కుళలుఱవుత్యాగి 
                 
 
 
పిలవగానే వచ్చేవాడు దేవుడు ! తలచగానే వచ్చేది సద్గురువు !!

ఓం శ్రీ వల్లభ గణపతి కృప
ఓం శ్రీ అంగాళ పరమేస్వరి కృప
ఓం శ్రీ సద్గురువు కృప

కౌపీనధారుడి కౌపీన లీల

నాడు శని వారం. పాఠశాలకు రెండు రోజులు సెలవు కావడంతో బాలుడు వెంకటరాముడు తన సద్గురువుతో తీర్థరాజమైన తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ చేద్దామని వచ్చాడు. కౌపీనం మాత్రమే ధరించి వున్న తన సద్గురువు పెద్దలతో గిరి ప్రదక్షిణ వీధిలో కుబేర లింగ ప్రాంత్యం దాటి వస్తున్నాడు బాలుడు.

అప్పుడు కొండ కేసి సాష్టాంగ నమస్కారం చేశారు పెద్దలు. సత్వరం బాలుడు కూడా వారి పక్కన అట్లే నమస్కరించాడు.  పెద్దలు ఎక్కడైతే సాష్టాంగ నమస్కారం చేస్తే అది గొప్ప దర్శనమని తన పూర్వ అనుభవాల నుండి తెలుసుకొన్నాడు బాలుడు.

తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గం నుండి కొండను చూస్తే, పలువిధమైన దృశ్యాలు కనబడుతాయి. ఆ దివ్య దృశ్యాలను తిరుఅణ్ణామలై ముఖ దర్శనాలని సిద్ధపురుషలతో పేర్కొనబడ్డాయి.  ఒక్కొక్క దర్శనమూ ఒక్కొక్క విధమైన మంచి ఫలితమును ఇవ్వగలదు.

“ఇదే రుద్ర ప్రజాపతి దర్శనం. రుద్ర ప్రజాపతులు సాక్షాత్తు  భగవంతుని వలె శక్తి గలవారు. వారు అ బాధ్యత వహించే వైభవం ఈ ప్రాంత్యం లోనే జరుగుతుంది. పార్వతీ దేవి కూడా దక్ష ప్రజాపతి కుమార్తె గదా. పలు సంవత్సరాల ఏకాదశీ ప్రత పరిపాలన చేయలేక పోయిన వారు ఈ దర్శనం ఏకాదశి తిథి నాడు పొంది తేనెలో నానపెట్టిన ఉసిరి దానం చేయడం వల్ల ఆ పొరపాటుతో సమకూర్చే ప్రభావం తగ్గిపొతుంది.
ఒకరి జాతక కుండలిలో లగ్నాధిపతీ స్థితి బట్టి వారి శరీర బలం ఆరోగ్యం కుదురుతుంది. భగవంతుని ప్రేరణతో లగ్నాధిపతి బలహీనంగా ఉంటే, అటువంటి వారు పైన చెప్పిన ఆరాధనతో మంచి పొందురు. శరీర ఆరోగ్యం పెరుగుతుంది.

తిరుఅణ్ణామలై వెళ్ళలక పోయినా తన ఊరి ఆలయాల్లో ద్వాదశీ తిథి నాడు ఉసిరి దానం చేయడమూ మంచిదే. "

పెద్దలు శ్రీ ఇడియాప్ప సిద్ధ స్వామివారు
బాలుడు వెంకటరాముడు

ఇలా మాట్లాడుతూ ఇంద్ర తీర్థం దగ్గర వచ్చారు. ఆ చెరువు గట్టున ఒక అశ్వత్థ చెట్టును చూపారు పెద్దలు. “ఇటువంటి వయసుమళ్ళిన పెద్ద రావి చెట్లును ప్రదక్షిణం చేసి తామే దంచిన పసుపు పొడి, కుంకుమ బొట్టు చెట్టుకు వేసి నమస్కారం చేయడం వల్ల ఎన్నో మంచి ఫలాలు వస్తాయి.

యువతిలూ సుమంగళ్ళీ భర్త నుండి తిరస్కరించబడిన స్తీలు ధార్మిక రీతిలో సురక్షత పొందుతారు. కుటుంబ ఐక్యమత్యం బలీయమవుతుంది. యంత్రం చేత తయారు చేసిన పసుపు పొడి పనికి రాదు.

ఒక్క అత్తి కలపతో కావించిన కుంబకోణం తగ్గరవున్న శ్రీ వానముట్టి పెరుమాళు వలె దేవతా ముర్తుల దర్శనం వల్లనూ స్త్రీలు శీలం సంరక్షణ కలుగుతాయి. "

అలాగే బాలుడూ పెద్దలూ రమణాశ్రమం దాటి ఏకముఖ లింగ దర్శనం అనే చోట చేరినారు. ఆ చోట నుండి కొండ చూస్తే ఈశ్వరుడి ఒక్క ముఖం మాత్రమే కనిపిస్తుంది.

అప్పుడు పెద్దలు, “ ఏమి నైనా ఈవాళ అన్నదానం చేస్తామని వచ్చావే. కాని అందుకై ఏర్పాట్లు ఏదీ చేసినట్టు తెలియలేదే. ఏమిటి?” అన్నాడు.

ఆ మాట విని ఒక్క పెట్టున ఉలికి పడి పొయిన బాలుడు, “వాద్యారా, ఏమి చెప్తావు?”

బాలుడు తన సద్గురువును వాద్యార్ అని పిలవడం రివాజు.  వాద్యార్ అంటే ఒకరి కర్మ ఫలితాలను తన తపోబలంతో జ్ఞాన శక్తితో తీర్చగలవారని అర్థం.

పెద్దలు మళ్ళీ “నువ్వే తిరుఅణ్ణామలైలో అన్నదానం చేద్దామని ఇక్కడికి తీసుకు వచ్చావు. ఇప్పుడు ఏమీ తెలియదని చెప్పినా ఏమిరా అర్థం?” బాలునికి మెల్లగా పెద్దలు చెప్పిన వాక్యాలు అర్థం అయ్యాయి. ఈ దివ్య క్షేత్రంలో అన్నదానం చెయ్యాలి అనేది పెద్దల కోరిక. కాని ఆ విషయాన్ని తిన్నగా చెప్పకండా ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఇక్కడకి వచ్చి ఉన్నారు.

ఆ సంగతి తెలిసినగానే ఏమి మాట్లాడక మౌనంతో పెద్దల ముఖాన్ని చూస్తున్నాడు బాలుడు.

“ఎందుకు నా ముఖం మీద చూపు? ఇప్పుడు బియ్యం వస్తోంది.”

“బియ్యం వస్తోందా? ఎక్కడ నుండి ఒచ్చును?” బాలుడు చుట్టూ అట్లూ ఇట్లూ చూశాడు. ఆ ప్రదక్షిణ మారగంలో వాళ్ళిద్దరి తప్ప మరెవ్వరూ లేరు.

కొన్ని సమయాల్లో తన కౌపీనం నుండే సొమ్ములూ తిండితిప్పలూ పెద్దలు తీసి వేయడమూ కద్దు. బాలుడు అలా భావించిన మరుక్షణం పెద్దలు తన కౌపీనాన్ని తీసి విప్పి దాన్లో కూడా ఏదీ లేదని నిరూపించారు. బాలుని ముహం చిన్నది అయింది. “నా వద్ద డబ్బు లేదు. వాద్యారి కౌపీనంలో రూపాయిలు లేవు. అరుగు పొరుగు ఎవ్వరూ లేరు. ఇప్పుడు అన్నదానమూ చెయ్యాలి.”   ఇలా తలచిన బాలుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. పెద్దలతో సెలవు తీసుకొని ఊరిలోకి పరుగెత్తి వెళ్లాడు.

బాలుడి తొమ్మిదేళ్ళ గురుకుల వాసంలో నడిచి పోవటం, కడుపారా తినటం అనే మాటకు చోటు లేదు. ఎన్నడూ ఎప్పుడూ పరకడుపుతో పరుగు పరుగే !

అక్కడ ఊర్లోని బజారు చేరాడు. కొందరు కోమటి వాళ్ళను అడిగి అన్నదానం చేద్దామని ఒక అంగడి లోపలకి వెళ్లాడు.

అంగడి గోడకి దేవతామూర్తుల చిత్ర పటాలు వేలాడుతూ ఉండేవి. ఆ కోమటి కూడా విభూతి కుంకుమం ధరించి ఉన్నాడు. బాలుడు వెళ్ళి వాని ముందు నిలబడి ఓంకారంతో నమస్కారం చెప్పాడు.  కాని కోమటి దాన్ని గమనించక అశ్రద్ధతో ఏం కావలెను అడిగాడు.

“ నా పెద్దలు ఇక్కడ గిరి ప్రదక్షిణ మార్గంలో అన్నదానం చేస్తున్నారు. అందుకై కొంచం డబ్బు కావలెను. మీరు ఏమైనా ఇవ్వగలరా?” అని నత్తి నత్తి అడిగాడు.

కోమటి పకపకా నవ్వి, “ ఏమిరా నువ్వే రెండు పడి బియ్యం తినేట్టు ఉన్నూవే. నువ్వు పోయి అన్నదానం చేయబోతావా? పో పో నాకు చాలా పని ఉంది. వేరెక్కడో వెళ్లి పో ” అన్నాడు.

బోగరు దేవాలయం, తిరుఈంగోయ్మలై

బాలునికి చాలా శోకం వచ్చింది. అతడికి డబ్బు లభించక పోవడం ఒక కారణమైనా ఆ కోమటి కూడా పెద్దల వలె తనను తిండిపోతుగా నిర్ణియించడమే ముఖ్య కారణమయింది.   

తనకు తానుగా మనసును సరిదిద్దుకొని ఇతర అంగడిల పద్ద అడగ సాగాడు. కాని అన్నీ అంగడిల కోమటివార్లు దాదాపు ఇట్టి బదులే చెప్పారు.

బాగా అలసి పోయిన బాలుడు ఒక అన్నదాన మఠం దగ్గిర వచ్చాడు.

కొన్ని సంవత్సరాల ముందు లక్షలేసి గిరి ప్రదక్షిణ భక్తులకు సాధులకు అన్నదానం చేసింది ఆ మఠం. కాని మఠాధిపతి సమాధి పొందిన తరువాత వచ్చినవారు కాల ప్రవాహంలో అన్నదానం పట్ల శ్రద్ధ వహించ లేరు.  ఎప్పుడో తీసిన పొలాల నుండి వచ్చిన రూపాయిలచే నాలుగు మంది అ మఠంలో జీవించి కాలాన్ని గడిపేవారు.

ఈ విషయాలు పెద్దలు ఇదివరకే బాలుడికి చెప్పి ఉన్నారు.

ఎట్లైనా ఆ మఠం నుండి బియ్యం తీసుకోవాలని నిర్ణయించుకొన్నాడు బాలుడు.

ధైర్యంగా మఠం లోపలికి వెళ్లాడు బాలుడు.

బియ్యం నిలువ బెట్టివున్న గదిణ్ణి వెతకసాగాడు. ఆ గది గుర్తించగానే దాని దగ్గిర వెళ్ళాడు. గుమ్మం వద్ద ఒక పనిమనిషి గోడకి వీపు ఆనించుకొని కూర్చుని అర్ధ నిద్రలో ఉన్నాడు.

“స్వామి, బియ్యం కావలెను” అన్నాడు బాలుడు.

“నువ్వు ఎవడవు?” అని అ పనిమనిషి ప్రశ్నీంచెను.

“నేను ఈవాశే కొత్తగా పనికి వచ్చాను. మధ్యాహ్న ఆహారం కోసం బియ్యం తెచ్చి రమ్మన్నారు వంటవారు” అన్నాడు బాలుడు.

“అట్లా … సరే …” అని గదిలోకి వెళ్లనిస్తాడు ఆ పనిమనిషి.

త్వరగా గదిలోకి వెళ్లి ఒక సంచిలో పడి బియ్యవు పోసుకొని బయటకు తిరిగి వచ్చాడు బాలుడు.

“సెలవు తీసుకొంటాను” అని పనిమనిషితో చెప్పాడు బాలుడు. అయితే అతడి నుండి గురక ధ్వనియే బదులుగా వచ్చింది.

మఠ గుమ్మం దాటి బయటకు రాగానే పరుగెత్తి త్వర త్వరగా వెళ్లాడు బాలుడు. ఒక వేళ అతడి దొంగతనం తెలుసుకొని ఆ మఠానికి చెందినవారు వస్తే చిక్కుకొంటాడు గదా? అందుకే అంత వేగం.

తాను చేసిన అసాధ్య కార్యాల గురించి పెద్దలకు తెలియజేయాలని ఎంతో సంతోషంతో వచ్చాడు బాలుడు. కాని అతణ్ణి చూడగానే పెద్దలు, “సరే టొమాటోలు ఎప్పుడు వస్తాయ?” అన్నాఢు.

బాలుడు ఏ మాట చెప్పలేడు. “ఇది ఏదో కొత్త విషయంగా వుందే” అని ఆలోటన చేయసాగాడు.

బాలుడికి ఇప్పుడు తేట వచ్చింది. అదేమి?

బియ్యంలా టొమాటోలు కూడా రావు. వాటిని కూడా బాలుడే తీసుకు రావాలి. ఇది పెద్దల రెండవ మెట్టు. అదే వాడు పొందిన తేట.

ఇక అవకాశం లేదు. త్వరగా వెళ్లాలి అని మళ్ళి ఊరికేసి బయలుదేరాడు బాలుడు.

టొమాటోల బజారుకు వచ్చాడు. అక్కడ టొమాటోల దిబ్బలు చూశాడు బాలుడు. ఒక దిబ్బ వెనుక కూర్చుకొని ఒక్కొక్క టొమాటొగా ఎత్తి తన లాగు పాక్కెట్లో ఉంచుకొన్నాడు.

వాస్తవానికి లాగు అనే పేరు అర్థం చేసుకోలేక అతడి చీలిమండ వరకు ఉండేదది.

బాలుడు ఎన్నడూ తనవద్ద డబ్బు దాచి పెట్ట కూడదని పెద్దలు అతడి పాక్కెట్లలో  రంధ్రాలు వేసి ఉండేవారు.  టొమాటోలు కింద పడి పోకూడదని ఇదివరకే తన పాక్కెట్లను దారంతో కట్టుకున్నాడు బాలుడు.

బ్రహ్మ దేవునికి ప్రణవ రహస్యం తెలిపిన
శ్రీ ప్రణవేశ్వర మూర్తి

ఓ పాక్కెట్ నిండా పోసుకొని మరో పాక్కెట్లో టొమాటోలు పెట్ట సాగాడు. అప్పుడు హఠాత్తుగా టొమాటోల దిబ్బ కిందకి జారసాగింది. కోమటి టొమాటోల దిబ్బ వెనుక ఉన్న బాలుని చూసేశాడు. “ఒక బాలుడు టొమాటోలు తీసుకు పోతాడు. దొంగను పట్టు… పట్టు…” అని కేకలు పెడుతూ బాలుని కేసి వచ్చాడు. ఇంతలో బాలుడు అక్కడనుండి పరుగెత్తి వెళ్లి పోయాడు.

ఎక్కడ ఎక్కడో చుట్టు తిరుగాడుతూ చివరికి ఉచ్ఛాసనిశ్వాసాలతో నిండి పోయి పెద్దల తగ్గర వచ్చాడు బాలుడు. అయితే పెద్దలు మరో అస్త్రంతో బాలునికై నిరీక్షిస్తున్నారు. బాలుని చూడగానే “రా రా నువ్వు ఇంత తెలివి తక్కువవాడని నాకు తెలియదయె.   

“టొమాటో పులవు చెయ్యాలంటే బియ్యం టొమాటోలు మాత్రం చాలునా? మరి నూనె మిరపకాయ చట్టి కుండ వంటి వాటిని ఎవరు తెస్తారు?” అన్నాడు పెద్దలు.

బాలుని తల గిర్రున తిరిగింది. ఉదయం నుండి భోజనం ఏమీ చేయలేదు. కాని పెద్దలకు దాని గురించి ఎటువంటి చింతన ఉన్నట్టు తెలియలేదు.

టొమాటో పులవు అన్నదానం చెయ్యాలని ఇప్పుడైతే పెద్దలు వ్యక్తపరచినారు. అది కూడా గొప్ప విషయమేనని లోలోన సంతోషంతో మరోసారి ఊరికేసి పయనించాడు బాలుడు.

ఇప్పుడు ఊరికి మరువైపు వెళ్లి ఒక అంగడి ముందు నిలిచి బిగ్గరగా ఏడ్వసాగాడు బాలుడు. ఆ కోమటి బాలుని ఏడుపుకు కారణం అడిగాడు. బాలుడు ఏడ్చుతూ “నా నాన్నగారు వంట సామాను కోసం రూపాయిలు ఇచ్చారు. కాని దారిన అవి తొలగి పోయాయి” అంటూ బాలుని లాగు పాక్కేట్ల రంధ్రంలోనికి తన వేలు పోనిచి చూపాడు. “వారు రాత్రి పని చేసి తిరిగి వచ్చినప్పుడు ఆహారం లేదంటే నా తల్లికి డెబ్బలు తినిపిస్తారు. అందుకనే ఏడ్చాను” అన్నాడు బాలుడు. బాలుడు చెప్పిన కాకమ్మ కథను నమ్మి ఆ కోమటి “పరవా లేదు. నీకు కావలసిన సామాను ఇస్తాను. నీ తండ్రి వచ్చాక డబ్బు ఇమ్ము” అంటూ నూనె మిరపకాయ ఉప్పు మొదలైన వాటిని బాలుడి వద్ద ఇచ్చెను కోమటి.

మళ్ళి ఏక ముఖ ప్రాంత్యం చేరెను. దారిన చట్టి కుండ మూత కట్టెల వంటి వాటిని కూడా చేకూర్చుకొన్నాడు బాలుడు.

ఈ విధంగా ఉప్పుతో తోమ్మిది పప్పుతో పది పోగుచేసి అన్నదాన కైంకర్యానికి తయారు అయ్యాడు బాలుడు.

ఈలోని మధ్యాహ్న సమయం వచ్చింది. పక్కన చెట్టు నీడ ఏమీ లేదు. తలపై ఎండ కాళ్ళ కింద మంట అనే రీతిలో వంట చేయ సాగాడు బాలుడు. పరుగు పరుగున వెళ్లి ఇంద్ర తీర్థం నుండి వంట కోసం మంచి నీళ్లు తెచ్చాడు. తన తల్లి వద్ద వంట నేర్చుకున్నాడు కనుక కొన్ని నిమిషాల్లో మంచి టొమాటో పులవు తయారు చేశాడు బాలుడు.

కుండకి మూతి వేసి పెద్దల దగ్గర వచ్చి కూర్చుకొన్నాడు బాలుడు. వంట పనిలో ఏవిధమైన సహాయం చేయలేక ఊరికే ఉండి పోయిన పెద్దల గురించి బాలునికి చాలా కోపం వచ్చింది. కాని బాహ్యంగా ఏదీ చెప్పకుండా మౌనంగా పెద్దల మరు ఆజ్ఞను ఎదురుచూస్తూ ఉన్నాడు బాలుడు.

కొంద సేవు తరువాత పెద్దలు “మంచివాడు ఎవడైనా దారిన వస్తే అతడికి బియ్యవు అన్నదానం ఇమ్ము” అని చేప్పి గిరి ప్రదక్షిణ దారికి ఎదురుగా తిరిగి కొండను చూస్తూ కూర్చుని ఉండి పోయారు.  బాలునికి దానితో కూడా చాలా సంతోషం ఏర్పడింది. కారణం ఏమిటంటే పెద్దలు సాధారణంగా ధానం ఇవ్వాలంటే ఈ ధానాన్ని ఈ విశేష దేవాలయ గుమ్మంలో ఇమ్ము ఈ ధానాన్ని నీల బట్టలధారికే ఇమ్ము అని ఏదేదో నిబంధనాలు చేప్పుదురు.

అలా ఎన్నో చోటులకు వెళ్లనక్కర లేదు కనుక గిరి ప్రదక్షిణ దారిన వస్తున్న భక్తులను గమనించ సాగాడు బాలుడు. అప్పుడు ఒక సాధువు వస్తున్నాడు. బాలుడు “వాద్యారా ! ఒక మంచి సాధువు వస్తున్నారు. అన్నదానం ఇవ్వ వచ్చునా ?” అని అడిగాడు.

“వాడు దొంగ. వానికి వద్దు.”

ఇంకా కొంద సేవు అయింది. మరొక సాధువు ఆ వైపు వచ్చాడు.

“వాద్యారా ! ఈతనికి ఇవ్వడమా?”

“వద్దు నాయినా. వాడు స్త్రీ లోలుడు.”

ఇట్లు అర గంటల సమయం గడిచింది. అప్పుడు ఒక మంచివాడు వచ్చాడు.

“వాద్యారా ! ఇదిగో ఒక మంచి వాడు. దానం చేతునా?”

“వాడు మంచివాడే. కాని వాని ఒళ్ళంతా విభూతి లేదే.”

“అట్లా … సరే ” అని మళ్ళి తన అన్వేషణలో మునిగిపోయాడు బాలుడు.

పెద్దలు చెప్పినట్లు ఒక సాధువు శరిరమంతా విభూతి ధరించి ధారిన వచ్చాడు.

ముంజం

అతణ్ణి చూపించాడు బాలుడు. పెద్దలు, “వాడు మంచివాడే. ఒళ్ళంతా విభూతి కూడా ఉంది. కాని నడుము కౌపీనం ఎక్కడ?” అని అడిగాడు.

బాలుడి కోపం ఎక్కి పోయింది. అయితే వాడు ఏమి చెయ్య గలడు? కొపాన్ని తగ్గించుకోని “వాద్యారా ! ఆ వైపు చూస్తూ కూర్చుకొని ఈ వైపు వచ్చినవారిని గురించి పొరపాటు చెప్తావే. దయచేసి ఈ వైపు తిరిగి కూర్చుండుము” అంటాడు బాలుడు.

“ సరే, నీ ఇష్టం “ అని పెద్దలు గిరి ప్రదక్షిణ వైపు తిరిగి కూర్చుని ఉన్నాడు. కానీ కళ్ళు రెండిటినీ మూసివేశారు.

ఐనను ఇంతవరకైతే తన వినతిని పెద్దలు స్వికరించడంతో బాలునికి ఆనందం కలిగంది.

విభూతి కౌపీనం ధరించిన మంచివాడి కోసం ఇప్పుడు వేచి ఉన్నాడు బాలుడు.

వాని మనస్సు “ దానం స్వికరించేవారు కౌపీనం ధరించనందున మాకు జరిగేది ఏమిటి? దాని అవసరం ఎందుకు?” అని చింతన చేయ సాగింది. అతడి చింతనకు అంతరాయం వేసింది పెద్దల గొంతు. “కారణం లేకుండేనా మన ప్రియ శిష్యుడు బోగరు కౌపీనం గురించి మూడు శత సహస్ర లక్షల పాటలు పాడి ఉన్నాడు? ఎప్పుడు కౌపీనం ధరించాలి కౌపీన వస్త్రం ఎలా ఉండాలి, తడి కౌపీనం ధరించే సమయం ఏది పంటి వాటిని గురించి బోగరు లక్షలాది పాటలు ప్రాసి ఉన్నాడు. "

తన మనసులోని చింతన తరంగాలను గుర్తించగల పెద్దల ప్రతిభ గురించి బాలుడు ఆశ్చర్యపోయాడు.

పెద్దలు కొనసాగిస్తారు.
"ఒక సారి ప్రణవ మంత్రానికి అర్థం తెలియదని చెప్పిన బ్రహ్మ దేవుణ్ణి సుబ్రమణ్య స్పామి చెరలో వేస్తాడు కదా? తరువాత శివుడు బ్రహ్మ దేవుడి తప్పును మన్నించి చెర నుండి విడిచి పెట్టాడు. బ్రహ్మ దేవుడికి తన అపరాధం గురించి ఎరుక కలిగింది కనుక ప్రణవ మంత్రానికి అర్థం తెలుసుకొనే మార్గాన్ని చూపమని శివుని ప్రార్థించాడు. తిరుచి పుశ్శంబాడి తగ్గర తాపాయి దివ్య స్థలంలో వెలసివున్న శ్రీ ప్రణవేశ్వర స్వామిని దర్శించి ప్రణవ రహస్యాన్ని తీసుకొందమని సలహా ఇచ్చాడు శివుడు.

శివుని అమృత వాక్యాలతో పరమానందం పొందిన బ్రహ్మ దేవుడు మానవ రూపంలో భూలోకం చేరాడు. తాపాయ్ స్థంలోని శ్రీ ప్రణవేశ్వరుని దర్శించినప్పుడు ఒక ఆలకాపరుడు అక్కడికి వచ్చి బ్రహ్మ దేవుడి పార్థన ఏమోనని అడిగాడు.

బ్రహ్మ దేవుడు ఆ చిన్నవాడికి ప్రణవం గురించి ఏం తెలుసని ఎంచి, “నేను ఒక నవ వస్తువును దేవుడి వద్ద ప్రార్థిస్తున్నాను” అన్నాడు. దాని వింటూ ఆ బాలుడు గలగల నవ్వి, “కౌపీనం లేని ప్రణవమా?” అని చెప్పి కనుమరుగు అయ్యాడు.

ఆశ్చర్యతో మూగ పోయాడు బ్రహ్మ దేవుడు. తాను ప్రణవ రహస్యాన్ని తెలుసుకోవడానికై భలోకం వచ్చాననే సంగతి ఈ చిన్నివానికి ఎలా తెలుసు. అతడు సామాన్య బాలుడు కాడనే ఎరుక వచ్చింది. ఆ విషయం గురించి చాలా సేవు ఆలోచన చేసిన తరువాత ప్రణవ రహస్యాన్ని తెలుసుకోవాలంటే కోపినం ధరించే అనుష్టాలను చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చిన బ్రహ్మ దేవుడు కౌపీనం ధరించి ఆ దివ్య స్థలంలో ధ్యానం చేస్తూ ఉండేవాడు.

ఎంతో యుగాల తరువాత శ్రీ సుబ్రమణ్య దేవుడే దర్శనం ఇచ్చి ప్రణవ మంత్రాన్ని దివ్య రహస్యను బ్రహ్మ దేవునికి ప్రసాదించాడు. మరల బ్రహ్మ లోకం వెళ్లాడు బ్రహ్మ దేవుడు. బ్రహ్మ అనేది ఒక పదవి కదా. అందుచేత ఇతర భూలోక పదవుల మాదిరి బ్రహ్మ దేవుని పదవికి కూడా నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. అయితే ఒకడు భగవంతుని హృదయాన్ని ఆశ్రయించి అందులో నివసిస్తూ ఉంటే అటువంటి వాడికి ఏవిధమైన కాల పరిమితి ఉండదు కదా?

అందుచేత బ్రహ్మ లోకం తిరిగి వెళ్ళిన బ్రహ్మ దేవుడు మళ్ళీ తాపాయి దివ్య క్షేత్రానికి వచ్చి కౌపీనం ధరించి తపస్సు చేయ సాగాడు. ఎందుకు ? శివుని హృదయంలో నిరంతర వాసం కలగడానికే !

చివరకు శివుడే తన దివ్య మంగళ దర్శనం కలిగించి బ్రహ్మ దేవునికి తన హృదయ కమలంలో ఆశ్రయం ప్రసాదించాడు.

అందుచేత ఎటువంటి ఆత్మ సాధనాలైనా వాటి పూర్ణ ఫలితాలకు అవసరమైనది కౌపీనం. ”

పెద్దల అమృత పలుకులను విన్న బాలుడు మునుపటి కంటే తీప్రంగా భక్తులను వెతకసాగాడు.

చాలా సేవు గడిచిన తరువాత  కేవలం విభూతి కౌపీనం మాత్రమే ధరించి ఒక సాధువు కొండ మార్గంలో వచ్చాడు.

ఆనంద తరంగాలు తన వదనంలో నృత్యం చేస్తూండగా బాలుడు “వాద్యారా ! ఇప్పుడు వచ్చి ఉన్నాడు మనం వెతుకుతున్న భక్తుడు” అని అన్నాడు.

పెద్దలు కళ్లు తెరచకుండా “నీ మాట నిజం. కాని వాని కౌపీనంలో మూడు రంధ్రాలు లేవు ” అని బదులిచ్చాడు.

బాలునికి విసుగు వేసింది. ఉదయం నుండి తిండి తిప్పలు ఏమీ లేవు. నీళ్ళు కూడా చూడ లేదు. అన్నదానం చేసినట్టయితే వానికి కొంచమైనా మిగిలిన ప్రసాదం లభిస్తుంది.

ఈ పెద్దల కండిషన్లు చూస్తే ఈ రోజు నేను ఆకలితోనే మరణించబోతాను అనుకొన్నాడు బాలుడు.

అన్వేషణ కొనసాగింది.

కాసేపట్లో విభూతి కౌపీనం సహితం ఒక పరమసాధువు దారిన వచ్చాడు. కౌపీనంలో మూడు రంధ్రాలూ ఉన్నయి. పెద్దల నిబంధనలు కచ్చితంగా ఉన్నాయి. బాలుడు, “వాద్యారా ! నీ ఇష్టం పూర్తి చేసేట్టు సాధువు ఒకరు ఉన్నారు. చూడు” అన్నాడు.

శ్రీ అరుణాచల మూర్తి
తాపాయ్ శివాలయం

పెద్దలు. “ వాస్తవం. కాని ఆ మూడు రంధ్రాలు ఆయుధ ఆకారంలో ఉండాలి” అన్నాడు. (ఆయుధం అనిదే తమిశ అక్షరం.)

బాలుడికి పిచ్చి ఎక్కిపోయినట్టు తోచింది.

ఏమీ రాని ఏమీ కాని అని మనసును సరి దిద్దుకొని మళ్ళి అన్నదాన సేపలో మునిగి పోయాడు.

పగటిపూట దాటి దాదాపు రాత్ర కూడా వచ్చింది. బాలుని ఓర్పు కోల్పోయింది. ఆకలి వానిని కపళీకరింది.

అప్పుడు ఒక పరమాత్మ ఒళ్ళంతా విభూతి ధరించి పాల వంటి తెల్లని కౌపీనం ధరించి వేయి సూర్య ప్రకాశం ప్రసరించే వదనంతో గిరి ప్రదక్షిణ మార్గంలో వచ్చాడు.

పరమ సంతుష్టిడయిన బాలుడు బిగ్గరగా “వాద్యారా, వచ్చినారు, వచ్చేశారు” అని వాద్యార్ తగ్గరకు వెళ్ళి చెప్పాడు.

అయితే, పెద్దలు అతడి మాట అలక్ష్యం చేసి మౌనంగా ఉండి పోయారు.

బాలుడు మళ్ళి మళ్ళి, “వాద్యారా చూడు, చూడు” అని చెప్పి ఏడ్వ సాగాడు.

కొన్ని నిమిషాల తరువాత పెద్దలు కళ్ళు తెరిచి, “  ఎందుకు ఇట్లు గొంతు ఎత్తున్నావు? ఇప్పుడు ఏం అయి పోయింది” అని నెమ్మదిగా అడిగారు.

“వాద్యారా ! ఈవాళ ఉదయం నుండి ఏమి తినడమూ లేదు త్రాగడమూ లేదు. ఊరంతా పరుగెత్తుకెల్లి సామాను సంపాదించి అన్నదానం కోసం బియ్యం తక్కాలీలు అన్నిటిని దొంగిలించి టొమాటో పులవు వండినాను. నువ్వు అన్నదాన వంటలో ఏమీ సహాయమూ చెయ్య లేక పోయినా పరవా లేదు. కనీసం, నేను కష్టబడి తెచ్చిన సాధువులను అంగీకరించినంత సహాయం కూడా చేయ లేదా?” అని విలపించాడు బాలుడు.

బాలుని కోపం ఉపశమించినంతవరకు ఏమీ మాట్లాడక ప్రశాంతంగా ఉండి పోయారు పెద్దలు. పిదవ మెల్లగా  “ఆ పరమాత్మ ఎక్కడ ? అతడికి ప్రసాదం ఇమ్ము” అన్నాడు పెద్దలు. ఇంతలో ఆ సాధువు వీధిలో ఎంతో ముందుకు పోయాడు.

వంటనే బాలుడు పరుగెత్తి గిరి ప్రదక్షిణ మార్గంలో త్వర త్వరగా ఆ సాధువును వెతక సాగాడు.

“వాద్యార్ మనకు కష్టం ఇవ్వడాన్ని ఒక ఉబుసుపోకగానే వేస్తున్నారు. ఆ సాధువు అక్కడ వచ్చినప్పుడే చెప్పి ఉంటే ఇదివరకు అతనికి అన్నదానం చేసి ఉంటాను.”

అతడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అతడు గిరి ప్రదక్షిణ మార్గం నుండి వదిలి పోయిన పక్షంలో అతణ్ణి వెతకడం కష్టం. కావున, వీధిలో వేగంగా వెళ్ల సాగాడు బాలుడు.  

దాదాపు పావు గంటల తరువాత ఆ సాధువును చూశాడు బాలుడు. “స్వామి, నా తాతగారు మీకు ప్రసాదం అర్పించడానికి ఆహ్వానించారు,” అని అన్నాడు బాలుడు.

“నీ తాతగారు ఎక్కడ ఉన్నారు?”  

బాలుడు పెద్దలు ఉండే స్థలాన్ని చూపాడు.

సాధువుకు కోపం నిండి పోయింది. “నేను ఇప్పుడైతే ఆ చోట నుండి వచ్చాను. మరి నీ తాతగారు ఎందుకు అప్పుడే నన్ను పిలిచలేదు,” అని తిరిగి తన దారిన వెళ్ళ సాగాడు ఆ సాధువు.

మరు క్షణం బాలుడు ఆ సాధువు పాదాల్లో సాష్టాంగంగా ప్రణామం చేసి, “స్వామి, అలా చెప్పకండి. నా తాతగారు అప్పుడే మిమ్మల్ను పిలిచమని చెప్పాడు కనుక నాకు ఒక ముఖ్యమైన పని వచ్చింది” అని తన రెండు వేళ్ళను చూపాడు బాలుడు.

సాధువు చిరునవ్వుతో, “అట్లయితే సరే …” అని అతడితో తోడుగా వెళ్లాడు.

సాధువును చూడగానే పెద్దలు తన తలపై రెండు చేతులను జోడించి ఓం అని ప్రణామం చేశారు. ఆ సాధువు కూడా అట్లే నమస్కారం తెలిపాడు. తరువాత వాళ్ళిద్దరూ పరస్పరం ప్రియ భాషణములాడిరి.

ఆ దృశ్యాన్ని చూసి బాలుడు ఎంతో కోపం పొందాడు. పరస్పరం పరిచయం కావడానికి ముందు ఈ రెండు కౌపీనధారులూ ఎట్టి నాటకాలు ప్రదర్శించారు. దేవుడా, ఇప్పుడైతే వాళ్ళు కౌగిలించుకున్నారు.

ఏమి చెయ్యాలో అని ఆశ్చర్యతో వారిని చూస్తూ ఉన్నాడు బాలుడు.

మిక్కిలి ప్రేమతో కుండెడు టొమాటో పులవును ఆ సాధువుకు ఇచ్చారు పెద్దలు. మళ్ళి ఒక సారి బాలుని తల గిర్రున తిరిగంది. సాధువు ఆ పులవంతా ఆరగిస్తే బాలునికి ఏదీ మిగిలి ఉండదు. అందుకే అతడు అంత బాధ బడ్డాడు. బాలుడు ఎదురుచూసినట్టే సాధువు పులవంతా తిని వేశాడు. తన కష్టాలను భరించలేని ఒక ధీర్ఘ నిట్టూర్ను వదిలి నేల మీద కూర్చుని పోయాడు బాలుడు.  

తరువాత పెద్దలు సాధువుతో సవినయంగా ఇలా అన్నాడు. “ఈ బాలుడు నీ కోసం ఎంతో కష్టాలను అనుభవించి శ్రమబడి తిండి తిప్పలు మాని టొమాటో పులవు వంట చేశాడు. అతడికి మీ అనుగ్రహం వర్షించండి”.

ఆ వార్త వినగానే బాలుడు సాధువు పాదాలపై తన తలను ఉంచి నమస్కారం చేశాడు. సాధువూ బాలుని నెత్తిన హస్తాలను పెట్టి గొప్ప ఆశీస్సులు ఇచ్చాడు.

బాలుడుకి తాను అంతవరకు అనుభవించని ఆనందం హృదయాంతరాళంలో పొంగి పొర్లడం అనుభూతమైంది.

ప్రకృతి తన అభివ్యక్తీకరణాన్ని ప్యక్తపరచినది. బాలుడు మరి పరమానంద లోకం నుండి ఆకలి కొట్టే ఈ భూలోకానికి తిరిగి వచ్చాడు.

సాధువు కుండలో ఏదైనా మిగిలి పెట్టాడేమోనని బాలునికి సందేహం రాగానే వాడు కుండ వైపు చూశాడు. అక్కడ జరిగిన సంభవాన్ని చూసి బాలుడు కనురెప్పలు మూతపడటం మరచి పోయాయి. అదేం ?

పెద్దలు తన చేతులను కుండలోకి పోనిచ్చి మిగిలిన టొమాటో పులవును ఎంతో ఆనందంతో ఆరగిస్తూ ఉన్నాడు. అప్పుడప్పడు తన ఒక్కొక్క వేలను నోటిలోకి పెట్టి నాలుకతో నాకుతూ ఉన్నాడు. “ఆహా … ఆహా … ఎంత అద్భుతమైన ప్రసాదం. అంటే, ఇది తిరుపతి లడ్డే, ఇది వాస్తవానికి పలని పంచామృతమే” అని ఏదేదో తనకుతానుగా పలుకుతూ ఉన్నాడు.    

పూర్తిగా ఆ కుండను శుభ్రం చేసిన తరువాత తన తలను కూడా ఆ కుండ లోపలకి పోనిచ్చి బియ్యవు తునకలను నాకారు. తరువాత చేతులూ నోటినీ కడిగి బాలుని దగ్గర వచ్చాడు. అతడి తలపై చేతులను ఉంచి, “ఏమి నయినా ఎందుకు ఇట్లు శోకంతో కూర్చున్నావు ?” అని ఏదీ తెలియనట్టు అడిగాడు.

కోపం యొక్క శిఖరం చేరాడు బాలుడు. పెద్దల హస్తాలను పట్టి పారవేశాడు.

వైవాహిక దోషాలను తొలగంచే మూర్తి
శ్రీ ముంజి విణాయకుడు, తాపాయ్ శివాలయం

“వాద్యారా ! ఉదయం నుండి నేను ఆకలితో ఉన్నాను. ఊరంతా తిరుగాడి వచ్చాను కూడా. నువ్పు ఎక్కడా పోలేదు. మరెందుకు నాకు ఏమీ ఇవ్వకుండా నువ్వే ఆ మిగిలిన ప్రాసాదం తిని వేశావు?”

వికసిత వదనంతో పెద్దలు ఇలా అన్నాడు. “ రా నయినా ఈ చిన్న విషయం కోసం కోపమాడవద్దు. నీకు కావలసినది అన్నం. ఆ కుండ చూడు,” అన్నాడు.

“కుండంతా నువ్వే కాళీ చేశావు. మరి దాన్లో ఏముంది?” బాలుని కోపం కరిగించలేదు.

“కోపం వద్దు నయినా. సరిగా చూడు” అన్నాడు పెద్దలు.

సందేహంతోనే కుండ తగ్గర వెళ్ళి మూతి తెరిచి చూశాడు బాలుడు. నిశ్చేష్టుడయ్యాడు.  ఆ కుండ నిండా వేడి వేడిగా సువాసనతో పులవు కానవచ్చాయి.

“వాద్యారా ! ఇదేమి? ఇందులో అద్భుతమైన పులవు ఉందే” అన్నాడు.

పెద్దులు “ అవన్నీ నీకే. తీసుకో ” అన్నాడు.

“అంతా నాకేనా? నీవూ కొంచం తీసుకోవచ్చు.”

“నాకు వద్దు. ఆకలి నీకే కదా?”

మరు క్షణం ఏమి అడగకుండా బాలుడు ఆ ప్రసాదాన్ని తిన సాగాడు. అప్పుడు ఇదివరకే అటువంటి ప్రసాదాన్ని ఎప్పుడో ఒక సారి తిన్నట్టు అతడి జ్ఞాపకానికి వచ్చింది కనుక ఆకలీ యొక్క ప్రభావం పొడనూపించడంవల్ల ఆ సంభవాన్ని జ్ఞాపకం చేసుకోలేక పోయాడు.
కడుపారా ప్రసాదం ఆరగించిన తరువాత పెద్దల వద్దకు వచ్చి “వాద్యారా ! ఇటువంటి రుచియైన ప్రసాదం నేను ఈపరకు తినటం లేదు. అద్భుతంగా ఉంది” అన్నాడు.

“సుబ్రమణ్య స్వామి ఆరగించిన ప్రసాదం మరి ఎలా ఉంటుంది?” అడిగారు పెద్దలు.

బాలుడు అచ్చేరు వొందాడు. “నీవు ఏమి చెప్తావు? ఇది సుబ్రమణ్య స్వామి ప్రసాదమా? వాడు ఇక్కడ ఎలా ఒచ్చాడు?”

పెద్దలు చిరు నవ్వు నవ్వి “నీకు అన్నీ వివరించాలి కదా?”

కొంత సేవు తరువాత పెద్దలు కొనసాగించారు.

“సుబ్రమణ్య స్వామిని రూపం ఎలా ఉంది? పలని కొండ మీద వాడు ఎలా దర్శనం సాధిస్తాడు?

ఒళ్ళంతా విభూతి. చేతిలో దండం. నడుమన కౌపీనం. దానితో ఇక్కడ వచ్చిన భక్తుడి కౌపీనంలో ముడు రంధ్రాలు ఉన్నాయి.  ఈ మూడు రంధ్రాలు తమిళ అక్షరమైన ఆయుధాన్ని సూచిస్తాయి. సుబ్రమణ్య స్వామి తమిళ భాషకి అధిదేవత అవుతుండటం వల్ల తమిళ అక్షరాన్ని తన కౌపీనంలో ధరించి మనకు దర్శనం ఇచ్చాడు” అని వివరించారు పెద్దలు.

సుబ్రమణ్య స్వామి స్వయంగా వచ్చి దర్శనం ఇచ్చినా దాన్ని గ్రహించలేక పోయానని ఎంతో బాధ బడ్డాడు బాలుడు.

అప్పుడు కొన్ని విషయాలు అతడి గుర్తుకు వచ్చాయి.

బాలుడికి ఎల్లప్పుడు  తిండితిప్పలు తీసి ఇచ్చే పెద్దలు ఎన్నడూ ఆ ఆహార పదార్థాలను ముట్టేది లేదు. ఇక వారే ఆ భక్తుడి ఎంగిలి ప్రసాదాన్ని ఆనందంతో తీసుకున్నారంటే దాన్లో ఏదో విశేషం ఉండాలి కదా? ఈ చిన్న విషయం మనకు ఎందుకు తోచలేదు అని తనను తాను అడిగాడు బాలుడు.

కొన్ని నెలల ముందు ఒక సారి పెద్దలు వెళ్ళియంగిరి యాత్ర చేయగోరినారు.

సబరిమల యాత్ర వెళ్లడానికి కావలసిన అనుష్ఠానల వంటి నియమాలు వెళ్ళియంగిరి యాత్రకి కూడా ఉన్నాయి.

మొదట ఆ యాత్రీకులు భగవంతుడికి తామే వంటిన ప్రసాదాన్ని నైవేద్యం పెట్టాలి. దేవుడు భూతశరీరంతో వచ్చి అ ప్రసాదాన్ని ఆరగించాలి. ఆ తరువాత మిగిలిన ప్రసాదాన్ని యాత్రీకులు ఆరగించాలి అనేది వ్రత నియమం.

అందుచేత పెద్దలు కూడా అంగాళ పరమేశ్వరి దేవికి తామే వంటిన చక్కెర పోంగలి నైవేద్యం చేశారు. అప్పుడు అంగాళ పరమేశ్వరి తొమ్మిదేళ్ళ బాలిక రూపంలో వచ్చి ఆ ప్రసాదాన్ని ఆరగించింది. అప్పుడు ఆమె చెప్పిన పదాల యొక్క అర్థం తెలుసుకొలేక పోయినా దేవి యొక్క సుమధురమైన గొంతను ఆలకించే భాగ్యాన్ని పొందాడు బాలుడు. అంతేగాక ఆమెతో సహజంగా మాట్లాడిన పెద్దల వ్యవహారిక పదాలు కూడా ఎంతో మధురంగానే ఉన్నాయి. అట్లు మిగిలిన ప్రసాదాన్నే పెద్దలూ బాలుడూ తీసుకొన్నారు. ఆ దేవి ప్రసాదాన్ని తిన్న సమయంలో వచ్చిన అదే సువాసన ఇక బాలుడు తిన్న ప్రసాదంలో కూడా ఉన్నది. కాని బాలుణ్ణి ఆక్రమించిన క్షుద్బాధ యొక్క ప్రభాపం వల్ల ఆ దివ్వ ప్రసాదం మహిమను గ్రహించలేక పోయాడు.

" సరే. అదీ పోనీలే. పెద్దలు కుండ నుండి ప్రసాదం తినేటప్పుడు “పలని ప్రసాదం .. పలని పంచామృతం…” అని వర్ణించాడు. అప్పుడు కూడా వచ్చినది దండాయుధపాణి అని నేను గ్రహించలేను.”

“అవకాశాలు అలంకరించుకొని రావు” అని పెద్దలు ఎన్నో సార్లు చెప్పి వున్నారు. ఇనను సుబ్రమణ్య స్వామిని దర్శనం కోల్పోయిందే.”

ఇట్లల్లా ఆ పసివాడు చింతన చేస్తున్నాడు.

“రాజా...”

పలని శ్రీ దండాయుదపాణి స్వామివారు

గొంతు విని పైకి చూశాడు బాలుడు.

దరహాస వదనంతో పెద్దలు, “నయినా మరి పని చూడు. స్వామి వచ్చిన సంఘటన గురించి నీకేమీ అర్థమయిందా ? ”

లేదని సైగతో తెలిపినాడు బాలుడు.

బాలుడు తగ్గర వచ్చి గొంతుక్కూర్చున్నారు పెద్దలు. “తిరుపతి లడ్డు ప్రసాదం యొక్క మహిమ ఏమో తెలుసా?”

బాలుడు, “అది పెద్దగా చాలా రుచిగా ఉంటుంది.”

దాన్ని విని బాలుని మీద పెద్దల నుంచి విసుగుతో ఒక చూపు వెళ్ళింది.

తన బదులు తిండిపొతునివలె అయినదేమోనని ఎంచి సిగ్గు బడ్డాడు బాలుడు.

కొంచం ఆలోచించి, “ ఆ లడ్డు చాలా పెద్దది. ఎంత కాలం గడిచినా చెడి పోదు,” అన్నాడు.

పెద్దలు, “అది సరే. ఏ తీర్థానికి చెందిన ప్రసాదమూ చెడి పోదు. కొన్ని సమయాల్లో ఆ ప్రసాదం దుర్గంధంతో చెడిపోయినట్టు తోచుతుంది. అంతే.  

తిరుపతి లడ్డు ప్రసాదం యొక్క గొప్ప మహిమ ఏమిటంటే, పడి పాలు పోయగల పాత్రలో పది పడి పాలు పోయ గలవా? లేవు. కాని తిరుపతి స్థలంలో సుమారు పది లడ్డులు చేయడానికి కావలసిన పదార్థాల నుండి ఒక లడ్డు తయారవుతుంది.

ఈ దివ్య సత్యాన్ని సాధారణ మానవ బుద్ధి మూలంగానో, లౌకిక శాస్త్ర శోధనాల ద్వారానో తెలుసుకోనడం కఠినం.

ఉత్తమ భక్తుడైన రామానుజాచార్యుడు తిరుపతి ఏడుకొండలవాడిని దర్శించడానికి వచ్చినప్పుడు పాకుడు యాత్రతోనే అంటే పసివాడిలా పాకుతూ కొండ మీద ఎక్కేవారు. కొండ మీద ఉన్నప్పుడు మూత్ర విసర్జన చెయ్యాలంటే మళ్ళీ పాకుతూనే కొండ కిందకి వచ్చేవారు. అటువంటి భక్తులకు ఈ విషయం కరతలామలకం.   

నేటి లోకులు క్వాంటం తియరి (Quantum theory) మూలంగా ఈ ఆధ్యాత్మిక విషయాన్ని గ్రహించ వచ్చు.”

పెద్దలు అలా చెప్పినా బాలుడు తనలో ఇలా మాట్లాడ సాగాడు. “సాధారణ గణితమే ఒంటబడ్డలేదు. ఇక క్వాంటం చదవడం ఎలా?”

పెద్దలు కానసాగారు. “పొద్దు వస్తే పగటి పొద్దు. పొద్దు వెళితే రాత్రి పొద్దు అని మనం భావిస్తాము. వాస్తవంగా పగటి రాత్రులు వ్యక్తిగతంగా అవుతాయి. అంటే ఒకరి తమో రజో గుణాల విష్పత్తిని బట్టి వారి పగటి రాత్రులు వస్తాయి. అలాగే తిరుపతి లడ్డుని బరువు కూడా వ్యక్తిగతంగా ఉంటుంది. అంటే ఒకరికి 200 గ్రాం బరువుగల లడ్డు మరొకరికి 500 గ్రాం బరువుగా కనిపిస్తుంది”

పెద్దలు చెప్పిన విషయాలను అనిమిషంగా వింటున్నాడు బాలుడు.

“రానున్న కాలంలో నీవు ఇక్కడ తిరుఅణ్ణామలైలో ఆశ్రమం ఒకదాన్ని నిర్మించి  లక్షలాది భక్తలుకు, విద్యార్థులకు ఇతరులకు అన్నదానం, వస్త్రదానం, లడ్డుదానం అని పలరకాల దానాలు చేస్తావు. అప్పుడు నీవు ఇచ్చే లడ్డు ప్రసాదంలో తిరుపతి లడ్డు యొక్క శ్రీవారి శక్తులు, పలని సుబ్రమణ్య స్వామిని సిద్ధామృత శక్తులు కలిసి తిరుఅణ్ణామలై జ్యోతి ప్రసాదంగా రూపిస్తుంది.”

“ఇది ఎలా సాద్యం? ఈ వట్టి పాకెట్తోనా అన్నదానం ?” అని తన లాగు పాకెట్ల రంధ్రంలోకి తన వేలును పోనిచి దాన్ని పెద్దలకు చుపి అడిగాడు బాలుడు.

పెద్దలు ఏమనక ఊరికిపోయారు.

బాలుడు ఆలోచన చేయ సాగాడు. “నా మంచి కోసం ఈ పెద్దలు ఎన్నో కార్యాలు చేసి ఉన్నారు. తిరుపతి ఏడుకొండలవాడి అనుగ్రహం, పలని సుబ్రమణ్య స్వామిని ఆశీస్సులు మనకు ఒక్కచోడ కలిగించినారు. తల్లి ప్రేమను మించిన ఈ గురువు కరుణకు కృతజ్ఞత చూపడం సాధ్యమా?”

ఎంతో సంతోషంతో పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలను గట్టిగా పట్టుకొన్నాడు బాలుడు. కన్నీరు మున్నీరై బాలుని ఆనంద ఆశ్రుపులు పెద్దల పాదపద్మాలను అభిషేకించాయి. 

పెద్దల మాట సాక్షాత్తు శివుని వాక్య కదా? కొన్ని సంవత్సరాల తరువాత బాలుడు వెంకటరాముడు సద్గురువు వెంకటరాముడు స్థితికి ఎక్కి తిరుఅణ్ణామలై గిరిప్రదక్షిణ మార్గంలో శ్రీలశ్రీ లోభామాతా అగస్త్య ఆశ్రమాన్ని నిర్మించి లక్షలాది భక్తలకు, యాత్రీకులకు, పాఠశాల పిల్లలకు అన్నదానం, చేతికి సరిపడని పెద్ద లడ్డుల దానాలు భగవత్ కృపతో చేశారు.

ఆశ్రమ సేవకులు లడ్డుల దానాల మహిమ గురించి శ్రీ వెంకటరామ స్వామి వారిని అడిగినప్పుడు పైనచెప్పన వివరాలు తెలిపారు. పైగా “మన ఆశ్రమం పంచుతున్న లడ్డు ప్రసాదాన్ని స్వీకరించే భక్తులకు ఉత్కృష్ట నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుందేమో తెలియదు. కాని ఈ చేతికి సరిపోని లడ్డు ప్రసాదాన్ని స్వీకరించే ఒక్క భక్తులు గాని లేదా ఒక్క పాఠశాల విద్యార్థి గాని ఈ చేతికి సరిపోని లడ్డు ప్రసాదంలో మన మనసుకు సరిపోని అంటే మానవ బుద్ధికి అతీతమైన ఆధ్యాత్మిక రహస్యం ఏమైనా ఉండునేమో అనుకుంటే చాలు నా సద్గురువైన పెద్దల ఆజ్ఞను ఒక ఇనుకైనా నెరవేర్చినవాణ్ణి” అని ఎంతో వినయంతో వివరించారు స్వామివారు.

వారి వాక్యాల్లో ప్రకాశించిన సత్యానలం అక్కడ పరివేష్టించి ఉన్న సేవకుల హృదయాలను స్పర్షించడంతో వారి కళ్ళు చెమ్మగిల్లాయి.

తాపాయ్ శివాలయ మహిమ

తిరుచి పుళ్ళంబాడి తగ్గర తాపాయ్ అనే కుగ్రామం సనాతన విలువ పొందినది. ప్రణవ మంత్రానికి అర్థం తెలియలేక పోయిన బ్రహ్మ దేవుడు ఈ స్థలంలో కఠోర అనుష్ఠాలను చేకొని ఉన్నత స్థాయిని కలిగినాడు కనుక ఇది సత్యయుగానికి చెంతిన స్థలం అవుతుంది.

ఈ దివ్య స్థలంలో నిరుది మూలన దర్శనం ఇస్తున్న శ్రీ ముంజీ వినాయకుడు యువతులకు ఒక వరప్రసాదం. వివాహం జరగకుండా అంతరాయం ఎదురుకొనేవారు శ్రీ ముంజి వినాయకుడి దర్శనం పొంది తొమ్మిది ముంజి మాలలు వినాయకుడికి అర్పించడం మంచిది.
ముంజం భూమికి వచ్చిన చరిత్ర తెలుసుకోనడం కూడా మాంగళ్య దోషాలను నివృత్తి చేస్తుంది.

శ్రీ బ్రహ్మ మూర్తి
తిరుపట్టూరు శవాలయం

శ్రీ రామచంద్ర మూర్తిని తాతగారు రఘు మహారాజా సర్వస్వం దానం చేస్తూనే ఉంటాడు. అతడి దేశం గురుకుల పాఠశాలతో నిండి ఉండేది.    

వరతంతువు అనే గురువు ఒక గురుకుల అధ్యక్షుడిగా ఉన్నాడు. అతడి శిష్యుడైన కౌత్సుడు అణకువ శీలం ప్రకాశం పొందిన అధ్యయుడు. విద్య ముగిసినప్పుడు వరతంతువు కౌత్సుణ్ణి పిలిచి అతడికి మంచి ఉపదేశాలు ఇచ్చి ఇంటికి తిరిగి పంపినాడు. అప్పుడు కౌత్సుడు గురుదక్షిణ ఏమైనా ఇవ్వాలని ఎంచి దాని గురించి తన గురువును అడిగాడు. కౌత్సుడు బీదవాడు కావడం కనుక వాడు గురుదక్షణ ఏది ఇవ్వనక్కర లేదని అన్నాడు గురువుగారు.

కాని కౌత్సుడు గురుదక్షిణను ఇచ్చితీరవలసిందే అని మళ్ళి మళ్ళి సమర్థించడంతో వరతంతువు అతడి ప్రార్థనను అంగీకరించి ఒకడు ఒక ఏనుగు మాద నిలుచుకొని రాతిని పారవేస్తే అది ఎంత దూరం దాటి కింద పడుతుందో ఆ దూరానికి పదునాలుగు రెట్లు సమానంగా స్వర్ణం ఇవ్వాల్సిందని కోరినాడు.

ఇంటికి వచ్చిన బాలుడు తన తల్లి తండ్రులతో గురుదక్షిణ గురించి చెప్పి వారి సలహా అడిగెను. అంత స్వర్ణం ఎవరి తరమూ కాదు కదా? చాలా సేవు ఆలోచన చేసిన తరువాత అతడు తల్లి రాజుగారి వద్ద అడుగుననే నిర్ణయోనికి వచ్చెను.

రఘు మహరాజు మందిరం చేరెను కౌత్సుడు. ఇంతలో రఘు మహారాజు తన కోశాగారులో ఉన్న స్పర్ణం అన్నిటినీ బీదవారికి పండితులకు దానం చేసిన కోశాగారులు పూర్తిగా కాళీ అయిపోయాయి.

మహారాజు వద్దకు కౌత్సుడు వచ్చేసరికి అతడు ఒక మట్టి పాత్రంలో భగవంతునికి ప్రసాదం పెట్టడం చూశాడు.  కౌత్సుడి కలలు ముక్కలుచెక్కలు పోయాయి. ఐనను రఘు మహారాజు అతనికి ఉచిత అతిథి సంస్కారాలు చేసి వచ్చిన కార్యం గురించి అడిగాడు. కౌత్సుడు సంశయంతో తాను గురువుగారికి ఇవ్వ వలసిన గురుదక్షిణ గురించి తెలిపాడు.

రఘు మహరాజు “ మా వద్దకు వచ్చిన ఎవరూ వట్టి చేతితో తిరిగి వెళ్ళరాదు. రేపు రా, నీ సంగతి చూస్తాను” అని వీడుకొలిచెను.

ఆ తరువాత రఘు మహారాజా తన కులగురువైన వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి వారితో సలహా అడిగెను. వశిష్ఠ మహర్షి “ఇంత స్వర్ణ గుట్టలు నీవు సంపాదించి చేర్చలేవు. దేవేంద్ర వద్దనే ఇంత స్వర్ణ ఉంటుంది. అందుచేత ఇంద్రలోకానికి దండయాత్ర వెళ్ళడమే సరియైన మార్గం” అన్నారు.

ఇంద్ర లోకం మీద దండ యాత్ర చేద్దామని మహారాజు ఆజ్ఞ ఇచ్చాడు. విజయ భేరీలు మోగసాగాయి. భేరీల ధ్వని ఇంద్ర లోకంలో ప్రదిధ్వనించాయి. ఆ దండయాత్రాన్ని కారణం అడిగి అది రఘు మహారాజు దేశం నుండి వచ్చిందని తెలుసుకొన్నాడు ఇంద్రుడు. ధర్మాన్ని నాటుకొవడమే తన ప్రథమ కర్తవ్యంగా తలచిన రఘు మహారాజుకు సహాయం చెయ్యాలని ఇంద్రుడు మహారాజాన్ని కోశాగారులను ఇంద్రలోక దివ్య స్వర్ణంతో నింపమని ఆజ్ఞను ఇచ్చేశాడు. అలాగే రఘు మహారాజా కోశాగారులో అపరంజి వర్షం పట్టింది.

మరునాడు ఉదయం వచ్చిన కౌత్సుడుకు రఘు మహారాజా ఆ స్వర్ణ గుట్టలను అర్పించాడు. కాని కౌత్సుడు తనకు కావలసినంత స్వర్ణం మాత్రం తీసుకొని మిగిలిన స్వర్ణాని తిరిగి ఇచ్చినాడు. ఆ సమయం మహారాజు కూడా అట్లు మిగిలిన స్వర్ణాన్ని మళ్ళి ఇంద్ర లోకానికే పంపి వేశాడు.

గురుదక్షిణగా స్వీకరించిన ఆ గొప్ప ధనాన్ని వరతంతువు తన సద్గురువైన కాలవ మహర్షి వద్దకు పంపినాడు. రానున్న కాలంలో స్వర్ణ విలువ ఎక్కి పోతుంది కనుక బీదవాళ్ళు భగవత్ పూజలకు స్వర్ణ వస్తువులను అర్పించలేవని తన జ్ఞాన దృష్టతో గ్రహించిన కాలవ మహర్షి ఆ భంగార నిధులను ఒక దైవలోక స్థావరమైన ముంజలోకి చేర్చి భూలోక మానవాళ్ళ మంచి కోసం ముంజ పుల్లులగా అర్పించారు.

ఈ విధంగా ఇంద్ర లోకం నుండి వచ్చిన అపరంజితో రఘు మహరాజు యోక్క అపార దాన ధర్మ శక్రులూ కౌత్సుడి విద్యా శక్తులూ వరతంతువుల ఆచార్య శక్తులూ కాలవ మహర్షిని తపశ్శక్తులూ ఇవన్నీ కలిసి ముంజ పుల్లలగా జన్మంచాయి. భూలోక స్వర్ణ కంటే దైవలోక అపరంజి పలు రెట్లు దివ్యత్వం కలిగినది. అందువల్ల తమ చేతితో కట్టబడిన ముంజి మాలలు దేవతా మూర్తులకు అర్పించడం మంచిదే.  

శ్రీ ముంజి వినాయకుడు

తాపాయ్ శివాలయంలో వెలసివున్న శ్రీ ముంజి వానాయకుడు గొప్ప అనుగ్రహ మూర్తి. వివాహం కాని యువతులు యువకులు కనీసం తొమ్మిది ముంజి మాలలు శ్రీ ముంజి వినాయకుడికి సమర్పించి ప్రార్థించడం వల్ల వైవాహిక ఆంతర్యం తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. తమ ఆడ పిల్లల శీలం గురించి బాధబడేవారు పైన చెప్పిన ప్రార్థనతో శ్రీ ముంజి వినాయకుడుకు పసుపు వస్తాన్ని సమర్పించడం కూడా మంచిదే.  

ఓం సద్గురు శరణమ్

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam