సాయిబాబా శక్తివల్లే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు! 

ఓం వల్లభ గణపతియే నమః 
ఓం శ్రీ అంకాళ పరమేశ్వరీ నమః 
ఓం గురువే శరణం 

గార్దబ వివాహం 

భగవంతుడి శక్తి సామర్థ్యాలు అపరిమితం. భగవంతుడి కృపకటాక్షాలు అనంతము. అయితే భగవంతుడి కృపాకటాక్షాలు అనంతమని నోటిమాటగా చెప్పడం కంటే వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే ఆ వాస్తవాన్ని ఆస్వాదించగలం. ఇలా భగవంతుడి కరుణకటాక్షాలను మనం ఆస్వాదించడానికే ఈ పుడమిపై సంచరిస్తున్న జంతువులే గార్దబాలు. 
గార్దబాల దైవీక గుణాలను వివరించడానికి పలు యుగాలు చాలవు. దేహమంతా ఏ రంగులో ఉన్నప్పటికీ గార్దబం ముక్కు చివరన తెలుపురంగును కలిగి ఉంటుంది. ఇది సాధారణమైన తెలుపువర్ణం కాదు. పలు యుగాలుగా ఫల్గుణి నదీ తీరంలో గార్దబాలు జరిపిన వ్రత ఫలితంగా శుక్రభగవానుడి కృపాశక్తి కలిగిన ఆ తెలుపు వర్ణం గార్దబము నాసికా ప్రాంతంలో చోటుచేసుకుంది. 

చీమలు పూజించే స్థలం
తిరువెరుంబూరు తిరుచ్చి

మృగరాజైన సింహం చాలా శక్తివంతమైనది మనకందరికీ తెలుసు. ఆ శక్తిని కలిగి ఉండటానికి దానికున్న వ్రత శక్తియే కారణం. సింహాలు అష్టమి, ఏకాదశి, శివరాత్రి, పౌర్ణమి, అమావాస్య దినాలలో ఉపవాసం ఉండి భగవంతుడిని ప్రార్థిస్తాయి. సింహాలు చేసే వ్రతాల గురించి తెలుసుకోవడం వల్ల మనకు ఒరిగేదేమిటని మీరనుకోవచ్చు. వాస్తవానికి వ్రతాల వెనుక దాగిన మహత్యాలు అపారం. సింహం వత్రమాచరించే దినాలలో మనం కూడా వ్రతమాచరించి దేవుని వేడుకుంటే ఈ జన్మలో లేదా మరుజన్మలో సింహంలా లేదా రాజయోగంతో కూడిన జీవితం ప్రాప్తిస్తుందన్నదే దీని అంతరార్థం. ఇలాంటి అద్భుత సత్యాలు వరాహ మిహిరుడు విరచిత బృహత్‌ సంహితలో దాగి వున్నాయి. అదే విధంగా అద్భుత వ్రతాలు ఆచరించిన గార్దబాలను 'రజత నాసికా సింహాలు' అని సిద్ధులు వర్ణిస్తుంటారు. 
తెలుపువర్ణంతో కూడిన ముక్కు కలిగిన శునకాలు, గార్దబాలు, గ్రద్దల దర్శనం శుభసూచకాలని చెప్పవచ్చు. తెలుపు రంగే కదా అని మనం తేలికగా కొట్టిపారవేయవచ్చు అయితే ఆ తెలుపువర్ణంలోనే అంతులేని వేలకొలది అద్భుతాలు ఉన్నాయి. పాల రంగు తెలుపు, ఆ తెలుపులో కాసింత పసుపు రంగు కలిసి ఉంది. కొంగ రంగు తెలుపు అయితే ఆ తెలుపు రంగులోనూ కాస్త నీలపురంగు కలిసి ఉంటోంది. తుమ్మపువ్వుల రంగు తెలుపు, అయితే ఆయా దినాలలో ఆధిక్యతను కలిగి ఉండే గ్రహాల రంగులు కలిసి వుంటాయి. అయితే ఏ రంగు నిజమైన తెలుపు అని నిర్ధారించలేమా. శంఖం రంగు మాత్రమే అసలైన తెలుపు వర్ణమని సిద్ధపురుషులు నొక్కివక్కాణిస్తున్నారు. కనుకనే శంఖం కాలినా దాని తెలుపురంగు చెక్కుచెదరదని పెద్దలు కీర్తిస్తుంటారు. 
తెలుపు వర్ణం స్వచ్ఛతకు నిదర్శనమని మనకు తెలుసు. ఇంద్రుడి శ్వేత ఐరావత దర్శనం మనస్సుకు పవిత్రతను అందిస్తుంది. అయితే సామాన్య మానవులు ఐరావత దర్శనం పొందటం సాధ్యమా? అయితే దేవుడు దీనికి కూడా ఓ మార్గాన్ని సూచిస్తున్నాడు. తిరుఅణ్ణామలై కార్తీక దీపాన్ని రెండు ఐరావతాల నడుమ ఉన్నట్లుగా ఊహించుకుని దర్శిస్తే కార్తీక దీప దర్శన ఫలితంతోపాటు ఐరావత దర్శనం చేసినంత శుభఫలితాలను దేవేంద్రుడు అందిస్తాడు. 

ఆడే పాదం అభయపాదం

అలాగైతే రెండు తెల్ల ఏనుగుల మధ్య మనకు లభించే దర్శనపు ఫలితం ఎలా ఉంటుంది? దానిని మాటలలో వర్ణించగలమా? దేవుళ్ళంతా తమ రెండు చేతులను పైకెల్లి ఆశీర్వదించే భంగిమలలో ఉండటాన్ని మీరు చూసి ఉంటారు. దానినే అభయహస్త దర్శనం అని పిలుస్తారు. అదే విధంగా అభయ పాద దర్శనం కూడా ఉంది. నటరాజస్వామి నాట్యమాడే పాద దర్శన మహిమలు గురించి మనమెంతో తెలుసుకోగలిగాం. అయితే పెరుమాళ్‌ యొక్క అభయ పాదర్శనం ఎవరైనా తిలకించారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాలి. 
అలాంటి అభయ పాద దర్శనమే కాదు, ఆ పాద తాపడం దీక్షను తిరునల్లూరులో పొందిన ఉత్తముడే తిరునావుక్కరసు నాయనార్‌. ఇలాంటి అభయ పాద దర్శనంతో కూడిన దర్శనమే అదుపులో ఉంచిన పాదదర్శనమని సిద్ధపురుషులు చెబుతారు. అంటే అహంకారాన్ని కట్టడి చేసిన పాదమే అభయపాదం. ఇలాంటి అభయపాద దర్శనాన్ని ఇచ్చేదే రెండు ఏనుగుల నడుమ మనం తిలకించే తిరుఅణ్ణామలై కార్తీక దీప దర్శనమని చెప్పవచ్చు. తిరుఅణ్ణామలైలో కార్తీక దీప దర్శనం చేసేటప్పుడు ఇరువైపులా రెండు ఐరావతములు ప్రత్యక్షమైనట్లు ఊహించుకుని దర్శించడం జ్యోతి దర్శన పద్ధతులలో ఒకటిగా చెబుతుంటారు. సాధారణంగా సంవత్సరాల చివరి రెండు సంఖ్యల కూడిక 6 సంఖ్యగా వచ్చే సంవత్సరాలలో ఇలాంటి జ్యోతి దర్శనాలు చేస్తే నిండైన మెండైన ఫలితాలు లెక్కకు మిక్కుటంగా లభిస్తాయి. ఉదాహరణకు 2006, 2015, 2024 సంవత్సరాలలో ఇలాంటి జ్యోతి దర్శనాలు చేయడం శ్రేయోదాయకం. 

శ్రీ కుమారస్వామి అలయం
తిరుఅణ్ణామలై

తెల్ల ఏనుగుకు శుక్రుడి సంఖ్య 6 కున్న లంకె ఏమిటి? దీనికి ఆధ్యాత్మిక కారణాలు వేలకు వేలు ఉన్నప్పటికీ ఏనుగు తొండం 6 సంఖ్యాకారంలో ఉండటం మానవులు సులువుగా తెలుసుకోగల కారణం. ఇలాంటి జ్యోతిలో మెరిసే శుక్రభగవానుడి శక్తియొక్క అంశమే గార్దబం నాసికపై ఉందని చెబితే గార్దపు దైవీక మహత్యాన్ని మాటలలో వర్ణించగలమా? 
పైగా ఇలాంటి శ్వేతవర్ణం నాసికపై ఉండటం కాలభైరవుడి తత్వమైన పగటి సమయాన్ని సూచిస్తుంది. కనుకనే ముక్కుపై తెలుపు రంగు కలిగిన శునకానికి మనం పొరలను, బిస్కెట్లను దానం చేయడం వల్ల కాలభైరవుడి అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాము. 
గార్దబం నాసికపై నున్న ధవళవర్ణం దైవీకమైనదని భావిస్తుంటే మరి ఆ గార్దబాలు ఆ శ్వేత వర్ణాన్ని పొందిన చరిత్ర కూడా విశేషదాయకంగానే ఉంటుంది కదా! ఆ చరిత్ర ఏమిటో తెలుసుకుందామా! 

ఆరంభంలో గార్దబం దేహమంతా నలుపు రంగే నిండి ఉండేది. ఓ సారి గార్దబాలన్నీ సమావేశమై తమ గురువైన రుద్ర ఫల్గుణి సిద్ధపురుషుడిని ఫల్గుణి వాగు తీరాన దర్శనం చేసి నమస్కరించి తమకున్న లోపాల గురించి మొరపెట్టుకున్నాయి. మానవులెవరూ తమను మతించడం లేదని పైగా పనికి రాని విషయాలు గురించి తెలిపేటప్పుడు తమనే ఉదాహరణగా చెబుతుండటం తమ మనస్సులను కలచివేస్తున్నదని తెలిపాయి. ఫల్గుణి సిద్ధులు గార్దబాల న్యాయ సమ్మతమైన బాధలను విని వాటిని ఓదార్చి హితవాక్యాలు నుడివారు. దైవానుగ్రహంతో వీలయినంత త్వరగా గార్దబ కులం ఉన్నతస్థితికి చేరేలా తన వంతు సేవలను అందిస్తానని వాగ్దానం చేశారు. 

కొరతలేవీ లేవు గోవిందా 

ఆ మేరకు కొరతలన్నింటినీ తీర్చగల తిరుఅణ్ణామలైలో కొలువుదీరి ఉన్న ఆ పరమేశ్వరుడిని దర్శించి ప్రార్థించి కష్టాల కడలి నుండి గార్దబాలను కడతేర్చేందుకుగాను గిరి ప్రదక్షిణ చేయసాగారు. ఆ సమయాన శుక్రభగవానుడు ఫల్గుణి సిద్ధుల ఎదుట ప్రత్యక్షమయ్యారు. 'ఓ మహాశయా! గార్దబాల కోసం మీరు చేస్తున్న గిరిప్రదక్షిణను చూసి సంతషించాం. గార్దబాల నాసికపై తన అనుగ్రహశక్తి ఉండేలా చేయమని భగవంతుడు నాకు ఆజ్ఞాపించారు. అయితే ఆ అనుగ్రహ శక్తిని వర్షించే పుణ్యశక్తిని సేకరించే సామర్థ్యం, సత్తా లేకపోవడం వల్ల నాకేమీ పాలుపోవటం లేదు' అని శుక్రభగవానుడు ఆ సిద్ధపురుషుడికి తన నిస్సహాయ స్థితిని వివరించారు. 
ఫల్గుణి సిద్ధులు 'శుక్రభగవానుడా! గార్దబాలకు అనుగ్రహశక్తిని ప్రసాదించేందుకు మీకెలాంటి పుణ్యశక్తి అవసరమో చెబితే ఆ శక్తి కోసం నా శాయశక్తులా కృషి చేస్తాను' అని తెలిపారు. 

గార్ధబ వివాహం పూవాలూరు

శుక్రభగవానుడు సమాధానమిస్తూ 'స్వామీ! భగవంతుడు నాకిచ్చిన ఆజ్ఞ ఇదే... 
ముక్కంటికి ఆవలివైపున 
ఆ ఆవలివైపుకు నిత్యమై 
ఆ నిత్యమైన పాలకడలిలా 
మొరియునదే అమృతం 
-అంటూ కాకభుజండ నాడి సూక్తి ని ఉటంకించారు. ఫల్గుణి సిద్ధులు కాసేపు ధ్యానం చేసిన మీదట ఆ సూక్తి యందలి భావాన్ని తేటతెల్లం చేశారు. పరమేశ్వరుడి పవిత్రమైన త్రినేత్రపు జ్వాలల నుండి ఆవిర్భవించిన కుమారస్వామి (మురుగన్‌) వారి అనుగ్రహం లభించే స్థలం వయలూరు. ఆ క్షేత్రంలోని స్వామివారిని ఆరాధించిన తర్వాత తిరువాలగీశ్వరుడిని దర్శనం చేసిన తర్వాత తిరుమలేశుని పూజిస్తే లభించే ప్రాణజ్యోతి ద్వారా తెన్‌కాశి ఈశ్వరుడిని అభిషేకించడానికి లభించేదే అమృతం' అని ఫల్గుణి సిద్ధులు వివరించారు. 
ఫల్గుణి సిద్దులు తెలిపిన వివరాలను విని శుక్రభగవానుడు ఆశ్చర్యపోయారు. 'స్వామీ మీరు వెల్లడించిన రహస్యాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. అయితే వాటిని నేను నెరవేర్చడం సాధ్యమవుతుందా?' అని ప్రశ్నించారు. ఫల్గుణి సిద్ధులు 'దేవా ఈ విషయంలో చింతించవలసని పనిలేదు. గార్దబాలు నన్ను కులగురువుగా ఆరాధిస్తుండటం వల్ల వాటి కోసం తపమాచరించడం నా ప్రథమ కర్తవ్యం. మీరు నుడివినట్లే ఆ అమృతాన్ని పొంది మీకందిస్తాను. ఆ తర్వాత భగవంతుడి ఆజ్ఞమేరకు దానిని గార్దబాల నాసికలపై అమర్చండి చాలును' అని శుక్రభగవానుడికి తెలిపారు. 
ఫల్గుణి సిద్ధులవారికి శుక్రభగవానుడు దర్శనమిచ్చిన స్థలం తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గంలో రమణాశ్రమానికి సమీపంలో ఆరుముగస్వామి ఆలయం ఎదురుగా ఉంది. సుదీర్ఘకాలం వివాహయోగానికి నోచుకోనివారు, న్యాయమైన రీతిలో సంసారిక జీవనాన్ని ఆశించేవారు, సంతాన భాగ్యం కావాలనుకున్నవారు దర్శించదగిన అనువైన స్థలమిదే! 

మూడింతల రహస్యం 

తిరుచ్చి సమీపం వయలూరు దివ్యక్షేత్రాన కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరుడు మూడింతల రహస్యాలను అనుగ్రహిస్తున్నారు. ఈ మూడింతల రహస్యం గురించి వర్ణించటానికి మాటలు చాలవు. అయినా భూములు కలిగి వున్నవారు శరవణభవ అనే మంత్రాన్ని జపిస్తూ వరిపంటను పండించి అందులో మూడింట ఒక వంతును వయలూరు మురుగప్పెరుమాళ్‌కు, మరో భాగాన్ని అన్నదానానికి, మిగిలిన భాగాన్ని తనకోసం ఉంచుకుని జీవిస్తున్నవారే ఆ మూడింతల రహస్యాన్ని తెలుసుకున్నవారని సిద్ధులు ఉవాచ. భూములు లేనివారైతే తమ ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించి పైన చెప్పినవిధంగా పంపిణీ చేసి జీవనం సాగిస్తే వారు కూడా ఆ మూడింతల రహస్యం ప్రకారం మురుగప్పెరుమాళ్‌ ఆరాధిస్తున్నవారవుతారు. 
ఈ మూడింతల రహస్యాన్ని తెలుసుకున్న ఫల్గుణి సిద్ధులు ఓ సాధారణ వ్యక్తిలా వయలూరులో ఎకరా భూమిని చదునుచేసి వరి పంట పండించి శ్రద్ధగా శరవణభవ మంత్రాన్ని పారాయణం చేసి ఫల్గుణి ఉత్తిరం దినాన కావేరి నుండి మట్టి కుండలలో జలాన్ని మోసుకువచ్చి అన్నదాన కైంకర్యాన్ని నిర్వర్తించేవారు. ఇలా మూడుమార్లు ఫల్గుణి ఉత్తిర ఉత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహించిన మీదట మురుగప్పెరుమాళ్‌ దర్శనం పొంది, ఆస్వామివారి ఆజ్ఞ ప్రకారం తిరుకుట్రాలం సమీపంలో ఉన్న ఇలంజి మురుగక్షేత్రాన్ని చేరుకున్నారు. అవును, ఇదే వాల్‌కీశ దేవుడున్న స్థలం. 

ఇలంజి మురుగన్ ప్రత్యేకత

తిరుకుట్రాలంలో ఫల్గుణిపాల పారై అనే రహస్యవంతమైన సంజీవిపారై ప్రాంతం ఒకటి ఉంది. దేవతలకు కూడా అందని పవిత్రక్షేతం అది. ప్రళయ కాలంలో ఎలాంటి మార్పులకు గురికాని అద్భుత దైవీక పర్వతమది. మానవులు అర్చనలు, అభిషేకాలు, గిరి ప్రదక్షిణ అంటూ భగవంతుని ఆరాధించే పద్ధతులు ఉన్నట్లే బ్రహ్మమూర్తులకు కూడా మానవుడి మేధకు అందని దైవ కార్యాలు ఉంటాయి. 
సిద్దులకు కూడా అలాంటి అద్భుతమైన దైవారాధన సేవలు ఉన్నాయి. ఓ సారి గురుమంగళ గంధర్వ శ్రీవెంకటరామ స్వాములు తాను ఓ నిమిషంలోపున 72 లక్షల దైవసేవలు చేస్తున్నట్లు ప్రకటించారు. మానవుడి మేధస్సుకు కూడా అందనంత సంఖ్యలను గురించి స్వామివారి వద్ద అడిగినప్పుడు 'సంఖ్య ప్రధానం కాదు. మేం చేస్తున పనులను మీకు వివరించలేకపోతున్నామే అని శ్రమపడుతున్నామని మీరు భావించాలి. ఉదాహరణకు కొంతసేపటికి ముందు జరిగిన ఓ సంఘటన. ఇది మీకు ఒకింత అర్థమవుతుందనే దీనిని గురించి మీకు తెలుపుతున్నాను. మీ ప్రశ్నలకు నేను సమాధానాలు చెబుతున్నప్పుడు అదే సమయాన చెన్నై కపాలీశ్వరాలయ గోపురం మీదు ఓ భూతం భూలోకంలో దిగటాన్ని చూశాను. 

శ్రీ రుద్ర ఫల్గుని సిద్దుడు
పూవాలూరు తిరిచ్చి

ప్రపంచంలో ఏ లోకం నుండి భూతాలు వచ్చినా అవన్నీ కపాలీశ్వారాలయ గోపుర కలశాల మీదుగానే దిగాలన్నదే దైవ నియతి. ఆ నియమం ప్రకారం భూలోకాన్ని చేరుకుంది ఆ భూతం. అయితే దిగిన తర్వాత గమ్యస్థానానికి వెళ్లలేకపోతున్నది. కారణం తప్పుడు విలాసంలో ఆ భూతం దిగటమే. ఆ విషయం కొంతసేపయ్యాకనే దానికి తెలిసింది. ఆలోపున అది పలు దివ్యస్థలాలను తిలకించడంతో భూలోకం నుండి మరెక్కడికీ వెళ్లేందుకు మనస్సు రాక ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోవాలని నిర్ణయించుకుంది. నేనా విషయం తెలుసుకుని జాప్యం చేయకుండా ఆ భూతాన్ని భూలోకం నుండి తిరిగి పంపటానికి తగు ఏర్పాట్లు చేయాల్చి వచ్చింది. ఏ జీవరాశియైనా అనవసరమైన చోట అనవసరమైన వేళలో ప్రవేశించకూడదు. అలాంటి తప్పుడు కార్యాలు జరిగితే వాటిని నిరోధించాల్సిన బాధ్యత సిద్ధపురుషులపైనే ఉంది. అయితే మీవద్ద మాట్లాడుతున్నట్లు ఓ బుజ్జి నాయనా! వెళ్లిపోరా నా కన్నా! నాయనా, నువ్వు రాకూడని చోటుకు వచ్చావురా బుజ్జికన్నా అంటూ మృదువుగా మాట్లాడితే ఆ భూతం మాట వినదని నాకు తెలుసు. అందుకనే భోలోకపు లెక్క ప్రకారం 1000 టన్నుల బరువున్న ఆ భూతాన్ని మోసుకెళ్లి ఆ గోపుర కలశంలో ఉంచాను'' 
'ఇలా భూలోకానికి వచ్చిన భూతాలను గోపుర కలశాలపైకి చేర్చితే అవి మళ్లీ భూలోకంలో అడుగుపెట్టలేవన్నదే దేవతా చట్టం. కనుక మరో నిమిషంలోగా ఆ భూతం అక్కడి నుండి వెళ్లిపోతుంది. 
ఇంతటి అద్భుత దైవ కార్యంలాగే బ్రహ్మాదిదేవుళ్లు చేయాల్సిన కార్యాలూ ఉన్నాయి. దేవతలకు సంబంధించిన పలు కార్యాలలో ఒకటిగా కుట్రాల జలధార ప్రవహించే ఫల్గుణి పాల పర్వతాన్ని రోజూ దర్శనం చేసుకుని సృష్టి కార్యాలు చేసే హస్తాలతో దానిని ఓమారు తట్టాలి. ఇలా తమ జీవితపర్యంతమూ ఆ ఫల్గుణి పర్వతాన్ని తడుతూనే ఉండాలి. ఇలా బ్రహ్మ ఆయుష్షు ముగిసిన తర్వాత వచ్చే బ్రహ్మదేవుడు ఆ పాల పర్వత కార్యాన్ని కొనసాగిస్తాడు. 

ఓంకారం పలు విధం 

ఇలా కోటానుకోట్ల సంవత్సరాలపాటు పునీతమైన జలపాతం ప్రాంతంలో ప్రతిధ్వనించే ఓంకార నాదం వల్ల ఆ పర్వతం మరింత పవిత్రంగా మారుతుంది. కుట్రాల జలపాతంలో మోగే ఓంకార నాదానికి కళ్యాణ ఓంకారనాదం అని పేరు. ఇలా ఒక్కో చోట పుట్టే ఓంకార నాదం ఒక్కో నామ రహస్యమును కలిగి ఉంటాయి. ఉదాహరణకు పళని పర్వతంపైని ఓంకార నాదాన్ని శుక్రనాదం అని చెబుతారు. తిరుక్కళుకుండ్రంలో ప్రతిధ్వనించే ఓంకారం దేవనాదం. తిరుచ్చి మలకోట్టపై వెలుగొందు నాదం ప్రకృణి ఓంకార నాదం. తిరువిడై మరుదూరు ఓంకార ప్రాకారంలోనిది గజానన నాదం. రామేశ్వరం సముద్రపుటలలో పుట్టే నాదం రఘునాద ఓంకారం. తిరుచెందూరు మురుగ క్షేత్రంలోనిది స్కంధనాదం. చిత్తరువులలో సైతం ఓంకార నాదం జనిస్తుంటుంది. కుట్రాల చిత్తిర సభలోను కుంభకోణం రామస్వామి ఆలయంలో సందడిచేసే నాదం వర్ణ ఓంకార నాదమే! 
సప్త ప్రణవ క్షేత్రం తిరువయ్యారు 
తిరువయ్యారు శైవక్షేత్రాన మూడో ప్రాకారం వద్ద ఒకమారు 'ఐయాఱా' అని నినాదం చేస్తే అది 'ఐయాఱా' 'ఐయాఱా' అని ఏడుమార్లు ప్రతిధ్వనిస్తుంది. ఈ ప్రతిధ్వనుల విశిష్టతలను తెలుసుకోదలచినట్లయితే పద్మాసనంలో మూడు గంటలపాటు ఆశీనులై ఏకముఖ ధ్యానంలో నిమగ్నమయితే మూడు సార్లు 30 యేళ్ల పాటు ఆత్మనాదం కనబడుతుంది. ఆ ఆద్మ నాదం విని ప్రతిధ్వనుల విశిష్టతలను తెలుసుకోగలం. అలా ప్రతిధ్వనించే ఓంకారమే సప్త ఓంకారమవుతుంది. 

సప్త ప్రణవ ప్రాకారం తిరువైయారు

శ్రీరామచంద్రమూర్తులను దశరథుడు, సీతాదేవి, శబరిదేవి, ఆంజనేయస్వామి అంటూ పలువురు పలు విధాలయిన అద్భుత రూపాలలో దర్శించారు. ఇవన్నీ అద్భుతమే అయినా, వీటిన్నింటికీ తలమానికంలా శ్రీరామచంద్రమూర్తిని ఓ సిద్ధపురుషుడు ఆజ్ఞాచక్రంలో దర్శనం చేయడం అంటే ఎంతటి భాగ్యమో కదా! అంతటి అద్భుత రూప దర్శన భాగ్యం పొందిన అవతారమూర్తి ఎవరనుకుంటున్నారు. అండచరాచరాలను పాలించే ఆకుచాటున దాగిన పిందెలా మన మధ్యనే సంచరిస్తున్న గురుమంగళ గంధర్వలు శ్రీవెంకటరామస్వాములు కాక ఇంకెవ్వరు? ఇడియాప్ప సిద్ధులు నుదట ఆజ్ఞాచక్రం నడుమ శ్రీరామచంద్రమూర్తిని కాంతిరూపంలో దర్శన భాగ్యం పొందారు. 
ఈ విధమైన ఓంకార రహస్యాలను మీరు కంప్యూటర్‌లో ఒక 'క్లిక్‌'తో క్షణాలలో సులువుగా తెలుసుకుంటున్నారు. అయితే శ్రీవెంకటరామస్వాములు ఇలాంటి ఓంకార రహస్యాలను చేధించడానికి పన్నెండు మైళ్ల వరకు వేడిగాడ్పులు చెలరేగే రాజస్థాన్‌ ఎడారి అలమటించాల్సి వచ్చింది. అక్కడి ఓంకారేశ్వర క్షేత్రమే ప్రపంచంలోని ఓంకార నాదాలకన్నింటికంటే మించిన పీఠంగా భాసిల్లుతున్నది. కౌపీనధారియైన ఆ పెద్దాయన మన సిన్నోడు వెంకటరామన్‌ను భగభగ మండుతున్న మండుటెండలోనే నడిపించి ఓంకారేశ్వరుల దర్శనానికి తీసుకెళ్లారు. చలువరాతులతో నిర్మితమైన ఆ పుణ్యక్షేత్రంలో మన సిన్నోడు పాదరక్షలు లేకుండా నడుస్తుంటే అడుగడుగునా పాదాలలో బొబ్బలు పుట్టేవి. 
ఆ పెద్దాయన కూడా ఎప్పటివలెనే 'ఒరే సిన్నోడా అర్జెంటుగా ఓ పనిబడింది, ఆ పనిముగించుకుని వస్తాను. నువ్వు ఆలోపున... అదిగో ఆ పక్కను ఉంది చూడు ఆ గుడి వద్దకు వెళ్లి కూర్చో. వస్తాను' అని చెబుతుండగానే ఏమి జరిగిందోనని సిన్నోడు ఆలోచించడానికి కూడా తావివ్వకుండా ఆ పెద్దాయన మెరుపులా మాయమయ్యారు. మన సిన్నోడు అడుగు తీసి అడుగు వేస్తే చాలు నిప్పుకణికలపై మోపినట్లు పాదం అడుగుభాగాన ఇంతింత బొబ్బలు పుట్టేవి. ఆ బాధను మన సిన్నోడు భరించలేక విలవిలాడిపోయేవాడు. అడుగుకు ఒక బొబ్బ అనుకుంటే 12 మైళ్ల దాకా నడిస్తే ఎన్ని బొబ్బలు అతడిని బాధపెట్టాయో మనం తెలుసుకోగలము. 

తెన్కాసి

అయితే ఆ సిన్నోడు గుడిలో అడుగుపెట్టీ పెట్టక ముందే... 
'సిన్నోడా! ఇంత సేపు ఇక్కడికెళ్లావురా. నీ కోసం కూర్చుని కూర్చుని నడుము విరిగిపోయింది కదారా' అంటూ అక్కడ ప్రత్యక్షమవుతాడు ఆ పెద్దాయన. 
అక్కడ ఆ పెద్దాయన గాజు గ్లాసు నిండా చల్లటి మజ్జిగను చేతపట్టుకుని నిలబడి ఉన్నాడు. మన సిన్నోడి కంటే ముందుగా ఆ పెద్దాయన అక్కడి ఎలా వచ్చాడు? ఎందులో వచ్చాడు అని ఆలోచించే స్థితిలో లేడు. అతడి చూపంతా తన కోసం చల్లటి నీడలో చల్లటి మజ్జిగతో వేచి చూస్తున్న పెద్దాయనపైనే. చిఱుతపులి వేగంతో ముందుకురికి పెద్దాయన చేతిలోని గ్లాసును పుచ్చుకుని ఆ మజ్జిగ గబగబా తాగాడు. ఆహా అద్భుతం! అంతటి తియ్యటి చిక్కటి మజ్జిగను మన సిన్నోడు ఎక్కడా రుచి చూడలేదు. ఆ మజ్జిగను తాగాక మన సిన్నోడిలో అలసట మాయమై కొత్త ఉత్తేజం వచ్చింది. పాదాలలో నొప్పి కూడా తెలియడం లేదు. అయినా ఆ పెద్దాయనపై సిన్నోడు చిరుకోపంతో జగడానికి దిగాడు. 'ఎంత పనిచేశావు పెద్దాయనా! నడిస్తే బొబ్బలు పుట్టే మార్గంలో నన్ను అనాధగా విడిచిపెట్టి వచ్చేశావు.. ఇక్కడ చూడు ఎంతటి బొబ్బో' అంటూ తన పాదాలను ఆ పెద్దాయనకు చూపాడు. ఆ పెద్దాయన ఏమీ ఎరుగనట్లు సిన్నగా నవ్వుతూ సిన్నోడివైపు చూసి 'ఏముందిరా' అన్నట్లు సైగ చేశాడు.

మన సిన్నోడికి చిర్రెత్తింది. 'ఇది కూడా కనబడలేదా ఈ పెద్దాయనకు?' అంటూ తన పాదాలలోని బొబ్బలను చూపడానికి ప్రయత్నించాడు. అయితే ఆ పాదాలపై ఇప్పుడు బొబ్బలు ఉంటే కదా చూపటానికి. సిన్నోడి పాదాలు చలువరాళ్లలా మిలమిలా మెరుస్తున్నాయి. పాదాల అడుగున ఎలాంటి బొబ్బలు లేవు. సిన్నోడు ఆ ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోయాడు. బొబ్బలు మాయమైనందుకు ఓ వైపు ఆనందించినా మరో వైపు బాధతో కళ్లలో జలజలా కన్నీళ్లు రాలాయి. ఇంతటి మండుటెండలో పాదాలలో బొబ్బలు పుడుతున్నా అష్టకష్టాలు పడి వస్తే ఆ బాధ ఎలాంటితో పెద్దాయనకు చూపే వీలులేకుండా దేవుడు తనను పరీక్షిస్తున్నాడు కదాయని బాధపడ్డాడు మన సిన్నోడు. 
ఆలోపునే ఆ పెద్దాయన సిన్నోడి తలంపును ఖండిస్తూ 'ఒరే! సిన్నోడా దేవుడు బాధకలిగించేలా ఎవరికీ పరీక్షపెట్టడురా' అంటూ బదులిచ్చాడు. ఆ సమయంలోనే పైనపేర్కొన్నట్లు ఓంకార రహస్యాలను సిన్నోడికి పూసగుచ్చినట్లు వివరించాడు. 
ఓ బ్రహ్మదేవుడి ఆయుష్షు ఎంతో తెలుసునా? భూలోకపు లెక్కల ప్రకారం సుమారు 365 లక్షల కోట్ల పైచిలుకు సంవత్సరాలు. ఇది ఏ మానవుడి మేధస్సు అంగీకరించని లెక్కే అయినా అదే వాస్తవం. ఇలా 100కు పైగా బ్రహ్మదేవుళ్లు ఆ పాల పర్వతాన్ని తమ జీవిత కాలాల్లో తడుతూ పూజించిన మీదట 100వ బ్రహ్మ ఆ ఫల్గుణి పాల పర్వతాన్ని తడుతున్నప్పుడు అందులో నుండి ఓ అరుదైన పుష్పం బయల్పడింది. కోటి సూర్యప్రభా ప్రకాశితమైన ఆ పుష్పాన్ని తిరువాలకీశ శ్వేత సైకత జ్యోతి అని సిద్ధపురుషులు పిలుస్తుంటారు. 
అంతటి అద్భుతమైన శ్వేత సైకత వాలకీశ మూర్తియే ఇలంజి మురుగప్పెరుమాళ్‌. ఇంతటి ఓ అద్భుత దివ్య చరిత్రను తెలిపిన కరుణాసముద్రుడు శ్రీవెంకటరామస్వాములకు ఎన్నో వేల సంవత్సరాలపాటు సేవచేసి ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోగలం? 
సగటు మానవుడి ఆయుష్షు అధికపక్షంగా 120 సంవత్సరాలు. అయితే మన శ్రీవెంకటరామస్వాములు చెబుతున్న దైవీక పరమార్థాలన్నీ లక్షల, కోట్ల సంవత్సరాలకు మునుపు జరిగిన పౌరాణిక ఇతిహాసపు వైభవాలుగా ఉంటున్నాయి. మానవుడి మేధకు అంతుచిక్కని ఈ సంగతులను ఎలా అంగీకరించలమని ఓ శిష్యుడు ఆయనను ప్రశ్నించారు. స్వాములు వినమ్రతతో బదులిస్తూ 'నాకేవీ తెలియదు సార్‌! మీరడిగే ప్రశ్నను ఈమెయిల్‌ వలె ఆ మిద్దెపైనున్న (పైలోకానికి) వారికి పంపుతాను. ఆ మెయిల్‌కు ఎప్పుడు సమాధానం వస్తుందో, ఎవరు ఆ సమాధానాన్ని తీసుకొస్తారో అవేవీ తెలియవు. చాలమటుకు దేవతలే సమాధానాలు తీసుకువస్తుంటారు. ఓ సారి నేనంపిన మెయిల్‌కు దత్తాత్రేయులవారే సమాధానం తీసుకువచ్చారు' అని పేర్కొన్నారు.

కముగు పూర్ణ అద్బుతం 

కల్పనలకు అందని పవిత్ర మూర్తి ఇలంజి మురుగప్పెరుమాన్‌ను ఆరాధించే పద్దతులు వేలకుపైగా ఉన్నప్పటికీ సిద్ధపురుషులు నిరాడంబరతతో ఐందరువి జలపాతంలో స్నానమాచరించి, మధ్యాహ్న సమయంలో స్వామివారిని దర్శించటం ఓ పద్ధతి. సిద్దపురుషుల లాగే ఫల్గుణి సిద్దుపురుషుడు కూడా ఓ మంగళవారంనాడు ఐందరువి జలపాతంలో స్నానమాచరించి, మురుగప్పెరుమాన్‌ను దర్శించారు. స్వార్థచింతనలు లేకుండా ఆ సిద్ధపురుషుడి రాకను ముందుగానే పసిగట్టిన తిరుకుట్రాల వనదేవతలు ఆ ఐందరువి జలపాతం పైన 500 ఎకరాల విస్తీర్ణంలో కుట్రాలపు జలాలో నింపి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటదాకా ఆరాధనలు, పూజలు నిర్వహించి ఆ పవిత్ర జలాలతో ఆ సిద్ధపురుషుడిని అభిషేకించారు. 

శ్రీ ఇలంజి మురుగను

ఇలాంటి అత్యద్భుత జలాభిషేకాన్ని మన గురుమంగళ గంధర్వులైన శ్రీవెంకటరామస్వాములకు 1999లో కార్తీక మాసంలో తిరుకుట్రాల వనదేవతలు నిర్వహించి సంతసించారన్నది మీకు తెలియని రహస్యం. ఆ తదుపరి సంవత్సరమైన 2000 సంవత్సరంలో లోకంలో పలు మలుపులు జరుగనుండటంతో శ్రీస్వాములు ఇలంజి మురుగప్పెరుమాన్‌ను తనివితీరా ప్రార్థించి భూలోకవాసులందరిని కష్టాలనుండి కడతేర్చమని వేడుకున్నారు. ఆ క్షేత్రంలో తనకు జరిగిన అభిషేకపు సాదర స్వాగత సత్కారాలను గురించి తర్వాతి కాలంలో శిష్యులకు తెలిపి మురిసిపోయారు. కముగు పూర్ణం అనే పేరుకలిగిన ఈ దివ్య అభిషేకం సిద్ధపురుషులకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులకు మాతమ్రే ప్రాప్తించాయి. 
వనదేవతలే కాదు భక్తజనులు సైతం ఇలాంటి కముగు పూర్ణ శక్తులను ఉపయోగించి లబ్దిపొందటం ఎలా? శుక్లపక్షం మంగళవారం మ్రన్మయ (మట్టి) కలశంలోనో లేక తామ్ర, ఇత్తడి కలశంలోనో గంగ, కావేరి వంటి నదుల పవిత్ర జలాలను సేకరించి ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ కలశాల ఎదుట ఆశీనులై రుద్రం, ఝముకం, తేవార, తిరువాచక కీర్తనలను, షణ్ముఖ కవచం వంటి కవచ కీర్తనలను పఠించాలి. ఆ తర్వాత ఆ కలశతీర్ధాన్ని ఆలయంలోని మురుగప్పెరుమాన్‌ అభిషేక ఆరాధనకు అందజేస్తే ఆ తీర్థ జలాల్లో కముగు పూర్ణ శక్తులు పుట్టి భక్తజనుల న్యాయమైన కోరికలు సంపూర్ణంగా నెరవేరుతాయి. 
శుక్లపక్ష మంగళవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరుసగా బుధ, చంద్ర, శని, గురు భగవాన్‌ హోరలు అద్భుత తీర్థ శక్తులను కలిగి ఉంటాయి. ఈ శక్తులు భూమికి అధిపతియైన అంగారక భగవానునికి సంబంధించిన మంగళవారంలో తీర్థవారి భూ సమృద్ధి శక్తులు అధికమవుతాయి. వాస్తు దోషాలు తొలగుతాయు. పైన పేర్కొన్న నాలుగు హోరలకు అధిపతులు అంగారక భగవానుడితో మితృత్వం కలిగి ఉండటం ఈ విశిష్టతకు కారణం. స్వంతంగా ఇళ్లులేనివారికి, అద్దె ఇళ్లలో నివసిస్తున్నవారికి పైన పేర్కొన్న ఆరాధనల వల్ల లబ్దికలుగుతాయి. బుధ గురు సంగమ ముద్రగా వెలుగొందు గాయత్రీ దశ ధ్యాన ముద్రలు (వీడియో చూడండి) ఈ ఆరాధన ఫలితాలను రెట్టింపు చేస్తాయనటమూ వాస్తవమే! పైగా అంగారక, బుధ గ్రహాలు కలిసే యోగపు అమరిక అద్భుతమైన రోగనివృత్తి శక్తులను, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంగారక భగవానుడి ఉష్ణ శక్తులు రోగనివృత్తిని, బుధభగవానుడి శ్వాసశక్తులు దీర్ఘాయుష్షును అందిస్తాయి. నాలుగు నిమిషాలకు ఒకమారు శ్వాసించడం వల్ల తాబేళ్లు 10000 సంవత్సరాల దాకా బతుకుతున్నాయి. అంతేకాదు తాబేళ్లు పుట్టిన వెంటనే తను పెంకు నుండి బయటికి రావడానికి రెండు సంవత్సరాలు, నడిచేందుకు ఐదేళ్లు పడుతాయి. ఇంతటి ఓర్పునకు దీర్ఘ శ్వాస తోడయి దాని ఆయుష్షును పెంచుతోంది. 
సాధారణంగా మేష, కటక, తులా, మకర అనే చరరాశులలో జన్మించినవారు ఆరోగ్యంగా ఉంటారు. అంగారక భగవానుడి జననస్థానమైన మేషరాశిలో మేషలగ్నంలో బుధహోరలో జన్మించినదే రామాయణకాలంనాటి జటాయువు. జటాయువు రావణుడితో యుద్ధం చేసి అసువులు బాసినతోడనే దానికి అంత్యకియ్రలు చేసి అంగారక భగవానుడి క్షేత్రమైన వైదీశ్వరన్‌ ఆలయంలో మోక్షం ప్రాప్తింపచేసిన శ్రీరామచంద్రమూర్తి మకర రాశిలో ఉచ్చస్థితిలో బలవర్థకమైన అంగారక భగవానుడి సప్తమ దృష్టిని పొంది కటక రాశిలో కటక లగ్నంలో జన్మించారు. కనుకనే వైదీశ్వరన్‌ ఆలయంలో జటాయువు గుండంలో పొందే విభూతి ప్రసాదం ఎలాంటి వ్యాధులనైనా నయం చేసే అద్భుత శక్తిని కలిగి ఉంటొంది. 

తిరుమల దివ్యక్షేత్రం 

ఇక పేర్కొనే తిరుమల కుమారస్వామి క్షేత్రం తమిళనాడు చెంకోట్టై దగ్గిర ఉన్నది.
ఇలంజి తిరువాలకీశ పెరుమాన్‌ను పూజించిన ఫల్గుణి సిద్ధులు సత్యాన్వేషణకుగాను తిరుమలై చేరుకున్నారు. అత్యద్భుత మూలికలు కలిగిన పవిత్ర స్థలమే తిరుమల క్షేత్రం. ప్రాణశక్తులు అధికంగా విహరించే స్థలం. కపాల భైరవుడు పాలిచే స్థలం కనుకనే కపాల వ్యాధుల నివృత్తికి, నరాల సంబంధిత వ్యాధులు (neurological disorders) నివృత్తికి ఆరాధించాల్సిన స్థలమిదే. 
ఐం, హ్రీం, క్లీమ్‌, నమశ్శివాయ, హీం అనే పంచ ధారణలతో మహేశ్వరుడిని ఆరాధించాడు ఫల్గుణి సిద్ధులు. ఆ సమయంలో ఆకాశం నుండి ఓ జ్యోతి జనించి తన అరచేతిలో జలధారలా వర్షిస్తుండటాన్ని గమనించారు. ఆ జలధార అత్యంత భక్తి ప్రపత్తులతో చేత ధరించి అక్కడి నుండి కాలినడకనే తెన్‌కాశి క్షేత్రానికి చేరుకున్నారు. తెనకాశి ఈశ్వరుడిని మనసారా ఆరాధించి ఫల్గుణి సిద్ధులు దర్శించి సిద్ధులకు శ్రేష్టుడైన ఆ మహేశ్వరుడికి తన అరచేతిలో జలధార తీర్థంతో అభిషేకించి తరించారు. ఆ అద్భుత అభిషేక దివ్య ప్రకంపనలే గార్దాబాల నాసికలపై శుక్ర చిహ్నాలుగా ఏర్పడ్డాయి. అప్పటి నుండి అవి రజిత నాసికా సింహాలుగా కీర్తి గడించాయి.

ఇలంజి కుమారస్వామి

ఇలంజి మురుగప్పెరుమాన్‌ రూపొందిన తిరువాలకీశ శ్వేత సైకతం విశిష్టతను తెలుసుకున్న పరాక్రమ పాండియన్‌ ఆ సైకతాల సమూహంలో కొంత భాగాన్ని తెన్‌కాశి లింగమూర్తితో కలిపి అద్భుత కార్యాలను నిర్వహించాడు. భక్తితో చేతులెత్తి నమస్కరిస్తున్న భంగిమతో ఉన్న పరాక్రమ పాండియన్‌ విగ్రహాన్ని నేటికీ ఆ ఆలయంలో భక్తులు దర్శిస్తున్నారు. 
'వీడని కరకమలాలతో వెలుగొందువాడు' అనే రీతిలో పరమేశ్వర సమేతంగా ఉన్న మురుగప్పెరుమాన్‌, పార్వతీదేవి కీర్తిని చాటిచెప్పే స్థలమే తెన్‌కాసి క్షేతం. ఇలంజి మురుగప్పెరుమాన్‌ విజయాలను అందించే తెనకాశి ముక్కంటి ఈశ్వరుడిని నిర్విరామంగా పూజిస్తుండటం ఈ క్షేత్రంలోని ప్రత్యేకత. పైగా ఫల్గుని పాల పర్వతంలో ప్రవహించే తీర్థంలో పంచ మహా శక్తులు జనిస్తున్నాయి. ఈ పంచ మహా శక్తులు మురుగప్పెరుమాన్‌ తప్ప వేరు దైవ మూర్తులెవరూ గ్రహించలేరు కనుక దానిని ఇలంజి మురుగప్పెరుమాన్‌ సంగ్రహించి తెన్‌కాశినాధుడికి గోపురం మీదుగా అందిస్తున్నారు. 
సిన్నోడుగా ఉన్నప్పుడు వెంకటరామస్వాములు ఓ సమయంలో కౌపీనధారియైన పెద్దాయన వద్ద 'గోపురం మీదుగా ఈ తీర్థాన్ని ఇక్కడి నుండి (ఇలంజి) స్వామివారికి (తెన్‌కాశి) పంపటం ఎలా సాధ్యమవుతుంది గురువుగారు?' అని అమాయకంగా ప్రశ్నించాడు. కౌపీనధారియైన ఆ పెద్దాయన 'అదేమంత కష్టమైన పని కాదురా. నీ వద్ద నాలుగు బకెట్ల నీటిని ఇచ్చి తెన్‌కాశి గుడిలో పోసి రమ్మంటే గుడి వద్దకు వెళ్లి ఆ నీటి పోసి వస్తావు కదా. అలాగే మన మురుగప్పెరుమానులవారు అగస్త్య మహర్షిని పిలిచి నాయనా పంచమహా శక్తులు కలిగిన ఈ తీర్థాన్ని తెన్‌కాశిలో ఉన్న మా నాన్నగారైన పరమేశ్వరుడికి అందించండి స్వామి అన్నారు. అగస్తుల్యవారు సరే స్వామీ అంటూ ఆ తీర్థాన్ని శిష్యగణానికి ఇచ్చి కార్యాన్ని చక్కగా నెరవేర్చారు. అగస్తుల వారు plumber గా మారితే ఆయన శిష్యులు pipes లాగా పనిచేశారు. అంతేరా!' అంటూ బదులిచ్చారు. అప్పట్లో మన సిన్నోడికి పెద్దాయన చెప్పినదేమీ అర్థం కాలేదు. మీకిప్పుడైనా అర్థమైందా? 
కొన్నేళ్లకు ముందే ఇలంజి మురుగన్‌ ఆలయానికి తెన్కాశికి నడుమ గోపురాలు నిర్మితమైనట్లు మనకు అనిపిస్తున్నా మురుగప్పెరుమాన్‌ సూక్ష్మ ఆరాధన నిరంతరం వెలుగొందు దైవీక అద్భుతం. తండ్రీకొడుకుల తారతమ్యాలు తొలగి కుటుంబ ఐకమత్యాన్ని చాటే అద్భుత స్థలమిది. 
ఇలా మూడుశక్తులూ మురుగప్పెరుమాన్‌ జ్యోతి, తిరువాలకీశ శ్వేతసైకత జ్యోతి, కముగు పూర్ణ శక్తి తిరుమలై పర్వత రహస్యాలు, తెన్కాశి ఈశామృతం, పల్గుణి సిద్ధుల తపోశక్తి, శుక్రభగవానుల అనుగ్రహము ఏకమై గార్దబాల నాసికపై శుక్ర సంజనిత శ్వేత వర్ణం ఏర్పడి ఉంటే మరి ఆ గార్దబాల దైవీక గుణగుణాలను వర్ణింప శక్యమా?   

ముందు అశ్వం వెనుక గార్ధబం 

ఓ విచిత్రమైన గొప్పదనం గార్దబానికి ఉంది. భౌతిక శాస్త్రంలో spin-half particles అనే పదార్థపు శకలాలు ఉంటాయి. వీటిని గణిత సూత్రాల ద్వారా సులువుగా వివరించటానికి వీలున్నప్పటికీ మనం ఈ లోకంలో తిలకించే పదార్థాలను ఉదాహరణలతో వివరించలేమన్నది వైజ్ఞానికుల అభిప్రాయం. అయితే దీనికి ఉదాహరణగా గార్దబాన్ని చెప్పవచ్చు అనేది ఆశ్చర్యదాయకమైన వైజ్ఞానిక సత్యం. అదెలా? Spin-half particles అనేవి తమ మొదటి వర్తులలో తమ స్థితిని తగ్గించుకుని తదుపరి వర్తులంలో తమ పూర్వపు స్థితిని పొందే పదార్థపు శకలాలు. అలాగైతే గార్దబపు జన్మ ముగిసిన తర్వాత ఆది మరుజన్మలో అశ్వంగా పుడుతుంది. అవును. ఇదే సృష్టి రహస్యం. 
గార్దబానికి అధి దేవత శుక్రభగవానుడు. గార్దపు మరుసటి జన్మయైన అశ్వానికి అధిపతి సూర్యభగవనాడు. కనుకనే సూర్య, శుక్రుల వరుసలో నవగ్రహ హోర ఆరాధన అమరి ఉంటుంది. జ్యోతిష్య తత్త్వంలో కీలకంగా వెలుగొందు శుక్రభగవానుడు సూర్యభగవానుడు గార్దబానికి, అశ్వానికి కీలకంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది? దీనిని మన పూర్వీకులు హాస్యపు ధోరణిలో 'ముందువెళితే కరుస్తోంది, వెనుక వెళితే తన్నుతోంది' అని చెబుతుంటారు. 
ఇలా అశ్వానికి ముందుగా ఉండటంతోపాటు పంచభూత శక్తుల్ని సమిష్టిగా పొందినదీ ఈ గార్దబం. పంచ భూత లింగాలను గురించి మీకు తెలుసు. పంచభూతాలూ అనుగ్రహించే దైవీక క్షేత్రాలు ఉన్నాయి. ఇలా పంచభూత శక్తులపై అవగాహన కలిగిన జీవులు గురించి మీకు తెలుసునా?   

చీమల పరిసర పరిజ్ఞానం 

పంచభూతాలలో భూమి లేదా పుడమి తత్త్వానికి తిరువారూరు ఈశ్వరుడు, ఏకంబ ఈశుడు అనుగ్రహ మూర్తులుగా వెలుగొందుతుండటం మీకు విదితమే. పుడమి తత్త్వాన్ని బాగా తెలుసుకోగలవి చీమలే. చీమల పుట్టలను గమనిస్తే అందులో లెక్కలేనంతగా మట్టి వుంటలు కనబడతాయి. అవి సామాన్యమైన మట్టి ఉంటలు కావు. చాలా సక్రమపద్ధతిలో రూపొందిన శ్రేష్టదాయకమైన చీమల సమాచార పరిజ్ఞానమే (database memory) ఈ మట్టి ఉంటలు. గణితపు కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పోల్చితే చీమలు సుమారు 600 రెట్లు కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయంటే అతిశయోక్తికాదు. చీమలకు మించిన కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని మానవుడు ఏనాడూ పొందలేడు. సిద్ధులకు మాత్రమే చీమలు గురించిన రహస్యాలన్నీ తెలుసు. త్రిసూచిక సంకేత పద్ధతిలో భ్రమణ (spin) విధానంలో ఉన్నదే చీమల కంప్యూటర్‌ వ్యవస్థ. ప్రస్తుతం కంప్యూటర్‌ రంగం ఉపయోగించే switch ఆధారితంగా కాకుండా భ్రమణ పద్ధతిలో చీమలు సమాచారాలను వ్యాపింపచేస్తున్నందువల్ల మట్టి ఉంటలు చీమల కంప్యూటర్‌లో ఎందుకు ఉపయోగపడుతున్నాయో మీరిప్పుడు తెలుసుకుని వుంటారు. కనుక మానవులు పుట్ట లింగాలున్న తిరువారూరు వంటి క్షేత్రాలలోను, చీమల ప్రధాన క్షేత్రమైన తిరువెరుంబూరులోను, పృథ్వీ తత్త్వానికి కేంద్రమైన ఏకాంబరేశ్వర పుణ్యక్షేత్రంలోను పూజలు చేస్తూంటే కొంతవరకైనా చీమల కంప్యూటర్‌ జ్ఞానం గురించి తెలుసుకోగలుగుతాము. 
ఈ విషయంలో మానవులకు సహాయపడేవి గార్దబములే. ఆ గార్దబాలను పెంచి సంరక్షిస్తూ వస్తే spin రహస్యం ద్వారా కంప్యూటర్‌ జ్ఞానాన్ని భవిష్యత్‌లో శాస్త్రవేత్తలు పెంచుకోగలుగుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారతీయ వైజ్ఞానిక వేత్త సత్యేంద్రనాత్ బోస్‌ గార్దబములను ప్రేమగా పెంచడం వల్లే అణు విజ్ఞానంలో కీర్తిపొందారన్న విషయాన్ని మనం గ్రహించాలి. గార్దబానికి క్యారెట్‌, పచ్చ బఠాణీలు, నూల్‌కోల్‌ వంటి కాయగూరలను తినిపిస్తే కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నవారు, కంప్యూటర్‌ రంగంలో సాధించాలనుకునేవారు ఉన్నత స్థితిని అందుకోగలుగుతారు. ఈ విషయాన్ని కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇది ఎలాంటి శ్రేష్టమైన నవగ్రహ ఆరాధనో మీరు తెలుసుకోగలుగుతారు. 
ఎంత మేరకు గార్దబాన్ని సంరక్షించి పెంచుతామో అంతటి స్థాయిలో భ్రమణపు రహస్యాలు తెలుసుకోగలము. పందులను సంరక్షించి జ్యోతిష రహస్యాలను తెలుసుకున్న వరాహమిహిరుడును జ్ఞాపకం చేసుకుంటే ఈ వాస్తవం సులువుగా బోధపడుతుంది. మూలికా రహస్యం పందుల నాసికలలో దాగి ఉన్నట్లు భమ్రణపు రహస్యం గార్దబపు దెబ్బలో దాగి ఉంది. 
గార్దబాల పటాలను కంప్యూటర్‌ desktop లో పెట్టుకుని దర్శనం చేస్తూండటం, గార్దపు పటాలను silver రంగులో coating చేసి పూజించడం, తిరుచ్చి లాల్గుడి పూవలూరు క్షేత్రంలో ఫల్గుణి సిద్ధుల వాహనంగా వెలుగొందే గార్దబమూర్తి ఆరాధించడం వల్ల మంచి పురోగతిని సాధించగలము.   

చింతకు చిక్కని సాలెపురుగు

పుడమి తత్త్వాన్ని కలిగిన చీమలు వలే నీరు‌ అనే జల తత్త్వాన్ని బాగా ఎరుకపరచుకున్నవే సాలెపురుగులు. సాలెపురుగు నిర్మించిన గూడులో ఏ పురుగైనా అతుక్కుంటుందన్న విషయం మీకు తెలిసిందే. అయితే ఆ గూడులో సాలెపురుగు చిక్కుబడే ప్రసక్తేలేదు. అంతే కాదు తన గూడుపై అతుకబడకుండా సులువుగా ఎలా సంచరిస్తుందో నేటికీ వైజ్ఞానిక శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యం. విజ్ఞానం ఎక్కడ ముగుస్తుందో అక్కడే సత్యజ్ఞానం ఆరంభమవుతుంది అనే సిద్ధుల వాక్కును బట్టి సిద్ధులు మాత్రమే ఈ రహస్యం గురించి సమాధామివ్వగలరు. 
శతాధిక సంవత్సరాలకు పూర్వం ఆదిశంకరులు సాలెపురుగు గూడు రహస్యం గురించి వివరించి ఉన్నారు. సాలెపురుగు తన సంకల్ప బలంచేత గూడును నిర్మిస్తున్న రీతిలోనే భగవంతుడు సైతం తన సంకల్పబలం వల్లే సృష్టికార్యం నిర్వర్తిస్తున్నాన్నదే నిత్య సత్యం. కనుక సాలెపురుగు గూడు అన్నది కేవలం ఒక పదార్థం కాదు. It has no mass. It is pure energy. సాలెపురుగు గూడు జలతత్త్వం ప్రాతిపదికన అల్లబడిన వల అని ఎరుకైనప్పుడు సాలెపురుగు ఎలా తన మాయ వలలో చిక్కుబడకుండా సంచరిస్తుందో సుస్పష్టంగా తెలుస్తుంది. భగవంతుడు ఏనాడు మాయచేత రూపొందించిన తన సృష్టిలో చిక్కుబడతారా? ఈ వాస్తవాన్నే పట్ణిణత్తార్‌ అనే భక్తశిఖామణి ఇలా చెబుతారు. 
ఊరు నిజం కాదు 
నీ బంధువులు నిజం కారు 

శ్రమపడి వొందిన పేరు నిజం కాదు 
మగువలు వాస్తవం కారు, సంతానమూ నిజం కాదు 
ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు 
నీవే శాశ్వతం కచ్చి ఏకంబ స్వామీ! 
-అంటూ ఈ లోకపు వాస్తవాన్ని ఎలుగెత్తి చాటారు. కనుక సాలెపురుగు గూడు మాత్రమే మాయవల కాదు. ఈ లోకంలోని సమస్తమూ భగవంతుడి మాయా లీలా వినోదాలు. 
అదే విధంగా జలతత్త్వాన్ని ఎరుక పరచేందుకు సాలెపురుగు జలతత్త్వాన్ని లోకానికి చాటిచెబుతున్న తిరుఆనైక్కా క్షేత్రపురీశ్వరుడైన ఈశునికి పందిరి వేసి ఆరాధించిందని చెబితే అతిశయోక్తి కాదు కదా! మనం సాధారణంగా సాలెగూడు అని అనుకున్నా సాలెపురుగుకు సంబంధించినంతవరకు భగవంతుడిని దుష్టశక్తుల నుండి కాపాడే కవచపందిరే అది. ఆ తలంపుతోనే భగవంతుడికి పందిరిని నిర్మించి ఆరాధించింది సాలెపురుగు. చివరకు ముక్తిని కూడా పొందగలిగింది. అడవి జంతువుల బారిని నుండి పరమేశ్వరుడిని కాపాడేందుకు కాపలా కాసిన కన్నప్పస్వామి కథే ఇది. ఈ భక్తికి logic లేదు. Logic చూస్తే భక్తి పెరగదు. విశ్వాసం కలుగదు. 
ఇళ్లలో రూపొందు సాలెగూళ్లు అద్భుత కవచ శక్తులు కలిగి ఉంటాయి. సాలెపురుగులే పలురకాలయిన దుష్ట తలంపులు కలిగిన శక్తులను తమ గూళ్ళలో చిక్కుబడేలా చేస్తాయి. వేరే ఏ శక్తివల్లా తలంపులను ఆకర్షించలేవని జ్ఞాపకముంచుకోండి. జలతత్త్వాన్ని తెలుసుకోగలిగిన జీవులే తలంపులను ఆకర్షించగలుగుతాయి. కనుకనే నైవేద్యం, తర్పణం, అర్ఘ్యం వంటి శుభకార్యాలకు జలాన్ని వినియోగిస్తున్నాము.   

మిణుగురు పురుగా విఠల మూర్తియా ? 

ఇక అగ్ని తత్త్వాన్ని తెలియజేసే జీవులలో ముఖ్యమైనది మిణుగురు పురుగు. ఓ సాయం సంధ్యా సమయంలో కనిపించి మాయమయ్యే మిణుగురు పురుగు సాధించే సాధనలను ఓ మనిషి తన జీవిత పర్యంతమూ పాటుపడినా సాధించలేడు. కారణం మిణుగురు పురుగు అగ్ని తత్త్వాన్ని బాగా ఆపోసన పట్టినంతగా మానవులు దాని మహిమను అవగాహన చేసుకోలేరు. చూడటానికి దీపపు కాంతి చుట్టూ ఆ కాంతిలోనే పడి మరణించినట్లు మానవుడు తలచటానికి కారణం మానవుడి అజ్ఞానమే. ఇకమీదట అయినా మిణుగురు పురుగుల చర్యలను సునిశితంగా పరిశీలించండి. 
ఓంకారం నుండి ఆవిర్భవించినది ఈ లోకమని మనకు తెలుసు. ఈ ఓంకార శక్తిని శబ్దరూపంలో అందించగలిగేది శంఖమేనని మీకు తెలుసు. శంఖం లోపలి భాగం ఎలా ఓంకార శబ్దాన్ని జనియింపజేసే తీరులో ఉంటుందో అదే పద్దతిలో మిణుగురు పురుగులు అగ్నిని ప్రదక్షిణం చేస్తాయి. ఇప్పుడు అర్థమైందా ఇంటిలో మిణుగురు పురుగులు చేసే త్యాగమేమిటో. కనుక ఇళ్ళలో మిణుగురు పురుగులు ఊరకనే సంచరించడం లేదు. ఓంకార శబ్దాన్ని జనియింపజేసే విధంగా అగ్నిని ప్రదక్షిణ చేస్తుంటాయి. సముద్రపు అలలు, పిడుగు, మెరుపులతో కూడిన వర్షంలో negative ions అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తులను జనింపజేసి దేహ ఆరోగ్యాన్ని పెంపొందింపజేసేవే ఈ వాయు కణాల పని. పరిసరాల శుభ్రతకు ఆరోగ్యవంతమైన గాలికి ఈ కణాలు ఆవశ్యకం. శక్తితో కూడిన ఈ వాయు కణాలు సూర్య, చంద్ర శ్వాస కళల ద్వారా రూపొందబడవచ్చును. 
మిణుగురు పురుగులు పునీతమైన తమ దేహపు అమరిక మూలంగా, రెక్కల కదలికల ద్వారాను, శ్వాస కళల ద్వారాను నిర్ణీత కోణంలో అగ్నిని చుట్టి ప్రదక్షిణ చేయడం వల్ల వర్షాకాలంలో అపరిమితంగా వెదజల్లబడు ఆరోగ్యవంతమైన వాయు కణాలు ఓంకార శక్తితో మిళితమై భూమండలమంతటా వ్యాపింపచేస్తాయి. ఇలాంటి అద్భుత దైవీక కార్యాన్ని ఏ మానవుడు తన జీవిత కాలంలో నెరవేర్చగలడా అని కాస్త ఆలోచించండి. ఇక రమణమహర్షిలా చాలా కాలంపాటు ఒకే చోట తపస్సు చేసేటప్పుడు దేహంలో ఏర్పడే మృదుత్వమే మిణుగురు పురుగుల దేహపు అమరికలో రూపొంది ఉన్నాయని ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక రహస్యం.   

ఊరక ఉండటం సుఖమేనా ? 

అగ్ని తత్త్వం వలెనే వాయు తత్త్వాన్ని తెలుసుకున్న జీవులు ఏవి? దీనిని మీరు సులువుగా ఊహించవచ్చును కదా. సీతాకోక చిలుకలే వాయు తత్త్వాన్ని తెలుసుకున్న జీవరాశులలో మొదటి స్థానంలో ఉంటాయి. సీతాకోక చిలుకలు ఆధ్యాత్మిక రహస్యాలను గురించి సీతాకోక చిలుక రెక్కల సిద్ధులు చేసిన అరుదైన సేవలు గురించి శ్రీ అగస్త్య విజయం సంచికల ద్వారా తెలుసుకోవచ్చును. 
ఊరక ఉండటం చాలా సుఖం అని చెప్పడం వెనుక చాలా పరమార్థాలు దాగి ఉన్నాయి. అందులో ఒక అర్థం ఏ కార్యం చేయకుండా ఇతరులకు మార్గం చూపడం, మనం నుదుట తిలకం పెట్టుకోవడం కూడా ఇలాంటిదే. విభూతి, కుంకుమ, చందనం, సింధూరం వంటి భగవద్‌ ప్రసాదాలను నుదుట పెట్టుకుని వెళుతున్నప్పుడు వాటిని చూసినవారికి క్షణం పాటైనా దైవం గుర్తుకు వస్తాడు. కనుక ఓ మనిషి నుదట బొట్టుపెట్టుకుని ఊరకనే ఊరంతా తిరిగి వచ్చినా ఎన్ని వేలమందికో, జంతువులకో, చెట్టుపుట్టలకో, పురుగు పుట్రలకో దైవీ భావాలను వ్యాపింపచేసినవాడవుతాడు కదా! ఆ రీతిలోనే సీతాకోక చిలుకలు తమ దేహంలోని పలు వర్ణాల ద్వారా, అమరికల ద్వారా ఈ లోకపు సృష్టితత్త్వాన్ని బోధిస్తుంటాయి. దీనినే గ్రీకు తత్త్వవేత్త సాక్రటీస్‌ Numbers and patterns make this world అని చెబుతారు. 

ఇలంజి నుండి తెన్కాశి
గోపుర దర్శనం

బ్రహ్మ జెముడు గొప్పదనం 
మార్పుకు తావులేని పంచభూత శక్తియైన ఆకాశ తత్త్వాన్ని చాటిచెప్పేవే బ్రహ్మ జెముడు చెట్లు. సాధారణంగా ఊరు, గ్రామ సరిహద్దులలో మొనదేలిన ముళ్లతో ఈ బ్రహ్మ జెముడు చెట్లు ఉంటాయి. ఇవి ఆయా గామ్రాలకు సంబంధించిన సమాచారాలను ఆకాశంలో నాడి రూపంలో పొందుపరుస్తుంటాయి. ఉదాహరణకు ఆ గ్రామంలో ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి, గ్రామం పేరు, సరిహద్దు దేవతల పేర్లు, మహత్త్యాలు, నీటి వనరుల వివరాలు, జంతువుల రవాణా, వాతావరణ పరిస్థితులు అంటూ మానవుడికి అంతుదొరక ని సమాచారాలను ఈ బ్రహ్మజెముడు చెట్లు ఆకాశంలో పొందుపరుస్తాయి. 
దీని వల్ల కలిగే ప్రయోజనమేమిటి? మనం తెలిసో తెలియకో ఆ గ్రామానికి విచ్చేసే మహపురుషులు, జ్ఞానులు, యోగులు వంటివారు నాడులను చదవటంలో నిష్ణాతులై ఉండటం వల్ల పలు సంవత్సరాలకు ముందు ఆ ఊరిలో జరిగిన వేడుకలు, ఉత్సవాలు గురించి తెలుసుకుని ఆ ఊరి ప్రజలకు మనకు తోచినంత సత్కార్యాలను నిర్వర్తించేందుకు సమాయత్తమవుతారు. ఈ విషయాలు అన్నింటినీ మహాపురుషులు తమ జ్ఞానదృష్టితో తెలుసుకునేందుకు వీలున్నా అవసరమయితే తప్ప మహాపురుషులు ఇంతెందుకు శ్రీరాముడు వంటి అవతార పురుషులు సైతం తమ పుణ్యశక్తులను ధారపోయరు. 
గాలి, వాన, తుఫాను, అగ్ని ప్రమాదం వంటి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల, వాతావరణ మార్పుల వల్ల భాధింపబడని తత్త్వ శక్తిగా ఆకాశ తత్త్వం వెలుగొందుతుండటం వల్లే బ్రహ్మజెముడు చెట్టు ఆకాశ తత్త్వాన్ని ఉపయోగించటం ఆధ్యాత్మిక వింతే! తిరుజ్ఞాన సంబంధ మూర్తి నాయన్మార్లు, అప్పర్‌పెరుమాళ్‌ వంటివారు తాము వెళ్లే పలు గ్రామాలలో కరువు కాటకాలు ఏర్పడబోతున్నాయనీ ఈ నాడి రహస్యాల ద్వారా తెలుసుకుని అవసరమైనంత రక్షణ చర్యలు చేపట్టి ఆ గ్రామ ప్రజలను, జీవరాశులను కాపాడిన అద్భుతాలు మనకు తెలిసినవే.   

అమృత పర్షాన్ని కురిపిద్దాం 

ఇలా పంచభూత తత్త్వాలను ప్రతి జీవరాశి అర్థం చేసుకుని వాటిని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించిన అద్భుతమైన వివరాలను తెలుసుకున్నాం. అయితే ఈ తత్త్వాలు అన్నీ ఒక్కటిగా చేర్చుకుని ప్రజలకు సేవలు చేయడంలో ఉన్నత స్థానం కలిగి ఉన్నదే గార్దబమని ఉత్తమమైన సత్యం. 
ఈ పరమ సత్యాన్ని మానవుడి మనస్సు ఎలా అంగీకరించగలుగుతుంది? దీనికి సులువైన సమాధానమే గార్దబ వివాహం. ఏ ప్రాంతాల్లో గార్దబ వివాహం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుంది. ఎప్పుడు వర్షం కురుస్తుంది? పంచభూతాలకు అధిపతియైన ఇంద్రుడు ఆజ్ఞాపిస్తే, వరుణ భగవానుడు సంతోషంగా ఉన్నవేళ వర్షం కురవటానికి వీలు కలుగుతుంది. కనుక గార్దబాలకు వివాహం జరిపించిన తోడనే ఆ చోట వర్షం కురిస్తే దేవతలు సంతసించినట్లు నిర్ధారణ అవుతుంది కదా. పైగా గార్దబ వివాహం జరిగిన తర్వాత కురిసే వర్షంలో ఆరు చినుకులకు ఒక అమృతపు చినుకు చొప్పున పుడమిపై అమృతవర్షం కురుస్తుంది. సాధారణంగా కురిసే వర్షంలో వెయ్యి చినుకులలో ఓ చినుకే అమృతపు శక్తిని, జీవశక్తిని కలిగి ఉంటుంది. 

గార్దబం వద్దనున్న మరొక అత్యద్భుతం కరము పాలు. గార్దబపు పాల అమృత శక్తులను, జీవశక్తులను, మూలికా రహస్యాలను, చిరంజీవి తత్త్వాలను మాటలలో వర్ణించలేము. అయినా మనకు తెలిసిన పురాణ వైభవం ద్వారా దానిని కాసింత తెలుసుకుందాం.   

మీనాక్షి కళ్యాణం 

ఈ ప్రపంచంలో జరిగిన అత్యద్భుత కళ్యాణ వైభవం ఏది? సందేహమెందుకు ఎంబెరుమనార్‌ సోమసుందరేశ్వరుడికి మీనాక్షిదేవికి జరిగిన తిరు కళ్యాణమే ఇప్పటిదాకా ఏలోకమూ చూడని అద్భుత కళ్యాణ వైభోఘం. అంతటి అత్యద్భుతమైన కళ్యాణం ఇప్పటి దాకా ఎక్కడా, ఏ కాలంలోనూ జరుగలేదనడం అతిశయోక్తి కాదు. ఇకపై అలాంటి కళ్యాణవైభోగాన్ని ఎక్కడా చూడలేము. 
పూర్వం వివాహ వేడుకలలో వరుడి తరఫువారు విందునారగించిన తర్వాతే వధువు తరఫువారు విందారగిస్తారు. అదీ అనాటి పద్ధతి. ఆ ప్రకారం వరుడిగా వేంచేసే సోమసుందరేశ్వరుడి తరఫున విందారగించేందుకు ఎవరూ రాకపోవడంతో వధువు మీనాక్షి తండ్రి దిగులు చెందాడు. ఈ విషయాన్ని తన కుమార్తె మీనాక్షి దేవికి ఆయన తెలుపగా, ఆమె కాబోయే పతి వద్దకు వెళ్లి మొరపెట్టుకుంది. సకలజీవులను తల్లివలె కాపాడే ఆ మహేశుడు అమ్మవారి కోరికను పెడచెవిన పెడతారా? వెంటనే అక్కడున్న ఓ శివగణాన్ని ఆహ్వానించి వరుడి తరఫు విందారగించేందుకు పంపుతారు. 
వరుడి తరఫున విందారగించేందుకు బానకడుపు కలిగిన ఓ గుండోదరుడు పంక్తిలో కూర్చున్నాడు. అతడెలా ఉన్నాడంటే... పెద్దలంటూ వుంటారు కదా. 'ఆహా అత్తిపండు సైజులో ఓ M-ton bomb వచ్చి కూర్చున్నదిరా' అని. ఆ రీతిలోనే ఉన్నాడు మన గుండోదరుడు. చూడటానికి కాస్త బ్రహ్మరాక్షసుడిలా ఉన్నా అతడి వేషధారణ నియమనిష్టలు కలిగి మహాశివభక్తుడిలా ఉంది. ఆ భూతం పంచకచ్చం ధరించి, వంటిపై 36 చోట్ల విభూతి రేఖలు దిద్దుకుని, యజ్ఞోపవీతం ధరించి, తలపై వేలాడే పిలక, కంఠంలో రుద్రాక్షం సహితంగా విందారగించేందుకు వచ్చి కూర్చుంది. గుండోదరుడు కూర్చున్న పీట పొదిగై పర్వతమంత పరిమాణంలో టేకు కలపతో తయారై ఉంది. మీనాక్షి కళ్యాణంలో ప్రధానమైన వంటవాడు ఎవరనుకుంటున్నారు. కైలాసంలో ఉండే అగస్త్య ముని పరంపరకు చెందిన భక్తులే వంటలు తయారు చేసే బాధ్యతల్ని చేపట్టారు. అన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. మన గుండోదరుడినికి 3 లక్షల మంది వడ్డించారు. ఇదిగో అతడారగించిన విందు పదార్థాల వివరాలు:   

తిన్నది కొండంత 

8000 కోట్ల లడ్డూలు. ఒక్కొక్కటీ నేటి ఒలింపిక్‌ క్రీడల్లో ఉపయోగించే కాలి బంతి పరిమాణం కలిగినవి. 
18000 కోట్ల జిలేబీలు 
3800 కోట్ల జాంగ్రీలు 
88 లక్షల అండాల నిండుగా అన్నం 
ఒక లక్ష అండాల సాంబారు 
800000 అండాల కొబ్బరి అన్నం 
నాలుగు రకాల మజ్జిగ. ఒక్కో రకం లక్ష అండాల చొప్పున 
ఉదాహరణకు కొన్ని ఆహార పదార్థాల కొలతలు, వివరాలు ఇవ్వబడింది. వాస్తవానికి గుండోదరుడికి 360 రకాల ఆహార పదార్థాలు వడ్డించారు. ఇవన్నీ ఆరగించడానికి గుండోదరుడికి పట్టిన సమయం కేవలం 30 నిమిషాలే. 
కళ్యాణం కోసం వడ్డించిన అన్ని రకాల ఆహార పదార్థాలు మిగలకుండా ఆరగించేశాడు. చివరకు వైగనదిలోని నీటిని తాగి గుండోదరుడు విందు ముగించాడని మనకందరికీ తెలిసిన సంగతే కదా. 
ఇంతటి బ్రహ్మాండమైన ఆహారపదార్థాలను తయారు చేయడానికి అవసరమయ్యే పదార్థాలు గురించి మన సిన్నోడు కౌపీనధారియైన పెద్దాయనను అడిగినప్పుడు 'నాయనా ఆ కాలంలోని లెక్కలన్నీ ఈ కాలపు మనిషికి తెలియవురా. మదురైలోని స్వర్ణతామర పుష్కరిణిలో ఒక తామర పువ్వు రేకుతో భారతదేశాన్నే కొనవచ్చుననుకో. అంతేకాదురా సెన్మగపాండియన్‌ దరుమికి బహుమతిగా ఇచ్చిన కాసులతో ఇప్పుడు సంపన్న దేశంగా చెబుతున్న అమెరికా దేశాన్నే కొనేయవచ్చుననుకో. ఇక తక్కిన విషయాల సంగతేమిటో నీవే అర్థం చేసుకో నాయనా' అంటూ నవ్వుతూ సిన్నోడు వెంకటరామన్‌కు వివరించారు. 
పైన పేర్కొన్న ఆహార పదార్థాల జాబితాలోని దైవీక రహస్యాలు కోకొల్లలుగా ఉండగా అందులో ఒకే ఒక అంశం గురించి పరిశీలిద్దాం. సాధారణంగా ఒకడు ఐదు కార్లు కలిగి ఉంటే, ఎందుకతడు ఐదుగురు అనుభవించాల్సిన సుఖాలన్నీ ఒక్కడే అనుభవిస్తున్నాడని భావిస్తాం. ఇది న్యాయసమ్మతం కాదు. అధర్మం అని కూడా భావించటం సహజమే. మరి అలాంటప్పుడు ధర్మవాహనమైన నందిదేవుడైన ఈశ్వరమూర్తి సమక్షంలో ఇలా కోటానుకోట్ల ఆహార పదార్థాలను ఒకే ఒక భూతం ఆరగించడం అధర్మమవుతుంది కదా! ఈ దైవీక లీలలో దాగిన రహస్యం తెలుసుకుంటేనే మన అయోమయాలు తొలగుతాయి. 
పొట్టిదైన ఆకారానికి దేనినైనా ఉదాహరణగా చెప్పగలం. కాని శ్రీఇడియాప్ప సిద్ధులు అత్తి పండు పరిమాణం అని చెప్సాల్సిన అవసరం ఏమొచ్చింది? అత్తిపండు పూసిన చందాన అనే నానుడి కూడా ఉంది. అంటే అత్తి పండు పూయడం చాలా అరుదైన విషయం. అత్తికాయను తప్ప అత్తి పూవును చూడలేం. అదే విధంగా ఆ భూతం తిన్నది మాత్రమే మనకు తెలుసును కాని ఆ ఆహార పదార్థాలన్నీ ఎక్కడికి చేరాయో ఎవరికైనా తెలుసునా? అది సోమసుందరేశ్వరుడికి మీనాక్షి అమ్మవారికి మాత్రమే తెలిసిన దైవీక రహస్యం. 

తెన్కాశి శివాలయం

పెళ్లికోసం చేసిన వంట పదార్థాలన్నీ గుండోదరుడే ఆరగిస్తే పెళ్లికి వేంచేసినవారి పరిస్థితి ఏమిటి? వారు భోంచేయకుండా పస్తులున్నారా? దానిని గురించి ఆత్మవిచారం చేసి చూస్తే పెళ్లికి వచ్చిన అన్ని కోట్ల జీవరాశులూ కేవలం 30 నిమిషాలలో భోంచేయడానికి దేవదేవేరీలు నిర్వహించిన లీలావిశేషమే ఈ గుండోదరుడి విందారగింపు అని అర్థమవుతుంది. 
కనుక గుండోదరుడు ఆరగించిన అన్ని పదార్థాలు అమ్మవారు మరుగుపరచబడి మీనాక్షిదేవి శక్తి తత్త్వంతో కలిసి అమృత శక్తులుగా అందరికీ వడ్డించారు. ఇది చెవి పోగులు కలిగిన ఈశుడు అందించిన జ్ఞానక్షీర విందు. ఆహా ఎంతటి అద్భుతమిది! ఇందులో మరొక దైవీక అద్భుతమూ జరిగింది. బీజాక్షర సవ్వడులలో ఐంకారం చాలా శక్తివంతమైనది. మన వెంకటరామస్వాములు తమిళంలో గాయత్రీ మంత్రాన్ని అందించినప్పుడు 
ఐం హ్రీం క్లీమ్‌ 
ఎవరు మన మేధస్సును ప్రేరేపిస్తారో ఆ జ్యోతి దేవుని మహోన్నత జ్యోతిని ధ్యానించెదము గాక! అంటూ ఐంకార బీజాక్షర శక్తిని సమ్మిళితం చేసి సమర్పించారు. గుండోదరుడు చివరగా వైగై నదీ తీర్థాన్ని సేవించాడు కదా! వైగై అనే పదంలో రెండు ఐంకార బీజాక్షరాల శబ్దాలతోపాటు వక్రమం అక్షరమము ఐక్యమై ఉండటంతో ఇది అద్భుతమైన అమృతశక్తులను పుట్టిస్తాయని అమృతవాక్కు తెలిపే రహస్యాలలో ఒకటి. అత్తికాయలో గుట్టుగా వడ్డించబడినది ఈ అమృతశక్తులే అని మీకిప్పుడు సులువుగా అర్థమవుతుంది. 
సిద్ధుల భాషలో, ఒక అణుబాంబును వేస్తే అందులో లక్ష మంది మృతి చెందడం గొప్పదనం కాదు. ఒక అణుబాంబును వేస్తే అందులో లక్ష బస్తాల వరిధాన్యం పండాలి. అదే గొప్పదనం అని చెబుతారు. ఇక్కడ M-ton bomb ఆకారంలో వచ్చిన ఓ చిన్న భూతం కోటానుకోట్ల మంది అతిథులకు భోజనం వడ్డించే అద్భుత కార్యాన్ని 30 నిమిషాలలో చక్కగా నెరవేర్చిందంటే అందులో ఆ మహేశుడి పాత్ర లేకుండా ఉంటుందా? ఆ దేవదేవుడికి కాక మరెవ్వరికి ఇది సాధ్యం? 
ఇప్పుడు ప్రారంభించిన చోటుకే వద్దాం. మీనాక్షి కళ్యాణానికి గార్దబ క్షీరానికి ఏమిటి సంబంధం? ఉన్నాములై అమ్మవారిగా అనుగహ్రించే పరమేశ్వరిదేవీ అమృత శక్తులు మీనాక్షి కళ్యాణంలో అత్తికాయలో దాగి మెరిసాయి. గార్దబ క్షీరంలో అందరికీ ఎరుక అయ్యేలా వర్ణాలు మెరిసాయి. అందువల్లే లోకంలో ఏ పదార్థానికి లేని మూలికా శక్తులు, అమృత శక్తులు, చిరంజీవి శక్తులు గార్దబ క్షీరంలో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రపంచ సుందరిగా వెలుగొందిన క్లియోపాట్రా గార్దబ క్షీరంతో తన దేహంలోని అవయవాలను రోజూ మసాజ్‌ చేసుకోవడం వల్లే జీవిత పర్యంతమూ తన యౌవ్వనపు బిగుతులు సడలకుండా అందంగా కనిపించారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. 
గార్దబ క్షీరాన్ని పితికిన వెంటనే ఉపయోగించాలి. లేకుంటే మూలికల గుణం పూర్తిగా మారిపోతుంది. వీలయితే గార్దబ క్షీరాన్ని పౌడర్‌గా చేసుకుంటే చాలా మంచిది.   

గార్దబం మోస్తున్నదేమిటి ? 

వీటన్నింటికంటే చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక గుణం, శక్తి గార్దబానికి ఉన్నాయి. అవేమిటో తెలుసా? జ్ఞానులకు సైతం భయం కలిగించే పవిత్ర కార్యం, యోగులును సైతం బెదరించే భాద్యత. మానవుల కర్మ భారాలను మోసే ఆధ్యాత్మిక కార్యం. ఇది అరుదుగా అదీ ఉన్నత స్థితిని కలిగిన జ్ఞానుల వద్దే చూడగలం. అయితే గార్దబంగా పుట్టిన వెంటనే అది కర్మను మోసి, కర్మను పారద్రోలి మానవులను కాపాడుతుంది. దీనికి భగవంతుడు వాటికిచ్చిన కర్మ శుక్ర శక్తులే కారణం. ఈ కర్మ శుక్ర శక్తుల బలిమి చేతనే గార్దబాలు మానవుల కర్మపు మూటలను సునాయాసంగా మోసి కర్మలను తొలగించే సత్కార్యాం చేస్తున్నాయి. 
మురికి కర్మలను ఎవరు మోసినా అది అద్భుతమైన దైవీక కార్యమే అవుతుందనటంలో సందేహమే లేదు. కనుకనే మురికి దుస్తుల మూటలను మోసే రజకుడు ఎదురొస్తే శుభశకునంగా భావిస్తున్నాము. పైగా పలువురి ఇళ్లల్లో జరిగే శుభకార్యాల సందర్భంగా రజకులకు మంగళకరమైన వస్తువులు, దక్షిణాది తాంబాలూను సమర్పించే ఆచారాలు నేటికి పాటిస్తున్నారు. అంతే కాదు ఈ రహస్యం తెలిసిన పలువురు ధనవంతులు తమ కుటుంబ సభ్యులెవరికైనా పెళ్లి కుదిరితే ఆ పెళ్లికి ముందు ఓ రజకుడిని ఉచితంగా పెళ్లి చేయించి ఉచితంగా సారె వస్తువులను దంపతులకు అందించి సత్కరిస్తుండం మీకు తెలిసి ఉండవచ్చు. ఇలాంటి పెళ్ళిళ్ల వల్ల ఎన్నో వైవాహిక దోషాలు తొలగి ఆ స్థలాల్లోని దుష్టశక్తులు సైతం తరిమివేయబడతాయన్నది ఆధ్యాత్మిక రహస్యం. 
ఇప్పుడు మీకో సందేహం రావచ్చు. ప్రపంచంలో మనచుట్టూ పశువులు, ఏనుగులు, శునకాలు, గుర్రాలు అంటూ ఎన్నో మృగాలు ఉన్నప్పుడు గార్దబానికి మాత్రమే ఎందుకు వివాహం చేయడం? కంప్యూటర్‌ ఇంజనీర్‌, మెకానికల్‌ ఇంజనీర్‌ అంటూ వేలకొలది సంఖ్యలో మనచుట్టూ ఇంజనీర్లు ఉన్నా ఓ ఇంటిని నిర్మించాలంటే దానికి సివిల్‌ ఇంజనీర్‌నే కదా పిలుస్తాము. అదేరీతిలో లోకంలో ఎన్నో జంతువులు ఉన్నా శుక్రశక్తి కలిగియున్న జంతువు గార్దబమే. మానవుల వివాహాలకు దోహదపడేది శుక్ర గ్రహమే కదా? ఆయనే కదా కళత్ర నాయకుడు. 

ఐందరువు కుట్రాలం

పైగా శుక్రశక్తులు కలిగిన జంతువులు ఎన్నో ఉన్నా 'కర్మ' శుక్రశక్తిని కలిగి ఉంటున్న జంతువు గార్దబం మాత్రమే. కర్మశుక్ర శక్తి కలిగి ఉన్న జంతువే ఇతరుల కళత్ర దోషాలను, కర్మ ఫలితాలను మోసి కర్మల దోషాలనుండి నివారణం కలిగిస్తాయి. ఇతరుల కర్మఫలితాలను తొలగించేందుకే భగవంతుడి చేత సృష్టింపబడిన మృగం లేదా మృగదేవత గార్దబమే. కర్మ ప్రభావాలు మాయం కావటమే కాదు కర్మశుక్ర శక్తులు లక్ష్మీకటాక్షాన్ని వర్షిస్తాయన్నది మరొక అత్యద్భుత అనుగ్రహం. సాధారణంగా శుక్రశక్తుల కొరత వల్ల మేగ రోగాలు కలుగుతాయి. గార్దబాల వివాహాలు ఆ మేఘరోగాలను తొలగించగల చక్కటి మందులవుతాయి. 
పలు మేగ రోగాలకు నవీన ఆంగ్ల వైద్య పద్ధతిలో మందులు లేవు. అవి ఆయుర్వేద వైద్యానికి మాత్రమే కట్టుబడతాయి. అలా ఆయుర్వేద, సిద్ధ వైద్యానికి కట్టుబడని కఠినమైన మేగ రోగాలు సైతం గార్దబ వివాహం ద్వారా పటాపంచలవుతాయంటే గార్దబాల దైవీక మహత్యాన్ని మాటలలో ఎలా వర్ణించగలం. 

రోగ నివారణ మాత్రమే కాదు వ్యాపార రంగాలలోను గార్దబ పూజ అద్భుత ఫలితాలను అందిస్తుంది. కృత్రిమ పరికరాల వ్యాపార ప్రగతికి గార్దబ పూజ దోహదపడుతుంది. ఉదాహరణకు artificial diamonds, covering jewellery, artificial limbs, కట్టుడు దంతాల సెట్ల వంటి వ్యాపారాల అభివృద్ధికి దోహదపడుతుంది. అదే విధంగా substitute, replacement part industries రంగాలలో ఉన్నవారి అందులో భాగస్వామ్యం కలిగి ఉన్న వ్యాపారులు గార్దబ పూజలు చేసి వృద్ధి చెందగలరు. 
భవిష్యత్‌లో సంపన్న దేశాలు, సంపన్నులు బంగారాన్ని దాచిపెట్టి వాటి ధరలు విపరీతంగా పెరిగేలా చేస్తారని సిద్ధుల అభిప్రాయం. దీనితో మధ్య తరగతి వ్యాపారులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు. అలాంటివారు గార్దబ పూజల ద్వారా రాబోవు కష్టాలనుండి గట్టెక్కగలుగుతారు. తమ వ్యాపారాలు అభివృద్ధి చెందటానికి అనువైన మార్గాలను పొందుతారు.   

గార్దబ మాంసం వద్దు 

మనిషి మేధస్సుకు అందనంత అనుగ్రహశక్తులను, కర్మఫలితాలను నిర్మూలించే శక్తులను గార్దబాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని నియమనిష్టలతో పూజించటానికి బదులుగా వాటిని మట్టుబెట్టే దుర్గుణం ఈ కలియుగంలో చోటుచేసుకోవడం అత్యంత విచారకరమైన విషయం. గార్దబాన్ని పెంచి పోషించే సద్గుణం లేక పోయినా ఫరవాలేదు, కాని దాని మాంసాన్ని ఆరగించి ఆకలి తీర్చుకోవడం మానుకుంటే మంచిది కదా! 
గార్దబ మాంసం వీర్యానికి చేటు కలిగిస్తుంది. గార్దబ మాసం తింటూ ఉంటే వీర్యశక్తిని కోల్పోయి పలు రోగాల బారినపడి వైవాహిక జీవితం నరకంగా మారుతుంది. దంపతుల మధ్య ఐకమత్యం ఉండదు. జీవితమే పోరాటంగా మారుతుంది. యోని క్యాన్సర్‌, అంగంపై క్యాన్సర్‌ వంటి చెడు రోగాలు కలుగుతాయి. ఈ రోగాలు ఎలాంటి మందులకు చికిత్సలకు నయం కావు. ఈ రోగాల వల్ల కలిగినే అవమానం, వేదనలు చెప్పనలవి కాదు. 
చిన్నపిల్లలు, పెద్దలు అజ్ఞానం వల్ల వేలాకోళంగా గార్దబాలను వేధించడం కద్దు. దయచేసి ఇలాంటి విపరీతపు ఆటలకు పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పెద్దలు హితవు చెబుతున్నారు. గార్దబాన్ని వేధిస్తే వైవాహిక ఆటంకాలు కలుగుతాయి. వయస్సు పైబడిన తర్వాత వివాహయోగం కలుగుతుంది. అశాంతితో కూడిన వైవాహిక జీవితం దుఃఖాలు కలుగుతాయి. 

రావణుడి ద్వారం తిరుపైంజీలి

ఇంతకు మించిన వేదన ఏమిటంటే ఈ జన్మలో గార్దబ మాంసాన్ని తినేవారు మరు జన్మలలో రాక్షసులుగా జన్మిస్తారనేది సృష్టి నియతి. అసురులలో క్రూరమైన స్థితే ఈ రాక్షస జన్మ. ఇది అవసరమా? 
గమనిక ! AIDS కు AID లేదు 
మనకు తెలిసిన AIDS అనే క్రూరమైన వ్యాధికంటే బాధాకరమైన మేగ వ్యాధులు ఉన్నాయి. AIDS కంటే క్రూరమైన 3000 వ్యాధులు ఉన్నట్టు సిద్ధులు చెబుతుంటారు. వాటికి సెమ్మేక గ్రంథి అని పేరు. గార్దబ మాంసాన్ని తిని ఊదితేనే ఇలాంటి సెమ్మేగ వ్యాధులు కలుగుతాయంటే ఇక దానిని తిన్నవారి పరిస్థితి ఏమిటో భగవంతుడికే ఎరుక! సెమ్మేగ వ్యాధులు AIDS కంటే వందరెట్లు బాధలను శారీరకంగాను, మానసికంగాను కలిగిస్తాయని సిద్ధపురుషులు హెచ్చరిస్తున్నారు. ఏ ఔషధాలకు ఈ సెమ్మేగ వ్యాధులు నయం కావన్నదే వాస్తవం. 
దీనిని నుండి మనకు తెలిసే నీతి ఏమిటి? భగవంతుడు మానవుడి సుఖజీవనం కోసం, ఆహారం కోసం ఎన్నో రకాల కాయలు, పండ్లు, ఆకు కూరలు, జంతవులు, పక్షులను సృష్టించారు. దానిని వదలిపెట్టి దోష నివృత్తి కోసం సృష్టించబడిన గార్దబం వంటి జంతువుల మాంసాన్ని మానవుడు తింటే తీవ్రమైన శాపానికి గురవుతాడని పెద్దలు చెబుతుంటారు. కనుక ఎట్టి పరిస్థితులలోను పశువులు, ఎద్దులు, గార్దబాలు వంటి దోష నివృత్తి జంతువుల మాంసాన్ని తినటాన్ని, వికయ్రించటాన్ని, ఆ జంతు సంబంధిత వ్యాపారం చేయటాన్ని మానుకోవడమే మంచిదని పెద్దలు హితవు చెబుతున్నారు. 
సాధారణంగా ఒకరి జాతకంలో దశమస్థానంలో మాంతి, గుళికుడు ఉంటే వారు కొత్త అన్వేషణలకు దోహదం చేస్తారు. కనుక అలాంటివారు తమ కొత్త అన్వేషణలతో కీర్తి ప్రతిష్టలు పొందాలన్నా, వాటి వల్ల ప్రజలకు మేలు చేయాలన్నా గార్దబాన్ని పూజించడం శ్రేయస్కరం. గార్దబ చిత్రాలను, విగ్రహాలను ఆరాధించడం మంచింది. పటాలకు, విగ్రహాలకు silver coating చేస్తే చాలా మంచిది. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ రంగాలకు చెందినవారు ఇలాంటి ఆరాధనలు, పూజలు చేస్తే సత్ఫలితాలను పొందగలుగుతారు.   

కుసుమ్నాథ్ నియమాలు

గార్దబాల కులగురువుగా పూవాలూరులో జీవసమాధి పొందిన రుద్ర ఫల్గుణి సిద్ధులు కీర్తింపబడుతున్నట్లుగానే గార్దబాల అనుగ్రహ దేవతగా గంధర్వ దేవత కుసుమ్నాధ దేవి పూజింపబడుతోంది. కళత్రదోషాలను తొలగించి, వైవాహిక ఆటంకాలను తొలగించి, మాంగళ్య శక్తులను వృద్ధి చేసి సద్గతిని అనుగ్రహించే దేవతే కుసుమ్నాధ దేవి. కుసుమ్నాధ నియమాలు (Kusumnath regulations) అంటూ కొన్ని వ్రత నియమాలు కూడా ఉన్నాయి. 
1. ప్రతి రోజూ 3 లిటర్ల నీటిని బాగా మరగకాచి చల్లార్చి తాగండి. 
2. కృష్ణపక్షపు శనివారాల్లో ఆముదం తాగడం 
3. రోజూ వేకువజామునే చన్నీటిలో స్నానం చేయడం 
4. రోజూ 108 గుంజీలు తీయడం (కుశా పద్ధతి, వాస్తు గుంజీలు తీయడం మంచిది) 
5. వారానికి ఒకసారి గార్దబానికి క్యారెట్‌, పచ్చ బఠాణీలు, నూల్‌కోల్‌ వంటి కాయగూరలు తినిపించాలి. 
ఈ ఐదు నియమాలను కుసుమ్నాధ నియమాలు అని పిలుస్తారు. ప్రశాంత చిత్తాన్ని చేకూర్చే ఈ నియమాలు ఏ దేవుళ్లను పూజించేవారైనా పాటించవచ్చును. ఈ నియమాలు పాటిస్తే దేహారోగ్యం, మానసిక ప్రశాంతత కలిగి ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధిని సాధించవచ్చు. 
కుసుమ్నాధ దేవి అనుగ్రహం పొందదలచినవారు పైన పేర్కొన్న నియమాలను పాటించి ప్రతినెలా మూలా నక్షత్ర దినాన తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ మార్గంలో రమణాశ్రమం సమీపంలోని ఏకలింగ ముఖ దర్శనం చేసుకోవాలి. ఈ దర్శనంతో వారున్న రంగాలలో అభివృద్ధిని సాధించగలుగుతారు.   

గార్దబ వివాహ వైభవం 

గార్దబ వివాహాన్ని ఎలా జరపాలి? గార్దబ వివాహాలు ఎక్కడ జరిపినా సత్ఫలితాలు కలుగుతాయి కాని దైవీక క్షేత్రాలు, సన్నిధులు, మహాపురుషులు జీవసమాధి ప్రాంతాలతోపాటు ఫల్గుణి సిద్ధులు అనుగ్రహించే వూవాలూరు నదితీరం వంటి స్థలాలలో శుక్రవారం, భరణి నక్షత్రదినాలలో, తిరువాదిరై నక్షత్ర దినాలో ఆడమగ గార్ధబాలను పూర్వాభిముఖంగా (అంటే తూర్పు దిక్కుగా) నిలబెట్టి పసుపు, కుంకుమ, జవ్వాదు బొట్టుపెట్టి, శుభ్రమైన పత్తితో లేదా పట్టుతో తయారైన ధోవతులు, చీరలు ధరింపచేసి, సువాసనలతో కూడిన పూలమాలలతో అలంకరించి ఆ గార్దబ దంపతుల ఎదుట సాష్టాంగంగా మోకరిల్లి నమస్కరించి వాటి ఆశీస్సులు పొందాలి. ఇదే సరైన పద్ధతిలో జరిగే గార్దబ వివాహ వైభవం. 
వడ శుక్రయాగం, పరవెలి శుద్ధిదారణం వంటి విస్తార సాంప్రదాయ పద్ధతులలోను గార్దబ వివాహాలను నిర్వహించవచ్చు. అయితే సద్గురువుల అనుగ్రహం పొందిన మీదటే ఈ పద్ధతులలో వివాహాలు జరిపించడం శ్రేయస్కరం. వివాహానంతరం గార్దబ దంపతులకు కడుపార భోజనం పెట్టాలి. 
ఈ వివాహాలను ఆలయంలో దైవ సన్నిధులలో జరుపటం మరీ మంచిది. ఇలా దైవ సన్నిధులలో మాంగల్యధారణ చేసేటప్పుడు గార్దబ దంపతులను నిలబెడుతున్నట్లయితే వాటిని తూర్పువైపు చూచేలా నిలబెట్టాలి. కూర్చుని మాంగల్యధారణ చేయదలిచితే ఉత్తరాభిముఖంగా ఆశీనులై వివాహవేడుకలు జరుపటం మంచిది. వీటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక తాత్పార్యాలు చాలా శక్తివంతమైనవిగా ఉండటంతో సద్గురువు సలహాలు తీసుకుని జరపాలి. 
గార్దబ వివాహం పూర్తయిన తర్వాత వర్షం కురిసే అవకాశం ఉంది. కనుక ఆ అమృత వర్షపు చుక్కలను కొబ్బరి ఆకు లేదా మట్టి కుండలో సేకరించి దైవ మూర్తులకు అభిషేకం చేసి, ఆ అభిషేక తీర్థాలను ఇతర దంపతులకు ఆశీర్వాద తీర్థంగా చల్లుకోవాలి. తక్కినవారు దైవ ప్రసాద తీర్థంగా పుచ్చుకోవాలి. 
ఈ నారికేళ జలా అభిషేకం వెనుక ఆసక్తికరమైన ఇతిహాసపు సంఘటన కూడా ఉంది.   

రావణుడు పొందిన కానుక

లంకాధీశుడైన రావణుడు ఓ మానవుడి వల్ల తనకు మరణం సంభవిస్తుందని ముందుగానే జ్యోతిషపండితులు, ఋషులు ద్వారా తెలుసుకున్నాడు. ఆ విషయంగా దిగులు చెందిన రావణుడు దాని నివారణకు ఏదైనా పరిహారం లభిస్తుందా అని భూలోకంలోని పలు పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలు నిర్వహించాడు. ఎందుకంటే ఈ పుణ్యభూమిలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభించే వీలుండటమే. పలు క్షేత్రాలు దర్శించిన మీదట చివరగా తిరుపైంజీలికి చేరుకున్నాడు రావణుడు. చాలా ప్రసిద్ధి చెందిన శివస్థలం. నవగ్రహమూర్తుల ఆవిర్భావానికి ముందుగానే ఏర్పడిన పుణ్యస్థలమిది. 

ఇడుంబను సన్నది తిరుమల

ప్రస్తుతం రావణ ద్వారంగా పిలువబడే ప్రవేశద్వారాన్ని దాటుకుని రావణుడు ఆలయంలో అడుగుపెట్టిన తోడనే స్వామివారు లేచి నిలిచి సాదరంగా స్వాగత సత్కారాలు చేశాడు. శరణన్న భక్తుడే ఉత్తముడని సిద్ధుల వాక్కుకు ప్రతీకగా సిద్ధకుల నాయకుడు మాత్రమే మంచి మార్గాన్ని చూపగలడు కదా. స్వామివారి స్వాగత సత్కారాలకు మురిసిపోయాడు రావణుడు. అప్పటివరకు తనను పట్టిపీడించిన మరణభయం క్షణాలలో మాయమైంది. 
స్వామివారు ఉపశమనపు మాటలతో రావణుడిని ఓదార్చారు. 'రావణా కేవలం ఓ మానవుడి వల్ల మరణం కలుగుతుందని చింతపడవద్దు. నీవనుకున్నట్లు శ్రీరామచంద్రుడు సామన్య మానవుడు కాదు సాక్షాత్తు మహావిష్ణువే నీ పూర్వ జన్మపు నియమం ప్రకారం నిన్ను పరమపదానికి చేర్చేందుకు ఈ పుడమిపై శ్రీరాముడిగా జన్మించాడు. ఇది ఎవరికీ లభించని మహా భాగ్యం. పైగా నీవు అంతిమ దశను చేరుకునేలోపున నీ కీర్తి ప్రతిష్టలు లోక ప్రసిద్ధమవుతాయి. అంతే కాదు నీకు ఓ అద్భుత వీరుడు కుమారుడిగా జన్మించనున్నాడు. ఆ దేవేంద్రుడినే జయించగల పరాక్రమశాలిగా ఉంటాడు. కనుక అతడికి మేఘనాధుడు అనే పేరుపెడతావు. భూలోకంలో రాముడి పేరు నిలిచి ఉండేదాకా నీ పేరు ప్రతిష్టలు వెలుగొందుతూనే ఉంటాయి.'' అన్నారు. 
స్వామివారి ఓదార్పు మాటలు రావణుడిని ప్రశాంత చిత్తుడిగా మార్చివేశాయి. రావణుడంతటి మహావీరునికి ఓ పరాక్రమశాలి పుట్టడం అంటే మాటలా? ఇంతకు మించిన దైవానుగ్రహం ఏముంటుంది? 
రావణుడు చేతులు జోడించి 'మహాత్మా మీ కృపకటాక్షాలకు మారుగా ఎలాంటి ప్రత్యుపకారం చేయాలో తెలియకున్నాను. మీరన్నట్లు పరాక్రమవంతుడైన కుమారుడి కోసం ఏవైనా తపస్సు యాగాలు చేయాలో తెలుపండి' అంటూ వేడుకున్నాడు. 

'రావణా! దేవేంద్రుడితో తలతూగే పరామ్రశాలిని కుమారుడిగా పొందాలంటే ఆ దేవేంద్రుడిని సంతోషపెట్టేలా ఓ సత్కార్యం నిర్వహించాలి. తపమే ఈ యుగంలో శ్రేష్టం. ఆ తపం లాంటి ఓ సత్కార్యం నిర్వహిస్తే చాలు! గార్దబ వివాహం నిర్వహిస్తే ఇంద్రుడు సంతసిస్తాడు. దాని ఫలితంగా ఇంద్రసమానుడైన కుమారుడు నీకు జన్మిస్తాడు' అని స్వామివారు వరమిచ్చారు. 
ఆ స్వామివారి అనుజ్ఞ ప్రకారం రావణుడు ఆ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద కళ్యాణ వేదికను ఏర్పాటు వేద పండితులచే బ్రహ్మాండమైన యాగలు నిర్వహించి అరటి మామిడి తోరణాలతో వేదికను అలంకరింపజేసి ఓ గార్దబ జంటకు వైభవంగా కల్యాణం జరిపించాడు రావణుడు. కల్యాణం ముగిసిన తర్వాత ఆ జంటను ముత్యాలపల్లకిలో ఆలయ ప్రదక్షిణ చేయించి తాను ప్రదక్షిణ చేశాడు. ఈ వివాహవేడుకలకు ఇంద్రాది దేవతలు మురిసిపోయారు. దంపతులపై, రావణుడిపై పూలవర్షం కురిపించారు. అమృత వర్షమూ కురిసింది. 
ఆ అమృత వర్షపు చుక్కలను కొబ్బరి పాలలో సేకరించి జ్ఞీలినాధుడికి అభిషేకం నిర్వహించి ఆ అభిషేక ప్రసాదాన్ని రావణుడు తన సతీమణి మండోదరికి అందించాడు. ఆ తర్వాత జరిగిన ఆ ఇతిహాసపు సంఘటనలు మనకందరికీ తెలిసినవే! అప్పుడు వాడుకలోకి వచ్చినదే ఈ కొబ్బరిపాల అభిషేకం! 
జీవితంలో ఒక్క పర్యంతమే సంభవించే మరణం గురించి మానవుడు పదే పదే తలచుకుంటూ భీతిల్లటం ఆనవాయితీగా మారింది. ఇలా మరణభయంతో ఉన్నవారు తిరుప్పైంజీలి తిరుక్షేత్రంలో గార్దబ వివాహం చేయిస్తే మరణభయం తొలగటమే కాకుండా ఇంద్రజిత్తు వంటి పరాక్రమంతో కూడిన సంతాన భాగ్యమూ ప్రాప్తింపచేస్తాడు ఆ స్వామివారు. రావణుడికి మేగనాధుడు జన్మించడానికి ముందు ఏ లోకంలోనూ ఆ పేరు కలిగినవారెవరూ లేరు. 
ఇక కొబ్బరి పాల మహత్యం ఎలాంటిది? కొబ్బరిని ఈ భూలోకానికి తీసుకువచ్చినది పరశురాముడు. పరశురామ అవతార లక్ష్యాలలో ఒకటి తన తపోశ్శక్తిని శ్రీరామచంద్రమూర్తికి అందించటం. అయితే రామచంద్రమూర్తి సర్వలోక చక్రవర్తి. ధనుర్వీరుడు. అలాంటి అజేయమూర్తికి తన తపోబలాన్ని యాచకంగా ఇవ్వగలడా? దీనికోసమే ఆ అవతార మూర్తి ఓ పధకం రూపొందిస్తాడు. ఆ మేరకు తన ధనుస్సును విరువమని శ్రీరాముడికి సవాలు విసరడం, ఆ రాముడు దానిపై విల్లునెక్కుపెట్టి విరచడం, ఓటమిని అంగీకరించి ప్రత్యుపకారంగా పరశురాముడు తన తపోబలాన్ని సమర్పించడం మనకందరికీ తెలిసిన విషయాలే! 
ఇలాంటి ఘటనే రావణుడి జీవితంలోను జరిగింది. గార్దబ వివాహం నిర్వహించి ఇంద్రుడి పరిపూర్ణ అనుగ్రహం పొందిన రావణుడికి మేఘనాధుడు కుమారుడిగా జన్మించాడు. ఆ మేఘనాధుడు దేవేంద్రుడినే ఓడించాడు. దేవేంద్రుడు అతడి పరాక్రమాన్ని మెచ్చుకుని 'ఇంద్రజిత్తు' అనే బిరుదును ప్రదానం చేస్తాడు. ఇంద్రజిత్తు అంటే ఇంద్రుడిని జయించినవాడు అని అర్థం. మేఘనాధుడికి దేవేంద్రుడు ఇంద్రజిత్‌ అనే బిరుదును ప్రదానం చేసేటప్పుడు ఆ సంఘటనకు సాక్షీభూతంగా నిలిచినది ఈ నారికేళ పాత్రమే! 

ఓం గురువే శరణం

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam