దివ్యాంగులకు సహాయపడే దివ్య పుష్కరం

ఓం శ్రీ వల్లభ గణపతి కృప
ఓం శ్రీ అంగాళ పరమేస్వరి కృప
ఓం శ్రీ సద్గురువు కృప

గురు మంగళ గంధర్వ శివరాజ యోగ మహోత్సవం 

ఒకే రాశిలో సూర్యుడు గురువు కలిసి ఉండటం శివరాజ యోగం అని పిలువబడుతుంది. శ్రీకృష్ణపరమాత్ములు, డమరుక శివసిద్ధులు వంటి ఉత్తమ పురుషులంతా ఇలాంటి శివరాజ యోగంలో అవతరించినవారే. స్వస్తిశ్రీ హేవిళంబి నామ సంవత్సరంలో ఇలాంటి శివరాజయోగం ప్రాప్తించనుండటం మన భూలోక మానవులు చేసుకున్న మహద్భాగ్యమే. ఈ యేడాది పురటాసి మాసం 31వ తేదీ మంగళవారం కృష్ణపక్ష త్రయోదశిలో ఇలాంటి శివరాజ యోగం ప్రాప్తించడం అరుదైన అద్భుత సంఘటన. శ్రీరంగనాథుడు శయన రూపంలో కొలువైన శ్రీరంగం క్షేత్రంలో శ్రీగణిత జ్యోతిష్యరీత్యా 17.10.2017 దినాన మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాలకు సూర్యభగవానుడు కన్యా రాశిలో నుండి తులారాశిలో సంక్రమించి ఈ అద్భుత శివరాజ యోగ సంగమాన్ని ఆవిర్భవింపజేయనున్నారు. ఈ శివరాజయోగం మంగళవారం గురుహోరలో ఉండటం వల్లే దీనిని గురుమంగళ శివరాజ యోగం అని పిలుస్తున్నారు. దీనితోపాటు విషు పుణ్యకాలం కూడా తోడవటంతో ఈ యోగ ఫలాన్ని మరింత పునీతంకావిస్తున్నది. ఈ యోగానికి డమరుక శివరాజయోగం తోడుకావటం వింతల్లో కెల్లా వింత. అంటే శివరాజయోగం ఏర్పడే తులారాశి అధిపతియైన శుక్రభగవానుడు కన్యారాశిలో సంక్రమించిన వేళ కన్యారాశికి అధిపతియైన బుధభగవానుడు సూర్య గురువుతో తులారాశిలో ఆవిర్భవించడమే డమరుక శివరాజయోగం. ఈ యోగ అమరికే అద్భుత గురుమంగళ గంధర్వ డమరుక శివరాజయోగ అమరిక. తులారాశిలో శివరాజయోగం రావడం మహామఖం వలె పన్నెండేళ్లకు ఒకమారు సంభవింస్తున్నదంటే ఇన్ని విశేషగుణాలు కలిగిన గురుమంగళ గంధర్వ శివరాజయోగం ఎన్ని వేల సంవత్సరాలకు ఒకమారు సంభవిస్తుందో ఓ సారి తలచుకుంటే ఈ యోగాన్ని అనుభవించగల మనకంటే అదృష్టవంతులు ఎవరై ఉంటారు? తులా పుష్కర స్నానికి అధిపతియైన శనీశ్వర భగవానుడు వృశ్చిక రాశిలో చేరి శుక్రుడు, అంగారకుడు (మంగళ గంధర్వులు) గ్రహమూర్తులతో రాజాధిరాజలకు విజయాన్ని చేకూర్చే మహిమాన్విత యోగాన్ని కలిగిస్తుంది. ఈ ప్రత్యేకతలన్నింటికి తలమానికంగా ఉంటోంది.

ఈ అయోమయ జ్యోతిష మెళకువలన్నీ వద్దు. ఓ సాధారణ దైవీక భక్తుడికి ఈ గురుమంగళ గంధర్వ శివరాజయోగం వల్ల కలిగే సత్ఫలితాలు ఏమిటని అడగాలనుకుంటున్నారు కదా? తులారాశిలో ఏర్పడే శివరాజ యోగం ఓ మానవుడు చేసే, అతడి కల్పనలకు కూడా అంతుచిక్కని తప్పిదాలకు కూడా ప్రాయశ్చిత్తం కలిగించగలిగించేది ఈ యోగమే! దివ్యాంగులకు, వృద్ధులకు, కటిక దారిద్య్రంలో ఉన్నవారికి సకల సౌభాగ్యాలను చేకూర్చునది ఇదే. కఠినాతికఠినమైన తప్పిదం అంటే భగవంతుడిని దూషించటమే కదా! అలాంటి మహా తప్పిదాన్ని గాయత్రీ మంత్రాన్ని ఈ లోకానికి అందించిన విశ్వామిత్ర మహర్షులు సైతం చేయాల్సివచ్చింది. మాయ వల్ల ఆ మహర్షి మహావిష్ణువునే తన పాద తాడనం చేసి ఘోర శాపాన్ని పొందిన విషయం మీకు తెలిసిందే. ఆ శాపం కారణంగా కుక్క కంటే హీనమైన స్థితిని విశ్వామిత్రుడు పొందినప్పుడు శ్రీఅగస్త్యమహర్షుల అనుగ్రహం చేత ఆయన తులారాశిలో శివరాజయోగం సంభవించిన ఓ విష్ణుపతి దినాన కారప్పంగాడు పెరుమాళ్‌ను ఆరాధించి శాప విమోచనం పొందారు. కనుక పైన నుడివినట్లు గురుమంగళ గంధర్వ శివరాజ యోగ దినాన మహాపురుషులచేత కీర్తింపబడిన కారప్పంగాడు, శ్రీరంగం అమ్మామండపం, కావేరి నదీ తీరాన జరిగిన ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని, సకల తప్పిదాల నుండి విమోచనం పొంది దైవానుగహ్రం, గురుభగవానుడి కరుణాకటాక్షములు స్వీకరించవలసిందిగా భక్తజనులను వేడుకుంటున్నాము. అగ్నిచేత కాల్చబడిన రాతి దోసె, రొట్టె, పరోటా, చపాతీ వంటి ఆహార పదార్థాలతో ఆరు వలయాలున్న జంతికలు, వాటితోపాటు ఓ పెద్ద లడ్డూను కూడా దానమిస్తే అత్యద్భుత ఫలితాలను పొందగలము. వృద్ధులకు, దివ్యాంగులకు అందించే ఇలాంటి దానాలు సుస్థిర లక్ష్మీకటాక్షాన్ని అందించి మోక్షప్రాప్తిని సైతం కలిగిస్తాయి. డమరుక శివసిద్ధులు ప్రతినిత్యమూ తిరుచ్చి సమీపంలో పెరుగమణి పళయూరు శైవస్థలంలోని పరమేశ్వరుడికి అభిషేక ఆరాధనలతోపాటు సుగంధభరిత సాంబ్రాణి ధూపం వేసి ప్రార్థించడం శుభదాయకం.

వరాహమిహురుడి సూత్రం ప్రకారం వృశ్చిక రాశిలో శనీశ్వరుడున్న వేళలో జన్మించినవారు జైలువాసం, ఇతరుల వల్ల మరణం వంటి కష్టాలను అనుభవిస్తారు. ఆ ప్రకారమే వృశ్చికరాశిలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నప్పుడు జన్మించిన శ్రీకృష్ణపరమాత్ముడు పాతాళపు జైలు గోడల మధ్యన జన్మించి, అంత్యకాలంలో వేటగాడి బాణపు దెబ్బకు అసువులు బాసారు. పైగా వృశ్చికరాశిలో ఉండే శనీశ్వరుడి దృష్టి వృషభరాశిలో ఉన్న మాతృకారకుడైన చంద్రభగవానుడిపైనా, శనీశ్వరుడి దశమస్థానపు దృష్టి సింహరాశిలో ఉన్న పితృకారకుడైన సూర్యభగవానుడిపై ప్రసరించడం వల్ల కృష్ణపరమాత్ముల తల్లి వాసుకి, తండ్రి వసుదేవులు కారాగార వాసం అనుభవించాల్సి వచ్చింది. ఈ కారణాన తీవ్ర మనోవేదనకు గురైన శనీశ్వరుడు తన కులగురువైన శనిభరణి సిద్ధులను శరణుజొచ్చి ఓ పూర్ణ అవతారపురుషుడికి, అతడి తల్లిదండ్రులకు కష్టాలు కలిగించే స్థితిని కల్పించటంవల్ల తనకు ఏర్పడిన దుఃఖాన్ని గురువులకు వివరించాడు. శనిభరణి సిద్ధులు 'శనీశ్వరా! భగవంతుడు నీకు అప్పగించిన కార్యాన్ని సక్రమంగా నెరవేర్చావు. అందువల్ల కలిగే సత్ఫలితాలకు దుష్ఫలితాలకు నీవే కారకుడివి అని భావించవద్దు. అయినా తిరుఅణ్ణామలైలో ఓసారి గిరి ప్రదక్షిణ చేస్తే దైవానుగ్రహం ప్రాప్తించి మరిన్ని ఉత్తమమైన వివరణలను పొందగలుగుతావు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శునక రూపంలో అదీ అంగవైకల్యంతో కూడిన శునకరూపం దాల్చి, గిరి ప్రదక్షిణను నిర్వర్తించు. ఇతరులకు నీకిచ్చే శెనగ ఉండలు తప్ప తక్కినవేవీ నీవు భుజించరాదని నీంటూ ఏర్పరచిన నియమాన్ని సక్రమంగా పాటించు' అని తెలిపి శనీశ్వరుడికి ఆశీస్సులందించారు శనిభరణి సిద్ధులు. 

ఆ సిద్ధపురుషుడి హితవచనాలతో ఉపశమనం పొందినమీదట శనీశ్వరభగవానుడు అంగవైకల్యం కలిగిన శునక రూపం దాల్చి తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేయసాగారు. అయితే ఆయనకు వేళకింత ఆహారం లభించడం కష్టతరమైంది. గిరి ప్రదక్షిణకు వచ్చే ఒకరిద్దరు మాత్రమే శెనగ ఉండలను ఇచ్చేవారు. అది కూడా అన్ని రోజులూ లభించేది కాదు. అయినా ఎంతో ఓర్పుతో తన గురుదేవుల ఆదేశాలను శిరసావహించి కాలే కడుపుతో, అంగవిహీనమైన కాళ్లతో నడుస్తూ తిరుఅణ్ణామలైని గిరి ప్రదక్షిణ చేయసాగాడు శనీశ్వరుడు. రోజులు గడిచే కొద్దీ శనీశ్వరుడికి లభించే శెనగ ఉండల సంఖ్య తగ్గిపోయాయి. చివరిదశలో 21 దినాలపాటు కనీసం ఒక శెనగ ఉండ కూడా లభించక, ఆకలితో మలమలమాడి, బక్కచిక్కిపోయి అక్కడక్కడా దారిలో ఉన్న వాననీటిని మాత్రమే తాగుతూ తన గిరి ప్రదక్షిణను కొనసాగించారు. అలా గిరిప్రదక్షిణ చేస్తూ శనీశ్వరుడు కుబేరలింగం దాటుకుని సిద్ధపురుషులు పరిభాష ప్రకారం ఎనిమిదడుగులకు ఒక జాన అంటూ కాసింత దూరం వరకూ నడిచి ఆకలిని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయారు. ఆ దర్శన ప్రాంతానికి 'కాకి తవ్వినగొయ్యి' అని పేరు. ఎలాంటి శనిదోషాలనైనా, నాగదోషాలనైనా, వివాహ దోషాలనైనా తొలగించగల అద్భుత అనుగ్రహ దర్శనం ఇది. ఆ చోట అరుణాచలేశ్వరుడు తెల్లని గడ్డం ధరించిన పండితుడి రూపంలో శనీశ్వరుడికి దర్శనమిచ్చి 'శనీశ్వరా, నీ తపస్సు పూర్తయ్యింది. శ్రీరంగంలో శయనించి భక్తకోటిని అనుగ్రహిస్తున్న శ్రీరంగనాథపెరుమాళ్‌ను, ఏ రాశిలో నీవు సంచారం చేసినందువల్ల కృష్ణావతార సందర్భంగా మహావిష్ణువు జైలువాసంలో జన్మించారో, అదే రాశిలో నీవు సంచరిస్తున్నప్పుడు, అది గురు నవాంశంగా అమరే దినాన అమ్మామండపం వద్ద తులా పుష్కరమాచరించి దర్శనం చేసుకుంటే నీకు సంపూర్ణ శాంతి లభిస్తుంది' అని దీవించారు. 

ఆ తర్వాత శనీశ్వరుడు వ్యయప్రయాసలనోర్చి శ్రీరంగం క్షేత్రానికి చేరుకున్నారు. తులా మాసంలో వృశ్చిక రాశిలో గురునవాంశంలో శనీశ్వరుడు సంచరించే దినం వరకూ రోజూ అమ్మామండపంలో స్నానమాచరించి శ్రీరంగనాథస్వామివారిని దర్శనం చేస్తూండేవారు. అరుణాచలేశ్వరుడు సూచించిన ఆ దైవీక ముహూర్త అమృతగడియల్లో పొంగి ప్రవహించిన కావేరి నదిలో స్నానమాచరించిన శనీశ్వర భగవానుడికి శ్రీదేవీ, శ్రీభూదేవి సమేతుడై శ్రీరంగనాథపెరుమాళ్‌ దర్శనమిచ్చి 'శనీశ్వరా! కృష్ణపరమాత్ముడికి, అతడి తల్లిదండ్రులకు తీరని కష్టాలు కలిగించినట్లు భావిస్తున్నావు. నిజానికి నీ త్యాగం వల్లే కృష్ణావతారానికే కీర్తి లభించింది' అన్నారు. పెరుమాళ్‌ పలుకులు శనీశ్వరుడికి తియ్యటి తేనె పలుకుల్లా వినిపించాయి. శనీశ్వరుడు సంతసించి 'స్వామీ! మీరు చెబుతున్నదేమిటో నాకు అర్థం కావటం లేదు. జైలువాసంలో ఎన్నో కష్టాలు కలిగించిన శనిదశ ఆ పెరుమాళ్‌కు కీర్తిని కలిగించిందంటే నేను నమ్మలేకపోతున్నాను. దయచేసి అర్థమయ్యేలా వివరించండి' అని ప్రార్థించాడు. పెరుమాళ్‌ సమాధానం చెబుతూ 'ఓ సాధారణ శిశువు భూలోకంలో జన్మించాలంటే దానికి తల్లిదండ్రులు ఎన్నో జన్మలపాటు తపస్సు చేసి ఉండాలని దైవ నియతి ఉంది. అలాంటప్పుడు ఓ పూర్ణావతారం ఈ భోలోకంలో జన్మించాలంటే తల్లిదండ్రులు ఎంతటి ఉత్తమశీలురుగా ఉండాలి. అదే సమయంలో ఆ తల్లిదండ్రులు ఎంతటి తపశ్సీలురుగా ఉన్నా ప్రశాంతంగా ఓ చోట తపమాచరించాలంటే దానికంటూ ఓ ప్రత్యేకమైన స్థలాన్ని ఎలా ఎంపిక చేయగలం. దానికి అన్ని విధాల అనువైన స్థలమే పాతాళ కారాగారం. ఒకే బాణానికి రెండు మామిడి పళ్ళు అన్నట్లు ఒకే సమయంలో రెండు రకాల అనుగ్రహాలు ప్రాప్తిస్తున్నాయి. మొదటిది భూమికి దిగువ పాతాళంలో చేసే తపస్సు అత్యంత శక్తివంతమైనది. (తిరుఅణ్ణామలై పాతాళ లింగం వద్ద తపస్సు చేసి రమణమహర్షులు అద్భుత సిద్ధులు పొందిన విషయం మనకు తెలిసిందే) రెండవది వామనావతారం సందర్భంగా మహాబలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపటం వల్ల నా అవతార లక్ష్యాలు నెరవేరినా, దానమిచ్చిన దానశీలిని భూమికి దిగువన బంధించడం వల్ల, తదుపరి అవతారంలో నేను పాతాళంలో అవతరించాల్సి వచ్చింది. వీటన్నింటికీ శనీశ్వరుడు అనే విధి నాయకుడిగా నీవు నెరవేర్చిన పక్షపాతరహితమైన నవగ్రహ సేవ సాయపడింది కదా! కృష్ణుడు అంటే నల్లనివాడు అని అర్థం. నా అవతారానికి నీవు నెరవేర్చిన సేవను మెచ్చుకునే రీతిలో కృష్ణావతారంలో నీకు ప్రీతికరమైన నల్లని వర్ణాన్ని స్వీకరించాను కదా! ఇప్పటికైనా నీవు చేసిన సేవలు ఎంతటి మహోన్నతనమైనవో చూశావు కదా?'. పెరుమాళ్‌ మాటలకు మురిసిపోయాడు శనీశ్వరుడు. మహదానందంతో అతడి నోటి వెంబడి మాటలు రాకపోయాయి. పెరుమాళ్‌ మళ్లీ శనిశ్వరుడిని ఓదార్చుతూ 'ఈ కారణాల చేత ఈ రోజు నుండి ఎవరైతే తులా మాసంలో శ్రీరంగం అమ్మామండపం వద్ద స్నానమాచరించి నన్ను దర్శించుకుంటారో వారినందరినీ వృశ్చికరాశిలో మాత్రమేకాదు ఏ రాశిలో నీవు సంచరిస్తున్నప్పుడు జన్మించినా వారి బంధనమంతా దైవీక బంధనంగా, దేవుని నివాసంగానే ఉంటుంది' అంటూ వరమనుగ్రహిస్తున్నాను. భగవదవతారాలకు సైతం సద్గురువులే మార్గదర్శకంగా ఉంటారన్నది సత్యవాక్కుగా ఉండటం వల్ల నీవు గురు నవాంశంలో సంచారం చేస్తున్నప్పుడు నెరవేర్చిన పూజలే నీకు పూర్ణమైన గురువుల అనుగ్రహం ప్రాప్తించేందుకు దోహదపడ్డాయి' అని శ్రీరంగనాథస్వామి హితోపదేశం చేశారు. 

రాబోవు 17.10.2017 దినాన శనీశ్వర భగవానుడు వృశ్చిక రాశిలో ప్రవేశించిన వేళ ఆయన నవాంశ సంచారం గురువుకు సంబంధించిన మీనరాశిలో తులారాశి అధిపతియైన శుక్రభగవానుడితో ఉచ్చమైన బలవర్థకమవుతుంది. ఇంతటి అద్భుతమైన శుభముహూర్త సమయంలో శ్రీరంగం అమ్మామండపంలో స్నానమాచరించి శ్రీరంగనాధస్వామివారిని దర్శించటం వల్ల, లడ్డూ, జంతికలు దానం చేయడం వల్ల లభించే సత్ఫలితాలను గురించి మాటలలో వర్ణించలేము. 
అరచేతిలో ఇమిడే లడ్డూ, జానెడు జంతిక 
కష్టాలను తొలగించే వరదాయక ఔషధం 
కరతలామలకం లాంటి ఈ భావనే 
నిన్ను అన్ని విధాలా కాపాడుతుంది 
-అంటూ శ్రీరంగంలో ప్రసాదంగా ఇచ్చే అరచేతిలో పట్టనంత పెద్ద లడ్డూ, జానెడు జంతిక మహిమలను అగస్త్యగ్రంథం వివరిస్తోంది. ఈ దానం పేదరికాన్ని పోగొట్టడమే కాక భక్తజనులను మహోన్నత జ్ఞానస్థితికి చేరుస్తుందనటం అతిశయోక్తి కాదు. మనం చూసే ఈ లోకం పంచభూతాలతో సృష్టించబడిన మాయ అన్నదే వాస్తవం. ఇదియే కరతలామలకం అనే జ్ఞాన స్థితిని తెలియజేస్తుంది. ఇలా కళ్ళెదుట కనిపించే ఈ లోకం మాయ యని అవగాహన పొందటం వల్లే శ్రీకంచి పరమాచార్యులవారు పండిన జ్ఞానఫలమని సిద్ధపురుషుల చేత కీర్తింపబడ్డారు. 

తిరుకానూరు దివ్యక్షేత్రం, తిరుకాట్టుపల్లి సమీపాన

రుద్రాగ్ని, స్కంధాగ్ని, భాస్కరాగ్ని, సోమాగ్ని అంటే పలు రకాలు అగ్నులు ఉన్నాయి. ఒక్కో రకమైన అగ్ని ఒక్కో విధమైన అనుగ్రహాన్ని అందిస్తాయి. వీటిలో మంగళాగ్ని అనేది అంగారక భగవానుడివల్ల లభిస్తుంది. అంగారక భగవానుడు ఈ మంగళాగ్నిని పొందిన స్థలమే తిరుకాట్టుపల్లి సమీపంలోని తిరుకానూరు దివ్యక్షేత్రం. ఇక్కడి స్వామివారిని శ్రీసెమ్మేని నాధుడు, శ్రీకరుంబేశ్వరుడు అని పిలువబడుతున్నారు. ఇక్కడి అమ్మవారు శ్రీశివలోకనాయకి, శ్రీసౌందర్యనాయకి అనే తిరునామాలు కలిగి ఉన్నారు. 
జనబాహుళ్యంలో అంగారకుడు అసమర్థుడంటూ ఓ అపోహ నెలకొని ఉంది. ఆ అపోహ వల్ల చింతించిన అంగారక భగవానుడు శ్రీఅగస్త్యమహర్షుల వారిని శరణుజొచ్చి ప్రజలకు తాను కూడా శుభఫలితాలనిచ్చే విధంగా కీర్తిపొందటానికి వరమివ్వమంటూ వేడుకున్నాడు. శ్రీఅగస్త్యమహర్షులు 'అంగారక భగవానుడా! నీ మంగళదాయకమైన శక్తుల గొప్పదనాన్ని తెలుసుకోలేక ప్రజలు నీపై అపోహపడుతున్నారు. నిజానికి నీ శక్తి నీకు కూడా తెలియదన్నదే వాస్తవం. ఈ భూలోకంలో జన్మించేవారెవరైనా సరే వారి కష్టాలను తొలగించే శక్తి సామర్థ్యాలు నీ అగ్ని శక్తికి మాత్రమే ఉన్నాయి. దీనిని ఈ లోకం తెలుసుకోవాలంటే నేను చెబుతున్న విధంగా తపమాచరిస్తే చాలును. 
శూలంలో సప్తగ్రహాలు అణగినప్పుడు 
కుమారుడి గోళంలో నీవు అణగి ఉంటావు 
శక్తి సాలగ్రామంలో అనుగ్రహం పొందినప్పుడు 
సృష్టిలో నీ కీర్తి వెలుగొందుతూ ఉంటుంది 
-అని అంటూ అంగారక భగవానుడు తపమాచరించాల్సిన పద్ధతులను వివరించారు. అంగారక భగవానుడికి ఆ సిద్ధపురుషుడి పరిభాష పదాలు ఏవీ బోధపడలేదు. అయినా ఆ మునిపుంగవుడి ఆజ్ఞను పొంది తిరుకుట్రాలం వెళ్ళి, కుట్రాలం జలపాతం వద్ద పద్మాసనం వేసుకుని ఆశీనులయ్యారు. ఎంతటి వేడిమి కలిగి ఉన్న అగ్నియైనా చల్లబడే ప్రాంతం కుట్రాలమే కదా! కుట్రాలపు జలధార మహిమ వల్ల అగస్త్యమహర్షులు నుడివిన అమృతవాక్కుల అర్థాలను అంగారక భగవానుడు క్రమంగా తెలుసుకోగలిగారు. 

మూడు రాశులలో ఏడు గ్రహాలూ ఏకమై ఉన్న శూలయోగ దినాన, కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరుడు)కి సంబంధించిన ఉత్తరా నక్షత్రాన అంగారకుడు కొలువుదీరితే అది అంగారకుడికి ఉన్నతమైన నవాంశంగా అమరిన ఆ రోజున సాలగ్రామ రూపం కలిగి ఉండే అమ్మవారి ప్రార్థనలలో అంగాకరకుడు పూర్తిగా లీనమైనప్పుడు, అమ్మవారు అనుగ్రహించే స్థలం ఎర్రటి ఇసుక పర్వతంగా ఉన్నప్పుడు చేసే భార్గవ తులా స్నానం మంగళాగ్నిని ప్రాప్తింపజేస్తుందని అంగారకుడు అర్థం చేసుకోగలిగాడు. సాలం అంటే సాలగామ్రం, ఇసుక అని అర్థం. 

ఆశ్వయుజ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు కావేరినదిలో స్నానమాచరించడమే తులాస్నానం. ఈ తులాస్నానం గురువు (బృహస్పతి) సూర్యుడు కలిసి ఉన్నప్పుడు చేయడం వల్ల అది భార్గవ తులాపుష్కరం అని పిలువబడుతోంది. పన్నెండు సంవత్సరాలకు ఒకమారు ఇలాంటి భార్గవ తులాస్నానం చేసే భాగ్యం ప్రాప్తిస్తుంది. సూర్యుడు, గురువు, అంగాకరకుడు ఈ మూడు గ్రహాలు అగ్ని గ్రహాలు. ఉత్తర నక్షత్రం అంగారకుడికి అధిపతియైన సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన ఉన్నతమైన అగ్ని నక్షత్రం. ఇలాంటి అద్భుత గ్రహాల సంగమ ముహూర్త సమయాన భార్గవ తులా స్నానమాచరించి, సాలగ్రామం రూపంలో కొలువైన తిరుక్కానూరు అంబికను ఆరాధించాడు అంగారకుడు. ఇక్కడి స్వామివారికి శ్రీసెమ్మేని నాధర్‌ అనే పేరు కూడా ఉంది. అంగారక భగవానుడు అంబికను ఆరాధించినప్పుడు భగవంతుడు తన అరుణదేహపు శక్తిని, మంగళాగ్ని శక్తిని అంగారకభగవానుడికి ప్రసాదంగా అందించారు. ఈ దివ్యక్షేత్రం సెమ్మనల్‌ అనే అద్భుత శక్తులు కలిగిన సైకత పర్వతంపై ఉంది. కాలగమనంలో ఈ క్షేత్రాన్ని మనల్‌మేడు (ఇసుక గుట్ట) అని పిలువబడుతోంది. ఈ క్షేత్రపు అగ్ని తత్త్వాన్ని వివరిస్తే అది వ్యాపార వస్తువుగా మారిపోతుందని సిద్ధపురుషులు, మహాపురుషులు దీని మహిమను గురించి అంతగా ప్రచారం చేయలేదు. ఎలాంటి అగ్ని దోషాలను, కర్మ ఫలితాలను, అంగారక దోషాలను ఇట్టే మటుమాయం చేయగల శక్తితో కూడుకున్న క్షేత్రమిదేనని ఆ సిద్ధపురుషులు చాటిచెబుతున్నారు. మృగశిర నక్షత్రానికి సంబంధించిన వృక్షం నల్లదుమ్మ వృక్షం. మృగశిర నక్షత్రం అంగారక భగవానుడి పాదంగా ఉండటం వల్ల ఈ స్థలంలోని ఈశ్వరుడికి నల్లదుమ్మ అగ్నిచేత వండిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించటం ఆనవాయితీగా ఉంటోంది. ఎన్నో యుగాలకు పూర్వం అంగారక భగవానుడికి ప్రాప్తించిన ఆ పునీతమైన భార్గవ స్నానమాచరించే శుభదినం రాబోవు 17.10.2017 రోజున వస్తుండటంతో భక్తజనం ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాము. తిరుక్కానూరు క్షేత్ర నాథుడిని శ్రీకరుంబేశ్వరర్‌ అనే నామంతో పిలువబడుతున్నారు. తమిళంలో 'కరుంబు' అంటే చెఱకు. కనుక చెఱకు రసంతో అభిషేకంగా చేయడం వల్లగాని, బెల్లంతో కూడిన నల్లదుమ్మల అగ్నిచేత వండిన అన్నాన్ని దానం చేస్తే అత్యద్భుత ఫలితాలు అందిస్తాయి. అతి ఉష్ణం వల్ల కలిగే ఎలాంటి వ్యాధులనైనా నయం చేస్తాయి.

ఓ వ్యక్తి ఈ జన్మలోనూ మరుజన్మలోను కీర్తి గడించాలంటే అందుకు అంగారక భగవానుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందితీరాల్సిందేనని చెప్పటం అతిశయోక్తి కాదు. ఏ మహాపురుషుడి జాతకాన్ని పరిశీలించినా అందులో ఖచ్చితంగా అంగారకుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఉదాహరణకు శ్రీరాముడు, శేషాద్రి స్వాములవారి జాతకాలలో అంగారకుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. వివేకానందస్వామి, గురుమంగళ గంధర్వుల జాతకాలలో అంగారకుడు ఉచ్చమైన స్థితిలో బలవర్థకంగాను ఉంటాడు. ఇలా భార్గవ తులా స్నానదినాన, మకరరాశిలో ఉచ్చస్థితిని పొందే మంగళవారం కూడా తోడయ్యే 17.10.2017 శుభయోగదినాన కావేరీ తీరంలోని ఏ వైష్ణవక్షేత్రంలోనో, శైవక్షేత్రంలోనో పుణ్యస్నానమాచరించి అగ్నిచేత వండిన ఆహారపదార్థాలను దానంగా ఇచ్చి అద్భుత ఫలితాలను, సకల సౌభాగ్యాలను పొందవచ్చు. 
తిరుకాట్టుపల్లి నుండి సుమారు 4 కి.మీ దూరంలో, తిరుచ్చి లాల్గుడి సెంగరై మార్గంలో వెళ్లి, కొల్లిడం వంతెనను దాటిన తర్వాత ఎడమవైపు తిరిగితే, సుమారు మూడు కి.మీ.ల దూరంలో ఉంది తిరుక్కానూరు దివ్యక్షేత్రం. 

ఎక్కడైనా ఎప్పుడైనా విస్తారంగా వ్యాపించి స్థిరంగా ఉంటుంది గురువుల అనుగ్రహం!! 
ఈ వీడియోను మీరు 12 సెకన్లపాటు తిలకించిన తర్వాత మీ కనులను మూసి మీ మనోఫలకంపై దర్శించగలిగేదే మంగళాగ్ని జ్యోతి బింబం. నియమనిష్టలతో నిర్వహించిన హోమాగ్నిలో 'శివయశివ శివశివ నమశ్శివాయ శివాయనమః' అంటూ ఉచ్చరిస్తూ ఆహుతి సమర్పించి ఆ అగ్నిని 12 సెకన్లపాటు తిలకించి మీ కనులను మూస్తే అప్పుడు మీ మనోనేత్రాలపై లభించే దర్శనం కూడా మంగళాగ్ని బింబమే. ఇదియే జ్యోతి తెలిపే జ్యోతిష్యం. ఇదియే గురుభగవానుడి జ్యోతి అని, స్వాతి నక్షత్రంలో లభించే అనుగ్రహ శక్తి. ఇలాంటి జ్యోతి అనుగ్రహ శక్తిని తులాస్నానం ప్రాప్తింపజేస్తుంది. భక్తజనులందరికీ 17.10.2017న గురుభగవానుడు స్వాతి నక్షత్రంలో కొలువుదీరి గురువు జ్యోతి ప్రసాదాన్ని అందిస్తారని సిద్ధపురుషులు చెప్పే రహస్యం. 

సద్గురువుల కరుణాకటాక్షాన్ని వివరించే ఓ అద్భుతమైన అనుభవం. శ్రీగురువులు దైవంపై అపారవిశ్వాసంతో వచ్చే భక్తుల కర్మఫలాలను తానే స్వీకరించి వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి ఒక్క అడుగు కూడా వేయలేని దుస్థితిలో పలు రోజులపాటు పడరాని పాట్లు అనుభవించారు. ఆయన దేహమంతటా రణాలు. దుస్తులు కూడా ధరించలేని వేదనాభరిత స్థితి అది. అంతటి దుస్థితిలోనూ తనను దర్శించటానికి వచ్చిన భక్తుల బాగోగులను అడిగి తెలుసుకుని ఓదార్పుమాటలతో పరామర్శించేవారు. నేలపై అడుగు పెట్టలేని పరిస్థితిలో ఓ భక్తుడి పిలిచి అతడి చేయి పట్టుకుని నడిచేందుకు కూడా ప్రయత్నించారు. అప్పుడా భక్తుడు శ్రీగురువుల చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు శ్రీ గురువులు అతడి చేతిని విదిలించి తామే ఆ భక్తుడిని చేతిని గట్టిగా పట్టుకున్నారు. దీనికి శ్రీగురువులు చెప్పిన కారణం : 'నీవు నా చేతిని పట్టుకుని, నేను ఆ సపోర్ట్‌తో నడుస్తుంటే నువ్వు ఎప్పుడైనా నా చేతిని విడిచిపెట్టే స్థితి రావచ్చు. అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది; అయితే నేనే నీ చేతిని గట్టిగా పట్టుకుంటే నాకు భయం ఉండదు కదా. నేను తలచుకుంటే నీ చేతిని విడిచిపెడతాను. ఎలాంటి భయం లేకుండా నేను నడవగలను' అని పేర్కొన్నారు. 

ఈ సంఘటనను బాహ్యార్థంగా పరిశీలిస్తే ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవించే మానవుడు ఎలా అప్రమత్తంగా ఉండాలో సద్గురువు పాఠం నేర్పినట్లుగా బోధపడుతుంది. అయితే అంతరార్థాన్ని పరిశీలించినట్లయితే సద్గురువు తన భక్తులపై ప్రదర్శించే అపారమైన కృపాకటాక్షాలు బోధపడతాయి. సద్గురువులు ఈ సంఘటన ద్వారా తెలిపే పాఠం ఏమిటంటే - శిష్యుడు గురువును పట్టుకుంటే అతడు ఎప్పుడైనా సత్సంగాన్ని విడిచిపెట్టేస్తాడు. అయితే సద్గురువు శిష్యుడిని స్థిరంగా పట్టుకుంటే శిష్యుడు దైవభక్తిని విడిచి ఏకాలంలోనూ సత్సంగం నుండి విడిపోడు. ఇదే కదా సద్గురువుల మహనీయ గుణం !

ఓం గురువే శరణం

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam