మంచి మనస్సే అందించును సుగంధం !

ఓం వల్లభ గణపతియే నమః 
ఓం శ్రీ అంకాళ పరమేశ్వరీ నమః 
ఓం గురువే శరణం 

పువ్వులు ప్రసాదించే పునీతాలు

పువ్వులు అని చెబితేనే వాటి సువాసన, మృదుత్వం, రంగులు సృష్టి యొక్క అత్యద్భుతాలు స్ఫురణకు వస్తాయి. ప్రస్తుతం మానవసమాజంలో పవిత్రత ఎంత వెదికినా కనిపించని వస్తువుగా ఉంటోంది. అయితే పువ్వులు పవిత్రవనాలుగా, పరిశుద్ధతను కలిగి విశ్వమంతటా మెరుస్తున్నాయి. పువ్వులన్నీ త్యాగ దీపాలే. ఏ పూల మొక్క కూడా తన కోసం పువ్వులను పుష్పించడం లేదు. అన్నీ ఇతర జీవుల కోసమే ఉంటున్నాయి. ఎవరూ కోయకున్నప్పటికీ పువ్వులు నేలరాలినా అవీ భూమిలో ఎరువుగా మారుతోంది. తన సువాసనలతో పుడమిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాయి. 
మంత్రాలవల్ల, మాయల వల్ల, తాంత్రిక శక్తుల ద్వారా సాధించలేనివాటిని పువ్వులతో సులువుగా సాధించగలము. ఎంతోమంది సిద్ధపురుషులు పువ్వులకు సంబంధించిన దైవీక రహస్యాలెన్నింటినో మనకు అందించారు. 
వీటిని అగస్త్యకుల దీపిక సద్గురు వెంకటరామ స్వామిగారు సేకరించి అమృతంలా మనకు అందించారు. వీటిని తెలుసుకుని ఉపయోగించి దైవానుగ్రహం పొందుతారని విశ్వసిస్తున్నాము. 

సిద్ధు సిద్థర్ వివరణ

సిద్ధు అనేది అందరి వద్దా ఉన్న శక్తియే. సిద్ధులు అన్నింటినీ సాధించగలుగుతున్నారు. మనం సాధించలేకపోతున్నామే ఎందుకని? 
సిద్ధులు తమ చింతనలను దేవునిపైనే ఉంచి ఏకీకృతమైన మనస్సుతో ఆధ్యాత్మిక శక్తిని పొందుతున్నారు. అయితే సామాన్య మానవుల సంగతి? తమకు నచ్చనివారిని ద్వేషిస్తూ, దురాశలను పెంచుకుని, అక్రమ మార్గాలలో సంపాదిస్తూ, లౌకిక సుఖాలను పొందటం కోసం సిద్ధశక్తిని, చింతనలను దుర్వినియోగపరచుకుంటూ వారిలోని సిద్ధశక్తిని కోల్పోయి వేటినీ సాధించలేకపోతున్నారు. ఈ పరిస్థితులలో పువ్వులతో సులువైన పద్ధతిలో సిద్ధశక్తిని పెంపొందించుకునే సులువైన మార్గాలున్నాయి. నిస్వార్థపు తలంపులతో ఇతర జీవరాశులకు సేవలందించి మన చింతనలను దైవంపై మళ్లిస్తే సిద్ధశక్తులు నిరుపయోగంగా కాకుండా వాటిని పెంపొందిస్తాయి. సిద్ధులకు పేర్లు ఉండవు. కుప్పై సిద్ధుడు, అళుగని సిద్ధర్‌, సంగూది సిద్ధర్‌ అంటూ వారి ప్రవర్తనలు, సేవలను బట్టి జనులు తమకు నచ్చిన పేర్లతో పిలుస్తుంటారు. ఇడియాప్ప సిద్ధులు, పూండి సిద్ధులు, తొల్లైకాదు సిద్ధులు, తడితూక్కి సిద్ధులు, సొరకాయ సిద్ధులు, తొళుప్పేడు సిద్ధులు, పంన్రిమలై సిద్ధులు, కళువెళి సిద్ధులు - ఈ పేర్లన్నీ కారణ సహిత నామాలే. 

ఉన్నత స్థితినిచ్చే రెండు మార్గాలు 
దైవానుగ్రహం పొందటానికి - భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాలంటూ పలు మార్గాలున్నాయి. తపస్సులు చేసి, వ్రతాలు చేసి నామసంకీర్తనలు, ఆలయపనులు నిర్వహించి కూడా దైవానుగ్రహం పొందవచ్చును. ఈ రెండో మార్గంలో సులువుగా దైవానుగ్రహం పొందగలము. ఈ భూలోకంలో పరలోకంలోను పలు కార్యాలను సాధించటానికి పువ్వులు తోడ్పడతాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం. పవిత్రమైన పుష్పాల ద్వారా ఆ దేవ దేవుని వద్దకు సులువుగా చేరుకోగలము. ఇదే పూల తత్త్వం! 
కట్టుబాట్లు లేని మనః సంచలనం, భావాలే మానవుడిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి కదా? తొలుత ఏయే భావాలు ఏయే మంచి కార్యాలకు దోహదపడతాయో తెలుసుకోవాలి. పువ్వుల సువాసనలు తరచూ మంచి తలంపులను, భావాలను ప్రేరేపిస్తాయి. కనుక పువ్వుల మధ్య జీవించడం చాలా మంచిది. ఈ కలియుగంలో మన దృష్టికి చెడుగా అనిపించేవన్నీ చెడుగా ఉండటం లేదు. మంచివిగా ఉన్నవని నిజానికి మంచివి కావు. కనుక ఈ విషయంలో ఏవి మంచో ఏవి చెడో నిర్ధారించుకోవడానికి సైతం ఈ పూల సువాసనలే సాయపడతాయి. కనుక ఎల్లప్పుడూ చేతిలో, సంచిలో- ఆలయంలో, ఇంటిలో పూజించిన పుష్ప ప్రసాదాలను ఎల్లవేళలా ఉంచుకుంటే మంచింది. ఆలయ పుష్ప ప్రసాదం చేతిలో ఉంటే చెడు శక్తులు సమీపించవు. ఇవి రక్షణ కవచంగా ఉంటాయి. ఎందరో మహానుభావులు పువ్వులు, కుంకుమ, అక్షింతలతో ఆశీర్వదించేవారు. కారణం వారి ఆశీస్సులను నేరుగా పొందే యోగశక్తి, మానసిక పరిపక్వత మనకు లేకపోవడంతో పునీత శక్తులున్న పువ్వుల ద్వారా ప్రాప్తింపజేస్తాయి. ఇలా ఆశీస్సులు అందించటంలో బడే సాహెబ్‌సిద్ధులు, పరమాచార్యుల వంటి మహాపురుషులు, మునులు కొందరికి అపారంగా అనుగ్రహిస్తున్నట్లు అగుపడతాయి. కానీ అది వాస్తవం కాదు. ఉత్తమపురుషులు ఎల్లప్పుడూ వారిలో ఉన్న ఆత్మపైనే దృష్టిని సారిస్తుంటారు. సిద్ధులు, మహాపురుషులు దైవీక సేవకులకు, భక్తుల కోసమే పూజలు చేస్తుంటారు. మనలాగ ఇది కావాలి అది కావాలి అంటూ స్వార్థ ప్రయోజనాల కోసం పూజించరు. మనలో ఇతర జీవరాశుల కోసం సేవలందిస్తుంటారో వారి కోసమే ఆ మహాపురుషులు అదనంగా తమ ఆధ్యాత్మిక శక్తిని అందజేస్తారు. వీటినే మనం వేరు విధంగా అర్థం చేసుకుంటున్నాము. మనకన్నా పవిత్రమైనవారు ఈ ప్రపంచంలో లేరని మనకు బోధపడుతుంది. దీనిని మనసాక్షితో అంగీకరించాలి. ఇలా మహాపురుషులు నిర్వహించే జపతపాలు, పూజాపునస్కారాలు అన్నీ పరుల కోసమే. అయితే కలియుగ పురుషులైన మనం మన కోసం ఎల్లప్పుడూ వేడుకుంటున్నాము. కోరుకుంటున్నవి నిజానికి మనకు అవసరమేనా, వాటి వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమిటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటాము. ఏదైనా అవసరమైతే వెంటనే దేవుని వేడుకుంటున్నాము. దీని కోసం ఎన్నిరకాల పూజా పునస్కారాలు చేస్తున్నాము. సక్రమమైనవాటి కోసం వేడుకోవడం తప్పుకాదు. అడగటానికి కూడా ఓ హద్దు ఉండాలి కదా! పువ్వులతో పూజిస్తే తలంపులను సక్రమపరచుకోగలము. 

నందివర్ధనం

ఎందుకు తరతరాలుగా సంధ్యావందనం, గాయత్రీజపం, పూజలు అంటూ కాస్తోకూస్తో చేయగలుగుతున్నాము ? మన పూర్వీకులు చెప్పారు. వారంతా చేశారు ఫలితాలు పొందారు. ఇందులోనే నిజమైన సంతోషం, తృప్తి, ప్రశాంత లభిస్తోంది. ప్రాచీన పద్ధతులను అనుసరించడం వల్లే శాశ్వతానందాలను, పరిపూర్ణ ప్రశాంతను పొందగలమని భావించాలి. దీపావళి, సంక్రాంతి పండుగల వల్ల ఊరావాడా, దేశమంతటా ఆనందం కలగుతోంది. అయితే ఇటీవలి కాలంలో కొన్ని దురలవాట్లు చొరబడ్డాయి. వేకువజామున (అదీ పెంపుడు కుక్కతో) వాకింగ్‌ వెళుతూ, బూట్లు ధరించిన కాళ్ళతోనే దేవుడిని మొక్కే దుస్థితికి చేరుకోకూడదు. ప్రాచీన పద్ధతికి స్వస్తి చెప్పటం వల్ల కలిగిన అనర్థమిదే! వేకువజామును పెంపుడు కుక్కతో కాలినడక చేసేవారు అదే సమయాన గుడికి ఎందుకు వెళ్లలేకపోతున్నారు. వాకింగ్‌కు వెళ్లేవారిని వారి పెంపుడు కుక్క కూడా ఈ ప్రశ్న వేస్తుంది. అయితే ఆ శునకపు భాష తెలియక 'ఉష్‌ చప్పుడు చేయొద్దు' మానవుడు ఆ శునకాన్ని అదిలిస్తాడు. 
శునకాలకు కూడా పువ్వుల మహత్త్యం తెలుసు. సుదూరంలో ఉన్న పూల పరిమళాలను సైతం శునకాలు ఇట్టే పసిగట్టగలవు. దగ్గరగా వెళ్లి ఆ సువాసనలను స్వీకరించి ప్రయోజనం పొందుతున్నాయి. అయితే పువ్వుల పవిత్రతను గురించి బాగా తెలిసిన మానవుడు రోజూ వాటిని ఉపయోగించలేకపోతున్నాడు. మన పూర్వీకులు తెలిపిన పూజా పద్ధతులన్నీ పువ్వులలాగే చాలా పవిత్రమైనవి. అంటే పవిత్రమైనవాటిని పాటిస్తే మంచి మార్గమేర్పడుతుంది. తృప్తి, సంతోషం కలుగుతాయి. పువ్వులు చెబుతున్న పాఠమిదే! 
ప్రతి పువ్వు తన రంగుతో, సువాసనతో పలువురికి ఆనందాన్ని అందించి చివరకు తానే వాడి ఒకే దినాన ముక్తిని చెందుతున్నాయని సద్గురు వెంకటరామస్వాములు చెబుతుంటారు. ఇలా ఒక రోజులోపలే ముక్తిని చెందే పువ్వులను భగవంతుని పూజకోసం సమర్పిస్తే మనకూ ముక్తి లభిస్తుంది కదా! మనం ముక్తిని పొందలేకపోయినా కనీసం పువ్వులకైనా భగవదనుగహ్రం ద్వారా ముక్తిని పొందేందుకు సాయపడవచ్చును కదా! 

కొంగ మందారం

జీవితంలో దైవ ప్రార్థనకు ఉపయోగించే సమయమే నిజమైన సద్వినియోగమైన కాలంగా పరిగణించవచ్చునని సద్గురు వెంకటరామస్వాములు చెబుతారు. నేలపై ఆశీనులై పువ్వులతో అర్చించి దైవాన్ని పూజించాలి. అయితే పూజలంటే కేవలం కూర్చుని చేసే పూజ కాదు. ఆఫీసులో ఉన్నప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, నడిచి వెళ్లేటప్పుడు, నిమ్మళంగా కూర్చున్నప్పుడు మనస్సులో నీటి ధారలా గాయత్రీ మంత్రాన్నో లేక మీకు బాగా తెలిసిన మంత్రాన్నో జపించడం కూడా పూజే! మనస్సులో అరుణాచలాన్ని ప్రదక్షిణ చేస్తున్నట్లు భావించటమూ పూజే అవుతుంది. 
త్రికాలాలు సంధ్యావందనాన్ని నిర్ణీత వేళల్లో చేయాలి. ఇది జాతిమతాలకు అతీతమైన పూజ. సూర్యోదయానికి ముందుగా, మధ్యాహ్నం, సూర్యాస్తమయానికి ముందుగా అర్ఘ్యం సమర్పించాలి. గాయత్రీ మంత్రాన్ని ఏ సమయంలోనైనా పఠించవచ్చు. కొంగ మందారం అనే పుష్పాన్ని తిలకిస్తూ శ్రీగాయత్రీ మంత్రాన్ని జపిస్తే పలురెట్లు మంచి ఫలితాలు లభిస్తాయి. 
సూర్యనమస్కారం అందరూ పాటించదగినదే. ప్రస్తుతం టీవీ, సినిమాలు, కంప్యూటర్‌ వీక్షణాల వల్ల చిన్న వయస్సులో కంటి అద్దాలను ధరించాల్సిన అగత్యం ఏర్పడుతోంది. చిరుత ప్రాయంలోనే జపం, సూర్యనమస్కారం చేయడం, ఆహారంలో కరివేపాకులు చేర్చుకోవడం, వారాంతంలో నూనెను తలంటుకుని స్నానం చేయడం వల్ల కనుచూపు మెరుగవుతుంది. దేవునికి సమర్పించిన నందివర్థనం పుష్పాన్ని కంటికద్దుకుంటే కనుచూపు చల్లబడుతుంది. కంటి చూపు మెరుగవుతుంది. 
'కామం చొరబడక ముందే గాయత్రీ జపం చొరబడాలి' అన్నది ప్రాచీన సామెత. బాల్యంలోనే అంటే కామ తలంపులు కలుగని వయస్సులోనే జంధ్యం ధరించి గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ వచ్చే క్రమశిక్షణ కలిగిన జీవనమార్గమేర్పడుతుంది. చెడుతలంపులు దరికిరావు. జంధ్య ధారణ అందరికీ అనువైనదే. ఓ వర్గానికి చెందినది కాదు. జంధ్యాన్ని 'వలయకార పుష్పం' గాను పిలుస్తుంటారు. 
మునుపు ఆలయాలలో రోజూ విగ్రహాలన్నింటికీ జంధ్యాన్ని ధరింపజేసేవారు. ఆ పద్ధతిని మళ్లీ ఆచరించాలి. భక్తులెవరైనా జంధ్యాలను సమర్పిస్తే ఇది సాధ్యం అవుతుంది. 

దైవ దర్శనమార్గంలో పయనం

ప్రస్తుతం పలువురు తాము ఎన్నో పూజలు చేశామని, ఇక పూజలు చాలుననే భావనకు వస్తుంటారు. ఆలయానికి వెళితే సత్ఫలితాలు, దుష్టభావనల నుండి విముక్తి లభిస్తాయని తెలుసుకోలేకపోతున్నారు. చేసిన పూజలు, లభించిన పుణ్యమూ చేసిన తప్పులు, తప్పుడు తలంపుల వల్ల హరించుకుపోయానని తెలియటం లేదు. మనం చేస్తున్న పూజలు, ఆలయ దర్శనాలు, సంధ్యావందనాలు, సూర్యనమస్కారం, జపాలు అన్నీ మనకు చెబుతున్నది ఒక్కటే. అవన్నీ దైవ దర్శనానికి అనువైన మార్గంలో మనల్ని తీసుకెళతాయి. మంచి మార్గంలో వదలిపెడితే దైవ దర్శనం కలుగుతుందా? ఇది చక్కటి ప్రశ్న. 
ఈ ప్రశ్నకు సమాధానాలను భోగర్‌, పులిప్పాణి, పులస్త్యులు తెలియజేశారు. వాటిని సద్గురు వెంకటరామస్వాములు వంటి అగస్త్యకుల దీప ప్రకాశకుల ద్వారా మన సమాజానికి అందుతున్నాయి. పూజ, పునస్కారాలు, అనుస్టానాలు దైవ మార్గంలో పయనింపజేస్తాయి. అక్కడి నుండి దేవుని చేరటానికి మార్గమేమిటి? 
గురువు : వ్రతాలు, ప్రార్థనలు అన్నీ మంచి మార్గంలో పయనింపజేసి ఆలయ ద్వారం వరకు తీసుకెళాతయి. 
పువ్వులు కూడా వ్రతమాచరిస్తాయి. ఇలా వ్రతమాచరించే పువ్వులు త్వరగా వాడిపోవు. అదనంగా సువాసనలు అందిస్తాయి. వ్రతమాచరించేవారు వీటిని తెలుసుకుని అలాంటి పుష్పాలను తమ వద్ద ఉంచుకుంటే చాలా మంచింది. వ్రతమంటే ఒక వేళ అల్పాహారానికి బదులుగా ద్రవాహారం తీసుకోవడం. మధ్యలో వ్రతాన్ని ఆపి ఆహారం భుజించడం వ్రతం కాదు. ఆహారం తీసుకోకుండా, నీరు కూడా తాగకుండా దైవస్పరణతో దైవనామాన్ని జపిస్తూ ఉండటమే వ్రతమవుతుంది. ఇలాంటి వ్రతాలు మనలను ఆలయ ద్వారం దాకా తీసుకెళతాయి. ఇంటి ప్రాంగణంలో పెరిగే మొక్కలందించే పుష్పాలను చేరువగా ఉన్న ప్రాచీన ఆలయాలకు సమర్పిస్తే ఆధ్యాత్మిక శక్తి అధికమవుతుంది. ఈ పుష్పాల సమర్పణ కూడా మనల్ని ఆలయం దాకా తీసుకెళతాయి. ఆలయ ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్లడమనేది వారి దాన ధర్మాలు, పుణ్యాలను బట్టి సులువవుతుంది. ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే ధానధర్మాలు ఆలయప్రవేశానికి దోహదపడతాయి. సంతోషంగా ఇచ్చిన భిక్ష, దానాల వల్ల పరుగులు తీసే అశ్వంలా ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని అగస్త్య గ్రంథం చెబుతోంది. 

అగస్త్య గ్రంథం అగస్త్య నాడి

అగస్త్య గ్రంథ భాష అంటే రాయని వేదమంత్రాల్లా విశ్వమంతటా వ్యాపించిన చతుర్‌కోటి యుగాల దాకా చెరగని శాశ్వతమైన అమృతవాక్యాలు. వీటిలో అపూర్వమైన, ఇప్పటి దాకా ఎవరి గ్రహించని అరుదైన వేద మంతాల్రు, నాలుగు యుగాలలో జీవులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, జీవులు పొందే సుఖదుఃఖాలకు సంబంధించిన వివరణలు, రోగాలు, ఆటంకాలను ఆయా యుగధర్మాలను బట్టి తొలగించుకునే పద్ధతులు దీర్ఘదర్శనంతో చెప్పబడి ఉన్నాయి. సద్గురు వెంకటరామస్వాములు వంటి అగస్త్య గురు ఆరాధకులే ఆకాశం నుండి గ్రహించగలుగుతారు. పూర్వం వీటిని అగస్త్య నాడి అని కూడా చెబుతుండేవారు. ప్రస్తుతం 'నాడి' అంటేనే వైదీశ్వరాలయంలోని నాడి జ్యోతిష్యమని పలువురు అపార్థం చేసుకుంటున్నారు. కనుకనే దీనిని అగస్త్య గురువులందించిన గ్రాంథాలు అని చెప్పవలసి వస్తోంది. 
సద్గురు వెంకటరామస్వాములు ఆధ్యాత్మిక ప్రవచనాలలో ఆకాశం నుండి ఆయా సమయాలలో స్వీకరించి అలాంటి అగస్త్య నాడి గ్రాంథ గురుముఖతహః భాగాలు, అమృత వర్షంలా ప్రవచించడం పలువురికి తెలిసిందే. ఆ ప్రవచనాలు సీడీల ద్వారా ప్రస్తుతం లభిస్తున్నాయి. 
కనుక దైవదర్శనం కోసం ఇలాంటి ఆధ్యాత్మిక శక్తులు అత్యంత ఆవశ్యకమవుతున్నాయి. దానము, ధర్మము, ఆలయ ద్వారాన్ని అధిగమింపజేస్తాయనుకుంటే, ఏ చర్యలు దైవదర్శనం లభింపజేస్తాయి? ఇది అరుదైన ఆత్మవిచారణకు సంబంధించిన ప్రశ్న ఇది. 
గురువు : దేవుని దర్శింపజేసే మార్గంలోకి రావడానికి పూజలు, సూర్యనమస్కారం, శాంతి, జపతపాదులు అవసరం. ఆ మార్గంలో ముందుకెళ్లి ఆలయాన్ని చేరుకోవడానికి వ్రతాలు అవసరం. వీటి ద్వారా మానవుడు దైవం కొలువైన ఆలయానికి చేరుకోగలడు. ఇక ఆలయం లోపల ప్రవేశానికి ఇష్టపడి సమర్పించిన భిక్ష, ఫలాపేక్షలేని ధర్మం అవసరమవుతాయి. కలియుగంలో వీటి సాయం లేకుండా కోటిసూర్యకాంతులతో వెలుగొందే దేవుని దర్శించలేము. 
ఇక ఉత్సవాలలో దేవుని దర్శించటం, తీర్థం, స్థలం మూర్తి దర్శనం వల్ల దైవ దర్శనం ప్రాప్తించదా? పూజలు నిర్వర్తించని ఆలయలలో పూజలు చేస్తే దైవ దర్శనం లభిస్తుందా? ఇవన్నీ దైవదర్శనానికి తీసుకెళ్లే సన్మార్గాలే అవుతాయి. ఈ మార్గంలో తరచూ దిగజారి పోకుండా ముందుకు పయనింపజేస్తాయి. ఆలయానికి కాలినడకన వెళ్లి పుష్పకైంకర్యాదులు చేస్తే ఈ మార్గంలో పయనించగలం. 
వ్రతమంటే ఆహారం భుజించకుండా ఉండటమే కాదు, దీపంలేని గుడిలో దీపం వెలిగించే సత్కార్యమే వ్రతం. 
ఒకరి అవసరాలను గుర్తెరిగి చేసే దానం దైవదర్శనానికి తోడ్పడుతుందా? 
ఇవన్నీ దేవుని దర్శింపచేయడానికి చేరువగా తీసుకెళ్లే మార్గాలే. అయితే దైవ దర్శనానికి ఇవి మాత్రమే చాలవు. ఇంతకు మించిన ఉత్తమమైన సేవలు ఉన్నాయి. 
శ్రీమహావిష్ణువు ఓ సారి నారదమహర్షికి నూనెతో నిండిన గిన్నెను ఇచ్చి ఆ నూనె నేలపై చిందకుండా లోకాన్ని ప్రదక్షిణం చేసి రమ్మని చెబుతారు. ఆ గిన్నెలో నూనె నేలపై చిందుతుందేమోనన్న భయంతోనే దానిని చేతపట్టుకుని నిరంతరం జపించే నారాయణ నామాన్ని నారదులు ఉచ్చరించలేకపోయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అంతటి మహామునులకే ఇలాంటి శోధనలు కలిగినప్పుడు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడే కలియుగ మానవుల సంగతేమిటి? సులువైన మార్గంలో దైవదర్శనానికి అనువైన పద్ధతులు ఏమిటి? 
నారదమహర్షుల ఉదంతం మనకు తెలియజేస్తున్నదేమిటి? నారదుడు గిన్నెలోని నూనె జారిపడకుండా ఎలా ఏకాగ్రతతో గడిపారో ఆ విధంగానే మనమూ ఏకాగ్రతతో దైవనామాన్ని స్మరిస్తు ఉండాలి. కలియుగ మానవులు అడవులకు వెళ్లి ముక్కుమూసుకుని తపములు చేయవలసిన అవసరం లేదు. మహాయాగాలు నిర్వహించనక్కర్లేదు. భక్తితో దైవ నామస్మరణ చేస్తేచాలు. 
ఏ కార్యమైనా ఏకాగ్రతచిత్తంతో చేస్తే ఆ కార్యం సత్ఫలితాలను ఇస్తుందని రుజవుతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నామజపం విడువరాదు. ఈ నామజపానికి పారిజాత పుష్పాలతో పూజించడం శ్రేయస్కరం. 
మహాభారతంలో ఓ సంఘటనను పరిశీలిద్దాం. ద్రోణాచార్యులు తన శిష్యులందరిని వరుసగా నిలబెట్టి చెట్టుపైని పండును బాణంతో కొట్టమని చెబుతారు. విల్లును ఎక్కుపెట్టిన శిష్యులను ఏమి కనిపిస్తోందని ప్రశ్నిస్తారు. గురిచూసే శిష్యులు చుట్టూ ఆకాశం, చెట్టుపై కొమ్మలు, వాటి నడుమ పండు కనిపిస్తున్నాయని సమాధానాలు చెబుతారు. చివరగా అర్జునుడు గురిచూస్తుండగా ద్రోణాచార్యులు ఏం కనిపిస్తోందని ప్రశ్నిస్తాడు. 'గురుదేవా! భాణంతో కొట్టాల్సిన పండు మాత్రమే కనిపిస్తోంది' అని సమాధానం చెబుతాడు. ద్రోణాచార్యులు 'శభాష్‌ అదే నిజమైన గురి' అని అర్జునుడిని మెచ్చుకుంటారు. ఈ రీతిలోనే మన పంచేంద్రియాలు ఓ సత్కార్యంపై లగ్నం చేసినప్పుడు దైవాన్ని ఏకాగ్రత చిత్తంతో పూజించటం సాధ్యమేనా? సాధ్యమే. ఈ చోట పుష్పధారనలు మనకు సాయపడతాయి. గురుహోర సమయంలో ఐదు రకాల పుష్పాలతో దైవానికి సమర్పించి పూజిస్తే పిల్లలకు చదువు సంధ్యలపై ఆసక్తి పెరుగుతుంది. 
గురువు : ఓ కార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు పంచేంద్రియాలను కట్టడి చేసినప్పుడు శ్వాస, హృదయ స్పందన వేర్వేరుగా జరుగుతాయి కదా. దేహంలోని భాగాలు పనిచేయడానికి ఎప్పటికప్పుడు ఆదేశాలను మన మెదడు అందిస్తూనే ఉంటుంది. రక్త ప్రసరణ సైతం కొనసాగుతూనే ఉంటుంది. ఇదే విధంగా చిన్నప్పటి నుండి దైవనామాన్ని జపించటాన్ని అలవాటు చేస్తే, ఏ కార్యం చేస్తున్నా మనస్సు దైవం కేంద్రీకృతమై ఉంటుంది. నిదురలో ఉన్నా, మెలకువలో ఉన్నా దైవనామస్మరణ చింతన ఉండటమే భక్తుల పవిత్రమైన అత్యుత్తమమైన విధానం. ఈ స్థితిని చేరుకున్నామా అని భగవద్‌ మార్గంలో పయనించే అభ్యాసకులు తరచూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. 
మహాపురుషులు అహరమూ భగవద్‌ చింతనతోనే లయమై ఉంటారు. 
ఇంటిలో పూజగదిలో తెల్లని తామర పుష్పాన్ని ఉంచి పూజిస్తూ వస్తే దైవ చింతన తరచూ ఏర్పడుతుంది. తప్పిదాలకు పాల్పడకుండా కాపాడే దైవాన్ని స్మరిస్తూ గానం చేస్తారు. జీవన మార్గాన్ని ఏర్పరచుకుంటారు.

దేవుని సులువుగా దర్శింపజేసే సత్కార్యాలు ఏమిటి? 
రెండు సత్కార్యాలు. ఒకటి నామసంకీర్తనం. మరొకటి ఆలయ జీర్ణోద్ధరణ పనులు. నోరారా దేవుని కీర్తించటమే నామసంకీర్తనం. బాగా పాడటం లేదా మంచి సంగీత జ్ఞానం కలిగి ఉండటం ఇక్కడ ముఖ్యం కాదు. నోరార దైవ నామాన్ని ఉచ్చరించటమే ఇక్కడ ముఖ్యం. కేవలం సణుగుకోవడం కాదు. 
దేవుని నోరారా కీర్తించటం పాడటం భగవంతుని దర్శించటానికి సరైన మార్గాన్ని చూపుతుంది. ఇక ఆలయ జీర్ణోద్ధరణ పనులు అంటే కుంభాభిషేకం నిర్వహించటం, కొత్తగా ఆలయాన్ని నిర్మించటం అని భావించకూడదు. ప్రాచీనమైనదిగాను, సంప్రోక్షణ జరిగినా సక్రమంగా నిర్వహించలేని ఆలయాలలో పారిశుద్ధ్య పనులు చేయడం కూడా ఆలయ పనులే. వాస్తవానికి సరైన గురువు ద్వారా సత్సంగ సమేతంగా చేసే ఆలయ పారిశుద్ధ్య పనులు వల్లే అపరిమితమైన ఆనందమూ శక్తివంతమైన పుణ్యశక్తీ మరెక్కడా లభించదని సద్గురు వెంకటరామస్వాములు చెబుతారు. 
ఆలయ ప్రాకారాలలో, గోపురాలలో, విమానాలలో పెరిగిన చిన్న చిన్న మొక్కలను తొలగించి శుభ్రం చేయడం కూడా పవిత్ర కార్యమే. దీపమే వెలుగని ఆలయంలో దీపం వెలిగించడం కూడా మహత్తరమైన కార్యమే! 
ఇలా వ్యయప్రయాసలకు తావులేకుండా ఆలయన పారిశుద్ధ్య పనులు చేయకుండా ఉండటం తప్పుకదా? 
ఉద్యోగస్థులంతా పనిదినాలలో కాకుండా సెలవు దినాలలో అయినా తప్పనిసరిగా ఆలయ పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి. 
కలియుగాన ఈ రీతిలో నామ సంకీర్తనం (దైవనామాన్ని ఉచ్చరించడం), ఆలయ పారిశుద్ధ్య పనులు నిర్వహించడం వల్ల దేవుని దర్శించగల మార్గం లభిస్తుంది. అయితే శక్తివంతమైన పూజావిధానాలు, పుష్పాలను సమర్పిస్తూ గానం చేయడం కలియుగంలో చాలా శ్రేష్ఠమైన తపమే! 
సద్గురువు ఆధ్వర్యంలో నామ సంకీర్తనం, ఆలయ పరిశుభ్రతా పనులు చేస్తే దైవ దర్శనమార్గమేర్పడుతుందనే తలంపు కలిగినవారంతా భాగ్యశాలురే! 
పుట్టిన వెంటనే ఎవరూ పెద్దలుగా మారలేరు కదా. ఉన్నఫళానా ఎంకామ్‌, ఎంసీఏ పట్టభద్రులం అవుతామా? చిన్న చదువుల తర్వాతే పెద్ద చదువులు చదవగలం. ఇదే విధంగానే ప్రతి భక్తుడు చేసే నామసంకీర్తనం, ఆలయ పారిశుద్ధ్య పనులు అంచెలంచెలుగా దైవ దర్శనం ప్రాప్తించేలా చేస్తాయి. 
కళాశాలల్లో బీఎస్సీ, బీకామ్‌, డిప్లొమా పొందటానికి పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాల పాటు ఓర్పును పాటించే మనిషికి దైవ దర్శనానికి వేచి ఉండేలా ఓర్పు, సహనం ఆవశ్యకమని సద్గురు వెంకటరామస్వాములు చెబుతారు. 
జీవితంలో పరిశుద్ధమైన, సహనం పాటించేందుకు ప్రతి బుధవారం తులసి దళాలను మాలగా కట్టి పశువులకు ధరింపజేసి ఆరాధించాలి. 
కూత్తనూరు సరస్వతి ఆలయం సమీపాని ఉన్న ఇంజికుడి శివాలయంలో కొలువుదీరి వున్న అమృత రూప శాంతపార్వతి అంబికకు సువాసనలు కలిగిన పువ్వులతో తామే కట్టిన మాలను సమర్పించి మొక్కితే జీవితంలో శాంతి సౌభాగ్యాలను పొందవచ్చు. 

చుక్కుల ముగ్గుల పవిత్రత

ఆలయాలలో బియ్యపు పిండితో ముగ్గులు వేయడం కూడా ఓ సత్కార్యమే. భక్తులంతా ఓ బాధ్యతగా భావించి ముగ్గులు వేయడం శ్రేయస్కరం. దీని వల్ల పలు సత్ఫలితాలు కలుగుతాయి. ఏ ఇంటి ముంగిట బియ్యపు పిండితో చుక్కలతో ముగ్గులు వేసి ఉంటాయో ఆ ఇంట దుష్టశక్తులకు తావుండదు. ముగ్గులు ఇంటికి రక్షణ కవచంగా ఉంటాయనడం అతిశయోక్తి కాదు. చుక్కల ముగ్గులు పుడమిపైని నక్షత్రాలని కీర్తిస్తారు. ఆలయాలలో వేసే ముగ్గు మన జీవితంలో ఏర్పడే సమస్యలనుండి మనల్ని కాపాడతాయి. అదెలాగంటే... 
ముగ్గులన్నీ బీజాక్షర శక్తులు. పితృలోక దేవతలు వచ్చి కూర్చునే చక్రాలు, యంత్రాలు. ఓ చోట ముగ్గు వేయగానే దాని యోగ యంత్ర చక్రకోణం వల్ల ఆ చోటు పవిత్రంగా మారుతుంది. ఇది అత్యుత్తమ సామాజిక సేవ కదా. ఇంటి వద్ద ముగ్గేసినా ఆ చోటు పవిత్రంగా మారుతుంది. ముగ్గులో చుక్కలు ఎక్కువగా ఉంటా ఆ సంఖ్యకన్నా శక్తులు అధికమవుతాయి. 
ముగ్గులలో పవిత్రమైన పువ్వులకు కూడా స్థానం ఉంది. ముగ్గులు పువ్వుల ఆకారంలోనూ ఉంటాయి. దుర్గా, లక్ష్మీ, సరస్వతి - ముగ్గురమ్మలు కలిసి మేరు పర్వతంపై వేసి రంగవల్లుల (పూలముగ్గుల)ను చూసే బ్రహ్మదేవుడు జీవరాశులను రూపొందించాడు. 
మార్గశిర మాసంలో ఇళ్ళ ముంగిళ్లలో, వీధుల్లో, ఆలయాల వద్దా ముగ్గులేసి, వాటి నడుమ పేడముద్దను దానిపైన గుమ్మడిపువ్వును పెడతారు. ఆవుపేడ ముద్ద గోలోకమే. ప్రతి ముగ్గూ ఈ విశ్వాన్ని సూచిస్తుంది. గుమ్మడిపువ్వు యొక్క పసుపు రంగు శ్రీశుభశ్రీ అనే మంగళ దేవతా మూర్తిని సూచిస్తుంది. ఈ ఆకారమే శుభమంగళ లోకపు ఆకారం కనుక ఎక్కడైతే పువ్వులతో కలిసి ముగ్గులు వేసి ఉంటాయో ఆ ప్రాంతాల్లో మంగళకరమైన దేవతలు కొలువై ఆ ముగ్గులేసిన కుటుంబీకులందరికీ సౌభ్యాగాన్ని కలిగిస్తారు. ఎన్నో మంచి విషయాలను విని, వాటిని తక్షణమే ఆచరించాలనే తలంపు కలిగినా, కాసేపటికి మనస్సు ఆ విషయాన్ని మరచిపోతోంది. దీనికి కారణమేమిటి? 

పువ్వుల పుట్టక

గురువు : మనస్సు మనం చెప్పినట్లు ప్రవర్తించదు. ఒకరు ఓ విషయాన్ని చెబితే వెంటనే దానిని చేయాలని మనస్సు భావిస్తుంది. ఇది ఆ విషయాన్ని చెప్పే వ్యక్తి సాధించే విజయం! అయితే ఆ తలంపును కార్యాచరణగా మారిస్తేనే విన్నవారికి విజయం చేకూరుతుంది. 
చంద్రమూర్తియే సకల జీవరాశులకు మనఃకారకుడు. పలు రకాల పువ్వులు ఆ చంద్రుడి కిరణాలు సోకి వికసిస్తాయి. మనస్సే మనిషిని అదుపాజ్ఞలలో ఉంచుతుంది. చంద్రభగవానుడి అనుగ్రహం ఉంటే మనస్సు లోబడుతుంది. 
చంద్రమూర్తి ఓ సమయాన మేరుపర్వతంపై ఘోర తపమాచరించారు. నిప్పు కణికల మధ్యన నిలిచి చాలా కాలంపాటు ఆయన తపస్సు చేశారు. ఆ తపస్సు ఎందుకోసం నిర్వహిస్తున్నదీ తెలియక దేవతలు ఆ చంద్రుడి వైపే దృష్టిసారించారు. చంద్రుడి దేహమంతా బక్కచిక్కిపోయింది. ఆ సమయాన ఉన్నట్టుండి ఆయన ఎదుట ఓ పెద్ద అగ్నిగోళం ఏర్పడి, పదహారు ముక్కలై ఒక్కో అగ్నికణమూ ఒక్కో సత్కార్యాన్ని చేశాయి. ఓ అగ్నికణం శిలలను చల్లబరిచాయి. మరొకటి జీవరాశులకు ప్రాణం పోసింది. ఇలా జరుగుతూ... చివరకు ఆ అగ్నికణాలన్నీ ఏకమై అంబికాదేవి రూపును ధరించాయి. చంద్రభగవానుడు అంబికాదేవిని ఆరాధించగా, ఆమె చంద్రభగవానుడికి అమృతపు చుక్కలను అందించింది. ఆ చుక్కలను ఆరగించినప్పుడు పలు అమృతపు చుక్కలు ఉద్భవించాయి. ఆ అమృతపు చుక్కల నుండే పలు రకాల పువ్వులు జన్మించాయి. పలు రకాలయిన, ఆకారాలతో కూడిన పువ్వులు ఏర్పడ్డాయి. 
అమృతమయమైన ఆ చంద్రుడి శీతల కిరణాల ప్రభావం వల్లే పువ్వులకు ఇంతటి మృదుత్వం, సువాసన, రంగులు కలిగాయి. ఇలా అంబికాదేవి అమృతస్పర్శను కలిగిన చుక్కలే పువ్వులుగా మారి ఈ పుడమిపై పుట్టాయి. 
అగస్త్యమహర్షి ఈ దైవీక రహస్యాలను సనకాది మునుల ద్వారా ప్రపంచానికి తొట్టతొలుత ఎలుగెత్తి చాటారు. అంతే కాకుండా యుగాల నియతికి తగినట్లుగా పువ్వుల ఆకారాల ఏర్పడ్డాయి. ఏది ఏమైనప్పటికి అమృతపు చుక్కలే పువ్వులని నిర్ధారింపబడ్డాయి. 
కోటానుకోట్ల రకాల పువ్వులు ఉన్నాయి. అమృతపు చుక్కల ద్వారా జనించిన పువ్వులు 38000 కోట్ల రకాల దాకా ఉన్నాయి. వీటిలో 20000 కోట్ల పువ్వులు విష్ణులోకానికి తరలివెళ్లాయి. 
11000 కోట్ల పువ్వులు సిద్ధుల లోకంలో ఉన్నాయి. అగస్త్యులవారే మూలికలకు అధిపతి. కనుక సిద్ధపురుషులు ఆ పుష్పాలతో లోక సంక్షేమార్థం పూజలు చేస్తుంటారు. ఈ 11000 కోట్ల పువ్వులలో ఏకార్థ జ్యోతిలో ఒకే ఒక పువ్వు సాయంతోనే భోగసిద్ధపురుషుడు 10,000 మంది శిష్యులతో ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. 
500 కోట్ల పువ్వులు వైద్య గుణాలను కలిగి ఉంటాయి. వీటిని వైద్యానికి మాత్రమే ఉపయోగించాలి. 1000 కోట్ల పువ్వులు అసురుల కోసం తరలిపోయాయి. తక్కిన 100 కోట్ల పువ్వులు మాత్రమే భూలోకంలో ప్రజల కోసం అవతరించాయి. 
ఇన్ని కోట్ల రకాలకు చెందిన పువ్వులను ఏ మానవుడైనా కోటాను కోట్ల జన్మలెత్తిన చూడ సాధ్యమా? కనుకనే వీటిని దర్శించిన సద్గురువును శరణుపొందితే ఆయన ద్వారా వేలకొలది పువ్వులను దర్శించినంత భాగ్యం కలుగుతుంది. పువ్వులే ఇన్ని కోట్ల రకాలుగా ఉన్నాయంటే ఇక కోటాటానుకోట్ల చతుర్కోటి యుగాలలో విస్తరించి ఉన్న ప్రపంచ రహస్యాలను ఏమని వర్ణించగలం? 
ఇలా పువ్వుల సృష్టికి కారణమైన అంబికాదేవిని గురించి మనమిప్పుడు తెలుసుకోవాలి కదా! 
గురువు : హరిహరాదులు ఒక్కటే అని ప్రపంచానికి చాటిచెప్పిన గోమతిదేవియే అత్యద్భుతమైన అంబికాదేవి. సనకాది మునులు శాంతిని పొందటానికి ఘోరతపస్సు చేసినప్పుడు గోమతిదేవి వారిని దక్షిణామూర్తిని మొక్కి, ఆరాధించే పద్ధతులను వారికి ఎరుకపరుస్తుంది. 
భూలోకంలో పుట్టిన ప్రతి పువ్వు వెనుక ఓ మహాపురుషుడి లేదా సిద్ధపురుషుడి పుణ్యచరిత దాగి ఉంటుంది. ఎలాగయితే వేదమంత్రానికి రిషి, సదస్‌ వంటి వ్యాకరణాలు ఉంటాయో అదే రీతిలో ప్రతి పువ్వుకు ఉన్నాయి. 
పలువురు మహాపురుషులు, సిద్ధపురుషులు తమ జీవిత పర్యంతమూ జపతపాదులు నిర్వర్తించి తెలుసుకున్న పువ్వుల రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనస్సును కట్టడి చేసిన మహాపురుషులు సిద్ధులు. కనుక వారిని హేళనగా కించపరచకూడదు. వారి సత్తాను లెక్కగట్టేందుకు ప్రయత్నించకూడదు. మనిషి మేధస్సుకు అందని ప్రపంచ సరిహద్దులను అధిగమించి జీవిస్తున్నవారే సిద్ధపురుషులు. 
అలాంటి ఉత్తమపురుషులకు అపవాదు కలిగిస్తే భావితరాలకు మహాపాపాలు అందించినవారమవుతాము. ఉత్తమ పురుషులను దూషించినా, కించపరచినా వారి వల్ల భూలోకంలో జనించిన పువ్వులను ధరించినా, ఉపయోగించినా, పూజకు ఉపయోగించినా అకారణ పాపములే కలుగుతాయి. కనుక ఉత్తమ పురుషులను కించపరచవద్దు! 
శ్రమలనోర్చి అన్ని విద్యలు నేర్చినా, సిద్ధులన్నింటినీ సముపార్జించినా కరుణా హృదయంతో లోక సంక్షేమమే నా ధ్యేయం అని తాయుమానవర్‌ సూక్తి. 
మునులు అన్ని రకాల పువ్వులను గురించి ఈ లోకానికి చాటి చెప్పారా? 
బ్రహ్మదేవుడి నివాస స్థలం సత్యలోకమని పేరు. తామరపై ఆశీనులై సృష్టి కార్యాలను నిర్వర్తిస్తుంటారు. 

ఉత్తమ మహిళలు కోరుకునే ఉత్తమ వరం

ఓ మగువ ఎలాంటి వరం కోరుకుంటుంది? మంచి భర్త కావాలనా? భర్త మంచివాడుగా ఉంటే చాలునా? భార్య కూడా గుణవతిగా ఉండాలి కదా! ధనం, సౌభాగ్యం, అందం, సద్గుణం కావాలని కోరుకునేవారు కూడా ఉన్నారు. అవన్నీ లభిస్తే చాలునా? మంచి నడవడిక ఉండాలి కదా! మంచి ప్రవర్తన ఉంటే చాలునా సంసారం సవ్యంగా సాగాలి కదా! అలాగయితే దీర్ఘసుమంళిగా ఉండాలని కోరుకుందామా? భర్త చనిపోయినా అతడు విడిచిపెట్టిపోయిన సత్కార్యాలను కొనసాగించే భార్య కూడా పవితమ్రైన పతివ్రతే! 
కనుక మగువలంతా పవిత్ర పాతివ్రత్యం కావాలిని కోరుకోవటమే శ్రేయోదాయకం. ప్రతి శుక్రవారం నాడు పసువులకు తామరపుష్పాల మాలను ధరింపజేసినట్లయితే ఉత్తమపురుషుల ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. అది దీర్ఘ సుమంగళి భాగ్యం కలిగేందుకు దోహదపడుతుంది. సుమంగళిగా ఉంటేనే కదా పవిత్రంగా ఉండటం సాధ్యమని అపార్థం చేసుకోకూడదు. భర్త జీవించి ఉన్నప్పుడు పువ్వులు, కుంకమలు ధరించి ఉండటం సుమంగళి భాగ్యం కాదు. భర్త మనస్సుకు నొప్పి కలిగించకుండా దైవ కార్యాలలో పాలుపంచుకుని, భర్త మృతి చెందిన తర్వాత కూడా ఆయన ఆశయాలను నెరవేర్చటమే సుమంగళి భాగ్యానికి సరైని నిర్వచనమవుతుంది. పైలోకంలో ఉన్న భర్త బాగుండాలని ఉత్తమురాలు సత్కార్యాలు కొనసాగించటమే మంచింది. 
''ఇవన్నీ ఉత్తమ మహిళల అంశాలే. పైలోకంలో ఉన్నవారు భూలోకంలో వున్నవారి దేహాలను చూడరు. వారి మనస్సులలో ఉన్న మంచి భావాలనే చూస్తారు. మనస్సు పవిత్రంగా ఉంటే దేహం కూడా పవిత్రంగా ఉంటుంది. పైలోకంలో ఆత్మలే సంచరిస్తుంటాయి. అక్కడ దేహాలకు తావులేదు. ఎవరు ఏ రూపం ధరించాలన్నా సాధ్యమవుతుంది. భూలోకంలో మహిళలు పిన్న వయస్సులోనే తగిన తోడుతో రోజూ ఆలయాలకు వెళ్లి ప్రవేశ ద్వారం వద్ద గోమయంతో చక్కగా అలికి, ముగ్గులు వేసి, ఆలయం లోపల కూడా శుభ్రంగా ఉంచాలి. బియ్యపు పిండితో వివిధ రకాల ముగ్గులు వేయాలి. పువ్వులను మాలగా కట్టడం వంటి సత్కార్యాలు నిర్వర్తించాలి. 
పెళ్లయిన తర్వాత భర్త, పిల్లల, తల్లిదండ్రుల అవసరాలేమిటో తెలుసుకుని సంరక్షించాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ ఉండాలి. 

పువ్వుల పుణ్యగుణాలను లోకానికి చాటినవారు

అగస్త్యమహర్షి తన శిష్యులకు నలుగురు మహామునులను గురించి వివరించి, ఆ నలుగురే పువ్వుల పుణ్యగుణాలను లోకానికి తెలియజేసినవారని పేర్కొన్నారు. 
ఆ నలుగురు మహామునులే తాము ఎల్లప్పుడూ దక్షిణాభిముఖంగా దైవ చరణాల వద్ద కొలువైన నలుగురు సనకాది మహర్షులు. సనకుడు, సనాతనుడు, సనత్‌కుమారుడు, దక్షిణా మూర్తి స్వామివారి చరణాల వద్ద కొలువై వెలుగొందుతుండటానికి పువ్వులతో ఆరాధించారు. 
ఈ నలుగురు మునుపు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మనశ్శాంతి కోసం మార్గం చెప్పండంటూ ప్రార్థించారు. మహామునులకు మనశ్శాంతి లేకుండా ఉంటుందా? అయినా భూలోకవాసులకు తెలియజేసేందుకు వీలుగా ప్రశ్నోత్తరాల రూపంలో సందేశాలను అందించారు. బ్రహ్మదేవుడు కూడా వారిని శంకరనారాయణమూర్తిని లోకానికి చూపెట్టిన గోమతిమాతను ఆరాధించి తరించమని చెబుతారు. 
సనకాది మునులు కూడా గోమతి మాతకు పలు రకాల పూజలు చేశారు. కావళ్లు మోసి పలు రకాల తపములనాచరించి, ఎన్నోపూజా పునస్కారాలు, పలు అభిషేకారాధనలు నిర్వహించారు. ఇవన్నీ ఉత్తమై దైవీక స్థితులను అందించగలవి. గోమతి మాత పాదాలను చందనంతో తాపడం చేసి కదంబ పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అమ్మాయిలకు రక్షణశక్తిని అందించే ఆరాధన ఇది. 
ఆదికాలంలో చెట్లు, కొమ్మలు ఆకులు మాత్రమే ఉండేవి. తర్వాత కాయలు కాసి పండ్లుగా మారుతుండేవి. పువ్వులేవీ ఉండేవి కావు. ఇప్పుడు కూడా పూవులు లేకుండానే కాయలు కాసే అత్తి వంటి చెట్లు ఉన్నాయి. కనుకనే 'అత్తి పూసినట్లు' అనే సామెత లోకప్రసిద్ధమైంది. 
సనకాది మునులు ఇలా భక్తిప్రపత్తులతో పూజలు చేస్తున్నప్పుడు గోమతి మాత పరవశించి వీరి ఎదుట ప్రత్యక్షమై చంద్రుడి అమృత తారల ద్వారా భూలోకానికి ఏతెంచిన పువ్వులను గురించి వివరిస్తుంది. ఈ మునులు మరింతగా చేసిన తపస్సుల కారణంగా ఆ అమ్మవారి నుండే అరుదైన తపఃఫలాలను సైతం పొందారు. 
ముక్తి, మోక్షం పొందిన మహామునులైనప్పటికీ వారంతా తమకోసం ఏవీ కోరుకోరు. ఒక వేళ ఏవైనా కోరి పొందినా వాటిని తమ వద్ద ఉంచుకోరు సర్వం కృష్ణార్పణమంటూ సమర్పించి ఇతర జీవుల సంక్షేమం కోసం అంకితమైపోతారు. 
తపము, యోగం, ధ్యానం పూజలు, ధానధర్మాలు వల్ల మానవులు కూడా వరాలు పొందగలరని ఆ మహామునులు లోకానికి చాటిచెప్పారు. గోమతి అమ్మవారు నుడివినట్లు భూలోకానికి వచ్చిన తొలి పువ్వుల ద్వారానే ఆమెను పూజించారు. వాటికి గోమతి పుష్పం అని పేరు. అంబికాదేవి సైతం ఆదిమూల పుష్ప పూజను స్వీకరించడానికి ముందు తనకు గోమతి అని పేరొచ్చేందుకు కారణమైన అన్ని దేవతామూర్తులు కొలువైన గోవును తొలిపూజను సమర్పించారు. ఇలా భూలోకానికి వచ్చిన తొలి పుష్పం ద్వారా పూజలందుకున్నది గోమాతే! ఆ తర్వాత ఆ నలుగురు మునులూ దక్షిణామూర్తిని, అటుపై గోమతి అమ్మవారిని పువ్వులతో అర్చించి సత్ఫలితాలను పొందారు. ఆ పుష్ప ఆరాధనల వల్ల అనతి కాలంలోనే వారు దక్షిణామూర్తి దర్శనమూ పొందగలిగారు. 

మనశ్శాంతికి మార్గం

మనశ్శాంతి అంటే ఏమిటి? దేనిని బట్టి మనశ్శాంతిని పొందామని చెప్పగలం? దీనిని సాక్షాత్తు మౌన మాధ్యమ దేవుడైన దక్షిణామూర్తియే పెదవి విప్పకుండానే తెలియజేశారు. సనకాది మునులు శాంత శక్తులను పొందగలిగారు. సనకాది మునులు కూడా శాంతి మార్గాలను వివరించారు. దక్షిణాభిముఖ దేవుడైన దక్షిణామూర్తిని గురువారాల్లోనో లేక ఇతర రోజుల్లోనో గురుహోర వేళలో పసుపు రంగు చామంతి పుష్పాలతో కిరిటం చేసి ధరింపజేసి మొక్కితే మంచి ఫలితాలు దక్కి మనశ్శాంతి లభిస్తుంది. 
మనస్సును కొంతమేరకు కట్టడి చేయడం అసాధ్యం. మనస్సును తొలుత దాని ఇష్టానుసారం వెళ్లనీయండి. అయితే భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండండి. మధ్యలో మనస్సు ఎటో వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఈ మానసిక పోరాటం అందరికీ ఎదురవుతూనే ఉంటుంది. ఇలా జరగటం ధ్యానారంభం. భగవన్నామాన్ని స్మరిస్తుండగానే చేతులలో విడిపువ్వులను ఉంచుకుని దేవుని పూజిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. ఇలా అభ్యాసం చేసుకుంటూ వస్తే మనస్సు సంచారం క్రమేణా తగ్గుతుంది. ఏకాగ్రత చిత్తమూ ఏర్పడుతుంది. 
దీనినే పెద్దలు నామసంకీర్తన మహిమ అని చెబుతారు. భగవన్నామాలను పలు రకాల రాగయుక్తంగా పాడటం శ్రేయోదాయకం. 
ఓం మురుగా, ఓం మురుగా ఓం 
ఓం మురుగా, ఓం మురుగా ఓం 
అనే సులువైన దైవస్తుతిని ఎన్నో రకాలుగా గానం చేయవచ్చు. అగస్త్యమహర్షి భగవన్నామాలను 'ఉదర పుష్పాలు' అని చెబుతారు. ఉదరం అనే పదానికి పలు అర్థాలు ఉన్నాయి. కడుపు, గుండె, కంఠం, నోరు, పెదవులు అనే అర్థాలు ఉన్నాయి. వాటి నుండి వెలువడే భగవన్నామాలే ఉదర పుష్పాలు. వీటికి సంగీతం కూడా తోడైతే దేవునిపై ఏకాగ్రత ఏర్పడుతుంది. 
భగవన్నామాలకు సంగీతాన్ని జోడించటానికి ముందుగా గుండు మల్లెపువ్వుల హారాన్ని ప్రతి వాద్యానికి సమర్పించాలి. అందుచేత అది ఓ సత్సంగ గానమాధుర్యమే అవుతుంది. ఇలాంటి సత్సంగ పూజల వల్ల ఆత్మబలం, మానసిక బలం, ఆత్మశాంతి అధికమవుతాయి. కనుకనే ఆలయాలలో సత్సంగ పూజల వలే ఉత్సవాలు జరుగుతాయి. సత్సంగ సమేతంగా పది మంది భక్తులంతా కలిసి ఏక కంఠంతో 'రామా' అని పలికితే చాలు పదిమందీ పదిసార్లు ఆ పవిత్ర నామాన్ని ఉచ్చరించినంత ఫలితాలు లభిస్తాయి. ఇక అలవికానంతగా పుణ్యశక్తులూ వర్షిస్తాయి. 
సత్సంగ సమేతంగా భగవన్నామ స్మరణ చేస్తున్నప్పుడే మనసు ఏకాగ్రత చిత్తంతో ఉంటుంది. సత్సంగ సమేతంగా భజనలు చేసేటప్పుడు తాంబూళ పళ్లెరం నిండుగా మల్లెపువ్వులు లేదా కదంబపువ్వులను చక్రపు ఆకారంలో ఉంచి మొక్కాలి. భజనలు ముగిసిన తర్వాత భక్తులందరికి ఆ పుష్ప ప్రసాదాన్ని అందించాలి. 
మన పూర్వీకులు దైవీక చింతనలు కలిగినవారు. ఏ కార్యం చేసినా ధార్మిక చింతనతో చేసేవారు. రాగం, తాళం అన్నీ మానవుడి మనస్సును లయింపజేసి మైమరచి భక్తిగానం చేసేవారు. మైమరచి నృత్యమూ చేసేవారు. మైమరచిపోవడమే అసలైన ధ్యానం. 
బ్రహ్మ తాళం వేస్తుండగా, విష్ణువు మృదంగ నాదం అందిస్తుండగా అమ్మవారు గానం చేయగా, లక్ష్మీదేవి ఆమెకు తోడుగా గాన సహకారం అందిస్తుండగా, సరస్వతి వీణనాదం ఒలికిస్తుండగా, సిద్ధులు, మహామునులు పలు రకాల వాయిద్యాలు మోగిస్తుండగా నటరాజస్వామివారు తాండవం ఆడుతుండటం వల్లే ఈ సృష్టి నడుస్తోంది. అందువల్లే పువ్వులు వికసిస్తున్నాయి. 

ఉడయార్కోవిలు శ్రీధర్మవల్లి అమ్మవారు

ధార్మిక శక్తులు ఏ యుగంలోనైనా అవసరమైనంతగా అనుగ్రహించేందుకు ఏర్పడినవే ఉడయార్‌ పాలయం అనే అత్యద్భుత శైవస్థలంలో కరవందీశ్వర ఆలయంలో ధర్మవల్లిగా అంబికాదేవి కొలువుదీరి ఉన్నారు. (వల్లి = లత) 
గ్రామాలలో జరిగే పువ్వులు గుచ్చే పూజలు గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. గంపలు గంపలుగా పువ్వులను తీసుకెళ్లి అమ్మవారి చుట్టూ పువ్వులను గుచ్చి అలంకరించి అభిషేకింపజేస్తారు. దీనితో ఆయా గ్రామాలలోని అరిష్టాలు తొలగిపోతాయి. అంబికాదేవి దేహంపై పడే ప్రతివువ్వు మంచి దేవతగా మారి ఆ ఊరికి సుభిక్షాన్ని కలుగజేస్తుంది. ఉదాహరణకు లక్ష పువ్వులు ఒకే చోట సమర్పిస్తే సుభిక్ష దేవతలంతా తరలివచ్చి సకల సౌభాగ్యాలు కలిస్తారు. సప్త కన్యలకు సంబంధించిన పువ్వులు గుచ్చే పూజ ఎల్లప్పుడు ధార్మిక చింతనలను కలిగించి కల్పవృక్షంలా కోరికలను తీర్చుతాయి. అలాంటి కల్పవృక్షమే తాళ‌మంగై శ్రీ చంద్రమౌళీశ్వర- శ్రీరాజేశ్వరి ఆలయ స్థల వృక్షం. తంజావూరు - పశుపతి ఆలయం సమీపంలో తాళ‌మంగై శివాలయం ఉంది. చక్రమంగై, హరిమంగై, శూలమంగై, నందిమంగై, పశుమంగై, తాళ‌మంగై, పుల్లమంగై అనే సప్త కన్యల స్థలాలు పక్కపక్కనే ఉన్నాయి. 



శ్రీ దర్మవల్లీ అమ్మవారు ఉడైయార్కోవిలు

ప్రతి యువతీ తన జీవితంలో ఒక్కసారైనా దర్శించి ప్రార్థించాల్సిన స్థలమే సప్త కన్యకల స్థలం. సప్తమినాడు లేదా ఆదివారాలో చిన్నారులు, కన్యలు ఈ ఏడు స్థలాలలో పూజలు జరిపితే పవిత్రమైన మహిళా లోకానికి ఏడు ప్రాయాలు సవ్యంగా ఉంటాయి. ఈ సప్త కన్యలను ఏయే రకం పూలతో పూజించాలో సిద్ధపురుషులు తెలిపి ఉన్నారు. 
చక్రమంగై - వృక్షిపువ్వు, గుండు మల్లె, మనోరంజితం 
హరిమంగై - ఎర్రతామర, తులసి, పసుపు రంగు పువ్వులు, పవళ మల్లెలు 
శూలమంగై - అరళి, ఎర్రతామర, తెల్ల తామర, సెన్బగం 
నందిమంగై - నందియావర్థనం, పన్నీర్‌పుష్పం 
పశుమంగై - గులాబీ పువ్వులు, బిక్షిపువ్వు, చామంతి పువ్వులు 
తాళ‌మంగై - మొగిలిపువ్వు, కదంబం, మల్లెలు 
పుళ్లమంగై - సంపంగి, మరువులు, దవనం, బిల్వం, పసుపు లేదా ఎరుపు కోగిల్వపువ్వలు. 
ధర్మ వృక్షాల కొమ్ములను పట్టుకుని దైవలోకాల నుండి ఈ పుడమకి వచ్చిన దేవియే ఉడయార్‌ పాలయ ధర్మవల్లి అమ్మవారు. 
తంజావూరు - సాలియమంగళం సమీపంలో ఉందీ ఉడయార్‌ పాలయం. 
ధర్మశక్తులతో భూలోకానికి వచ్చిన దేవి. లోకంలో అధర్మం అధికమైందని చింతించేవారు ఈ క్షేత్రంలో పన్నెండు రకాల పుష్పాలతో ధర్మవల్లిని పూజించి ఆరాధిస్తు వస్తూ మనశ్శాంతి లభిస్తుంది. యుగధర్మానుసారం పరిపాలన సాగించవచ్చు. ఉత్తములు ఆశీర్వాదాలు వెతుక్కుంటూ వస్తాయి. 
భూలోకానికి మహాపురుషులు ఆగమనం ఎందుకు? 
సహజంగానే భూమిపై ధర్మశక్తులు అణగారి ఉండాలనేది కలియుగ నియతి. కనుకనే మనం జీవిస్తున్న కలియుగాన అధర్మ కార్యాలు అధికంగా జరుగుతుంటాయి. యుగధర్మ నియతి ఈ విధంగా ఉన్నప్పుడు మహాపురుషులు భూమిపై మళ్లీ మళ్లీ అవతరించి కష్టపడాల్సిందేనా? 
ఏ యుగమైనా సరే ధర్మరక్షణ కోసం, మంచివారు జీవించడానికి, మంచి సమాజం అభివృద్ధిచెందడానికి మనుష్య ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. తప్పదు! ఈ విషయం వెనుకంజ వేయడం తగదు! 
అధర్మమైన కలియుగాన సంతానాన్ని క్రమశిక్షణ పెంచడం తల్లి దండుల్ర బాధ్యత అవుతుంది. అలా పెంచడమే తపస్సు. ప్రతి ఇంటా పువ్వులతో పూజిస్తే ఆ తపం సులువవుతుంది. ఇళ్లల్లో పువ్వులు అలంకరించడం దైవానుగ్రహం కోసమే కాదు మంచి యోగ, ధ్యాన శిక్షణగాను ఉంటుందని చాలామందికి తెలియదు. కనుక పువ్వులను అలంకరించడం మనస్సు ప్రశాంతత చెందుతుంది. ఇదే ఉత్తమ ధ్యానంగాను ఉంటుంది. 

కలియుగంలో దైవ దర్శనం

ప్రతియుగంలోను ఒకే రకమైన ధర్మనియమాలు ఉంటాయి. ఓ యుగంలో పదివేల సంవత్సరాలపాటు తపస్సు చేస్తే భగవద్దర్శనం ప్రాప్తిస్తుందనేది ధర్మనిరతి. ఆ తర్వాత యుగంలో పలు వందల సంవత్సరాలపాటు ఒంటి కాలిపై నిలిచి లేదా జలం మధ్యన నిలిచి, లేదా మండుతున్న అగ్ని నడుమన నిలిచి తపస్సు చేసినట్లయితే దైవ దర్శనమూ, వరాలు లభిస్తాయి. ఆ తర్వాతి యుగంలో ఉపవాసంతో ఓ స్థలంలో నిశ్చలంగా ఉంటే కొన్నేళ్ల తర్వాత దైవ దర్శనం కలిగి వరాలు పొందగలుగుతారు. 
అయితే కలియుగాన కఠినమైన తపస్సు, తాండవాలు ఏవీ అవసరం లేదు. దైవ నామస్మరణ చేస్తే చాలును. సంకీర్తనగా నోరు తెరచి పాడితేనే దైవాన్ని దర్శించగలుగుతారు. 
గానం చేయాలంటే అందుకు సంగీత తోడు కావాలి కదా అని ఎవరూ వెనుకంజవేయనవసరం లేదు. గానంపై దృష్టిపెడితే చాలు. చిన్నప్పటి నుండే చిన్న పిల్లలకు పాటపాడేందుకు శిక్షణ గరిపించాలి. దైవనామాలను ఉచ్చరించడంలో శిక్షణ కూడా ఇవ్వాలి సుమా! ఇంటిలో మరువాలు, తులసి, బిల్వం వంటి పుష్పాలు ఉంటే ఆ ఇంట సంగీత జ్ఞానం వృద్ధి అవుతుంది. 
ఆలయాలలో తొలి రోజు ధరింపజేసిన పూలమాలలను తొలగించి వాటిని చెత్తకుప్పలలో పారవేయకుండా సముద్రంలోనో, వాగులలోనో వేస్తే కుటుంబానికి పుణ్యం దక్కుతుంది. మంచి ఉపాధి లభిస్తుంది. జీవితం స్థిరమవుతుంది. ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో ఆయా సమయాలలో 'సంభవామి యుగే యుగే' (తాను అవతరిస్తారని) భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు చెబుతారు. భూలోకానికి విచ్చేసే మహాపురుషులంతా పూలతో నిండిన ఉద్యానవనాలకు చేరువగానే నివసిస్తుంటారు. వారున్న ప్రాంతాల్లో నిరంతరం ధర్మకార్యాలు జరుగుతుంటాయి. మహామునుల మహాత్మ్యం అదే! రావణుడు అకమ్రపాలన సాగిస్తున్నప్పుడు అతడికి హితబోధ చేసేందుకు ఎంతోమంది మహర్షులు లంకు వెళ్లారు. అయినా రావణుడు తన మనస్సు మార్చుకోలేదు. అయితే సమాజంలో రావణుడిలా ప్రవర్తించినవారంతా మంచివారైపోయారు. కనుక మహర్షులు తమ బాధ్యతలను కొనసాగించడానికే నిరంతరం ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ మనిషి మంచివాడుగా మారడం మారకపోవడం వారి వారి విధిని బట్టి జరుగుతుంది. కానీ మహర్షులు మాత్రం దుష్టులను సత్‌శీలురుగా మార్చేందుకు చేసే ప్రయత్నాలు ఆపే ప్రసక్తే లేదు. 
మనిషి ఎంత చెడ్డవాడైనా అతడిలోనూ ఏదో ఒక మూలన మంచితనం దాగి ఉంటుంది. ఆ మంచితనాన్ని గనుక గుర్తించి అతడు ప్రవర్తిస్తే చాలు త్వరగానే అతడు మంచివాడుగా మారిపోగలడు. అతడి చుట్టూ వున్నవారు సైతం మంచిమనుషులవుతారు. దీనితో సమాజం కొంతవరకూ బాగుపడుతుంది. దీనికి మహామునుల ప్రయత్నాలు సహకరిస్తాయి. 

శంఖు పుష్పం

కుటుంబంలో ఎవరైనా చెడు గుణాలతో వుంటే ప్రతి ఆదివారంనాడు కరుప్పన్న ‌స్వామికు శంఖుపుష్ప మాలలను సమర్పించి మొక్కితే సద్గుణవంతుడవుతాడు. వాల్మీకి మహర్షి మునుపు అడవులలో తెలిసో తెలియక అధర్మమార్గంలో సంచరించిన విషయం మనకందరికీ తెలుసు. అయితే నేడు ఆ ఉత్తమశీలుడైన వాల్మీకి మహర్షిని మనసారా అందరూ కొనియాడుతున్నాము కదా! పలు జన్మలలో తోడుగా ఉంటూ ఏదో కారణాలవల్ల విడిపోయినవారు ఇలాంటి మహర్షులను దర్శించడం వల్ల పూర్వం తాను చేసిన ధానధర్మాలు గుర్తుకు వచ్చి ఈ జన్మలోనూ ఆ ధర్మాలను నిర్వర్తించి సద్గతి పొందుతారు. ఇలాంటి వారిని సన్మార్గంలో పయనింపజేసేందుకు కూడా మహర్షులు అవతరిస్తున్నారు. 
మల్లెపూవులు మంచివారు, చెడువారు అనే తేడాలు లేకుండా సువాసలను వెదజల్లుతుంది కదా! మహాపురుషులు సైతం పువ్వులవలె పవిత్రమైనవారు. కనుక వారు ఏ రూపంలో పుడమిపై అవతరించటం, వారిని దర్శనం చేసుకోవడం వల్ల మానవులు సద్గతిని పొందటమూ జరుగుతుంది. ఈ కారణంగానే భగవంతుడు భూలోకంలో సత్పురుషులను అవతరింపజేస్తూనే ఉంటారు. 

పువ్వులలో దాగిన దైవీక శక్తులు

పువ్వులను కొన్నప్పుడు వాటిని దేవునికి సమర్పించిన తర్వాతే తలలో పెట్టుకోవాలి. ఓసారి ఉపయోగించిన పువ్వులను కొనడం మంచిది కాదు. మనకు బాగా తెలిసిన చోటే పువ్వులను కొనుగోలు చేయాలి. 
పెళ్లికి ఉపయోగించిన పువ్వులను, మృతదేహాలపై చల్లిన పువ్వులను కూడా కొందరు అమ్ముతుంటారు. వాటిని కొని ఉపయోగిస్తే కడుపునొప్పులు వస్తాయి. పొద్దుగుంకే వేళ పువ్వులను కొనకూడదు. 
పూర్వం నుదుట కుంకమ బొట్టు ధరించిన ముత్తయిదువల వద్దే పువ్వులు కొనాలనే నియమం ఉండేది. ఆ తర్వాత పోట్రిడై యోగి అనే మహాముని పలు కాలం తపమాచరించిన తర్వాత పురుషులు నుదుట కుంకమ ధరించి పువ్వులను విక్రయిస్తే వాటిని కొనవచ్చునని ప్రకటించారు. పువ్వుల ద్వారా ఆ పోట్రిడై యోగి మనలను అనుగ్రహిస్తూ వుంటారు. 
మహిళలు తలలో ఒ పువ్వును ధరించరాదు. అలా ధరిస్తే వివాహయత్నంలో ఆటంకాలు ఎదురవుతాయి. 
పువ్వులను కొప్పులలో గుచ్చి ధరించకూడదు. తన నడుమ పావిట దీసి, చూపుడువేలు, బొటవేలితో వెంట్రుకలను పైకెత్తి, బొటనవేలు, ఉంగరపు వేలితో పువ్వులను తలలో పెట్టుకోవాలి. పువ్వులు తలకు ఇరువైపులా వేలాడ కూడదు. తలలో పువ్వులు చెండులా అందంగా కనిపించాలి. చెవి కొసనుండి దిగువ వరకు ఉన్న ప్రదేశం దాకా కాస్త జాగాను విడిచిపెట్టి తలలో వెనుకవైపున పువ్వులు పెట్టుకోవాలి. 
ఇక పూలధారణలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఎట్టి పరిస్థితులలోనూ వాసనలేని పువ్వులను సువాసనలు వెదజల్లే పువ్వులతో చేర్చి కట్టరాదు. అలా చేస్తే శాపానికి గురవుతారు. వాసనలేని పువ్వులను దేవునికో, ఆలయానికో సమర్పించకూడదు. ఉదాహరణకు అడవిమల్లెలు, కాగితపు పువ్వులు. 
అడవిమల్లెలను సువాసనలున్న పువ్వులతో చేర్చి తలలో పెట్టుకుంటే దుస్వప్నాలు వస్తాయి. అడవి జంతువులు కలలో వచ్చి బెదరిస్తాయి. కాగితపు పువ్వులు పెట్టుకుంటే మనస్సు చంచలమై అయోమయంగా మారుతుంది. 
అర్చనకు అనువైన రోజులు - పువ్వుల రకాలు 
అంబికాదేవి ఏయే దినాలలో ఎలాంటి పువ్వులతో అలంకరించి పూజించాలో, ముఖ్యంగా నవరాత్రి సమయాలలో పాటించాల్సిన పద్ధతులను గురించి పూర్వీకులు మనకు తెలిపి ఉన్నారు. 
ఆదివారం : తామరపుష్పాలతో అలంకరించి పూజిస్తే ఇంటిలో అప్పుల బాధలు ఉండవు. మగువలలో పాతివ్రత్యం పెరుగుతుంది. 
చెన్నై సమీపంలో ఉన్న జ్ఞాయిరు, సూర్యనార్‌ కోయిల్‌ సమీపం తిరుమంగళకుడిలో భాస్కరపూజ సందర్భంగా సూర్యకిరణాలు స్వామివారిపై ప్రసరిస్తాయి. ఆ క్షేత్రాలలో ఈ పూజలు జరుపటం శ్రేయస్కరం. 

సోమవారం : కలువ పువ్వులు, మల్లెపువ్వులతో అంబికాదేవిని అలంకరించి పూజించాలి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తొలగి ఐకమత్యం ఏర్పడుతుంది. 
చెంగల్పట్టు సమీపంలో ఉన్న మామండూరు, ఉత్తిరమేరూరు శివాలయం, ముసిరి శ్రీచంద్రమౌళీశ్వర ఆలయం ఈ పూజలకు అనువైన క్షేత్రాలు. 
మంగళవారం : అరళి, సంపంగి పువ్వులతో అమ్మవారిని అలంకరించి పూజించాలి. భర్తను వాహన ప్రమాదాల నుండా కాపాడగలిగనే పూజ ఇది. తరచూ ప్రయాణం చేసేవారు ఈ పూజలు చేయడం మంచిది. 
తిరువారూరు, కుడవాసల్‌ సమీపం కాప్పనామంగళం, చెన్నై కోయంబేడు శివాలయం, సాకోట్టయ్‌ ఉయ్యవందమ్మాళ్‌ కోయిల్‌ వంటి క్షేత్రాలలలో ఈ పూజలు చేయాలి. 
బుధవారం : పగడపు మల్లెలతో అలంకరించి పూజించాలి. చిన్నారులలో జ్ఞాపకశక్తి అధికమవుతుంది. 
కాంచీపురం- వందవాసి మధ్య ఉన్న కూళమందల్‌ పేసుం పెరుమాళ్‌ ఆలయం, పుదుకోట సమీపం తిరువోణం గ్రామంలోని శివాలయం, కూత్తనూరు సరస్వతి ఆలయం సమీపంలోని శ్రీలక్ష్మీ నారాయణ ఆలయం వంటి క్షేత్రాలలో ఈ పూజలు చేయడం శ్రేయస్కరం. 
గురువారం : చామంతి పువ్వులతో అలంకరించి పూజించాలి. వ్యాపారం వృద్ధి చెంది, ఖజానా నిండుతుంది. 
పుదుకోట సమీపం పూరమ్‌ నక్షత్ర స్థలమైన తిరువరంకుళం శివాలయం, ఆవుడయార్‌ కోయిల్‌,- తిరుపునవాసల్‌ సమీపంలోని తీయత్తూర్‌ సహస్ర లక్ష్మీశ్వర కోయిల్‌, తిరుకరుక్కావూరు సమీపం పొన్‌మన్మేయ్‌న్ద నల్లూరు శ్రీలక్ష్మీ నారాయణ పెరుమాళ్‌ ఆలయం, శివగంగ జిల్లా తిరుపత్తూరు నిండ్ర నారాయణ పెరుమాళ్‌ ఆలయం వంటి క్షేత్రాలు ఈ పూజలకు అనువైనవి. 
శుక్రవారం : ఎరుపు తెలుపు రంగులున్న రామభాణ పుష్పాలతో అలంకరించి పూజించాలి. పిల్లల లోపాలు తొలగుతాయి. అమ్మాయిలకు మాంగళ్య బలం చేకూరుతుంది. 
నాట్టరసంకోట్టయ్‌ కన్నాత్తాళ్‌ అమ్మవారు, స్వామిమలై సమీపంలోని నాక్కుడిలోని శ్రీ కళ్యాణసుందరి, తిరువారూరు సమీపం కళ్యాణమహాదేవి గ్రామంలో ఉన్న శ్రీకళ్యాణ మీనాక్షి ఆలయం వంటి క్షేత్రాలలో ఈ పూజలు చేయవచ్చు. 
శనివారం : మనోరంజితం, నీలోద్భవం, శంఖు పుష్పాలతో అలంకరించి పూజించాలి. మానసిక పరిపక్వత, ప్రశాంతత కలుగుతాయి. 
చెన్నై- పుదుచ్చేరి మధ్యనున్న మరకాణం భూమీశ్వరర్‌, అరంతాంగి సమీపంలోని అరసర్‌కుళం శ్రీస్వర్ణపురీశ్వరర్‌, మీమి‌సల్‌ సమీపంలోని మంచకుడి అంజేల్‌ పెరుమాళ్‌ మరియు శ్రీకళ్యాణ లక్ష్మీనరసింహాలయం, తిరుచ్చి- తురైయూరు సమీపంలోని తిరుత్తియమలై తాయినుమ్‌ నల్లాల్‌ అంబికాలయం వంటి క్షేత్రాలు ఈ పూజకు అనువైనవి. 
సంపంగి పూలకు సువాసనలు ఆపాదించిన దివ్యపురాణ వైభవం, పువ్వుల దివ్యమహిమలను భూలోకంలో వ్యాపింపజేసినవారు పండార వాడై‌ సిద్ధులు. 
పండార వాడై‌ అనే పేరుకలిగిన స్థలాలలో ప్రారంభంలో కొంతకాలం బసచేసి, చివరకు అరుణాచలక్షేతమ్రైన తిరుఅణ్ణామలై చేరుకుని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తించినవారే ఈ పండార వాడై సిద్ధపురుషుడు. పువ్వుల సువాసనలు, వాటి దివ్యమహిమలను జనానికి ఎలుగెత్తిచాటారు. ఇక కుప్పయ్‌ సిద్ధులు, మలపుళు సిద్ధులు ఎల్లప్పుడూ చెత్తాచెదరంతో కూడిన, మలమూత్రాల విసర్జన ప్రాంతాల్లో సంచరించిన వారి దేహం నుండి నిరంతరం మల్లెపువ్వుల సువాసనలు గుబాళింపులు ప్రజలపై వెదజల్లేవి. అక్కడి ఆలయానికి వెళ్లే భక్తులు చెత్తకుప్పల నడుమనున్న ఈ సిద్ధపురుషులకు పువ్వులను అందించి, వాటిని వారి చేతుల మీదుగా స్వీకరించి ఆలయంలో సమర్పిస్తుండేవారు. ఆలయ అర్చకులు సైతం భక్తులు పువ్వులను అందించిన వెంటనే 'కుప్పయ్‌ సిద్ధులు, మలపుళు సిద్ధుల ఆశీస్సులందుకున్నారా?' అని ప్రశ్నించడం ఆనవాయితీగా ఉండేది. ఇదే విధంగా పండార వాడై సిద్ధులు ఉండే ప్రాంతంలోనూ పువ్వుల సువాసనలు వ్యాపించేవి. 
ఇక తమిళుల ఆరాధ్యదైవం కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరుడు)కి ప్రీతికరమైన సంపంగి పువ్వులు శాకంబరి దేవీ అనుగ్రహంతోనే అంతటి సువాసనలను పొందగలిగింది. ఆ సంపంగి పువ్వులు ఆ వరాన్ని పొందిన పుణ్యక్షేత్రమే తిరుచెంగాట్టాంగుడి. తిరువారూరు జిల్లాలోని నన్నిలం అనే చోట ఆ ఆలయం ఉంది. 
భూలోకంలో వృక్షసంతతిని వ్యాపింపజేసే శాకంబరీ దేవి, సంపంగి పువ్వులకు సువాసనలను ప్రాప్తింపజేయడానికి తపమాచరించిన చోటే తిరుసెంగాట్టంగుడి శ్రీ ఉత్తరాపదీశ్వరాలయం. సిరుతొండనాయనార్‌ జీవించిన పుణ్యక్షేత్రమిది. శివ, విష్ణు, బ్రహ్మ - త్రిమూర్తులు, పర్వతరాజపుత్రిక పార్వతి, లక్ష్మీ, సరస్వతి దేవి సంపంగి పువ్వులకు అంతటి సువాసనలందించారు. అంతే కాకుండా ఆ పువ్వులు సుబ్రహ్మణ్యేశ్వరుని తొలిపూజలకు ఉపయోగపడేలా చేశారు. ఆ సమయంలోనే పండార వాడై‌ సిద్ధులు సైతం మరో సిద్ధుడిగా అవతరించి ఉండేవారు. కనుకనే ఆయన సంపంగి పువ్వుల సువాసనల చరిత్రను లోకానికి ఎలుగెత్తి చాటగలిగారు. అప్పట్లో అరుణాచలక్షేత్రమంతా సంపంగి పూల వనాలతో నిండిఉండేది. పండార వాడై సిద్ధులు వసించిన సంపంగి వాడై‌ సిరుకొండ నేటికీ ఆ సువాసనలను వెదజల్లుతోంది. 
దేవలోకంలోనూ పూలవనాలు ఉన్నాయి. ఆ లోకంలో స్వర్ణపుష్పాలు, రత్న పుష్పాలు, వైఢూర్య పుష్పాలు విరివిగా ఉన్నప్పటికీ తామర, మల్లెపువ్వులు వంటి భూలోపు పువ్వులకే దైవీకతత్త్వాన్ని కలిగి ఉంటాయి. 
భూలోకంలో ద్వాదశి దినాన తామరపుష్పాలతో దేవుని పూజిస్తే దేవలోకంలో వెయ్యి స్వర్ణపుష్ఫాలతో అర్చించిన ఫలితాలు దక్కుతాయి. కనుకనే మహర్షులు, జ్ఞానులు, యోగులు కోటాను కోట్ల దేవతలు, కిన్నర, కింపురుష గంధర్వులు తపమాచరించడానికి భూలోకానికే వస్తుంటారు. ఇక పూజకు ఉపయోగించే కొబ్బరిని 'కపాల పుష్పం', 'కపాల ఫలం' అని దేవలోకంలో కీర్తిస్తుంటారు. 

గౌతమ మహర్షి సేవలు

సృష్టి ఆరంభంలో పువ్వులను జనింపజేసేందుకు రాధ, దుర్గ, లక్ష్మీ, సరస్వతి, సావిత్రి అనే పంచ మహామాతృమూర్తులు తోడ్పడ్డారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రినేత్రాల నుండి వెలువడిన నేత్ర పుష్ప చక్రం ద్వారా వేదపుష్పం, మంత్రపుష్పం, జ్ఞానపుష్పం, యోగపుష్పం, నక్షత్రపుష్పం, స్వర్ణ పుష్పం అనే ఏడు రకాల పుష్పాలకు సంబంధించిన బీజాలను జనింపజేసి శాకంబరీ దేవికి అందించారు. ఇలా శాకంబరీ దేవి ద్వారా నవరాత్రులలో దశమినాడు పువ్వులను జనింపచేశారు. వారంలో ఏడురోజులూ కోటానుకోట్ల పువ్వులు వ్యాపించి అండచరాచరమంతటా పూలవనాలతో నిండిపోయాయి. ఇలాంటి సువాసనలు అందించే పువ్వులతో నిండిన నందనవనం భూలోకంలో తొలుత ఆవిర్భవించిన స్థలాలలో పూవనూరు ఒకటి. తంజావూరు - నీడామంగళం సమీపంలో ఉన్న ఆ పుణ్యస్థలంలోనే కల్పవృక్షపు తొలి పుష్పం భూమిపై పడింది. కల్పవృక్షపు పువ్వును ధరించిన కర్పగవల్లి, రాజపుష్పాన్ని ధరించిన రాజేశ్వరిదేవి, జలయోగపుష్పాన్ని ధరించిన చాముండేశ్వరీ దేవి అనుగ్రహం అధికంగా లభించే స్థలం కూడా ఇదే. పువ్వులు అందించే పుణ్యఫలాలను కలియుగంలో అత్యధికంగా అందించే అరుదైన స్థలమిదే!

పూవనూరు

శాకంబరి దేవీ వల్లే కోటానుకోట్ల పుష్పాలు జనించాయి. దేవలోకంలోని దేవతలను ఆరాధించేందుకు భూలోకంలోని పువ్వులనే అధికంగా ఉపయోగిస్తుంటారు. భోలోకంలోని పువ్వుల మహిమలన్నీ దేవతలందరికీ బాగా తెలుసు. వారి వారి స్థలాలలో భోలోకపు పుష్పాలతో దైవాన్ని పూజిస్తారు. ముక్తులు, మోక్షభూమివాసులు, పితృలు వంటివారు కోటానుకోట్ల ఊర్థ్వ లోకవాసులు పువ్వుల మహత్త్యం గురించి తెలుసుకుని ఉన్నారు. ఇంతటి పుణ్యఫలాలు కలిగిన పువ్వుల మహిమను భూలోకపు వాసులు తెలుసుకోలేకపోతుండటమే విచారకరం. ఇకనైనా పువ్వుల మహత్మ్యాన్ని తెలుసుకుని పూజలు చేద్దాం. 
ఇక చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించేటప్పుడు అరటిపువ్వు, మొగిలిపువ్వు, తెల్లతామరపువ్వు, నందివర్థనం, సింధూరపువ్వులను తాంబూళ పళ్లెంలో ధాన్యంపైన పెడతారు. అరటిపువ్వు రేఖలను విరచి అందులో ధాన్యపు గింజలను అక్షింతలుగా ఉంచి, విద్యాపూజను నిర్వహిస్తారు. ఆవుదూడల ఎదుట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభదాయకం. ఈ పూజల తర్వాత అరటిపువ్వును ముక్కలు చేసి పశువుకు పెట్టాలి. అక్షరాభ్యాసం నాడు ఏ భాషలో అక్షరాలు తీర్చిదిద్దుతామో ఆ భాషలో విద్యను గరపాలి. దీనికి దైవీక కారణాలు కూడా ఉన్నాయి. 
ప్రతిభాషకు చెందిన అక్షరాలను 'అక్షరపుష్పం' అని చెబుతారు. కనుక దైవగీతాలను 'అక్షరమాల' అని పిలుస్తారు. అంటే అక్షరపుష్పాల ద్వారా అర్చించడమవుతుంది. నిత్యమూ రంగనాథులవారికి తాను ధరించిన పూమాలను సమర్పించి పునీతురాలైన భక్తురాలు ఆండాళ్‌దేవి. చాలామంది తమిళంలోనో సంస్కృతంలోనో వారి మాతృభాషలలోనో అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. మంచి మార్కులు సంపాదించడం ఒక్కటే ఉత్తమ విద్యకాదు. విద్యతోపాటు క్రమశిక్షణ సత్‌శీలం పెంపొందించుకోవాలి. విద్యాపాఠాలు సైతం ఆధ్యాత్మికతకు దోహదం చేసే రీతిలో ఉండాలి. లేకుంటే విద్యనభ్యసించే పిల్లలు యాంత్రికంగా ప్రవర్తిస్తారు. సత్యజ్ఞాన విద్య కూడా చాలా అవసరమే. ఆత్మశక్తి, వీర్యశక్తి, జ్ఞానశక్తి, యోగశక్తిని బోధించడమే ఉత్తమమైన విద్యగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం పిల్లలు సద్గుణాలు లేకుండా ఉండటానికి తల్లిదండ్రులే కారణమవుతున్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్యనందిస్తేనే సద్గుణాలు కలుగుతాయి. మన దేశపు సంస్కృతీ సంప్రదాయాలను విడిచిపెట్టకూడదు. రోజూ బాలికలు తలపై పువ్వులు ధరించి పాఠశాలలకు వెళితే జ్ఞాపకశక్తి అధికమవుతుంది. పాఠశాలలోనూ వెలుపలా ఆ పువ్వుల సువాసనల వల్ల పవిత్ర ప్రాంతాలుగా మారుతాయి. 
బ్రహ్మలోకంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే పుష్పాలను కోసి రోజూ శివపూజ, విష్ణుపూజలు నిర్వహిస్తుంటారు. కనుకనే భూలోకంలో మానవులు పువ్వుల మహత్మ్యం తెలుసుకుని పువ్వులతో నిత్యపూజలు, ఆలయ దర్శనం చేస్తుంటారు. పువ్వుల పవిత్రతను తెలియజేసే పురాణ గాథ ఒకటి ఉంది. 
ఓ సాయం సంధ్యాసమయంలో... 
అమృతకటాక్షఫు వేళ దైవీక పరిపూర్ణ మనస్సుతో ప్రపంచానికి మేలు చేయడానికి బ్రహ్మదేవుడు సిద్ధమవుతారు. ఆ శుభముహూర్త వేళ అందమైన ఓ అమ్మాయిని సృష్టిస్తారు. అన్ని రకాల విద్యాబుద్ధులు, సత్‌శీల గుణాలు నేర్పేందుకు విద్యాపూజను నిర్వహించి పాఠాలు చెప్పసాగారు. నాలుగువేదాలు తెలిసిన బ్రహ్మదేవుడు ఆ అమ్మాయికి సర్వకళలను నేర్పారు. ఆ అమ్మాయికి పాఠాలు చెప్పేందుకు బ్రహ్మదేవుడు భూలోకంలోనే పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయి సర్వకళలను నేర్చుకుని యుక్తవయస్సుకు చేరుకున్న ఓ తరుణాన ఓ రోజు నారదమహర్షి బ్రహ్మలోకానికి రాగా ఆ అమ్మాయి ఆ మహాముని ఆశీస్సులు కోరింది. నారదుడు 'దీర్ఘ సుమంగళి భవ' అని ఆశీర్వదించాడు. ఆ అమ్మాయి చేసిన పాదపూజలను చూసి అచ్చెరువొందాడు నారదుడు. బ్రహ్మదేవుడు ఇవ్వలేని వరాలేమైనా ఉంటాయా? 

వృక్షి పువ్వులు

మహాపురుషులకు పాదపూజ చేసేటప్పుడు గురుకత్తి పుష్పం లేదా ఎరుపు వర్ణ వృక్షిపువ్వులను ఉపయోగిస్తే చాలా మంచిది. 
నారాయణ నామ మహిమ 
ఆ యువతి నారదమహర్షితో ఇలా అన్నది: 
'స్వామీ ఓం నారాయణాయ నమః' అని చెప్పడం కంటే 'ఓం నారదనారాయణాయ నమః' అని చెబితే పెరుమాళ్‌ అనుగ్రహం త్వరగా దక్కుతుందని బ్రహ్మదేవులవారు తెలిపారు. అంటే తన భక్తులను అనుగ్రహించడంలో పెరుమాళ్‌ అందరికంటే ముందుంటారట. ఆ పెరుమాళ్‌కు అత్యుత్తమ భక్తుడు మీరే కదా మీ విష్ణుభక్తికి సాటి లేదని బ్రహ్మదేవుడు నాకు వివరించారు. ఉత్తమ ప్రతివ్రతగా ఉండాలని ఆశీర్వదించండి స్వామీ!' అని మొక్కింది. నారదమహర్షి ఆమె కోరికను మన్నించి ఓ మంచి వ్రత పద్ధతిని ఆమెకే తెలియజేశాడు. లోకం మెచ్చుకునే ప్రతివ్రతగా మారేందుకు ముల్లై పువ్వులతో ఆరాధించడం మంచిది. ఇక అమ్మాయిని ఓ ఉత్తముడికి వివాహం జరిపించాలని బ్రహ్మదేవుడు నిర్ణయించాడు. 
ఆ సమయంలోనే నారదమహర్షి నుండి ఆ వరాన్ని పొందింది. నారదుడు చెప్పిన వ్రతపద్ధతి ఏమిటంటే పాతివ్రత్యంలో ఉత్తమస్థితిని పొందటానికి ప్రతి పౌర్ణమి రోజున వ్రతమాచరించాలి. ఆ రోజున ముల్లై పువ్వులతో గోమతి దేవి నామాలను ఉచ్చరిస్తూ అమ్మవారిని ఆ పుష్పాలను అలంకరించి మొక్కాలి. ఇదే గోమతి ఉపాసనకు దోహదం చేసే ముల్లై పుష్ప సమర్పణ వ్రత పూజ. 
గోమాతా మా కులమాత 
కులమాతా మా గోమాత 
గోమాతా వరదాయని గోమతి మాతా 
గోకులపు తిలకవతి గోమతి మాతా 
-ఇదే గోమతీశ్వరికి సంబంధించిన స్తుతి. శంకరనారాయణమూర్తి ఇష్టదేవేరియే ఈ గోమతి మాత. యువతులు పసుపు అరళి, పసుపు చామంతి, గుండు మల్లెలు, కదంబపువ్వులతో అర్చించాలి. అమ్మవారి పాదాలపై ఉంచి గోమాతను స్తుతించాలి. 

చాలా సులువైన పూజ ఇది. భూలోకపు మహిళలకు బాగా తెలిసిన పూజా పద్దతి ఇదే. 
బ్రహ్మదేవుడు సృష్టించిన ఆ యువతి పౌర్ణమి వ్రతమాచరించి ముల్లై పువ్వులను సమర్పించి ప్రార్థనలు చేసింది. ఆ యువతిని పెళ్లాడేందుకు పలువురు ముందుకొచ్చారు. ఆ యుగపు నియమం ప్రకారం భూమిని చుట్టి ఎవరు అందరికంటే ముందు గమ్యం చేరుకుంటారో అతడికిచ్చి వివాహం చేస్తారు. భూమిని చుట్టి రావడం సులువైన పని కాదు. తప, యోగ, జ్ఞానశక్తులు కలిగినవారికే అది సాధ్యం కాగలదు. భూమిని ఆత్మార్థంగా ప్రదక్షిణ చేసేవారి దీర్ఘాయుస్సు, దీర్ఘ దర్శనమూ లభిస్తాయి. 
ఆ ప్రకారం పలువురు భూమిని చుట్టేందుకు సిద్ధమయ్యారు. గతంలో నారదుడిచ్చిన మామిడి పండు కోసం వినాయకుడు భూలోకాన్ని చుట్టిరమ్మంటే తన తల్లిదండ్రులైన శివపార్వతులను మూడు మార్లు ప్రదక్షిణ చేసి, తలిదండ్రులను ప్రదక్షిణ చేస్తే భూలోకాన్నే చుట్టినట్లవుతుందని చెప్పి ఆ పండును దక్కించుకున్నారు. ఇదే రీతిలో లక్ష్మీసమేతుడైన మహావిష్ణువును ప్రదక్షిణ చేసినా లోకాన్ని చుట్టివచ్చినట్లవుతుంది. ఇలా ఆలోచనల తెంపరలో మునిగిన నారదుడికి చటుక్కున అ అమ్మాయికి అన్ని విధాలో యోగ్యుడైన వ్యక్తి జ్ఞప్తికి వచ్చింది. భూలోకంలోనే కదా ఉత్తమపురుషులు ఎక్కువగా ఉండేది. నారదుడు భూలోకం చేరుకున్నాడు. గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. బ్రహ్మలోకంలోని ఆ తరుణికి అనువైన భర్త మీరేనన్నాడు నారదుడు. గౌతమమహర్షి అందుకు అంగీకరించలేదు. కాని నారదమహర్షి తన వాదనలతో ఆ మహామునిని అంగీకరింపజేశాడు. 
కలియుగంలో అనువైన భార్యను పొందటానికి మాంగల్యభాగ్యం ఇచ్చే మంగళమైన గురు భగవాన్‌' అంటూ స్తుతించి పురుషులు మాలగా కట్టి ఇచ్చిన చామంతి మాలతో గురువారాల్లో గురుహోర ముహూర్తంలో దక్షిణామూర్తికి సమర్పించి మొక్కాలి. ఈ పూజలకు తప్పనిసరిగా పసుపు చామంతి పువ్వులనే వాడాలి. 
గురువారం గురుహోర సమయం : ఉదయం 6-7, మధ్యాహ్నం 1-2, రాత్రి 8-9. ఆ తర్వాత వేకువజాము 3-4. ఆ రోజున సూర్యోదయ సమాయాన్ని బట్టి ఈ సమయాలలో స్వల్ప మార్చులు చోటుచేసుకుంటాయి. 
నారదమహర్షి ఎంతగా పట్టుబట్టినా బ్రహ్మ మానసపుత్రికయైన ఆ మగువను మనువాడేందుకు గౌతమ మహర్షి సుతరామూ అంగీకరించలేదు. నారదుడికి ఏం చేయాలతో తోచలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నట్టుండి ఆ సమయంలో 'నారదమహర్షి మాటను అంగీకరించు మహర్షీ' అంటూ అశరీరవాణి పలికింది. 'హమ్మయ్యా! తానొచ్చిన కార్యం నెరవేరింది' అని ఊపిరి పీల్చుకున్నాడు నారదుడు. అది దైవానుగ్రహమని భావించిన గౌతమ మహర్షి వివాహమాడేందుకు అంగీకరించాడు. ఇరువురూ బ్రహ్మలోకానికి బయలుదేరారు. దారిలో ఓ అందమైన పశువు దూడను ఈనుతున్న దృశ్యం కనిపించింది. ఓ వైపు ఆ గోమాత ముఖం, దాని వెనుక వైపు ఉదరంలో నుండి నేలపై జారిపడబోతున్న చిన్ని దూడ ముఖం ఇలా ఆ రెండు జీవాల ముఖాలను గౌతమమహర్షి దర్శించాడు. ఆ రెండు జీవాల ముఖాలను చూడగానే అమ్మునీశ్వరుడికి సాక్షాత్తూ మహాలక్ష్మీదేవి ముఖరావిందాలను దర్శించినంత అనుభూతి కలిగింది. ఓ వైపు జన్మనిచ్చేందుకు సిద్ధమైన పశువు, మరో వైపు జనించడానికి సిద్ధంగా ఉన్న చిన్ని దూడ ముఖాలు కనిపించే సమయంలో ఆ గోవును గనుక 14 సార్లు ప్రదక్షిణ చేస్తే ఏడేడు లోకాలను ప్రదక్షిణం చేసినంత భాగ్యం కలుగుతుంది. ఈ విషయం బాగా తెలిసిన గౌతమ మహర్షి ఊరుకుంటాడా? ఆ గోవును ఆ మహర్షి పధ్నాలుగుసార్లు చుట్టి మాంగళ్యసూతకం పఠించారు. ఆ తర్వాత ఇరువురూ బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు. మార్గమధ్యంలో తనకు ఎదురైన సంఘటనను గురించి నారదుడు బ్రహ్మదేవుడికి ఎరుకపరచి, అందరికంటే ముందుగా భోలోకాన్నే కాదు ఏడేడు లోకాలను చుట్టి వచ్చినంత పుణ్యఫలాన్ని దక్కించుకున్నది గౌతమ మహర్షేనని నుడివాడు. బ్రహ్మదేవుడు చాలా సంతసించి గౌతమ మహర్షిని తన మానసిక పుత్రికను ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఆ ఉత్తమ పతివ్రతా దేవియే అహల్య అవుతుంది.

ఈ పురాణగాథనే అగస్త్యమహర్షి తన శిష్యులకు తరచూ వినిపించారు. 
సూటి ఆవుకు ప్రతి రోజూ అరటి పువ్వులను తినిపించి మొక్కితే ఇంటిలో ఏర్పడే ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతాయి. ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. 
గోమాతా నీవే గోలోక వేదం 
ఆగమాలకు నెలవే గోమాత 
భాగవత మహత్త్యం చాటే గోమాతా 
పశుపతిగా పతిపశువుగా కరుణించు మాతా 
- ఇదే గోమాతా స్తుతి. 
తంజావూరు సమీపం తాళమంగై ఆలయం సమీపంలో పశుపతి అనే గ్రామంలో ఉన్న శ్రీపశుపతీశ్వర ఆలయంలో శుక్ర, మంగళ, ప్రదోష రోజులలో ఆవుదూడలను మూడుసార్లు ప్రదక్షిణ చేసి గోపూజలు చేస్తే ఇంటిలో శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి. 
ఇలా ఆలయంలో ఆవుదూడలను ప్రదక్షిణ చేసేటప్పుడు వచ్చే గోమయం చాలా పవిత్రమైనది. ఆ గోమయపు చుక్కలను వంటిపై చల్లుకుంటే చాలు దైవాశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. 
పతివ్రతా శిరోమణి అహల్యకు శిలగా మారాలనే శాపం ఎందుకు వచ్చింది? 
అది శాపం కాదు ఘోరతపస్సు అని చెబుతారు సిద్ధపురుషులు. 
ముల్లై పుష్పాలతో పూజించినందువల్లే ఆమె లోకం మెచ్చే పతివ్రతగా పేరుతెచ్చుకున్నారు. రామాయణ కాలంలో అహల్యకు శాపం వచ్చింది. 
బ్రహ్మలోకంలోనూ, భూలోకంలోనూ అందరూ అహల్య అందాలను గురించే కబుర్లాడుకునేవారు. ఈ విషయం దేవలోకాధిపతి దేవేంద్రుడు చెవులకు సోకింది. ఆత్రుత అణచుకోలేక దేవేంద్రుడు నేరుగా వెళ్లి అహల్యను తనివితీరా చూశాడు. ఆమె అందానికి అచ్చెరువొందాడు. తానున్న దేవలోకంలోనూ ఇంతటి అందాలను కలిగిన దేవకన్నలెవరూ లేరే. అహల్యకు ఇంతటి అందం ఎక్కడినుండి వచ్చిందో కదా! అని కనురెప్పలను ఆర్పకుండా తదేకంగా చూశాడు. నవయవ్వన పట్టుసడలని అవయవాల సౌందర్యంతో తళతళలాడుతూ మెరుస్తున్న ఆమె అందాలకు తాను దాసోహమనుకున్నాడు. అహల్యపై మోహపరవశుడైనాడు ఆ దేవలోకాధిపతి దేవేంద్రుడు. ఆమె పొందుకోసం తహతహలాడాడు. ఆ లోపున గౌతముడు అహల్యను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దేవేంద్రుడికి అహల్యపై మోజు మరింత పెరిగిందే కాని ఏ మాత్రమూ తగ్గనేలేదు. దేవేంద్రుడిలో కామం కట్టలు తెంచుకున్నది.

తన కామపు వాంఛను తీర్చుకునేందుకు ఓ పధకం వేసుకున్నాడు. ఓ వేకువజామున గౌతమ మహర్షి ఆశ్రమం వద్దకు వెళ్లి కోడి పుంజుగా మారి రెండుమార్లు కూత పెట్టాడు. ఆ కోడికూతలను విని, తెల్లారిందనుకున్నాడు గౌతముడు. స్నానపానాదుల కోసం నదీ తీరానికి బయలుదేరాడు. అదే సమయంలో ఇంద్రుడు గౌతముడి రూపంతో ఆశ్రమంలో చొరబడ్డాడు. నదీ తీరానికి వెళ్లిన గౌతముడు తెల్లారలేదని, కోడికూతలు విని మోసపోయానని అనుకుంటూ తన ఆశ్రమానికి తిరిగొచ్చాడు. అహల్యను చూసి ఆ మునీశ్వరుడు ఆగ్రహోదరుడైనాడు. అహల్యను శిలగా మారిపోవుదువు గాక అని శపించాడు. అహల్య నవయవ్వన అందమైన ఆకారమే దేవేంద్రుడిని కామోద్రేకుడిగా మారాడనుకున్నాడు. అహల్యకు ఆ అందం లేకుండా చేయాలనే గౌతముడు శిలగా మారిపోతావు అంటూ అహల్యకు శాపమిచ్చాడు.

ఇక తన సౌందర్యరాశియైన తన సతీదేవి అందాలకు మోహించిన దేవేంద్రుడికి, 'వళ్లంతా యోని నేత్రాలతో ఉండెదవు గాక' అని శాపమిచ్చాడు. వళ్లంతా యోని నేత్రాలను చూసి దేవేంద్రుడు దుఃఖించాడు. సిగ్గుతో కుంచించుకుపోయి ఎవరికంట పడకుండా హిమాలయాల్లో కొంత కాలం దాక్కున్నాడు. కాళ్ళావేళ్లా మహర్షిని వేడుకుని శాపం నుండి బయటపడ్డాడు.

ఇక అహల్య సంగతి ...

శ్రీరాముడి పాద స్పర్శతో శిలగా నున్న అహల్యకు శాపవిమోచనం లభించింది. ఉన్నత పదవుల్లో ఉన్న వారు కామచింతనలు లేకుండా ఉండాలనే ఈ పురాణగాథ తెలియజేస్తుంది. ఈ పురాణగాథలో అహల్య శీలంపై అపనిందలు వేయడం తగదు. బ్రహ్మదేవుడి వల్ల సృష్టింపబడి, నారద మహర్షి ద్వారా పతివ్రతా శిరోమణిగా వరం పొంది, పౌర్ణమి దినాలలో గోమాతను పూజించి, గౌతమ మహర్షిని భర్తగా పొందిన అహల్య తప్పిదాలకు పాల్పడే అవకాశమే లేదు. ఇక ఇంద్రపదవి అనేది కోటానుకోట్ల జన్మలలో ఉత్తమ కార్యాలను నిర్వహించడం వల్ల పుణ్యఫలాలు పొందడం వల్ల లభించే అరుదైన అత్యున్నత పదవి. అయితే ఇంద్రుడు, దేవతలు అహంకారం, పేరాశల వల్ల తప్పిదాలకు పాల్పడే అవకాశం ఉంది. అందులోనూ కామం పాతాళానికి పడవేస్తుంది. సత్‌శీలురాలైన పతివ్రత జోలికి ఎవరూ పోకూడదు. ఆమెను దైవసమానురాలిగా భావించాలి. వివాహమైన తర్వాత భార్యాభర్తలు అందం కోసం అర్రులు చాచకూడదు. తనపై ఎవరూ ఆశలు పెట్టుకున్నా వాటిని మొగ్గలోనే తుంచివేయాలి. ఈ పురాణగాధ మనకు తెలుపుతున్నది ఏమిటంటే ఎంతటి అందమూ అహంకారం కలిగినా మహిళలు ఇతరులలో కామభావాలను ప్రేరేపించేలా మసలు కోకూడదు. అదే సమయంలో సకల దేవతలకు అధిపతిననే అధికారంతో విర్రవీగిన దేవేందుడ్రికి గుణపాఠం లభించింది. 
ఎంతోమంది దేవేంద్ర పదవులను పొంది ఉంటారని అయితే కొండంత పుణ్యం చేసి ఉంటే ఆ పదవిని పొందటం సులభసాధ్యమని అయితే ఆ పదవిని పొందిన తర్వాత కాసింత కామవాంఛ ఏర్పడితే చాలు ఆ ఇంద్రపదవే పోతుందని, శాపాలకు గురి కావాల్సి వస్తుందని సద్గురు వెంకటరామస్వాములు చెబుతారు. ఇలాంటి దేవేంద్రులు ఎందరో మానవరూపం దాల్చి పూజించి పరిహారం పొందిన స్థలమే సింహపీఠంపై ఆశీనులై కొలువైన తిరుమీయిచ్చూరు పెరుమాళ్‌ ఆలయం. మైలాడుతురై - తిరువారూరు మధ్యన కూత్తనూరు సరస్వతి ఆలయానికి వెళ్లే మార్గంలో తిరుమీయిచ్చూరు ఉంది. చాలామంది భక్తులు అక్కడి లలితాంబికను మాత్రమే దర్శించి వెళుతుంటారు. తిరుమీయిచ్చూరు శివాలయం చేరువగానే సింహపీఠ పెరుమాళ్‌ ఆలయం కూడా ఉంది. నేరతలంపులు కలిగినవారి సద్గుణాలను అందించే స్థలమిది. కామవాంఛలను రానీయకుండా చేసే పవిత్రక్షేత్రం కూడా ఇదే. లోకంలోని మానవులు తమ జీవితంలో కొంతకాలమైనా అంబికాదేవిని తప్పకుండా ఆరాధించి తీరాలని సిద్దపురుషులు చెబుతారని సద్గురు వెంకటరామస్వాములు పేర్కొన్నారు. 
స్వామి వివేకానందుడు చికాగో సర్వమత మహాసభలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ 'అమెరికా సోదరసోదరీమణులారా!' అని సంబోధించగానే పావుగంటపాటు సభికులు లేచి నిలబడి, చేసిన కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. ఈ శక్తి ఎలా వచ్చిందంటే తన మనస్సులో ఎప్పుడూ కామవాంఛలకు తావివ్వకపోవడం వల్లేనని, మానవుడు కామానికి దూరంగా ఉంటే శక్తిమంతుడు కాగలడని వివేకానందస్వామి చెబుతారు. వివేకానందులు ధ్యానసమయంలో దేవునికి సమర్పించిన ప్రసాదపుష్పాలను తన వద్ద ఉంచుకొంటారు.

ఇదే రీతిలోనే అహల్య కూడా శిలగా మారిన పురాణగాధ వెనుక కూడా ఎన్నో అంతరార్థాలు దాగి ఉన్నాయి. అగస్త్య కులదీపంలా ప్రకాశిస్తున్న సద్గురు వెంకటరామస్వాములు వీటిని లోకానికి ఎలుగెత్తి చాటుతున్నారు. ఓ మహాముని చెప్పే గుణపాఠం కంటే ఓ పతివ్రతా శిరోమణి తెలిపే గుణపాఠం ఏ యుగ కాలంలోనైనా శక్తిమంతంగా ఉంటుందని యోగులు, జ్ఞానులు చెబుతుంటారు. కనుకనే పునీతురాలైన అహల్య ఉదంతం దేవేంద్రలోకానికి చక్కటి గుణపాఠం నేర్పింది. 
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. భార్యాభర్తలు ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలే తప్ప అందం కోసం, అలంకరణ కోసం ఆరాటపడకూడదు. మంత్రజపం, వ్రతం, ధ్యానపానాదుల వల్ల దంపతులకు తేజస్సు లభిస్తుంది. కారైకాల్‌ అమ్మవారు, అవ్వయార్‌ తమ దేహపు అందాలను విసర్జించి ఆధ్యాత్మిక భావాలను లోకంలో వ్యాపింప చేసిన సంగతులు మనకు తెలిసినవే. దైవారాధన వల్ల సౌందర్యాన్ని పొందగలము. నిత్యం పూలతో దేవుని పూజించాలి. మహాపురుషుల చరిత్రలను పఠించాలి. ఆలయాలకు వెళ్లి తాము కట్టిన పూలమాలలను సమర్పించడమూ మంచిది. వీటివల్ల ఆధ్యాత్మిక శక్తి అధికమవుతుంది.

ప్రస్తుతం చూసేవారెవరైనా మోహించే విధంగా పడతులు కురచదుస్తులు ధరిస్తున్నారు. ఈ కారణంగా లోకమంతటా జరుగుతున్న అత్యాచారాలను మనం చూస్తున్నాం. ఈ కలియుగంలో ఇలాంటివి జరుగుతాయనే ముందుగానే ఊహించిన మహాపురుషులు ఎందరో ఎన్నో చక్కటి పరిష్కార మార్గాలను సూచించారు. మరి వాటిని పాటించేవారు లేరే! వీటిని పాటిస్తేనే కదా కామపూరిత చర్యలను నిరోధించగలం. 
ఆలయాలలో అంబికాదేవికి పూలతో తయారు చేసిన వస్త్రాన్ని సమర్పించడం, పువ్వులతో అలంకరించడం, ఉత్సవాలు జరుపటం, గజపూజ, గోపూజ వంటి కార్యాలను తరచూ నిర్వర్తిస్తుండాలి. 

ఉత్తమలోకాలలో పతివ్రతాశిరోమణులను పతివ్రతా దైవాలనుగానే భావిస్తుంటారు. అలాంటి పతివ్రతా దైవాల దైవాలోకాలకు వెళ్లి మూలస్థానపు మెట్లుగా మారుతారు. వాటిని 'పతివ్రతా శిలలు' అని అంటారు. గ్రామీణ ప్రాంతాలలో అక్కడక్కడా ఈ పతివ్రతా శిలలను చూడవచ్చు 
పెళ్లి రోజున మిరపరాయిపై వధువు కాలిని మోపి అరుంథతిని తిలకించే ఆచారం ఉంది కదా. ఇక్కడ మిరపరాయి పతివ్రతా శిలగా భావించాల్సి ఉంది. మరి పవిత్రమైన ఆ శిలపై కాలిని మోపటం న్యాయమా? అయితే ఈ ఆచారం పాటించడం వల్ల కలిగే సత్ఫలితం గొప్పది. అహల్య వంటి పతివ్రతా శిరోమణని తలపించే రాయిని కాలితో స్పర్శించడం వల్ల మనస్సు పవిత్రంగా మారుతుంది, అరుంధతి అనే శిలవంటి నక్షత్రాన్ని దర్శించడం వల్ల పవిత్రమైన ప్రకాశవంతమైన భావాలు చోటుచేసుకుంటాయి. 
మానవులలో ఎందరో మరుజన్మలో ఆలయాల మెట్లుగా మారి భక్తుల పాదధూళి తమపై పడాలని కోరుకుంటున్నారు. అలా ఆలయ మెట్లుగా మారినవారు వేలకొలది సంఖ్యలో ఉన్నారు. పండరిపురంలోని ఓ ఆలయ ప్రవేశద్వారం వద్ద నామదేవుడనే భక్తుడు ప్రధానమైన మెట్టుగా పడి ఉన్నారు. ఆ గుడిలో శ్రీకృష్ణుని దర్శించటానికి వచ్చే భక్తులంతా ఆ మెట్టు రూపంలో ఉన్న నామదేవునిపై పాదాలు మోపుతుంటారు. ఇలాంటి త్యాగపూరిత భావాల వల్లే నామదేవుడి వంటివారు జ్యోతిస్వరూపులుగా నాలుగు యుగాలపాటు వెలుగొందుతూనే ఉంటారని సద్గురు వెంకటరామస్వాములు చెబుతుంటారు. ఆకాశంలో నక్షత్రాల రూపంలో ప్రకాశించే అరుంధతి, వశిష్టమహర్షిని పగటిపూటే తిలకించే దంపతులు ఆ పుణ్యదంపతుల స్ఫూర్తితో పవిత్ర దంపతులుగా జీవనం సాగించగలుగుతారు. 
నేటికీ గామ్రాలలో శిలరూపంలో మునిపీఠం, అమ్మవారి పీఠం అనే శిలలను చూడవచ్చు. మంజకుడి వద్ద పెరుమాళ్‌ ఆలయంలోను నేటికీ మునిపీఠ శిలను తిలకించవచ్చు. పతివ్రతా శిరోమణులను శిలలుగా మనం ఆరాధిస్తున్నాం. పాతివ్రత్యానికి మనం ఇచ్చే గౌరవమర్యాదలు కూడా అపారం, అజరామరం. అంతటి కీర్తిని సంతరించుకున్న ఆ శిలలను కూడా పువ్వులతోనే ఆరాధిస్తున్నాం. తమిళులు పతివ్రతా శిరోమణిగా నేటికి పూజిస్తున్న కన్నగిదేవిని సైతం శిలాపీఠరూపంలోనే ప్రజలు ఆరాధిస్తున్నారు. పనంజాయల్‌ అనే ప్రాంతంలో ఈ విధమైన ఆరాధన నేటికీ కొనసాగుతోంది. దేవకోట - వెళ్లయపురం - ఒక్కూరు- తిరుపునవాసల్‌ ప్రాంతంలో పనంజాయల్‌ గ్రామం ఉంది. అక్కడ కళ్యాణమీనాక్షిగా శిలారూపంలో ఉన్న పత్నిపీఠాన్ని ఆరాధిస్తున్నారు. శ్రీరాముని పాదస్పర్శతో అహల్య శాపం విమోచనం పొందిన తర్వాత యేళ్లతరబడి ఆమెకు శిలారూపమిచ్చిన ఆ బండరాయిని పనంజాయల్‌ గ్రామంలో గౌతమ మహర్షి స్వయంగా ప్రతిష్టించారు. ఆ పీఠంపై శిలారూప దేవి ఆవిర్భవించింది. ఈ అమ్మవారిని కూడా అరుదైన పుష్పాలతో పూజిస్తారు. పతివ్రతా శిరోమణులు ఈ ప్రాంతంలో అమ్మవారిని ఆరాధించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. సువాసనలు కలిగిన పుష్పాలతో పూజిస్తే దంపతుల మధ్య ఐకమత్యం పెంపొందుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అహల్య, గౌతమమహర్షి కూడా పుష్పారాధనల గొప్పదనాన్ని కూడా లోకానికి చాటిచెప్పారు. కనుక పనంజాయల్‌ గ్రామంలో కొలువైన శిలారూప అమ్మవారిని మంగళ, శుక్రవారాల్లో సప్తమి దినాలలో సుగంధ పుష్పాలతో పూజిస్తే సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి.

తంజావూరు పసుపతి ఆలయ సమీపంలో ఉన్న - చక్రమంగై, అరిమంగై, శూలమంగై, నందిమంగై, పశుమంగై, తాళమంగై, పుల్లమంగై (పశుపతి ఆలయం) అనే సప్తకన్యల క్షేత్రాలకు ధీటుగా మహిళాలోకం ఉత్తమ ఆరాధన క్షేత్రంగా ఈ పనంజాయిల్‌ శిలారూపు అమ్మవారి ఆలయం భాసిల్లుతోంది. 
గోపుర కట్టడ శిలారాధన 
ఈ కాలంలో అరుణాచల గిరిప్రదక్షిణ మరియు ఆలయ ఆరాధనలలో పాదయాత్రలలో దారి పొడవునా చిన్న రాళ్లను గుట్టలుగా చిన్న పిల్లల మాదిరిగా చిన్న గూళ్ళ మాదిరిగా చిన్న గోపురాలు కట్టి ఉండటాన్ని చూడగలం. దీనిని పత్నీ గోపురం లేదా పత్నీ శిలాపీఠ ఆరాధన అని అంటారు. 

పత్ని గోపురం

ప్రాచీనమైన ఈ పత్ని శిలాపీఠ ఆరాధన తెలిసీ తెలియకుండా ప్రస్తుతం పలు చోట్ల పునర్మిస్తుండటం సంతోషదాయకం. శ్రీరాముడి కాలానికి మునుపటి కాలంలో పతివ్రతా శిలాపీఠారాధన భూలోకంలో ఆచరిస్తుండేవారు. గౌతమ మహాముని అహల్య దంపతుల ద్వారా మళ్లీ ఆచరణలోకి వచ్చిన అత్యుత్తమ ఆరాధన ఇదే. ఆయా స్థలాలకు అనుగుణంగా చిన్న రాళ్ళతో చిన్న పీఠం, చిన్న గోపురం రూపొందించి ఈ అరుదైన రూపానికి పతివ్రతా శిలా పీఠం లేదా పతివ్రతా పీఠం అని పిలుస్తున్నారు. పవిత్రమైన సాంసారిక జీవనం కోసం ఈ మొక్కుబడి ఉండేది. వాస్తు శాస్త్ర ప్రకారం ఆలయలలో మూల రాయి (corner stone), ఇళ్ళల్లో పునాది రాయి ఈ రూపులో తయారవుతున్నవే! 
ఇలా వైవాహిక ఆచారంలో మిరపరాయిపై పాదం మోపే ఆచారం ప్రధానంగా మారింది. ఉత్తమమైన ఋషులు, ఋషుల పత్నులు పవిత్రక్షేత్రాలకు సంబంధించి కొండదారిలో లేదా పాదయాత్ర మార్గంలో రాళ్ళుగా పడి ఉండటాన్నే వైకుంఠంగాను, కైలాసంగా భావిస్తుండేవారు. 
ఇలా పతివ్రతా శిలాపీఠారాధన భూలోకంలో రావడానికి అహల్యాదేవి కారకురాలైంది. పౌర్ణమి రోజుల్లో ముల్ల పువ్వుల ద్వారా గోమతి అంబికాదేవిని పూజించటం వల్ల, పతివ్రతా దైవాలను చేతులెత్తి మొక్కినందువల్ల శ్రీరాముడి పవిత్ర పాద స్పర్శ అనే భాగ్యాన్ని పొందగలిగింది అహల్యాదేవి. రామావతారానికి కంటే ముందుగానే అహల్య పతివ్రతా శిలాపీఠంగా ఉండేదని తెలుస్తున్నది. నాయన్మార్లలోనే పెద్దదైన కారైకాల్‌ అమ్మవారు దివ్యమైన దేవార పాశురాలను 'శ్రేష్ఠమైన తిరువందాది' అని కీర్తింపబడినట్లే అహల్యాదేవి శాపం వల్ల శీలాపీఠం రూపు దాల్చిందన్నదే ఇక్కడ మనకు తెలియవచ్చే తాత్పార్యం. అహల్యాదేవి శ్రేష్టమైన పతివ్రతా శీలాపీఠమైనట్లుగానే భావించాల్సిందే. ఇదే పౌరాణిక అనుభూతిలో వెల్లడయ్యే మహత్తరమైన దైవతత్త్వం. దీనిని మనం బాగా అర్థం చేసుకోగలిగితే 'అహల్య ఎందుకు రాయిగా మారాలే శాపం పొందింది' అనే అనుమానం తలెత్తదు కదా! 
శ్రీరాముని పవిత్ర పాద స్పర్శకే శాపం తొలగింది. అహల్యాదేవి గౌతముని శరణుజొచ్చింది. అహల్య గనుక తప్పిదం చేసి ఉన్నట్లయితే శిలారూపంలో ఉన్న ఆమెకు ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముని పాదస్పర్శ లభించేదా? 
అహల్య మాతను పంచపత్నీ మాతలలో ఒకరుగా భావించాలని ప్రాచీనమైన దైవ స్తోత్రం మనకు చాటిచెబుతుంది. 
పంచమాతా స్తోత్రం: 
''అహల్యా ద్రౌపది సీతా తారా మండోదరి తథా 
పంచకన్యా స్మరే న్నిత్యం మహాపాతక నాశనం' 
-అనే పరమానంద స్తుతి మహాభారతంలో శ్రీకృష్ణుడు కీర్తించినట్లుగా ఉంది. కృష్ణభగవానుడే అహల్యాదేవిని పంచ పతివ్రతా మాతలలో శ్రేష్టమైనదని కీర్తించాడంటే ఆమె పాతివ్రత్యానికి ఇంతకు మించిన రుజువేముంటుంది?(అహల్యామాత, ద్రౌపదీదేవి, సీతాదేవి, తారా దేవి, మండోదరి దేవి- వీరే పంచ పతివ్రతా మాతలు) కనుక ఈ లోకమంతా పారాయణం చేసే స్తుతిలో అహల్యామాత ప్రథమ స్థానం సంపాదించుకుంది. ఇంతటి కీర్తిని అహల్యాదేవి సంపాదించుకోవడానికి కారణం ఆమె గోమతి అంబికాదేవిని ముల్లై పువ్వులతో ఆరాధించడమేనని అగస్త్యమహర్షి చెబుతారు. 

పువ్వులు కొనటానికి నియమాలు

వేలాడుతున్న కొంగుతో మగువలు పువ్వులు కొనటం, కోయడం, ధరించడం చేయరాదు. చీరకొంగు చాలా పవిత్రమైనది. కనుకనే ఆలయాలలో మగువలు ఎడమ అరచేతిపై కొంగును పెట్టుకుని, దాని పై కుడి అరచేతిని ఉంచి, మగవారు ధోవతి కొసను అరచేతిపై ఉంచుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించడం ఆనవాయితీగా ఉంటోంది. 
పుదుకోట - ఆవుడయార్‌ ఆలయం సమీపంలో ఉన్న మీమిసల్ శ్రీకళ్యాణరామాలయంలో భర్త ధోవతి కొసను, భార్య చీరకొంగు కొసను ముడివేసుకుని ఇరువురూ శివా విష్ణు ఆలయాలను ప్రదక్షిణ చేస్తుంటారు. కుటుంబ శాంతికి ఈ రకం ప్రదక్షిణ దోహదపడుతుంది. 
శ్రీరాముడు సీతాదేవి కూడా ఈ స్థలంలో ఈ రకం ప్రదక్షిణ చేశారని పురాణగాధను బట్టి తెలుస్తోంది. ఇలా ప్రదక్షిణ చేసే దంపతుల మధ్య అన్యోన్యత అనురాగాలు వెల్లివిరుస్తాయని చెప్పడం అతిశయోక్తి కాదు. మగువల చీర కొంగు ఏ సమయంలోనూ నేలను తాకే విధంగా ఉండరాదు. చీరకొంగు నడుమున దోపుకొనే ఉండటమే పవిత్రమవుతుంది. చీర కొంగు నేలపై పడేలా ఉంటే అశుభ దోషాలు ఆవరిస్తాయి. పుణ్య వ్యయమూ కలుగుతుంది. నేలపై చీరకొంగు తారాడుతుంటే దంపతుల మధ్య ఐకమత్యం ఉండనే ఉండదు. 
రెండు మూరల పొడవునా చీరకొంగు వేలాడుతుంటే అగ్ని వల్ల గండం ఏర్పడుతుంది. మూడు మూరల పొడవునా చీరకొంగు వేలాడుతుంటే మనోభీష్టంతో మనువాడిని మగడినే కోల్పోయే దుస్థితి ఏర్పడుతుంది. 
పాదం వరకూ చీరకొంగు వేలాడుతుంటే పుట్టిల్లు, మెట్టినిల్లు కోల్పోయి కష్టాలపాలవుతారు. 
నుదుటిపై పెద్దగా కుంకుమ తిలకం పెట్టుకునే సుమంగళి స్త్రీల వద్దే పువ్వులు కొనడం శ్రేయోదాయకం. పువ్వులను విక్రయించేవారు మగవారైతే, వారి నుదుట విభూతి, తిలకం, నామం ఉన్నవారి వద్దే పువ్వులను కొనాలి. భగవంతుడు జనన, మరణాలను రహస్యంగానే ఉంచాడు. ఇది కూడా మన మంచికే నని భావించాలి. ఈ రహస్యాన్ని బహిర్గతపరిచే దైవత్వం ఉంది. అయితే పువ్వుల పవిత్రతా గుణాలను దివ్యమైన జ్ఞానం కలిగినవారికే ఈ దైవత్వం సిద్ధించగలదు. అదీ సద్గురువు ద్వారానే లభిస్తుంది. 
పువ్వుల పవిత్ర గుణాలు మంచి భవిష్యత్తును సూచించగల దీర్ఘదర్శనం కలిగి ఉంటాయి. కనుకనే ఓ సత్కార్యాన్ని చేయాల వద్దా అని తెలుసుకోవడానికి పువ్వులను వేసి చూసుకునే ఆచారం ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్నది. అయితే సకలమైన విషయాలకూ ఈ పద్ధతిని పాటించకూడదు. 
పువ్వులను వేసి చూసుకునేందువల్ల కలిగే ఫలితం ఏదైనా దానిని మనసారా స్వీకరించే గుణం మనకు ఉండాలి. ఆ గుణం వుంటేనే ఈ పద్ధతిని పాటించాలి. నిర్ణయం కోసం పువ్వులను చేత తీసుకునేవారు కల్లాకపటం తెలియనివారుగా శాంతస్వరూపులుగాను ఉండాలి. ఈ కారణం వల్లే చిన్నారుల ద్వారా గంపలోని వివిధ రంగులు కలిగిన పువ్వులలో ఒకదానిని తీస్తారు. 
కులదైవం, ఇష్టదైవం సమక్షంలో పువ్వును తీసే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచిది. అందరూ చూస్తున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేయరాదు. అత్యంత విశ్వాసం ఉంటేనే ఈ పద్ధతిని పాటించాలి. లేకుంటా ఈ పద్ధతి జోలికే వెళ్లకూడదు. ఇక్కడ నమ్మకమే ఆవశ్యకమవుతుంది. 
లోకమంతా దైవనామాలను ఉచ్చరిస్తూ ఉంటే పువ్వుల సంఖ్య భూలోకంలో అధికమవుతూ వస్తుంది. కనుకనే దైవాల పేర్లను 'నామపుష్పం, నామాక్షర పుష్పం' అని పిలుస్తుంటారు. 'ఓం నమశ్శివాయ' అంటూ ఓ పువ్వును ఉంచితే, అందులో అక్షర శక్తి, శబ్దశక్తి ఓ నామక్షరం కొలువుదీరుతుంది. దీనిని నామావళి జ్యోతి, నామజ్యోతి అని పిలుస్తారు. ఇలా భూలోకంలో కోటానుకోట్ల సార్లు రామనామాన్ని ఉచ్చరిస్తే, రామనామాన్ని రాస్తే వెంటనే అత్యద్భుత రీతిలో 'రామజ్యోతి' ప్రత్యక్షమై లోక జీవరాశులకు రక్షణ కవచంగా నిలుస్తుందని దశావతార మూర్తుల నియతి. రామనామ జపానికి అంతటి మహత్తు ఉంది. ఇలాంటి రామజ్యోతుల నుండి పుట్టినదే రామబాణ పుష్పం. ఈ పుష్పం అందరికీ సులువుగానే లభిస్తుంది. శ్రీరాముడు పచ్చపువ్వులతో శ్రీపిచ్చీశ్వరులకు శివపూజ చేసిన స్థలమే మామండూరు క్షేత్రం. చెన్నై - చెంగల్పట్టు సమీపంలో మామండూరు ఉంది. ఈ స్థలంలోనే పచ్చపువ్వు కాస్త రామబాణపుష్పంగా మారింది. రామేశ్వరంలో సీతాదేవి రూపొందించిన శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించి పూజించినప్పుడు ఎగసిపడ్డ శివారామ జ్యోతిలో తొట్టతొలుత విరబూసిందీ పుష్పం. 

బాణం అంటే ఆయుధమని మాత్రమే అర్థం కాదు. మన్మథుడు ఏ చోట పుష్పబాణాన్ని సంధిస్తాడో ఆ చోట సంతాన భాగ్యం కలుగుతుంది కదా. పూబాణం అంటే పువ్వులతో అర్చించడం అని భావించాలి. మల్లెపువ్వుల మహత్యాన్ని తెలుసుకునేలా మహాభారతంలో ఓ సంఘటన కూడా ఉందని సద్గురు వెంకటరామస్వాములు చెబుతారు. 
కౌరవుల సభ... దృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, భీష్మ, ద్రోణ, విదురాదులంతా వారివారి ఉచితాసనాలలో ఆశీనులై ఉన్నారు. 
దుర్యోధనుడు లేచి 'అహరం నా మేలునే కోరుకునే కురుపితామహులారా! పెద్దలారా! పాండవులు అడిగినట్లు ఐదూళ్లు కాదు కదా సూదిమొపినంత స్థలం కూడా తిరిగివ్వనని నిక్కచ్చిగా ప్రకటించాను కనుక పాండవులపై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే సైనిక దళాన్ని సమీకరించడానికి ముందుగా శ్రీకృష్ణుడుని కలుసుకోవాలని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయాలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ మీ అభిప్రాయాలను నిర్భయంగా, సభాముఖంగా తెలుపండి' అన్నాడు. 
శ్రీకృష్ణుడిని దర్శించి ఆశీస్సులు పొందాలన్న దుర్యోధనుడి మాట విని భీష్ముడు, విదురుడు చాలా సంతోషించారు. ఆ కృష్ణభగవానుడిని దర్శనం చేసుకుంటేనయినా దుర్యోధనుడి మనస్సు మారుతుందని , యుద్ధం జరుగకుండా ఉంటుందేమోనని ఆ కురువృద్ధులు భావించారు. ద్రోణ, కృపాచార్యులు సైతం తమ అంగీకారాన్ని సభాముఖంగా ప్రకటించారు. అయితే దుర్యోధనుడి ముద్దుల మామయ్య శకుని మాత్రం నోరు మెదపకుండా మౌనం పాటించాడు. దుర్యోధనుడి వెన్నంటే వుండే తాను, ఆ రారాజు దుర్యోధనుడు తన దగ్గరకు వచ్చి అడిగితే తన అభిప్రాయం చెప్పవచ్చులే అని అనుకున్నాడు. సభలోని కురుపితామహులు, మంత్రివర్గ సభ్యులు, పెద్దలందరి ఆమోదం పొందిన దుర్యోధనుడు శకునివైపు తిరిగాడు. శకుని తన చిరుగడ్డాన్ని తడుముకుంటూ ఏమీ మాట్లాడలేదు. 
సభ ముగిసిన తర్వాత సింహాసనం నుండి దిగుతున్న దుర్యోధనుడిని చూసిన శకుని 'దుర్యోధనా! నన్ను ఒంటరిగా కలుసుకో! నీకో ముఖ్యమైన విషయం చెబుతాను' అన్నాడు. దుర్యోధనుడు కోపంతో తన అంతఃపురానికి విసవిసా నడుచుకుంటూ వెళ్లాడు దుర్యోధనుడు. కాసేపయ్యాక శకునిమామ అభిప్రాయమేమిటో తెలుసుకోవాలనే ఉబలాడపడ్డాడు. 
శకుని వద్దకు వెళ్ళాడు దుర్యోధనుడు. ఎత్తయిన ఆసనంపై అతడిని కూర్చోబెట్టి, అతడి ఆసనం కంటే చాలా తక్కువ ఎత్తు కలిగిన పీఠంపై శకుని ఆశీనుడై మాట్లాడసాగాడు. 
'దుర్యోధనా! యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడిని కలుసుకోవాలని నీ మనసులోని మాటను నిండు సభలో ప్రకటించావు. అందరూ ఆమోదించారు. అయితే వారంతా నీపై ప్రేమాభిమానాలు ఉన్నట్లు నటిస్తున్నారు. వాస్తవానికి వారికి నీపై ఏమంత శ్రద్ధాసక్తులు లేవు. కనుకనే ఎల్లప్పుడూ నీ సంక్షేమం కోరే నేను, ఎవరూ లేని ఈ సమయంలో నీకో మంచి మాట చెప్పబోతున్నాను. ఇది చాలా రహస్యం. వేరెవరికీ తెలియకూడనిది' ఆసక్తిని అధికం చేసేలా శకుని అన్నాడు. 
'దుర్యోధనా! పాండవులతో యుద్ధం చేయాలన్న నీ నిర్ణయం చాలా మంచిదే. అంతకంటే ముందుగా నువ్వు శ్రీకృష్ణుడిని కలుసుకోవాలనుకోవడమూ మరీమంచిదే. అయితే నేను సూచిస్తున్న రోజున పయనమై వెళ్లి, కృష్ణుడిని కలిసి ఆశీస్సులు పొందు' అన్నాడు శకుని. 
అప్పటిదాకా శకునిమామ ఏదో పెద్ద విషయం చెబుతాడునుకున్న దుర్యోధనుడికి ఉన్నట్టుండి నవ్వాగలేదు. 
'మామా! నీ ముహూర్తాన్ని గణించడానికి ఇప్పుడిక్కడ జ్యోతిష్యులెవరూ లేరు కదా!' అన్నాడు నవ్వుతూ. 
'నీపై నిజమైన ప్రేమాభిమానాలు కలిగిన నేను తప్ప ఇంకెవరూ మంచిరోజును గణించి చెప్పగలరు? కౌరవసభలోని వారినెవరినీ నువ్వు నమ్మవద్దు దుర్యోధనా!' అని శకుని చెబుతూ తాను సిద్ధపరచిన ముహూర్తపు పత్రాన్ని దుర్యోధనుడికి అందించాడు. 
ఆ వివరాలను పరిశీలించిన దుర్యోధనుడికి తీవ్రమైన కోపం కలిగింది. శ్రీకృష్ణుడిని కలుసుకునేందుకు చంద్రాష్టమం రోజున వెళ్ళమని శకుని పెట్టిన ఆ ముహూర్తాన్ని చూసి మంటపుట్టింది. 
'మామా ఎంతటి ధైర్యముంటే నీవు చంద్రాష్టమం రోజును వెళ్లమని చెబుతావు? నాపై నీకు నిజమైన అభిమానం ఉంటే ఈ దుర్దిదనాన్ని సూచిస్తావా?' అని దుర్యోధనుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
శకుని మాట్లాడుతూ 'దుర్యోధనా! చంద్రాష్టమం తెలిసే ఆ రోజున వెళ్లమని చెబుతున్నాను. చంద్రాష్టమం రోజున మంచి జరగదని భావించడం ముఖ్యం కాదు. ఆ రోజున నీవడిగే వరాలను చాకచక్యంగా అడగాలి. కృష్ణుడి వద్ద నేను చెప్పనున్న రెండు వరాలను అడుగు' అన్నాడు. 
'అంతకంటే ముందు ఓ విషయం తెలుసుకో. శిశుపాలుడు జన్మించిన వేళ, అతడి తల్లి అందరినీ పిలిచి ఆ బిడ్డను వారి చూపుతుంది. ఎందుకని?'' 
'శిశుపాలుడు నాలుగు చేతులు కలిగి పుట్టాడు. ఏవరో ఒకరు శిశుపాలుడిని చూసినప్పుడు అదనంగా ఉండే రెండు చేతులు తొలగిపోతాయని ఆమె తెలుసు. అంతేకాదు ఎవరి దృష్టి తగిలితే ఆ బిడ్డడి రెండు చేతులు విడిపోతాయో అతడి చేతిలోనే శిశుపాలుడికి మరణం సంభవిస్తుంది. ఈ విషయాలన్ని శిశుపాలుడి తల్లికి బాగా తెలుసు. కనుకనే అక్కడున్న అందరినీ రమ్మని పిలిచి శిశువును చూపెడుతుంది. ఆ సమయంలో అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. 
అందరూ వరుసగా వచ్చి ఆ బిడ్డను చూసి చంకనెత్తుకున్నారు. ముద్దులాడారు. తమకు తోచిన కానుకలనూ ఇచ్చారు. ఇక శ్రీకృష్ణుడి వంతు వచ్చింది.! 
'కృష్ణా! రా నాయనా! వచ్చి, నా బిడ్డను ఎత్తుకోవయ్యా' అని శిశుపాలుడి తల్లి కోరింది. 
'అత్తయ్యా! ఇప్పుడెందుకులే. ఇంకో రోజు బిడ్డను ఎత్తుకుంటాలే' అంటూ నీళ్ళు నమిలాడు కృష్ణుడు. 
'కృష్ణా! అదంతా కుదరదు. నువ్విప్పుడే నా బిడ్డను తీసుకుని ముద్దాడాల్సిందే'నని పట్టుబట్టింది. 
'అత్తయ్యా! ఈ రోజు చంద్రాష్టమం. మరో మంచి రోజు చూసి, బిడ్డను ఎత్తుకుంటానులే' అన్నాడు కృష్ణుడు. 
శిశుపాలుడి తల్లి పట్టుసడలించలేదు. 'కృష్ణా! ఏదిఏమైనా సరే. ఈ రోజే! ఇప్పుడే నా బిడ్డను నువ్వు చంకనెత్తుకుంటేనే నాకు మనశ్శాంతి కలుగుతుంది' అన్నది. 
'సరే! అత్తయ్యా! ఇక జరుగబోయేదానికి నీదే బాధ్యత' అంటూ శ్రీకృష్ణుడు ఆ బిడ్డను వెనుకవైపు నుండి పైకెత్తాడు. జన్మాంతరపు పగ వల్ల ఆ బిడ్డ రెండు చేతులతోనూ కృష్ణుడి దాడి జరిపేందుకు ప్రయత్నిస్తుంది. ఈ విషయం ముందుగానే పసిగట్టిన కృష్ణుడు ఆ బిడ్డను వెనుకవైపున చేతులుంచి పైకెత్తాడు' అని శకుని దుర్యోధనుడికి చెబుతాడు. 
'దీనికి, చంద్రాష్టమం రోజున కృష్ణుడిని చూడటానికి సంబంధమేమిటి మామా!' అని అడిగాడు దుర్యోధనుడు. 
'ఆగు దుర్యోధనా! శిశుపాలుడి మరణం కృష్ణుడి వల్ల జరుగలేదు. అతడి తల్లి వలనే జరిగింది' 
'కృష్ణుడు ఆ బిడ్డను ఎత్తుకోగానే అదనంగా ఉన్న రెండు చేతులు మాయమవుతుంది. ఆ దృశ్యాన్ని చూసినతోడనే శిశుపాలుడి తల్లి బోరున విలపిస్తుంది. కృష్ణుడి వల్లే శిశుపాలుడికి మరణం సంభవిస్తుందని నిర్ధారించుకుంది'. 
'బిడ్డపై నిజమైన పాశమున్న తల్లి ఏం చేయాలి? కృష్ణా! నా కుమారుడిని ఎట్టి పరిస్థితులోనూ చంపవద్దు అని వరమడిగి ఉండాలి కదా! అందుకు భిన్నంగా కృష్ణుడిని వరం కోరింది శిశుపాలుడి తల్లి. 
శ్రీకృష్ణుడిని స్తుతించి 'కృష్ణా! నా కొడుకు చేసే వంద తప్పుల వరకూ వాడిని క్షమించు' అని వింత వరం కోరిందా మాతృమూర్తి. 
'తన సుపుత్రుడు వందసార్లు తప్పులు చేయడని అనుకుందో లేక వంద తప్పులు చేస్తే ఇక అతడు తన కొడుకు కాడని అనుకుందేమో తెలియదు గాని, ఆ వింత వరాన్ని కృష్ణుడిని అడిగిమరీ పొందింది. ఆ వరం వల్లే శిశుపాలుడికి మరణం సంభవించిందని మనందరికీ తెలిసిన విషయమే! కనుక, దుర్యోధనా! శ్రీకృష్ణుడి వల్లే నీకు పెను ముప్పువాటిల్లే అవకాశముంది. ఆ ఆపదలు రాకుండా ఉండాలంటే కృష్ణుడిని రెండు వరాలు అడుగు! మొదటి వరం వల్ల శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలను ధరించకూడదు. రెండో వరం వల్ల శ్రీకృష్ణుడి సర్వసైనిక దళాలు నీ వశమై నీ పక్షాన నిలిచి యుద్ధం చేయాలి. ఈ రెండు వరాలను గనుక శ్రీకృష్ణుడి ద్వారా నీవు పొందితే ఇక విజయలక్ష్మి తప్పకుండా నిన్నే వరిస్తుంది దుర్యోధనా' అని అన్నాడా కపట శకుని. 
చంద్రాష్టమం రోజని తెలిసినా, దుష్టబుద్ధి కలిగిన ఆ దుర్యోధనుడు ఆ దినానే శ్రీకృష్ణుడిని కలుసుకుని, యోగక్షే మాలను అడిగి తెలుసుకున్నాక ఆ రెండు వరాలను పొందుతాడు. ఆ తర్వాత జరిగిన మహాభారత కథ మనకందరికీ తెలిసిందే! 
చంద్రాష్టమం రోజున చంద్రుడికి ప్రీతికరమైన మినుమలతో వడలు తయారు చేసి పశువులకు తినిపించాలి. చంద్రుడి కిరణాలతో వికసించే కలువ పువ్వులు, మల్లెపువ్వులతో పూజించాలి. నెల పొడుపు నాడు చంద్రుని దర్శించాలి. 
ప్రస్తుతం చంద్రాష్టమం రోజునే ఆఫీసులలో కీలకమైన పనులు చేయాల్సి వస్తుంది. ఇక విద్యార్థులకు పరీక్షలు, ఇంటర్వ్యూలు, ప్రయాణాలు ఆ రోజునే జరిగే పరిస్థితులు కూడా దాపురిస్తాయి. అలాంటి సమయాలలో కంచి ఏకాంబరేశ్వరాలయం, తలచంగాడు నాన్‌మదియం, చంద్రశేఖరుడు, ఒలిమది, మహిమలై, చంద్రమౌళీశ్వరుడు వంటి చంద్రశక్తి క్షేత్రాల్లోను, చంద్రుడు పూజించిన స్థలాల్లోను మినుమలతో తయారు చేసిన వడలను నైవేద్యం పెట్టి వాటిని పశువులకు తినిపిస్తే సకల దోషాలు పటాపంచలవుతాయి. 

పువ్వులు తెలిపే శకునాలు

శకునాలను తెలుసుకోవడానికి కూడా పువ్వులు ఉపయోగపడుతున్నాయి. 
దేవునికి సమర్పించేందుకు పూలమాలను తీసుకుని ఒకరు ఎదురైతే - అది కార్యసిద్ధికి శుభశకునం. 
మానవులకు ధరింపజేసేందుకు పూలమాలను చేతపట్టుకుని ఒకరు ఎదురుగా వస్తే ధనం వల్లే కార్యసిద్ధి అవుతుందని భావించవచ్చు. 
మహాపురుషులకు వేయడానికి పూలమాలను పట్టుకుని ఒకరు ఎదుటబడితే రుణబాధనుండి విముక్తి లభిస్తుంది. జన్మరుణం, వైవాహిక రుణం తీరిపోతాయి. 
మృతదేహానికి వేయడానికి పూలమాలను చేతపట్టుకుని ఒకరు ఎదురుగా వస్తే చెడుశకునమవుతుంది. కార్యసిద్ధికి ఆటంకమేర్పడుతుంది. ఆ రోజున ఎక్కడికీ వెళ్లకూడదు. 
పువ్వుల నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. 
మల్లెపువ్వులు ఉన్న చోటును పరిశుభ్రంగా ఉంచుకోగలదు. భూలోకంలో మల్లెపువ్వులున్నా వాటి సువాసనలు మటుకు పైలోకం నుండే వెలువడుతుంటాయి. 
మల్లెపువ్వుల లాగే మానవులు కూడా తామున్న చోటున పువ్వులు, అగరువత్తులు, సాంబ్రాణి, కర్పూరం వంటి సుగంధ పరిమళాలతో కూడిన వస్తువులు ఉంచాలి. దుర్గంధానికి తావివ్వకూడదు. ఈ కారణం వల్లే మానవులు శిరస్సుపైన, చెవులపైనా, సంచులలోనా, చేతులలోనైనా ఎల్లప్పుడు సువాసనలిచ్చే పువ్వులు పెట్టుకుని ఉండే సత్సాంప్రదాయం ఏర్పడింది. 
ఓ మల్లెచెట్టుగానీ, కొమ్మగాని తానున్న చోటున త్యాగభరితంగా ఎలా సువాసనలను వ్యాపింపచేస్తాయో అదే రీతిలో మానవుడు కూడా త్యాగబుద్ధిని అలవరచుకోవాలి. మానవుడు తరచూ పవిత్రమైన పుష్పాలతో మాట్లాడుతుండాలి. అది మనస్సుకు ఓదార్పును అందిస్తుంది. ఎవరొచ్చినా ఎలాంటి వారు వచ్చినా భేదభావాలకు అతీతంగా పువ్వులు సువాసనలను అందిస్తాయి. ఇవే పువ్వులు నిర్వర్తించే దానధర్మాలు. పువ్వులు ఎల్లప్పుడు సుగుణాలనే కలిగి సువాసనలిస్తాయి. ఇలా పువ్వుల నుండి మనిషి ఎన్నో గుణపాఠాలు పొందుతూనే ఉంటాడు. కనుకనే పువ్వులను మనం పలకరిస్తూ ఉండాలి. పువ్వులతో మాట్లాడితే ఇతరులు మనల్ని హేళనగా చూసినా పట్టించుకోకూడదు. తొలుత మానసికంగా పువ్వులతో మాటలాడాలి. కాలక్రమేణాలు పువ్వులు చెప్పే సమాధానాలు మనకు బోధపడతాయి. పువ్వులు సుగంధాలను దానం చేస్తున్నట్లే మన వద్దకు ఎవరొచ్చినా, ఎలాంటి వారొచ్చినా లేదు అని చెప్పకుండా వీలయినంతగా దానం చేయాలి. నిరుపేదలు అగుపడితే ఆహారం, ఫలాలు, బిస్కెట్లు, మిఠాయిలు వంటి తినుబండారాలనైనా దానంగా ఇవ్వాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఇలాంటి తినుబండారాలను వెంటతీసుకెళ్లడం మరీ మంచిది. ఎవరికీ చిల్లరడబ్బులను ఇవ్వకండి. అలా ఇచ్చిన డబ్బును బీడీ సిగరెట్‌లు అంటూ దురలవాట్ల కోసం ఆ డబ్బును వారు ఖర్చుపెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే దానమిచ్చిన మనకు పాపం అంటుకుంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త సుమా! సాధ్యమైనంతవరకూ వస్తురూపంలో దానం చేయండి. ఇది కలియుగం కనుక చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి సుమా! అందరిపైనా వారి వేషభాషలను బట్టి ఏవగించుకోకుండా ఆదరణతో దానధర్మాలు నిర్వర్తించాలి. పువ్వులలో ఎలా వాసనలు వస్తూనే ఉంటాయో అలాగే మానవుడు ఎంత దానం చేసినా వారి వద్ద లక్ష్మీదేవి స్థిరంగా తిష్టవేసుకునే ఉంటుంది. ద్వేషభావాలు, తీవ్రవాదం, ఉగ్రవాదం, కిరాతకం, హింసలు, యుద్ధాలకు నెలవైన ఈ కలియుగంలో దైవస్తోత్రాలను పఠించడం, పువ్వుల ద్వారా సువాసనలను వ్యాపింపచేయడం, ఆలయ ఉత్సవాలు నిర్వహించడం, రోజూ ఆలయ దర్శనం చేయడం, దానధర్మాలు, యాగాలు, నిత్య ఆలయ పూజలు నిర్వర్తించడం వంటి దైవ కార్యాలను అధికంగా చేయాలి సుమా! భూలోకాన శాంతి సౌభాగ్యాలు విలసిల్లేందుకు మానవులు తమవంతు సహాయ సహకారాలను అందిస్తూ ఉండాలి. పువ్వులు చెట్లలోనే ఉంటే నిరుపయోగమవుతాయి. దైవపూజలకు, సత్కార్యాలకు వాడితే ఆ పువ్వులలో దైవీక శక్తులు ఎన్నో రెట్లు అధికమవుతాయి. దీనికి మానవలోకం దోహదం చేయాలి. మానవ సమాజం పువ్వులకు తమవంతు సహకారం అందించాలి. ఇందులో అధికంగా లాభపడేది మానవులే కదా. కనుక మానవులకు పువ్వుల వలన పుణ్యగతులు ప్రాప్తిస్తాయని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. 

అందరికీ అనువైన ఆలయ పనులు

కలియుగంలో ఆలయపనులు, భగవన్నామ స్మరణ, భగవత్‌ కీర్తనాలాపనలు భగవంతుడిని చేరుకునే మంచి మార్గాలు. కనుక మనకు వసతులు లేక పోయినా, చేతులలో ధనం ఉండకపోయినా, మా వూరిలో సత్సంగమే లేదు కదా అని ఆరాటపడేవారు కూడా సులువుగా ఆలయ పనులను నిర్వర్తించవచ్చును. అదెలాగంటే... 
ఎన్నో ఆలయాలలో నందవనాలలో పువ్వులు కోయకుండా వుంటాయి. వాటిని భక్తి ప్రపత్తులతో కోసి, అందంగా నేర్పుగా మాలలుగా కట్టి దేవునికి సమర్పించడం మహాభాగ్యం కదా! ఇలా పుష్పమాలలతో భగవత్‌ కైంకర్యాలకు వినియోగించడం వల్ల బ్రహ్మలోకం చేరుకున్నంతగా పుణ్యఫలాలు దక్కుతాయని సద్గురు వెంకటరామస్వాములు చెబుతుంటారు. సిద్ధపురుషులు కూడా ఈ మహత్కార్యాలపట్ల మహదానందం పొందుతారు కదా!

మరో సులువైన ఆలయ కైంకర్యం కూడా ఉంది. తరచూ మన గురుదేవులు ఈ కైంకర్యం గురించి చెప్పారు. భక్తులంతా ఆలయంలో కర్పూరం వెలిగించి, కర్పూరం ఉండిన ప్లాస్టిక్‌ కవర్‌లను ఆ ప్రాంతంలోనే పారవేసి చెత్తకుప్పలతో ఆ ప్రాంతం పేరుకుపోయేలా చేస్తారు. దీని వల్ల కర్పూరహారతి వల్ల కలిగే పుణ్యఫలం మనకు దక్కకుండా పోతుంది. సద్గురు వెంకటరామస్వాములు ఆలయమంతటా చెత్తాచెదారాలు లేకుండా భక్తులతో కలిసి పారిశుద్ధ్య పనులు చేపట్టమని సూచించారు. 
బస్సులు, ఆటోలలో వెళ్లి, వ్యయప్రయాసలకోర్చి మంగళవారాల్లో ఆలయానికి వెళ్లి రాహుకాలంలో జరిపే దుర్గాపూజలో పాల్గొనే భక్తులు సైతం కొబ్బరినారలను, అరటి తొక్కలను, ఖాళీ అగరవత్తుల ప్యాకెట్లను, కాగితాలను పారబోసి అపరిశుభ్రంగా చేస్తుంటారు. ఇలా చెత్తాచెదారాన్ని ఆలయంలో ఎక్కడబడితే అక్కడ పారవేస్తే మనం చేసిన పూజలకు ఎలాంటి పుణ్యం దక్కదని గుర్తించాలి. చేతచిల్లిగవ్వ కూడా లేకుండా ఆలయానికి వెళ్లే భక్తుడు ఆలయంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చి చెత్తాచెదారాలను భక్తులతో కలిసి తొలగిస్తే వారికి దైవాశీస్సులు, దైవానుగహ్రం ప్రాప్తిస్తాయి. 
కోటానుకోట్ల అసురులు, దేవతలు, ఇంద్రులు, మానవులను సద్గుణవంతులుగా తీర్చిదిద్దే అరుదైన స్థలం సెల్లూరు గుణాంబిక ఆలయం. 
దుష్టులను మార్చే సెల్లూరు శివభూమి 
ప్రతిరోజూ నందివర్థనం పువ్వులను సమర్పించి భగవంతుని పూజిస్తే ధర్మనంది అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో ఏనాడు కామపూరిత భావాలకు లోనుగాకుండా కాపాడుతుంది. ఇదివరకే కామ పాప కార్యాలలో చిక్కుకుని వుంటే అలాంటి వారు తిరువారూరు - కుడవాసల్‌ సమీపంలో ఉన్న శ్రీకైలాసనాధుడు - శ్రీ గుణాంబిక కొలువుదీరిన శివాలయాన్ని దర్శించి ఆరాధిస్తే తగిన పరిహారం పొందగలుగుతారు. సద్గుణాలు సైతం మెండుగా ప్రాప్తిస్తాయి. 
నందివర్థనం పూలమొక్క, భూలోకంలో తొట్టతొలుత ఆవిర్భవించిన ప్రాచీనమైన ఆలయంలోని శ్రీగుణాంబిక సమేత మహేశ్వరుని దర్శించటం వల్ల మనస్సు, బుద్ధి, జ్ఞానం, దేహం పవిత్రతను సంతరించుకుంటాయి. ఇలా పువ్వుల పవిత్రత చెడు తలంపులనే దుర్వాసనలకు గురికాకుండా కాపాడుతుంది. విశ్వమానవులను సైతం ఆధ్యాత్మిక రీతిలో ఉన్నత స్థితికి చేర్చుతుంది. 
లలితా సహస్రనామాన్ని పఠించి చివరగా 'గోమతి' అమ్మవారి నామాలను ఉచ్ఛాటన చేస్తే ఆ పూజల వలన సంపూర్ణమైన ఫలాలు దక్కుతాయి. ఎందుకంటే లలితా లలితాంగి అనే రాగమూ, పుష్పము గోమతి మాత పాద చరణాల వద్దే పుట్టాయి. లలిత లేదా లలితాంగి అనే రాగంలో భక్తిగీతాలను ఆలాపించడం విశేదాయకం. 
హయగ్రీవమూర్తి వద్ద విద్యను నేర్చుకోవడం వల్ల సరస్వతీ దేవికి సాక్షాత్తు హయగ్రీవుడే సద్గురువయ్యారు. అగస్త్య మహర్షి సతీమణి లోభా మాత అండచరాచరాలన్నింటా పూజించిన మహామంత్రం లలితా సహస్రనామమే! దీనిని లలితా, లలితాంగి అనే రాగాలలో పాడే గీతాలు గోమతి అమ్మవారి పవిత్ర పాదాలను చేరుతాయన్నదే అగస్త్యమహర్షి - లోభా మాతల దివ్యసందేశం! 

మదురై మాడాకుళం
శ్రీ కపాలీశ్వరి దేవి

మదురై - పళంగానత్తం - బైకారా మార్గంలో మాడాకుళంలో మెట్లెక్కి చేరుకోగల చిన్న పర్వతంపైన కపాలీశ్వరీ దేవి కొలువై నిత్యం భక్తులను అనుగ్రహిస్తున్నారు. కపాలీశ్వరుని పరిణయమాడేందుకు అంబికాదేవి ఈ పర్వతంపై ధరించిన తపోరూపమే కపాలీశ్వరీ అవతారం. కపాలీశ్వరిగా తాను మునుపు ధరించిన తపోరూపాన్ని దర్శించటం కోసం సాక్షాత్తు కర్పగాంబాళ్‌ అమ్మవారు ప్రతియేట ఓ నిర్ణీతమైన రోజున ఈ పర్వతంపై మయూర రూపంలో వేంచేస్తారని పురాణ పూర్వ ఐతిహ్యం. ఈ కొండకు కపాలీపర్వతం (కపాలగిరి) అనే ప్రాచీనమైన నామాలున్నాయి. 
మానవుడు మేధావిచక్షణా జ్ఞానంతోనే అన్నింటినీ తెలుసుకుంటాడు. అయితే పక్షులు, జంతువులకు మాత్రమే మూలికా జ్ఞానం ప్రకృతిసిద్ధంగా లభించటం బ్రహ్మరహస్యమే! కపాల జ్ఞానశక్తి స్థలాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. వీటిలో ఉన్న (జ్ఞానశక్తి) పుష్పాలను దర్శించటం వల్ల అపారమైన జ్ఞానాన్ని పొందగలం. ఈ కొండ ఆకారం కొబ్బరి కపాలం (పై పెంకు)లా ఉంటుంది. కపాలపతి అనే ప్రాణాయామ యోగవిధానం పుట్టిన స్థలమిది. కొబ్బరిని సిద్ధపురుషులు 'కపాల ఫలం' అనే పిలుస్తారు. కొబ్బరి పూచే పుష్పమే 'కపాల పుష్పం'. 
కొబ్బరిలో ఐదురకాల పంచభూత శక్తులు ఉన్నాయి. కొబ్బరిలో ఉన్న పప్పు పృథ్వి (భూమి), అందులో నీళ్లు, దానిపై వాయువు ఉంటాయి. కొబ్బరి లోపలి భాగం ఉష్ణం (అగ్ని)గాను, కొబ్బరినీళ్ల పైభాగం ఖాళీస్థలం (ఆకాశం) ఉంటాయి. ఇలా భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం అనే పంచభూత శక్తులు కొబ్బరిలో కొలువై ఉంటాయి. ఈ కారణం వల్లే భగవంతుడి పూజలకు, యాగాదులకు కొబ్బరి కాయలను కొట్టడం ఆనవాయితీగా మారింది. దీపం, పుష్పం, ఫలం, తోయం, కొబ్బరి అనే ఐదూ పంచభూతశక్తులకు తలపిస్తాయి కనుకనే వాటిని పూజాపునస్కారాలకు ఉపయోగిస్తున్నారు. ఇక బ్రహ్మదేవుడు, శాకంబరీ దేవి కపాలీశ్వరి అనుగ్రహం పొందిన స్థలం కూడా ఇదే! తొలుత బ్రహ్మదేవుడికి పంచభూతాలను తలపించేలా ఐదు శిరస్సులు ఉండేవి. అప్పట్లో బ్రహ్మదేవునికి ఐదు కొబ్బరికాయలను సమర్పించి ఐదు శిరస్సులపై పగులగొట్టి పూజించేవారు. ఇలా శిరఃకపాలంలో కొబ్బరి కాయలను పగులగొట్టుకునే కపాలఫల యోగ విధానం కూడా ఇక్కడే ఆరంభమైంది. 
కొబ్బరిని పగులగొట్టేటప్పుడు వినిపించే శబ్దమే 'కపాల క్లీంకారం'. ఓంకారం అంశమిది. ఈ బీజామంత్రానికి ప్రత్యధి దేవతామూర్తి కపాలీశ్వరియే! వినాయకుడి ప్రీతికరమైన మంత్రబీజ శక్తి కనుకనే ఆయన ఎదుట కొబ్బరిని దిష్టి తీసి ముక్కలయ్యేలా పగులగొడుతున్నాము. 
కపాలీశ్వరుడు తన కరకమలాలతోనే తొట్టతొలుత కొబ్బరికాయను పగులగొట్టిన కపాలజ్యోతి పీఠమే ఈ పర్వతం. దీనిపైనే కపాలీశ్వరి కొలువై వుంది. కొబ్బరికాయలను పగులగొట్టడం వల్ల జనించే క్లీంకార బీజాక్షర శబ్దం అమ్మవారి వీనులకు వినిపిస్తాయి. కనుక ఆ దేవి ముంగిట కొబ్బరికాయలను నేలపై పగులగొడితే చాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కపాలగిరిని ప్రదక్షిణ చేయడం కూడా శ్రేయస్కరం. కపాలీశ్వరిదేవిని ఆరాధిస్తే కపాలం, శిరస్సు, ముఖానికి కలిగే రోగాలను నయం చేస్తుంది. బుద్దిస్వాధీనంలేనివారు, మందబుద్ధులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలు, మామూలు మనుషులుగా మారిపోతారు. వారి మేధోజ్ఞానమూ వికసిస్తుంది. కపాల సంబంధిత వైద్యనిపుణులు దర్శించాల్సిన అరుదైన వైద్యశక్తి సంజనిత పుణ్యక్షేత్రం కూడా ఇదే! 

ఓం గురువే శరణం

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam