కుళలుఱవుత్యాగి 
 
 
 
ఏ మహర్షిని నమస్కరించినా అది శుకబ్రహ్మ మహర్షికే సమర్పణమవుతుంది !!

ఓం శ్రీ వల్లభ గణపతియే నమః 
ఓం శ్రీ అంకాళపరమేశ్వరీ నమః
ఓం శ్రీ గురువే శరణం

రక్షాండర్‌ తిరుమల మహాత్మ్యం

తిరుచ్చి నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రమే రక్షాండర్‌ తిరుమల దివ్యక్షేత్రం. కుళిత్తలై, మణప్పారై మొ||లగు ప్రాంతాల నుండి తోగమలై మీదుగాను చేరుకోగల శివక్షేత్రం. ఆర్.టీ. మలై అని సోమరసంపేట మీదుగా ఈ ఆలయం వరకు వెళ్లటానికి సిటీ బస్సులు కూడా ఉన్నాయి. 
తిరుఅణ్ణామలై ఆలయానికి ధీటైన ప్రాచీనమైన ఈ దివ్యక్షేత్రం ఇటీవలి కాలం వరకు ప్రజలచేత పూజలందుకోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. మహాశివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయంలో మళ్లీ పూజలు ప్రారంభం కావటం ప్రజలు చేసుకున్న మహా తపఃఫలితమే! 
అగస్త్యమ హామునులు 
భూసుర పూజిత పుడమిలో జన్మించి 
మహాదేవి మహత్తరమైన దీవెనలతో 
ఆరాధించు భక్తులను ఆదుకునే 
జ్యోతిస్వరూప దేవీ ఈ క్షేత్ర పరిపాలకురాలు 
-అంటూ ఈ పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన అమ్మవారి కృపాకటాక్షాలను వివరిస్తుంటారు. 
సాధారణంగా శైవక్షేత్రాలలో అంబికాదేవి అద్భుతశక్తి ప్రవాహం శక్తిసమేతంగా విరాజిల్లుతుంటుంది. ఉదాహరణకు తిరు ఆనైక్కా, కంచి కామాక్షి, మధుర మీనాక్షి వంటి దివ్యక్షేత్రాలలో అమ్మవారే అయ్యవారికంటే అధికమైన కీర్తి ప్రతిష్టలతో విలసిల్లుతుండటం విదితమే! ఇక చిదంబరం, తిరుఅణ్ణామలై వంటి క్షేత్రాలలో స్వామివారి కీర్తి ప్రతిష్టలు మిన్నంటి ఉండటాన్ని చూస్తున్నాం. అయితే వీటికి మినహాయింపుగా రాక్షాండర్‌ పర్వత క్షేత్రంలోని భగవానుడు శ్రీవిరాట్శిల ఈశ్వరుడి వైభవవిశేషాలను మాటలతో వర్ణించలేము. అమ్మవారైన శ్రీపెరియనాయకి వైభవమో అజరామరం. 
ఇలా ఈ స్థలమూర్తులే కాక ఆ పవిత్రస్థలంలోని చెట్టుచేమలూ సైతం ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేస్తుండటం మనకు ఆహ్లాదాని కలిగిస్తాయి. 

జయవిజయుల విజయం

వైకుంఠపు ద్వారపాలకులైన జయవిజయులు దుర్వాసుల శాపం వల్ల భూలోకవాసులుగా జన్మించి పలు దివ్యక్షేత్రాలలో తపములు ఆచరించి మళ్లీ వైకుంఠం చేరుకున్న సంగతి మీకు తెలిసిందే. 
జయవిజయులు శాపవిముక్తి కోసం వైకుంఠం వెళ్లడానికి ముందు ఆ ఇరువురూ చివరగా తపమాచరించిన దివ్యక్షేత్రమే రక్షాండర్‌ తిరుమల క్షేత్రం. ఎన్నో యేళ్లపాటు నిర్వహించే తపోఫలితాల వల్లే వైకుంఠ పదవి లభిస్తుందని చెబుతున్నప్పుడు అలాంటి వైకుంఠంలోనే ద్వారపాలకులుగా సేవలందించిన జయవిజయులు పలు పుణ్యక్షేత్రాలలో తపమాచరించవలసిన అవసరం ఎందుకొచ్చిందని సందేహం కలుగకమానదు. 

రాచాండారు తిరుమల

ఓ సామాన్య భక్తుడు దేవుడిని ఎలా పూజించాలి? ఉదాహరణకు ఓ శివాలయ దర్శనం కోసం వెళ్ళినప్పుడూ తొలుత దూరం నుంచే ఆలయ గోపురాన్ని, గోపురకలశాలను దర్శించాలి. తర్వాత ఆలయంలోపల అడుగుపెట్టగానే ధ్వజస్తంభం వద్ద సాష్టాంగంగా నమస్కరించి తర్వాత బలిపీఠం, నవగ్రహనాలు, అమ్మవారు, చండీశ్వరమూర్తి, ఆంజనేయుల సన్నిధి, భైరవ సన్నిధులంటూ అన్ని సన్నిధులను దర్శించిన మీదట చివరగా అంటే పూర్ణంగా ఈ సన్నిధి మూర్తులను పూజించడం వల్ల కలిగిన దైవీక పుణ్యశక్తిని గర్భాలయంలోని మహాశివుడికి సమర్పించి దర్శనభాగ్యం కల్పించిన ఆ కరుణామూర్తికి ధన్యవాదాలు తెలుపుకుని వెళ్లాలని సిద్ధపురుషులు ఏర్పరచిన సులువైన ఆరాధన పద్ధతి. 
ఈ విధంగా పలు పుణ్యస్థలాలను సేవించిన జయవిజయులు తమ పొందిన అద్భుత శక్తులలో కొంత భాగాన్ని జమ్మిచెట్ల రూపంలో రక్షాండర్‌ తిరుమలలో విడిచిపెట్టి వెళ్లారని అగస్త్యమహామునులు చెబుతున్న స్థలరహస్యం. 
కనుక ఈ ప్రాంతంలో అద్భుత దైవీక శక్తులు కలిగిన జమ్మి చెట్లను పూజిస్తే వైకుంఠంలో పూజలు చేసినంతగా పుణ్యఫలాలను సులువుగా ఈ భూలోకంలో పొందటమంటే మాటలా? ఆహా ఆ సిద్ధపురుషులు మనపై ప్రసరింపజేసిన కరుణయే కరుణ! 
ఈ స్థలంలో పూజలు చేసేవారు ఈ రెండు జమ్మిచెట్లనడుమ నడచి వెళ్లితే అది స్వర్గద్వారంలో పాదం మొపినంత పుణ్యఫలాన్ని కలిగిస్తుంది. ఇంతకీ స్వర్గద్వారమంటే ఏమిటి? వైకుంఠంలో ద్వారపాలకులను దాటుకుని వెళ్లి శ్రీమహావిష్ణువును, మహాలక్ష్మిని దర్శనం చేసుకోవడమే కదా స్వర్గమంటే! ఇక్కడ కూడా మీరు వైకుంఠ ద్వారపాలకులను దాటుకుని వెళుతున్నారనుకుంటే ఆ తర్వాత మీకు లభించే దర్శనభాగ్యం కూడా స్వర్గమే కదా! 
ఈ వివరాలను, స్థల వైభవవిశేషాలను, ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకునేటప్పుడు అవన్నీ వివరించకుండానే మీకు సులువుగా అర్థమవుతాయి. ఆరాధించు భక్తులకు కుడివైపు జయుడు, ఎడమవైపున విజయుడు కొలువుదీరి ఉంటారు. అంటే శ్రీవిరాట్శిల మహేశ్వరుడికి ఎడమైపున జయుడు, కుడివైపు విజయుడు ఉంటారు. 

వేదాలు వాప్తిచెందిన అద్భుతం

మనకు తెలిసినవి రుగ్వేదం తదితర వేదాలే. నిజానికి ఇవి వేదంలోని విభాగాలే. అదే విధంగా పన్నిరు తిరుమురైగల్‌, నాలాయిర దివ్య ప్రబంధం, తిరు అరుట్పా, తిరుప్పుగళ్‌ వంటి భగవన్నామ సంకీర్తనలూ వేదాలు అవుతాయి. భగవంతుడిలాగే వేదాలకు కాల గణాంకాల వంటి పరిమితులు లేవు. వేదం అనాదియైనది. అన్నింటినీ అధిగమించి స్థిరంగా ఉన్నది. మనకు తెలిసిన నాలుగు వేదాలలో ఉప విభాగాలు అసంఖ్యాకం. అవన్నీ కాలప్రవాహంలో ధ్వనిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు కలియుగంలో సామవేదపు విభాగాలు ప్రతిధ్వనిస్తుంటాయి. శ్రీసామవేదీశ్వరుల క్షేత్రంలో (తిరుమంగళం, లాల్గుడి) పరశురాములు దీర్ఘనేత్రం అనే సామవేదపు సాఖ్యాన్ని పఠిస్తూనే నేడు ఆరాధిస్తున్నారు. ఈ సామవేద సాఖ్యను సిద్దపురుషులు మాత్రమే తెలుసుకోగలుగుతున్నప్పటికీ సామాన్య భక్తులకు దీర్ఘనేత్రం అనే సామవేద సాఖ్యను పఠించగా వచ్చే ఫలాలను అందించే పూజా విధానాలను అందించారు. 
ఎర్ర గులాబి పూల రేకులతో కలకండతో చేరి రోటిలో మెత్తగా దంచి వాటితో తేనె, చిటికెడు పచ్చకర్పూరం కలిపి తయారు చేసిన 'గులగందు'తో పరశురాముడు ఆరాధించిన శివలింగానికి నైవేద్యంగా సమర్పించి నిరుపేదలకు దానం చేస్తే సామవేదం పఠించినంత పుణ్యఫలాలు దక్కుతాయి. రక్తహీనత కూడా నయమవుతుంది. దేహంలో నూతనజవసత్వాలు, దైవీక కార్యక్రమాలను నిర్వర్తించడానికి భుజబలాలను సైతం అందిస్తాయి. 

జయ వజయుల జమ్మి చెట్లు

ఇలా రక్షాండర్‌ పర్వతంపైని జమ్మి వృక్షాలలో అక్షర అశ్వత్థం అనే వేదాలు నిరంతరం ఘోషిస్తుంటాయని పలువురు ఎరుగని ఆధ్మాతిక రహస్యం. సాధారణంగా ఇవి జమ్మి చెట్టు ఆకులు ఒకదానితో ఒకటి రాసుకోవడం వల్ల వచ్చే శబ్దమని, గాలి వీయడం వల్ల ఆకుల కదలికల వల్ల కలిగే శబ్దమని మనం భావిస్తాము. నిజానికి అవన్నీ అక్షర అశ్వత్థ వేద గానాలే! 
కుండలినీ యోగంలో అనాహత చక్రాన్ని చేరుకునే స్థితిలో అనుభవించేదే ఈ అక్షర అశ్వత్థ వేద నాదం. ఈ అశ్వత్థ అక్షర వేదనాదానికి తార్కాణంగా విరాజిల్లుతున్నదే ఇప్పటి అమృతానందమయి అమ్మవారి వేదనాదం. అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నవారందరూ ఈ వేదనాదాన్ని విని తరించి ఉంటారు. 
అమ్మవారిని దర్శనం చేసుకున్నవారు కాస్త గతంలోకి వెళ్లి ఆ దర్శన భాగ్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అమ్మవారు భగవన్నామ సంకీర్తన సమయంలో అమ్మా అమ్మా లేదా కృష్ణా కృష్ణా కృష్ణా అంటూ కొన్ని భగవన్నామాలను గానం చేస్తున్నప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తోందో కాస్త దీర్ఘంగా ఆలోచించండి. వాస్తవానికి ఆ శబ్దాలు అమ్మవారి ముఖారవిందం నుండి గానీ, ఆమె పెదవుల నుండిగా వచ్చినవి కావు. ఆ వేదనాదాలు మీ మనస్సు నిండా, మీరున్న స్థలమంతటా, ఈ భూలోకమంతటా, మన శిరస్సుపైని ఆకాశమంతటా వ్యాపించి ఉంటున్నాయి. 
ఇక మీదట అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు అమ్మవారిచ్చే దైవీక పిలుపును సునిశితంగా గమనించండి. అవును చెవులకింపుగా వినబడుతున్న ఆ శబ్దాలే అక్షర అశ్వత్థ వేద నాదాలు. విష్ణు వేద గానాలు. అశ్వత్థ వేద శక్తులను మానవులు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకునే పద్ధతులను మన పెద్దలు వివరించి ఉన్నారు. పురుషులు ఈ జమ్మివృక్షాలకు దిగువగా గంటసేపు పద్మాసనం వేసుకుని లేదా ఏదైనా సుఖాసనం వేసుకునో జమ్మిచెట్ల ఆకుల వల్ల కలిగే శబ్దాలను గమనించినట్లయితే కాలక్రమేణా ఆ శబ్దాలు వేద ధ్యానంగా మారుతుంది. జయ జమ్మివృక్షం దిగువన వలవోట్టు నక్షత్ర దినాలలోను, విజయుడి జమ్మివృక్షం దిగువన ఇడవోట్టు నక్షత్ర దినాలలోను పైన చెప్పినట్లు ధ్యానం చేస్తే శుభఫలితాలు మెండుగా లభిస్తాయి. అశ్విని, భరణి, కృత్తిక, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, అస్త, చిత్త, స్వాతి, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, రేవతి ఈ పదిహేను నక్షత్రాలు వలవోట్టు నక్షత్రాలు.
రోహిణి, మృగశిర, ఆరుద్ర, మఖ, పూర్వఫల్గుణి, ఉత్తర, విశాఖం, అనూరాధ, జ్యేష్ట, శ్రవణము, ధనిష్ట, శతభిష ఈనే 12 నక్షత్రాలు ఇడవోట్టు నక్షత్రాలు. అయితే చాలామంది ఈ నక్షత్రాలకు సంబంధించి విశేష గుణాలు తెలియకున్నాయి. అలాంటివారు ఆది, మంగళ, గురువారాల్లో జయుడి జమ్మివృక్షం దిగువన, సోమ, బుధ, శుక్రవారాల్లో విజయుడి జమ్మివృక్షం దిగువన పైన పేర్కొన్న విధంగా ధ్యానం చేయవచ్చు. శనివారం ఈ రెండు వృక్షాలలో దేని దిగువనైనా ధ్యానం చేయవచ్చు. 
ఈ అశ్వత్థ ధ్యానం రాత్రిపూట నిదురలేమితో బాధపడేవారికి కలలకు తావులేని సుఖనిద్ర లభిస్తుంది. అయితే వారు పగటిపూట తప్పకుండా నిదురించరాదు. నరాల సంబంధిత రోగాలు, మూర్చరోగం వంటి వాయు సంబంధిత రోగాలు నయమవుతాయి. 20, 30 యేళ్లు దాటినా స్త్రీ, పురుషులు పడకలోనూ మూత్రవిసర్జన సమస్యతో బాధపడుతుంటారు. ఆంగ్ల, ఆయుర్వేద, సిద్ధ వైద్యాలలోనూ ఈ సమస్యకు పరిష్కారం లభించదు. బయటచెప్పుకోలేని ఈ వేదనకు ఉపశమనం కలిగించేదే ఈ అశ్వత్థ ధ్యానం. నిరంతర ఆరాధన ఆవశ్యకం. 

కుల సంరక్షణం శివ సంపాదనం

సాధారణంగా శివ సంపాదనను దుర్వినియోగపరిస్తే కులనాశనమవుతుందని చెబుతుంటారు. శివుడి సొత్తులో చిటికెడంత అపహరించినా ఆ నేరం చేసిన వ్యక్తి వంశాన్నే సమూలంగా నాశనపరుస్తుందని భావం. దీనికి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న స్థలాలలో రక్షాండర్‌ తిరుమల క్షేత్రం ఒకటి. ఈ ప్రాంతంలో గబ్బిలాల ఎంగిళ్లు మాలిన్యాలు అధికంగా కనిపిస్తాయి. శివుడి సొత్తును అపహరించినవారే ఇలా గబ్బిలాలుగా జన్మించి వారి బాధలను ఇలా వెళ్లగక్కుకుంటున్నారు. 
ఓసారి మన గురుదేవులైన వెంకటరామస్వాములు సిన్నోడిగా ఉన్నప్పుడు పెద్దాయనతో కలిసి ఓ శివాలయానికి వెళ్లారు. ఆ చోట దేవుని దర్శించటానికి కూడా వీలులేనంతగా ఎక్కడ చూసినా గబ్బిలాల మాలిన్యాలే అధికంగా కనిపించాయి. సిన్నోడు ఆ మాలిన్యాలను గురించి పెద్దాయన్ని అడిగినప్పుడు 'ఒరేయ్‌ సిన్నోడా నువ్వెంతగా కోట్లు సంపాదించినా నువ్వు తినబోయేది ఈ జానెడు కడుపుకు సరిపడా ఆహారమే కదా! నువ్వు జిలేబీ తిన్నా లడ్డూలు తిన్నా చివరకు అదంతా మలం రూపంలోనే విసర్జనమవుతాయి కదా. ఈ నిజాన్ని శివుడి సొత్తును అపహరించేవాడు బాగా అర్థం చేసుకోవడానికే స్వామి ఆ నేరస్థులను గబ్బిలాలుగా పుట్టించి తన గుడిలోనే వేలాడదీశారు. గబ్బిలం తన నోటిద్వారానే ఆహారాన్ని భుజిస్తాయి. ఆ నోటి ద్వారానే మలాన్ని విసర్జిస్తాయిరా' అని సమాధానమిచ్చారు. 

గరుడ తీర్షం రాచ్చాండారు తిరుమల

ఆ మాటలు విన్న సిన్నోడు దిగ్భ్రాంతి చెందాడు. 'శివుడి సొత్తును అపహరిస్తే ఇంతటి కఠినమైన శిక్షా?' అంటూ ఆ చిన్ని హృదయం ఆ పాపుల కష్టాలను తెలుసుకుని కలతచెందింది. ఓ వైపు ఆ పాపులు తప్పిదాలకు సిన్నోడి మనస్సు బాధపడుతూనే మరోవైపు చిన్నదంటే మరీ చిన్నదంత అనుమానం కూడా కలిగింది. సిన్నోడి అనుమానమేమిటో పసిగట్టిన ఆ పెద్దాయన గబుక్కున 'సిన్నోడా ఏ సందేహం కలిగినా దాన్ని వెంటనే నివర్తి చేసుకోవాలిరా' అంటూ కన్నుగీటారు. సిన్నోడు సిగ్గుతో కుంచించుకుపోయాడు. కాసేపయ్యాక ఆ పెద్దాయన తలపైకెత్తి 'విశ్వనాథా!' అని గట్టిగా పిలిచారు. ఆ గుడిలో పెద్దాయన, తను తప్ప ఇంకేవరూ లేరు. ఎవరిని పిలిచారా అని సిన్నోడు ఆలోచిస్తుండగానే ఆ పెద్దాయన తలక్రిందులుగా వేలాడుతున్న గబ్బిలాలవైపు చూస్తూ పిలిచాడని తెలుసుకున్నాడు. సిన్నోడికి ఏమీ బోధపడలేదు. అయితే పెద్దాయన పిలిచిన మరుక్షణం ఓ గబ్బిలం వేగంగా ఎగురుతూ వచ్చి పెద్దాయన పాదాలపై పడి రెక్కలు టపటపా కొట్టుకుంటూ నిలిచింది. పెద్దాయన ఆ గబ్బిలాన్ని సిన్నోడికి చూపి ''ఇక్కడ చూడరా! ఇక్కడ పడి ఉన్నాడే ఈ విశ్వనాథుడికి వంద ఎకరాలకు పైగా ఆస్తులుండేవి. కానీ శివుడి సొత్తుగా ఉన్న ఎకరం భూమిని ఆక్రమించుకుని తన భూములతో కలుపుకున్నాడు. ఆ భూమికి సంబంధించి కౌలుగాని, వరిధాన్యాలను గానీ ఇవ్వలేదు. ఇప్పుడేమైంది. గబ్బిలంగా పుట్టి వేలాడుతున్నాడు'. సిన్నోడు కిందపడి ఉన్న గబ్బిలం వైపు చూశాడు. అక్కడ గబ్బిలం కనపడలేదు. ఓ వృద్ధుడి ఆకారం కనిపించింది. ఇక పెద్దాయన చెప్పినదంతా అక్షర సత్యాలని బోధపడింది. 
ఎన్నో యేళ్లు గడిచాయి... 
సిన్నోడు వెంకటరామను‌ కైలాసపు అగస్త్యమునుల పరంపరలో 1001వ గురు మహాసాన్నిధ్యంగా సమున్నతస్థితికి చేరుకున్నారు. 1994వ సం|| వేసవి సెలవులలో రక్షాండర్‌ తిరుమల పర్వతంపై ప్రక్షాళన పనులు చేపట్టి నిర్విఘ్నంగా పూర్తి చేశారు. అప్పుడా ప్రాంతంలో సంచరిస్తున్న గబ్బిలాలను చూపిస్తూ 'చూశారా విశ్వనాథుడి పరిస్థితిని' అని ఓ గబ్బిలాన్ని చూపెట్టారు. భక్తసేవకులెవరికీ ఏమీ అర్థం కాలేదు. మునుపు పెద్దాయన తనతో చెప్పిన సంగతులను వివరించిన మీదటే వారికి అర్థమైంది. మీకిప్పుడు అర్థమైంది కదా. విశ్వనాధుడు గబ్బిలంగా వేలాడిన చోటు ఎక్కడో కాదు ఈ రక్షాండర్‌ తిరుమలై పర్వతం మీదే! '. అప్పుడో భక్త సేవకుడు అడిగాడు 'గురువుగారూ! వీడిక్కడి వేలాడుతున్నాడని తెలుసుకుని నా మనస్సెందుకో మిక్కిలిగా బాధపడుతోంది. ఆ బాధను భరించడానికి మనస్సు అంగీకరించడం లేదు' అన్నాడు. గురువుగారు నవ్వుతూ 'అవునర్రా, కాంచీపురంలో ఓ భక్తుడు శివాలయ నిర్మాణానికి ఒక్కటంటే ఒక ఇటుకను విరాళంగా ఇచ్చాడు. దాని ఫలితంగా అతడి తర్వాత 21 తరాలవారంతా సకల సంపత్తులతో ఉన్నారంటే మీ మనస్సులు అంగీకరిస్తాయి. అయితే ఒకడు శివుడి సొత్తును అపహరిస్తే ఆ సొత్తును తిరిగి అప్పగించేంత వరకు గబ్బిలంగా వేలాడతాడంటే మీ మనస్సులు అంగీకరించవా?' అని ప్రశ్నించారు. సన్నిధానం సంధించిన యదార్థపు ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఎవరికి సాధ్యం? 

శ్రీ విరాట్శిలేశుడు
రాచ్చాండారు తిరుమల

అయితే సామాన్య మానవులందరి పరిస్థితి కూడా ఇలాంటిదే. చిటికెడు కర్పూరాన్ని వెలిగిస్తే చాలు దేవుడు మనకు కొండంత సంపదలను ఇవ్వాలని కోరుకునే మానవుడు తాను చేసే చిన్నపాటి తప్పిదానికి పడే శిక్షను అనుభవించడానికి మనస్సు అంగీకరించదు. ఇలాంటి ఆధ్యాత్మిక తత్త్వాలను శ్రీగురుదేవులు వివరిస్తున్నప్పుడు ఓ భక్తుడు 'గురువుగారూ!..' అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించి గురువుగారిని చూస్తూ ఆగిపోయాడు. శ్రీగురువులు వెంటనే 'ఎందుకు సారు‌ తడబడుతున్నారు. ధైర్యంగా అడగవలసింది అడగండి' అంటూ ధైర్యాన్ని కలిగించడంతో, ఆ భక్తుడు 'మీ పెద్దాయన సాక్షాత్తు పరమేశ్వరుడేనని మీరు తరచూ చెబుతుంటారు. అలాంటప్పుడు ఆ పెద్దాయన పాదాలపై పడిన విశ్వనాథుడు ఎందుకింకా ఈ జన్మ నుండి మోక్షం పొందకుండా ఇక్కడే వేలాడుతున్నాడు?' అని అడిగాడు. 
గురువుగారు పెద్దగా నవ్వుతూ 'మీ ప్రశ్న న్యాయమైనదే. మా గురువుగారైన కౌపీనధారుడు మహాశివుడే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే మహాశివుడి దర్శనం పొంది వరాలు పొందిన రావణుడి పరిస్థితి ఏమైంది? కామంతో పాపాలు చేశాడు. ఆతడు పరిపూర్ణ భక్తుడయ్యాడా? లేదే! కనుక మహాశివుడి పాదాలుపై మోకరిల్లినందుకు తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది. అది వేరే సంగతి. అదే సమయంలో అపహరించిన శివుడి సొత్తును తిరిగి చెల్లించనంతవరకు ఏ భగవంతుడి దర్శనమైనా ఓ చోరుడికి వెనువెంటనే పాపం నుండి విముక్తి కలిగించదనే వాస్తవాన్ని మీరంతా తెలుసుకోవాలి' 
'కలియుగంలో చాలామంది ఇలా అపోహపడుతుంటారు. మనం ఎన్ని తప్పులైనా చేయవచ్చు. ఎప్పుడో పావలా కర్పూరాన్ని వినాయకుడి ఎదుట వెలిగిస్తే చాలు మన తప్పులన్నింటికీ ప్రాయశ్చిత్తం కలుగుతాయనుకుంటారు. ఇది ప్రజల అజ్ఞానానికి పరాకాష్ట! 
'వినాయకుడి ఎదుట పావలా కర్పూరం వెలిగిస్తే అందుకు తగ్గ ఫలితం కలుగుతుంది. అంతెందుకు, కర్పూరం కూడా వద్దు. తిరుచ్చి మాణిక్య వినాయకుడికి మీరు రెండుచేతులతో నమస్కరిస్తే చాలు దాన్ని ఓ ప్రార్థనగా మన్నించి కరుణించే మహాగణపతి ఆయన. అయితే ఆ మహాగణపతి కూడా తన తప్పులను సరిదిద్దుకోని భక్తుడికి ప్రాయశ్చిత్తం అందించడానికి ఎలా అంగీకరిస్తారు?' 
ఏ శివస్థలం శివుడి సొత్తు కూలనాశనం అని చాటిచెబుతున్నదో ఆ శివస్థలమే కుల సమృద్ధికికి అండగా నిలుస్తుందనటానికి సాక్ష్యంగా విరాజిల్లుతోంది. ఇక్కడున్న జమ్మిచెట్ల సమిధలు (ఎండిపోయిన, తానుగా పడిన జమ్మిచెట్టు పుల్లలు), జమ్మిచెట్టు పుల్లలు, కొమ్మలను సక్రమంగా ఉపయోగిస్తే చిన్నారులు చదువుల్లో మేటిగా తయారై, సద్గుణాలతో కుల సమృద్ధికికి తోడ్పడతారు. కుల సంరక్షణ జ్యోతులుగా కీర్తింపబడతారనేది అక్షర సత్యం! 

అక్షర పృథ్వీపూజ

ఈ క్షేత్రంలో జమ్మి వృక్షాల నుండి ఎండిపోయి తానుగా నేలపై రాలే పుల్లలను సేకరించండి. ఆ పుల్లలు ఎంత పొడవైనవిగా ఉన్నా ఫర్వాలేదు. ఓ ఇత్తడి, కంచు లేదా కొయ్యతతో తయారైన తాంబూళంలో కావేరి, కొల్లిడం వాగు ఇసుకను పొసి చదునుపరచి జమ్మి చెట్టు పుల్లలతో ఆ ఇసుకపై ఆ.ఇ.ఉ అనే మూడక్షరాలను పైనుండి కిందకు రాయాలి. తర్వాత ఆ మూడు అక్షరాలను చేతితో తుడిచివేయాలి. ఆ తర్వాత ఇసుకపై ఇ.అ.ఉ అంటూ మూడక్షరాలను పైనుండి కిందకు రాయాలి. తర్వాత ఆ అక్షరాలను చేతితో తుడిచివేయాలి. ఆ తర్వాత ఇసుకపై ఉ.అ.ఇ అని పైనుండి కిందకు రాయాలి. ఇలా మూడుసార్లు రాయడం ఓ అక్షర వరుస అవుతుంది. ఇలా ఎన్ని అక్షర వరుసల వరకైనా రాయవచ్చు. చిన్న పిల్లల ఆసక్తి వయస్సును బట్టి ఎన్ని సార్లయినా రాసి శిక్షణ ఇవ్వవచ్చు. 
దీని వల్ల చిన్నపిల్లలకు చదువులపై ఆసక్తి అధికమవుతుంది. మంచి గుణాలు అలవడతాయి. తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో ఉంటారు. అయితే ఇవన్నీ ఒకటి రెండు రోజులలోపే అలవడుతాయని తలచొద్దు. నిరంతరం పట్టుదలగా పూజిస్తూ వస్తే అద్భుత ఫలితాలను పొందవచ్చు 
ఈ పూజలో ముఖ్యంగా గమనించాల్సినవి. 
1. జమ్మి చెట్టు పుల్లలను ఏ కారణం చేతనైనా చెట్టునుండి విరుచకూడదు. నరకరాదు. ఎండిపోయి తానుగా విరిగి నేలపై పడిన పుల్లలను మాత్రమే ఉపయోగించాలి. 
2. పన్నెండేళ్లలోపు పిల్లల కోసం వారి తల్లిదండ్రులు ఈ పుల్లలను సేకరించుకుని తీసుకెళ్లవచ్చు. అంతకు మించిన వయస్సుకలగిన బాలబాలికలు తామే ఈ పుల్లలను ఏరుకుని వెళ్లవచ్చు. 
3. అక్షర పృథ్వీ పూజను ఆలయాలలో, ఇళ్లల్లో, పాఠశాలల్లోనూ నిర్వహించవచ్చును. 
4. పూజలు నెరవేర్చే సమయంలో పుల్లలు విరిగినట్లయితే వాటిని వాగులో విసిరివేయాలి. వాటిని మళ్లీ ఉపయోగిస్తే ఫలితం ఉండదు. 
5. ఒకరు ఒకసారి మాత్రమే ఈ పుల్లలు సేకరించుకెళ్లవచ్చును. అయితే పాతపుల్లలు గనుక ఉంటే వాటిని వాగులో పడవేసి కొత్త పుల్లలు తీసుకెళ్లాలి. 
6. తాంబూలపు పళ్ళెము, ఇసుక, జమ్మిచెట్టు పుల్లలు ఒక్కో చిన్నారికి వేర్వేరుగా అందించాలి. ఒకరు వాడిని తాంబూల పళ్లెము, ఇసుక, జమ్మిచెట్టు పుల్లలను మళ్లీ వాడకూడదు. 

అందరికీ సానుకూలమైనదే అక్షరపూజ

చిన్నారులు, బాలబాలికలే కాదు పెద్దలకూడా ఈ అక్షర పూజలను జరిపి అద్భుత ఫలితాలను పొందవచ్చు. 
ఓ కీలకమైన విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అయోమయంగా ఉన్నప్పుడు ఈ అక్షరపూజను చేస్తే అపరిష్కృత సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దలు ఈ పూజలు జరుపటానికి ముందుగా తలస్నానం చేసి నుదుట విభూతి రేఖలు ధరించాలి. చిన్నారులకు, బాలబాలికలకు ఈ నియమాలు వర్తించవు. 
ఒప్పందాలపై సంతకాలు చేయడానికి ముందు, కొత్తగా ఉద్యోగంలో చేరడానికి ముందు పైన పేర్కొన్న పూజలు చేస్తే అద్భుత ఫలితాలు పొందవచ్చు. 
బ్యాంక్‌ చెక్కుల రూపంలో నగదు బట్వాడాలు చేసేవారు, హస్తసాముద్రిక జ్యోతిష్యులు, వైద్యులు ఈ పూజలను నిరాటంకంగా నిర్వహిస్తూ వస్తే తమ రంగాలలో ఉన్నతస్థితికి చేరుకోగలుగుతారు. వీరంతా తాము ఉపయోగించే జమ్మిచెట్టు పుల్లలను నెలకు ఒకసారైనా మార్చుకుంటే మంచిది. 

విద్యాశక్తులందించే జమ్మిపుల్లలు

విద్యాశక్తులు మెండుగా కలిగిన మూలికలలో జమ్మిపుల్లలు కూడా ఉన్నాయి. విద్య అంటే ఇక్కడ పాఠశాలలో లభించే విద్య కాదు. ఏది నిరంతమైన జ్ఞానమో ఆ విద్యాశక్తిని అందించే మహత్తర గుణాలు కలిగినవే జమ్మిచెట్టు పుల్లలు. నేడు ఇలాంటి దైవీక విద్యను బోధించే గురుకులాలు మచ్చుకైనా కానరావు. ప్రస్తుతమున్న విద్యా సంస్థలన్నీ పుస్తక పాఠ్యాంశాల బోధనలకే పరిమితమైపోయాయి. ఇలా చిన్నారులకు పుస్తక పాఠ్యాంశాలతోపాటు ఆధ్యాతిక అంశాలపై ఆసక్తిని కలిగించేవే రక్షాండర్‌ పర్వతంపై లభించే జమ్మి చెట్టు పుల్లలు. 
ఈ జయ, విజయ వృక్షాల కిందపడి ఉన్న ఏదైనా ఒక పుల్లను తీసుకుని దానికి చందనం తాపడం లేదా పసుపు, కుంకమలు అద్ది, పసుపువస్త్రంలో చుట్టి దానిని సరస్వతీ దేవిగా భావించి ఆరాధించి, పూజిస్తే పుస్తకపాఠాలను చదివే చిన్నారులకు కాలక్రమేణా ఆధ్యాత్మిక బోధనలపై ఆసక్తి పెరిగి సశ్చీలురవుతారు. అభయమిచ్చే స్తోత్రాలను, విభూతి మహాత్మ్యం కలిగించే స్తోత్రాలను, ఇడుములను తొలగించే స్తోత్రాలను చిన్నారులు పఠించి జమ్మిసరస్వతి దేవని పూజిస్తూ వస్తే విద్యాశక్తులు అధికమవుతాయని సిద్ధమహాపురుషుల ఉవాచ. 

మహిళలకు మహద్భాగ్యాలనిచ్చే క్షేత్రం

పురుషుల వలె మహిళలూ జంధ్యం ధరించి తర్పణాలు, హోమాలు, యాగాలు వంటి దైవీక కార్యాలు నిర్వహించలేకపోతున్నామేనని పలువురు మహిళలు కలత చెందుతుంటారు. అలాంటి దైవీక కార్యాలు నిర్వహించడం సమజంసమే అని పలువురు అయోమయం చెందుతుంటారు. వాస్తవానికి కార్గి, మైత్రేయి వంటి ఎందరో మహిళామణులు పురుషులు నిర్వర్తించే అన్ని కార్యాలను నిర్వహించి మహిళా లోకానికి కీర్తిని కలిగించారు. 
అయితే, ఇటీవలి కాలంలో జంధ్యంవంటివాటిని పురుషులకే పరిమితం చేయడానికి కారణం మహిళలు తమ ఇంటిల్లిపాది కార్యాలను నెరవేర్చితే చాలు అందులోనే దైవీక ఫలితాలు పొందగలుగుతారని భావించటమే! అయితే మహిళలు ధరించే మంగళసూత్రం జంధ్యం కంటే అత్యంత శక్తివంతమైనది. ఆ మహిళలు పితృ కార్యాల కోసం తయారు చేసే నైవేద్య ప్రసాదాలు పురుషులు చేసే తర్పణాల కంటే మిక్కిలి పవిత్రమైనది.

శ్రీ అమ్మవారు రాచ్చాండారు తిరుమల

ఈ పద్ధతిలోనే రక్షాండర్‌ తిరుమల పర్వతంలో విరాజిల్లే జమ్మి వృక్షాలను మహిళలు పూజించే విధానం ఇదే. పసుపును తమ చేతులతో నూరి ఈ వృక్షాలకు తాపడం చేసి, కుంకు బొట్లు పెట్టి కనీసం మూడు సార్లు ఒక్కో వృక్షాన్ని ప్రదక్షిణ చేసి మొక్కితే అన్ని సౌభాగ్యాలు పొంది సుఖమయ జీవనం సాగించగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యం వృద్ధి చెందుతుంది. విడాకులు పొందటానికి సిద్ధంగా ఉన్న వైవాహిక బంధాలు మరింతగా బలపడతాయి. 
యుక్తవయస్సుకలిగిన యువతులు తమ చేతులతో నూరిన పసుపును ఈ రెండు జమ్మివృక్షాలకు తపడిం చేసి ఒక్కో వృక్షాన్ని తొమ్మిదిసార్లకు తక్కువ కాకుండా ప్రదక్షిణ చేసి మొక్కితే పెళ్లి అడ్డంకులు, చర్మవ్యాధులు మటుమాయమవుతాయి. సుగుణవంతుడైన భర్తను పొందగలుగుతారు. పసుపు, కుంకమ, గాజులు, తిలకంబొట్టు, మంగళసూత్రపు హారం, ఫలపుష్పాలు తదితర మాంగల్యపు వస్తువులను తమలపాకులతో ముత్తయిదువకు సమర్పించటమే ఈ క్షేత్రపు సుప్రసిద్ధ సుమంగళి పూజగా సిద్ధపురుషులు నొక్కివక్కాణించారు. ఇవన్నీ శంకర నారాయణమూర్తులవారి కరుణాకటాక్షాలు కలుగటానికి దోహదపడతాయి. ఎలాగంటే? 
తాంత్రిక శాస్త్రాలలో తమలపాకులు శివతత్త్వాన్ని, వక్కలు వైష్ణవతత్త్వాన్ని చాటిచెబుతాయి. వక్కల లోపల విష్ణు ఆయుధమైన చక్రాన్ని తలపించేలా సన్నటి రేఖలు ఉండటాన్ని సామాన్యులు సైతం తిలకించి తన్మయత్మం చెందుతారు. 
దేవతలను వశమొనర్చుకోవటానికి ఉపయోగించే తమలపాకులు శివతత్త్వాన్ని చాటి చెప్పడం ఆశ్చర్యం కాదు కదా! పెరుమాళ్‌ను నిందిస్తే మహాశివుడి వద్ద ప్రాయశ్చిత్తం పొందవచ్చునని పెద్దలు చెబుతుంటారు. ఈ పద్ధతిలోనే భగవాన్‌ శ్రీరామానుజుల వారు గురువాజ్ఞను అధిగమించి 'ఓం నమోనారాయణ' అనే అష్టాక్షరి మంత్రాన్ని లోకానికి ఉపదేశించినందుకు గురువర్యులు ఆయనను తమలపాకులపై ఆశీనులు కావించి ప్రాయశ్చిత్తం ఒసంగిన ఉదంతం మనకందరికీ ఎరుకే మరి! 

లోక సంక్షేమార్థ యాగం

విశ్వమానవాళి సకల సౌభాగ్యాలు పొందటానికి, దేశంలో శాంతిని నెలకొల్పటానికిగాను ఆలయ జీర్ణోద్ధరణ పనులు, కుంభాభిషేకాలు, రథోత్సవాలు, ప్రదోషాలు, శివరాత్రులు వంటి ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలకు కూడా నోచుకోలేని మహాసంప్రోక్షణలు అర్థాంతరంగా ఆగిపోయిన ఎన్నో ఆలయాలను మనం చూస్తున్నాం. 
ఈ విధంగా ఆలయ కుంభాభిషేకం, రథోత్సవం వంటి ఆలయ కార్యక్రమాలు అర్థాంతరంగా ఆగిపోతే పునఃప్రారంభమయ్యేలా అనుగ్రహించే కరుణామూర్తి లాల్గుడి సమీపంలో కొలువైన తిరుమాందురై శ్రీఆమ్రవనేశ్వరస్వామివారు! 
ఈ క్షేత్రంలో శుక్లపక్ష చతుర్థి తిథులలో స్వామివారిని సేవించి హోమాలు, యాగాలు ఆరాధనలు నిర్వహిస్తే అర్థాంతరంగా ఆగిపోయిన ఆలయ కార్యక్రమాలు పునఃప్రారంభమవుతాయి. అలాంటి హోమాలు, యాగాలలో రక్షాండర్‌ తిరుమల పర్వతంపైని జమ్మి వృక్ష సమిథలను ఆహూతిగా సమర్పిస్తే ఫలితాలు త్వరితగతిన లభిస్తాయి. 
కొలను తవ్వకం, వంతెన నిర్మాణం, పాఠశాలలు, ఉద్యానవనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం నిర్వహించే ఏ యాగంలోనైనా, హోమాలలోనైనా తప్పనిసరిగా రక్షాండర్‌ తిరుమల పర్వతంపైని జమ్మి వృక్షాల సమిథలను ఉపయోగిస్తే అత్యద్భుత ఫలితాలను పొందవచ్చు. అయితే ఆ సమిథలను స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే అవాంఛిత పాపాలను మూటగట్టుకోవలసి వస్తుందన్న విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి. 

గరుడ తీర్థం

రక్షాండర్‌ తిరుమల దిగువన ఉన్నదీ గరుడతీర్థం. అద్భుతమైన మూలికల శక్తులు మెండుగా ఉన్న రోగ నివారణ తీర్థం ఇది. ఈ తీర్థం ఆవిర్భావ చరిత్ర వినినంతనే ఎన్నో వ్యాధులు నయమవుతున్నాయంటే ఈ తీర్థం మహిమను మాటలలో వర్ణింప శక్యమా? 
దేవలోకంలో రక్షుడు అనే దేవ గరుడపక్షి ఉండేది. పరాక్రమం, భక్తి, సద్గుణాలు కలిగిన గరుడ పక్షి అది. నారాయణుడిపై అపారభక్తితో పూజిస్తూ ఉండేది. దానికి ఓ ఆశ, కోరిక కలిగింది. అదేమిటంటే? 
మహాశివుడు నందివాహనమెక్కి సంచరిస్తున్నట్లు శ్రీమన్నారాయణమూర్తిగా ఓ వాహనంలో సంచరిస్తే ఎంత బాగుంటుందో కదా అని తలచేది. అంతేకాదు శ్రీమన్నారాయణుడికి తానే వాహమైతే మరెంతో బాగుంటుందో కదా అని తలచింది. ఇలా భావించిన ఆ గరుడపక్షి నారాయణమూర్తిని శరణుజొచ్చి తన కోరికను విన్నవించింది. ఆపద్బాంధవుడైన ఆ నారాయణమూర్తి 'తథాస్తు' అని దీవించారు. ఆ సమయంలో లక్ష్మీదేవి అడ్డుపడి 'రక్షుడా పరాక్రమశాలివైన నీవు ఏదైనా ఓ మంచి కార్యం నెరవేర్చినందుకు బహుమానంగా నారాయణమూర్తికి వాహనమైతే నీకు మరింత గౌరవం లభిస్తుంది, నా పెనిమిటి మహావిష్ణువుకు కీర్తి లభిస్తుంది కదా! అన్నది. గరుడపక్షి కూడా అమ్మవారి సంకల్పానికి ఆమోదం తెలిపాడు. 'అవును తల్లీ! మీరు చెప్పినది సమంజసమే. నేను చేయదలచిన శుభకార్యమేదో మీరే చెప్పండిం' అంటూ వేడుకున్నాడు. 'మహాశివుడి వాహనం ఎలా ధవళకాంతులతో ధగధగలాడుతోందో అదే రీతిలో నా పెనిమిటి ఆశీనులయ్యే వాహనం కూడా స్వచ్చమైన తెల్లదనం ఉండాలన్నదే నా తలంపు. ఆ సంకల్పాన్ని నీవు నెరవేర్చాలి' అంటూ శ్రీమహాలక్ష్మి తెలిపింది. గరుడుడు కూడా అందుకు ఆమోదించి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వద్ద సెలవుపుచ్చుకుని భూలోకంకు చేరింది గరుడపక్షి.

పూవాయి మధురం

పలు తీర్థాలను దర్శించి తన దేహాన్ని ఎలా ధవళపు వర్ణంలోకి మార్చుకోవడమా అంటూ ఆలోచనలో పడ్డది. ఆ సమయంలో అక్కడికేతెంచిన నారదుడిని కలుసుకుని, ఆ మహాముని వద్ద తన కోరికను వ్యక్తపరచింది. నారదుడు సమాధానం చెబుతూ 'రక్షుడా! నీ సంకల్పం నెరవేరాలంటే ధ్రువశక్తి పర్వతమలైకి వెళ్లి అక్కడ తపమాచరించాలి. ఆ పర్వతంలో వక్క పరిమాణమంతా రాతిని పెకల్చి సూర్యోదయానికి ముందు మింగి వేయాలి. ఆ తర్వాత రోజంతా ఆ పర్వతాన్ని ప్రదక్షిణ చేయాలి. మరుసటి రోజు కూడా సూర్యోదయానికి ముందే పర్వతం నుండి వక్కంత రాతిని పెకల్చి మింగి వేసి పర్వత ప్రదక్షిణ కొనసాగించాలి. ఆ పర్వతమంతటా అలుముకున్న వనమూలికల శక్తుల కారణంగా నీ దేహం తెలుపురంగుకు మారుతుంది. సర్వాభీష్ట సిద్ధిరస్తు!' అంటూ ఆశీర్వదించి సెలవుతీసుకున్నాడు నారదుడు. 
గరుడపక్షికి అమితానందం కలిగింది. తపమాచరించవలసిన ప్రదేశం, తపం చేసే విధానాన్ని కూడా నారదమహర్షి ఎరుకుపరచినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధ్రువపర్వతం వైపునకు వేగంగా ఎగురుతూ వెళ్లిపోయింది. 
రక్షాండర్‌ పర్వతపు మునుపటి పేరే ధ్రువపర్వతం. ధ్రువనక్షత్రంలా సుస్థిరంగా శక్తి అంశాలన్నింటిని కలిగి విరాజిల్లే పర్వతం కనుక దానికా పేరు స్థిరపడింది. అప్పట్లో దైవ సన్నిధులు ఏర్పడక దైవీక శక్తులు సూక్ష్మరూపంలో వ్యాపించి ఉండేవి. 
ధ్రువ పర్వతాన్ని చేరుకున్న గరుడపక్షి తూర్పుదిక్కుగా ఆశీనుడై భగవంతుడిని ప్రార్థించి తన ముక్కుతో పర్వతాన్ని పెకలించేందుకు ప్రయత్నించింది. ఏమాశ్చర్యం! పర్వతంలో చిటికెడంత రాతిని కూడా పెకలించకపోయింది. దేవలోకానికి చెందిన ఆ గరుడపక్షికి ఆశ్చర్యం కలిగింది. దేవలోకంలోనూ పర్వతాలు, నదులు, పుష్పాలు మెండుగా ఉంటాయి. రక్షుడనే ఈ గరుడపక్షి ఓ పర్వతాన్ని ముక్కుతో పొడిచిందంటే చాలు ఆ కొండ ముక్కచెక్కలైపోయేది. అంతటి పరాక్రమాలను కలిగిన గరుడపక్షికి ఇక్కడ సూదిమొన అంతటి రాతి ముక్కను ఆ కొండనుంచి ముక్కుతో పెకలించలేకపోయింది. అయినా పట్టువిడువక అదే పనిగా తన ముక్కుతో పర్వతాన్ని పలుచోట్ల పొడిచినా ప్రయోజనం లేకపోగా ముక్కు నుండి రక్తపు ధారలు కారినా, వెరవకు తన ప్రయత్నాలను కొనసాగించింది. చివరకు తీవ్ర అలసట చెంది మైకం వచ్చి నేలపై పడిపోయింది. 
మరుసటి రోజూ ఉదయం లేచిన గరుడపక్షి మళ్లీ తన ప్రయత్నాలను ప్రారంభించింది. ఇలా యేడాది పాటు ఆ పక్షి తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. చివరకు దాని ముక్కు పూర్తిగా అరిగిపోయింది. దీనితో ఆ పక్షి అచేతనంగా పడిపోయింది. అయినా ఆ పర్వతం నుండి చిన్న రాతిముక్కను సైతం పెకలించలేకపోయామే అనే బాధ కలిగింది. ఆ పరిస్థితిలో నారదమునులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. రక్షుడి తపస్సు గురించి అడిగాడు నారదుడు. జరిగినదంతా నారదుడి వద్ద ఏకరువుపెట్టింది గరుడపక్షి. అంతా విన్నాక నారదులు 'తుమ్మపువ్వును ఆశ్రయించు' అంటూ అక్కడి నుండి అదృశ్యమయ్యాడు నారదుడు. గరుడపక్షి బాగా ఆలోచించింది. నారదుడు చెప్పిన పదాలను మళ్లీ మళ్లీ జప్తికి తెచ్చుకుంది. ఆ పర్వతాన్ని పరికిస్తుండగా దానిపై ఓ చోట అందమైన తుమ్మపువ్వుల చెట్టు కనిపించింది. 
వెంటనే గరుడపక్షి ఆ తుమ్మపువ్వుల చెట్టును దగ్గరగా వీక్షించింది. దేవలంలోకంలోనూ, భూలోకంలోనూ ఆ గరుడపక్షి ఎన్నో రకాల తుమ్మపువ్వుల చెట్లను చూసింది. అయినా దాని కనుల్లోపడిన ఈ తుమ్మపువ్వుల చెట్టు తెల్లనిరంగు దాని కళ్లుమిరిమిట్లు గొల్పింది. దానికంటే మరో ఆశ్చర్యకరమైన సంగతి గరుడపక్షికి తెలిసింది. 
దేవలోకంలోని పర్వతాలన్నింటిని క్షణంలో తునాతునకలు చేసే శక్తి సామర్థ్యాలు కలిగిన తన ముక్కు ఈ ధ్రువపర్వతంలోని ఓ చిన్న రేణువును కూడా కదలించలేకపోయింది. అయితే ఓ పసిబిడ్డ సైతం సునాయాసంగా పీకి పడేసేలా ఉండే ఈ తుమ్మపువ్వుల చెట్టు ఆ పర్వతంలోకి తన వేర్లను చొచ్చుకుని పోయేలా చేసి ఏపుగా ఎలా పెరిగిందన్నదే ఆ గరుడపక్షికి ఎదురైన ఆశ్చర్యకరమైన సంగతి ఇదే! ఇప్పుడు మరొక ఆశ్చర్యం. ఆ తెల్లటి తుమ్మపువ్వులను గరుడపక్షి నిశితంగా చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచో 'నారాయణ నారాయణ' అనే సుమధురమైన స్వరంతో నామజపం చేస్తున్నవిధంగా శబ్దాలు వినిపించాయి. ఆ గరుడపక్షి తన చెవులను నిక్కబొడుచుకుని ఆ శబ్దాలు ఎటువైపు నుండి వస్తున్నాయా అని పరికించింది. ఆ శబ్దాలు ఎక్కడి నుండో రాలేదు. తనకు చేరువగా ఉన్న తుమ్మపువ్వుల చెట్టునుండే వస్తున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఇప్పుడా గరుడపక్షికి అసలు సంగతి తెలియవచ్చింది. తన వలన అన్నీ సాధ్యమవుతుందన్న అహంకారం వల్లే ఆ పర్వతాన్ని పెకలించలేకపోయినట్టు బోధపడింది. అయితే భగవంతుడి నామస్మరణ చేయగలిగితే అన్నీ సాధించవచ్చునని ఈ తుమ్మపువ్వుల చెట్టు తనకు తెలుపుతోందని అర్థమైంది. తన తపస్సు ఫలించడానికి మార్గాలు తెలియవచ్చాయి. వెంటనే తాను ఎంపిక చేసుకున్న చోట గరుడపక్షి కూర్చుని పర్వతంపై తన ముక్కును ఆనించి 'నారాయణా నారాయణా' అంటూ జపించసాగింది. కాసేపటికి ఆ పర్వతంలో నుండి చిన్న రాతి ముక్కపెకలించుకుని పడింది. గరుడ పక్షి ఆనందానికి పట్టపగ్గాలు లేపోయింది. గరుడపక్షి ఆ చిన్న రాతి ముక్కను నారదుడు చెప్పినట్లుగానే నోట వేసుకుని మింగింది. తన రెక్కలను ఊపుకుంటూ పర్వతాన్ని ప్రదక్షిణం చేసింది. ఇలా నెలల తరబడి, యేళ్లతరబడి పర్వతాన్ని తన ముక్కుతో పెకల్చి, రాలిపడిన రాతి ముక్కను మింగుతూ వచ్చింది. రోజూ మింగిన ఆ రాతి ముక్కల వల్ల ఆ గరుడపక్షి బరువు విపరీతంగా పెరిగింది. రోజులు గడిచే కొద్ది ఆ పక్షి కదలలేని పరిస్థితికి చేరుకుంది. అయినా పట్టువదలకుండా ఆ గరుడపక్షి తన పర్వతాన్ని ప్రదక్షిణ చేసింది. 

స్థల వృక్షం పూసుర విల్వం

ఆ సమయంలో ఓ రోజు నారదమహర్షి అక్కడికొచ్చారు. పరమానందంతో నారదుడికి నమస్కరించింది గరుడపక్షి. తన బరువు విపరీతంగా పెరుగుతుండటం గురించి నారదుడికి ఎరుకపరచింది. నారదుడు సమాధానం చెబుతూ 'రక్షకా! నీ తపం సవ్యంగానే సాగుతోంది. అయితే నీ భావనలలోనే ఇంకా మార్పు రాలేదు. ఆ మార్పు వస్తే బాగుండేది'' అన్నారు. 
గరుడపక్షి 'స్వామీ మీరు చెబుతున్నదేమిటో అర్థం కావటంలేదు' అన్నది. నారదుడు ఆ గరుడపక్షితో 'రక్షకా నువ్వింకా శివ, వైష్ణ బేధాలను పాటిస్తూ మహావిష్ణువే మహోన్నతుడని ఏకపక్షంగా భావనలను పెంచుకున్నావు. ఆ భేదమే నీ బరువు అధికమయ్యేందుకు ప్రధాన కారణమైంది. నిజానికి ఈ పర్వతపు రాళ్లు దైవీక శక్తిని కలిగినవే. వాటిని మింగినా బరువు పెరగటానికి ఆస్కారమే లేదు.'' అంటూ నారదులు నారాయణ, శివతత్త్వాలను ఆ గరుడపక్షికి బోధించారు. గరుడపక్షికి అప్పుడర్థమైంది తన అజ్ఞానం ఏపాటిదో! వెంటనే మనస్సులో శివవిష్ణువులనే భేదాలు సమసిపోయాయి. మరుక్షణమే దాని ఎదుట ఉన్న ధ్రువపర్వతం మాయమైంది. కైలాసపర్వతం ప్రతక్ష్యమైంది. శివపార్వతులు ఎదుట నిలిచింది ఆ గరుడపక్షి. మంచుకొండలపై దేవగణాలు, భూతగణాలు నిలిచి ఉన్నాయి. 
మహాశివుడు ఆ గరుడపక్షిని ఆప్యాయంగా తిలకిస్తూ- 
ఓం తత్‌ పురుషాయ విద్మహే శ్రీమద్‌ నారాయణ పాద సేవకాయ ధీమహీ 
తన్నో గరుడ ప్రచోదయాత్‌ 
అంటూ ఆశీర్వదించాడు. ఇంతటి మహద్భాగ్యం ఎవరికి లభిస్తుంది. మహాశివుడే ఆ గరుత్మంతుడిని మహాశివుడి పాదసేవకుగాను 'గరుడాళ్వార్‌'గా పురమాయించడం మరీ విశేషదాయకం. దైవీకమైన కైలాసపర్వతంలోని మంచు కొండలపై శివశక్తుల కృపాకటాక్షాలకు మహావిష్ణువు ఆశీర్వాదం తోడై గరుత్మంతుడి కంఠాన్ని తెల్లటి మంచు కప్పివేసింది. పక్షి గరుత్మంతుడిగా మారింది. దేవతలు, భూతగణాలు, శివగణాలు ఆ గరుడాళ్వార్‌పై పూలవర్షం కురిపించారు. శ్రీమన్నారాయణుడు శ్రీమహాలక్ష్మిదేవి ప్రత్యక్షమైన నీలకంఠుడి కరుణచే ధవళవర్ణంలోకి మారిన గరుత్మంతుడిని తన వాహనంగా నియమింపజేసుకున్నాడు. ఇలా గరుత్మంతుడు తపమాచరించి మహాశివుడి కరుణాకటాక్షములకు నోచుకున్న పవిత్ర స్థలమే రక్షణ ఆండార్‌ తిరుమలగా మారి ఆ తర్వాత మరువి రక్షాండర్‌ తిరుమలగా ఖ్యాతికెక్కింది. 
మహాశివుడి ద్వారా పఠించబడిన గరుడ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తుండటం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి వ్యాధులు వచ్చినా త్వరితగతిన మాయంకావటం తథ్యం. వైద్యులు ఈ గరుడ గాయత్రీ మంత్రాన్ని పఠించి ఆ మహాశివుడిని దర్శించుకుని పూజలు చేస్తే భక్తులు తమ శాఖలలో ప్రతిభావంతులుగా పేరుతెచ్చుకుంటారు. 
గురువారాల్లో మంచినీళ్లను మాత్రమే తాగి వ్రతమాచరిస్తే పైన పేర్కొన్న గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ వస్తే రుణ బాధలన్నీ సమసిపోతాయి. 

త్యాగరాజు కప్పలు

అద్భుతమైన మూలికా శక్తులు నిండిన గరుడ తీర్థంలో ఓ ప్రత్యేకమైన జాతికి చెందిన కప్పలు జీవిస్తున్నాయి. ఈ కప్పల దిగువన పసుపు వర్ణాన్ని కలిగి ఉంటున్నాయి. కనుక ఈ కప్పలను స్వర్ణ రేఖా కప్పలు అని పిలుస్తుంటారు. 
సాధారణంగా సర్పాలు, కోళ్లు, కప్పలు, బాతులు, పందులు వంటి జంతువులు ప్రజలను అంటు వ్యాధుల నుండి కాపాడతాయి. అయితే ఇలాంటి త్యాగమయమైన జంతువుల వల్ల పలు అంటు వ్యాధులు వస్తాయని చెబుతుండటం వేదనాభరితమని సిద్ధపురుషులు చెబుతారు. 
మనిషి యొక్క శ్వాసవాయువుల్లో విషపు శక్తులను పాములు తప్ప మరే శక్తి విరుగుడు కలిగించలేవు. పలు పంటభూములు ఇతర వ్యాపకాలకోసం ఉపయోగించటం వల్ల ఆ నేలో జీవించే పాము సంతతి నాశనం కావటం వల్లే ప్రస్తుతం తీవ్రమైన వ్యాధులు కలుగుతున్నాయి. 
అదే విధంగా నాటు కోళ్లను స్వేచ్చగా సంచరించేలా చేస్తే అవి ఎన్నోరకాల విషక్రిములను స్వాహా చేస్తాయి. అయితే ఆ కోళ్లను బంధించి కృత్రిమమైన ఆహారాన్ని ఇవ్వడం వల్ల కూడా రోగాలు కలుగుతున్నాయి. 
అదే విధంగా గరుడ తీర్థంలో బ్రతికే స్వర్ణ రేఖా కప్పలు పలు వ్యాధుల నుండి ప్రజలను కాపాడుతున్నాయి. వీటి తపస్సు చాలా ప్రత్యేకమైనది. ఇవి రాత్రనకా పగలనకా వర్రా హరా అంటూ బీజాక్షరాలను పలుకుతూనే ఉంటాయి. పౌర్ణమినాడు ఓ నిర్ణీత అమృత ఘడియల్లో తమ కళ్లను విశాలంగా తెరచి గరుడ తీర్థం విస్తీర్ణాన్ని పరిశీలిస్తుంటాయి. ఆ సమయంలో ఆ కప్పల కళ్ల నుండి ఓ విధమైన రోగ నిరోధక శక్తులు ఈ తీర్థం ఉపరితలంపై వ్యాప్తి చెందుతుంటాయి. ఆ సమయంలో ఈ తీర్థాన్ని చూస్తున్నవారికి బంగారాన్ని కాచి నీటిపై పూతపూసినట్లు అగుపడతాయి. సుమారు ముప్పావు విఘడియల దాకా ఈ శక్తులు నీటి పైభాగాన వ్యాప్తి చెందుతాయి. రక్షాండర్‌ తిరుమల పర్వతాన్ని ఎవరైనా ప్రదక్షిణ చేసి ఈ తీర్థాన్ని దర్శనం చేసుకుంటే చాలు జీవితాంతం వారికి పచ్చకామెర్లు సోకే ఆస్కారముండదు. 

శ్రీ దక్షిణామూర్తి
రాచ్చాండారు తిరుమల

ఈ ప్రపంచం జరిగే అన్ని కార్యాలకు ఏదో ఒక దైవీక నియమం ప్రకారమే జరుగుతాయని చెప్పడానికి పైన పేర్కొన్న కప్పల వైద్యం ఓ చక్కటి ఉదాహరణ. దీనిని గురించి మరికాస్త విశదపరుస్తాం. కప్పల కళ్ళ నుండి స్వర్ణరేఖలు పొందుపరచబడి ఉన్నాయి. స్వర్ణం అంటే బంగారం. స్వర్ణానికి గణితపు సంఖ్య మూడు అవుతుంది. ఆ కప్పలు అందించే శక్తులు ముప్పావు ఘడియలు గరుడ తీర్థంలో వ్యాప్తి చెందుతాయి. ముప్పావు ఘడియలను గణితం ప్రకారం గణించినట్లయితే అది (.75=7+5=12=3) మూడు సంఖ్యను తెలియజేస్తుంది. ఈ శక్తులు నయంచేసే వ్యాధి పచ్చకామెర్లు. అది పసుపు వర్ణానికి చెందిన అంకె 3. దేహంలో కాలేయంలో సమస్యలు ఏర్పడినప్పుడే పచ్చకామెర్లు వస్తాయి. ఆ కాలేయానికి సంబంధించిన అంకె కూడా 3. ముప్పావు ఘడియలపాటు నవీన కాల నిమిషాల లెక్కకు మార్చితే అది 18 నిమిషాలుగా మారుతుంది. ఇది అసుర గురు శక్తివల్ల మార్చబడినట్లు లెక్కించబడుతుంది. (60=6+0 =6). అప్పుడు 1+8 = 9 అంటే రోగ నివారణ కారకుడైన అంగారక భగవానుడి శక్తులు ఆవరించి ఉంటాయి. ఇదే పుణ్యక్షేత్రాలు తెలియజేసే దైవీక మహాత్మ్యం. 
ఇలా అద్భుత మూలికల శక్తి కలిగిన గరుడ తీర్థాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంటే సోపులు, షాంపులు వంటివాటిని ఉపయోగించకుండా ఉమ్మివేయకుండా, మలమూత్రాలను విసర్జించకుండా ఉంటే ఆ పరిశుభ్రతకు తగినట్లుగా ఈ తీర్థంలో స్వర్ణరేఖా కప్పల సంతతి వృద్ధిచెందుతాయి. ఎంతమేరకు వాటి సంతానం అభివృద్ధి చెందుతాయో అంతమేరకు ఊరిలో, దేశంలో, సమాజంలో రోగ నిరోధక శక్తులు పెరుగుతాయి. అంటు వ్యాధులు అణగారిపోతాయి. పైగా 100 స్వర్ణరేఖా కప్పలకు ఒక కప్ప చొప్పున గణితస్తే ప్రతియేటా గరుడ తీర్థపు కప్పలు తిరుపట్టూరు శైవస్థలంలో మండూక నాధుడి జ్యోతిలో ఐక్యమవుతాయి. దీనివల్ల ప్రజలకు కలిగే ఫలితాలను మాటలలో వర్ణించలేము. 
పౌర్ణమి తిథిలో మాత్రమే స్వర్ణరేఖా శక్తులు తీర్థమంతటా వ్యాపించినప్పటికే ఏ సమయలోనైనా ఈ స్థలాన్ని ప్రదక్షిణ చేసి గరుడ తీర్థాన్ని దర్శిస్తే అసంఖ్యామైన ఫలితాలను పొందవచ్చు. ఈ తీర్థాన్ని దర్శనం చేసుకుంటే చాలు ఆస్తమా వంటి దీర్ఘ కాలిక వ్యాధులకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. 
కప్పల కంటిని పోలి వుండే సగ్గుబియ్యంతో చేసిన పాలపాయసాన్ని తయారు చేసి దానంగా ఇస్తే రోగం త్వరగా నయం కాగలదు. ఆ పాయసంలో కాస్త స్వర్ణ భస్మం కూడా చేర్చి అందించటం చాలా మంచిది. అయితే ప్రస్తుతం స్వర్ణభస్మం అరుదైనది, అధిక ధరకలిగినదిగా మారటంతో సిద్ధపురుషులు దీనికి ప్రత్యామ్నాయంగా ఆవారం పుష్పదళాన్ని పాయసంలో కలిపి దానం చేస్తే అది స్వర్ణభస్మం దానం చేసినంతగా ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. 
కనుక అష్టమి, పౌర్ణమి తిథి రోజులలో, అయిలం నక్షత్రపు రోజులలో దేవుని దర్శించి గరుడతీర్థాన్ని దర్శనం చేసుకుని, అదే రోజున తిరుపట్టూరు శ్రీబ్రహ్మపురీశ్వరుడిని దర్శనం చేసుకుని పాయసాన్ని దానంగా ఇస్తే కలిగే ఫలితాలు అసంఖ్యాకం. తలరాతను సైతం మార్చగల దైవమూర్తులే రక్షాండర్‌ ఈశ్వరుడు, మండూక నాధులు! 

అరచేతిలో అణగిపోయే కఠిన చిత్తం

విశ్వశిలా రాళ్లు వజ్రం కంటే పలురెట్లు అధికమైన కఠినత్వాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నప్పుడు, నిజానికి దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే సందేహం కలుగుతోంది కదా! 
పట్టుదల పటుత్వం కలిగిన మనుష్యుడే దేనినైనా సాధించగలడు. మన గురువుగారు నుడివినట్లు ఆత్మస్థయిర్యంలేకుండా 'మెదు పకోడీలా' ఉండే మనిషి ఏ సత్కార్యమూ, ఆధ్యాత్మిక సాధనలు నెరవేర్చలేడు. ఏ సత్కార్యమెనా, ఆధ్యాత్మిక పరమైన కార్యమైనా వాటిని నెరవేర్చేటప్పుడు ఆటంకాలు కలుగడం సహజమే. కనుక ఆ అడ్డంకులను అధిగమించి, వ్యతిరేకతలను ఎదుర్కొని నిలబడి, తన సత్సంకల్పాన్ని విజయవంతంగా నెరవేర్చేందుకు మనస్థయిర్యాన్ని ఇచ్చేవే ఈ విశ్వశిలా రాళ్లు. 
దీనికి చక్కటి ఉదాహరణ భీష్మాచార్యులవారి జీవిత చరిత్రే. వెరవని ధైర్యం, పర్వతసమానమైన దృఢచిత్తం కలిగి, భగవంతుడిపై అచంచల విశ్వాసంతో అస్ఖలిత బ్రహ్మచర్యం పాటించిన సాధనాపరుడే భీష్మాచార్యుడు. 
భీష్మాచార్యులు మునుపు ధృవశక్తి పర్వతం అని పిలువబడిన రక్షాండర్‌ తిరుమలలో మూడేళ్లపాటు ఒంటికాలిపై ఘోరతపమాచరించటం వల్లే యావత్‌ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా నైష్ఠిక బ్రహ్మచారిగా వెలుగొందారు. దేవవ్రతుడని పేరుతగ్గట్టు కీర్తి ప్రతిష్టలను గడించారు. 
అంతేకాదు శ్రీకృష్ణపరమాత్ములవారి విశ్వరూప దర్శనభాగ్యమూ పొందలిగారు. వీటన్నింటినీ విశ్వశిలా రాళ్ల అనుగ్రహం వల్లే సాధించగలిగారు. ఆ కారణానే విష్ణు సహస్రనామంలో 'విశ్వం' అని ప్రారంభించి మహావిష్ణువును స్తుతించారు. 
అదేవిధంగా భీష్ముడే కాదు యశోద, అర్జునుడు, అక్రూరుడు సహా శ్రీకృష్ణభగవానుడి విశ్వరూప దర్శనం పొందినవారంతా మునుపటి జన్మలలో ఈ ధృవశక్తి పర్వతంపై తపమాచరించినవారే! 
తమిళుల ఆరాధ్యదైవం సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి విశ్వరూప దర్శనభాగ్యానికి నోచుకున్న శూరపద్ముడు సైతం మహాశివుడి నుండి మృత్యుంజయ వరాన్ని పొందటం కోసం తపస్సు చేయడానికి ముందు ఈ దృవశక్తిపర్వతంపై ఒక యుగకాలంపాటు తోడక ముహూర్త తపస్సు చేసి యేళ్లతరబడి అన్నపానీయాలు లేకుండా నిద్రాదులు విస్మరించి, మహాతపస్సు చేయగల శక్తి యుక్తులను సైతం పొందగలిగాడు. 

తోటక ముహూర్తం

ఆదిశంకరుల ప్రధానశిష్యులైన తోటకాచార్యులవారు తన గురువుగారి ఆజ్ఞానానుసారం ఈ స్థలంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం ఓ అత్యద్భుత విశేషం. 
శ్రీ అంటే సంపద అని సాధారణమైన అర్థంగా ఉన్నప్పటికీ, శ్రీ అనే పదం వేలకొలది ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేస్తుంది. శ్రీ అంటే ఎల్లప్పుడూ విడువకుండా చివరిదాకా వెన్నంటి అనుగ్రహించే సహాయకుడు అనే అర్థం కూడా ఉన్నది. ఇక్కడ శ్రీవిరాట్‌శిల ఈశ్వరుడంటే అంత్య కాలం వరకూ భక్తుల వెన్నంటి ఉండే రక్షకుడు అని అర్థం. కఠినశిలారూపుడు అని ఈ పదం ప్రధానమైన అర్థంగా ఉంటోంది. 
ఈ అద్భుత క్షేత్రంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించడానికిగాను ఆదిశంకర భగవత్పాదులు తన ప్రియశిష్యుడిని పురమాయించి, పంపాడంటే, ఆ శిష్యుడు శ్రీచక్రాన్ని మాత్రమే ప్రతిష్టించి ఉంటాడా? 
శ్రీచక్రంలో ఎన్నో రహస్యాలు మర్మాలు దాగి ఉంటాయి. ఆదిశకంరులు చెన్నై తిరువళ్ళికేణి క్షేత్రంలోని శ్రీపార్థసారథి పెరుమాళ్‌ ఆలయంలో ప్రతిష్ఠించిన శ్రీచక్రాన్ని 'భవసాగర శ్రీచక్రం' అని పిలుస్తారు. ప్రజలు మళ్లీమళ్ళీ ఈ పుడమిపై జన్మించి శోకసముద్రంలో పడి కొట్టుమిట్టాడకుండా, భగవంతుడు వారిని ఆపద్బాంధవునిలా రక్షించే రీతిలో ఈ వైష్ణవక్షేత్రాన శ్రీచక్రాన్ని ఆదిశంకరులు ప్రతిష్టించి ఉన్నారు. ఈ చక్రం అద్భుతమైన రోగనివారణ శక్తులు కలిగి ఉంటోంది. 
మధుమేహం వల్ల మృత్యువుకు చేరువై, ప్రాణగండం నుండి బయటపడ్డ రాజకీయ ప్రముఖుడొకరు శ్రీపార్థసారథి ఆలయ తీర్థకొలనులో శ్రమదానంతో పూడికతీత పనులు నిర్వర్తించి సద్గతిని పొందిన విషయం మీకు తెలిసిందే. 
ఆదిశంకరుల గురువు ఆదిశేషుడి అవతారమైన గోవింద భగవత్పాదులు. తన గురువుగారిని మరువక ఆయనకు నిత్యం సేవలందించే సేవకుడిగా ఆదిశేషుడు మహాశివుడి శివతాండవాన్ని దర్శించిన క్షేత్రమైన చిదంబరంలో ఆదిశేష శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. గురునిందకు పాల్పడినవారు, చేయతగని పనులు చేసినవారికి ప్రాయశ్చిత్త పద్ధతులను లోకానికి ఎలుగెత్తి చాటి చెప్పడం ఈ శ్రీచక్రం మహత్త్వం. 
చేసిన మేలును మరచిపోయేవారికి వారి తప్పిదాలను ఎరుకపరచి, పశ్శాత్తాపం చెంది, మంచివారుగా మారిన వారి సుఖజీవనానికి మంచి మార్గాన్ని చూపేదే అద్భుత చక్రం కూడా ఇదే. ఆదిశేషుడు ఒసంగిన అద్భుతమైన అరుదైన విరాళసంపత్తు అని నామంతో కీర్తింపబడునదే చిదంబరం నటరాజస్వామివారి ఆలయంలోని శ్రీచక్రమంటే అతిశయోక్తి కాదు. 
వివాహ వయస్సు దాటి కల్యాణయోగానికి నోచుకోకుండా ఎంతోమంది మగువలు కష్టాలకడలిలలో కొట్టుమిట్టాడుతున్నారు. అదేవిధంగా వివాహిత మహిళలు మెట్టినింట బంధువుల ప్రవర్తనల వల్ల, సందేహం, రోగం వంటివాటివల్ల శారీరకంగా, మానసికంగా వేదనాభరితమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వీరి కష్టాలను తొలగించి సుఖమయమైన సంసారిక జీవితాన్ని ప్రసాదించగలిగే రీతిలో ఆదిశంకర భగవత్పాదులు తిరువిడైమరుదూరు పుణ్యక్షేత్రంలో మేరు శ్రీచక్రాన్ని ప్రతిష్టించి ఉన్నారు. దీనిని 'జీవ ఐక్య మంగళ శ్రీచక్రం' అని కూడా పిలుస్తుంటారు. 
ఈ కాలపు యువతులు వైవాహిక జీవితాన్ని వాయిదావేస్తుంటారు. వీలయితే వైవాహిక జీవితానికి దూరంగా ఉంటారు. ఒక వేళ వివాహమైనప్పటికీ సంతానభాగ్యం పట్ల ఆసక్తి కనబరచకుండా ఉంటారు. ఒక వేళ సంతానం కలిగినా తన అందం పోతుందన్న అపోహతో తన ముద్దుబిడ్డకు చనుబాలను ఇవ్వడానికి జంకుతుంటారు. ఇలా ఈ కలియుగాన ఎదురవుతున్న అస్తవ్యస్తమైన జీవన పరిస్థితులనుండి ప్రజలను కాపాడేందుకే సేవాతత్పరుడైన తాయుమానసుఖ సిద్ధులు మణప్పారై శ్రీఅగస్తీశ్వరాలయంలో స్తన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. 
మణప్పారై నుండి గుండ్రటి భూమికి అటువైపు వెళితే అమెరికాలోని ఓరిగాన్‌ సరస్సు ప్రాంతం కనబడుతుంది. అక్కడ కూడా ఓ అద్భుతమైన శ్రీచక్రం ప్రతిష్టించబడి ఉంది. వరాహ పృథ్వీచక్రం అని పిలువబడే ఈ చక్రం ఎన్నో రకాలైన వాస్తుదోషాలను నివృత్తి చేసే వాస్తు శక్తులను మెండుగా కలిగి ఉంటోంది. 
ఇక ఇదే రీతిలోనే రామేశ్వర అగ్ని తీర్థంలో రాత్రనకా పగలనకా స్నానమాచరించే సముద్ర తీర ప్రాంతంలో మేధావి మహర్షి 'మేరు జ్వాలా' అనే అద్భుతమైన శ్రీచక్రాన్ని ప్రతిష్టించి ఉన్నారు. కోటాను కోట్ల మంది ప్రజలు ఇప్పటి దాకా రామేశ్వరం అగ్ని తీర్థంలో స్నానమాచరించినవారు, ఇంకా స్నానమాచరించబోయే ప్రజలూ మానసిక ఉల్లాసాన్ని ఆధ్యాత్మిక ప్రగతిని పొందటానికి ఆ మేరు జ్వాలా చక్రం నుండి వెలువడుతున్న ఆధ్యాత్మిక జ్యోతులే సాయపడుతున్నాయి. 
ఇలా ఎన్నో క్షేత్రాలలో అద్భుతమైన శ్రీచక్రాలు ప్రతిష్టించిన ఆదిశంకరులు తన అత్యుత్తముడైన శిష్యుడిని పంపి రక్షాండర్‌ పర్వతంపై శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేశారంటే దాని వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం కూడా ఇంపుగానే ఉంటుంది కదా? 
తోటకాచార్యులు ఈ క్షేత్రంలో నితంబ నిష్కంఠ శ్రీచక్రాన్ని ప్రతిష్టించి ఉన్నారు. ఈ సూక్ష్మ చక్రాన్ని దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక శక్తులను పొందినవారు చాలా కొద్దిమందే ఉన్నారు. వారిలో ఒకరే శేషాద్రిస్వాములు. నేటి ప్రపంచంలో ఆ శ్రీచక్రపు శక్తిని తిలకించే భాగ్యం పొందినవారు మాతా అమృతానందమయి మాత్రమే. 
ఈ అద్భుత శ్రీచక్రాన్ని తోటకాచార్యులు ప్రతిష్టించడానికి రెండేళ్లపాటు ఇక్కడి విశ్వశిలా పర్వతాలపై తోటక ముహూర్త సమయంలో ఒంటికాలిపై తపస్సు చేశారు. 
అభిజిత్‌ ముహూర్తం మీకందరికీ తెలిసిందే. పట్టపగలులో ఉండే ఈ ముహూర్తాన్ని అభిజిత్‌ ముహూర్తం అని అంటారు. చంద్రబలం, బ్రహ్మ ముహూర్తం, గోధూళి ముహూర్తం వంటి ఏవిధమైన కాల దోషాలు లేని పుణ్య సమయమే అభిజత్‌ ముహూర్తం. 
అభిజిత్‌ సమయాన్ని సక్రమంగా గణించడం అత్యంత ఆవశ్యకం. సాధారణగా పట్టపగలు అని చెబుతున్నప్పటికీ, దానిని నిశితంగా గణించాలి. ఉదాహరణకు ఓ రోజు సూర్యోదయం ఉదయం ఏడుగంటలు, అదే రోజున సూర్యాస్తమం సాయంత్రం 6 గంటలనుకుంటే ఆ నాటి పగటి సమయం 11 గంటలని భావించాల్సి ఉంటుంది. ఆ పగటి సమయాన్ని చెరిసగం చేస్తే ఐదున్నర గంటలవుతుంది. ఈ ఐదున్నర గంటలను సూర్యోదయ కాలమైన 7 గంటలను కూడితే అది 12.30 గంటలన్ని లెక్కకడతాము. కను ఆ రోజు అభిజిత్‌ ముహూర్త సమయం మధ్యాహ్నం 12.30 గంటలేనని గణాంక పరిశీలనల ద్వారా రుజువవుతుంది. 
ఈ అభిజిత్‌ సమయానికి ముందున్న ఒక గంటా 30 నిమిషాలు, అభిజిత్‌ సమయానికి వెనుక వచ్చే ఒక గంటా 30 నిమిషాలు కలిపితే వచ్చే మూడుగంటల సమయం తోడక ముహూర్తమవుతుంది. చాలా పునీతమైన ముహూర్త సమయమిది. 
ఈ తోటక ముహూర్త సమయంలో, శుక్లపక్ష దినాలలో కుడికాలిపై నిలిచి, కృష్ణపక్ష దినాలలో ఎడమ కాలిపై నిలిచి రెండేళ్లపాటు చేసిన తపోఫలితంగా నితంబ నిష్కంఠ శ్రీచక్రాన్ని తోటకాచార్యులు ప్రతిష్ఠించారు. 
దక్షిణ కామాఖ్య ఎక్కడుంది? 
అస్సాంలో చాలా ప్రసిద్ధిపొందిన శక్తిపీఠమైన కామాఖ్య అనే పుణ్యక్షేత్రం భవిష్యత్తులో దక్షిణాది ప్రజల ఆరాధనలకు నోచుకోకుండా పోతుందేమోన్న తలంపుతో ఆదిశంకరులు ప్రజలపై ఉన్న ప్రేమాభిమానాల కారణంగా తన శిష్యోత్తముడిని పంపి దక్షిణాత్య కామాఖ్యగా భాసిల్లే రక్షాండర్‌ పర్వత పవిత్రక్షేత్రాన కామాఖ్య శక్తిపీఠానికి ధీటుగా శ్రీపుర శక్తులన్నింటిని నితంబ నిష్కంఠ శ్రీచక్రం ద్వారా ప్రతిష్ఠ చేశారు. 
ఎన్నో యుగాలుగా ధృవ శక్తిపర్వతంగా పేరొందిన అద్భుత శక్తి స్థలం కామాఖ్య శ్రీపుర శక్తులతో భాసిల్లుతుండటంలో ఆశ్చర్యమేముంది? ధృవశక్తి నాయకిగా ఇన్ని యుగాలపాటు ఆరాధించటం కోసం శక్తి దేవియే ఈ కలియుగాన పెరియనాయకి అమ్మవారనే శుభనామంతో కొలువై వున్నారు. 
ఇక అమ్మహాదేవి కరుణాకటాక్షములను అవగాహన చేసుకుని ఆ దేవిని పూజించి సకల సౌభాగ్యాలను పొంది జీవించమని ప్రార్థిస్తున్నాము. 

పూవాయ్ మధురం

ప్రతి దైవమూ ప్రత్యేక పద్ధతులలో తన అనుగ్రహశక్తులను భక్తులకు అందిస్తుంటుంది కదా? 
ఉదాహరణకు తిరుఅణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడు తన అనుగ్రహశక్తులను గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ముఖతహ దర్శనాల వల్ల ప్రసాదిస్తున్నాడు. శబరిమల అయ్యప్పస్వామివారు ఇరుముడి ధరించి 48 రోజులపాటు వ్రతమాచరించి, పెరియపాదైలో పాదయాత్రగా వచ్చే భక్తులకు 18 మెట్ల స్పర్శ ఫలితాలుగా, మకరజ్యోతి ఫలితాలుగాను ప్రసాదిస్తున్నారు. రామేశ్వరంలోని రామనాధస్వామివారు తన క్షేత్రంలోని తీర్థాల ద్వారా తన అనుగ్రహశక్తులను భక్తులకు అందిస్తున్నారు. 
ఇదే రీతిలో రక్షాండర్‌ తిరుమలలో కొలువై ఉన్న అంబాళ్‌ 'పూవాయ్‌ మధురం' అని పిలువబడే పుష్కరిణి ద్వారా తన భక్తకోటికి అపరమిత అనుగ్రహశక్తులను అందిస్తున్నారు. అమ్మవారి సన్నిధికి కుడివైపు ఉన్న తీర్థమే 'పూవాయ్‌ మధురం' అనే అద్భుత తీర్థం. 
మగవారికి, మగువలకు వచ్చే సుఖ వ్యాధులను నయం చేసే మూలికా తీర్థం కూడా ఇదే. భక్తులకు దాంపత్య జీవనంలో ఏర్పడే అన్ని సమస్యలను పరిష్కరించడానికి అనువైన ఔషధాన్ని పోలిన అనుగ్రహశక్తులను అమ్మవారు అందిస్తున్నారు. మహిళల ఋతుస్రావ సమయాలలో ఏర్పడే సమస్యలు, రోగాలను మటుమాయం చేయగల అద్భుత దైవ తీర్థమే పూవాయ్‌ మధురం. 
ప్రతి మూలానక్షత్ర దినాన పొట్రాలం వూవాయ్‌ సిద్ధపురుషుడు కొల్లిమలై ఆకాశగంగతో పొంగిపొర్లి ప్రవహించే అమృతసరస్సులో పెరిగే మేఖలై పద్మం అనే అద్భుతమైన మూలికశక్తులను కలిగిన పద్మాలను ఈ పూవాయ్‌ మధురం తీర్థంలో నింపి వెళుతుంటారు. కొల్లిమలైలో తప్ప మరెక్కడా కానరాని ఈ మేఖలై పద్మం ప్రసాదించే మూలికా మహత్త్యాన్ని మాటలతో వర్ణించలేము. ఈ మూలికలను తిలకిస్తే లేదా ఆ పద్మాలకు 12 అడుగుల దూరాన నిలిచి ఆ మూలికల వాసనలు ఆఘ్రాణించినా మగవారికి, మగువలకు కలిగే సుఖ వ్యాధులన్నీ ఇట్టే నయమవుతాయంటే ఈ వ్యాధినివారణ మహత్త్యాన్ని ఏమని వర్ణించగలం? 
మగవారు, మగువలు మూలా నక్షత్రం రోజున ఈ స్థలంలో గిరి ప్రదక్షిణ చేసి మొక్కడం వల్ల అపరిమితమైన ఫలితాలను పొందగలుగుతారు. నిజానికి పూవాయ్‌ మధురం పుష్కరిణిని చూడక ఉండటమే మంచిది. ఆ మహిమను గిరి ప్రదక్షిణ చేసి ఆ దేవిని ఆరాధించటం వల్ల లేదా ఆ అమ్మవారికి స్వర్ణమేఖలై పద్మాలను సమర్పించడం ద్వారా పొందటమే అత్యుత్తమమైన మార్గమని సిద్ధపురుషులు చెబుతున్నారు. ఈ ఆధ్యాత్మిక నిపుణత్వం గురించి తెలుసుకోవాలంటే ఈ తీర్థానికి సిద్ధపురుషులు అందించిన పూవాయ్‌ మధురం అనే నామం గురించి సమగ్రంగా పరిశీలనలు సాగించండి. 
ఇలా భక్తులంతా పూవాయ్‌ మధుర తీర్థాన్ని కళ్ళతోనే కాకుండా అమ్మవారి దర్శనఫలితంగా దైవానుగ్రహం పొందటానికే తోటకాచార్యులవారు నిదంబ నిష్కంఠ శ్రీచక్రాన్ని పూవాయ్‌ మధురం తీర్థంలో ప్రతిష్టించారు. అద్భుత శ్రీపుర యోగినీ చక్రంగా నితంబ నిష్కంఠ శ్రీచక్రంగా విరాజిల్లుతున్న పుష్కరిణియే ఈ పూవాయ్‌ మధురం. 
పూవాయ్‌ మధురం తీర్థం మూలికా దైవీక శక్తులను అంబాళ్‌ దర్శనం వల్ల పొందటానికి దోహదం చేసేవే మేఖలై పద్మాలు. బంగారంతో వడ్డాణం చేసి అందులో నవరత్నాలను పొదిగి, వాటి నడుమ నీలపు రత్నాన్ని పొదిగి అమ్మవారికి ధరింసజేయడాన్నే మేఖలై పుష్పం అని అంటారు. ఇదే పూవాయ్‌ మధురం తీర్థపు మూలికా శక్తులను, దైవ అనుగ్రహాన్ని, రోగనివారణ శక్తులను, శ్రీపుర యోగినీ స్పర్శను, శ్రీచక్ర వినియోగ కాంతులను పొందటానికి అనువైన పద్ధతి అని సిద్ధపురుషులు చెబుతున్నారు. 
సకల సంపత్తులు కలిగిన ధనవంతులు ప్రపంచ శాంతి కోసం, సామాజిక సంక్షేమం కోసం ఈ మేఖలై పుష్పాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు. అయితే ఆర్థిక స్థోమతలు లేని పామర భక్తులు ఏం చేయాలి? అమ్మవారు దానికీ మార్గం చూపకుండా ఉంటారా? 
ఒక్కో వైపు ఆరు తెల్ల తామరపుష్పాలు చొప్పున ఇరువైపులా 12 తెల్ల తామరపుష్పాల నడుమ నీలోత్పల పుష్పాన్ని అమర్చి పూల వడ్డాణాన్ని తయారుచేసి, అమ్మవారికి సమర్పిస్తే, దానిని బంగారు వడ్డాణంగానే భావించి స్వర్ణమేఖలైగా స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఈ విషయంలో అమ్మవారి కరుణాకటాక్షాలు అపారం కదా! 
కనుక మూలా నక్షత్ర దినాలలో పైన పేర్కొన్న పద్ధతులతో అమ్మవారికి మేఖలై పుష్పాలను సమర్పించి, ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేసి, మూలవిరాట్టులను దర్శనం చేసుకుంటే సకల సంపదలు, సత్ఫలితాలు పొందగలుగుతారు. 
రక్షాండర్‌ తిరుమలలోని విశ్వశిలా రాళ్లలో ఒంటికాలిపై నిలిచి ఆ యోగ స్థితిలో, ముఖ్యంగా తోడక ముహూర్త సమయంలో దేవుని మొక్కడాన్నే 'తోటక ముహూర్తపు మొక్కుబడి' అని పిలుస్తాము. ఆ పద్ధతులను గురించిన ముఖ్యాంశాలను పరిశీలిద్దాం: 
దుర్గా చరణ ఆసన పద్ధతి ప్రకారం - అంటే ఒక కాలును మడిచి, మరో కాలుని నేలపై ఆనించి ఈ కొండపై ఏ చోటులోనైనా ఆరాధించవచ్చును. 
కనీసం ఒక గుళిక కాలం పాటు (24 నిమిషాలు) కాలును మార్చి నిలువకుండా, ఈ మొక్కుబడిని నెరవేర్చుకోవడం శ్రేయోదాయకం. 
మొక్కుబడి సమయంలో కాళ్లను మార్చుకోవచ్చునని అనుకున్నా కాల అంశాలకు సంబంధించిన ఫలితాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. అంటే శుక్లపక్షాన అధికమయ్యే అంశాలైన ఆయుష్షు, ఆరోగ్యం, సంపద, కీర్తిప్రతిష్టలు, గురు విశ్వాసం, దైవ భక్తి, జ్ఞానం తదితరాల కోసం, కృష్ణపక్షంలో తగ్గుముఖం పట్టే రోగాలు, రుణాలు, పేదరికం, దుష్టశక్తులనుండి విముక్తి పొందటానికి అనువైన మొక్కుబడిని తీర్చుకునే అనువైన స్థలమిది. 
దైవవిశ్వాసం, గురు భక్తిని పెంచగల అద్భుతమైన మొక్కుబడి కూడా ఇదే! పర్వతం అంటే శిఖరంలా ఉన్నతస్థితిలో నిజమైన భక్తిని పొందటానికి సాయపడేవే ఇక్కడున్న విశ్వశిలా రాళ్లు. 
ఎంతటి తీవ్రమైన కామ దుర్గుణాలను సైతం ఇట్టే మటుమాయం చేయగల తపో శిక్షణ కూడా ఇదే. అయితే మనసారా చేసిన తప్పులకు చింతించి మళ్లీ అలాంటి తప్పులు చేయకుండా ఉంటామనే దృఢనిశ్చయాన్ని ఏర్పరచుకున్నవారికే ప్రాయశ్చిత్త మార్గాలను అందిస్తుంది. 
ఉపవాసం, శబరిమల యాత్ర, కైలాస యాత్ర వంటి కఠినమైన వ్రత, నియమాలు కలిగిన దైవారాధనలను నెరవేర్చుకునేలా మనోస్థయిర్యాన్ని అందించగల అద్బుత పుణ్యక్షేత్రం ఇదే. 
హరిశ్చంద్రుడు సత్యోజాత వ్రతాన్ని ఆచరించి నిరంతరం సత్యంశీలుడిగా, సత్సీలుడిగా శాశ్వత కీర్తిని పొందడానికి ఆయనకు తోడుగా నిలిచినది ఈ స్థలంలోని తోటక ముహూర్త ఆరాధనే అని చెప్పడం అతిశయోక్తి కాదు. 

పిడికిలి బిగిస్తే అంతరంగం

మహాపురుషులు ఏ కార్యాన్ని చేసినా దాని వెనుక వేలకొలది కారణ కార్యాలు ఇమిడి ఉంటాయి. ఈ క్షేత్రానికి ఆదిశంకరులు తోటకాచార్యులవారిని ఎందుకు పంపారు? 
తోటకమంటే తామర అని బాహ్యపరమైన అర్థమున్నప్పటికీ తోటకమంటే పునీతమైన పదాలు మాత్రమే, పునీతమైన శబ్దాలు మాత్రమే స్వీకరించి పునీతుడై పుట్టినవాడనీ అర్థం. 
చాలా పవిత్రమైన మనస్సు కలిగినవారే శక్తి తత్త్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ విధంగా పునీతమైన కామాఖ్య స్థలంలో ఆరాధన పద్ధతులను ఏర్పరచిన తోటకాచార్యువారు పునీతమైన దక్షిణ కామాఖ్యలో పునీతమైన శక్తి తత్త్వాలను నింపారు. కామాఖ్య అంటే కామం అంటే ఏమిటని బాగా అవగాహన పొందినవారే శివతత్త్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. శక్తి లేకుంటే శివుడు లేదని చెప్పడం వెనుక తాత్పర్యం కూడా ఇదే. 
తోటకాచార్యుడనేది ఆయన కారణ నామమే. అది కూడా అద్వైత పారంపర్య నామమే. గిరి అన్నదే ఆయన జన్మతహ వాస్తవమైన నామధేయం. కనుకనే ఆయన కామగిరియైన గౌహతిలో కొలువైన అమ్మవారి శక్తి తత్త్వాన్ని గ్రహించి నితంబ నిష్కంఠ శ్రీచక్రాన్ని ఇచ్చోట ప్రతిష్ఠించగలిగారు. 
అంతరంగము అద్వైత తత్త్వము వేర్వేరు కాదు. అంతరంగమే అద్వైతం.. అద్వైతమే అంతరంగం. శివశక్తి తత్త్వం వలెనే నాణేనికి ఉన్న ఇరు పార్శ్వాలు ఇవి. ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. దీనినే పెద్దలు 'పిడికిలి మూస్తే అంతరంగం, పిడికిలి తెరిస్తే బహిర్గతం (అద్వైతం)' అనీ, 'పట్టపగలు బట్టబయలు' అని అద్వైత తత్త్వాన్ని సులువుచేసి వాక్రుచ్ఛారు. 
అంతరంగ జ్ఞానం కలిగినప్పుడే జ్ఞానం పరిపక్వత, పూర్ణత్వం పొందుతాయని ప్రజలకు బోధించడానికి మండనమిశ్రుడితో ఏర్పడిన చర్చావేదికలో ఆయన సతీమణి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రాజుగారు ఒకరి దేహంలో పరకాయ ప్రవేశం చేసి అంతరంగ జ్ఞానం పొందాడనే ఓ నాటకాన్ని కూడా ఆదిశంకరులు ఆవిష్కరింపజేసిన ఆ చరిత్ర మీకు సుపరిచితమే కదా! 
సవ్యంగా నియమనిష్టలతో సాగే దాంపత్య జీవన ధర్మమే ఆంతరంగిక జ్ఞానాన్ని అద్వైత జ్ఞానాన్ని పొందే ఆధ్యాత్మిక మార్గమని ప్రాచీన కాలం నుండి వశిష్టుడు - అరుంధతి, అగస్త్య మహర్షి - లోభాముద్ర, తిరువళ్ళువర్‌ - వాసుకి వంటి ఉత్తమ దంపతులు తమ జీవితాల ద్వారా లోకానికి ఎలుగెత్తి చాటారు. 
అంతేగాకుండా దైవీక మార్గంలో మనం పొందే పాఠాలు, అనుభవాలు మనలను మళ్లీ మళ్లీ ఉన్నతస్థితికి చేర్చుతాయనడానికి తోటకాచార్యులవారి జీవితమే చక్కటి సత్యసహిత నిదర్శనం. 
కామాఖ్యలో శక్తి ఆరాధనను నిర్వహించే ఉత్తమ దంపతులకు, గిరిగా (పర్వతంగా) ఆవిర్భవించిన ఆయనే, ఆదిశంకరుల వద్ద అద్వైత పాఠాలను నేర్చుకుని, కామాఖ్య శక్తి తత్త్వాలను దృవశక్తి పర్వతంలో పాదుకొల్పారు. ఆ మహాపురుషుడే మరుజన్మలో మహారాష్ట్రలోని శక్తిపీఠాన్ని ఆరాధించి రజనీష్‌ అనే అద్వైతిగా జన్మించారని కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆధ్యాత్మిక సత్యం. గురుభక్తిలో మునిగి తేలిన అద్వైతవాదియే రజనీష్‌! 

విశ్వశిల ప్రదర్శించే విశ్వరూపం

శ్రీవిరాట్శిల ఈశ్వరుడు ఓ చిన్న పర్వతంపై కొలువై ఉన్నట్టు అవగతమవుతోంది కదా? నిజానికి ఈ పర్వతం చూడటానికి చిన్న గుట్టలా కనిపించినా వాస్తవానికి 'విశ్వశిలా' అనే మూలిక దైవీకశక్తులే పర్వతాకారంలో, రాతి కొండలా కనువిందు చేస్తున్నదనేదీ ఇక్కడ యదార్థం. 
ఈ విశ్వశిలా కొండగుట్టల గొప్పదనం గురించి అగస్త్యమహామునులు చెబుతున్నది ఏమిటంటే? 
చెదరని జ్యోతిస్వరూపుడు ఓంకారనాధుడు 
బెదరని గమ్యమేమిటో చూపే విశ్వనాధుడు 
శరణన్న వారి కష్టాలన్నీ తీర్చే శిల్వేశ్వరుడు 
అంటే రక్షాండర్‌ పర్వతంపై కొలువైన శ్రీవిరాట్శిల ఈశ్వరుడు తనను ఆశ్రయించిన భక్తుల కష్టాలను మనోవేగంతో తీర్చటమే కాక ప్రళయకాలంలో వారిని కంటికి రెప్పలా సంరక్షిస్తాడు.
వాస్తవానికి ప్రళయకాలంలో ఏ జీవుడు, ఏ వస్తువూ నాశనం కావటం లేదు. జీవరాశులన్నీ వివిధాకారాలలో ఓంకార నాదంలా భగవంతుడిలో లీనమవుతాయి. అయితే శ్రీవిరాట్శిల ఈశ్వరుడిని శరణుజొచ్చినవారిని ఓంకార స్వరూపులుగానే ఉంటారు. తదుపరి సృష్టి సమయంలో పూర్వపుస్థితినే పొందుతారన్నదే పై పాటలోని భావం. 
ఇదే విశ్వశిల రాతిగుట్టల మహాత్మ్యం. విశ్వశిలా రాతి గుట్టలు ప్రళయ కాలంలోనూ చెదరకుండా ఓంకారనాదంగానే సుస్థిరమై ఉంటాయి. వాటిని నాశనమంటూ లేదు. ఈ విశ్వశిలా రాతిగుట్టలను సిద్ధపురుషులు వజ్రమంతటి వెన్నవంటి మృదువైన పర్వతాలని చెబుతుంటారు. దేవలోకపు గరుడుడైన రక్షుడు తన పటిష్టమైన ముక్కుతో పగలని ఈ పర్వతపు రాళ్ల నడుమ తుమ్మపువ్వు చెట్లు వేళ్లూనుకున్న విషయాన్ని ఇంతకుమునుపు పరిశీలించిన సంగతిని గుర్తుకు తెచ్చుకుంటే చాలా ఈ పర్వతపు గొప్పదనం తెలుస్తుంది. 
కనుకనే ఈ క్షేత్రంలో వజ్రాలను, వెన్నను దానం చేస్తే చాలు అద్భుతఫలితాలు వర్షిస్తాయి. వజ్రాల దానం అందరికీ సాధ్యపడదుకదా? దానికి కూడా ఓ మార్గం చూపారు సిద్ధపురుషులు 
ఓ అరటి ఆకులో లేదా దొన్నలో పశువు వెన్నను గుండ్రంగా ఉంచి దానిపై దానిమ్మ గింజలను చల్లి చిన్నపిల్లలకు దానం చేస్తే వజ్రాలను, వెన్నను దానం చేయగా వచ్చే ఫలితాలు సంప్రాప్తిస్తాయి. 
ఇలాంటి దానాలు దీర్ఘాయుష్షును కలుగజేయడంతోపాటు ప్రమాదాలు, రోగాలు వల్ల సంభవించే అకాలంగా మృత్యువాతపడకుండా కాపాడుతుంది. 60, 70, 80 వివాహ వార్షిక వేడుకలు జరుపుకునే దంపతులు ఇలాంటి దానాలు చేయడం వల్ల అద్భుత ఫలితాలను పొందగలుగుతారు. 

శ్రీ సుస్వరూప భైరవరు
రాచ్చాండారు తిరుమల

శుక్ర, శని ఆదివారాలలో ఇలాంటి దానాలు చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ అద్భుత విశ్వ శిలతో రూపొందించిన మూర్తియే నాచ్చియారు కోవెల‌ గరుత్మంతుడు. నిజానికి విశ్వశిలలో తయారైన మూర్తి అనటం కంటే విశ్వశిలతో రూపొందించబడిన మూర్తి అని చెప్పటమే సమంజసంగా ఉంటుంది. 
రక్షుడనే దేవలోకపు గరుడపక్షి శ్రీమన్నారాయణ మూర్తికి గరుడవాహనం అయ్యేందుకు అనుగ్రహం పొందినప్పుడు తన తపోశక్తులలో కొంత భాగాన్ని గరుడశిల ఆకారంలో భూలోకంలో వదలిపెట్టి వెళ్లాడు. ఆ శిలే ప్రస్తుతం నాచ్చియారు‌ ఆలయ పెరుమాళ్‌ వాహనంగా ఉంటూ భక్తజనంపై కరుణాకటాక్షాలను ప్రసరింపజేస్తున్నాడు. మనం ఇంతకు మునుపే చెప్పుకున్నట్లు విశ్వశిలా రాతిగుట్టలు శక్తి అంశాలే. ఇక వాటి బరువులలో వ్యత్యాసం కనిపించడొంక మాయే! దీనిని నిరూపిస్తూ నాచ్చియారు ‌కోయిల్‌లో జరిగే అద్భుత సంఘటనను పరిశీలిద్దాం. నాచ్చియారు‌ ఆలయపు రాతి గరుత్మంతుడిని తొలుత నలుగురు భక్తులు మోస్తారు. కాసేపయ్యాక దాని బరువు క్రమేణా పెరుగుతుంది. తొలుత నలుగురు భక్తులు ఆపై 8, 16, 32 భక్తుల దాకా మోస్తారు. చివరగా నలుగురు భక్తులు మోస్తారు. నలుగురు మాత్రమే మోసుకెళ్లిన ఆ గరుత్మంతుడిని 128 మంది మోసుకెళ్లే విధంగా దాని బరువు విపరీతంగా పెరగటం వింతే కదా! 
ఇక్కడ నలుగురు 128 మందిగా మారాల్సిరావటం వెనుక గల రహస్యమేమిటి? 128 అనేది నాలుగుతో 32 సంఖ్యను గుణిస్తే వచ్చే సంఖ్య కదా. అంటే ప్రజల ఆశలు, అడియాసలు 32 విభాగాలకు పరిమితమవుతాయి. అంటే ధనం, విద్య, యువతి, పదవి అంటూ 32 విధాలైన ఆశలే మానవుడిపై ప్రభావం చూపుతుంటాయి. మానవుల ఆశలను, ఆశయాలను నెరవేర్చేందుకే ఈ గరుత్మంతుడు తన బరువును 32 ఇంతలుగా పెంచుకుంటూ వారి కోరికలన్నింటినీ తీర్చగలుగుతున్నాడు. 
ఇదే విధంగా శ్రీఅగస్త్య మహామునులు కూడా భక్తజనానికి కలిగే కష్టాలన్నింటినీ తొలగించేందుకు పొదియ పర్వతంపై యేళ్లతరబడి తపమాచరించి మహేశ్వరుడిని నుండి 32 రకాల శ్లోకాలను పొంది, వాటిని ప్రజా సంక్షేమం కోసం అందజేశారు. ఆ 32 శ్లోకాలను ఏ చోట పఠించినా అక్కడి ప్రజలందరి ప్రార్థనలు నెరవేరుతాయి. మరి విశ్వశిలా పర్వతశ్రేణులపై కొలువైన రక్షాండర్‌ దివ్యక్షేత్రంలో ఈ 32 శ్లోకాలను పఠిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చుననేది సిద్ధపురుషుల మహావాక్కు. 

వరాలనిచ్చే తిరుమలేశుడు

'తిరు' (శ్రీ) అంటే సిరులు లేదా సంపదలు అని అర్థం. అయితే ఆ సంపదలు సహజంగానే ఓ చోటు నుండి మరోచోటుకి తరలిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి కదా? అయితే తిరుమల అంటే అశాశ్వతమైన, స్థిరత్వం లేని స్థలంగా భావించలేం కదా? కనుకనే తిరుమలేశుడు పర్వతంలా స్థిరమైనిలిచిన చోట కొలువుదీరి శాశ్వతమైన సంపదలనిచ్చే ప్రాంతమని భావించడమే మంచిది. 
ఏది శాశ్వతమైనది? ఈ లోకంలో అరుణాచలం ఒక్కటే ఏనాటికీ స్థిరమైన సుస్థిరమైన సంపద. ఆ సుస్థిర సంపదలకు మార్గాన్ని చూపేవే అక్కడుంటున్న బిల్వ వృక్షాలు. అది ఎలాగనే విషయం చాల ఆసక్తికరమైనది. బావిలోని నీళ్లు, పడతుల ధనము, వటవృక్షపు నీడ చలికాలంలో వేడిగాను, వేసవిలో చల్లగాను ఉంటాయని పెద్దలు చెబతుంటారు. పైపైనే దీనిని పరిశీలిస్తే ఇదేదో పెద్దల వాక్కు అని తలంచకుండా దాని వెనుకనున్న ఆధ్యాత్మిక రహస్యాలను పరిశోధించి చూస్తే తిరుమల ఎలా వరాలనిస్తుందనే విషయం బోధపడుతుంది. 
బావిలోని నీరు, పడతుల ధనము, వటవక్షపు నీడ - వీటియొక్క చల్లదనం, వేడిని గురించి అర్థంచేసుకోవడానికి ముందు మానవులకు ఇతర వస్తువులకు సంబంధించి వేడి, చల్లదనపు తత్వాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
లోపలి వేడి, వెలుపలి వేడి, నడుమ వేడి అంటూ మూడు విధాలైన ఉష్ణోగ్రతలు మన దేహంలో వ్యాపించి ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతల తత్త్వాలను అర్థం చేసుకోని కారణాల వల్లే చాలా మంది రోగాలతో బాధపడుతుంటారు. ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి తత్త్వాలు సిద్ధులకు మాత్రమే తెలిసిన రహస్యంగా ఉండటం వల్ల ఈ తత్త్వాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కన్నా వారి బోధించే సద్గుణాలను, అలవాట్లను కళ్లు మూసుకుని పాటిస్తే చాలు రోగరహిత దీర్గాయుష్షు, సుగుణాలతో సంతోషంగా జీవించటం తథ్యం. 
ఉదాహరణకు మన అరచేయి నడుమ (మధ్యస్థపు) వేడిని, మహిళల మోచేయి వెలుపలి వేడి తత్త్వాలను కలిగి ఉన్నాయి. కనుకనే వివాహ సందర్భంలో వరుడు వధువు యొక్క చేతివ్రేళ్లను పట్టుకునే పాణి గ్రహణమనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ పాణిగ్రహణ మంత్రాలను గమనించి విని అర్థం చేసుకుంటే ఆరోగ్యవంతమైన దేహం, మేధోసంపత్తి కలిగిన పిల్లలు పుట్టడానికి దోహదపడతాయి. ఈ వైభవంలో మరికొన్ని అద్భుత రహస్యాలు కూడా ఉన్నాయి. గ్రహణం అంటే మింగటం, పట్టుకోవడం అని అర్థం. సూర్యగ్రహణం సందర్భంగా రాహువు సూర్యుడిని మింగుతాడని చెబుతాం. కను పాణి గ్రహణం అంటే వరుడు వధువు చేతిని పట్టుకుంటాడు అనే అర్థంతోపాటు వరుడు వధువును మింగుతాడు అనే అర్థం కూడా ఉంది. 
కామేశ్వరుడైన శివుడు సృష్టిని నెలకొల్పేందుకు మన్మథుడిని పంపాడు కదా? అప్పుడు మన్మధుని శివుడు తన త్రినేత్రంతో దహించడాన్ని కామదహనం చేశాడని మనం చెబుతాం. నిజానికి భగవంతుడి లీలలో ఏవీ నాశనం కాదని కదా చెబుతుంటాం. దానిని పరిగణనలోకి తీసుకుని వాస్తవాన్ని పరిశీలిస్తే అక్కడ జరిగినది కామదహనమే కాదు. అది కామ దమనమే. అంటే కామం నాశనం కాలేదు. కామం దమనమైంది అంటే కామం అదుపులోకి వచ్చి శివుడి స్వాధీనంలోకి వచ్చింది. 
కామం దహనమయితే సృష్టి ఎలా సాధ్యమవుతుంది? పాణిగ్రహణ సమయంలోను ఇదే జరుగుతున్నది. వరుడు వధువుని మింగి అంటే శక్తి తత్త్వం అనే కామాన్ని మింగి తన కట్టుబాటులో ఉంచుకుని దాని ద్వారా సక్రమమైన సంసారాన్ని సాగిస్తాడని అర్థం. అప్పుడే అతడు తిరువళ్లువరు‌ నుడివినట్లు మంచి మగధీరుడని అనిపించుకుంటాడు. ఇలా లోపలి వేడి, వెలుపలి వేడి తత్త్వాలు మధ్య పొంతన కుదరకపోవడం వల్ల స్వీయభోగాలాలసత వల్ల నరాల బలహీనత, ఆత్మనూన్యతా భావం వంటి లోపాలు ఏర్పడుతున్నాయి. 

ఇవ్వాల్సింది ఏమిటి ?

ఒకరినొకరు కలుసుకునేటప్పుడు కరచాలనం చేసుకునే అలవాటు అన్నివర్గాలవారిలోనూ వేగంగా వ్యాప్తిలోకి వస్తుండటాన్ని చూస్తున్నాం. ఈ అలవాటును నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులు కలుపటం వల్ల రెండు మనసుల కలయిక వల్ల మధ్యస్థపు వేడి మధ్యస్థపు వేడి కలుస్తాయి. అందువల్ల దేహంలో విపరీతమైన ఉష్ణం, దేహంలో బలహీనతలు ఏర్పడుతున్నాయి. చేతికొనలలోని సూక్ష్మమైన నరాలు దెబ్బతింటాయి. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు రెండు అరచేతులను ఒక్కటిగా చేసి నమస్కరించటమే మన ప్రాచీన సంప్రదాయం. రెండు అరచేతుల మధ్యనున్న బాహ్యాంతరపు గాలులు నమస్కరించే వ్యక్తి హృదయానికి చేరువగా ఉండటం వల్ల హృదయంలో వసిస్తున్న భగవంతుడి కరుణాకటాక్షాలను ఇతరులకు సమర్పించినవారమవుతాము. 
రెండు అరచేతుల నడుమన్ను వాయుమండలం సూర్య, చంద్ర శక్తుల సంగమంగా ఉంటాయి. కుడి చేయి సూర్యశక్తిని, ఎడమచేయి చంద్రశక్తిని కలిగి ఉండటం వల్ల ఆ రెండు శక్తుల సంగమం వల్ల ఏర్పడే శాంతి సమాజంలోనే శాంతిని చేకూరుస్తుంది. 
అయితే కరచాలనం చేసేటప్పుడు సూర్యశక్తి, సూర్యశక్తి కలిసి దేహంలో అనవసరంగా అత్యధిమైన ఉష్ణాన్ని పుట్టిస్తుంది. 
ఇలా ఉష్ణ, శీతల తత్త్వాలను అర్థం చేసుకోగలిగినప్పుడే బావిలోని జలం యొక్క శీతలత్వాన్ని అర్థంచేసుకోగలం. బావిలోని జలపు శీతలత్వాన్ని అర్థం చేసుకోగలిగారు కనుకనే కంచి పరమాచార్యులు బావినీటిని బకెట్టుకు తాడుకట్టి తోడుకోకుండా చేతితో బకెట్టులోని జలాన్ని తీసుకుని స్నానమాచరించేవారు. రాట్నం ద్వారా బావినీటిని తోడితే దాని ఉష్ణస్థితి మారుతుంది. ఇదేమంత పెద్ద విషయం కాదు కదా అని మీరనుకోవచ్చు. అయితే బావినీటి శీతలపుస్థితిని అర్థం చేసుకున్నందువల్లే పరమాచార్యులు ఆ తర్వాత చంద్రమౌళ్వీరుని పూజలో సమర్పించే బిల్వపత్రాల శీతలపు స్థితిని అర్థంచేసుకోవడానికి వీలుపడుతుంది. ఇలా ప్రతి దైవీక విషయం మరో దైవీక విషయానికి అనుసంధానం కలిగి ఉంటుంది. 
శివుడికి సమర్పించే బిల్వ పత్రాల గురించి తెలుసుకోగలిగితేనే చెట్టునిండా బిల్వ పత్రాలున్నా ఆదిశంకరులు 'ఏకబిల్వం శివార్పణం' అని అంటూ ఒకే బిల్వపత్రాన్ని ఎందుకు సమర్పించారనే రహస్యం బయటపడుతుంది. 

శ్రీ అమ్మవారు

బిల్వపత్రాల గురించి తెలుసుకోగలిగితేనే ఆ పత్రాల తర్వాత పుట్టి బిల్వ కాయలు గురించి అర్థం చేసుకోగలం. బిల్వ కాయను గురించి తెలుసుకోగలిగితేనే భూసుర జ్యోతిని గురించి అర్థం చేసుకోగలం. భూసుర జ్యోతిని గురించి తెలుసుకోగలిగితేనే పడతుల ధనాన్ని గురించి అర్థం చేసుకోగలం. 
భూసుర జ్యోతి అంటే ఏమిటి? బ్రహ్మ విష్ణువుల మధ్య తమలో ఎవరు పెద్ద అనే తర్కం ఏర్పడినప్పుడు ఆది అంతాలను తిలకించటానికిగాను పరమేశ్వరుడు మహా అగ్ని జ్వాలగా వారి ఎదుట ప్రత్యక్షమయ్యారు కదా? అప్పుడు పైకెగసిన మహాజ్యోతి స్వరూపమే భూసుర జ్యోతి. భూసురం, భూసరై, భూసుర జ్యోతి అంతా తెలియజేసేది ఒక్కటే. ఈ భూసుర జ్యోతి ఆ తరుణంలో భూగోళాన్ని మాత్రమే కాదు అండ చరాచరాలన్నింటిలోనూ వ్యాపించిన బిల్వ కాయలలోనూ పరిణమించింది. అప్పుడే ఆ మహేశ్వరుడు పవిత్రపర్వతమంతటా ఉన్న బిల్వ వృక్షాలలోనూ ఈ భూసుర జ్యోతి వ్యాపించింది. కనుకనే తిరుఅణ్ణామలైకి సాటియైన ప్రాచీనమైనదిగా ఈ స్థలం కీర్తింపబడుతోంది. 
ప్రతియేటా మార్గశిర మాసారంభంలో ఈ భూసుర జ్యోతిలో ఒక భాగం తిరుఅణ్ణామలై నుండి బయల్పడి భూలోకమంతటా వాయురేణువులతో కలిసి ప్రజలకు అవసరమైన ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని అందిస్తోంది. మార్గశిర మాసంలో ఇళ్ల ముంగిట పేడనీళ్లు చల్లి పిండి ముగ్గులు వేసి ఓ గొబ్బెమ్మపై గుమ్మడి పువ్వును ఉంచటంతో ఈ భూసుర జ్యోతి దానిపై వ్యాపించి మానవులకు అపరిమితమైన శుభాలను అందిస్తోంది. 
మార్గశిర మాసంలో ఉదయాన్నే లేచి ఈ భూసుర జ్యోతి శక్తులను పొందితే చాలు యేడాది పొడవునా ప్రజలకు అవసరమైన దేహ, మానసిక ఆరోగ్యశక్తులు లభిస్తాయి. భూసుర శక్తిలోని ఓ వాయు అంశాన్నే ఓజోన్‌ పొర అని పిలువబడుతోంది. 
కనుకనే మహారక్షకుడి పర్వతంలో విరాజిల్లే బిల్వ వృక్షాల నుండి ఒక బిల్వ పత్రాన్ని భగవంతుడికి సమర్పిస్తే చాలు దాని వల్ల కలిగే ఫలితాలు వివరించి లెక్కించి చెప్పలేము. ఈ పవిత్రస్థలంలో ఎక్కడైనా ఓ చోట కూర్చుని ఈ బిల్వకాయలను గురించి తపమాచరించాలి. 
ఎప్పుడైతే ఈ భూసర జ్యోతి దర్శనం లభిస్తుందో అప్పుడే శ్రీ ఉణ్ణాములై అమ్మవారి ధన రహస్యాలు అవగతమవుతాయి. ఈ రహస్యాలను అర్థంచేసుకున్నవారినే అమృతం సేవించినవారని చెబుతుంటాము. కనుకనే తిరుజ్ఞాసంబంధమూర్తి మాత్రమే కాకుండా అర్థనారీశ్వరి అమృతసమాన పాలను సేవించిన అందరూ భూసుర జ్యోతిని దర్శించినవారవుతారని మనకు అవగతమవుతోంది కదా? అమృతక్షీరాన్ని సేవించడం వల్ల జ్ఞానం మాత్రమే సిద్ధించదు. అప్పుడు వటవృక్షం నీడ రహస్యమేమిటో తెలుస్తుంది. వటవృక్షం నీడ రహస్యాన్ని తెలుసుకోవడం వల్ల ప్రయోజనమేమిటి? అప్పుడే తిరుఅణ్ణామలైలో కొలువుదీరిని దక్షిణామూర్తి దివ్యస్వరూపాన్ని దర్శించే మహాభాగ్యం కలుగుతుంది. 
వీటన్నింటికీ మూలాధారంగా బావిలోని జలాలు ఉండటం వల్లే పలు దేవాలయాలలో స్వామివారికి అభిషేకం నిర్వహించడానికి విద్యుత్‌ మోటార్లతో నీటి తోడకుండా, చేతితో నీటిని తోడి అభిషేకం చేయడం ఆనవాయితీగా మారింది. కనుకనే స్వామివారి అభిషేకానికి బావినీటిని చేది ఇవ్వడాన్ని మహోన్నతమైన కార్యంగా చెప్పబడుతోంది. 
ఈ కీర్తిప్రతిష్టలన్నింటికీ సాక్ష్యంగా నందీశ్వరమూర్తిగాను ఆ పరమేశ్వరుడు తిరుఅణ్ణామలైలో విరాజిల్లుతున్నారు. ఏ అవతారమూర్తి యైనా తిరుఅణ్ణామలైని ప్రదక్షిణ చేయాలంటే తొట్టతొలుత ఈ నందీశ్వరమూర్తి వద్ద అనుమతిపొంది, ఆయన చెప్పేరీతిలోనే తిరుఅణ్ణామలైస్వామివారిని సేవించాలంటే ఆ స్వామివారి ఆధ్యాత్మిక స్థితి ఎంతటి మహోన్నతమైనదో వివరించగలమా? అలాంటి ఉన్నతస్థితి లభించటానికి తిరుచోట్రుతురై ప్రాంతంలో ఆయన బావినీటిని చేది ఆ జలాలతో స్వామివారి అభిషేకం జరిపేందుకు దోహదపడటమే! 
మహారక్షకుడి పర్వతంలోని బిల్వవృక్షాల దర్శనం భూసుర జ్యోతి దర్శననానికి సాటియైనదని చెబుతున్నప్పుడు ఆ బిల్వ వృక్షాలలను ఎలా సంరక్షించుకోవాలి? ఏ కారణం చేతనైనా ఆ వృక్షం నుండి బిల్వదళాలను భగవంతుడి పూజకు తప్ప ఇతర కార్యాలకు ఉపయోగించరాదని దృఢ నిర్ణయం కలిగి ఉండాలి. మహాశివుడి కీర్తిప్రతిష్టలను వివరించగల మహాసిద్ధపురుషులు మరొక అద్భుతం గురించి కూడా చెబుతారు. మానవులకు, రాముడు, కృష్ణుడు అని పేర్లున్నట్లుగానే ఈగ, చీమ, చెట్ల చరాచార జీవురాశులన్నింటికి ఈ భూలోకంలో పేర్లున్నాయి. ఆ విధంగా మహారక్షకుడి దివ్యక్షేత్రంలో కన్నిమూల గణపతికి సమీపంలో ఉన్న బిల్వ వృక్షానికి భూసుర జ్యోతి బిల్వం అనీ, దుర్గాదేవికి ఎదురుగా ఉన్న బిల్వవృక్షాన్ని శక్తి విలంబిత బిల్వం అని పిలువబడుతున్నాయి. 

సుస్వరూప భైరవమూర్తి

తనను గురించి సంపూర్ణంగా తెలుసుకోవడమే భగవద్‌సేవలకు మూలం అవుతుంది. అయితే ఈ 'తనను తెలుసుకోవడం' అనేది అంతటి సులవైన కార్యం కాదు. ఈ విషయంలో మునిగితేలినివారికే తెలస్తుంది. ఇలాంటి ఆత్మవిచారానికి తోడుగా ఉంటున్నవారే ఆ మహారక్షకుడి పర్వతంపై వెలసిన సుస్వరూప భైరవమూర్తి స్వామివారు. రమణమహర్షి ఆ స్థలంలోని బైరవమూర్తిని సేవించి అనుగ్రహం పొందిన అద్భుతాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పన్నెండేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు రమణులు ఈ స్థలంలోని సుస్వరూప భైరవమూర్తి ఎదుట ఆశీనులై ప్రతి తిరువాదిరై నక్షత్ర దినాన ఆ నక్షత్రం వ్యాపించి ఉండే సమయం వరకూ ధ్యాన నిమగ్నులై ఉంటారు. 
అదే విధంగా ప్రతి రోహిణీ నక్షత్ర దినాన ఇక్కడి దక్షిణామూర్తి ఎదుట ఆశీనులై రోహిణి నక్షత్రం వ్యాపించి ఉండే సమయం వరకూ బిల్వవృక్షాలలో వ్యాపించి ఉన్న భూసురజ్యోతిని గురించి ధ్యానం చేసేవారు. ఈ ఆధ్యాత్మిక సాధనలను కొనసాగింపులో భాగంగానే ఆయన ఆత్మవిచారంలో ఉన్నతస్థితిని చేరుకుని, చివరకు ఆ మహేశ్వరుడి దర్శనభాగ్యానికి నోచుకున్నారు. 
ప్రత్యేక సన్నిధిలో దక్షిణాభిముఖంగా కొలువుదీరి ఉండటం ఈ స్థల సుస్వరూప భైరవమూర్తి ప్రత్యేకతను తెలియజేస్తుంది. అదే విధంగా తిరుచ్చి దగ్గరవున్న మలైయడిపట్టి అనే పవిత్రస్థలంలో భైరవమూర్తి కొలువై ఉండటం భూలోకవాసులు చేసుకున్న మహద్భాగ్యం. సాధారణంగా దక్షిణాభిముఖంలో కొలువైన భైరవమూర్తిని సేవించడం వల్ల ఆత్మవిచారంలో మహోన్నత స్థితిని పొందగలం. తానెవరు తన స్వీయస్థితిని గురించి నిదర్శన సమేతమైన అనుభవాన్ని ఈ భైరవమూర్తి కలుగజేస్తారు. 
దేహపరమైన మానసికపరమైన లోపాలు వల్ల ఆత్మస్థయిర్యం కోల్పోయి ఆత్మనూన్యతా భావంతో జీవిస్తున్నవారిలోని విరక్తిని పోగొట్టి వారి జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని నిండుగా నింపటమే ఈ స్వామి అరుదైన గుణం. 
ఊహించని రోగాలు, ప్రమాదాలు, రుణ బాధలు, ప్రేమ విఫలం, వ్యాపారంలో నష్టం వంటి బాధలతో ఆత్మహత్య చేసుకోవాలనుకునే స్థితిలో ఉన్నవారికి మానసిక ధైర్యాన్ని, ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగల మానసిక బలాన్ని పొందుతారు. 
సుదీర్ఘ కాలం పితృదేవతలకు నెరవేర్చలేకపోయిన పితృ, తర్పణ సేవలు చేయలేకపోయినవారు, ఆ సేవలను విస్మరించినవారు తమ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపంతో వాటిని సరిదిద్దుకునే అవకాశం పొందగలుగుతారు. 
తమ కులదైవం గురించి తెలియనవారు, ఏ దైవాన్ని ఇష్ట దైవంగా ఎంచుకోవాలో తెలియనివారు ఈ స్థలంలోనే తాము సేవించాల్సిన దైవాలను తెలుసుకోగలుగుతారు. 

దైవ ప్రదక్షిణమే గిరిప్రదక్షిణ

మహారక్షకుడి దివ్యక్షేత్రాన్ని చుట్టి, ప్రదక్షిణ సేవతో దైవారాధన చేసే పద్ధతులలో కనీసం 108 పద్ధతులు ఉన్నప్పటికీ, అందులో ముఖ్యమైన మూడు గిరిప్రదక్షిణ పద్ధతులు ఈ కలియుగంలో సిద్ధపురుషులు తెలియజేశారు. 
ఈ క్షేత్రంలోని విశిష్టదాయకమైన గిరి ప్రదక్షిణ పద్ధతులను కాయశిరై ప్రదక్షిణగా సిద్ధులు పరిభాషలో చెబుతుంటారు. కాయశిరై ప్రదక్షిణ అనే పేరుకు సంబంధించిన కారణాలను తెలుసుకోవడం కంటే ఈ స్థల ప్రదక్షిణ చేసే భక్తులు కొనసాగించే ప్రదక్షిణల వల్ల కలిగే శుభకారకాలను స్వయంగా తెలుసుకోవడమే మంచిది. 

అష్టాక్షర కాయ్శిరై ప్రదక్షిణ

ఈ పద్ధతిలో గిరిప్రదక్షిణ చేయడానికి ముందుగా జయ జమ్మివృక్షాన్ని ఎనిమిదిసార్లు, విజయ జమ్మివృక్షాన్ని ఎనిమిదిసార్లు వేర్వేరుగా ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత మహారక్షకుడి కొండను ఓసారి ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ ప్రారంభించిన స్థలంలోనే దానిని పూర్తి చేయాలి. ఇదే ఏక పర్యంతపు ప్రణవ కాయ్‌శిరై ప్రదక్షిణ. 
తోడక కాయశిరై ప్రదక్షిణ 
ఈ పద్ధతిలో పైన పేర్కొన్నట్లు తోడక ముహూర్తసమయం ముగిసేంత దాకా గిరి ప్రదక్షిణలోనే గడపవలసి ఉంటుంది. ఈ ముహూర్త సమయంలో ఒకటి, ఎనిమిది, పది అంటే ఎన్నిసార్లయినా గిరి ప్రదక్షిణ చేయవచ్చు. మీకున్న సత్తువ, అభీష్టం ప్రకారం ప్రదక్షిణ సంఖ్యలను ఎంచుకోవచ్చు. గిరి ప్రదక్షిణను ముహూర్త సమయం (మూడు గంటలు) లోపున నిర్విఘ్నంగా పూర్తి చేయగలగాలి. 
పైన పేర్కొన్న ఏ పద్ధతిలోనైనా గిరిపద్రక్షిణ చేసిమొక్కి అద్భుత ఫలితాలను పొందవచ్చు. 

పండరి పాదుకా గిరి ప్రదక్షిణ

ఈ పద్దతిలో గిరి ప్రదక్షిణను ఏ క్షేత్రంలోనైనా ఆచరించవచ్చు. కానీ మహారక్షకుడి క్షేత్రంలో చేసే గిరి ప్రదక్షిణ విశేషదాయకమైన ఫలితాలు లభిస్తాయి. భరతుడు రాముడి పాదరక్షలను శిరస్సుపై మోసుకెళ్లి సింహాసంపై పెట్టి పూజించి పాలించినట్లు, కొత్త పాదరక్షణు శిరస్సుపై ఉంచుకుని రాచాండారు తిరుమలై కొండను ప్రదక్షిణ చేసి ఆ పాదరక్షలను ఎవరికైనా దానం చేస్తే లభించే శుభఫలితాలు అసంఖ్యాకం. 
తోలుతో చేసిన పాదరక్షలను ఎట్టిపరిస్థితులలోనూ ఉపయోగించ వద్దు. పిల్లలు, పెద్దలు, స్త్రీ, పురుషులనే తారతమ్యాలు లేకుండా ఎవరైనా చేయవచ్చు. తలకు వచ్చిన ప్రమాదం తలపాగాతో పోయిందన్నట్లు ఎదురుచూడకుండా వచ్చే ప్రమాదాల నుండి ప్రజలను కాపాడే అద్భుత దానం ఇదే! 
ప్రభుత్వం, రాజకీయాలు, ఆధ్మాతికరంగం, ఆర్థికరంగం వంటి శాఖలలో ఉన్నత పదవులలలో ఉన్నవారికి ప్రమాదాలు ఎటువైపు ఏ విధంగా సంభవిస్తాయో ఊహించలేము. అలా మహోన్నత హోదాలలో ఉన్నవారంతా 'నిత్యగండం పూర్ణాయుష్షు' అనే రీతిలో ప్రతిక్షణం మరణభయంతోనే గడుపుతుంటారు. 
వీరంతా తమ భయాన్ని లోలోపలే దాచుకుంటూ, లక్షలు, కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి భద్రతా పరికరాలను కొనుగోలు చేస్తుంటారు. నిజానికి తుపాకీ అనేది ప్రతికూలమైన శక్తియే. అది ఎవరిని కాపాడదని సిద్ధపురుషులు ఘంటాపథంగా ప్రకటిస్తున్నారు. జీవాన్ని సృష్టించిన మహేశ్వరుడే ఆ జీవుడిని కాపాడగలడు. 
పైన పేర్కొన్న పాదుకా ధ్యానం ఎలాంటి ఆపదలనుంచైనా ప్రజలకు కాపాడే అద్భుతమైన ఆరాధనా పద్ధతి అదే. గండం, శూలం, అతిగండం వంటి యోగదినాలలో కృష్ణపక్షం, శుక్లపక్షం వంటివాటిని పట్టించుకోకుండా ఈ ఆరాధనలను నిర్విఘ్నంగా నిర్వహించవచ్చును. 

విరాట్ స్వరూపుడు మహేశ్వరుడు

మహారక్షకుడి పర్వతం మహేశ్వరుడి విరాట్‌ విగ్రహనాధుడి అనుగ్రహశక్తులు ఎన్నో లెక్కింప శక్యం కాదన్నదే వాస్తవం. అమృతమయమైన ఆ మహేశుడి నామ విశేషాలు కొన్నింటిని కాస్త ఆస్వాదిద్దామా? 
శిల అంటే బాణం, ఆకారం, రూపం వంటి అర్థాలు ఉన్నాయి కదా? విరాట్‌శిల అంటే విరుగని విగ్రహం, విచ్ఛేదనం కాని విగ్రహం అని అర్థం. అయితే జనకమహారాజు వద్ద నున్న శివ ధనుస్సును శ్రీరాముడు విరిచి సీతను పరిణయమాడారు. అలాదే ధర్మరాజు నుండి పొందిన శివధనుస్సును విదురుడు ఆగ్రహంతో విరిచాడు కదా. అలాంటప్పుడు విరాట్‌శిల సూచించే ఆధ్మాత్మిక వస్తువేదో ఉండాలి కదా? దానిని గురించి మీరే ఆలోచించి తెలుసుకుంటేనే సముచితంగా ఉంటుంది. కనుక బాగా ఆలోచించండి... ఆలోచించండి. ఆపై శిల అనే పదానికి ఆకారం, రూపం అని భావార్థాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే అది విరాట్‌ + శిల = విరాట్శిల అవుతుంది. విరాట్‌ అంటే మహేశుడు ఆవిర్భవించని స్థితి. పరబ్రహ్మ స్థితిలో మహేశ్వరుడి దివ్యస్వరూపాన్నే విరాట్‌ స్వరూపమని పరిగణిస్తాము. విరాట్‌ పురుషుడు శక్తి సంగమించినప్పుడు కోటాను కోట్ల యోని బేధాలు కలిగిన జీవరాశులు ఆవిర్భవిస్తాయి. 
కనుక విరాట్‌శిల ఈశ్వరుడు అంటే కోటానుకోట్ల జీవరాశులకు అధినాయకుడని అవగతమవుతుంది. దీనిని నిర్వికల్ప సమాధి వంటి మహోన్నత ఆధ్యాత్మిక యోగస్థితిలోనే తెలుసుకోగలమని అనుకున్నా సామాన్య జీవులు సైతం ఈ సత్యాన్ని ఎరుకపరచడానికి మహేశ్వరుడు దోహదం చేస్తాడనే విరాట్‌శిల మహేశ్వరుడి బోధపరిచే మహోన్నత సత్యమవుతుంది. 
ఇంతకు మించిన మహోన్నత ఆధ్యాత్మిక శక్తి ఉండదు గాక ఉండదు!

ఓం గురువే శరణం

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam