, దానిని బీదలకు దానంగా యివ్వడానికి వెనుక ఎన్ని భగవల్లీలలు ఉన్నాయో తెలుసుకొన్నారా?

నూతన వస్త్రాలను పంచభూతాల శక్తులను కలిగి వుంటాయి. పాతగుడ్డలలో, వాటిని ధరించిన వారి పాప కర్మల ఫలాలు అంటుకొని వుంటాయి. పాత గుడ్డలలో మంచివాటిని దానంచెయ్యటం, వాటినంటుకునివున్న పాపకర్మలు దానాన్ని పర్యవేక్షిస్తున్న ధర్మదేవతలు స్వీకరిస్తారు గాబట్టి వాటిని గూడా దానం చెయ్యడంలో తప్పులేదు.

అయినా బీదలు నూతన వస్త్రాలనే ఆశిస్తారు కాబట్టి ఎప్పుడూ నూతన వస్త్రాలనే భగవంతుని కానుకగా అర్పించడం పంచభూతశక్తులు నూతన వస్త్రాలలో నిండి వుండడంచేత నూతన వస్త్రాల దానానికే మనం ప్రాముఖ్యత నివ్వాలి.

తొమ్మిది గజాల చీర దాన మహిమ

భగవత్కృపా ప్రాప్తికి అవసరమైన వాటిలో ముఖ్యమైన మంచి అలవాట్టు ఏక పత్నీ వ్రతం అనేది శ్రీ రామచంత్ర మూర్తి మాదిరి, దేహంలో, మానసంతో జీవించినంతకాలం ఆచరించవలసిన వ్రతం. కానీ కలియుగంలో వ్యవహారికంగా యిది సాధ్యమా?

శారీరకంగా, దృష్టిద్వారా, మానసికంగా, అంతరంగం ద్వారా ఉదయించే దుర్మార్గమైన ఐహీక నేరాలు ఎన్నో మరెన్నో. ఒక్కొక్క ప్రాణీ పురుషుడో, స్త్రీయో దాని మనస్సాక్షీకి విరోధంకాకుండా దీర్ఘాలోచన చేసిచూడాలి. ఇటువంచి కామ, క్రోధ అపరాధాలకు పరిహారంగానే ఎనిమిది లేక తొమ్మిది గజాల చీరను సిద్ధపురుషులు దానంగా అనుగ్రహీస్తున్నారు. ఎందుకు? వస్త్రమే గదా మానాన్ని కాపాడే చిహ్నం. గుడ్డ కట్టకపోవడం, చాలీచాలని గుడ్డను కట్టడం కామ నేరాలకు అంకురార్పణ. అంతరంగానికి మంచి నడత అనే కవచానెన్నో తొడగకపోవడమే చెడునడతకు దారితీస్తుంది. దీనికి పరిహారంగా శరీరాన్ని కప్పే కవచంగా ఎనిమిది, తొమ్మిది గజాల చీరలను దానం చెయ్యటమవుతుంది.

ఆహా, ఎంత పెద్ద చీర అంటూ ఆనందించేటప్పుడు ఆసంతోషమే (దానమిచ్చిన వారి) కర్మ ఫలాల విమోచనకు సుగమమవుతుంది.

ఆంతేగాక నూతన వస్త్రాలు, ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిది గజాల చీరలు చాలాపెద్దవిగా వుండటంవల్ల వాటి పంచభూతశక్తి, ఆఖర్షణ శక్తులు అధికమవుతాయి.

ఎనిమిది, తొమ్మిది గజాల చీరలను వుచ్చుకొని అంతపొడవు వాడే అలవాటులేని బీద స్త్రీలు వాటిని రెండుగా చించవచ్చుగదా అని అభిప్రాయపడవచ్చు. ఒకటి రెండైన చీరలను గ్రహించేటప్పుడు వారు ఆనందం పొందుతారుగదా, అలా అయితే ఆ ఆనందం రెట్టింపు అవుతుందిగదా.

మనం నూతన వస్త్రాలను ధరించేటప్పుడు పొందే ఆనందం కొంతసేవు వుంటుంది. కానీ మనం దానంచేసే కొత్త గుడ్డలను బీదలు ధరించి, వారు పొందే ఆనందం రెట్టింపై మనకు తిరిగి చెందినప్పుడు అది అంతులేని ఆనందమై అనుగ్రహం ఆశీస్సుల మాదిరి మారి మనకు శాశ్వతమై నిలిచే కవచ శక్తిలా కాపాడుతుంది. ఇదే దాన ధర్మాల మహాత్యం.

కాబట్టి, ఒకరు ఎంతదూరం (ఎంత వరకు) ఎనిమిది తొమ్మిది  గజాల చీరలు ఏడు మూరల ధోవతులు వంటి శరీరాన్ని పూర్తిగా కప్పగల వస్త్రాలను దానం చోస్తాడో అదే లెక్కకు అతని చెడ్డపనుల పాపకర్మల ఫలం తగ్గుతుంది. పరిస్థితుల ప్రాబల్యంవల్ల ఆచార వ్యవహారాలను అతిక్రమించి జీవితం గడపవలసి వచ్చినప్పడు ఎనిమిది, తమ్మిది గజాల చీరలను యితరులకు దానం చెయ్యటం ఒక మంచి పరిహీరం  అవుతుంది. కానీ, ఇలాంటి దాన ధర్మాల తరువాత వాశ్శు తమ జీవితాలను సరిదిద్దుకోవాలి.

భగవన్నామ జపం చేస్తే

తిరుఅణ్ణామలైలో ఓం నమశ్శివాయ, ఓం శక్తి వంటి భగవన్నమాలు స్తుతించడంవల్ల ఏవిధమైన విశేష శక్తి ప్రాప్తిస్తుంది?

దీని గురించి శ్రీ అగస్త్య గ్రంధాలు వేలానువేల పంక్తులలో వివరిస్తున్నాయి. తిరుఅణ్ణామలైలో జబించబడజే ఓం అనే ఒక దైవ నామానికి, వెయ్యిరెట్ల పుణ్యశక్తీ అధికమవుతుంది. కానీ తిరుఅణ్ణామలైలో చేయబడే ఇటువంటి పుణ్యశక్తి మంచి కైంకర్యాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఎంతగొప్ప, అద్భుతమైన పుణ్యశక్తి! చూచేందుకు లభించని, వేరెక్కడా పొందే వీలులేని పుణ్యశక్తి. ప్రపంచంలోనే తిరుఅణ్ణామలైకి మాత్రమే యింతటీ పుణ్యశక్తి వుంది. అలాగయితే తిరుఅణ్ణామలైలో వుండే ఒక్కొక్క క్షణమూ భగవన్నామ జపంతోనో, మంచి పనులతోనోగదా గడుపవలసింది.

మా అశ్రమంలో 27 నక్షత్ర లింగాలు,
27 నక్షత్ర వృక్షాలు దర్శనం చేయండి

ఇక్కడ భగవన్నామం జపం చేస్తూనే మంచి కార్యాలను చేస్తే హిమాలయాలను మించి ఆకాశాన్నందుకోగల శక్తి లభిస్తుంది.

సమూహ ప్రార్థనలు, మంచి కార్యాల మహిమలు

హిందూ మతం అనుసరించే సమూహ ప్రార్థన, భగవన్నామ జపాలవంటిని ఈ నాటికీ పలు యితర మతాలలో గూడా సాకి భగవంతుని లీలలను స్తుతిస్తున్నాయి. కుల, మత, జాతి, భేదాలులేని దైవాన్ని చాలా మంది కలిసి ఒక చోటచేరి, ప్రార్థించడంలోనే ఆనందం ఇమిడివుంది. దీనికోసమే దేవాలయాలు, మసీదులు, ప్రార్థనామందిరాలూ వెలసినాయి.

వందమంది చేరి నామావళి, సహస్రనామ పారాయణ త్రిశతి, భక్తిగీతాలు, తిరువాచకం, వంటిదైవస్తోత్రాలు పఠిస్తుంటే అవి నూటికి నూరై ఇనుమడిస్తుంటాయి. వందమంది చేరి ఓం నమశ్శివాయ అని ఒకసారి అంటే ఒక్కొక్కరు వందసార్లు ఓం నమశ్శివాయ మంత్రాన్ని అన్నట్లు శ్రీ చిత్రగుప్తుడు పుణ్యవులెక్కలో రాస్తాడు. ఇదీ సామూహికప్రార్థన మహిమ.

ఈ సామూహిక నామ బపమే తిరుఅణ్ణామలై పుణ్యస్థలంలో జరిగితే...

తిరుఅణ్ణామలై పరిహద్దు ప్రాంతాల్లో ఏస్థలంలోనైనా వంద మంది చేరి ఓం నమశ్శివాయ అని ఒకసారి ఎలుగెత్తి అంటే ఒక్కొక్కరు 100000 సార్లు ఓం నమశ్శవాయ అన్నట్టు చిత్రగుప్తడు పుణ్యవు చిట్టాలో రాస్తాడు. ఏదైనా సత్కార్యానికి 1000 రెట్లు ప్రతిఫలాన్ని ప్రసాదించే పుణ్యస్థలంగదా తిరుఅణ్ణామలై.

దినిని ఆధారం చేసుకొనే సత్యసాయిబాబా వంటి భగవత్స్వరూపులు సామూహిక ప్రార్థనలో జాతిమత భేదాలు పాటించకుండా జరుపుతున్నారు.

అల్లాహో అక్బర్, పరమపిత వంటి భగవన్నామాలు జపిస్తూ ఏ కుటుంబాలైనా సత్కార్యాలు చేస్తే అవి వేయి రెట్లు అధిక మపుతాయి.  

తిరుఅణ్ణ్మలైలో జరిగే జపం, తవం, ధ్యానం, పూజ, ఆరాధన, అభిషేకం, అన్నదానం, వస్త్రదానం, బీదలకు చేసే ఔషధ సాయం వంటి అన్ని మంచికార్యాలు, మంచి ఉద్దేశాలూ ఒక్కొక్క విధమైన, విశేష పుణ్యశక్తి లభిస్తుంది. ఈ రహస్యాలను సద్గురువు నాశ్రయించి తెలుసుకొని మంచి ఫలితాలను పొందండి.

అన్నదానం, వస్త్రదానం, ఔషధ సాయం, పాదరక్షాదానం, కట్టెల దానం, తైలదానం, దీపదానం, హోమం వంటి వాటిని సామూహికంగా నిర్వర్తించి కోటానుకోట్ల సత్పలితాలను పొందండి.

తిరుఅణ్ణామలై విచ్చేయండి

తిరుఅణ్ణామలైలో జరిగే సత్కార్యాలు జప ధ్యానాల మూలంగా లభించే పుణ్యశక్తి సత్కార్యాలకు మాత్రమే సహకరిస్తాయి. దానిని దుర్మార్గవు మార్గాలకు వినియోగించ కూడదని పేర్కొన్నాంగదా? దీని మూల మేమిటి?

ఒకరు తడవతడవకూ తిరుఅణ్ణామలై వెళ్ళి చాలా మందితో కలిసి జీవించిన మంచివిధానలలోనే ఉపయోగించవలసిన పుణ్యశక్తిని హెచ్చు మొత్తంలో పొందగలిగితే చెడు ఆలోచనలను యోచించే వీలుండని పద్ధతికి అతడికి మనో పక్వత సిద్ధిస్తుంది. ఎంత కొప్ప భాగ్యం.

తిరుఅణ్ణామలైలోనే జీవించే భాగ్యం లభించిన వాళ్ళు, తమపుట్టుక యొక్క విశేషాన్ని  గమనించి, తమ జీవితంలో దాన ధర్మాలు చేయడం, తిరుఅణ్ణామలై యాత్రికులకు అవసరమైన సేవలు చేయడంవల్ల ఈ జన్మ కర్మలనుండి విముక్తి పొంత గలుగుతారు. కోటాను కోట్ల జన్మల కర్మల నుండి విముక్తి చేయగలిగిన పుణ్య స్థలం తిరుఅణ్ణామలై.

తిరుఅణ్ణామలైకి తరుచూ వెళ్లలేని వారూ, రాలేని వారూ ఏంచెయ్యాలి? వాళ్లకు కూడా శ్రీ అరుణాచనేశ్వరుడు మంచిమార్గాన్ని సూచించినట్టు శ్రీఅగస్త్య గ్రంధం పేర్కొంటుంది.

కార్తీక దీపం అణ్ణామలైలో ప్రజ్వలింపబడుతోందిగదా, లక్షోప లక్షల భక్తులు పాల్గొనే ఆదీపోత్సవంలో అన్నదానం చేయడంవల్ల ఒక సంవత్సరానికి సరితూగే పుణ్యశక్తిని సులభంగా పొందవచ్చు.

భరణి దీపం

కార్తీక దీపం నాటి మందురోజు అణ్ణామలై భరణి దీపం రోజు. పంచమూర్తుల దర్శనం, పంచభూతాలు తమకు మూలాధారమైన పరమేశ్వరుణ్ణి శివజ్యోతి మాదిరి వీక్షించే దినం.

మామూలుగా కొత్తగా వివాహమైన గ్రామ యువతులు కార్తీక దీపానికి యింటినించి దీపాలు వెలిగించే నిమిత్తం నూనెను తీసుకు రావడం ఆనవాయితీ.

తిరుఅణ్ణామలై అఖండ జ్యోతి దర్శనం గొప్ప విశేషమైనదంటే, అందరూ యా దివ్య దర్శనానికి బయల్దేరితే, ఇండ్లలో దీపం పెట్టేదెవరు? దీపంరోజు యిల్లు తాళం వేసి వెళ్ళొచ్చా?

పంచవర్ణ చిలుకల రూపంలో అనుగ్రహం చేసే
సిద్ధ వురుషులు, తిరుఅణ్ణామలై

సాధారణంగా వృద్ధులు లేక యితర్ల యిళ్లలో వుంటున్నారు, చుట్టు పక్కల వున్నవారిని నుంచి దీపం పెట్టించ వచ్చు. అయినా, తిరుఅణ్ణామలై పోయి, ఆవు నెయ్యి, పత్తి, మంచి నూనెలతో దీపారాధన చేసిన పిదవ జ్యోతి దర్శనం చేయడం ఎన్నేజన్మల పుణ్య ఫలమౌతుంది. దీపదర్శనమే మహాపాపాలన్నీటినీ క్షాళన చేస్తుంది.

తిరుఅణ్ణామలై కార్తీక దీపంలో, దీపం వెలిగించడానికి గమనించాల్సిన సేవలను అర్థం చేసుకుంటే ఈ భూలోకమేగాక ప్రపంచంలో వున్న సకలకోటి జీవులకూ ఆధారమైన ఈ దీపాన్ని వెలిగించే మహాపుణ్యశక్తిని పొందవచ్చు. అన్ని జీవాలనూ ప్రతికించే ఈ అద్భుత పరమేశ్వరుని సేవలో భాగం పంచుకోడం మహాభాగ్యంకదా.

కొత్తగా వివాహమయి వచ్చిన యువతులు, దంపతులు తిరుఅణ్ణామలై ఆలయంలో ఆవునేతి అఖండ దీపాలు వెలిగించడం పంచ జ్యోతులను వెలిగించడం చాలా గొప్పది. సుమంగళి అయిన అత్తగారి ద్వారానో, భర్త సంబంధీకులైన సుమంగళుల ద్వారానో ప్రథమ దీపజ్యోతిని వెలిగించి దాని నుంచి 12, 21, 51, 102 వంటి లెక్కలలో ఆవునేతి దీపాలను వెలిగించాలి.

ప్రథమ కార్తీకానికి గ్రహంలో దీపం వెలిగించాలి అనే కుటుంబవు ఆనవాయితీ వున్న వారు భరణి దీపంరోజున 27 నక్షత్ర లింగాలు వున్న దేవాలయాలలో ముందు భరణి నక్షత్ర లింగాలకు దీపాలు వెలిగించాలి. చెన్నైతగ్గరి తిరువట్రీయూర్ శ్రీ పడంబక్కనాతర్ శివాలయంలో 27 నక్షత్రాలకు ప్రత్యేకించబడిన లింగాలు వున్నాయి.

ఇంట్లో పైన చెప్పిన విధంగా సుమంగళి అయిన అత్తగారు, లేదా భర్త సంబంధీకులలోని సుమంగళి చేత ఆవునేతి జ్యోతిని 12, 21, 51, 102 వంటి లెక్కలో దీపాలను వెలిగించాలి. 27 నక్షత్ర దీపలింగాలు వున్న ఆలయం దగ్గరలో దొరకకపోతే ఏదో ఒక శివాలయంలో వృద్ధ సుమంగళితో వెళ్ళి, పైన చెప్పిన ప్రకారం దీపాలను వెలిగించాలి.

భరణి దీపజ్యోతి పుణ్యశక్తి, ఆడబిడ్డ లేక భర్తవైపు సంబంధించిన కుటుంబవు వారి సుఖ జీవనంకోసం. దీనివల్ల ఆడబిడ్డ, అత్తగారు వంటివారిచేత కలిగే కష్టాలు తరుగుతాయి. ఐకమత్యం కుదురుతుంది. కాబట్టి తిరుఅణ్ణామలై దీపానికి వెళ్లే అవకాశం వీలులేనప్పుడు మాత్రమే కాక ఏదైనా ఒక ఆలయంలో ఆవునేతి దీపాలను వెలిగించాలి.

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam